వైరల్ వీడియో : ఉద్యోగుల కాళ్లు కడిగిన బాస్ లు..

Submitted on 8 November 2019
china Cosmetic company bosses wash feetof top performing employees to express gratitude for their hard

బాబ్బాబూ..ఆ పని చేసి పెట్టరా..నీకాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటాను అంటాం. అది ఒక ఊతపదం. కానీ తీరా ఆ వ్యక్తితో పని జరిగాక మనం అన్న పనిచేస్తామా? చేయనే చేయం. ఇప్పటి వరకు ఆ మాట అనడమే చూశాం.. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు మాత్రం.. ఆ కంపెనీ ఉద్యోగుల కాళ్లు కడిగారు. ఎందుకో తెలుసా? వారి కంపెనీ ప్రొడక్ట్స్‌ను అత్యధికంగా సేల్‌ చేసినందుకు..దానికి ఆ కంపెనీలు లాభాలు తెచ్చిపెట్టినందుకు.  ఉద్యోగుల కాళ్లు కడిగారు. 

చైనాలోని ఓ కాస్మోటిక్‌ కంపెనీలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 8 మంది ఉద్యోగులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ 8 మంది ఉద్యోగులు కంపెనీ ప్రొడక్ట్స్‌ను అనుకున్న దాని కంటే అధికంగా సేల్స్‌ చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 2 న చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని జినాన్‌లో జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో కంపెనీ ప్రతినిథులు  ఆ 8 మంది పాదాలను కాస్మోటిక్‌ కంపెనీ అధ్యక్షుడు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కడిగారు.

మొదటిగా .. 8 మందిని కుర్చీల్లో కూర్చోబెట్టి.. వారు వేసుకున్న షూను అధ్యక్షుడు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తమ చేతులతో విప్పారు. ఆ తర్వాత వారి పాదాలను పెద్ద పాత్రల్లో పెట్టి నీటితో కడిగి కృతజ్ఞతలు చెప్పారు. అయితే దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఆ ఎనిమిదిమందికి కాళ్లు కడిగి చేతులు దులుపుకున్నారు అని కొందరూ..కాళ్లు సెంటిమెంట్ గా  కడిగేస్తే..బోనస్ లు అడగరుగా..అంటూ మరికొందరూ.. వ్యాఖ్యానించారు. 

China
Cosmetic
Company
bosses
wash feetof
performing employees
express gratitude
for their hard

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు