ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

Submitted on 16 April 2019
 Child Protect Team MISSION MANGALORE To THRIVANDRUM

ఎప్పుడూ ఫేస్ బుక్ లో ఉంటావ్ ఎందుకు.. పనేం లేదా అని తిడుతుంటాం.. పనికిమాలిన సోషల్ మీడియా అని ఆడిపోసుకుంటాం.. ఈ మాటలు ఎలా ఉన్నా.. 15 రోజుల ఓ చిన్నారి ప్రాణం కాపాడటానికి ఇదే ఫేస్ బుక్ ద్వారా అద్బుతమైన ప్రయోగం జరిగింది. దేశంలోనే మొదటిసారి ఇలాంటి తరహా ప్రయోగంతో భేష్ అనిపించటమే కాదు.. ఓ పసివాడి ప్రాణం కాపాడారు ఫేస్ బుక్ లోని నెటిజన్లు.

అది కూడా రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో.. రెండు ఆస్పత్రుల మధ్య కో ఆర్డినేషన్‌తో. వినటానికి చాలా చిన్నగా అనిపించినా.. MISSION MANGALORE to THRIVANDRUM (మిషన్ మంగళూరు టూ త్రివేండ్రంగా) సాగిన ఈ ఆపరేషన్ అద్భుతం అంటున్నారు.
 కామన్‌గా కనిపిస్తున్న ఈ విషయం ఇంతగా వైరల్ అవడానికి గల కారణం. అసలెందుకు చేయాల్సి వచ్చింది. ఎవరి సహకారంతో చేస్తున్నారు తెలుసుకోండి.
Read Also : RRR మూవీపై రూమర్స్ : ప్రభాస్ గెస్ట్ రోల్

సమస్య ఏంటీ : 

త్రివేండ్రంలో 15 రోజుల చిన్నారికి గుండె సర్జరీ చేయాల్సి ఉంది. కేరళ నుంచి త్రివేండ్రం వరకూ వెళ్లేందుకు వేరే సదుపాయం లేదు. రోడ్డు మార్గంలోనే వెళ్లాల్సి రావడంతో చైల్డ్ ప్రొటెక్షన్ టీంను సంప్రదించారు. వారి సలహా మేరకు అంబులెన్స్‌లో ప్రయాణిస్తూ ఎక్కడికక్కడ అలర్ట్ చేయడం ద్వారా సులభంగా చేరుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఈ ప్రయోగం చేశారు. 

మంగళూరు టూ త్రివేండ్రం 600 కిలోమీటర్లు :
ఆశయంతో పాటు దూరం కూడా పెద్దదే. దాదాపు 10గంటలకు మించిన ప్రయాణం. కర్ణాటకలోని మంగళూరు నుంచి కేరళలోని త్రివేండ్రం వరకూ 600కి.మీలకు పైగా దూరం.


ఫేస్‌బుక్ కంటిన్యూస్ లైవ్ ద్వారా:
ఫేస్‌బుక్ లైవ్ ఇవ్వడం ద్వారా పక్క రాష్ట్రంలో వరకూ నెటిజన్లు అప్రమత్తమైయ్యారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా, ప్రతి గ్రామంలో ఒక్కో నెటిజన్ కదిలి వచ్చారు. ప్రవేట్ వాహనాలు, కార్లు, బస్సులు, అంతా రోడ్డుకు ఓ పక్కకు జరుగుతూ అంబులెన్స్ కు దారి ఇస్తున్నారు. 

స్వచ్ఛంధంగా రోడ్లపైకి వచ్చిన నెటిజన్లు :

చైల్డ్ ప్రొటెక్షన్ టీం ఇచ్చిన పిలుపు మేరకు నెటిజన్లు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. ముందుగా టీం ఆరంభమైన చోట పోస్టును షేర్ చేసింది. ఆ తర్వాత మరో ఊర్లో వారికి తర్వాత వేరే జిల్లా వారికీ ఇలా పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. చిన్నారి ప్రాణం కాపాడేందుకు నెటిజన్లు స్వచ్ఛందంగా కదిలిరావడంతో రోడ్లన్నీ ఫ్రీగా కనిపిస్తున్నాయి. టై వేస్ట్ కాకుండా అంబులెన్స్ దూసుకుపోతుంది. అంబులెన్స్ వస్తున్న విషయం తెలుసుకున్న వాహనదారులు రోడ్డు పక్కన తమ వాహనాలను ఉంచి దారి కల్పిస్తున్నారు. 

పిచ్చగా వైరల్: 
క్షణాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియో 3 గంటల్లోనే 20 వేల షేర్లు.. 15 వేల కామెంట్లు, 15 వేల లైక్స్
‌తో అత్యంత ఆదరణతో హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లే ట్రాఫిక్ సూచనలు చేస్తూ.. ఎక్కడిక్కడ క్లియరెన్స్ సూచనలు, సలహాలు ఇస్తూ.. వాహనదారులు స్వతంత్రంగా వ్యవహరించేలా చేశారు. 
Read Also : లారెన్స్ దెయ్యం సినిమాల సీక్వెల్స్

ట్రాఫిక్ పోలీస్ లేకుండానే:
ట్రాఫిక్ క్లియర్ చేయడంలో నెటిజన్లు కదిలిరావడంతో సమాచారం అందుకున్న ప్రతి ఒక్కరు చైన్‌లా ఏర్పడి రోడ్లను క్లియర్ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసు లేకుండానే ఫ్రీ ట్రాఫిక్‌తో అంబులెన్స్ ప్రయాణిస్తుంది. 


అంబులెన్స్‌లో ఉన్న చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసేందుకు వినూత్నంగా ఆలోచించారు. అంబులెన్స్ సైరన్‌తో కేవలం రోడ్డుపై కనపించే వాళ్లే తప్పుకుంటారు. కానీ, ఫేస్‌బుక్ లైవ్ ఇవ్వడం ద్వారా మంగళూరు నుంచి త్రివేండ్రం వెళ్లబోయే వాహనం గురించి ముందుగానే తెలుసుకుని అందరూ అప్రమత్తం అవుతారనేది వారి ఉద్దేశ్యం. 15 రోజుల చిన్నారిని కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం. 

Read Also : మహిళను ఈడ్చుకెళ్లిన మెట్రో రైలు : తలకు తీవ్రగాయాలు

Child Protect Team
MISSION MANGALORE To THRIVANDRUM
kerala

మరిన్ని వార్తలు