వైరల్ వీడియో : ఇది ఏలియన్ కాదు అమ్మాయి

Submitted on 21 February 2019
Child bored of standing in railway station queue climbs through baggage X-Ray

పిల్లల అల్లరి గురించి చెప్పాల్సిన పని లేదు. తుంటరి పనులు చేస్తుంటారు. కళ్లు మూసి తెరిచేలోపు ఏదో ఒకటి చేసేస్తారు. నానా హడావుడి చేసి కంగారు పెట్టేస్తారు. ఊహించని పనులతో షాక్‌లు ఇస్తారు. చైనాలో ఓ అమ్మాయి చేసిన తుంటరి పని ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తల్లిదండ్రులు, సెక్యూరిటీ సిబ్బందిని కంగారు పెట్టింది. వారి కళ్లుగప్పి ఆ పాప ఏకంగా లగేజీ చెక్ చేసే ఎక్స్‌రే మెషిన్‌లోకి దూరేసింది.

చైనాలోని డొంగన్ రైల్వే స్టేషన్‌లో ఈ సరదా ఘటన చోటు చేసుకుంది. ఓ జంట తమ పాపతో రైల్వే స్టేషన్‌కు వచ్చింది. స్టేషన్ ఎంట్రన్స్‌లో లగేజీ తనిఖీ చేసే మెషిన్ దగ్గర ప్రయాణికులు వేచి ఉన్నారు.  చాలా పెద్ద క్యూ ఉంది. తమ లగేజీలను ఎక్స్‌రే మెషిన్‌లో పెడుతున్నారు. ఒక్కొక్కరిగా ప్రయాణికులు ముందుకు వెళ్తున్నారు. తల్లిదండ్రులతో వచ్చిన ఓ పాప మాత్రం క్యూ లో వెయిట్ చేయకలోపోయింది. క్యూ లో నిల్చోవడం బోర్ కొట్టిందో ఏమో కానీ.. వెంటనే చెకింగ్ మెషిన్‌లోకి దూరేసింది. కొన్ని సెకన్ల తర్వాత ఇటు వైపు నుంచి బయటకు వచ్చింది.

కాగా ఎక్స్‌రే‌లో ఆ పాప ఆకారం చాలా భిన్నంగా కనిపించింది. వింత ఆకారం దర్శనమిచ్చింది. చూసేవాళ్లకు ఏలియన్ పోలికలు కనిపించాయి. కొందరికి పురుగులా కనిపించింది. మరికొందరికి జంతువేమో అనిపించింది. అది మనిషి అని చెబితే కానీ నమ్మలేని పరిస్థితి.

పాప చేసిన పని తల్లిదండ్రులు, కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ గమనించలేదు. పాప అలా చేసేసరికి పేరెంట్స్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బంది షాక్ తిన్నారు. ఆ తర్వాత అమ్మాయి చేసిన పని తల్చుకుని నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పాప చేసిన పని చూసి నెటిజన్లు సరదగా నవ్వుకుంటున్నారు. పిల్లాలా మజాకా అని కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అనే మేసేజ్‌ను ఈ వీడియో చెప్పింది.

Read Also: ఫిటింగ్ వర్మ : చంద్రబాబు కంటే రానానే రియల్
Read Also:జెట్ ఎయిర్‌వేస్ విమాన టికెట్‌పై 50 శాతం డిస్కౌంట్
Read Also:కేంద్రం కీలక ఆదేశాలు : బోర్డర్ కు విమానాల్లోనే బలగాల తరలింపు

Woman bored of standing in railway station queue climbs through baggage X-Ray. Watch viral video

మరిన్ని వార్తలు