తేజస్ లో విహరించిన ఆర్మీ చీఫ్

Submitted on 21 February 2019
Chief of the Army Staff General Bipin Rawat after taking a sortie in Light Combat Aircraft - Tejas in Bengaluru

దేశీయ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో గురువారం(ఫిబ్రవరి-21,2019) ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ విహరించారు. బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ స్టేషన్ లో జరుగుతున్న ఏరో ఇండియా-2019 ప్రదర్శనలో భాగంగా మరో పైలట్ తో తేజస్ లో ప్రయాణించారు.భారత్ లో తయారైన యుద్ధ విమానంలో రావత్ ప్రయాణించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.  తేజస్ లో ప్రయాణించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని రావత్ అన్నారు.తేజస్ లక్ష్యం చాలా బాగుందన్నారు. తేజస్ ఒక అద్భుతమైన ఎయిర్ క్రాఫ్ట్ అని తెలిపారు. గాల్లో ఉండగానే ఇంధనం నింపుకోవడం,పలు రకాల బాంబులు,ఆయుధాలు కలిగి ఉండటం వంటి ప్రత్యేకలు తేజస్ లో ఉన్నాయి. లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్(LAC)తేజస్ బుధవారమే వాయిసేనలో చేరింది.

tejas
airforce
BENGALURU
aero india
army chief
Bipin Rawat

మరిన్ని వార్తలు