నో యోయో: చెన్నై సూపర్ కింగ్స్‌ స్పెషల్

Submitted on 15 March 2019
CHENNAI SUPER KINGS NO YO YO TEST

టీమిండియా క్రికెట్‌లో ఇటీవలి కాలంలో యోయో ఫిట్‌నెస్ టెస్టు ఎంతో కీలకమైపోయింది. ఫిట్‌నెస్‌కు ఇంతగా ప్రాధాన్యమివ్వడానికి ధోనీ కూడా ఓ కారణమనే చెప్పాలి. అలాంటిది ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్   జట్టుకు యోయో టెస్టు అవసర్లేదని ఆ జట్టు సహాయక సిబ్బందిలో ఒకరైన భారత మాజీ ట్రైనర్ రాంజీ శ్రీనివాసన్ తెలిపారు.
Read Also: న్యూజిలాండ్ ఘటనపై విచారంలో కోహ్లీ

తొలి మ్యాచ్‌లో చెన్నై జట్టుతో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం యోయో పద్ధతి తప్పనిసరిగా అమలయ్యేలా చూస్తోంది. ఈ విషయం రాంజీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. భారత జాతీయ జట్టు అవలంభించే ఫిట్‌నెస్ పద్ధతులు సూపర్ కింగ్స్ అమలుపరచాలని లేదు. ఎవరి లెక్క వారిది. మా జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ డిఫరెంట్ జోన్. అతని దగ్గర ఫిట్ నెస్ గురించి స్మార్ట్ స్కిల్స్ ఉంటాయి'

'మా ప్లేయర్లను 2కి.మీ నుంచి 2.4కి.మీల వరకూ పరిగెత్తాంచాం. దానిని బట్టే మా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేశా. స్ప్రింట్ టెస్టును రిపీట్ కూడా చేసి చూశాం. కెప్టెన్ తనకు నచ్చే విధమైన ఫిట్‌నెస్‌తో జట్టును తయారుచేసుకుంటాడు' అని వెల్లడించారు.  
Read Also: కోహ్లీకి ధోనీ వార్నింగ్: లేట్ చేయొద్దు

YOYO
cricket
CSK
MS Dhoni
IPL
IPL 12
IPL 2019

మరిన్ని వార్తలు