నిలువుదోపిడీ : ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్ల మోసం

Submitted on 12 February 2019
Chating of Un Employe : 7 crores in the name of jobs

కరీంనగర్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడు రాధాకృష్ణను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరు చెప్పి ఇతను రూ. 7కోట్లు వసూలు చేసినట్లు కరీంనగర్ ఏసీపీ శోభన్ కుమార్ తెలిపారు. సూర్యాపేటకు చెందిన వెల్ది రాధాకృష్ణ  హైదరాబాద్ అంబర్ పేటలో శ్రీవెంకటేశ్వర కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి మోసం చేయడం ప్రారంభించాడు. 320 మంది నుంచి  7 కోట్ల రూపాయలు వసూలు చేసాడు. ఇతనికి సహకరించేందుకు రవిచంద్రా రెడ్డి, బుట్ట జయరాజ్, నాయిని విద్యాసాగర్, ఈశ్వర వేణు గోపాల్ అనే వారిని నియమించుకున్నాడు. వీరంతా కలిసి కరీంనగర్,వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, నల్గొండ, హైదరాబాద్ కర్నూలు, కృష్ణా, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి డబ్బు వసూలు చేశారు. సెక్రటేరియట్, రెవెన్యూ, కమర్షియల్ టాక్స్, డిపార్ట్ మెంట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కోకరి దగ్గర నుంచి లక్ష రూపాయలుపైనే వసూలు చేశారు. కొందరికి నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చారు.

కరీంనగర్ మండలం నగునూర్ కు చెందిన  పైడిపాల వెంకటయ్య వీరి వలలో పడ్డాడు. తెలిసిన వారి నుంచి 26 లక్షలు వసూలు చేసి రాధాకృష్ణకు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న రాధాకృష్ణ ఉద్యోగాల విషయం మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మోసపోయానని గ్రహించిన వెంకటయ్య కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన రెడ్డికి  ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన టాస్క్ ఫోర్సు పోలీసులు.. రాధాకృష్ణ బృందాన్ని అరెస్టు చేసి చెక్ బుక్స్, లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

cheating
jobs
government jobs
Consultancy

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు