డిమాండ్లు పరిష్కరించమంటే ప్రధాని ఎదురుదాడి : సీఎం చంద్రబాబు

Submitted on 11 February 2019
chandrababu spoke at Dharmaparata deeksha in delhi

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి రాజధానికి ప్రధానిని పిలిస్తే మట్టి, నీళ్లు ముఖానికి కొట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. 18 డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేస్తామనిచెప్పి మాట మార్చారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తాను తగ్గి ప్రవర్తించానని చెప్పారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మనకు ఎందుకు ఇవ్వరని నిలదీశానని గుర్తు చేశారు. మోడీ, అమిత్‌ షా అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. 

దేశంలో పారదర్శకంగా పని చేస్తోంది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకి ఆర్థికసంఘానికి ముడిపెట్టారని వాపోయారు. నరేగా డబ్బులు ఇవ్వలేదన్నారు. పోలవరానికి రూ.4 వేల కోట్లు ఇవ్వాలని చెప్పారు. ఏపీ భవన్‌లో చేపట్టిన ఏ పనైనా సఫలమవుతుందన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందనే కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పారు. తమది పవిత్రమైన దీక్ష అన్నారు. 
 

Chandrababu
spoke
Dharmaparata deeksha
Delhi

మరిన్ని వార్తలు