రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ : 18 డిమాండ్ల లేఖ సమర్పణ 

Submitted on 12 February 2019
Chandrababu meeting with President Ram Nath Kovind

ఢిల్లీ : ఏపీ విభజన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ తో సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టిన అనంతరం ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. ఏపీ భవన్ నుండి రాష్ట్రపతి భవన్ వరకూ ర్యాలీగా వెళ్లి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన చంద్రబాబు 18 డిమాండ్లతో కూడిన లేఖను కోవింద్ కు చంద్రబాబు అందజేశారు. వీరంతా ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్లారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోవింద్ ను కోరామని..విభజన హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమో మోడీ వాగ్ధానం చేసిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రధాని మోదీకి నాయకత్వ లక్షణాలు లేవని..దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మోదీకి లేదని విమర్శించారు. ఢిల్లీ దీక్షతో ఏపీ ప్రజల బాధను దేశం మొత్తానికి తెలియజేశామని..దీనికి మంచి స్పందన వచ్చిందనీ..పలు పార్టీల అధినేతలు మఖ్యమంత్రులు..మాజీ ప్రధాన మంత్రులు తమ ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలపటమే దానికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. ఏపీకి న్యాయం జరిగేంతవరకూ..నరేంద్రమోడీని గద్దె  దింపేంతవరకూ పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

 

మరిన్ని వార్తలు