బ్రేకింగ్: జ్యోతి హత్యకేసులో శ్రీనివాస రావు పై కేసు నమోదు

Submitted on 16 February 2019
case against Srinivasa Rao in Jyothi murder case

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి- జ్యోతి హత్యకేసులో ప్రియుడు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. అయితే.. ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని మీడియాకు ఇచ్చేందుకు మంగళగిరి డీఎస్పీ రామకృష్ణ నిరాకరించారు. మొదటి నుంచీ కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్న డీఎస్పీపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని డీఎస్పీపై జ్యోతి బంధువుల ఆరోపిస్తున్నారు. డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా.. ఓ మంత్రి ఒత్తిళ్లకు ఉన్నతాధికారులు తలొగ్గారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

guntur
mangalagiri
Jyothi
murder
Love

మరిన్ని వార్తలు