నేషనల్ అవార్డుల దరఖాస్తుకు ‘కంచెరపాలెం’ మూవీకి అనుమతి!

Submitted on 13 January 2019
Care of Kancharapalem, Kancharapalem movie, National Awards, US Producer, Praveen Paruchuri, Rana Daggubati, Suresh Productions, Rajyavardhan Singh Rathore 
  • చిత్ర నిర్మాత అభ్యర్థన మేరకు దరఖాస్తు పరిశీలనకు అవకాశం

  • ఐఎఫ్ఎఫ్ఐ 2019 అవార్డులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

తెలుగు హిట్ చిత్రం కేర్ ఆఫ్ కంచెరపాలెం చిత్రబృందానికి గుడ్ న్యూస్. నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కాని ఈ చిత్రానికి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మరో అవకాశం కల్పించింది. చిత్ర నిర్మాత యూఎస్ సిటిజన్ ప్రవీణా పరుచూరి అభ్యర్థన మేరకు మరోసారి నేషనల్ ఫిల్మ్ అవార్డులుకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. ఐఎఫ్ఎఫ్ఐ 2019 అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డు కాంపిటీషన్స్ కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కంచెరపాలెం మూవీ.. నేషనల్ అవార్డులకు ఎంపిక చేయకపోవడంపై ఆ చిత్ర నిర్మాత భారత సంతతికి చెందిన కార్డియాల‌జిస్ట్ విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి.. కేటీఆర్ సహా పలువురు రాజకీయ నేతలను న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. ప్రవీణ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్.. కంచెరపాలంపై చిత్రం ఎంపికపై మరోసారి సమీక్ష జరపాలని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాథోడ్ ను ట్విట్టర్ వేదికగా కోరారు.

కేటీఆర్ ట్వీట్ కు రాథోడ్ రెస్పాన్స్..
కేటీఆర్ ట్వీట్ పై రాజ్యవర్థన్ రాథోడ్ స్పందించారు. ‘‘ప్రియమైన కేటీఆర్ గారు.. మా అధికారులు ప్రవీణాతో ఈ విషయమై చర్చించారు. నేషనల్ ఫిల్మ్ అవార్డులకు అర్హత సాధించాలంటే.. ఆ చిత్రానికి సహా నిర్మాత ఒకరైన కనీసం భారతీయుడై ఉండాలి. మా వాళ్లు.. కంచెరపాలెం నామినేట్ దరఖాస్తుకు సంబంధించి విధానాలపై ప్రవీణాకు వివరించారు. అంతర్జాతీయ ఐఎఫ్ఎఫ్ఐ 2019 అవార్డుల కాంపిటీషన్ కు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది.  

రాథోడ్ ట్వీట్ పై నిర్మాత ప్రవీణా స్పందన.. 
కేటీఆర్ కు రాథోడ్ చేసిన ట్వీట్ పై కంచెరపాలెం చిత్ర నిర్మాత యూఎస్ సిటిజన్ ప్రవీణ స్పందించారు. ‘‘సురేష్ ప్రొడక్షన్స్, రానా దగ్గుబాటి అందించిన ప్రోత్సాహంతో నేషనల్ అవార్డులకు దరఖాస్తు చేసుకున్నాం. రాథోడ్ సార్, కేటీఆర్ సార్.. విలువైన మీ స్పందనకు ధన్యవాదాలు. భారతీయ నిర్మాత ఉంటేనే నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక చేస్తారనే నిబంధనను శాశ్వతంగా మార్పు చేసే దిశగా చర్చలు కొనసాగిస్తాం. లవ్ యూ తెలుగు సినిమా’’ అంటూ రీట్వీట్ చేశారు.  

గత ఏడాది సెప్టెంబర్ 7న విడుదలైన కేర్ ఆఫ్ కంచెరపాలెం చిత్రం కలెక్షన్ల రికార్డు సృష్టించింది. దేశంలోనూ, విదేశాల్లోనూ ఈ చిత్రం మంచి హిట్ టాక్ అందుకున్న సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డులకు అర్హత కలిగిన ఈ సినిమాను నేషనల్ ఫిల్మ్ అవార్డులకు నామినేట్ చేయకపోవడంపై కంచెరపాలెం చిత్రబృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చిత్ర నిర్మాత యూఎస్ సిటిజన్ అనే ఒక్క కారణంతో నేషనల్ అవార్డులకు కేర్ ఆఫ్ కంచెరపాలెం మూవీని ఎంపిక చేయలేదని చిత్రబృందం అసహనం వ్యక్తం చేసింది.  


Read Also: కేటీఆర్ స్పందించారు : ‘కంచెరపాలెం’ నేషనల్ అవార్డ్స్ కు నోచుకోలేదంటే..?

Care of Kancharapalem
Kancharapalem movie
National Awards
US Producer
Praveen Paruchuri
Rana Daggubati
Suresh Productions
Rajyavardhan Singh Rathore 

మరిన్ని వార్తలు