మస్ట్ రీడ్ : ప్రపంచంలో ఫస్ట్.. ఏప్రిల్ నుంచి ఆ సిటీలో నీళ్లు ఉండవు

Submitted on 20 March 2019
Cape Town to be the first major city in the world to be without water

ఒక్క నీటి చుక్క ఎంతో విలువైనది. పొదుపుగా నీటిని నిల్వచేసుకుంటే భవిష్యుత్తులో అదే నీటి బిందువు ప్రాణాధారమవుతుంది. నీటిని వృథాచేయరాదు. లేదంటే ప్రకృతి విక్రోపాన్ని రుచి చూడాల్సిన పరిస్థితి ఎదురువుతుంది. పబ్లిక్ ప్లేస్ ల్లో కావొచ్చు.. ఇంట్లో కావొచ్చు.. నీటిని వృథా చేస్తుంటారు. నీళ్ల ట్యాప్ లు నుంచి బాత్ రూం ట్యాప్ ల వరకు అనవసరంగా నీటిని వృథా చేస్తుంటారు.. తస్మాత్ జాగ్రత్త. మీరు వృథా చేసిన నీరు భవిష్యత్తులో తాగేందుకు కూడా దొరకని పరిస్థితి ఎదురుకాక తప్పదు. ముందే మేల్కొండి.. నీటిని నిల్వ చేయండి.. నీటి విలువ ఏంటో ఇప్పుడు తెలియకపోవచ్చు.. ఒక్క రోజు మున్సిపాలిటీ నీళ్లు రాకపోతేనే ఎంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. నీళ్లు లేవని చిరాకుపడుతుంటారు. కాసేపు ఇంట్లో వాడకానికి నీళ్లు లేకుంటేనే ఇంత వర్రీ అవుతుంటే.. తాగడానికి కూడా చుక్క నీళ్లు దొరకని వారి పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా? కరువు అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒక నగరాన్ని చూస్తే తెలుస్తుంది. సమ్మర్ వచ్చిందంటే ఆ నగరంలో తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకవు. తాగునీటి కొరతతో అక్కడి జనం అల్లాడిపోతున్నారు. 

సమ్మర్ వచ్చిందంటే.. నగరంలో నీటి కటకట :
వర్షాకాలంలో నీళ్లతో కళకళలాడే డ్యామ్ లు ఎండాకాలం వచ్చిందంటే ఎండిపోయి వెలవెలబోతుంటాయి. ఎక్కడ చూసిన కరువు విలాయతాండవం చేస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది. చాలీచాలనీ నీటి సరఫరాతో గొంతు తడుపుకునే ధీన పరిస్థితివారిది. ప్రపంచవ్యాప్తంగా కరువు పీడించే నగరాల్లో అత్యంత దుర్భర పరిస్థితి. అది ఎక్కడో కాదు.. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ సిటీ. వెస్టరన్ కేప్ రీజియన్ లో ఎన్నో ఏళ్ల నుంచి నీటి కొరత వెంటాడుతోంది. వర్షపాతం తక్కువగా ఉండే ఈ ప్రాంతంలో సమ్మర్ వచ్చిందంటే నీళ్ల కటకట మొదలువుతుంది. తాగునీటి కోసం కేప్ టౌన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ప్రకృతిపరంగా సంభవించే నీటి కొరత సమస్యను ప్రపంచంవ్యాప్తంగా చాలా దేశాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. కేప్ టౌన్ నగరవాసులు కూడా నీటి ఎద్దడితో ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని బతుకీడుస్తున్నారు. నీటి కొరతను తట్టుకోలేక సౌత్ ఆఫ్రికా వాసులు నీళ్ల కోసం బారులు తీరుతున్నారు.

నీటి సరఫరాకు ఇదే ఆఖరి నెల :
కేప్ టౌన్ నగరంలో నీటి సరఫరా నిలిచిపోనుంది. ఏప్రిల్ లో పూర్తిగా నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ప్రపంచంలో నీటి సరఫరా నిలిచిపోనున్న తొలి మేజర్ సిటీగా కేప్ టౌన్ రికార్డు ఎక్కనుంది. సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ నుంచి నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కేప్ టౌన్ ప్రజలకు నీటి సరఫరా ఇదే చివరి రోజు కానుంది. తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న నగరవాసులకు అక్కడి ఆర్మీ రోజువారీగా రేషన్ వాటర్ సరఫరా చేస్తూ వస్తోంది. నీటి కుళాయిలను ఏర్పాటు చేసి ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
Read Also :20 రోజుల తర్వాత : వచ్చేది ప్రజల ప్రభుత్వమే

నగరవాసులకు నీటిని అందించేందుకు డ్యామ్ ల్లో వాటర్ ను సేకరించి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. నీటి కొరత మరింత దారుణ స్థితికి చేరుకోవడంతో నీటి సరఫరాను నిలిపివేయాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. నీటి వాడకంపై షరతులు విధించారు. నీటి వాడకాన్ని సగానికి పైగా తగ్గించేశారు. వాటర్ ట్యాంకుల్లో నీటిని రోజువారీగా సరఫరా చేస్తూ వచ్చారు. ఆరు కీలక డ్యామ్ లనుంచి 13.5 శాతం నీటి సరఫరా చేస్తున్నారు. సెప్టెంబర్ 2018 నుంచి కేప్ టౌన్ పర్వత ప్రాంతాల్లోని డ్యామ్ ల్లోని నీరు 70శాతానికి పైగా ఇంకిపోయింది.

జీరో డే.. డ్యామ్ ల్లో అడుగంటిన నీళ్లు
దీంతో సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం నీటి సరఫరా నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు అది జీరో డేకు పడిపోయింది. వర్షపాతం మీద ఆధారపడే ఇక్కడి ప్రజలకు వేసవి వచ్చిందంటే చాలు.. కరువు తాండవిస్తుంటుంది. వెస్టరన్ కేప్ రీజియన్ లో 2015 నుంచి డ్యామ్ ల నీటిమట్టం స్థాయి క్రమంగా పడిపోతు వస్తోంది. 2017 నుంచి 2018 మధ్య కాలంలో నీటి ఎద్దడి మరింత పెరిగిపోయింది. డ్యామ్ క్యాపాసిటీ మొత్తం 15 నుంచి 30 శాతం పెరిగితే.. 2017 తర్వాతి కాలంలో జీరో డేకు పడిపోయింది. దీంతో సౌత్ అఫ్రికా నీటి సరఫరాపై ఆంక్షలు విధించింది. మార్చి 2018లో నీటి సరఫరాను 500 మిలియన్ల లీటర్లు (13 కోట్లు యూఎస్ గ్యాలెన్లు) సగానికి పైగా తగ్గించారు. మార్చి 2019 నాటికి నీటి సరఫరాకు క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. 

భవిష్యత్తు కాదు.. 2019 ప్రస్తుత పరిస్థితి ఇది :
మీరు చూస్తున్న ఈ దృశ్యాలు.. వచ్చే 2100 సంవత్సరం కాదు.. 2050 సంవత్సరం అంతకన్న కాదు.. 2019 ఏడాది ఏప్రిల్ లో పరిస్థితి ఇది. జలధార అడుగంటిపోయింది. డ్యామ్ లు, సరస్సులు పూర్తిగా ఎండిపోయాయి. ఏప్రిల్ నాటికి నీటి స్థాయి విలువలు మరింత దారుణ పరిస్థితి ఉండేలా కనిపిస్తోంది. నీళ్లు లేక నదులు బీటలు వారిపోయాయి. మూడు సంవత్సరాల్లో కరువు సమస్య అత్యంత దుర్భరంగా మారిపోయింది.

మేల్కొండి.. నీటి విలువ తెలుసుకోండి :
నగరవాసులకు నీటి వాడకం 2 నిమిషాల కంటే తక్కువగా మాత్రమే వాడాలి. గిన్నెల కడిగే షింకులు కూడా కట్టియాల్సిందే. వాటర్ బాటిళ్లలో నీళ్లు నింపుకుని వాటితే రోజులు గడపాల్సిన పరిస్థితి. నీటి కుళ్లాయిల దగ్గర బారులు తీరాల్సిందే. రోజు మీరు వాడే నీటిలో 90 శాతం నీటిని నిల్వ చేయాలి. జాగ్రత్తగా నీటిని వాడాలి. వృథాగానీటిని పోనివ్వద్దు. వాతావరణ శాస్త్రవేత్తలు ఈ పరిస్థితిని చూసి గ్లోబల్ వార్మింగ్ ప్రమాదస్థాయికి పెరిగిపోతుందని, ప్రపంచవ్యాప్తంగా మరెన్నో పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 
Read Also :భారీ తిమింగలం మృతి.. కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు

Cape Town
Water Crisis
major city
World
Drought
With out water   

మరిన్ని వార్తలు