ఇదిగో ప్రాసెస్ : గూగూల్ హోం స్పీకర్‌తో అమెజాన్ మ్యూజిక్ ప్లే చేయొచ్చు!

Submitted on 19 February 2020
Android device, Amazon Music, Google Home, Google Home speaker

మీ దగ్గర గూగుల్ హోం స్పీకర్ ఉందా? ఆండ్రాయిడ్ డివైజ్ నుంచి అమెజాన్ మ్యూజిక్ ప్లే చేయొచ్చు. అమెజాన్ మ్యూజిక్ యాప్ నుంచి గూగుల్ హోం స్పీకర్ తో కనెక్ట్ చేసి సాంగ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అమెజాన్ మ్యూజిక్ కంట్రోల్ చేయడానికి గూగుల్ హోంలో వాయిస్ కమాండ్స్ పనిచేయవు. 

ఇందుకు మీరు ఇతర థర్డ్ పార్టీ యాప్స్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఆండ్రాయిడ్ డివైజ్ నుంచి మీ గూగుల్ హోంకు అమెజాన్ మ్యూజిక్ ఈజీగా క్యాస్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ తమ మ్యూజిక్ ప్రియుల కోసం సొంత మ్యూజిక్ యాప్ క్రియేట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ యాక్సస్ చేసుకునే యూజర్లందరిని అమెజాన్ మ్యూజిక్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. 

అమెజాన్ డివైజ్ లనుంచి గూగుల్ యూట్యూబ్ యాప్ తొలగించింది. దీంతో అమెజాన్ మ్యూజిక్ గూగుల్ హోం స్పీకర్ ద్వారా ప్లే చేయలేకుండా మారింది. మీ కంప్యూటర్ నుంచి గూగుల్ క్రోమ్ లో అమెజాన్ మ్యూజిక్ వెబ్ యాప్ ద్వారా కూడా యాక్సస్ చేసుకోనే అవకాశం ఉంది. కానీ, ఇతర మ్యూజిక్ యాప్ స్ట్రీమింగ్ తో పోలిస్తే కాస్తా కష్టమే మరి. ఇటీవలే అమెజాన్ మ్యూజిక్ యాప్.. తమ ఆండ్రాయిడ్ యాప్ క్యాస్టింగ్ సపోర్ట్ యాడ్ చేసింది. 

మీ దగ్గర ఆండ్రాయిడ్ డివైజ్ ఉంటే చాలు.. మీ గూగుల్ హోం స్పీకర్ తో అమెజాన్ మ్యూజిక్ ఈజీగా క్యాస్ట్ చేసుకోవచ్చు. అదే ఆపిల్ యూజర్లు అయితే.. కంప్యూటర్ ద్వారా క్యాస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా క్యాస్టింగ్ సపోర్ట్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే, ఆండ్రాయిడ్ డివైజ్ ఉపయోగించి గూగుల్ హోం స్పీకర్ తో అమెజాన్ మ్యూజిక్ ఎలా కనెక్ట్ చేయాలో ఓసారి చూద్దాం...

* మీ ఆండ్రాయిడ్ ఫోన్లో అమెజాన్ మ్యూజిక్ యాప్ ఓపెన్ చేయండి.
* మీ ఫోన్ స్ర్కీన్ కింది భాగంలో Cast icon పై tap చేయండి.
* TV మాదిరిగా.. ఐకాన్‌లో Wi-Fi సింబల్ మాదిరిగా కనిపిస్తుంది. 
* డివైజ్ లిస్టులో మీ గూగుల్ హోం స్పీకర్ ఎంచుకోండి.  
* మీ ఫోన్ వై-ఫై.. గూగుల్ హో స్పీకర్ ఒకే వై-ఫై నెట్‌వర్క్ కనెక్ట్ అయి ఉండాలి.
* ఇప్పుడు ఏదైనా ఒక మ్యూజిక్ సాంగ్ ఎంచుకోండి.
* గూగుల్ ప్లే హోం స్పీకర్ నుంచి ప్లే చేసేలా సెట్ చేస్తే చాలు.. 

నోట్ : గూగుల్, అమెజాన్ మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. వాయిస్ కమాండ్స్ అనుమతి లేదు. ఇతర మ్యూజిక్ యాప్స్ ద్వారా మాత్రమే వాయిస్ కమాండ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. 

Android device
Amazon Music
Google Home
Google Home speaker

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు