Activities calendar
17 April 2017
హైదరాబాద్: అవును నీటి కోసమే కోటి కష్టాలు, బిందెడు నీళ్ల కోసం అష్టకష్టాలు, కిలోమీటర్ల కొద్ది నడిచి, అన్ని పనులు పక్కనబెట్టి, కేవలం నీటి కోసమే ఎన్నో బాధలు పడుతున్నారు. ఆ దృశ్యాలను చూస్తే రాజస్థాన్ ఇసుక ఎడారుల్లో పడే బాధలు గుర్తుకొస్తున్నాయి. చుట్టూ అన్ని సదుపాయాలు ఉన్నట్లే ఉంటాయ్, కానీ సమయానికి చుక్క నీరు రాదు. ప్రభుత్వాలు, అధికారులు అన్ని సమకూరుతున్నాయని నమ్మబలుకుతారు. తీరా కష్టకాలం వచ్చే సరికి ఎప్పటి బతుకే మిగిలింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో కనిపిస్తున్న దుస్థితి. ఇదే అంశం పై నేటి 'వైడాంగిల్' స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..
హైదరాబాద్: రిజర్వేషన్ల మీద అఖిల పక్షాల డ్రామా.. అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తున్న పార్టీలు, కూలి పనులకు జమైతోన్న కోట్ల పైకం...చెమట ఎల్లకుండనే చేరిపోతున్న లక్షలు, లోకశాన్ని ముద్దపప్పు అనుడు బంద్...చర్యలు తీసుకునే ఆలోచనలో చంద్రాలు, లోపల కుర్చీలు ఇరగ్గొట్టిన తెలుగు తమ్ముడు...బయట చెప్పుతోని కొట్టుకున్న ఫ్యాన్ గుర్తన్న, ఫేస్ బుక్ ప్రేమలో పడి బుక్కయిన పోరడు...మారు ఫోటోలతోని మాయ చేసిన కిలాడీ, హిందూపురం కాడా విపరీతమైన దూప..బాలికాక రాకకోసం జనం చూపు.. ఇత్యాది అంశాలతో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న హాట్ హాట్ అంశాలతో మన ముందుకు వచ్చారు. మరి మీరు కూడా వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చేసింది. బాహుబలితో ఎన్నో సంచలనాలు సృష్టించి, రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా,ఎన్నో ప్రశ్నలు మిగిల్చింది. మరి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తూ పార్ట్ -2 రిలీజ్ కాబోతోంది. అదేనండి బాహుబలి -2 ద కంక్లూజన్, ఇదే సినిమా గురించి బోలెడన్ని కబుర్లు '10టివి'తో షేర్ చేసుకున్నారు. హీరో అమరేంధ్ర బాహుబలి 'ప్రభాస్, దేవ సేన 'అనుష్క' తో చిట్ చాట్ పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...
ఉద్దానం కిడ్నీ సమస్యల పై మంత్రికి నివేదిక...
'తెలంగాణ లో మహిళ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి'
అనంతపురం : హిందూపురంలో సిపీఐ నేతలు ఆందోళనకు దిగారు.. ఎమ్మెల్యే బాలయ్యా, మా నీటి సమస్యలు తీర్చవయ్యా అంటూ వినూత్నరీతిలో నిరసన తెలిపారు.. కాలనీవాసులతో కలిసి ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.. కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు.. మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని... అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని నేతలు ఆరోపించారు..
విజయవాడ: రాజధాని ప్రాంతంలో దళితులు సాగు చేసుకుంటున్న లంక, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం ఇవ్వాలని దళిత సంఘాలు.. రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. రాజధానిలో దళితుల పట్ల వివక్ష.. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళితులకు ప్రభుత్వం అనేక హామీలు గుప్పించిందని.. కానీ అవేమి నెరవేర్చాలేదని విమర్శించారు. అలాగే పాట్ల కేటాయింపులో వివక్ష విడనాడాలని .. వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అమరావతి: ప్రతి సోమవారం విజయవాడలోని కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి పోలవరం నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షిస్తున్న చంద్రబాబునాయుడు, ఈసారి ప్రాజెక్టు పురోగతిని స్వయంగా పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన చంద్రబాబు, ఆ తర్వాత స్పిల్ వే రెగ్యులేటర్, డయాఫ్రం వాల్, గేట్ల నిర్మాణాలను తనిఖీ చేశారు.
అధికారులు, కాంట్రాక్టర్లకు సూచనలు, సలహాలు, ఆదేశాలు ...
ప్రాజెక్టు స్థలంలోనే చంద్రబాబునాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్న ఈ భేటీలో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలతో పాటు ఆదేశాలిచ్చారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు... ఇంకా వేగాన్ని పెంచాలని కోరారు. ఇందుకు అనుగుణంగా యంత్రాలతో పాటు మానవ వననరులను సమకూర్చుకోవాలని ఆదేశించారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం కొందరు నేతలు పోవరం పనులను అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కోర్టుల్లో కేసులు వేస్తూ, కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ...
జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో చేసిన పనులకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు అంశంపై కూడా చర్చ జరిగింది. వీటిని చెల్లించేందుకు వీలుగా ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నాబార్డు నుంచి ఐదువేల కోట్ల రూపాయల గ్రాంటు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తెచ్చారు.
ఏపీ జెన్కో ఆధ్వర్యంలో పవర్ హౌస్ నిర్మాణం ....
పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని చంద్రబాబు అధికారులకు వివరించారు. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో పవర్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. మొత్తం మీద పోలవరం పనులు గడువులోపే పూర్తి చేస్తామని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు.
తూర్పుగోదావరి :రంపచోడవరంలో విషాదం చోటుచేసుకుంది. తూర్పుమన్యంలో ఓ కొండపైన నివాసం ఉంటున్న గిరిజనుల పూరిగుడిసె మంటల్లో కాలి బూడిదకాగా..ఆ మంటల్లోనే చిక్కుకొని నలుగురు చిన్నారులు కన్నుమూశారు. నలుగురు చిన్నారులను ఇంట్లో వదిలిపెట్టిన తండ్రి కూలీపనిగా వెళ్లగా..కొద్దిసేపటికి తల్లి మంచినీటి కోసం బయటకు వెళ్లింది. అయితే తల్లిదండ్రులిద్దరూ బయటకు వెళ్లిన కొద్దిసేపటికే కొండప్రాంతానికి మంటలంటుకున్నాయి. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే గుడిసెకు మంటలంటుకున్నాయి. అయితే విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులిద్దరూ ఇంటికి చేరుకున్నారు. కానీ అప్పటికే నలగురు చిన్నారులు మంటల్లో చిక్కుకొని కన్నుమూశారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు.
టీఎస్ సీఎస్ ను కలిసిన టీ.ఉద్యోగ సంఘం నేతలు
4గురు టీఎంసీ నేతలపై సీబీఐ కేసులు
అనంతపురం : జిల్లాలోని కదిరిలో ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో నకిలీ అభ్యర్థులు పరీక్ష రాశారు. ఒకరికి బదులు మరొకరు పరీక్షలకు హాజర అయ్యారు. అయన అధికారులు పట్టించుకోలేదు. ఉదయం 8 గంటలవరకే అభ్యర్థుల పేపర్ చేతికొచ్చింది. అధికారులు తూతూ మంత్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నల్లగొండ : అలకలు.. అంతర్గత కుమ్ములాటలతో నిత్యం కస్సుబుస్సుల కాపురంగా ఉండే తెలంగాణ కాంగ్రెస్‌లో .. పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పొలిటికల్ వ్యూహాల్లో దిట్టలనిపించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్‌తో కాపురాన్ని తెంచేసుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారు కమలనాథులను ఆశ్రయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ, కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ రూట్ మ్యాప్ ఏంటి..?
రాజకీయాల్లో ఈ సోదరులకు ప్రత్యేక గుర్తింపు.......
కోమటిరెడ్డి బ్రదర్స్..! తెలంగాణ కాంగ్రెస్‌లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ సోదరులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఇపుడు టీకాంగ్రెస్ రాజకీయాలకు ఈ ఇద్దరు సోదరులే కేంద్రబిందువుగా మారారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం కోమటిరెడ్డి బ్రదర్స్ వూహమా..? లేక కమలంపార్టీ ఎత్తుగడా.. అన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. టీపీసీసీలో కీలక పదవులు కోరుకుంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్.. పార్టీ అధిష్ఠానాన్ని బెదిరించడానికే ఇలా బిజెపిలోకి వెళ్తున్నట్టు లీకులిస్తున్నారని కొంతమంది అంటుండగా .. తెలంగాణలో బలపడాలని ప్రయత్నిస్తున్న కమలంపార్టీ.. కావాలనే ఇటువంటి ప్రచారానికి దిగిందనేది మరికొంతమంది వాదన.
.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాస్‌లీడర్‌గా........
నల్లగొండ నియోజకవర్గంలో వరుస విజయాలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాస్‌లీడర్‌గా గుర్తింపుతెచ్చుకోగా... జిల్లానేతల్లో ఐక్యత తీసుకురావడంలో.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పేరుతెచ్చుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇద్దరు సోదరులు కలిసి వ్యూహం రచిస్తే.. ఇక తిరుగే ఉండదన్నది అనుచరుల మాట. నల్లగొండ జిల్లాలోనేకాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ సోదరద్వయానిది చక్రం తిప్పే స్థాయేనని అనుచరులు నమ్ముతారు. కోమటిరెడ్డి సోదరులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగారు. వైఎస్ కు అత్యంత సన్నిహిత బృందంలో వీరూ ఉన్నారు. వైఎస్ హయాంలోనే ఈ కుటుంబానికి మంత్రి పదవి దక్కింది. అయితే వైఎస్ మరణానంతరం కోమటిరెడ్డి సోదరుల ప్రాభవం తగ్గుతూ వచ్చింది.
పీసీసీ కుర్చీకోసం.......
కాలక్రమంలో, తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడం.. రాష్ట్రం సిద్ధించడం.. ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంతో.. కాంగ్రెస్‌పార్టీ అధికారానికి దూరమైంది. ఇదే క్రమంలో.. కాంగ్రెస్ పార్టీ సారథ్యంపై పార్టీలో అంతర్గత రాజకీయాలు ఊపందుకున్నాయి. పీసీసీ కుర్చీకోసం జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, పార్టీ అధిష్ఠానం మాత్రం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైపు మొగ్గింది. తమను కాదని, తమ జిల్లాకే చెందిన ఉత్తమ్‌ను పీసీసీ పీఠంపై కూర్చోబెట్టడంతో.. కోమటిరెడ్డి బ్రదర్స్ కినుక వహించారు. అది కాస్తా.. ఉత్తమ్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్‌గా రూపాంతరం చెందింది. వీలుచిక్కినప్పుడల్లా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై సెటైర్లతో పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నారు కోమటిరెడ్డి సోదరులు. నల్లగొండ జిల్లాక్యాడర్లో కోమటిరెడ్డి సోదరులకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా హస్తంపార్టీ అధిష్ఠానం కేవలం నోటీసుల జారీకే పరిమితమైంది.
నల్లగొండజిల్లా రాజకీయంగా కీలక పాత్ర.....
నిజానికి, ఉమ్మడి ఏపీలోనూ.. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోనూ నల్లగొండజిల్లా రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగిన సాధరణ ఎన్నికల్లోనూ గులాబీ గాలిని తట్టుకొని ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకుంది హస్తంపార్టీ. అయితే ఎన్నికల అనంతర పరిణామాలతో ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డితో పాటు.. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సొంత నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పినా.. క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సవాల్ చేసి మరీ తమ్ముడిని గెలిపించుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అంతేనా, ఇటీవల నియోజవకర్గ పరిధిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన పట్టును నిరూపించుకున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ మౌనం.......
టీపిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో వైరం.. మరోవైపు అధికార పార్టీ ఆకర్షణ నుంచి సొంతక్యాడర్ ను కాపాడుకోవాల్సిన అవసరం నేపథ్యంలో, కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ పిరాయిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కోమటిరెడ్డి బ్రదర్స్ మౌనం.. అర్ధాంగీకారాన్ని తెలియజేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి వీరి ఫిరాయింపు వార్తలతో నల్లగొండజిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇంతకీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలాంటి స్టెప్ తీసకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
కరీంనగర్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ ఆల్ఫోర్స్ కాలేజీ విద్యార్థులు సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. అన్ని గ్రూపుల్లోనూ కళాశాల స్టుడెంట్స్ మంచి మార్కులు సాధించారు. కాలేజీ టాపర్లను కాలేజీ చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు.
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టును ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తిచేయడానికి ప్రయత్నించడం అప్రజాస్వామ్యమని మహిళా రైతు సంఘం నేతలు విమర్శించారు. హైదరాబాద్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అధికార వాదనలు-గ్రామస్థాయి నిజాలు అనే అంశంపై మహిళా రైతు సంఘాల వేధిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బాధిత మహిళా రైతులు, ప్రజాసంఘాలు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.
నిజామాబాద్ : రైతుల మీద తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఉచితంగా ఇస్తామన్న 4వేల రూపాయల ఎరువులను ఈ పంట నుండే అమలు చేయాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోదన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరుణ కోసం ప్రొఫెసర్ కోదండరామ్ పాదయాత్ర నిర్వహించారు. పురాతన కట్టడాలపై బిల్లును ఆమోదించిన ప్రభుత్వం పురాతన నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడం దారుణమన్నారు. నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలు మాని ప్రజల కోసం ఫ్యాక్టరీని తెరిచి జిల్లా ఆర్థిక వ్యవస్థను కాపాడాలన్నారు.
అదిలాబాద్ : టీఆర్ఎస్ బహిరంగసభకు నిధుల సేకరణకోసం మంత్రి జోగు రామన్న స్వీపర్‌గా మారారు.. ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో పారిశుద్ధ్య పనులు చేశారు. ఈ పనులకు ఆస్పత్రి యాజమాన్యం లక్షా యాభైవేల రూపాయలు ఇచ్చింది.. అక్కడినుంచి ఖానాపూర్వెళ్లిన మంత్రి చెరువుగట్టున మట్టి మోశారు. ఇలా రెండు లక్షల యాభైవేల రూపాయలు సంపాదించారు. ఈ డబ్బును పార్టీ ప్లీనరి అవసరాలకోసం వినియోగిస్తామని జోగు రామన్న తెలిపారు.
విజయవాడ : గుణదల చేరుకున్న దేవినేని నెహ్రూ మృతదేహనికి మంత్రి నారా లోకేష్, రవీంద్ర నివాళులు అర్పించారు. నెహ్రూ మృతదేహం కడసారి చూపు కోసం కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు. ఆయన అంతిమయాత్ర రేపు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుంది.
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్ వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. గాంధీ గంజ్ నుంచి శ్రద్దానంద్ గంజ్‌కు మార్కెట్ తరలించే విషయంపై కమీషన్ ఏజెంట్లు .. మార్కెట్ కమిటీ అధికారుల మధ్య గొడవ కొనసాగుతోంది. నోటీసులతో రంగంలోకి దిగిన అధికారులు..గాంధీ గంజ్‌లోని ఏజెంట్లకు నోటీసులు జారి చేశారు. ఈనెల 10 వరకు ఇచ్చిన గడువు ముగిసినా.. తొలగించకపోవటంతో అధికారులు నోటిసులు జారి చేసారు.
అంగడి బజార్ నుంచి గాంధీ గంజ్‌కు......
2001 సంవత్సరంలో నగరంలోని అంగడి బజార్ నుంచి కూరగాయల మార్కెట్‌ను గాంధీ గంజ్‌కు తరలించారు. సుమారు 60 మంది కమీషన్ ఏజెంట్లు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. 40 మంది ఏజెంట్లకు అధికారులు ప్లాట్ పారాలను నిర్మించి ఇచ్చారు. విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్దం సేవలు, సెక్యూరిటీ సౌకర్యాలు ఉచితంగా కల్పించడంతో..హోల్ సేల్ కూరగాయల మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు.
అందుబాటులో ఉండే శ్రద్ధానంద్ గంజ్‌లో........
ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో.. అధికారులకు అందుబాటులో ఉండే శ్రద్ధానంద్ గంజ్‌లో కోటి రూపాయల వ్యయంతో హోల్ సేల్ కూరగాయాల మార్కెట్‌ను నిర్మించారు. 62 గదులతో పాటు 2 కార్యాలయాలతో మార్కెట్ నిర్మాణం పూర్తి అయి ఏడాది గడిచినా.. కమీషన్ ఏజెంట్లు అక్కడికి వెళ్లెందుకు ససేమిరా అంటున్నారు. నగరానికి దూరంగా ఉండే శ్రద్ధానంద్ గంజ్‌లో సరుకుకు సరైనా రక్షణ లేదని.. తమకు ప్రాణభయం ఉందని కమీషన్ ఏజెంట్లు వాపోతున్నారు. ఎన్ని నోటీసులిచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కమీషన్ ఏజెంట్లు అంటున్నారు. అవసరమైతే ఆందోళన చేపట్టేందుకు సిద్ధమని చెబుతున్నారు.
గుంటూరు : కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ పాలనలో తన మార్క్ చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే నుంచే తన శాఖపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులతో వరుసగా రివ్యూ మీటింగ్ లు, భేటీలు నిర్వహిస్తున్నారు
అనుభవం లేని లోకేష్‌కు కీలక శాఖలు.....
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలు ఎలాంటి అనుభవం లేని లోకేష్‌కు ఇవ్వడం ఏంటనే చర్చ కూడా జరిగింది. ఇలాంటి విమర్శలకు తావివ్వకుండా తనకు కేటాయించిన శాఖలను , మిగతా అన్ని శాఖల కంటే విజయవంతంగా నడపాలన్న భావనతోనే వరుస భేటీలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అవగాహన పెంచుకోవాలని...........
మరోవైపు లోకేష్ తన శాఖ మీద పట్టు సాధించడమే కాకుండా , కీలకమైన ఇతర శాఖల మీద కూడా అవగాహన పెంచుకోవాలని చూస్తున్నారట. తన శాఖలకు అనుబంధంగా ఉన్న శాఖల సమీక్షలకు హాజరవ్వడం ద్వారా పాలనకు సంబంధించి సమాచారాన్ని మరింత ఎక్కువగా తెలుసుకోవచ్చనే లోకేష్ భావిస్తున్నారట.
.
ప్రతిపక్షం ఇరుకునపెట్టే అవకాశం.......
మంత్రి కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్షం ఇరుకునపెట్టే అవకాశం ఎక్కువ ఉండడంతో ఇప్పటి నుంచే తన శాఖలపై పూర్తి పట్టు సాధించి ప్రతిపక్ష ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ : కశ్మీర్లో అల్లర్లను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కూలంకషంగా చర్చించామన్నారు. జీఎస్టీ బిల్లు వల్ల రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని వాటిని సవరించాలని సీపీఎం కోరిందన్నారు. నోట్ల రద్దు వల్ల నల్లడబ్బుంతా తెల్లడబ్బుగా మారిందంటున్నారు.
విజయవాడ : జీతాలు ఇవ్వడం లేదంటూ విజయవాడ ఎంపి కేశినేని నాని కార్యాలయం ఎదుట కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు ఆందోళణకు దిగారు. ఎంపి నాని తమను మోసం చేశారని గత 8 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ డ్రైవర్లు, క్లీనర్లు, ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గత నెల 15వ తేదీలోపు జీతాలు ఇస్తామని కేశినేని నాని హామీ ఇచ్చారని....కానీ ఇప్పటివరకు ఇవ్వకుండా తమను రోజూ ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే ఎంపి నానిని కలిసేందుకు వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వీరికి సీపీఎం, సీపీఐ నేతలు కూడా మద్దతు తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను అన్నివిధాలా ఆదుకోవాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
రేపు నెహ్రూ అంత్యక్రియలు
మరో పదేళ్లు సీఎం గా కేసీఆర్ ఉండాల్సిందే:మంత్రి కేటీఆర్
పశ్చిమ గోదావరి : ప్రతిపక్షాలు ఎన్ని అవరోధాలు సృష్టించినా పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి తీరతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ప్రాజెక్టు నిర్మాణంపై ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబునాయుడు..... అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనుల వేగాన్ని పెంచేందుకు వీలుగా యంత్రపరికరాలు, మానవ వనరులను సమకూర్చుకోవాలని ఆదేశించారు. భూసేకరణను వేగవంతం చేయాలని చంద్రబాబు కోరారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగానే ఎక్కువ సమయం దీనికి కేటాయిస్తున్నామని చెబుతున్నారు.
--
వనపర్తి : జిల్లాలోని ఖిల్లా ఘనపూర్ దారుణం జరిగింది. నవవధువు పారిజాతంను భర్త అంజనేయులు దారుణంగా హత్య చేశాడు. తలపై తీవ్ర గాయాలతో అక్కడికక్కడే పారిజాతం మరణించింది. ఈ నెల 12న పారిజాతం, అంజనేయులుకు వివాహం జరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు భార్యను ఇంట్లోకి తీసుకెళ్లి రోకలిబండతో దాడి చేసినట్టు బంధువులు తెలిపారు. పరారీలో ఉన్న అంజనేయులును కోసం పోలీసులు గాలిస్తున్నారు. కావాలనే తమ బిడ్డను చంపాడని వధువు తల్లిదండ్రులు తెలిపారు.
జీహెచ్ ఎంసీలో నాళాల పూడికతీతలో అవినీతి.. విచారణ
నవ వధువును దారుణంగా హత్య చేసిన భర్త
దేవినేని కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా లోకేష్
నిజామాబాద్ : ఇరవై ఏళ్లు వస్తే కాళ్లు వంకర్లు పోతాయి. పరుగెత్తాల్సిన వయసులో అడుగు తీసి అడుగు వేసేందుకు అపసోపాలు పడతారు. ఇదేమీ వింత జబ్బుకాదు. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారుతోంది. నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామం ఫ్లోరైడ్ బారినపడి నరకయాతన అనుభవిస్తున్న దుస్థితిపై ప్రత్యేక కథనం.
ఫ్లోరైడ్ అనగానే గుర్తొచ్చేది.......
ఫ్లోరైడ్ సమస్య అనగానే తెలంగాణ రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది నల్గొండ జిల్లా... కానీ ఇపుడు ఈ వ్యాధి నిజామాబాద్ జిల్లా ప్రజలను కూడా వణికిస్తోంది. బోదన్కు 10 కిలోమిటర్ల దూరంలో ఉన్న ఫతేపూర్ గ్రామం ఫ్లోరైడ్ భారిన పడి కుంగిపోతోంది. ఫ్లోరైడ్ నీళ్లు తాగి చిన్నారుల నుంచి పెద్దవారి వరకు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. గ్రామంలో కొందరు యువకులు ఫ్లోరైడ్ కారణంగా కాళ్లు వంకరలు తిరిగి నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అత్యంత దయనీయమైన స్థితిలో బతుకులిడుస్తున్నారు. వైద్యులకు చూసిప్తే ఫ్లోరైడ్ సమస్య అని చెబుతున్నారు.
40 ఏళ్ల నుంచి ఫ్లోరైడ్ సమస్యతో..........
ఫత్తేపూర్ గ్రామ ప్రజలు గత 40 ఏళ్ల నుంచి ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఈ గ్రామంలో 2 వేల 500 మంది జనాభా ఉంటారు. వీరందరికి ఒకే ఒక్క బోరు ఉంది. కరెంట్ రాగానే ఈ బోరు ద్వారా నీటిని పంపింగ్చేసి గ్రామంలోని వాటర్ ట్యాంకులను నింపుతారు. ఆ తరువాత ఆ నీటినే గ్రామంలోని అన్నీ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. దీంతో వేరే గత్యంతరం లేక ఇక్కడి ప్రజలు ఆ నీటినే తాగటానికి, వాడుకోవడానికి వినియోగించాల్సి వస్తోంది. ఏళ్లుగా పరిష్కారం చూపుతామన్న నేతల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి.
పక్కనే నీటిని శుద్ధిచేసే భారీ ప్రాజెక్టు........
ఫత్తేపూర్ గ్రామం పక్కనే చిన్నమావందిలో ఫ్లోరైడ్ నీటిని శుద్ధిచేసే భారీ ప్రాజెక్టు ఉంది. ఇక్కడ నుండి దాదాపు 17 గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీటిని అందిస్తున్నా.. ఫత్తేపూర్‌కు మాత్రం ఆ నీటిని సరఫరా చేయకపోవడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యం ఫత్తేపూర్ వాసుల పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫత్తేపూర్ గ్రామంలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపించాలని బాధితులు కోరుతున్నారు.
తాంసీ ఎత్తిపోతలకు ప్రభుత్వం నిధులు మంజూరు
ఖమ్మం : గులాబీ కూలీదినాల్లో భాగంగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ బార్బర్ అవతారమెత్తారు. ఖమ్మంలోని ఓ హెయిర్‌స్టయిల్ షాపులో ఆయన గడ్డం గీశారు. ఆ తర్వాత చికెన్ షాపులో చికెన్ కొట్టారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి చాయ్‌లు అమ్మారు. మూడు పనుల ద్వారా 10వేల 500 రూపాయలు సంపాదించారు. ఈ డబ్బును టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఖర్చు చేస్తామని పువ్వాడ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలి: సీఎం యోగి
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
అమ్మఒడి కార్యక్రమంపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష
అగ్నిప్రమాద బాధితులు ధర్నా
కార్తీ చిదంబరానికి ఈడీ నోటీసులు
లక్నో : ట్రిపుల్ తలాక్‌పై స్పందించకుండా మౌనం వహించేవాళ్లు కూడా నేరస్థుల కిందే వస్తారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశమంతా ఒకటే అయినప్పుడు వివాహానికి సంబంధించి ఒకే చట్టం ఎందుకు అమల చేయకూడదని ఆయన ప్రశ్నించారు. మహాభారతంలో ద్రౌపతి వస్త్రాపహరణం జరిగినపుడు సభలో అందరూ మౌనంగా ఉండడాన్ని ఉదహరిస్తూ ట్రిపుల్ తలాక్ విషయంలో మౌనంగా ఉండడం నేరం కిందకే వస్తుందని యోగి పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ 91వ జయంతి సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలీసుల నుంచి ప్రాణహాని ఉంద హెచ్ ఆర్సీకి ఫిర్యాదు
పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. గేట్ల తయారీ యూనిట్, స్పిల్‌వే రెగ్యులేటర్‌ను పరిశీలించారు. డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులనూ చంద్రబాబు పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
అంబే వాలీపై చర్యలకు సుప్రీం కోర్టు ఆదేశం...
ఢిల్లీ : సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. హైకోర్టు తీర్పులోని పేరా నంబర్ 15,16లను సమర్ధించింది. సింగేణిలో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. అర్హత ఉండి, మెడికల్‌గా అన్‌ఫిట్ అయితేనే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంతోపాటు ఆ సంస్థ గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుతో సింగరేణి కార్మికులు ఆందోళనలో ఉన్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇంకా స్పందించలేదు.
గుణదలకు చేరుకున్న దేవినేని భౌతికకాయం
కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు ఆందోళన
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కుదరవు:సుప్రీం
ఎన్టీఆర్ భవన్ లో టీ.టిడిపి ముఖ్య నేతల భేటీ
నలుగురు చిన్నారుల సజీవదహనం
తాలిపేరు, గుండ్లవాడు ప్రాజెక్టుల పనులను పరిశీలించిన మంత్రులు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అన్నారు. ధర్నాచౌక్‌ను ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ధర్నాచౌక్‌పై సానుకూల నిర్ణయం వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ గుండెపోటుతో చనిపోయారు. విద్యార్ధి దశలోనే రాజకీయాలపట్ల ఆకర్షితులైన నెహ్రూ.. పాలిటిక్స్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీలో కీలక నేతగా మారి... ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. బెజవాడ రాజకీయాల్లో తన ముద్ర వేశారు. దేవినేని నెహ్రూ రాజకీయ ప్రస్థానంపై 10టీవీ కథనం..
1954 జూన్ 22న నెహ్రూ జననం
దేవినేని నెహ్రూ 1954 జూన్ 22న కృష్ణా జిల్లాలో జన్మించారు. దేవినేని నెహ్రూ అసలుపేరు దేవినేని రాజశేఖర్. నెహ్రూ విద్యార్ది దశలో ఉండగానే రాజకీయాలపట్ల ఆకర్షితులయ్యారు. ఎన్టీఆర్ పిలుపుతో నెహ్రూ రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1983లోకృష్ణా జిల్లాలోని కంకిపాడు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఘన విజయం సాధించారు. భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 1985,1989,1994లో వరుసగా గెలిచారు. కంకిపాడు నియోజకవర్గంలో వరుసగా నాలుసార్లు గెలిచి తిరుగులేని నేతగా ఎదిగారు. 1996 నుంచి 94 మధ్యలో ఎన్టీఆర్ కేబినెట్లో నెహ్రూ మంత్రిగా కూడా పనిచేశారు. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చినప్పుడు ఆయన ఎన్టీఆర్‌కు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాలతో దేవినేని నెహ్రూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కొద్దికాలం తర్వాత కాంగ్రెస్ తీర్దం పుచుకున్నారు. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009,2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నెహ్రూ ఓటమిపాలయ్యారు.
టీడీపీలో చేరిక.......
రాష్ట్రవిభజన, ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని భావించిన నెహ్రూ.. మళ్లీ టీడీపీకి దగ్గరవుతూ వచ్చారు. కొద్ది నెలల క్రిందటే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో కీలక బాధ్యతల్లోకి వస్తున్న సమయంలోనే ఆయన హఠాన్మరణం చెందారు.
బెజవాడ రాజకీయాల్లో దేవినేని ప్రత్యేకస్థానం
బెజవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బెజవాడ పాలిటిక్స్‌లో ఆయన కీలక వ్యక్తిగా ఎదిగారు. దేవినేని నెహ్రూకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. నెహ్రూ కుమారుడు అవినాష్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నెహ్రూ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రికత్త
చెన్నై : అన్నాడీంఎకే ప్రధాన కార్యదర్శి దినకరన్ కు ఉచ్చు బిగుస్తోంది. ఈసీకి లంచం ఇవ్వజూపిన విషయంలో ఆయన అడ్డంగా దొరకడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 126 కింద ఆయనపై నాన్ బెలబుల్ కేసు నమోదు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించిన చంద్రశేఖర్ చెప్పిన వివరాలతో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు రేపు దినకరన్ ను ఢిల్లీ పిలిపించి విచారణ చేయనున్నారు. ఒకవేళ దినకరన్ దోషిగా నిరూపణ అయితే శిక్ష పడడమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హడు అవుతాడు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ వర్గం తరపున పోటీ చేస్తోన్న ఆమె మేనల్లుడు దినకరన్ ఏఐఏడీఎంకే పార్టీ అధికారిక గుర్తు అయిన రెండాకుల గుర్తు కోసం అధికారులకు లంచం ఇచ్చినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు.
నేడు మార్కెట్ లో పలు రకాల ఇయర్ రింగ్స్ కనువిందు చేస్తున్నాయి. వేసుకున్న డ్రస్ కు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ అమ్మాయిలను మురిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల ఇయర్ రింగ్స్ ను సొగసులో పరిచయం చేసాం. అదేమిటానుకుంటున్నారా? మరి ఆలస్యం ఎందుకు చూసేద్దామా? పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అవినీతి అధికారి బయటపడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. విద్యా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతోపాటు చెన్నై, విజయవాడ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌సహా ఎనిమింది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. జగదీశ్వర్‌రెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 16 కోట్లకుపైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో మొత్తంగా 12 బృందాలు పాల్గొన్నాయి.
మహిళలు అభివృద్ది పథంలో నడవాలనేది ఆమె ఆశయం. వారు ఆర్థికంగా స్వంతకాళ్ళపై నిలబడాలనేది ఆమె లక్ష్యం. అందుకోసం ఆమె నిరంతరం తపన పడుతుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా పోరాడి వారికి అండగా నిలబడుతుంది. గత రెండు దశాబ్ధాల నుండి నిరంతరం ఇదే ఆశయంతో కొనసాగుతున్న ఓ అతివ కథనంతో మీ ముందుకు వచ్చింది ఈనాటి స్ఫూర్తి.
అందరికీ స్ఫూర్తిదాయకం
ప్రతీ మహిళ తమ కుటుంబం కోసం ఏదో చేయాలని తపన పడుతుంది. అది ఇంటి బాధ్యత తెలిసిన వ్యక్తిగా ఆమె ఆరాటం. కానీ అందుకు తగిన వనరులు గానీ, అవకాశాలుగానీ అందుబాటులో వుండకపోవచ్చు. అటువంటివారికి అండగా నిలబడుతోంది ఓ ఆదర్శ మహిళ. ఆమే లక్ష్మీ వాసన్. ప్రతీ మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా నడవాలని ఆమె తపన. అలా అనుకోవటమే కాదు..గ్రామీణ మహిళల శ్రేయస్సు కోసం గత రెండు దశాబ్దాల నుండి పాటుపడుతోంది. ముదిమి వయస్సులో కూడా గ్రామీణ మహిళ కోసం అహర్నిశలు శ్రమిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు చంటి ప్రసన్న కేంద్ర స్థాపకురాలు లక్ష్మీవాసన్.
అరుదైన వ్యక్తి లక్ష్మీ వాసన్
ప్రస్తుత పరిస్థితుల్లో తమ కుటుంబాలను తీర్చిదిద్దుకోవటమే గగనమైపోతోంది. ఇటువంటి తరుణంలో ప్రతీ మహిళా ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్మీ వాసన్ వంటి అరుదైన వ్యక్తి నేటి సమాజానికి ఎంతో అవసరం. ఎనిమిది పదుల వయస్సు దగ్గర పడుతున్న తరుణంలో కూడా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పాటుపడుతున్న లక్ష్మీ వాసన్ కు మానవి అభినందనలు తెలుపుతోంది. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని..ఎటువంటి లాభాపేక్ష లేకుండా మహిళా సాధికార కోసం ఆరాటపడుతున్న లక్ష్మీ వాసన్ లక్ష్యం నెరవేరాలని మానవి ఆకాంక్షిస్తోంది.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్ సిండికేట్ మాయాజాలం..సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. సిమెంట్ ధరలు అమాంతం పెంచేయడంతో ఇళ్ల నిర్మాణం కష్టతరంగా మారింది. ఏటా ఇలా కృత్రిమ కొరత సృష్టించి అనూహ్యంగా ధరలను పెంచేస్తున్నారన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏడాదికి 15 లక్షల టన్నులు అవసరం.....
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏడాదికి సగటున15 లక్షల టన్నుల సిమెంట్ అవసరమవుతోంది. రాజధానిగా మారిన తర్వాత నిర్మాణరంగం ఊహించని విధంగా ఊపందుకుంది. ఈ క్రమంలో సిమెంట్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతున్నా ఆ మేరకు సిమెంట్ కంపెనీలు ఉత్పత్తి పెంచడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అయితే తాము సిండికేట్ కావడంలేదని, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే ధరలు పెంచాల్సి వస్తోందని సిమెంట్ కంపెనీలు చెబుతున్నాయి.
ఒకేసారి ధరల రెట్టింపు.....
కంపెనీల వాదన ఇలా ఉంటే నిర్వహణ వ్యయం, రా మెటీరియల్ ధరలు పెరగకపోయినా సిమెంట్ కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి ధరలు అమాంతంగా పెంచేస్తున్నాయని భవన నిర్మాణదారులు, బిల్డర్లు, డెవలపర్లు విమర్శిస్తున్నారు. మార్చి నెలలో కంటే ఈ నెలలో ధరలు రెట్టింపు అయ్యాయని చెబుతున్నారు. రూ.215 ధరకు విక్రయించే సిమెంట్ ధరను రూ.350కుపైగా పెంచారు. రూ.250 ధరకు విక్రయించే సిమెంట్ బస్తాను రూ.385 పైచిలుకు పెంచారు.
భవన నిర్మాణ కార్మికులపై ప్రభావం...
ఒక్కసారిగా ధరలు పెరగటం వల్ల ఆ ప్రభావం భవన నిర్మాణదారులపై పడుతోంది. దీంతో బిల్డర్ల సంఘాలన్నీ పోరాటాలకు సన్నద్ధమవుతుడడంతో రోజువారీ కార్మికులకు ఉపాధి దొరక్క రోడ్డున పడే పరిస్థితి ఏర్పడనుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకోవాలని పలువురు కార్మికులు కోరుతున్నారు.
విజయవాడ : 'మీ పాలన భేష్.. బీసీలు, ఎస్టీలు, ముస్లింమైనార్టీల రిజర్వేషన్ల కోటా పెంచడానికి ప్రయత్నిస్తున్న మీకు అభినందనలు' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అభినందన లేఖ రాశారు. తమ ముఖ్యమంత్రిలా చేయొద్దన్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరినందుకే చంద్రబాబు తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ముద్రగడ తన లేఖలో వాపోయారు. పదవులు, ఆస్తులు శాశ్వతం కాదని.. పేరు, ప్రతిష్టలే ముఖ్యమని భావిస్తున్న తమకు అభినందనలు తెలుపుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న మొదటి ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
మైదుకూరు బయోగ్యాస్ ప్లాంట్ లో ప్రమాదం
విజయవాడ : కిడ్ని సమస్యతో బాధపడుతు తుది శ్వాస విడిచిన దేవినేని నెహ్రూ తన జీవితంలోని తీపి జ్ఞాపకాలను ఫొటోల రూపంలో భద్రపరుచుకున్నారు. వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోలతో ఓ గ్యాలరీని ఏర్పాటు చేశారు. నెహ్రూ రాజకీయ ప్రస్థానంలో చెరగని ముద్రలుగా నిలిచాయి. ఎన్టీఆర్ పిలుపుమేరకు టీడీపీతో తన ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీలో చేరినప్పుడు ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటో ఎంతో పదిలంగా ఉంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఫొటో, రకరకాల ఫొటోలను ఆయన భద్రపరుచుకున్నారు.
పాలెంవాగు ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రులు హరీష్, తుమ్మల
విజయవాడ : భానుడి ప్రతాపానికి విజయవాడ నగర వాసులు విలవిల్లాడుతున్నారు. మండుతున్న ఎండలకు ఇళ్ళ నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ఉదయం నుంచే నగరంలోని ప్రధాన కూడళ్ళన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. అటు ఇంద్రకీలాద్రిపై భక్తుల ఇక్కట్లు పెరిగిపోయాయి. ఆలయ అధికారులు భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండతో ఇబ్బంది పడుతున్నారు. దర్శనానికి కార్డు సిస్టం, ఒకే కౌంటర్ ఉండటంతో చిన్నపిల్లలు, మహిళలు ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. వ్యాపారులు కూడా సాయంత్రం సమయంలోనే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో భేటీ అయ్యింది. అంతర్జాతీయ అంశాలతోపాటు దేశంలోని రాజకీయ పరిణామాలపై పొలిట్‌బ్యూరో చర్చిస్తోంది. ప్రధానంగా జీఎస్టీ బిల్లు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి ఎన్నిక, ఈవీఎంల టాంపరింగ్, పార్టీ స్థానిక మహాసభల నిర్వహణపై చర్చ జరుగుతోంది. వీటితోపాటు కశ్మీర్ పరిస్థితులు, గో సంరక్షణ దాడులు, రైతుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై పొలిట్‌బ్యూరో చర్చిస్తోంది. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తమిళనాడు రైతులు చేస్తున్న నిరసనపై చర్చ జరగనుంది. ఈ పొలిట్‌బ్యూరోలో చర్చించి నిర్ణయించిన అంశాలపై రేపు, ఎల్లుండి జరిగే కేంద్రకమిటీలో చర్చించనున్నారు.
హైదరాబాద్ : ధర్నాచౌక్‌ను ఎత్తివేయడంపై కాంగ్రెస్ పోరుబాటపట్టింది. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఆందోళన చేపట్టడానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వీ.హనుమంతరావు, దానం నాగేందర్ సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరిండంలో టీఆర్ ఎస్ సర్కార్ విఫలం అవుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ధర్మ గంట లాంటి ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
గుడిసె దగ్ధం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం
ఆదిలాబాద్ : జిల్లాపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వారం రోజులుగా జిల్లాలో 45 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు జనాన్ని భయపెడుతున్నాయి. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు మధ్యాహ్ననానికి అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా పడుతున్నారు.
మరో వివాదంలో దినకరన్
చెన్నై : తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు కొసాగుతున్నాయి. అర్కేనగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నుంచి తమిళ రాజకీయాలు వెడేక్కుకుతున్నాయి. జయలలిత మరణాంతరం అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోయింది. అందులో ఒకటి శశికల వర్గం, రెండు సెల్వం వర్గాలుగా ఉన్నాయి. శశికల వర్గం అధికారాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి శశికల వర్గానికి షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా శశికల మేనల్లుడు దినకరన్ ఈసీకి లంచం ఇవ్వజూపిన విషయంలో అడ్డంగా దొరికిపోయాడు. అర్కేనగర్ ఉపఎన్నికల్లో తనకు రెండు ఆకుల గుర్తు కేటాయించాలని దినకరన్... చంద్రశేఖర్ అనే మధ్యవర్తికి రూ.1.39 కోట్లు ఇచ్చాడు. మధ్యవర్తి చంద్రశేఖర్ ఢిల్లీలో క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్ చెప్పిన వివరాల ఆధారంగా దినకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా : జిల్లాలోని జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ -హైదరాబాద్ హైవేపై ఆవులు తరలిస్తున్న ఓ డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న ఆవులకు గాయాలు అయ్యాయి. కొన్ని ఆవులకు కాళ్లు విరిగాయి. తుని నుంచి హైదరాబాద్ కబేలాకు ఆవులు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నెల్లూరు : నగరంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులనే టార్గెట్ చేశారు. మంగళూరు పోలీస్‌కమిషనర్ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు. నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఉన్న కమిషనర్ నివాసంలో ఈ దొంగతనం జరిగింది. దొంగల కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఏకంగా పోలీస్ బాస్ ఇంటేకే కన్నం వేయడంతో.. నెల్లూరులో కలకలకంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకట్, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి రాకేష్, టీకాంగ్రెస్ నేత మహేష్ గౌడ్, బీజేపీ నేత రఘునందన్ పాల్గొని, మాట్లాడారు. బీసీ, ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ తరలింపు అంశంపై చర్చించారు. ధర్నా చౌక్ తరలింపు సరికాదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు గుండెపోటు రావడంతో నెహ్రూ మృతి చెందారు. నెహ్రూ మృతదేహాన్ని విజయవాడకు తరలించారు. మృతదేహం ఒంటి గంటకు విజయవాడకు చేరుకోనుంది. భౌతికాయాన్ని పొట్లూరు వరప్రసాద్, తుమ్మల నాగేశ్వర్ రావు, హరికృష్ణ సందర్శించారు. గత వారం రోజులుగా కిడ్నీ సంబంధ వ్యాధితో దేవినేని నెహ్రూ బాధపడుతున్నారు. అనారోగ్యంతో వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నెహ్రూకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కేర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో దేవినేని నెహ్రూ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. దేవినేని నెహ్రూ 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు నియోజకవర్గం నుంచి 5సార్లు , విజయవాడ తూర్పు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1994 నుంచి 96 మధ్య ఎన్టీఆర్ హయాంలో ఆయన సాంకేతికశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. దేవినేని నెహ్రూ అసలు పేరు దేవినేని రాజశేఖర్. 1954 జూన్ 22న కృష్ణా జిల్లాలో దేవినేని జన్మించారు. విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచే రాజకీయాలపట్ల ఆకర్షితులయ్యారు. 1983లో టీడీపీ తరపున రాజకీయ ఆరంగేట్రం చేశారు. నెహ్రూకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు అవినాష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. దేవినేని నెహ్రూ హఠాన్మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవినేని నెహ్రూ మృతి టీడీపీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ హఠాన్మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవినేని నెహ్రూ మృతి టీడీపీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు. గత వారం రోజులుగా కిడ్నీ సంబంధ వ్యాధితో దేవినేని నెహ్రూ బాధపడుతున్నారు. అనారోగ్యంతో వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నెహ్రూకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కేర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో దేవినేని నెహ్రూ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. దేవినేని నెహ్రూ 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు నియోజకవర్గం నుంచి 5సార్లు , విజయవాడ తూర్పు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1994 నుంచి 96 మధ్య ఎన్టీఆర్ హయాంలో ఆయన సాంకేతికశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. దేవినేని నెహ్రూ అసలు పేరు దేవినేని రాజశేఖర్. 1954 జూన్ 22న కృష్ణా జిల్లాలో దేవినేని జన్మించారు. విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచే రాజకీయాలపట్ల ఆకర్షితులయ్యారు. 1983లో టీడీపీ తరపున రాజకీయ ఆరంగేట్రం చేశారు. నెహ్రూకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు అవినాష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు.
కూకట్ పల్లి ఎస్ మార్ట్ వద్ద చోరీ
దేవినేని నెహ్రూ మృతదేహం విజయవాడకు తరలింపు
మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి బొంతల చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'మిర్చి రైతులు తీవ్ర కష్టాల్లో వున్నారు. పండించిన పంటకు సరియైన ధర లభించక నష్టాల పాలవుతున్నారు. ధరలు పడిపోయిన నేపథ్యంలో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో బోనస్ ధరలిచ్చి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదు. ఇప్పుడు మిర్చి రైతులు లబోదిబోమంటుంటే, వచ్చే ఏడాది నుంచి ఒక్కొక్క రైతుకి ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లలో వేస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఊరిస్తున్నారు. ఈ నిర్ణయం స్వాగతించదగ్గదే అయినా, ప్రస్తుతం ఇబ్బందుల్లో వున్న రైతులను ఆదుకునే ప్రయత్నాలు చేయకపోవడం, మార్కెట్ శక్తులను నియంత్రించకపోవడం సమర్ధనీయం కాదు. మిర్చి ధరలు దారుణంగా పడిపోవడం, కోల్డ్ స్టోరీజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. ధరల పతనం, మార్కెట్ల మాయాజాలం నుంచి తమను కాపాడాలంటూ రైతులు కోరుతున్నారు. మిర్చి పండించి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలొస్తున్నాయి. అసలు మార్కెట్ లో మిర్చి ధరలు ఇంతగా పడిపోవడానికి కారణం ఏమిటి? ధరల పతనం నుంచి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలేమిటి? ఇదే అంశంపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
హైదరాబాద్ : డబ్బున్న యువకులే ఆమె టార్గెట్. చాటింగ్‌లతో మతి పోగోడుతుంది. ఆకట్టుకునే క్యాప్షన్లతో పరిచయం పెంచుకుంటుంది. వాట్సాప్ అంటూ గంటల పాటు తనతో మాట్లాడేలా చేస్తుంది. మరో అమ్మాయి పోటో చూపించి మాయ చేస్తుంది. ప్యార్ అంటూ ఫేస్బుక్లో అడ్డంగా బుక్ చేస్తుంది. తన మాయలో పడ్డవారిని బురిడీ కొట్టిస్తుంది.
లేడీ కిలాడీ లీలలు
ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి కనకమహాలక్ష్మి. పేరు గౌరవ ప్రదంగా ఉన్నా... బుద్ధి మాత్రం వక్రం. పక్కా 420. చూడ్డానికి సాదాసీదాగా కనిపించినా... కుర్రాళ్ల హార్ట్ కొళ్లగొట్టడంలోనే కాదు.. వారికి కుచ్చుటోపీ పెట్టడంలోనూ మహాముదురు. ఈ లేడీకిలాడీ లీలలు వింటే ఎవ్వరైనా కంగుతినాల్సిందే. ఇష్క్ అంటూ కవ్విస్తుంది.. రిస్క్ తీసుకున్నవారికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. ఫేస్బుక్లో అబ్బాయిలను బుక్ చేయడంలో దేశముదురు.
విప్రో ఉద్యోగికి గాలం
హైదరాబాద్ విప్రోలో ఉద్యోగం చేస్తున్న ఈపురుపాలెం గ్రామానికి చెందిన సురేష్‌ను ఆకట్టుకునే చాటింగ్‌తో ముగ్గులోకి దింపింది. అందంగా ఉండే ఓ యువతి ఫోటో ప్రొఫైల్‌తో చల్లా మౌనిక పేరుతో సురేష్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. చాటింగ్‌తో మొదలైన వ్యవహారాన్ని.. ఫోన్లో గంటలపాటు మాట్లాడే స్థాయికి తీసుకెళ్లి ప్రేమమత్తులో ముంచింది. విషయం పెళ్లి దాకా రావడంతో.. తన తండ్రి ఒంగోలు సీసీఎస్ డీఎస్పీ అని..తన ఇద్దరు బ్రదర్స్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని కోతలు కోసింది.
నిద్రమాత్రలు మింగానని వాట్సాప్ వీడియో
ఆ తర్వాత మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని.. అందుకే నిద్రమాత్రలు మింగానంటూ వాట్సాప్‌లో వీడియో పోస్టు చేసి షాకిచ్చింది. ఇది నిజమేనని నమ్మిన సురేష్..మౌనిక తన తండ్రిగా చెప్పిన ఒంగోలు సీసీఎస్ డీఎస్పీకి మేసేజ్ పంపడంతో..ఆమె బండారం బయటపడింది. దీంతో ఆరా తీయగా ఆమె.. ప్రకాశం జిల్లా చీరాల రామనగర్‌కు చెందిన కనకమహాలక్ష్మి అని తెలిసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఓ హోటల్‌కు రమ్మని మళ్లీ సురేష్‌ను ట్రాప్ చేసింది. ఆ తర్వాత డబ్బులు కావాలంటూ బ్లాక్ మెయిల్ చేసింది. విషయం బయటకు పొక్కడంతో తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టిందని బాధితుడు వాపోతున్నాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాడు.
ప్రేమ పేరుతో మోసం
ఇక లేడీ కిలాడీకి యువకులను మోసగించడం కొత్తేమి కాదని తెలుస్తోంది. వైజాగ్‌కు చెందిన ఓ వ్యాపారిని లోబరుచుకుని అతడి నుంచి 20 సవర్ల బంగారం నొక్కేసినట్లు సమాచారం. అటు తిరుపతిలో ఈ మాయలేడిపై 2005లో మూడు కేసులున్నాయి. నార్కట్‌పల్లిలో ఓ చోరీ కేసులో నిందితురాలు. అయితే అటు కనకమహాలక్ష్మి.. ఇటు సురేష్ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన పోలీసులు.. నిజా నిజాల నిగ్గు ఏంటో తేల్చే పనిలో పడ్డారు.
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో 57 శాతం... సెకండియర్ లో 66.4 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లోనూ ఎప్పట్లాగానే బాలికలే పైచేయి సాధించారు.
2,75,273 మంది ఉత్తీర్ణత
తెలంగాణలో ఇంటర్ ఫలితాలను మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంత్రి ఈఫలితాల్ని ప్రకటించారు.. ఫస్టియర్ పరీక్షలకు హాజరైన 4లక్షల 75వేల 874 మంది విద్యార్థుల్లో 2లక్షల 70వేల 738 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ పరీక్షలను 4లక్షల 14 వేల 213 మంది విద్యార్థులు రాయగా... 2లక్షల75వేల 273 మంది పాస్ అయ్యారు.. మొదటి సంవత్సరం ఫలితాల్లో 57 శాతం.... రెండో సంవత్సర ఫలితాల్లో 66.45 ఉత్తీర్ణత నమోదైంది.. గత ఏడాదికంటే ఈసారి ఉత్తీర్ణతశాతం పెరిగిందని కడియం తెలిపారు.
63శాతం మంది బాలికలు పాస్
ఈసారి రిజల్ట్స్‌లో బాలికలే పైచేయి సాధించారు.. ఫస్టియర్ లో 63శాతం మంది... సెకండియర్‌లో 71 శాతం విద్యార్థినిలు ఉత్తీర్ణులయ్యారు. ఈసారి ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాల్లో మేడ్చల్ మొదటి స్థానం... రంగారెడ్డి రెండో స్థానం సాధించాయి. మొదటి సంవత్సరం రిజల్ట్స్‌లో మహబూబాబాద్... సెకండియర్ ఫలితాల్లో నిర్మల్, గద్వాల్, మహబూబాబాద్ చివరిస్థానంలో నిలిచాయి.
మే 15 నుంచి సప్లమెంటరీ పరీక్షలు : కడియం
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 15 నుంచి నిర్వహిస్తామని కడియం తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లను త్వరలో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు.
దేవినేని నెహ్రూ మృతి పట్ల పలువురు సంతాపం
హైదరాబాద్ : స్వల్ప వివాదం చినికిచినికి గాలివానలా మారింది. హైదరాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాల్మీకినగర్, సూర్యనగర్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాల్మీకినగర్ బస్తీలో రోడ్డుపై పెళ్లి విందు ఏర్పాటు చేయడంతో.. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. వారించడంతో ఆగ్రహించిన యువకులు తమ బ్యాచ్‌తో వచ్చి వాల్మీకినగర్‌లో హంగామా చేశారు. రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. వంట పాత్రలు పడేసి కుర్చీలు విరగొట్టారు. 2 కార్లు, 5 ఆటోలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. అల్లరిమూకల్లో కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజ్ ని సేకరించారు. సెంట్రల్ జోన్ డీసీపీ డేవిడ్ జోయల్ హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
హైదరాబాద్ : ముస్లింలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. అసెంబ్లీతో పాటు మండలిలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ పలు విషయాల్లో సర్కారు తీరును ఎండగట్టారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపుదల బిల్లును స్వాగతిస్తూనే... బిల్లుకు కేంద్రం నుంచి ఆమోదం పొందే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం చేశారు.
చర్చను అదరగొట్టిన కాంగ్రెస్
ముస్లింలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చపై కాంగ్రెస్ అదరగొట్టింది. పలు సందర్భాల్లో ఈ అంశంపై సర్కారును నిలదీస్తూ టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడేవిధంగా చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. బిల్లును సమర్ధిస్తూనే.. దీనిని తీసుకురావడంలో జరిగిన జాప్యాన్ని ఎత్తిచూపారు. ఎన్నికల హామీని అమలు చేసేందుకు మూడేళ్లు ఎందుకు పట్టిందని నిలదీయడంతో సరైన సమాధానం చెప్పుకోలేక అధికారపక్షం అధికారపక్షం ఉక్కిరిబిక్కిరైంది. ఈ బిల్లు విషయంలో న్యాయపరంగా ఎదురయ్యే ఇబ్బందులను జీవన్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు.
బీసీలు, ఎస్సీలకు పెంచకపోడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్
బీసీల్లో ముస్లింలు ఒక్కరికే రిజర్వేషన్లు పెంచడం, బీసీలు, ఎస్సీలకు పెంచకపోడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు తీసుకురావడంతోనే పరిమితం కాకుండా... కేంద్రంపై ఒత్తిడితెచ్చి బిల్లకు ఆమోదం పొందే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ సర్కారుపై ఉన్న విషయాన్ని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు.
బీసీలు, ఎస్సీలకూ రిజర్వేషన్లు పెంచాలి : షబ్బీర్ అలీ
మరోవైపు శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ కూడా ముస్లిం రిజర్వేషన్ల పెంపుదల బిల్లుపై సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించారు. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చాల్సిన రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడంలేదని విమర్శించారు. ముస్లింలు, గిరిజనులతోపాటు బీసీలు, ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు పెంచాల్సిందని షబ్బీర్ సూచించారు. మొత్తంమీద రిజర్వేషన్ల పెంపుదల బిల్లుపై అటు అసెంబ్లీతోపాటు, ఇటు మండలిలో కాంగ్రెస్ సభ్యులు కనపరచిన పనితీరు పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొండంత ఆత్మవిశ్వాసం నింపించేందుకు దోహదపడిందని భావిస్తున్నారు.
దేవినేని నెహ్రూ మృతి పట్ల సీఎం చంద్రబాబు, లోకేష్ సంతాపం
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు గుండెపోటు రావడంతో నెహ్రూ మృతి చెందారు. 22 జూన్ 1954 సం.లో నెహ్రూ జన్మించారు. దేవినేని నెహ్రూ అసలు పేరు రాజశేఖర్. దేవినేనికి అక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. 1982 సం.లో నెహ్రూ టీడీపీలో చేరారు. 1983 నుండి 1994 వరకు కంకిపాడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్ టీఆర్ మరణాంతరం చంద్రబాబు విభేదాల కారణంగా టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. 2004సం.లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్ టీఆర్ కు దేవినేని నెహ్రూ సన్నిహితుడు. 1994సం.లో ఎన్ టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఏడాది క్రితం తిరిగి టీడీపీలో చేరారు.