Activities calendar

25 December 2016

జగిత్యాలలో దారుణం...

జగిత్యాల : జిల్లాలోని దూంపేటలో అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. వరకట్నం డబ్బులు ఇవ్వడం లేదని అత్త, మామ, భార్యపై కర్రతో భర్త మల్లేశం దాడికి పాల్పడ్డాడు. మామ భూమయ్య మృతి చెందారు. అత్త గంగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య పరిస్థితి విషమంగా ఉంది. వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

 

22:02 - December 25, 2016

'ఒక్కడొచ్చాడు' మూవీ టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా హీరో హీరోయిన్ విశాల్, తమన్నా మాట్లాడారు. సినిమా విశేషాలను తెలిపారు. చిత్రం అందరికీ నచ్చుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు చిత్రాన్ని చూడాలని కోరారు. వారు తమ సినిమా అనుభవాలను వివరించారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:39 - December 25, 2016

విజయవాడ : ఏపీలో నాట్యానికి పట్టం కట్టారు. కళకు న్యాట్యమణులు జీవం పోశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేల మంది ఒకే సారి కూచిపూడి న్యాట్యాన్ని ప్రదర్శించి గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ముగింపు ఉత్సవాల్లో ఈ అరుదైన రికార్డు నమోదైంది. 
అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం 
విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం మైదానంలో సిలికానాంధ్ర, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు కెక్కింది. 6వేల 117 మంది కళాకారిణులు ప్రదర్శించిన మహా బృందనాట్యం ఆధ్యంతం ఆకట్టుకుంది. నాట్య సమ్మేళనానికి 18 దేశాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు. 
చంద్రబాబుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ధ్రువీకరణ పత్రం 
గిన్నిస్‌బుక్‌ ప్రతినిధి రిషినాథ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కూచిపూడి నృత్యానికి పుట్టినిల్లయిన 'కూచిపూడి' గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని కళాకారులు ముందుకెళ్లాలని బాబు సూచించారు. కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుకెక్కడం గర్వకారణమన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన నాట్యాల్లో కూచిపూడి ఒకటిగా నిలుస్తుందన్నారు. కూచిపూడి నృత్యానికి గతంలో రూ.100కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, నారా లోకేశ్‌, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

పాలేరు రిజర్వాయర్ లో దూకి వివాహిత ఆత్మహత్య

ఖమ్మం : పాలేరు రిజర్వాయర్ లో దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న హైదరాబాద్ ఆత్మహత్య చేసుకున్న భర్త మృత దేహాన్ని కారులో తీసుకొస్తూ మార్గంమధ్యలో భార్య నాగలక్ష్మీ కాల్వలో దూకింది. నాగలక్ష్మీ ఖమ్మం వాసిగా గుర్తించారు.

 

ఏపీలో 361 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

విజయవాడ : ఏపీలో 361 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 259 డిప్యూటీ సర్వేయర్లు, 13 టౌన్ ప్లానింగ్ సర్వేయర్లు, 31 మైనింగ్ టెక్నికల్ ఆసిస్టెంట్లతోపాటు ఇతర టెక్నికల్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. 

20:42 - December 25, 2016

ధృవ టీంతో డైరెక్టర్ హరీష్ శంకర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా హీరో రామ్ చరణ్, సినిమాలో విలన్ గా నటించిన నటుడు అరవిందస్వామి మాట్లాడారు. సినిమా విశేషాలను వివరించారు. తమ అనుభవాలను తెలిపారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూడండి..

20:35 - December 25, 2016

హైదరాబాద్ : అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌లో అలజడి.. వాచ్‌మెన్‌ ఉరుకులు, పరుగులు.. స్థానికుల టెన్షన్‌... పోలీసుల రంగప్రవేశం.. ఇద్దరు మహిళల అరెస్ట్‌.. అపార్ట్‌మెంట్‌ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన ఆ ఇద్దరు ఎవరు? ఆ రాత్రి ఏం జరిగింది? 
సాయి భరద్వాజ్‌ అపార్ట్‌మెంట్ లో ఘటన
హైదరాబాద్‌ కూకట్‌పల్లి రామకృష్ణవీధిలోని సాయి భరద్వాజ్‌ అపార్ట్‌మెంట్.... అర్ధరాత్రి 2గంటలకు అపార్ట్‌మెంట్‌పైనుంచి ఏవో శబ్దాలొస్తున్నాయంటూ వాచ్‌మెన్‌కు ఫోన్‌ వచ్చింది.. వెంటనే ఏం జరుగుతుందో చూసేందుకు వాచ్‌మెన్‌ బిసయ్య పైకి వెళ్లాడు. శబ్దాలు ఎక్కడినుంచి వస్తున్నాయో పరిశీలిస్తూనే వాచ్‌మెన్‌ అపార్ట్‌మెంట్‌ పైకివెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంతలో 302 అపార్ట్‌మెంట్‌లోఉండే ఇద్దరు మహిళలు రూంనుంచి బయటకొచ్చారు. ఈ టైంలో ఇక్కడికి ఎందుకువచ్చావంటూ ప్రశ్నించారు. వాచ్‌మెన్‌ను ఫోన్‌ మాట్లాడొద్దని హెచ్చరించారు. 
వాచ్‌మెన్‌పై ఇద్దరు మహిళలు కత్తితో దాడి
పైనుంచి శబ్దాలు వస్తున్నాయని... చూసేందుకు వెళుతున్నానని చెబుతూ వాచ్‌మెన్‌ మెట్లమీదుగా పైకివెళ్లేందుకు ప్రయత్నించాడు.. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు మహిళలు కత్తితో వాచ్‌మెన్‌పై దాడిచేశారు.. సీసీ కెమెరాపై నీళ్లు పోశారు.. ఆ ఇద్దరి తీరుతో భయపడిపోయిన వాచ్‌మెన్‌ భయంతో కిందకు పరుగులుతీశాడు. వాచ్‌మెన్‌ కిందకు వెళ్లగానే ఇద్దరు నిందితులు అక్కడ రక్తం మరకలు తుడిచేశారు.. ఈలోగా అరుపులువిన్న పై అంతస్తులోనివారు అక్కడికి వచ్చారు.. గాయపడ్డ వాచ్‌మెన్‌ను ఆస్పత్రికి తరలించారు.. 
ఇద్దరు మహిళలు అరెస్ట్‌ 
స్థానికుల ఫిర్యాదుతో అపార్ట్‌మెంట్‌కు వచ్చిన పోలీసులు.. వాచ్‌మెన్‌పై దాడిచేసిన ఇద్దరు మహిళలకు మతిస్తిమితం లేదని చెప్పారు. మొత్తానికి వాచ్‌మెన్‌పై దాడిచేసిన ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

గుజరాత్ లో రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి

గుజరాత్ : జామ్ నగర్ జిల్లా కలవాడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

బేగంబజార్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : బేగంబజార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అజీజ్ ప్లాజాలో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. 

20:19 - December 25, 2016

ఢిల్లీ : ప్రజలకు ఆధార్ నంబర్‌ ద్వారా బ్యాంకు లావాదేవీలు అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. నగదు రహిత సేవల ప్రచారం కోసం దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో డిజి-ధన్‌ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆర్‌బీఐ అవసరమైన మేరకు నగదు విడుదల చేస్తోందని చెప్పారు. మొబైల్ ఫోన్లు, కార్డులు లేనివారు వేలిముద్ర ద్వారా లావాదేవీలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం వెల్లడికి ఆయా దేశాలను సంప్రదించామన్న ఆయన.. నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల సమాచారం కోరామని స్పష్టం చేశారు. 

20:08 - December 25, 2016
20:05 - December 25, 2016

చిత్తూరు : ఏపీలో బలిజ సామాజికవర్గాన్ని అణగదొక్కేస్తున్నారని... టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు ఓవీ రమణ మండిపడ్డారు. కేవలం మూడు జిల్లాలకే పరిమితమైన కాపులను అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. ఆరు జిల్లాల్లో భారీగా ఉన్నా బలిజ సామాజిక వర్గాన్ని పట్టించుకునేవారే కరువయ్యారని విమర్శించారు. ఆరు జిల్లాల్లోని బలిజ సామాజికవర్గ నేతలతో బలిజ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. బలిజ సామాజికవర్గాన్ని బీసీలుగా గుర్తించాలని రమణ డిమాండ్ చేశారు.

 

19:47 - December 25, 2016

శ్రీకాకుళం : జిల్లాలో 'నేను, నాన్న, నా బాయ్‌ఫ్రెండ్స్' మూవీ యూనిట్‌ సందడి చేసింది.. ఎస్ బీఎస్ థియేటర్‌లో ప్రేక్షకులను మూవీ హీరో అశ్విన్‌, నిర్మాత, ఇతర నటులు కలుసుకున్నారు.. మూవీని హిట్‌ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.. ఆ తర్వాత మూవీ బృందం అరసవల్లిలోని సూర్యనారాయణ ఆలయానికి వెళ్లారు.. స్వామివారిని దర్శించుకున్నారు.

 

19:43 - December 25, 2016

శ్రీకాకుళం : సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను విజయవంతం చేశారంటూ ప్రేక్షకులకు నటుడు శకలక శంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు.. శ్రీకాకుళంవచ్చిన శంకర్‌ తనకు ఈ జిల్లాఅంటే చాలా అభిమానమని చెప్పుకొచ్చారు.. చాలామంది సెలబ్రిటీలు విశాఖ సరిహద్దువరకే వచ్చిపోతారని... సిక్కోలుకు ఎందుకు రారని ప్రశ్నించారు.

 

19:40 - December 25, 2016

హైదరాబాద్ : ఏపీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ రోజున ప్రజలంతా సంతోషంగా ఉండాలని సీఎం చంద్రబాబు..క్రిస్మస్ కానుకను అందించారని మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని ఎస్‌.ఐ. చర్చి క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు  మంత్రి తెలిపారు. 
శ్రీకాకుళంలో
శ్రీకాకుళం జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రార్థనలు, బోధనలతో చర్చిలన్నీ మార్మోగాయి. జిల్లా వ్యాప్తంగా చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. 
నెల్లూరులో  
నెల్లూరులో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని చర్చిలన్నింటినీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రేమను, శాంతిని పంచడానికే క్రీస్తు అవతరించాడని....మత బోధకులు సందేశాలనందించారు. 

 

19:36 - December 25, 2016

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తికి చెందిన భూస్వామి కరుణం గోపాలరావు ఆరోవ కుమారుడి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పాతికేళ్ల నుంచి కరుణం రామకృష్ణ అజ్ఞాతంలో ఉన్నారు. కుటుంబ సభ్యులు, మిత్రులకు తెలియకుండా 25 ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఆయన పేరుమీద పుట్టపర్తి నడిబొడ్డులో 40 కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నాయి. ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లాక భూకబ్జాదారులు వాటిని ఆక్రమించుకొని అపార్టుమెంట్లు నిర్మించుకున్నారు. తాజాగా రామకృష్ణ అజ్ఞాతం వీడటంతో కబ్జారాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. 

 

విజయవాడలో అంతర్జాతీయ కూచిపూడి మహా సమ్మేళనం

విజయవాడ : ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 5 వ అంతర్జాతీయ కూచిపూడి మహా సమ్మేళనం జరిగింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, నారా లోకేష్, దేవాన్ష్, గిన్నిస్ బుక్ ప్రతినిధులు హాజరయ్యారు. కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకెక్కింది. 6117 మంది కళాకారిణులతో మహాబృందం నాట్యం చేసింది. 

2013 భూసేకరణ బిల్లు చట్ట విరుద్ధం : కోదండరాం

హైదరాబాద్ : 2013 భూసేకరణ బిల్లు చట్ట విరుద్ధమని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. విద్య పరిరక్షణ కోసం జనవరిలో యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఫిబ్రవరిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రైవేట్ విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు తాము వ్యవతిరేకమన్నారు. 

హత్యకు గురైన వైసీపీ ఎంపీటీసీ రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జగన్

కడప : ఇటీవల హత్యకు గురైన వైసీపీ ఎంపీటీసీ రామిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. పల్లెల్లో చంద్రబాబు ఫ్యాక్షనిజంను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు త్వరలో దేవుడు మొట్టికాయలు వేస్తారని చెప్పారు. రాజకీయం అంటే హత్యలు, ఫ్యాక్షనిజం కాదని... పేదల గుండెల్లో స్థానం సాంపాదించుకోవడమన్నారు. 

 

19:13 - December 25, 2016

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పవన్‌ అభిమానులు ధర్నా చేశారు. టీడీపీ గెలుపులో పవన్‌ పాత్ర లేదనే చింతమనేని వ్యాఖ్యలు తక్షణమే వెనక్కితీసుకోవాలని పవన్‌ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేశారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్‌ కల్యాణ్‌ చేసిన కృషిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. చింతమనేని వెంటనే పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలన్నారు. 

 

19:10 - December 25, 2016

అనంతపురం : ప్రధాని మోడీకి చిత్తశుద్ది ఉంటే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్‌ విసిరారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు మోదీనే అంగీకరించారని ఆయన గుర్తుచేశారు. కార్పొరేట్‌ సెక్టార్లకు మద్దతు పలికేందుకే ప్రధాని మోదీ నోట్లు రద్దు చేశారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలోని కరవు మండలాలను ప్రభుత్వం ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

19:06 - December 25, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వరికుప్పలకు నిప్పు పెట్టారు. రాపాక, నల్లగుంట గ్రామాల్లోని 35 ఎకరాలకు సంబంధించిన వరి కుప్పలను తగులబెట్టారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తే ఈ పని చేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 

రావెల, జానీమూన్ మధ్య సమసిన వివాదం

విజయవాడ : ఎపి మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ మధ్య వివాదం సమసిపోయింది. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు ఆంజనేయులు సమక్షంలో మంత్రి రావెల, జానీమూన్ సమావేశయ్యారు. వివాదాలకు తావులేకుండా భవిష్యత్ లో కలిసి పని చేస్తామని చెప్పారు.

18:38 - December 25, 2016
18:37 - December 25, 2016

పెద్దపల్లి : కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు, తొలి క్రైస్తవ సూక్తులకు దగ్గర పోలికలున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం కోసమే..కీస్తు ప్రాణాలు అర్పించారని చెప్పారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి, సమానత్వం కోసమే సీపీఎం పాదయాత్ర కొనసాగుతోందని ఆయన అన్నారు. 

 

18:25 - December 25, 2016

కరీంనగర్‌ : కేసీఆర్‌ ప్రజలకు హామీలిస్తూ.. ఇచ్చిన మాట మరిచిపోయి చరిత్రలో అబద్దాల సీఎంగా మిగిలిపోతారని, కరీంనగర్‌ జిల్లాను అద్దం తునకలా చేస్తానన్న కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. 70 వ రోజు పాదయాత్ర పెద్దపల్లి జిల్లా నుంచి కరీంనగర్‌ జిల్లాలోకి చేరుకుంది. ప్రజాసమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఉందని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తీవ్రంగా విఫలమయ్యాయని తమ్మినేని ఆరోపించారు. 

18:22 - December 25, 2016

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి అంబరాన్ని అంటుతోంది. క్రైస్తవ దేవాలయాలు విద్యుత్‌ దీపాల కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోకంలో అవతరించిన సంతోషాన్ని ఆనందోత్సాహాల మధ్య క్రైస్తవ సోదరులు పంచుకుంటున్నారు. సికింద్రాబాద్‌లో పలు చర్చిల్లో... క్రిస్మస్ కేక్‌లను కట్ చేసి అందరికీ పంచి పెట్టి హ్యాపీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. 

18:19 - December 25, 2016

మెదక్ : జిల్లాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ఆసియాలోనే రెండవ అతిపెద్ద సుప్రసిద్ధ మెదక్ చర్చ్‌లో తెల్లవారుజామునే ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ప్రభువు దయతో ప్రపంచం శాంతియుతంగా ఉండాలని బిషప్ రెవండ్ సాల్మాన్‌రాజు అన్నారు.  భక్తుల రాకతో చర్చి ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. 

18:14 - December 25, 2016

మేడ్చల్‌ : జిల్లాలోని జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 40వేల రూపాయల విలువైన ఎల్‌ఎస్‌డీ నార్కొటిక్‌ రసాయనాలతో కూడిన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో రామకృష్ణ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. రామకృష్ణకు కిషోర్‌, కరణ్ అనే ఇద్దరు యువకులు సహకరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి..

 

 

మేడ్చల్‌ జిల్లాలో డ్రగ్స్ ముఠాను పట్టుకున్న పోలీసులు

మేడ్చల్‌ : జిల్లాలోని జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు.. వీరినుంచి 40వేల రూపాయల విలువైన నార్కొటిక్‌ రసాయనాలతోకూడిన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. 

18:07 - December 25, 2016

కరీంనగర్ : జిల్లాలోని గోదావరిఖనిలో సింగరేణి సంస్థ జీఎం కార్యాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. గోదావరిఖని సమీపంలోని జనగామ గ్రామ పరిసరాల్లో బొగ్గు తవ్వకాల కోసం ఇటీవల సంస్థ తవ్వకాలు చేపట్టింది. ఈ క్రమంలో గ్రామాన్ని తరలించి ఉపాధి కల్పించాలని వేడుకున్నప్పటికి సంస్థ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఊరుకునేదిలేదని అధికారులతో గొడవకు దిగారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

 

18:02 - December 25, 2016

వరంగల్ : వారంతా ఆయా ప్రాంతాలకు చెందిన వారు..ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్నారు. ఎప్పటిలాగానే సంతోషంగా రెస్టారెంట్‌లో ఫుడ్‌ తిన్నారు. అదే వారి పాలిట విషంగా మారింది. దీంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంతగా విద్యార్థులను ఆందోళనకు గురిచేసిన ఈ సంఘటన వరంగల్‌ జిల్లా నిట్‌ లో చోటు చేసుకుంది. 
నిట్ విద్యార్థులకు అస్వస్థత
ఇలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరంతా వరంగల్‌ జిల్లా నిట్ విద్యార్థులు. రెండు రోజుల క్రితం ఓ రెస్టారెంట్‌లో ఆయా వంటకాలు తిన్నారు. రెస్టారెంట్‌ నుంచి బయటకు రాగానే వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 మంది అబ్బాయిలుండగా..మిగిలిన ఐదుగురు అమ్మాయిలు.
నిట్ చుట్టు పక్కల చాలా రెస్టారెంట్లు 
వరంగల్‌లోని నిట్ చుట్టు పక్కల చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టూడెంట్స్‌ని ఆధారం చేసుకొని నడుస్తున్నవే. అయితే క్వాలిటీ పాటించాలని తాము ఎన్నిసార్లు చెప్పినా రెస్టారెంట్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తాము రెగ్యులర్‌గా ఈ రెస్టారెంట్లలోనే తింటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఎప్పుడూ జరగని విధంగా ఇలా జరగడం విచారకరమని అంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి రెస్టారెంట్లలో క్వాలిటీ మెయింటెయిన్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి రెండు రోజులుగా వైద్య సేవలు జరుగుతున్నప్పటికీ..ఇంకా విద్యార్థులు కోలుకోలేదు. మరో రెండు మూడు రోజుల చికిత్స అవసరమని వైద్యులు చెబుతున్నారు. 

 

17:57 - December 25, 2016

విజయవాడ : మొట్టమొదటి కాంగ్రెస్‌యేతర ప్రధానిగా వాజ్‌పేయి చరిత్ర సృష్టించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా సుపరిపాలన దినోత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పేదలు బాగుండాలని వాజ్‌పేయి నిరంతరం పరితపించేవారన్నారు. డిసెంబర్ 31 తర్వాత సామాన్యుల కష్టాలు తీరుతాయని తెలిపారు. అవినీతిపరులకు కష్టాలు మొదలవుతాయన్నారు. 

 

17:53 - December 25, 2016

హైదరాబాద్ : పాస్‌పోర్టు నిబంధనల సడలింపుతో.. తమ కలలు సాకారం అయ్యే అవకాశం వచ్చిందంటున్నారు అనాథలు. ఇప్పటిదాకా పుట్టినతేదీ ధృవీకరణలో ఇబ్బందులతో... విదేశాలకు వెళ్లి చదవుకోవాలన్న ఆశలు నెరవేరక.. పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా కేంద్రప్రభుత్వం పాస్‌పోర్ట్‌ నిబంధనల సవరణతో వారి కష్టాలు తీరనున్నారు.
అనాథ విద్యార్థుల్లో చిగురించిన ఆశలు 
పాస్‌పోర్ట్‌ నిబంధనలు  సవరించడంతో.. అనాథ విద్యార్థుల్లో విదేశీ ఆశలు చిగురిస్తున్నాయి. ఉన్నత విద్యకోసం తపిస్తున్న తమకు కొత్తరెక్కలు వచ్చాయని సంతోషపడుతున్నారు. అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చే సంస్థలు, చదువుకునే అవకాశాలు ఉన్నా.. పుట్టిన తేదీ ధృవీకరణలో ఇంతకాలం నానా ఇబ్బందులు ఎదురయ్యాయి. విదేశాల్లో చదువుకోవాలన్న వారి ఆశలకు పాస్‌పోర్ట్‌ నిబంధనలు ప్రతిబంధకాలుగా ఉండేవి. 1989 జనవరి 26తర్వాత పుట్టిన వారంతా తప్పని సరిగా పుట్టినరోజు సర్టిఫికేట్టు సమర్పించాల్సి రావడం అడ్డంకిగా మారింది. అయితే తాజాగా పాస్‌పోర్ట్‌ పోందడానికి అనాథ ఆశ్రమాలు ఇచ్చే జనన ధృవీకరణ పత్రాలు సరిపోతాయన్న కేంద్రం ప్రకటనతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
పుట్టినతేదీలతో పాస్ట్‌పోర్ట్‌కు వీలు
కొత్త నిబంధనల ప్రకారం.. విద్యాసంస్థలు ఇచ్చే మార్కుల జాబితా,  టీసీల్లో  ఉండే డేటాఫ్‌ బర్త్‌ తో పాస్‌పోర్ట్‌ పొందడానికి వీలు కలిగింది. దీంతో ప్రతిభావంతులైనా అనాథ విద్యార్థులు  విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కలిగిందంటున్నారు.. అనాథ హక్కుల  ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇంతకాలం అసంతృప్తిలో గడుపుతున్న అనాథలకు విద్యా ఉపాధి అవకాశాలకు వీలుకలిగినట్లైంది. 

 

17:42 - December 25, 2016

సిద్దిపేట : జిల్లాలోని ప్రజలకు మంత్రి హరీశ్‌రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సీఎస్‌ఐ చర్చిలోని క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్‌చేసి...శుభాకాంక్షలు చెప్పారు. 

17:40 - December 25, 2016

కరీంనగర్ : దేశంలోనే క్రిస్మస్‌ను అధికారికంగా జరిపిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లోని క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచానికి శాంతిని అందించిన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకోవడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 

కల్వకుర్తి దగ్గర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మహిళలు మృతి

నాగర్ కర్నూల్ : కల్వకుర్తి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు.  

 

17:11 - December 25, 2016

అలహాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అలహాబాద్‌ నగరంలో ఇద్దరు యువకుల్ని స్థానికులు చావబాదారు. సెల్‌ ఫోన్లు దొంగిలిస్తున్నారనే ఆరోపణలతో నడిరోడ్డుపై యువకుల్ని చితకబాదారు. తమను విడిచిపెట్టాలని యువకులు ఆర్తనాదాలు చేస్తున్నా.. ఏ ఒక్కరూ కనికరించకపోగా.. విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

17:02 - December 25, 2016

'వంగవీటి' సినిమా టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రం సంగీత దర్శకుడు రవిశంకర్, గీత రచయిత సిరాశ్రీ పాల్గొని, మాట్లాడారు. చిత్రానికి సంబంధించిన విషయాలు తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విజ్ఞాన్ భవన్ లో డీజీ ధన్ మేళా కార్యక్రమం..

ఢిల్లీ : విజ్ఞాన్ భవన్ లో డీజీ ధన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, గంభీర్, దీపా మలిక్ పాల్గొన్నారు.

16:27 - December 25, 2016
16:22 - December 25, 2016

హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ శాంతినగర్ కేబీఎస్ బ్యాంకులో సీఈవో మన్మద దలైపై జరిగిన కాల్పుల కేసును పోలీసులు చేధించారు. ఈమేరకు సీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసు వివరాలను వివరించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 12 రౌండ్ల బుల్లెట్లు, రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను 48 గంటల్లో గుర్తించడం జరిగిందని చెప్పారు. సైంటిఫిక్, టెక్నికల్ ఆధారాలు వినియోగించి నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. షేక్ అబ్దుల్ రహీం, నరేష్, రాజేందర్ లు అరెస్టయిన వారిలో ఉన్నారని.. వెంకటరత్నం అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ కేసును చేధించేందుకు పది స్పెషల్ టీంలను రంగంలోకి దింపడం జరిగిందని పేర్కొన్నారు. నిందితులు ఈ కేసు నుండి తప్పించుకోవడానికి తెలంగాణతోపాటు మరో మూడు రాష్ట్రాల్లో తిరగారని, నగదు దోపిడికి నిందితులు ప్రణాళికలకు వేశారని తెలిపారు. ఘటన జరిగినప్పుడు మహ్మద్ దలైపై హత్యాప్రయత్నం జరిగిందని అనేక అనుమానాలున్నాయని తెలిపారు. కానీ నిందితులు కేవలం రాబరి కోసమే కాల్పులు జరిపినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. 

 

మెదక్ చర్చీలో డిప్యూటి సీఎం..

మెదక్ : ప్రఖ్యాత చర్చీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి కుటుంసభ్యులు, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు.

కేబీఎస్ సీఈవో కాల్పుల కేసులో ముగ్గురి అరెస్టు..

హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ శాంతినగర్ కేబీఎస్ బ్యాంకులో సీఈవో మన్మదదలైపై కాల్పుల కేసును పోలీసులు చేధించారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 12 రౌండ్ల బుల్లెట్లు, రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. షేక్ అబ్దుల్ రహీం, నరేష్, రాజేందర్ లు అరెస్టయిన వారిలో ఉన్నారు. వెంకటరత్నం అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసును చేధించేందుకు పది స్పెషల్ టీంలను రంగంలోకి దింపడం జరిగిందని సీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. నిందితులు ఈ కేసు నుండి తప్పించుకోవడానికి మూడు రాష్ట్రాల్లో తిరగారని, నగదు దోపిడికి నిందితులు ప్రణాళికలకు వేశారని తెలిపారు.

 

రాజీవ్ నగర్ కూలిన ఇంటి గోడ..

రాజన్న సిరిసిల్ల : రాజీవ్ నగర్ లో ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో 9మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులున్నారు. ఓ శుభకార్యంలో భోజనాలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

15:55 - December 25, 2016

బెంగళూరు : కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య వివాదాల్లోకి చిక్కుకున్నారు. వ్యక్తిగత సిబ్బందితో షూలేస్‌ కట్టించుకుంటూ మీడియా కెమెరాకు అడ్డంగా చిక్కారు. మైసూర్‌ పర్యటనలో ఉన్న ఆయన.. పీఏతో షూలేస్‌ కట్టించుకున్నారు. సిద్ధ రామయ్య వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. మరోవైపు సిబ్బంది కాదని దగ్గరి బంధువని ఆయన అనుచరులు వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.. 

 

15:53 - December 25, 2016

నల్లగొండ : పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి నిర్మూలన ఏమోగానీ రైతులు, కార్మికులు, ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, సన్నకారు రైతులే కాదు. మధ్య తరగతి రైతులు, వాణిజ్య పంటలు సాగు చేస్తున్న వారు కూడా నోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటలు సాగు చేసి తీరా కాపు అందే సమయానికి కేంద్రం ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 
జీవితాలు చిన్నాభిన్నం 
నల్లధనం వెలికి తీసేందుకు అంటూ కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు బ్యాంకులో ఉన్న డబ్బుల కోసమో.. ఇంట్లో ఉన్న కాస్తో కూస్తో నగదు మార్పిడికో.. నానాయాతన పడుతున్నారు. దీంతో వేలాది మంది ఉపాధి కొల్పొయి రోడ్డున పడ్డారు. 
వ్యవసాయ రంగంపై నోట్ల రద్దు ప్రభావం
ఇతర రంగాలు ఎలా ఉన్నా.. వ్యవసాయ రంగంపై నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యాసంగీ సిజన్ ప్రారంభమవుతుండడంతో సాగుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్న అన్నదాతలు చేతిలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలకు చెల్లించడానికి, పెట్టుబడుల కోసం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రోజుకు అరకొర నగదు మాత్రమే ఇస్తుండడంతో పనులు మానుకొని రోజుల తరబడి బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. అయితే చిన్న, సన్నకారు రైతులు మాత్రమే కాదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వాణిజ్య పంటలు సాగుచేస్తున్న ఆసామీ రైతులు కూడా నోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోతున్నారు.
పడిపోయిన తోటల సాగు
నల్లగొండ జిల్లా తిప్పర్తి సమీపంలో తోటల సాగు పడిపోయింది. రెండేళ్ల నుంచి అక్కడి రైతులు దానిమ్మ తోటలు సాగుచేస్తున్నారు. సరిగ్గా నవంబర్ చివరలో తోట కాపుకు వచ్చింది. తొలి సారే కాపు ఏపుగా ఉండడంతో పాటు.. కాయలు లావుగా రావడంతో తమ కష్టార్జితం అంతా తీరినట్టేనని ఆసామీలు భావించారు. కానీ నోట్ల రద్దు వారి ఆశలను అడియాసలు చేసింది.
కొనుగోళ్లు నిలిపివేత..  
నోట్ల రద్దు ప్రకటన తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారని.. దీంతో నెలపాటు కాయలను కోయకుండా ఆపాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు, చెన్నయ్ లాంటి ప్రాంతాల్లోని అన్నీ మార్కెట్లను సంప్రదించామని.. కానీ ఎక్కడా వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రాలేదన్నారు. నెలపాటు కూలీలకు అదనంగా వేతనాలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. మరో వైపు నెలరోజుల తర్వాత ధర తగ్గిపోయిందని.. దీంతో రెండువైపులా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బుల కోసం రోజల తరబడి క్యూ లైన్లలో 
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటనతో చిన్న, సన్నకారు రైతులు బ్యాంకుల వద్ద కూలీలకు చెల్లించే డబ్బుల కోసం రోజల తరబడి క్యూ లైన్లలో నిలబడుతుండగా.. వాణిజ్య పంటలు వేసుకున్న ఆసామీ రైతులు దిగుబడి ఉన్నా.. కొనుగోలు దారులు రాక నష్టపోతున్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా.. వాణిజ్య పంటలతో లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు నోట్లరద్దుతో లక్షల్లోనే నష్టపోతున్నారు.

 

15:45 - December 25, 2016

శ్రీకాకుళం : మూత్రపిండాల వ్యాధి ఉద్దానం ఉసురు తీస్తోంది. దశాబ్దాలుగా సిక్కోలు జిల్లాలో కబలిస్తున్న ఈ మహమ్మారి.. ముఖ్యంగా పేదోళ్ల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ వ్యాధి బారినపడి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. 
కుటుంబంపై విధి చిన్నచూపు 
ఈమె పేరు డిల్లెమ్మ.. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జగతి గ్రామంలో కూలి నాలి చేసుకుంటూ బతుకీడుస్తున్న కుటుంబం. వీరిపై విధి చిన్న చూపుచూసింది. డిల్లెమ్మను మూత్రపిండాల వ్యాధి కబళించింది. దీంతో ఆమె మంచానికే పరిమితమైంది. 
డిల్లెమ్మకు మూత్రపిండాల వ్యాధి
కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న డిల్లెమ్మ భర్త నీలయ్య.. భార్యకు వ్యాధి సోకడంతో.. ఆమెను చూసుకుంటూ ఇంటి వద్దె ఉంటున్నాడు. గత మూడు నెలలుగా ఆమెను అన్ని ఆస్పత్రుల చుట్టూ తిప్పాడు. ఉన్న కొద్దిపాటి భూమి, బంగారాన్ని అమ్మేశాడు. అయినా వ్యాధి నయం కాలేదు. రోజురోజుకు రోగం ముదరడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. డిల్లెమ్మకు డయాలసిస్‌ చేస్తే కొన్నేళ్లపాటు ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు సూచించారు. ఇప్పటికే వైద్యం కోసం అప్పులు చేశానని.. ఇంకా వైద్యం చేయించే స్థోమత లేదని నీలయ్య వాపోతున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బస్సు చార్జీలు కూడా లేవంటున్నాడు. భార్యను చూసుకుంటూ ఇంట్లోనే ఉండడంతో ఇద్దరు పిల్లలను పస్తులు ఉంచాల్సి వస్తుందంటున్నాడు. చుట్టుపక్కల వారు చేస్తున్న సాయంతో ఇల్లు గడుస్తుందని.. తన భార్య వైద్యానికి ప్రభుత్వం గానీ.. ఎవరైన దాతలు సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఇప్పటికే వైద్యానికి ఉన్నదంతా అమ్ముకున్నామని.. ఇప్పుడు పూట గడవడం కూడా కష్టం ఉందని డిల్లెమ్మ అంటోంది. దయార్ధ హృదయులైన దాతలు తమను ఆదుకోవాలని ఆమె కన్నీరుమున్నీరవుతోంది. 


ఇక తల్లిదండ్రుల పరిస్థితిని చూసి పిల్లలు తల్లడిల్లుతున్నారు. స్థానికులు కొద్దిపాటి సాయం చేస్తున్నప్పటికీ.. డయాలసిస్‌కు భారీ మొత్తంలో డబ్బులు కావాల్సి ఉండడంతో.. సాయం చేసే దాతల కోసం డిల్లెమ్మ దంపతులు ఎదురుచూస్తున్నారు. 

15:23 - December 25, 2016

మహారాష్ట్రలో నగదు..బంగారం స్వాధీనం..

మహారాష్ట్ర : పన్వేల్ లో నగదు..బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 35 లక్షల 2వేల నోట్లు, 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఐటీ శాఖకు పోలీసులు అప్పగించారు.

15:21 - December 25, 2016

తూర్పుగోదావరి : నోరుంది కదా అని రెచ్చిపోతే.. సారిచెప్పాల్సి వస్తుంది. ఈ నీతి ఆ ప్రజాప్రతినిధికి బాగా తెలిసొచ్చింది. నోటికి పనిచెప్పిన పిఠాపురం ఎమ్మెల్యేకు జూనియర్‌ డాక్టర్ల నుంచి వచ్చిన వ్యతిరేకతతో  కళ్లుబైర్లు కమ్మాయి. మొదట్లో బెట్టుచేసినా.. పార్టీ అధినేత మందలింపుతో తిట్టిన నోటితోనే టీడీపీ ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. 
వైద్యసిబ్బందిపై వర్మ హంగామా 
అధికారపార్టీ ఎమ్మెల్యేనన్న అహంకారంతో ఊగిపోయారు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ. కాకినాడ ప్రభుత్వాసుపత్రి వైద్యసిబ్బందిపై ఆయన చేసిన హంగామా అంతా ఇంతకాదు. నోటికి వచ్చినట్టు దూషిస్తూ.. శుక్రవారం రోజు రెచ్చిపోయారు. పిఠాపురం మండ‌లం రాయ‌వ‌రం గ్రామంలో ఎల‌క్ట్రిక్ వర్క్‌ చేసే ఓ వ్యక్తి ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుణ్ని శుక్రవారం సాయంత్రం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి తీసుకెళ్లారు. అయితే... ఆస్పత్రిలో బాధితుడికి త‌గిన వైద్యస‌హాయం అందించ‌డంలేద‌ని బాధితుని బంధువులు పిఠాపురం ఎమ్మెల్యే వ‌ర్మకు ఫిర్యాదు చేయడంతో.. ఎమ్మెల్యేగారు నిప్పులుతొక్కినట్టు చిందులేశారు. దీంతో ఆస్పత్రివద్ద జూనియర్‌ డాక్టర్లు, సిబ్బంది నిరసనకు దిగారు.  
జూ.డాక్టర్లు, సిబ్బంది విధులు బ‌హిష్కరణ 
ఆస్పత్రిలో వైద్యపరికరాలు పనిచేయక తాము పూర్తిస్థాయిలో వైద్యం అందించలేక పోతున్నామని.. విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే వర్మ ..ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడాన్ని నిరససిస్తూ శుక్రవారం రాత్రి నుంచి విధులు బ‌హిష్కరించిన వైద్య సిబ్బంది మొత్తం ఆస్పత్రి గేటు ఎదుట బైఠాయించి అర్థరాత్రి వ‌ర‌కూ ఆందోళ‌న చేశారు. వీరి ఆందోళనకు వామపక్షాలతోపాటు, యూనియన్‌లు మద్దతుగా నిలిచాయి. 
ఎమ్మెల్యేకు సీఎం చంద్రబాబు క్లాస్‌ 
వైద్య సిబ్బంది ఆందోళన మరింత ముదిరి.. పరిస్థితి చేజారిపోతున్న సమయంలో ఎమ్మెల్యేకు సీఎం చంద్రబాబు క్లాస్‌ తీసుకున్నట్టు సమాచారం. ఆస్పత్రివద్ద ఆయన ప్రవర్తనపై మందలించినట్టు తెలుస్తోంది. దీంతో బెట్టువీడిన ఎమ్మెల్యే.. కలెక్టర్‌ ఆఫీసుకు వచ్చి.. జూనియర్ డాక్టర్లతో మంతనాలు మొదలు పెట్టారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. చివరికి.. ఆస్పత్రికి వచ్చి తన దురుసు ప్రవర్తనపై ఇలా చింతించారు ఎమ్మెల్యే వర్మ. 
వైద్య సేవలు తిరిగి ప్రారంభం 
అయితే... ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ కోరాల్సిందేనని.. జూనియర్‌ డాక్టర్లు పట్టుబట్టారు. దీంతో కలెక్టర్‌  జోక్యం చేసుకుని..సర్దిచెప్పడంతో.. పరిస్థితి సద్దుమణిగింది. మొత్తానికి ఎమ్మెల్యే దిగిరావడంతో.. ఆసుపత్రిలో వైద్య సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

 

వివాదంలో కర్ణాటక సీఎం..

కర్ణాటక : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. సిబ్బఒందితో షూ లేస్ కట్టించుకుంటున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. లేస్ కట్టిన వ్యక్తిన తన బందువని సిద్ధరామయ్య పేర్కొంటున్నారు.

15:10 - December 25, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ మానవాళికి ప్రేమ, కరుణ, శాంతి, సేవాభావాలను బోధించడానికే యేసుప్రభువు మనిషి రూపంలో జన్మించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని బైబిల్ మిషన్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.  పెదకాకాని చర్చికి చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రభువు దయతో రాష్ట్రాభివృద్ధి, పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తానని బాబు తెలిపారు.  
పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు 
తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సోదరులకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్‌ పండగను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు.   
ఎన్టీఆర్ భవన్‌లో 
ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ మతాన్ని గౌరవించే ఏకైక పార్టీ తెలుగుదేశమని టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరస్సింహులు అన్నారు. మనుషులందరూ శాంతి, ప్రేమ, కరుణ, సేవాభావం కలిగి ఉండాలని ప్రభువు తెలిపారని మోత్కుపల్లి తెలిపారు. 
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో
అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. విదేశీ భక్తులు సత్యసాయిబాబా మహా సమాధి వద్ద క్రిస్మస్ జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాయిని, క్రీస్తును కీర్తిస్తూ ఆలపించిన గీతాలు భక్తులను మంత్రముగ్థులను చేశాయి. విద్యుత్ దీపాలతో సాయికుల్వంత్ సభామందిరాన్ని ప్రత్యేకంగా అలరించారు. 
విశాఖలో 
విశాఖలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ప్రార్థనలకు అన్ని చర్చిలు ముస్తాబయ్యాయి. నగరంలోని కన్నె మరియమ్మ చర్చితో పాటు 18వ దశాబ్దం నాటి సెయింట్ పాల్స్ చర్చి ఇలా ప్రముఖ చర్చిలన్ని ప్రత్యేక అలంకారణతో శోభాయామనంగా తయ్యారయ్యాయి. కొన్ని చర్చిలలో బాలయేసు, పశువుల కొట్టం శకలాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
విజయవాడలో
విజయవాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు కుటుంబ సమేతంగా ప్రార్థనా మందిరాలు, చర్చ్ లకు క్యూ కట్టడంతో నగరమంతా క్రిస్మస్ సందడి నెలకొంది. గుణదల పుణ్యక్షేత్రం, ఫిలదెల్పియా ఏజీ చర్చ్, జీసస్ మిరకల్స్, సీఎస్ఐ, సెయింట్ పాల్ కతెడ్రల్ చర్చిలకు క్రైస్తవులు భారీగా చేరుకుంటున్నారు. క్రీస్తురాజపురం, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, కంకిపాడు, అంబేడ్కర్ నగర్ లో భారీగా ఏర్పాటుచేసిన క్రిస్మస్ స్టార్లు, ట్రీలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. 

 

కేరళలో భారీ నగదు స్వాధీనం..

కేరళ : కన్నూరులో భారీగా నగదును ఆబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 లక్షల కొత్త 2వేల నోట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రైవేటు బస్సులో తరలిస్తుండగా అబ్కారీ అధికారులు పట్టుకున్నారు.

ఉగ్రవాదిపై ఎన్ఐఏ ఛార్జీషీట్..

ఢిల్లీ : అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాది మహమ్మద్ ముసాపై ఎన్ఐఏ ఛార్జీషీట్ దాఖలు చేసింది. కోల్ కతాలో విదేశీయులను చంపేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించింది. ఓర్లాండో రిసార్ట్స్ వద్ద పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ ఛార్జీషీట్ లో పేర్కొంది.

15:05 - December 25, 2016

ఢిల్లీ : దేశంలో నగదు రహిత లావాదేవీలు దాదాపు 300శాతం పెరిగాయని ప్రధాని మోడీ అన్నారు. లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్‌ వ్యాపార్‌ యోజన పథకాల ద్వారా  చిన్నవ్యాపారులు, వినియోగదారులకు  లబ్ధి చేకూరుతుందన్నారు.  అవినీతిని అడ్డుకునేందుకు  బినామీ ప్రాపర్టీ చట్టంలో  మార్పులు తెస్తున్నట్టు ఆయన తెలిపారు. డిజిటల్‌ ట్రాన్షాక్షన్స్‌ ప్రోత్సహకానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మన్‌ కీబాత్‌ కార్యక్రమంలో ప్రధాని కోరారు. 

 

సుపరిపాలనను అడ్డుకొంటోంది నేతలే - వెంకయ్య..

ఢిల్లీ : రోడ్లు, టెలిఫోన్, కేబుల్ వ్యవస్థ రావడానికి మాజీ ప్రధాని వాజ్ పేయి కారణమని, సుపరిపాలనను రాజకీయ నేతలే అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అంబానీ, ఆదానీలు కాంగ్రెస్ హాయాంలోనే పుట్టారని, నోట్ల రద్దుతో కాశ్మీర్ లో అల్లరిమూకల అరాచకాలు ఆగిపోయాయని, మాదకద్రవ్యాల సరఫరా ఆగిపోయిందన్నారు. అవినీతి, బ్లాక్ మనీ అంతం కోసమే మోడీ అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించేందుకే నోట్ల రద్దు చేయడం జరిగిందని, జనవరి 1 నుండి అవినీతి పరుల కష్టాలు మొదలవుతాయన్నారు.

పేదరికం లేని సమాజమే తన ధ్యేయం - బాబు..

గుంటూరు : పేదరికం లేని సమాజమే తన ధ్యేయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెదకాకాని బైబిల్ మిషన్ చర్చీలో క్రిస్మస్ వేడుకల్లో బాబు పాల్గొన్నారు. జెరూసలెం యాత్రకు ఆర్థిక సాయం రూ. 20 వేల నుండి రూ. 40వేలకు పెంచనున్నట్లు, చర్చీల నిర్మాణాలకు రూ. 3 లక్షల సాయం అందిస్తామన్నారు.

 

మహారాష్ట్ర సరిహద్దులో మావోల భీభత్సం..

మహరాష్ట్ర :సరిహద్దులో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. ఐరన్ ఓర్ తవ్వకాల దగ్గర వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించారు. 47 లారీలు, టిప్పర్లు, రెండు రోడ్డు రోలర్లు, నాలుగు జేసీబీలను దగ్ధం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.

తిరుపతి ఘాట్ రోడ్డులో జీపు బోల్తా..

చిత్తూరు : తిరుపతి మొదటి ఘాట్ రోడ్డు 20వ మలుపు వద్ద జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులకు గాయాలయ్యాయి. వీరిని రుయా ఆసుపత్రికి తరలించారు.

సూళ్లూరు పేటలో దోపిడి దొంగలు బీభత్సం...

నెల్లూరు : సూళ్లూరు పేటలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. సాయినగర్ లోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి ముగ్గురు మహిళలపై కత్తులతో దాడి చేశారు. 25 సవర్ల బంగారం, రూ. 40వేలు అపహరించారు. ఈశ్వరమ్మ అనే

14:11 - December 25, 2016

సన్ని, అక్షిత‌, ప్ర‌శాంత్‌, ప్ర‌స‌న్న హీరో హీరోయిన్లుగా వెల్ఫేర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శివ శ్రీ ద‌ర్శ‌క‌త్వంలో డాక్ట‌ర్ మ‌ళ్ల విజ‌య్ ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం 'ఇంకేంటి నువ్వే చెప్పు'. వికాస్ సంగీతం అందించిన ఈ సినిమా 30వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ తో టెన్ టీవీ స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఈ చిట్ చాట్ లో హీరో హీరోయిన్లు సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం..

14:05 - December 25, 2016

నిజామాబాద్ : నిజాం షుగర్స్‌కు సంకెళ్లు పడి ఏడాది పూర్తయినా...పరిశ్రమ తెరుచుకోలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..వంద రోజుల్లోనే ఫ్యాక్టరీలను తెరుస్తామన్న కేసీఆర్ మాటలు..కాగితాలకే పరిమితమయ్యాయి. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయనుకున్న కార్మికుల ఆశలు..అడియాశలుగానే మిగిలాయి.

ఆసియా ఖండంలోనే పేరుగాంచిన నిజాం షుగర్స్...
ఆసియా ఖండంలోనే పేరుగాంచిన నిజాం షుగర్స్... ఇప్పుడు రాష్ట్ర ప్రజలే మరిచిపోయే స్థితికి చేరుకుంది. నిత్యం కార్మికులతో కళకళలాడిన పరిశ్రమ..శిథిలావస్థలో చితికిపోతోంది. తాము అధికారంలోకి వస్తే పూర్వవైభవం తీసుకొస్తామంటూ ప్రకటించిన నేతలు...ఆ సంగతే మర్చిపోయారు. దీంతో పరిశ్రమనే నమ్ముకొని బతికిన కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డాయి.

ఫ్యాక్టరీలను పునరుద్దరిస్తామని కేసీఆర్ హామీ..మరిచిపోయిన ప్రభుత్వం
నిజాంఘగర్ ప్యాక్టరీని యాజమాన్యం... 2015 డిసెంబర్ 23న చెరుకు, నీటి లభ్యత లేదని లేఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేసింది. అయితే 2015 జనవరి 5న సీఎం కేసీఆర్, రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వమే ఫ్యాక్టరీలను నడిపించాలని రైతులు డిమాండ్‌ చేయడంతో..సీఎం సమ్మతించారు. తరువాత ఆ సంగతే మరిచిపోయి పాత పాటనే పాడింది. దీంతో రైతులు, కార్మికులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రే మాట మీద నిలబడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం
ఈ ఏడాది క్రషింగ్ సీజన్లో ఫ్యాక్టరీని ప్రభుత్వం పునరిద్దిరిస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడిపించలేదని ప్రకటించడంతో.. తీవ్ర నిరాశకు గురయ్యారు. పరిశ్రమలను నడిపిస్తామని చెప్పి...సాక్షాత్తు ముఖ్యమంత్రే మాట మీద నిలబడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజాం ఫ్యాక్టరీలను పునరుద్దరించాలని కార్మికులు, రైతులు డిమాండ్
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిజాం ఫ్యాక్టరీలను పునరుద్దరించాలని కార్మికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే పరిశ్రమలను నడిపిస్తే..అనేక కార్మిక కుటుంబాల బతుకులు బాగుపడతాయని చెబుతున్నారు. 

13:56 - December 25, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు ప్రభావం ఎరువుల డీలర్లపై పడింది. నగదు కష్టాలతో ఎరువుల కొనుగోలును రైతులు అమాంతం తగ్గించేశారు. దీంతో లక్షల టన్నుల ఎరువుల బస్తాలు గోడైన్లలో పేరుకు పోవడంతో ..అయినకాడికి అమ్ముకునేందుకు కంపెనీలడీలర్లు గ్రామాల బాటపట్టారు.

నగదు కష్టాలతో ఎరువుల కంపెనీలు డీలా
నగదు కష్టాలతో రైతులే కాదు.. ఎరువుల కంపెనీలు డీలాపడ్డాయి. కొనుగోళ్లు అమాంతం పడిపోవడంతో.. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి.. నిల్వచేసిన ఎరువులు వడ్డీదండగ బేరంగా మారాయి.

ఎరువుల రేటు తగ్గించి అమ్ముతున్న కంపెనీలు
నోట్లరద్దుతో వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో .. రైతులకు కొద్దిగా ఉపశమనం కలిగించే పరిస్థితి ఏర్పడింది. ఎవురుల రేటును తగ్గించి అమ్ముతున్నారు డీలర్లు. 1125 రూపాయలుగా ఉన్న డీఏపీ ధరను ప్రస్తుతం 1087లకే ఇస్తున్నట్టు ఇఫ్కో కంపెనీ ప్రకటించింది. అటు కోరమాండల్‌ కంపెనీ కూడా బస్తాపై 60 రూపాయల వరకు తగ్గించింది.

కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాపై రూ.50నుంచి రూ.70 వరకు తగ్గింపు
నోట్ల దెబ్బకు.... కాంప్లెక్స్‌ ఎరువులను కూడా తగ్గించి అమ్ముతున్నాయి కంపెనీలు. బస్తాకు 50 నుంచి 70రూపాయల వరకు తగ్గించాయి. తెలంగాణలో ఒక్క యాసంగి సీజన్‌లోనే లక్షన్నర టన్నుల డీఏపీ, 3లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను రైతులు వాడుతుంటారు. అటు ఏపీలో దాదాపు 7లక్షల టన్నుల వరకు ఎరువుల వినియోగం ఉంటుంది. ఈ మొత్తం మ్మీద.. 50కీలోల భస్తాకు ..సగటున 50రూపాయలు తగ్గినా.. టన్ను ఎరువుకు 1000రూపాయలు మిగిలే అవకాశం ఉంది. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో వినియోగమయ్యే 10లక్షల టన్నులు ఎరువుకు దాదాపు 100కోట్ల రూపాయల వరకు రైతులకు ఆదా అయినట్టే అంటున్నారు ..ఎరువుల డీలర్లు.

నిలిచి పోయిన లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు
గత ఆరు నెలలుగా అమ్మకాల్లేక లక్షల టన్నుల ఎరువులు నిలిచి పోవడంతో.. కంపెనీల ఏజెంట్లు గ్రామాలబాట పట్టారు. లారీల్లో ఎరువుల బస్తాలు గ్రామాలకే తీసుకెళ్లి రైతులకు అమ్ముతున్నారు. స్క్వైపింగ్‌ మిషన్లను కూడా తీసుకెళ్లి రైతులకు సమస్యలేకుండా చూస్తున్నారు. ఒకవేళ రైతులకు ఏటీఎం కార్డులు లేకుంటే.. పేటీఎం లాంటి యాప్‌ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నాయి ఎరువుల కంపెనీలు. 

13:52 - December 25, 2016

హైదరాబాద్ : తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి తెలంగాణలో మోడల్ జిల్లాలుగా మారాలని అభిప్రాయపడ్డారు. వివిధ అభివృద్ధి పథకాలు,తదితర సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల శాఖ కార్యకలాపాలు, మార్కెటింగ్ తదితర శాఖల పనితీరుపై హరీశ్ రావు సుదీర్ఘంగా సమీక్షించారు.

అధికారులతో మంత్రి హరీశ్‌రావు 9 గంటలకు పైగా సమీక్ష
జాతీయ రహదారులు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, మిషన్ భగీరథ, సాగునీటి పథకాలు, గోడౌన్లు, మార్కెట్ యార్డుల పనితీరుపై మంత్రి హరీశ్‌రావు 9 గంటలకు పైగా సమీక్షించారు. మెదక్,సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మంజూరైన జాతీయ రహదారులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. జాతీయ రహదారులకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. జాతీయ రహదారులన్నింటికీ సంబంధిత జిల్లా హెడ్ క్వార్టర్ తో, ఔటర్ రింగు రోడ్డుతో అనుసంధానం చేయాలని ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

జాతీయ రహదారులు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, మిషన్ భగీరథ
3 జిల్లాల్లో ఉపాధిహామీ పథకం తీరుతెన్నులను మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో వందశాతం మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి తెలంగాణలో మోడల్ జిల్లాలుగా మారాలని అభిప్రాయపడ్డారు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్నందున ప్రత్యామ్నాయంగా పొలాల్లోనే రైతుల కళ్ళేలను సిమెంట్ కాంక్రీటుతో నిర్మించే ప్రతిపాదనలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పాత మెదక్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా చేపట్టవలసిన భూసేకరణ పనులు, పెరగనున్న ఆయకట్టు వివరాలతో సమగ్ర ప్రజెంటేషన్ ఇవ్వాలని కాళేశ్వరం సి.ఇ. హరిరామ్‌ను మంత్రి ఆదేశించారు. మిషన్ కాకతీయ మొదటి, రెండవ దశల్లో చేపట్టిన పనులు, ఫలితాలను ఆయన సమీక్షించారు. మూడో విడత పనుల ప్రతి పాదనలు వెంటనే పంపాలని ఆదేశించారు. సింగూరు పనులను మంత్రి సమీక్షించారు. పాత మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాలలోనూ 10 రైతు బజార్ లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

3 జిల్లాల్లో ఉపాధిహామీ పథకం పనితీరుపై హరీశ్‌ సమీక్ష
పాత మెదక్ జిల్లా పరిధిలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్లు, భవనాల శాఖ కార్యక్రమాల పట్ల మంత్రి తుమ్మల తీవ్రంగా స్పందించారు. రహదారుల పరిస్థితి అద్వాన్నంగా ఉందంటూ..ఇది వర్కింగ్ సీజన్ అయినందున పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆయన కోరారు. పనుల విషయంలో జాప్యం పనికి రాదన్నారు.

 

13:48 - December 25, 2016

పెద్దపల్లి : సీపీఎం మహాజన పాదయాత్ర 70వ రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న మహాజన పాదయాత్రలో కేసీఆర్‌ సర్కార్‌పై పాదయాత్ర బృందం సభ్యుడు జాన్‌వెస్లీ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారని విమర్శించారు. 

13:43 - December 25, 2016
13:36 - December 25, 2016

కాళ్ల నొప్పులు..ఉరుకుల పరుగుల జీవితంలో కాళ్ల నొప్పులు కొంతమందికి అధికంగా వస్తుంటాయి. దీనితో ఈ బాధ నుండి విముక్తి పొందాలని ఏవేవో వాడుతుంటారు. మినరల్ లోపం, మధుమేహం మరియు ఇతర ఆరోగ్య పరిస్థితుల వలన కాళ్ళలో నొప్పి రావచ్చు. ఇలాంటి నొప్పులను కొన్ని రకాల గృహ నివారణలు మరియు సహజ పద్దతులు త్వరగా ఉపశమనం అందిస్తాయి.
కాళ్లలో నొప్పి..వాపులకు తగ్గించేందుకు 'ఐస్' ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇందుకు ఐస్ ముక్కలను ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఉంచాలి. నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో ప్లాస్టిక్ బ్యాగ్ తో వలయాకార రూపంలో మసాజ్ చేయాలి. ఇలా ఐస్ బ్యాగ్ తో 10 నిమిషాల పాటు చేయాలి. ఎక్కువ సేపు చేయకూడదు.
లవంగాల నూనె కూడా నొప్పులను నివారించడానికి సహాయ పడుతుంది. నొప్పిగా అనిపించిన వెంటనే లవంగాల నూనెను రాయాలి. ఈ నూనెతో మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ సరిగా జరిగి, కండరాలు విశ్రాంతి చెందుతాయి.
కొన్ని సమయాల్లో కాళ్లలో బెణుకుతుంటాయి. బెణుకులు మరియు గాయాలకు వెనిగర్ పరిష్కారం చూపుతుంది. ఒక బకెట్ వేడి నీటిని తీసుకోవాలి. అందులో రెండు చెంచాల వెనిగర్ ను వేయాలి. దీనితో పాటు కొంత ఎప్సం సాల్ట్ ను కలుపుకోవాలి. కలుపుకున్న అనంతరం ఈ బకెట్ లో కాళ్లు పెట్టాలి. దాదాపు 20 నిమిషాల పాటు కాళ్లను నానబెట్టాలి. ఇలా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు.

13:34 - December 25, 2016

హైదరాబాద్‌ వాసులకు డిసెంబర్‌ మాసం అనగానే టక్కున గుర్తుకొచ్చేది పుస్తక మహోత్సవం. ఈ మహోత్సవాలలో పుస్తకాలు విరివిగా దొరకడమే కాకుండా పలు అరుదైన పుస్తకాలు బుక్ ఫెస్టివల్ లో లభించటం ప్రత్యేకత. ఈ ఏడాది బుక్‌ ఫెయిర్‌ డిసెంబర్‌ 15 నుంచి 26 వరకూ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగుతున్నాయి. బుక్‌ ఫెయిర్‌లో సుమారు 300కు పైగా స్టాళ్లు ఉండడం, ప్రతి రోజూ ఏదో ఒక సాహిత్య పరమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ప్రతియేటా 10 రోజుల పాటు జరిగే బుక్‌ ఫెయిర్‌ ఈ ఏడాది 12 రోజులు నిర్వహిస్తున్నారు. బుక్‌ ఫెయిర్‌ నిర్వ హించే 12 రోజుల్లో 10 రోజుల పాటు ప్రత్యేకంగా సాహి త్యోత్సవాలు జరుగుతుండడం విశేషం.

13:29 - December 25, 2016

పాఠశాల విద్యార్ధులకు వారం రోజుల్లో తెలుగు భాషను నేర్పించవచ్చను రుజువు చేశారు రచయిత నెల్లూరు నర్శింహారావు. లయ ఆధారంగా ఒక తెలుగు వాచకాన్ని రూపొందించారు నెల్లూరు నర్శింహారావు..తెలుగు గేయ నేపథ్యంలో రాసిన నెల్లూరు నర్శింహారావు వాచకంపై సమీక్షణం మీకోసం ఈ వీడియో సిద్ధంగా వుంది. 

13:19 - December 25, 2016

ఆధునిక తెలుగు కవిత్వంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ కవి పాపినేని శివశంకర్ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. పాపినేని కవితా సంపుటి 'రజనీగంధ'కు గాను ఈ అవార్డు ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ అవార్డును బహుకరించనున్నారు. కాగా, పాపినేని శివశంకర్ స్వగ్రామం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నెక్కల్లు. తాత్త్వికమైన లోతులను స్పృశిస్తూ ఆధునిక తెలుగు కవిత్వంలో పాపినేని శివశంకర్ అగ్ర కవుల సరసన చేరారు. ఇప్పటివరకు 350కవితలు, 55 కథానికలు,220దాకా వ్యాసాలు పాపినేని శివశంకర్ కలం నుంచి జాలువారాయి.

13:15 - December 25, 2016

ఖమ్మం : ముందు దగా.. వెనక దగా.. కుడి ఎడమల దగా దగా.. అన్న చందంగా...ముందు కల్తీ వెనక కల్తీ.. ఎక్కడ చూసినా కల్తీ కల్తీ.. అని చెప్పుకోవాల్సి వస్తోంది. గాలి, నీరు, తినే తిండితో పాటు ప్రతిఒక్కటీ కల్తీమయం అయిపోయింది. తాజాగా ఖమ్మంలో మరో కల్తీ కారం మాఫియా గుట్టు రట్టయింది. అయితే.. ఈ మాఫియా వెనుక ఎందరో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే సూత్రధారుడుగా ఉండటం కలకలం సష్టిస్తోంది. ఖమ్మం జిల్లా కల్తీ కారం మాఫియాపై 10 టివి స్పెషల్‌ స్టోరీ...! 
కల్తీ కారం మాఫియా 
ఖమ్మం జిల్లాలో కల్తీ కారం మాఫియా ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేస్తోంది. మధిర, ముదిగొండ, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని శ్రీనివాస్‌నగర్‌, ఖమ్మం అర్బన్‌ మండలం అల్లీపురంలో టన్నులకొద్దీ నకిలీ కారం బస్తాలు ప్రత్యక్షం కావడం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ కల్తీ కారం మాఫియా ఆగడాలు పెచ్చుమీరి పోతున్నా... వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికార పార్టీ నేత...? 
భారీ ఎత్తున కల్తీ కారం బస్తాలు బయటపడ్డ వ్యవహారంలో.. అధికార పార్టీకి చెందిన ఓ నేత చక్రం తిప్పుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు.. మధిర ప్రాంతం నుంచే కల్తీకారం సరఫరా అవుతున్నా... సంబంధిత నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
తూతూ మంత్రంగా పోలీసులు చర్యలు 
బస్తాల కొద్దీ కల్తీ కారం బయటపడ్డా... కల్తీ మాఫియాపై పోలీసులు తూతూ మంత్రంగా కేసులు పెట్టి వదిలిపెట్టడంతో... నిందితులు మళ్లీ యథేచ్చగా అక్రమ కల్తీ వ్యాపారం చేస్తుండటం గమనార్హం. కల్తీ కారం బస్తాలను తరలిస్తున్న 11 లారీలను ఇటీవల మధిరలో పట్టుకున్నారు. వాటిలో 3 లారీల కారాన్ని మధిర ప్రాంతం వైరా నది వద్ద, 2 లారీల సరకును దెందుకూరు సమీపంలో పడేశారు. ఇంకా 6 లారీల నకిలీ కారం సరకు ఎటుపోయిందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 
సూత్రదారి.. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యయుడు 
ఈ కల్తీ కారం మాఫియా సూత్రదారుడు... మధిర మండలం జిలుగుమాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడన్న విషయం తెలిసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పిల్లలకు విద్యాబద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే ఈ మాఫియాను నడుపుతూ ప్రజారోగ్యం క్షీణించే పనికి ఒడిగట్టడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సదరు ఉపాధ్యాయుడు చైనాకు చెందిన వాంగ్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి.. కారం తయారు చేసిన తర్వాత వచ్చే వ్యర్థ పదార్థాలను  కొనుగోలు చేసేవాడు. వాటితో నకిలీ కల్తీ కారం తయారు చేసి మార్కెట్‌లో విక్రయించేవాడు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. 
అసలు సూత్రధారిని వదిలేశారు... 
కల్తీ కారం తాయారీకి సంబంధించిన వ్యర్థ పదార్థాలను బస్తాల్లో నింపి..  ఖమ్మం , మధిర, వైరా, కొణిజర్ల, ముదిగొండ , విజయవాడ, గుంటూరు జిల్లాలోని కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచారు. మధిరలో విషయం బయటకు పొక్కడంతో.. అధికార పార్టీకి చెందిన ఓ నేత అపుడే పైరవీ ప్రారంభించినట్లు సమాచారం. అసలు సూత్రధారిని వదిలి కేవలం నకిలీ కారం బస్తాలను కోల్డ్ స్టోరేజీలో దాచిన వారిపైనే విజిలెన్స్, పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.  
నిందితులను కఠినంగా శిక్షించాలి : స్థానికులు 
మధిర పరిధిలో ఐదు లారీల నకిలీ కారం బస్తాలు, ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్‌లో 25 క్వింటాళ్ల నకిలీ కారం సీజ్‌ చేయడం, ఖమ్మం అర్బన్ మండలం అల్లీపురం సాగర్ కాలువ సమీపంలో 2 వేల బస్తాలు పడేసి వెళ్లడం.. వీటితో పాటు....కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలోని ఓ కోల్డ్‌ స్టోరేజీలో లక్షా 39 వేలకు పైగా మిరప విత్తనాల బస్తాలు వెలుగు చూడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోందని అధికారుల చెబుతున్నారు. ఈ కల్తీ కారం వ్యవహరానికి సబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.  

 

13:10 - December 25, 2016

గుంటూరు : ప్రపంచ మానవాళికి ప్రేమ, కరుణ, శాంతి, సేవాభావాలను బోధించడానికే యేసుప్రభువు మనిషి రూపంలో జన్మించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని బైబిల్ మిషన్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పెదకాకాని చర్చికి చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రభు దయతో రాష్ట్రాభివృద్ధి, పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తానని బాబు తెలిపారు.  

కాపులు..బలిజలను వేర్వేరుగా చూడాలి - ఓవీ రమణ..

తిరుపతి : సామాజిక, ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా కాపులు, బలిజలను వేర్వేరుగా చూడాలని టిటిడి పాలక మండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ పేర్కొన్నారు. కాపులు తమ స్వార్థంతో బలిజలను అణగదొక్కుతున్నారని, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని బలిజ సామాజిక వర్గాలతో బలిజ యునైటెడ్ ఫ్రంట్ స్థాపిస్తామన్నారు. ముద్రగడ కాపుల జపం చేస్తూ బలిజలకు ప్రాధాన్యం కల్పించడం లేదన్నారు. బలిజలకు ఎక్కువ స్థానాలు కేటాయించే పార్టీలకు తాము రాజకీయంగా మద్దతు పలుకుతామన్నారు.

13:07 - December 25, 2016

హైదరాబాద్‌ : కూకటపల్లిలో దారుణం చోటుచేసుకుంది. శ్రీసాయి భరద్వాజా అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌పై ఇద్దరు మహిళలు కత్తితో దాడికి తెగబడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బీసయ్య అనే వ్యక్తి భరద్వాజా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మూడో అంతస్తు నుంచి శబ్దాలు రావడంతో రాత్రి 2 గంటలకు ఫ్లాట్‌ నెంబర్‌ 302కు వెళ్లి వాచ్‌మెన్‌ ఆరా తీశాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు వాచ్‌మెన్‌పై కత్తితో కిరాతకంగా దాడి చేశారు. ఆ తర్వాత నెత్తుటి మరకలను నీటితో కడిగేశారు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని అపార్ట్‌మెంట్‌ వాసులు ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వాచ్ మెన్ పై మహిళల దాడి..

హైదరాబాద్ : కూకట్ పల్లి వివేకానంద్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వాచ్ మెన్ బిసయ్యపై ఇద్దరు మహిళలు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో వాచ్ మెన్ కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఇతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీ సాయి భరద్వాజ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

ఆదిత్య కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం..

మెదక్ : పటన్ చెరులోని పాశమైలారం ఆదిత్య కెమికల్ ఫ్యాకర్టీలో ప్రమాదం చోటు చేసుకుంది. బెంగాల్ కు చెందిన కార్మికుడు మృతి చెందాడు.

13:03 - December 25, 2016

ఢిల్లీ : పొగమంచు ఉత్తరాది రాష్ట్రాలను భారీగా కమ్మేసింది. దేశరాజధాని ఢిల్లీ మంచుదుప్పటి గుప్పిట చిక్కుకుంది. మధ్యాహ్నం అవుతున్నా.. పొగమంచు తీవ్రత తగ్గటం లేదు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లు, విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

12:59 - December 25, 2016

నల్లగొండ : స్నాచర్లు చెలరేగుతూనే ఉన్నారు. ఈవ్‌టీజర్లు హల్‌ చల్‌ చేస్తూనే ఉన్నారు. ప్రాణాలు పోతున్నా అరాచకాలు ఆగడం లేదు. ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. షీటీమ్‌లు ఆకతాయిలపై కొరడా ఝుళిపిస్తున్నా..ఏదో ఓ మూల మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదీ తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ రాచకొండ కమిషనరేట్‌లో పరిస్థితి. ఈ కమిషనరేట్‌ పరిధిలో జరుగుతున్న దారుణాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

రాచకొండ కమిషనరేట్‌లో పెరుగుతున్న క్రైమ్‌రేట్‌
గడిచిన ఏడాదితో పోలిస్తే 2016 ఆడాళ్లలో వణుకుపుట్టించింది..కామాంధుల వికృత క్రీడకు ఎందరో అబలలు బలయ్యారు.. మరెందరో జీవితాలు నాశనమయ్యాయి...అబలలపై అరాచకాలను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే అయ్యాయి... షీ బృందాల ఏర్పాటుతో పోకిరుల్లో భయాన్ని సృష్టించినా... నిర్భయ చట్టాలు మాత్రం కామాంధులను కట్టడి చేయలేకపోయాయి.. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, హత్యాయత్నాలు కలవరం రేపుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాచకొండ కమిషనరేట్‌లో పెరుగుతున్న క్రైమ్‌రేట్‌ గుబులుపుట్టిస్తోంది.

అబలలపై ఆగని అరాచకాలు...పెరిగిన అత్యాచారాలు...
హైదరాబాద్‌ మహానగరంలో సైబరాబాద్ కమిషనరేట్ రెండుగా విడిపోవడం కాస్త ఉపశమనం కలిగించినా..రాచకొండ కమిషనరేట్‌లో జరుగుతున్న నేరాలు, ఘోరాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక కేసుల దర్యాప్తు, రికవరీలో పోలీసులు కొంత వెనకబడిపోయారు. చైన్ స్నాచర్లు స్వైర విహారానికి అడ్డుకట్టపడటం లేదు. గొలుసు దొంగతనాల కేసులు ఛేదించడంలో కాస్త వెనుకపడి ఉన్నామని స్వయంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పడం గమనార్హం.

స్నాచింగ్‌ కేసుల ఛేదింపులో కొంత వెనుకపడ్డమన్న సీపీ
ఇక రాచకొండ కమిషనరేట్‌లో షీటీమ్స్‌ పనితీరుపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. 2244 మంది పోకిరిలపై కేసులు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. గతేడాది 50 కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా..ఈ ఏడాది 77 ఎఫ్‌ఆర్‌లు రికార్డయ్యాయి. రెండేళ్లలో 127 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. ఈవ్‌టీజర్లలో 24 మంది మైనర్లు ఉండగా..391 మంది 21 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. గతేడాది 302 కేసులు నమోదు కాగా 2016లో 415కు పెరిగాయి. ఇక కమిషనరేట్లో పెరుగుతున్న క్రైమ్‌ రేట్‌ స్థానికులకు దడపుట్టిస్తోంది. రెండు కోట్లు విలువైన గంజాయి పోలీసులకు పట్టుబడటం..కమిషనరేట్‌ పరిధిలో గంజాయి వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సూడో నక్సలైట్ల పేరుతో అపోలో ఆస్పత్రి యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో సత్వరం స్పందించిన పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులకు సంకెళ్లు వేశారు. మరోవైపు అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, వేధింపుల కేసులు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.

పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, వేధింపుల కేసులు
ఇక హత్య కేసులు ఛేదించడంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. 2015లో 6 హత్య కేసుల్లో ఐదింటిని ఛేదించారు. 2016లో 6 మర్డర్‌ కేసులకు ఆరింటిని ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. రాబరీ కేసులు లాస్ట్‌ ఇయర్‌ 39, ఈ ఏడాది 54కి పెరిగాయి. చైన్ స్నాచింగ్ అండ్ రాబరీ కింద నమోదైన కేసుల్లో.. గతేడాది ఒక్క కేసు నమోదు అయితే ఈ ఏడు 126కు పెరగడం స్నాచర్ల హల్‌చల్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. గత ఏడాది 240 కేసులు నమోదు కాగా పోలీసులు ఛేదించింది 179 మాత్రమే.. ఈ ఏడాది 142కు గాను 70 కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. 2015లో ఇళ్ల చోరీలు 629.. 2016లో 706కు పెరిగాయి. గతేడాది 316 కేసులు రికవరీ చేయగా.. ఈ ఏడు 706 కేసుల్లో కేవలం 360 మాత్రమే రికవరీ చేశారు.2015లో 48 అటెన్షన్ డైవర్షన్ కేసుల్లో 17 మాత్రమే ఛేదించారు. ఈ సంవత్సరం 60 కేసులకు గాను 37 కేసుల్లో పురోగతి సాధించినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు ... ఇక మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి.
ఈ ఏడాది 153 కేసుల్లో 142 ఛేదించి 93% పురోగతి..
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 854 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పలు కేసులు ఛేదించడంలో సహయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. సంజన కేసు సంచలనం సృష్టించింది..మందు బాబుల ర్యాష్‌ డ్రైవింగ్‌కు తల్లీకూతుళ్ల జీవచ్ఛవాలుగా మారిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఏడాది 8516 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు బుక్ చేయగా.. పట్ట పగలు మద్యం సేవించి 1151 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఇక ఆన్ లైన్ చీటింగ్ కేసులు ఈ ఏడాది 39 నమోదయ్యాయి. 

12:51 - December 25, 2016

కడప : తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సోదరులకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్‌ పండగను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. కుటుంబ సమేతంగా క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. క్రీస్తు జన్మదినం సంధర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నింటాయి. ప్రత్యేక ప్రార్థనలతో ప్రధాన చర్చిలన్ని మార్మోగుతున్నాయి. విజయవాడలోని ఇమ్మాన్యుయేల్ చర్చికు క్రైస్తవ సోదరులు భారీగా తరలివచ్చి ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 

12:47 - December 25, 2016

ఢిల్లీ : ర‌ష్యాకు చెందిన రక్షణ శాఖ విమానం టీయూ-154 న‌ల్ల స‌ముద్రంలో కూలిపోయింది. విమానం కూలిన స‌మ‌యంలో అందులో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. సోచి నుంచి టేకాఫ్ అయిన కాసేప‌టికే ఆ విమానం రాడార్ ప‌రిధి నుంచి మాయ‌మైంది. సోచి తీరంలోనే న‌ల్ల స‌ముద్రంలో విమాన శ‌క‌లాల‌ను రెస్క్యూ టీమ్ సిబ్బంది గుర్తించారు. సాంకేతిక కార‌ణాల వ‌ల్లే విమానం కూలిపోయిన‌ట్లు అధికారులు ప్రాథమిక అంచ‌నాకు వ‌చ్చారు. విమానంలో ర‌ష్యా సైనికాధికారులు, క‌ళాకారులు ఉన్నారు. వీళ్లంతా రాబోయే న్యూ ఇయర్ వేడుక‌ల‌ను సిరియాలోని మీమిన్ ఎయిర్‌బేస్‌లో ఉన్న ర‌ష్యా ఎయిర్‌ఫోర్స్‌ అధికారులతో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి వెళ్తున్నట్లు రష్యా రక్షణ విభాగం తెలిపింది. విమానంలో 9 మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు.

12:35 - December 25, 2016

పవర్ స్టార్..మలయాళ సూపర్ స్టార్ 'మోహన్ లాల్'లు కలిస్తే...ఇంకేముంది అభిమానులకు కోలాహాలమే. ఈ ఇద్దరూ ఆయా వుడ్ లలో వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. నటన..హావభావాలతో కట్టిపడేస్తున్న 'మోహన్ లాల్' తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇతను నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. ఈ ఏడాది వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. తెలుగులో 'మనమంతా', 'జనతా గ్యారేజ్' చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. మెయిన్ రోల్ వేసిన మలయాళీ సినిమాలు 'పులి మురుగన్', 'ఒప్పం' సినిమాలు అక్కడ విజయవంతమయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది ఐదు సినిమాల్లో 'మోహన్ లాల్' నటించారు. తాజాగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తో 'మోహన్ లాల్' నటించనున్నాడని సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 'పవన్' 'కాటమరాయుడు' చిత్రంలో నటిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలకు 'పవన్' సైన్ చేశాడు. తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్ లో 'వేదలం' రీమెక్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కీలక పాత్రను 'మోహన్ లాల్' పోషించనున్నారని టాక్. మొదట 'సన్నాఫ్ సత్యమూర్తి' లో నటించిన 'ఉపేంద్ర'ను తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ 'మోహన్ లాల్' చిత్రాలు వరుసగా విజయవంతం అవుతుండడంతో 'త్రివిక్రమ్' పునరాలోచనలో పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మంచి సక్సెస్ లు సాధించిన 'మోహన్ లాల్' ను తీసుకోవాలని 'త్రివిక్రమ్' యోచించినట్లు టాక్. ప్రస్తుతం దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

కూలిన రష్యా మిలటరీ విమానం..

ఢిల్లీ : అదృశ్యమైన రష్యాకు చెందిన మిలటరీ విమానం టీయూ 154 కూలిపోయింది. సోచి వద్ద రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో మొత్తం 92 మంది సిబ్బంది ఉన్నారు. నల్లసముద్రంలో విమాన శకలాలను అధికారులు గుర్తించారు.

12:01 - December 25, 2016

మెగా అభిమానుల ఎదురు చూస్తున్న వేళ రానే వస్తోంది. 'చిరంజీవి' నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' చిత్రం కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత 'చిరు' మేకప్ వేసుకుంటున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా 'కత్తి' రీమెక్ తో 'చిరు' 'ఖైదీ నెంబర్ 150' గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు..టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో 'చిరు'కు జోడిగా 'కాజల్' నటిస్తోంది. సినిమా ఆడియో వేడుక కోసం ఎదురు చూసిన అభిమానులకు చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. డైరెక్ట్ గా ఆడియోను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో 'ఖైదీ'కి సంబంధించిన పాటలు రెండిటిని ఇటీవలే విడుదల చేశారు కూడా. అభిమానుల నిరుత్సాహ పరచకుండా చిత్ర యూనిట్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ వేడక నిర్వహించనున్నట్లు 'రామ్ చరణ్' స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈవెంట్ కి సంబంధించి తేది, వేదికని ఫైనల్ చేసి అఫీషియల్ గా ప్రకటించింది మూవీ యూనిట్. జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడలో 'ఖైదీ నంబ‌ర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ని ఇటు అభిమానులు, అటు సినీప్ర‌ముఖుల మ‌ధ్య‌ గ్రాండ్‌గా జ‌ర‌పనున్నారని టీం ప్రకటించింది. 2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీగా వస్తోన్న 'ఖైదీ నంబ‌ర్ 150' చిత్రం కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ పై నిర్మించబడుతోంది. బాలీవుడ్ న‌టుడు 'త‌రుణ్ అరోరా' విల‌న్ పాత్ర‌లో నటిస్తున్నాడు.

11:53 - December 25, 2016

పవన్ కళ్యాణ్ 'ఉగాది' బరిలో నిలుస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకొంటోంది. ఉగాది పండుగను పురస్కరించుకుని సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కిషోర్ పార్థాసాని(డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'శృతిహాసన్' మరోసారి 'పవన్' సరసన జత కడుతోంది. 'పవన్‌ కళ్యాణ్' సినిమా అంటే ప్రేక్షకులు ఏం అశిస్తారో ఆ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాత పేర్కొన్నారు. తాజా షెడ్యూల్ ఇటీవల పొల్లాచ్చీలో పూర్తయిందని, చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చిందన్నారు. 'గబ్బర్‌సింగ్' ఘనవిజయం తరువాత 'పవన్‌ కళ్యాణ్', 'శృతి హసన్‌'ల కలయిక ఈ చిత్రంలో కనువిందు చేయబోతుందని పేర్కొన్నారు. మిగిలిన చిత్రీకరణ అంతా జనవరి, ఫిబ్రవరిల్లో పూర్తిచేసి చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఏటీఎంలో డబ్బుల వర్షం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులోని కొటాక్ మహేంద్ర ఏటీఎంలో డబ్బులు అధికంగా వచ్చాయి. కొటాక్ మహీంద్ర ఏటీఎం నుండి శనివారం రూ. 2500 విత్ డ్రా చేస్తే రూ. 2వేలు నోటుతో పాటు, ఐదు రూ. 500 నోట్లు వచ్చాయి. ఎయిర్ పోర్టు అధికారులు గమనించి ఏటీఎంను మూసివేశారు. రూ. 8లక్షలు డ్రా చేసినట్లు ఎయిర్ పోర్టు సిబ్బంది గుర్తించారు.

 

క్రైస్తవులకు తమ్మినేని, పాదయాత్ర బృందం శుభాకాంక్షలు..

పెద్దపల్లి : క్రైస్తవులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పాదయాత్ర బృంద సభ్యులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మనుషులంతా సమానమేనని ఏసుక్రీస్తు బోధించారని, సమానత్వం కోసం క్రీస్తు తన ప్రాణాలు అర్పించారని తమ్మినేని తెలిపారు. అట్టడుగు కులాల అభివృద్ధి, సమానత్వం కోసమే తమ పాదయాత్ర కొనసాగుతోందన్నారు.

మన్ కీ బాత్ లో మోడీ..

ఢిల్లీ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రసంగించారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, నగదు రహిత లావాదేవీలను వ్యాపారులు ప్రోత్సాహించాలని సూచించారు. డిజిటల్ లావాదేవీలపై ప్రోత్సాహం కోసం లక్కీ గ్రాహక్, డీజీ ధన్ వ్యాపార్ యోజనలు ప్రారంభించామని, దేశ వ్యాప్తంగా 30 కోట్ల రూపే కార్డులున్నాయన్నారు. జన్ ధన్ ఖాతాలున్న వారి వద్ద 20 కోట్ల రూపే కార్డులున్నాయన్నారు.

11:33 - December 25, 2016
11:28 - December 25, 2016

ఢిల్లీ : ఈ మధ్య కాలంలో విమానాలు మిస్ అయిపోవటం..ప్రమాదాలకు గురవ్వటం సర్వ సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన మిలటరీ విమానం అదృశ్యమయ్యింది. ఈ విమానంలో రష్యా ఆర్మీకి చెందిన ముఖ్యమైన 92 మంది అధికారులు వున్నట్లుగా తెలుస్తోంది. రష్యా నుండి సిరియాలోని లతిక ప్రాంతానికి బయలుదేరింది. ఉదయం 5.20 గంటల ప్రాంతంలో టేకాఫ్ తీసుకున్న టీయూ 154 విమానం 20 కిలో మీటర్లు ప్రయాణించిన అనంతరం రాడార్ తో సంబంధాలు తెగిపోయినట్లు రష్యా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. నల్ల సముద్రం పాంత్రంలోని సోచీ ప్రాంతంలో విమానం మిస్ అయినట్లుగా తెలుస్తోంది. విమానం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా బ్రెజిల్ నుండి ఫుడ్ బాల్ ఆటగాళ్ళతో బయలుదేరిని విమానం ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. 

11:25 - December 25, 2016

గుంటూరు : క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పెద్దకాకాని లోని బైబిల్ మిషన్ చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సేవ గురించి ప్రపంచానికి చాటి చెప్పటానికే చాటి చెప్పేందుకే ఏసు ప్రభు పుట్టాడన్నారు. సేవలో పాల్గొంటేనే క్రిస్మస్ సంకేతమని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా గుంటూరులో ప్రతీ సంవత్సరం క్రైస్తవ మహాసభలకు లక్షలాదిమంది తరలివస్తూంటారు. మహాసభలకు వచ్చే క్రైస్తవ భక్తుల కోసం వచ్చేవారి కోసం ప్రయాణం కోసం సదుపాయాలు కల్పించాలని ఫాదర్ సామ్యుల్ కిరణ్ కోరారనీ..దానికి చర్యలు తీసుకుంటామన్నారు. క్రిస్మస్ పండుగలకు ఒక ప్రత్యేకత వుందన్నారు. కాకాని చర్చిలో చేపట్టిన సేవా కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. క్రైస్తవ భక్తులకు ఆయన అభినందించారు. 

11:02 - December 25, 2016

టాలీవుడ్ యంగ్ స్టార్ లలో 'నిఖిల్' కూడా ఒకరు. ఇతను వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ దూసుకెళుతున్నాడు. 'శంకరాభరణం' అనంతరం విడుదలైన ''ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం విజయవంతం కావడంతో 'నిఖిల్' ఉత్సాహంగా ఉన్నాడు. అనంతరం తన తదుపరి చిత్ర విషయంలో కూడా స్పీడుగానే ఉన్నాడు. 'స్వామిరారా' ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో తన చిత్రం ఉంటుందని..ఇందులో 'రీతూ వర్మ' హీరోయిన్ గా నటిస్తోందని 'నిఖిల్' ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లుక్ ను విడుదల చేశాడు. 'కేశవ' అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. కొన్ని కొటేషన్స్ తో ఎక్స్ పెక్టేషన్స్ పెంచిన 'నిఖిల్' తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ మూవీకి 'పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే కిక్కే వేరు' అనే ట్యాగ్ లైన్ ని తగిలించారు. డిఫరెంట్ షేడ్ లో 'నిఖిల్' కనిపిస్తున్నాడు. అంతేగాక ఓ వైపు గన్నులు..మరోవైపు నెత్తుటి మరకలతో పోస్టర్ ఉంది. రివేంజ్ డ్రామాగా సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. 'నిఖిల్' కెరియర్ కే బెస్ట్ చిత్రంగా 'కేశవ' ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. 50 శాతం చిత్ర షూటింగ్ పూర్తైందని 'నిఖిల్' తన అఫీషియల్ పేజ్ ద్వారా తెలియచేశాడు. ఫిబ్రవరిలో ఈ మూవీని రిలీజ్ కి రెడీ చేయనున్నట్టు టాక్.

క్రిస్మస్ కేక్ కట్ చేసిన జగన్..

కడప : పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిలో ఏర్పాటు చేసిన ప్రార్థన కూటమిలో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి.. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి కూడా ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్‌ కేక్‌ కోసి అందరికి పంపిణీ చేశారు.

క్రిస్మస్ వేడుకల్లో జగన్..

కడప : జిల్లాలోని పులివెందులకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చేరుకున్నారు. సీఎస్ఐ చర్చీలో జగన్ కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి..

మహారాష్ట్ర : మరో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఒంటినిండా తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆ ఘటనతో పూణెలో కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాకు చెందిన అంతర దాస్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.

రష్యా మిలటరీ విమానం అదృశ్యం..

ఢిల్లీ : రష్యాకు చెందిన మిలటరీ విమానం అదృశ్యమైంది. సోచి వద్ద రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. టియు 154 ఎయిర్ క్రాఫ్ట్ విమానంలో మొత్తం 92 మంది సిబ్బంది ఉన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో సీఎం బాబు..

గుంటూరు : పెదకాకాని బైబిల్ మిషన్ చర్చీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

జగ్గారంలో కుటుంబం ఆత్మహత్య..

భద్రాద్రి : అశ్వాపురం (మం) జగ్గారంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు సురేష్, సరిత, నాగచైతన్య (9), చింటూ (6) మృతులుగా గుర్తించారు.

10:37 - December 25, 2016
10:36 - December 25, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దై 47 రోజు కొనసాగుతోంది. అయినా సామాన్యుల కష్టాలు తీరలేదు. ఏటీఎంల ముందు క్యూలు కొనసాగుతున్నాయి. పండుగ పబ్బం అంటూ తేడా లేకుండా బ్యాంకుల్లో సామాన్యులు పడిగాపులు పడుతునే వున్నారు. చాలాచోట్ల ఏటీఎంల ముందు అవుట్‌ ఆఫ్ సర్వీస్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నోట్ల కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. పెద్దనోట్లరద్దుతో పలు దుకాణాలు బోసిపోతున్నాయి. కొత్త నోట్ల కొరతతో చిరువ్యాపారులు నష్టాలపాలవుతున్నారు. చిరు వ్యాపారులు నష్టాల్లో ఉన్నారు. గిరాకీలేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో హిమాయత్ నగర్ లోని ఐసీఐసీ బ్యాంక్ వద్ద క్రిస్మస్ పండగరోజున కూడా ప్రజల కష్టాలు ఎలా వున్నాయో చూద్దాం..

10:29 - December 25, 2016

భద్రాద్రి : క్రిస్మస్ పండుగరోజున దేశమంతా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటోంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారాంలోని ఒక కుటుంబంలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సురేష్..సరిత అనే భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆప్రాంతంలో విషయం నెలకొంది. మృతులను సురేశ్‌(33), సరిత(30), నాగచైతన్య(9), చింటు(6)గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవాలా వద్దా అనుకుంటూ గత రెండు రోజులుగా మధనపడుతూ..సురేషు..సరిత మధనపడుతూ రెండు రోజులను రెండు యుగాల్లా గడిపారు. చివరకు వేరే దారిలేక..అప్పులు తీర్చలేక..తీర్చేందుకు దారిలేక ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. కూల్ డ్రింక్ లో పురుగులమందు కలిపి పిల్లలకు బలవంతంగా తాగించారు. తరువాత వారుకూడా తాగారు. దీంతో కుటుంబం అంతా మృతి చెందారు. తాము మృతి చెందిన తరువాత పిల్ల భవిష్యత్తు ఎలా వుంటుందోనని భయపడి వారు ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కానీ నవమాసాలూ మోసి కని పెంచిన వారు చిన్నారులను చంపేందుకు కూల్ డ్రింక్ తాగిస్తున్న సమయంలో వారి మానసికంగా వారు ఎంతగా అల్లాడిపోయి వుంటారో తలచుకుంటేనే గుండెలు పిండేసేలా వుంది కదూ.. కానీ బ్రతకటానికి కంటే చావటానికి కూడా చాలా ధైర్యం కావాలి కదూ..

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న బాబు..

గుంటూరు : దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని పెదకాకాని బైబిల్ మిషన్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. 

09:58 - December 25, 2016

కరీంనగర్ : గోదావరిఖనిలో సింగరేణి సంస్థ జీఎం కార్యాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. గోదావరిఖని సమీపంలోని జనగామ గ్రామ పరిసరాల్లో బొగ్గు తవ్వకాల కోసం ఇటీవల సంస్థ తవ్వకాలు చేపట్టింది. ఈ క్రమంలో గ్రామాన్ని తరలించి ఉపాధి కల్పించాలని వేడుకున్నప్పటికి సంస్థ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఊరుకునేదిలేదని అధికారులతో గొడవకు దిగారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

09:51 - December 25, 2016

అనంతపురం : భాళాపురమం గ్రామంలో యువతి నాగమల్లీశ్వరి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కిడ్నాప్ జరిగినప్పుడు... పోలీసులు కేసు నమోదు చేసుకోకపోవడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సురేష్‌ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పెద్దమనుషుల పంచాయితీలో తేల్చుకోవాలని చెప్పడంతో మనస్తాపం చెందిందంటున్నారు. ఆ బాధతోనే కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పొగమంచుతో పలు రైళ్లు రద్దు..

ఢిల్లీ :దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. కనుచూపు మేరలో పరిసరాల్లో ఏమి అగుపించకుండా ఉంది. వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా 8 అంతర్జాతీయ విమానాలు, 7 దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా పలు రైళ్లు రద్దు అవగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

09:36 - December 25, 2016

ఢిల్లీ :దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. కనుచూపు మేరలో పరిసరాల్లో ఏమి అగుపించకుండా ఉంది. వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా 8 రైళ్ళను అధికారులు రద్దు చేయగా మరో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 8 అంతర్జాతీయ విమానాలు, మరో 15 దేశీయ విమానాలు ఆసల్యంగా నడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో పొగమంచు కారణంగా ప్రజలు పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు.బైటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పలు వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

09:28 - December 25, 2016

విజయవాడ: నగరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పండుగ ఒక మతానికి మాత్రమే సంబంధించిన పండుగ కాదనీ..మానవాళికి సంబంధించిన పండుగ అని ఫాదర్ తెలిపారు. మానవులకోసం సాక్షాత్తు దేవుడే మనిషి పుట్టాడని ఆయన తెలిపారు. నగరంలోని ప్రధాన చర్చిలన్ని భక్తుల ప్రత్యేక ప్రార్థనలతో మార్మోగుతున్నాయి. ఒకరికి ఒకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. క్రైస్తవ సోదరులు ఈ వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటున్నారు.

విజయవాడలో గుణదలమాత చర్చిలో క్రిస్మస్ సంబరాలు
అటు విజయవాడలో గుణదలమాత చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. విజయవాడ కతోలిక పీఠం మోన్‌సిజ్ఞోర్, పుణ్యక్షేత్రం రెక్టర్ యం.చిన్నప్ప బాలయేసు స్వరూపానికి సాంబ్రాణి ధూపం వేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. గురువులు క్రిస్మస్ కేక్ కట్ చేసి భక్తులకు శుభాకాంక్షలు అందజేశారు. గుణదలమాత గాయక బృందం ఆలపించిన క్రిస్మస్ గీతాలు భక్తులను ఆలరించాయి. భక్తులు క్రొవ్వోత్తులు వెలిగించి బాలయేసు సంబంధించిన గీతాలు ఆలపించారు. ఈ వేడుకలకు జిల్లాతో పాటు, నగరంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు ఆశేష సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరుణమయుడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు మార్మోగిపోతున్నాయి.

 

09:22 - December 25, 2016

పెద్దపల్లి : ప్రజా సమస్యలపై చర్చించడంలో అసెంబ్లీ విఫలమైందని, ప్రతిపక్షాలు ప్రజల పక్షాన మాట్లాడకుండా.. వ్యక్తిగత దూషణలకు దిగితూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజలే ప్రతిపక్షాల పాత్ర పోషిస్తూ.. సమస్యలపై ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఆయన అన్నారు.

69వ రోజు వరకు 1800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంతో పల్లెపల్లెను పలకరిస్తూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 69వ రోజు పూర్తి చేసుకుంది. 69వ రోజు పెద్దపల్లి జిల్లా నిట్టూరులో ప్రారంభమైన పాదయాత్ర.. వెంకట్రావుపల్లి, కాచాపూర్‌, వడ్కాపూర్‌, జూలపల్లి గ్రామాల్లో పర్యటించింది. కాచాపూర్‌లో ప్రజాప్రంట్‌ వ్యవస్థాపకుడు ఆకుల భూమయ్య వర్ధంతి సభలో పాదయాత్ర బృందం పాల్గొంది.

ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్‌
ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఉందని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తీవ్రంగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజలే ప్రతిపక్షాల పాత్ర పోషిస్తూ.. ప్రభుత్వం చర్యలను ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సీఎం జీతాలను లక్షల్లో పెంచుకున్న ప్రభుత్వం.. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, మునిసిపల్‌ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని తమ్మినేని దుయ్యబట్టారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీల పరిస్థితి దయనీయంగా ఉంది : నేతం రాజు
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, కనీస వసతలు లేక ఆదివాసీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గిరిజన సంఘం నేత నైతం రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ కు తమ్మినేని మరో లేఖ 
పెద్దపల్లి జిల్లా సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. బసంత్‌నగర్‌, రాగినేడు భూముల సమస్యలతో పాటు రైస్‌ మిల్లులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లేఖలో కోరారు. గోదావరిఖని ఏరియాలో సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 

09:14 - December 25, 2016

తమిళనాడు : వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచే చర్చిలు భక్తులతో కోలాహలంగా మారాయి. ప్రఖ్యాతిగాంచిన వేలాంగిణి చర్చిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రైస్తవులు వేలాదిగా సామూహిక ప్రార్ధనలతో క్రిస్మస్‌ను జరుపుకున్నారు. ఇక ఆసియాలోనే అతిపెద్ద ప్రఖ్యాత క్రైస్తవ ఆలయం శాంతోంలో చర్చి ప్రత్యేక ప్రార్థనలతో మారుమోగింది.

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు..
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖులు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 

09:02 - December 25, 2016
08:55 - December 25, 2016

మెదక్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నింటాయి. ఆసియాలోనే రెండవ అతిపెద్ద సుప్రసిద్ధ మెదక్ చర్చ్‌లో తెల్లవారుజామునే ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ప్రభువు దయతో ప్రపంచం శాంతియుతంగా ఉండాలని బిషప్ రెవండ్ సల్మాన్‌రాజు అన్నారు. భక్తుల రాకతో చర్చి ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.

మెదక్ చర్చిలో క్రిస్మస్ శోభ
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది మెదక్‌ చర్చి. ఇది మన రెండు తెలుగురాష్ట్రాలకి తలమానికమని చెప్పవచ్చు. ఇది ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా కూడా పేరొందింది. ప్రేమ, శాంతి, మత సామరస్యానికి ప్రతీకగా ఈ చర్చి నిలిచింది. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు జాతర జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల నుంచి ఈ చర్చిని సందర్శించడానికి వస్తున్నారు. చరిత్రాత్మక విశిష్టత కలిగిన ఈ చర్చి క్రిస్మస్‌ పండగ సందర్భంగా కొత్త శోభను సంతరించుకుంది.

08:37 - December 25, 2016

గుంటూరు : తెలుగుదేశంలో మహిళలకే రక్షణ లేనప్పుడు రాష్ర్టంలోని మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. కాగా మంత్రి రావెల, గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌ జానీమూన్‌ల మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్‌ నడుస్తోంది. గతేడాది నుంచి అభివృద్ధి పనులకు మంత్రి రావెల తనకు సహకరించడం లేదని జానీమూన్‌ ఆరోపించారు. తమకు రాజకీయ జీవితం లేకుండా చేస్తానని రావెల హెచ్చరించారని ఆరోపించారు. గతంలో రావెల అనుచరులు కొందరు తమ ఇంటికి వచ్చి దురుసుగా ప్రవర్తిస్తూ దాడిచేసే ప్రయత్నం చేశారని జానీమూన్‌ ఆరోపించారు. మంత్రి రావెల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని జానీమూన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. దీన్ని అలుసుగా తీసుకున్న వైసీపీ విమర్శలకు దిగింది.

08:25 - December 25, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌ సేవలకు ప్రజలు అలవాటు పడుతున్నారు. దీంతో ప్రైవేటు యాప్‌ల పంట పడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొత్త యాప్‌లను తీసుకువస్తోంది. ఏటీఎం, పేటీఎంలకు ధీటుగా సులభతర యాప్‌లను రూపొందించింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న 'ఆధార్‌ పేమెంట్‌ యాప్‌' నేటి నుంచి అందుబాటులోకి రానుంది.

నేటి నుంచి అందుబాటులోకి ఆధార్‌ పేమెంట్‌ యాప్‌
ఆన్‌లైన్‌ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెట్‌ ప్రాజెక్టు ఆధార్‌ పేమెంట్‌ యాప్‌ను నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఇక నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషిన్ల అవసరం అమాంతం తగ్గిపోనుంది. ఒక్కసారి ఈ యాప్‌ ప్రారంభం అయిన తర్వాత ఆన్‌లైన్‌ పేమెంట్లకు ఛార్జీలు వసూల్‌ చేసే మాస్టర్‌ కార్డు, వీసా కార్డులాంటి సంస్ధలకు ఇక కోలుకోలేని దెబ్బ పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

21 బ్యాంకులకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనుమతులు
స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఎలాంటి చెల్లింపులనైనా క్షణాల్లో చేసే విధంగా ఆధార్‌ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌లను విడుదల చేసేందుకు 21 బ్యాంకులకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనుమతిచ్చింది. ఈ యాప్‌లను వినియోగించి ఆయా బ్యాంకుల ఖాతాదారులు ఎవరికైనా క్షణాల్లో సొమ్మును బదిలీ చేయవచ్చు. ఎవరికైతే నగదును పంపించాలనుకుంటారో వారి ఖాతా నెంబరు, మొబైల్‌ నెంబర్‌, ఆధార్‌కార్డు, వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ను యాప్‌లో నమోదు చేసి నగదు బదిలీ చేయవచ్చు. ఆ వెంటనే నగదు పంపించిన వ్యక్తి ఖాతాలోంచి నిర్ణీత మొత్తం తగ్గిపోతుంది. నగదు అందుకున్న వ్యక్తి ఖాతాలో ఆ సొమ్ము జమ అవుతుంది.

ప్రయోగాత్మకంగా వెయ్యి మంది కస్టమర్లతో 5,000 లావాదేవీలు
ప్రయోగాత్మకంగా వెయ్యి మంది కస్టమర్లతో 5,000 లావాదేవీలు నిర్వహించి వాటి సక్సెస్‌ రేటు 80 శాతం ఉన్న బ్యాంకులకు మాత్రమే యాప్‌లను విడుదల చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ నిబంధన ఉండటం వల్లనే బ్యాంకులపై తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది.

ఈ బ్యాంకుల్లో యాప్ అందుబాటులో
ఆంధ్రాబ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌, డిసిబి బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, సహకార బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, కర్ణాటక బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, విజయ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌లు యాప్‌లను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

మార్కెట్ లో బయోమెట్రిక్‌ రీడర్ల ధర రూ.2 వేలు
దీన్ని బయోమెట్రిక్ రీడర్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. అనంతరం వేలి ముద్రను బయోమెట్రిక్ రీడర్ పై ఉంచి కస్టమర్ ఆధార్ కార్డ్ నెంబర్‌ను ఎంటర్ చేసి బ్యాంక్ వివరాలను పొందుపరిచిన తర్వాత స్కానింగ్‌ కోరుతుంది. ఆ తర్వాత వినియోగదారుడు తన వేలి ముద్రను బయోమెట్రిక్ రీడర్ పై ఉంచితే లావాదేవీ పూర్తవుతుంది. ఇప్పటికే ఈ యాప్‌కు అవసరమైన బయోమెట్రిక్‌ రీడర్లు మార్కెట్ లో ఉన్నాయి. వీటి ధర రూ.2000గా ఉంది.

08:12 - December 25, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మనీలాండరింగ్‌కు అడ్డాగా మారింది. 140 కోట్ల పాత నోట్లను బంగారంగా మార్చుకున్న వైనం ఐటి దాడుల్లో వెలుగు చూసింది. 430 కిలోల బంగారాన్ని ఐటి స్వాధీనం చేసుకుంది. పెద్దనోట్ల రద్దు తర్వాత రెవెన్యూ, ఐటీ శాఖ అధికారులు ఇప్పటివరకు చేసిన దాడులన్నింటిలోకీ ఇదే అతి పెద్ద దాడి. దేశరాజధాని ఢిల్లీ, నోయిడాలలో ఐటి అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్దఎత్తున నల్లధనం వెలుగుచూసింది.

430కేజీల బంగారం పట్టివేత
శ్రీలాల్‌ మహల్‌ లిమిటెడ్‌ అనే కమొడిటీ ట్రేడింగ్‌ కంపెనీ యాజమాన్యం నివాసాలు, కార్యాలయాల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోని లక్నో విభాగానికి చెందిన అధికారులు ఏకకాలంలోఈ దాడులు నిర్వహించారు. డీఆర్‌ఐ జరిపిన దాడుల్లో సుమారు 430కేజీల బంగారం పట్టుబడింది. ఈ కంపెనీ 140 కోట్ల నల్లధనాన్ని 430 కేజీల బంగారంలోకి మార్చింది.

రెండు రోజులుగా ఢిల్లీ, నొయిడా ప్రాంతాల్లో ఐటి దాడులు
ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు గత రెండు రోజులుగా ఢిల్లీ, నొయిడా ప్రాంతాల్లో ఐటి దాడులు జరిపింది. ఈ దాడుల్లో బంగారంతో పాటు 2.60కోట్ల విలువైన పాతనోట్లు, 12 లక్షల విలువైన కొత్త నోట్లను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాక సుమారు 80కేజీల వెండి, మరో 15 కేజీల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

రద్దయిన పాతనోట్లతో భారీగా బంగారం కొనుగోలు
పెద్దనోట్ల రద్దు తర్వాత పెద్దఎత్తున వారి కార్యాలయాల నుంచి ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రద్దయిన పాతనోట్లతో భారీగా బంగారం కొనుగోలు చేశారు. ఈ మొత్తంతోనే బంగారు నాణేలు లేదా కడ్డీలను ప్రభుత్వం రంగ సంస్థ అయిన మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేశారు. ఈ బంగారాన్ని ఆ సంస్థ ప్రతినిధులు బహిరంగ మార్కెట్లో అమ్మకానికి సిద్ధం చేశారని, అదికూడా పాతనోట్లలో ఎక్కువ విలువకు అమ్ముతున్నారని తెలిపారు. అధికారులు సంస్థ డైరెక్టర్లను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా అనారోగ్య కారణాలు చూపి తప్పించుకుంటున్నట్లు సమాచారం.

లక్నోలో 11 చోట్ల నిర్వహించిన దాడుల్లో 12 కోట్ల ఆస్తులు
బులియన్‌ ట్రేడర్స్‌ స్థావరాలపై ఐటి దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరులో 47.74 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా, అలహాబాదులో కోటి 6 లక్షల విలువ చేసే బంగారం, వెండి...20 లక్షల నగదు జప్తు చేశారు. ఢిల్లీలోని కోటక్‌ మహీంద్రా బ్యాంకు 39 కోట్లు డిడి ద్వారా ఓ ఏజెంట్‌ మార్చే యత్నం చేస్తుండగా అధికారులు జప్తు చేశారు. లక్నోలో 11 చోట్ల నిర్వహించిన దాడుల్లో 12 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి.

08:03 - December 25, 2016

నల్లగొండ : రైతన్న పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి నిర్మూలన ఏమోగానీ రైతులు, కార్మికులు, ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, సన్నకారు రైతులే కాదు. మధ్య తరగతి రైతులు, వాణిజ్య పంటలు సాగు చేస్తున్న వారు కూడా నోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటలు సాగు చేసి తీరా కాపు అందే సమయానికి కేంద్రం ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాలపై నిర్ణయం తీవ్ర ప్రభావం
నల్లధనం వెలికి తీసేందుకు అంటూ కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు బ్యాంకులో ఉన్న డబ్బుల కోసమో.. ఇంట్లో ఉన్న కాస్తో కూస్తో నగదు మార్పిడికో.. నానాయాతన పడుతున్నారు. దీంతో వేలాది మంది ఉపాధి కొల్పొయి రోడ్డున పడ్డారు.

వ్యవసాయ రంగంపై నోట్ల రద్దు ప్రభావం
ఇతర రంగాలు ఎలా ఉన్నా.. వ్యవసాయ రంగంపై నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యాసంగీ సిజన్ ప్రారంభమవుతుండడంతో సాగుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్న అన్నదాతలు చేతిలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలకు చెల్లించడానికి, పెట్టుబడుల కోసం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రోజుకు అరకొర నగదు మాత్రమే ఇస్తుండడంతో పనులు మానుకొని రోజుల తరబడి బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. అయితే చిన్న, సన్నకారు రైతులు మాత్రమే కాదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వాణిజ్య పంటలు సాగుచేస్తున్న ఆసామీ రైతులు కూడా నోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోతున్నారు.

తిప్పర్తి సమీపంలో పడిపోయిన పంట సాగు
నల్లగొండ జిల్లా తిప్పర్తి సమీపంలో తోటల సాగు పడిపోయింది. రెండేళ్ల నుంచి అక్కడి రైతులు దానిమ్మ తోటలు సాగుచేస్తున్నారు. సరిగ్గా నవంబర్ చివరలో తోట కాపుకు వచ్చింది. తొలి సారే కాపు ఏపుగా ఉండడంతో పాటు.. కాయలు లావుగా రావడంతో తమ కష్టార్జితం అంతా తీరినట్టేనని ఆసామీలు భావించారు. కానీ నోట్ల రద్దు వారి ఆశలను అడియాసలు చేసింది.

నోట్ల రద్దు ప్రకటన తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేరు : రైతు
నోట్ల రద్దు ప్రకటన తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారని.. దీంతో నెలపాటు కాయలను కోయకుండా ఆపాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు, చెన్నయ్ లాంటి ప్రాంతాల్లోని అన్నీ మార్కెట్లను సంప్రదించామని.. కానీ ఎక్కడా వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రాలేదన్నారు. నెలపాటు కూలీలకు అదనంగా వేతనాలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. మరో వైపు నెలరోజుల తర్వాత ధర తగ్గిపోయిందని.. దీంతో రెండువైపులా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులు నోట్లరద్దుతో లక్షల్లో నష్టం
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటనతో చిన్న, సన్నకారు రైతులు బ్యాంకుల వద్ద కూలీలకు చెల్లించే డబ్బుల కోసం రోజల తరబడి క్యూ లైన్లలో నిలబడుతుండగా.. వాణిజ్య పంటలు వేసుకున్న ఆసామీ రైతులు దిగుబడి ఉన్నా.. కొనుగోలు దారులు రాక నష్టపోతున్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా.. వాణిజ్య పంటలతో లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు నోట్లరద్దుతో లక్షల్లోనే నష్టపోతున్నారు.

 

దిగి వచ్చిన ఎమ్మెల్యే వర్మ..

తూర్పుగోదావరి : కాకినాడ జీజీహెచ్ లో హైడ్రామ చోటుచేసుకుంది. జూనియర్ డాక్టర్లపై పిఠాపురం ఎమ్మెల్యే వర్మ నోరు పారేసుకోవటం..వారు ఆందోళనచేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎట్టకేలకూ దిగి వచ్చిన వర్మ డాక్టర్లపై తన ప్రవర్తనకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. జీజీహెచ్ కు వచ్చిన ఎమ్మెల్యే వర్మ డాక్టర్లతో తాను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ తెలిపారు. కానీ శాంతించని జూనియర్ డాక్టర్లు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పట్టుపట్టారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని నచ్చచెప్పటంతో డాక్టర్లు శాంతించారు. దీంతో వివాదానికి తెరపడింది. 

07:54 - December 25, 2016

తూర్పుగోదావరి : కాకినాడ జీజీహెచ్ లో హైడ్రామ చోటుచేసుకుంది. జూనియర్ డాక్టర్ల ఆందోళనతో పిఠాపురం ఎమ్మెల్యే వర్మ దిగివచ్చారు. ఎట్టకేలకూ డాక్టర్లకు వివరణ ఇచ్చుకున్నారు. డాక్టర్లపై తన ప్రవర్తనకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. జీజీహెచ్ కు వచ్చిన ఎమ్మెల్యే వర్మ డాక్టర్లతో తాను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ తెలిపారు. కానీ శాంతించని జూనియర్ డాక్టర్లు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పట్టుపట్టారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని నచ్చచెప్పటంతో డాక్టర్లు శాంతించారు. దీంతో వివాదానికి తెరపడింది. పేషెంట్లకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్ధేశ్యంతోనే అలా ప్రవర్తించానని వర్మ వివరణ ఇచ్చారు. కాగా సీఎం చంద్రబాబు గట్టిగా క్లాస్ తీసుకోవటంతోనే ఎమ్మెల్యే దిగివచ్చి వివరణ ఇచ్చుకున్నట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ నేపథ్యం..
పిఠాపురం మండ‌లం రాయ‌వ‌రం గ్రామంలో ఒక ఎల‌క్ట్రిక‌ల్ వ‌ర్కర్ ప్రమాదానికి గురికావ‌డంతో తీవ్ర గాయాలపాల‌య్యాడు. దీంతో బాధితుడిని కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి తీసుకెళ్లారు. అయితే... ఆస్పత్రిలో బాధితుడికి త‌గిన వైద్యస‌హాయం అందించ‌డంలేద‌ని బాధితుని బంధువులు పిఠాపురం ఎమ్మెల్యే వ‌ర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంట‌నే ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మెల్యే వ‌ర్మ... విష‌యం కూడా తెలుసుకోకుండా... నోటికి ప‌నిచెప్పడంతో ఇప్పుడు వైద్యసిబ్బంది ఆందోళకు దిగారు. తీవ్రస్థాయిలో దుర్భాష‌లాడుతూ, ఓ జూనియ‌ర్ డాక్టర్ మొబైల్ విసిరికొట్టడంతో వైద్య సిబ్బంది నిరసన తెలియజేస్తూ విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. 

07:38 - December 25, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ సంస్థాగత కమిటీల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత కమిటీలను నియమించేందుకు అధినేత కేసీఆర్‌ దృష్టి పెట్టినట్లు సమాచారం. కీలకమైన పొలిట్ బ్యూరో సహా రాష్ట్ర, జిల్లా కమిటీలను త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి.

కొత్త కమిటీలపై ప్రత్యేక దృష్టిసారించిన అధినేత
తెలంగాణలో అధికార పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్‌కు కొత్త కార్యవర్గాలు ఇప్పటికీ లేవు. పాత జిల్లా కేంద్రాలుగానే జిల్లా అధ్యక్షులతో కమిటీలను నియమించిన పార్టీ అధినేత... కొత్తగా జిల్లాలు ఏర్పాటు కావడంతో కొత్త కమిటీలపై స్పెషల్‌ ఫోకస్‌ చేశారు. 2015లో చేపట్టిన సభ్యత్వ నమోదు అనంతరం జిల్లా అధ్యక్షుల ఎన్నిక, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నికను పార్టీ పూర్తి చేయించింది. దాదాపు రెండేళ్లుగా వాయిదా పడుతున్న కమిటీల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు ఇటీవల కేసీఆర్‌ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. గతంలో 12మంది జిల్లా అధ్యక్షులుగా ఉన్న కమిటీలు కొత్త జిల్లాల ఏర్పాటుతో 31 జిల్లా కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కమిటీతో పాటు అనుబంధ సంఘాల నియమాకంపై కూడా పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే జాబితాలను సిద్ధం చేసి ముఖ్యమంత్రి ముందుంచారు.

రాష్ర్ట కార్యవర్గంలో అన్ని జిల్లాల నేతలకు అవకాశం
రాష్ట్ర కార్యవర్గం విషయానికి వస్తే అన్ని జిల్లాల నేతలకు ప్రాతినిథ్యం దక్కే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర కమిటీ జంబో కమిటీగా ఏర్పాటు అవుతుందని పార్టీ నేతలు అంటున్నారు. జిల్లా కమిటీల విషయానికి వస్తే రిజర్వేషన్ల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నియామకం చేయాలనే అభిప్రాయంతో అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. అన్ని కమిటీల్లో సుమారు 50 శాతం వరకు BC, SC, ST, మైనార్టీలకు చోటు కల్పించే విధంగా కమిటీల రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహిళా కమిటీతో పాటు వీలైన చోట్ల జనరల్ కమిటీల్లో కూడా మహిళలకు సముచిత స్థానం ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. కమిటీలకు సంబంధించిన తుది జాబితాలను కీలక నేతలు సిద్ధం చేసి కేసీఆర్‌ ముందుంచినట్లు సమాచారం. పొలిట్‌బ్యూరో మాత్రం ఈ విడత తక్కువ మంది నేతలకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరికొన్ని రోజుల్లో చేపట్టే సభ్యత్వ నమోదు నాటికే కమిటీల ఎంపికను ప్రకటించి సంస్థాగతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని గులాబీ దళపతి భావిస్తున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. 

07:36 - December 25, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఒక సంచలనమని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రం ఓ గొప్ప నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం -2016 ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.. నోట్ల రద్దు వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు... అయితే ఈ సమస్యలు త్వరలోనే తీరుతాయన్నారు. చట్టం ఉన్నవాళ్ల చుట్టం కాదని.. ప్రజలను, అమాయకులను మోసం చేయకుండా చూసే బాధ్యత సివిల్ సప్లయ్ డిపార్టుమెంటుపై ఉందని ఈటల పేర్కొన్నారు. 

07:33 - December 25, 2016

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరో వారం రోజులపాటు పొడిగించారు. ఇప్పటికే ఆరు లక్షల మంది సభ్యులు సభ్యత్వం తీసుకోగా.. గడువు పెంపుతో మరో 2 లక్షల మంది సభ్యత్వం తీసుకుంటారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. భారీ స్థాయిలో సభ్యత్వాలు చేపట్టి.. తెలంగాణలో టీడీపీ లేదన్న అధికార పార్టీ ఆరోపణలకు చెక్‌ పెట్టాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

నవంబర్‌ 1 నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు
తెలంగాణలో బలం పెంచుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. నవంబర్‌ 1 నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భారీ ఎత్తున సభ్యత్వాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ముందు చేదు అనుభవమే ఎదురైంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన 20 రోజుల వరకు.. చాలా నియోజకవర్గాల్లో ఎలాంటి సభ్యత్వాలు నమోదు కాలేదు. అనంతరం మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా టీడీపీ సభ్యత్వ నమోదుపై పడింది. దీంతో ఆ కార్యక్రమం నత్తనడకన కొనసాగుతోంది.

ఆషామాషీగా తీసుకోవద్దన్న చంద్రబాబు
ఇక ఇటీవల జరిగిన తెలంగాణ టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశంలో.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని చంద్రబాబు నేతలను హెచ్చరించారు. పనితీరును బట్టే, భవిష్యత్తులో పదవులు, టికెట్ల కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. దీంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకుంది. నిన్నటివరకు 6 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నట్లు తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్‌ పెద్దిరెడ్డి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తగ్గిన సభ్యత్వాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయని.. దీంతో మరో వారం రోజులపాటు సభ్యత్వ నమోదు గడువు పొడిగించినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగైందని టీఆర్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సభ్యత్వ నమోదుతో సమాధానం చెబుతామంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే శక్తి ఒక్క టీడీపీకే ఉందన్నారు పెద్దిరెడ్డి.

టీడీపీ సభ్యత్వాలకు గడువు పెంపు
మరోవారం రోజులు పెంచిన గడువుతో తెలంగాణలో టీడీపీ సభ్యత్వాలు మరో రెండు లక్షలు పెరిగే అవకాశాలున్నట్లు నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలను బలోపేతం చేసేందుకు టీ-టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. 

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు..

ఢిల్లీ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖులు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌, ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌, వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు..

హైదరాబాద్ : క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా చర్చిలు విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

07:27 - December 25, 2016

హైదరాబాద్ : మాజీ సైనికులు, వారి కుటుంబ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా మెరుగైన చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని.. మరికొన్నింటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేసీఆర్‌
మాజీ సైనికోద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కేసీఆర్‌.. మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న మాజీ సైనికులకు డబుల్‌ పెన్షన్‌ ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. పెన్షన్‌ పొందుతున్న ఉద్యోగి మరణిస్తే.. ఆ పెన్షన్‌ను అతడి భార్యకు కూడా వర్తింపజేయాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెన్షన్‌ను ప్రతి నెలా ఇతర ఉద్యోగులతో పాటు.. విధిగా చెల్లించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైనిక సంక్షేమ బోర్డుల బలోపేతం
ఇక యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాల మాదిరిగానే.. సర్వీసులో ఉండి అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలలో మరణించిన కుటుంబాలకు కూడా సదుపాయాలు, పరిహారం చెల్లించాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేయడంతో పాటు.. కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లోనూ సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సైనిక సంక్షేమ కార్యలయాల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యుద్ధంలో మరణించిన సైనికులకు ఇచ్చే పరిహారం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండే విధంగా ప్రత్యేక విధానం రూపొందించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

సైనికుల ఇళ్లకు ఆస్తిపన్ను మినహాయింపు
ఇవేకాక సైనికుల సంక్షేమం కోసం కేసీఆర్‌ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తిపన్ను మినహాయింపు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకంలో రెండు శాతం కేటాయించాలని నిర్ణయించారు. అలాగే.. సైనికుల సొంత వాహనాలకు తెలంగాణ రాష్ట్రంలో తిరిగి లైఫ్‌ ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇదిలావుంటే వీర సైనికులకు ఇచ్చే పెన్షన్‌ను 6 వేలకు పెంచినందుకు కేసీఆర్‌కు మాజీ సైనికోద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

 

07:25 - December 25, 2016

హైదరాబాద్ : క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా చర్చిలు విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

అర్థరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు
క్రిస్మస్‌ సందడి అంబరాన్ని అంటుతోంది. క్రైస్తవ దేవాలయాలు విద్యుత్‌ దీపాల కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. చర్చిలను అందంగా అలకరించారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అర్థరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోకంలో అవతరించిన సంతోషాన్ని ఆనందోత్సాహాల మధ్య క్రైస్తవ సోదరులు పంచుకుంటున్నారు. క్రిస్మస్ కేక్‌లను కట్ చేసి అందరికీ పంచి పెట్టి హ్యాపీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలను తెలుపుకుంటున్నారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖులు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌, ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌, వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

మెదక్ చర్చిలో క్రిస్మస్ శోభ
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది మెదక్‌ చర్చి. ఇది మన రెండు తెలుగురాష్ట్రాలకి తలమానికమని చెప్పవచ్చు. ఇది ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా కూడా పేరొందింది. ప్రేమ, శాంతి, మత సామరస్యానికి ప్రతీకగా ఈ చర్చి నిలిచింది. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు జాతర జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల నుంచి ఈ చర్చిని సందర్శించడానికి వస్తున్నారు. చరిత్రాత్మక విశిష్టత కలిగిన ఈ చర్చి క్రిస్మస్‌ పండగ సందర్భంగా కొత్త శోభను సంతరించుకుంది.

విజయవాడలో గుణదలమాత చర్చిలో క్రిస్మస్ సంబరాలు
అటు విజయవాడలో గుణదలమాత చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. విజయవాడ కతోలిక పీఠం మోన్‌సిజ్ఞోర్, పుణ్యక్షేత్రం రెక్టర్ యం.చిన్నప్ప బాలయేసు స్వరూపానికి సాంబ్రాణి ధూపం వేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. గురువులు క్రిస్మస్ కేక్ కట్ చేసి భక్తులకు శుభాకాంక్షలు అందజేశారు. గుణదలమాత గాయక బృందం ఆలపించిన క్రిస్మస్ గీతాలు భక్తులను ఆలరించాయి. భక్తులు క్రొవ్వోత్తులు వెలిగించి బాలయేసు సంబంధించిన గీతాలు ఆలపించారు. ఈ వేడుకలకు జిల్లాతో పాటు, నగరంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు ఆశేష సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరుణమయుడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు మార్మోగిపోతున్నాయి.

Don't Miss