Activities calendar

21 December 2016

టీఅసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకముందు వ్యవసాయ రంగంపై సభలో సుధీర్ఘంగా చర్చ జరిగింది.

 

21:59 - December 21, 2016
21:58 - December 21, 2016
21:57 - December 21, 2016
21:56 - December 21, 2016
21:54 - December 21, 2016

మహారాష్ట్ర : గోండియాలోని ఓ హోటల్‌లో  ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. తెల్లవారుజామున మూడున్నరకు హోటల్‌ కింది అంతస్తులో ఉన్న ఓ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే హోటల్‌లోని అన్ని అంతస్థులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటన జరిగిన సమయంలో హోటల్‌లో 15 మంది అతిథులున్నారు. ప్రాణాలు దక్కించుకునేందుకు ఓ వ్యక్తి హోటల్‌ రెండో అంతస్తు నుంచి కిందికి దూకాడు. తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ వ్యక్తి మృతి చెందాడు. శవాలు పూర్తిగా కాలిపోవడంతో మృతులను గుర్తించలేకపోతున్నామని పోలీసులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. 

 

21:53 - December 21, 2016

ఢిల్లీ : మర్సెడీజ్‌ కారులో కూర్చున్న యువతిని దారుణంగా కాల్చి చంపిన ఘటన  ఢిల్లీలో చోటుచేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక నజఫ్ గఢ్‌కు చెందిన పదిహేడేళ్ల యువతి తన ఇద్దరు స్నేహితులైన శుభమ్‌, అతడి స్నేహితుడు యోగేష్‌తో కలిసి షాపింగ్ చేసేందుకు బయటకు వెళ్లింది. షాపింగ్‌కు వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె తల్లి త్వరగా రావాలని ఫోన్‌ చేసింది. ఇంతలోనే షాపింగ్ ముగించుకుని ఆ యువతిని ఇంటివద్ద డ్రాప్‌ చేసేందుకు బాయ్‌ ఫ్రెండ్స్‌ తమ మెర్సిడేజ్ కారులో బయలు దేరారు. యువతి ఇంటి సమీపానికి చేరుకోగానే టాయ్‌లెట్‌ వెళ్లేందుకని యోగేష్‌ కారు దిగాడు. యోగేష్‌ కారులోనే ఉంచిన పిస్టల్‌ తీసుకుని శుభమ్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. తల్లి చూస్తుండగానే కూతుర్ని ఆమె స్నేహితుడే తుపాకీతో కాల్చి హత్యచేశాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శుభం కోసం గాలిస్తున్నారు.

 

21:50 - December 21, 2016

హైదరాబాద్ : కూకట్‌పల్లి శుభోదయ కాలనీలో స్కూల్‌ బిల్డింగ్‌పై నుంచి పడి ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. రాఘవ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న మోనా అనే విద్యార్థిని స్కూల్‌ భవనం మూడవ అంతస్తు నుంచి కిందపడింది. అది గమనించిన స్థానికులు బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం లేదంటూ స్థానికులు స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై దాడి చేసి.. ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. పాఠశాల మూడో అంతస్తులో బాలిక షూ విడిచి ఉండటం.. అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థిని ప్రమాదవశాత్తు పడిందా.. లేక ఆత్మహత్యాయత్నం చేసిందా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బాలిక తల్లిదండ్రులు శివ, సోని తమకు చిన్నారి పడిపోయిన విషయాన్ని యాజమాన్యం ఆలస్యంగా తెలిపిందని ఆరోపించారు.

 

21:48 - December 21, 2016

ఢిల్లీ : కేంద్ర సాహిత్య అకాడమీ 2016 సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించింది. సాహిత్య రంగంలో విశేషకృషి చేసిన రచయితలు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 24 భాషల్లో ఎనిమిది కవితా సంకలానాలు , ఏడు చిన్న కథల సంపుటలు, ఐదు నవలలు, రెండు విమర్శనాత్మక రచనలు, ఒక నాటికకు అవార్డులు ప్రకటించింది. తెలుగులో రజనీగంధ కవితా సంకలనానికి పాపినేని శివశంకర్ కు సాహిత్య అకాడమీ అవార్డు లభించనుంది. డాక్టర్ శివశంకర్ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నెక్కల్లు గ్రామంలో జన్మించారు. తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవిగా పేరున్న శివశంకర్... మట్టిగుండె, సగం తెరిచిన తలుపులు వంటి కథా సంపుటాలు, 350 దాకా కవితలు, 55 చిన్న కధలు, 220వ్యాసాలు రచించారు. గుంటూరులోని తాడికొండ మండలంలోని బి.ఎస్.ఎస్.బి.కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి 2011 నవంబరులో పదవీ విరమణ పొందారు. 2017 ఫిబ్రవరి 22న కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ సాహిత్య అకాడమీ అవార్డులను రచయితలకు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద లక్ష రూపాయల నగదు , తామ్రపత్రం అందజేస్తారు. గతేడాది సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగిచ్చినా తాము స్వీకరించే నిబంధనే లేదని సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. 

 

21:45 - December 21, 2016

గుంటూరు : నోట్ల రద్దు మరో ప్రాణాన్ని బలితీసుకుంది. గుంటూరు జిల్లా గణపవరంలో నగదు కోసం ఎస్ బిఐ బ్యాంక్ వద్ద క్యూలైన్లో నిల్చున్న వృద్ధుడు కొండ్రుపాటి కోటేశ్వరరావు సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు.  మృతుడు రైస్ మిల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. జీతం తీసుకునేందుకు ఉదయం నుంచి బ్యాంకు వద్ద క్యూలైన్‌లో నిలబడి స్పృహ కోల్పోయి మృతిచెందాడని బంధువులు తెలిపారు.  

 

21:43 - December 21, 2016

హైదరాబాద్ : నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపే అవకాశం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రైతులు సొసైటీగా ముందుకొస్తే.. వారికి ఫ్యాక్టరీని అప్పగించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. చక్కర ఫ్యాక్టరీలను సొసైటీలు నడిపితేనే నిలకడగా ఉంటాయన్నారు. దేశంలోనే అత్యధికంగా రుణమాఫీ చేసిన ఘనత తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగంపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడిగా సాగిన చర్చ సందర్భంగా సీఎం ఈ విషయాలు వెల్లడించారు. 
ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు 
తెలంగాణ అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై జరిగిన సుదీర్ఘంగా చర్చలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. సాగు విషయంలో రాష్ర్టంలో అన్నదాతలు పడుతున్న బాధలను సభ దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలపై మంత్రులు సమాధానాలు ఇచ్చారు. రైతుల రుణమాఫీని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే రైతుల వడ్డీలను కూడా భరిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ వచ్చాక పాత బకాయిలు 480 కోట్లు చెల్లించామన్నారు. కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వంపై అనవసరంగా నిందలు వేయడం సరికాదన్నారు. రైతుల నుంచి బ్యాంకర్లు ఎవరైనా వడ్డీ వసూలు చేసి ఉంటే దాన్ని కూడా చెల్లిస్తామన్నారు.
నిజాం షుగర్‌ ఫ్యాక్టరీపైనా చాలాసేపు చర్చ
నిజాం షుగర్‌ ఫ్యాక్టరీపైనా సభలో చాలాసేపు చర్చ సాగింది. షుగర్‌ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం రావాలంటే 10లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు అవసరమని, చెరకును పండించటం రైతులకు ఆసక్తి లేని సమయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు కేసీఆర్‌. నిజాం షుగర్‌ పరిశ్రమ తెరిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసిందని వివరించారు. నిజాం ఫ్యాక్టరీని టేకోవర్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 10ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నిజాం షుగర్స్‌ను తెరిపించలేక పోయిందన్నారు. చక్కర ఫ్యాక్టరీలను సొసైటీలు నడిపితే నిలకడగా ఉంటాయన్నారు. ప్రభుత్వమే స్వయంగా నడిపే అవకాశం లేదని స్పష్టం చేశారు. 
రూ.16,500 కోట్లు రైతు రుణాలు మాఫీ : సీఎం కేసీఆర్ 
దేశంలోనే అత్యధికంగా రుణమాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మొత్తం 16,500 కోట్లు రైతు రుణాలను మాఫీ చేశామన్నారు. ఇప్పటికి 75 శాతం రుణమాఫీ అయిందని, మిగతా 25 శాతం వచ్చే బడ్జెట్‌లో చేస్తామన్నారు.  నాడు వ్యవసాయం దండగ అన్న చోటే ఇవాళ పండుగ చేసి చూపిస్తున్నామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వన్‌టైం రుణమాఫీ గురించి ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. మొత్తంగా వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ సాగింది. 

 

21:39 - December 21, 2016

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదిపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోది...సహారా, బిర్లా గ్రూపుల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మోది సొంత రాష్ట్రం గుజరాత్‌లోని మహసాణాలో జరిగిన సభలో రాహుల్‌ ఈ ఆరోపణలు చేశారు. అక్టోబర్‌ 2013 ఫిబ్రవరి 2014 మధ్య 9 వాయిదాలలో సహారా గ్రూపు 40 కోట్లు మోదికి ఇచ్చినట్లు ఐటీ రికార్డుల్లో ఆధారాలున్నాయని రాహుల్‌ తెలిపారు. అదే సమయంలో బిర్లా గ్రూపు మోదికి 12 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటివరకు దీనిపై విచారణ జరగలేదని రాహుల్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాహుల్‌ ఆరోపణలను బిజెపి తిప్పికొట్టింది. నరేంద్రమోది పవిత్ర గంగానది లాంటివారని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

 

21:37 - December 21, 2016

ప్రైవేటుకు ద్వారాలు తెరిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారా? యూనివర్సిటీలపై నిర్లక్ష్యం చూపుతున్నారా? బాధ్యతలను వదుల్పుకోవాలని ఆరాటపడుతున్నారా? ప్రైవేట్ యూనివర్సిటీలెందుకు? యూనివర్సిటీల్లో సదుపాయాలు లేక నానా ఇబ్బందులు, సిబ్బంది లేక అంతంతమాత్రంగా మారిన విద్యా బోధన, తూతూ మంత్రంగా సాగుతున్న పరిశోధనలు, తెలంగాణలో ప్రయివేట్ యూనివర్సిటీల ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ప్రయివేట్ యూనివర్సిటీలకు ఆమోధం 
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, యూనివర్సీటీలన సామాన్యులకు అందకుండా మార్చేస్తున్నారా..? రిలయన్స్ విద్యా సంస్థలతో ఏ జరుగబోతుంది? ... ఇదే అంశంపై ఇవాళ్లి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

21:10 - December 21, 2016

పండుగపాటలు పాడుతున్న ప్రభుత్వాలు... ఏ పబ్బానికి ఆ ఏశంగడుతున్న చంద్రులు, అంగన్ వాడీ కొలువులకు సర్కారు పోస్టుమార్టం..మొదటికే మోసమని అక్కల మొత్తుకోలు, ఒక్కటైతున్న బీసీ బహుజన జాతులు... ఇప్పటికైనా ఆపాల్నంట నేతల కోతలు, గుప్త నిధుల కోసం బాయిదొవ్విన దొంగలు... ఏడుగోలల బాయిల ఎక్కొస్తున్న నీటి గంగ, దరిద్రలచ్చిమిని పొలిమేర దాటిచ్చిన జనం... అసలులచ్చిమి తోటి సంతోషంగుండాలే మనం. పోరగాళ్లకు దొరికిన కొత్త నోట్ల కట్టలు.. పోలీస్ స్టేషన్ చేరిన పంపకం పంచాదీ... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

20:52 - December 21, 2016

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిర విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాట్లోనే..
'రాజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాం. యానతో చాలా సార్లు చర్చించాను. ఆ మార్పుకు రజనీకాంత్ కు సంబంధం ఉంటుందా లేదా నేను చెప్పలేను. అన్నాడీఎంకే ప్రభుత్వం సవ్యంగా నడుస్తుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా తమిళనాడులో ఎదగడానికి ప్రయత్నిస్తాం. శూన్యత ఏర్పడినప్పుడు ఎదగాలని ఏ పార్టీ అయినా అనుకుంటుంది. నోట్ల రద్దు నిర్ణయం ఫలితం ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మెడీ పాలనలో ఏమైనా తప్పిదాలుంటే విమర్శించడానికి వెనుకాడం. టీఆర్ ఎస్ కు బిజెపికి ఎలాంటి రాజకీయ అవగాహన లేదు. తెలంగాణలో మాకు ప్రధాన శత్రువు టీఆర్ఎస్సే. కేంద్రం నిధులిచ్చినంత మాత్రాన ప్రేమ ఉన్నట్లు కాదు' అని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:36 - December 21, 2016

హైదరాబాద్‌ : ఇందిరాపార్క్‌ వద్ద  చేనేత కార్మికులు ధర్నాకు దిగారు.  మగ్గాలతో ప్రదర్శన చేసి నిరసన తెలిపారు.  చేనేత రంగానికి వెయ్యికోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. టెప్కోతో పాటు చేనేత సహకర సంఘాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి.. సమగ్ర చేనేత విధానాన్ని ప్రకటించాలన్నారు.  మహిళా కార్మికులకు నెలకు వెయ్యిరూపాయల పించన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చేనేత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన  ధర్నాలో వామపక్షాల నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. 

 

20:34 - December 21, 2016

నల్గొండ : ప్రభుత్వం..ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత ఉందన్నారు. ఎన్నికల లబ్ధి కోసం ఉద్యోగుల నోటిఫికేషన్‌లను పెండింగ్‌లో పెట్టడం సరికాదని అన్నారు. 

 

20:29 - December 21, 2016

విజయవాడ : నోట్ల రద్దు నిర్ణయం ఎదురవుతున్న పర్యవసానాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం తన సలహానేనని హడావుడి చేసిన చంద్రబాబు .. ఇప్పుడేమో పరిష్కారం దొరకడం కష్టం అంటున్నారు.
భుజాలు తడుముకుంటున్న చంద్రబాబు
నోట్ల రద్దు నిర్ణయం దేశ ప్రజలందరూ ఎదురొచ్చి హారతి పట్టే నిర్ణయమవుతుందని ప్రధాని మోదీ నుంచి ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం లాంటి పార్టీలు ఊహించాయి. కానీ అనుకున్నదొకటి అయ్యిందోకటనే భావన ఏర్పడంతో నేతలూ, పక్షాలు సదురుకుంటున్నారు. ఆ వరుసలో ముందు ఉన్నారు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. మొదట ఈ నిర్ణయం భేషైనదని.. ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకోమని ప్రధానికి లేఖ రాశానని భుజాలు చరుచుకున్న చంద్రబాబు ఇప్పుడేమో భుజాలు తడుముకుంటున్నారు. కష్టాలు కొన్ని రోజులే అన్న ఆయన.. కష్టాలు తీరడం లేదు.. పరిష్కారం దొరకడం కష్టమే నంటున్నారు. 
40 రోజులైనా తగ్గని కష్టాలు  
నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదు.. దీని వల్ల 40 రోజులైనా కష్టాలు తగ్గడం లేదు.. పరిష్కారం కూడా దరిదాపుల్లో కనిపించడం లేదు.. ఎన్నో సంక్షోభాలను చూశాను.. కానీ ఇది అతిపెద్ద సంక్షోభమంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై లేఖ రాసినప్పటి నుంచి మోదీ నిర్ణయం తర్వాత చంద్రబాబు వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు 
అక్టోబర్‌ 12న ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు
అక్టోబర్‌ 12న ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు. నల్లధనం దేశ ఆర్థిక మూలాలను శాసిస్తోందని, రూ.500, 1,000 నోట్లను రద్దు చేయాలని విజ్ఞప్తి. నగదు రహిత లావాదేవీలే నల్లధనానికి మందు అని పేర్కొన్న వైనం. నవంబర్ 8 మోదీ నిర్ణయం తర్వాత బాబు ప్రెస్ మీట్. తాను డిమాండ్‌ చేయడం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్య.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై హర్షం 
పెద్ద నోట్ల రద్దు చరిత్రాత్మక నిర్ణయమంటూ హర్షం. పెద్ద నోట్ల రద్దు కోసం తాను చాలాకాలంగా పోరాడుతున్నానని వెల్లడి. 
నవంబర్‌ 28న సమీక్ష సందర్భంగా బ్యాంకర్లపై ఆగ్రహం. ఆ తర్వాత కొద్ది రోజులకు జాతీయ విపత్తంటూ వ్యాఖ్య. నోట్ల రద్దు మంచిదే కానీ అమలే సరిగ్గా కావడం లేదు. నోట్ల కష్టాలు తాత్కాలికమేనని వ్యాఖ్య. పెద్ద నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదు. దీనివల్ల కనుచూపు మేరలో పరిష్కారం కన్పించని ఎన్నో సమస్యలు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందంటూ బాబు వ్యాఖ్య.
చంద్రబాబు నిర్వేదం 
హుదూద్‌ తుపాను వల్ల విశాఖకు తీవ్ర నష్టం జరిగితే ఎనిమిది రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేశా... ఆగస్టు సంక్షోభాన్ని సమర్థంగా అధిగమించాను... నోట్ల రద్దు వల్ల కలుగుతున్న కష్టాలను మాత్రం అధిగమించలేకపోతున్నానని చంద్రబాబు నిర్వేదం వ్యక్తం చేశారు. రోజుకు రెండు మూడు గంటలు బ్యాంకర్లతో సమీక్షలు జరుపుతున్నా ఉపయోగం ఉండటం లేదు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది. డిసెంబర్‌లో వృద్ధులు, వితంతువులకు పింఛన్లు అందజేయలేకపోయానని బాబు తాజాగా వ్యాఖ్యానించారు.  ఎంతోమంది వృద్ధులు నోట్ల మార్పిడి సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదిఏమైనా  పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై సీఎం చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారు. నోట్ల రద్దుపై ప్రజల్లో ఏర్పడుతున్న వ్యతిరేకతకు అనుగుణంగా చంద్రబాబు కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు.     

 

20:21 - December 21, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో వ్యవసాయరంగంపై వాడీ వేడీ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాలు వాదోపవాదాలు చేసుకున్నాయి.
దేశంలోనే 16వేల 500 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వ ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు సీఎం కేసీఆర్‌. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కేంద్రం నుంచి రుణమాఫీ డబ్బులు రావడంలో ఆలస్యం కావడం వల్లే సకాలంలో రుణమాఫీ జరగలేదని వివరణ ఇచ్చారు. ఫిబ్రవరిలో మొత్తం రుణమాఫీ పూర్తి చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 
రైతులపై వరాలు ఎందుకు ప్రకటించడం లేదన్న కోమటిరెడ్డి 
అన్ని వర్గాలపై వరాలు కురిపిస్తున్న ప్రభుత్వం రైతులపై ఎందుకు వరాలు ప్రకటించడం లేదో చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులను భిక్షగాళ్లను చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. 
వ్యవసాయాన్ని మెరుగుపరుస్తాం : పోచారం 
కాళేశ్వరం, పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది 25 వేల కోట్ల బడ్జెట్‌ పెట్టుకుని.. రాబోయే ఐదేళ్లల్లో బీళ్లుగా ఉన్న భూములకు సాగు నీరు అందిస్తామని పోచారం స్పష్టం చేశారు. 

 

20:15 - December 21, 2016

చెన్నై : తమిళనాడు సీఎస్ రామ్మోహనరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అక్రమాస్తుల కేసులో ఐటీ, ఈడీ, సీబీఐ ముప్పేట దాడి చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వర్గాలు వణికిపోతున్నాయి. సీఎస్‌కు ఉచ్చు బిగుస్తుండటం.. ఏఐఏడీఎంకేకు పెను సవాల్‌గా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నెపంతో జోక్యానికి బీజేపీ పావులు కదుపుతుండగా.. రాజకీయ విమర్శలకు డీఎంకే పదును పెడుతోంది. మొత్తానికి తమిళనాడు సీఎస్‌ రామ్మోహనరావు అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. రామ్మోహనరావు బంధువుల ఇళ్లలో భారీగా నగదు, బంగారం బయటపడుతుండటంతో.. ఆయనను రేపు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. వేలూరు, చిత్తూరులో భారీగా ఆస్తులు బయటపడ్డట్లు తెలుస్తోంది. తమిళనాడు సెక్రటేరియట్‌లో 3 గంటల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. అటు రామ్మోహనరావు బంధువుల ఇంట్లో 200 కేజీల బంగారం, వంద కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి, రామ్మోహనరావు కొడుకు వివేక్‌కు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివేక్‌ను కూడా రేపు అరెస్టు చేసే అవకాశం ఉంది. చిత్తూరులో రామ్మోహనరావు వియ్యంకుడి ఇంట్లోకి వేయింగ్‌ మెషిన్లు తీసుకెళ్లిన అధికారులు నోట్లను లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ చెన్నైలో శేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల శేఖర్‌రెడ్డి ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు 130 కోట్ల నగదు, 171 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు ప్రేమ్‌, శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు జనవరి 3 వరకు రిమాండ్‌ విధించింది. 

 

అమర్జిత్ సింగ్ తో విద్యాసాగర్ రావు భేటీ సమావేశం

ఢిల్లీ : కేంద్ర జలవనరుల కార్యదర్శి అమర్జిత్ సింగ్ తో తెలంగాణ నీటి పారుదల సలహాదారు విద్యాసాగర్ రావు భేటీ అయ్యారు. తమిళనాడులో త్వరలో పెను మార్పు చూడబోతున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు వ్యవహార శైలి, పట్టిసీమ ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి విద్యాసాగర్ రావు ఫిర్యాదు చేశారు.

క్యూలైన్ లో నిలబడి వృద్ధుడు మృతి

గుంటూరు : నాదెండ్ల మండలం ఎస్ బీఐ వద్ద వృద్ధుడు మృతి చెందారు. వెంకటేశ్వరరావు క్యూలైన్ లో నిలబడి కుప్పకూలి మృతి చెందాడు. 

ప్రైవేట్ విద్యా సంస్థలపై కేంద్రం కన్ను

ఢిల్లీ : ప్రైవేట్ విద్యా సంస్థలపై కేంద్రం కన్నేసింది. క్యాపిటేషన్ ఫీజు డోనేషన్ రూపంలో నల్లధనం పోగేస్తున్నవారి వివరాల సేకరిస్తున్నారు. సీబీడీటీ 2015లోనే నివేదిక రూపొందించింది. జస్టిస్ ఎంబీషా అధ్యక్షతన ఏర్పాటైనా సిట్ వద్ద సీడీబీటీ నివేదిక ఉంది. దేశంలోని కాలేజీలు ఏటా రూ.48,400 కోట్ల నల్లధనం పోగేస్తున్నట్లు అంచనాగా ఉంది. 

చిలుకలూరిపేటలో ఎస్ బిఐ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

గుంటూరు : చిలుకలూరిపేటలో ఎస్ బిఐ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్ బిఐ మెయిన్ బ్రాంచ్ లో ఓ అధికారి, బజార్ బ్రాంచ్ లో మరో అధికారిపై సస్పెండ్ చేశారు. నోట్ల అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు వేటు వేశారు. 

ఎనిమిది భాషల్లో 2017..18 నీట్ పరీక్ష

ఢిల్లీ : ఎనిమిది భాషల్లో 2017..18 నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ,అస్సాం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో నీట్ పరీక్షను నిర్వహిస్తారు. 

19:41 - December 21, 2016

కృష్ణా : విజయవాడ క్రిస్మస్ శోభను సంతరించుకుంది. నగరంలోని అన్ని చర్చ్‌లు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఈనెల 25 న క్రిస్మస్ వేడుకలను అంబరాన్ని తాకే విధంగా చేసుకునేందుకు కుల,మతాలకతీతంగా ప్రజలు సమాయత్తమవుతున్నారు.  
ముస్తాబైన చర్చ్‌లు,  ప్రార్థనా మందిరాలు 
క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ సమీపిస్తుండటంతో విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని చర్చ్‌లు, ప్రార్థనా మందిరాలు రంగురంగుల అలంకరణలతో... అందంగా ముస్తాబయ్యాయి. 
ఈ నెల 25న క్రిస్మస్ పండుగ
ఈనెల 25న క్రిస్మస్ వేడుకలను... గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం, వన్‌టౌన్‌లోని ఫిలదెల్పియా చర్చ్, సెయింట్ పాల్ చర్చ్, ప్రసాదంపాడులోని జీసస్ మిరాకల్స్, సింగినగర్‌లోని సీఎస్ఐ చర్చ్, బెంజ్ సర్కిల్‌లోని సెయింట్‌ కతెడ్రల్‌ చర్చ, పెనమలూరులోని సీఎస్ఐ చర్చ్‌లు ఘనంగా నిర్వహించబోతున్నాయి. 
విద్యుద్దీపాలతో దగదగలాడుతున్న పలు ప్రాంతాలు 
పండుగ సందర్భంగా క్రీస్తురాజపురం, జోజినగర్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, కంకిపాడు, భవానీపురం, మొగల్రాజపురం, గవర్నర్ పేట, కృష్ణలంక తదితర ప్రాంతాలు విద్యుత్‌ దీపాల అలంకరణతో మిరుమిట్లు గొల్పుతున్నాయి. క్రిస్మన్ చెట్లు, నక్షత్ర వెలుగులు, రంగురంగుల అలంకరణలతో చర్చ్‌లను తీర్చిదిద్దారు. ఏసుక్రీస్తు జన్మించిన తీరును తెలిపే విధంగా బొమ్మల కొలువులు, ప్రత్యేక అలంకరణతో చర్చ్‌లు కొలువుదీరాయి.  శాంతా క్లాజ్,  కాపరులు, మరియామాత, వివిధ రకాల బొమ్మలు, గొర్రెలు, పశువుల పాక సెట్లను ఏర్పాటు చేసి వైభవంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు ఇక్కడి ప్రజలు సమయాత్తమవుతున్నారు. 
నవంబర్ 1 నుంచి సెమీ క్రిస్మస్ వేడుకలు
ఇప్పటికే నవంబర్ 1 వ తేదీ నుంచి జరుగుతున్న సెమీ క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ వేడుకలు డిసెంబర్ 24 వరకు భారీగా జరగనున్నాయి. నగరంలో ప్రార్థన మందిరాల్లో ఆరాధనలు, ప్రార్థనలు మిన్నంటుతున్నాయి. ఈ నెల 25 న అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

19:38 - December 21, 2016
19:35 - December 21, 2016

చెన్నై : తమిళనాడు సీఎస్‌ రామ్మోహనరావు అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. రామ్మోహనరావు బంధువుల ఇళ్లలో భారీగా నగదు, బంగారం బయటపడుతుండటంతో.. ఆయనను రేపు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. వేలూరు, చిత్తూరులో భారీగా ఆస్తులు బయటపడ్డట్లు తెలుస్తోంది. తమిళనాడు సెక్రటేరియట్‌లో 3 గంటల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. అటు రామ్మోహనరావు బంధువుల ఇంట్లో 200 కేజీల బంగారం, వంద కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి, రామ్మోహనరావు కొడుకు వివేక్‌కు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివేక్‌ను కూడా రేపు అరెస్టు చేసే అవకాశం ఉంది. చిత్తూరులో రామ్మోహనరావు వియ్యంకుడి ఇంట్లోకి వేయింగ్‌ మెషిన్లు తీసుకెళ్లిన అధికారులు నోట్లను లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ చెన్నైలో శేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల శేఖర్‌రెడ్డి ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు 130 కోట్ల నగదు, 171 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు ప్రేమ్‌, శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు జనవరి 3 వరకు రిమాండ్‌ విధించింది. 

 

19:25 - December 21, 2016

జగిత్యాల : బీడీ కార్మికులు కదంతొక్కారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేలాది మంది బీడీ కార్మికులు కలెక్టరేట్ కు... భారీ ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనాలను బ్యాంకుల ద్వారా కాకుండా, నేరుగా ఇవ్వాలని.. నగదు రహిత బదిలీ పథకంలో బీడీ కార్మికులకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో బీడీ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం తక్షణమే నోట్ల రద్దు సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. 

 

19:18 - December 21, 2016

విపక్షాల ప్రతి డిమాండ్లను నేరవేర్చలేం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఒక్క విడతలోనే రుణమాఫీ చేయదల్చుకోలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. విపక్షాలు చేసే ప్రతి డిమాండ్లను నేరవేర్చలేమని చెప్పారు. లక్షా 90 డిమాండ్లు చేస్తే వాటిని నేరవేర్చలేమన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అందరి రైతుల రుణాలపై బ్యాంకులు చార్జీలు వేశాయని అనుకోవడం లేదని సీఎం అన్నారు. 'ఇలా ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి' అని సీఎం చెప్పారు. వచ్చే బడ్జెట్ వరకు చివరి విడత రుణమాఫీ చెల్లిస్తామని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడవాలంటే 10 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరమన్నారు.

19:15 - December 21, 2016

హైదరాబాద్ : ఒక్క విడతలోనే రుణమాఫీ చేయదల్చుకోలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. విపక్షాలు చేసే ప్రతి డిమాండ్లను నేరవేర్చలేమని చెప్పారు. లక్షా 90 డిమాండ్లు చేస్తే వాటిని నేరవేర్చలేమన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అందరి రైతుల రుణాలపై బ్యాంకులు చార్జీలు వేశాయని అనుకోవడం లేదని సీఎం అన్నారు. 'ఇలా ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి' అని సీఎం చెప్పారు. వచ్చే బడ్జెట్ వరకు చివరి విడత రుణమాఫీ చెల్లిస్తామని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడవాలంటే 10 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరమన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. 

 

వరంగల్ రేంజ్ డీఐజీ కేశవనాయుడుకి మెమో జారీ

హన్మకొండ : వరంగల్ రేంజ్ డీఐజీ కేశవనాయుడుకి మెమో జారీ చేశారు. వరంగల్ జైలు మాజీ పర్యవేక్షణ అధికారి న్యూటన్ ఉప పర్యవేక్షణ అధికారి జిఎం.శ్రీనివాస్, డిప్యూటీ జైలర్ సుభాష్ లకు మెమోలు జారీ చేశారు. జైళ్ల శాఖ డీజీ నలుగురు వార్డర్లకూ మెమోలు జారీ చేశారు.

సెంట్రల్ జైలు జైలర్ గోపిరెడ్డిపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్ : సెంట్రల్ జైలు జైలర్ గోపిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. నయీం అనుచరులు పాశం శ్రీను, సుధాకర్ ల వద్ద ముడుపులు తీసుకున్నాడని గోపిరెడ్డిని సస్పెండ్ చేశారు. 

బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌కు పవన్‌ కౌంటర్‌

హైదరాబాద్ : బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌంటర్‌ ఇచ్చారు. విస్తృత రాజకీయ అనుభవం, రాజ్యాంగ నిపుణత కలిగిన పార్టీ నాయకుల నుంచి పెద్దనోట్ల రద్దులాంటి తప్పుడు నిర్ణయం ఎలా వచ్చిందని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. లెక్కలేనంత మంది అమాయకుల చావులకు కారణమైన పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎలా వచ్చిందని పవన్‌ ప్రశ్నించారు. 

 

18:47 - December 21, 2016

హైదరాబాద్ : బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌంటర్‌ ఇచ్చారు. విస్తృత రాజకీయ అనుభవం, రాజ్యాంగ నిపుణత కలిగిన పార్టీ నాయకుల నుంచి పెద్దనోట్ల రద్దులాంటి తప్పుడు నిర్ణయం ఎలా వచ్చిందని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. లెక్కలేనంత మంది అమాయకుల చావులకు కారణమైన పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎలా వచ్చిందని పవన్‌ ప్రశ్నించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:45 - December 21, 2016
18:42 - December 21, 2016

హైదరాబాద్ : ఓ కృత్రిమ మేథస్సు ప్రపంచానికి కొత్తగా పరిచయం అయ్యింది. ఈ కృత్రిమ మేథస్సు పేరు జార్విస్. కృత్రిమ మేథస్సు అంటే అదేదో సరికొత్త రోబో అనుకుంటే పొరపాటే.. అచ్చంగా మనం వాడే సెల్‌ఫోనే. దీని సృష్టికర్త మరెవరో కాదు... ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్. దీంతో ఇప్పుడీ కృత్రిమ మేథస్సుకు మరింత క్రేజ్ పెరిగింది. 
కొత్త కృత్రిమ మేథస్సు సృష్టించిన జుకెర్ బర్గ్ 
ఫేస్‌బుక్‌తో చరిత్ర సృష్టించిన మార్క్ జుకెర్ బర్గ్ ఓ కృత్రిమ మేథస్సును ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ కృత్రిమ మేథస్సు పేరు జార్విస్. పాటలను ఎంపిక చేయడం, ఒకదాని తర్వాత మరొకటి వచ్చేలా చూడటం, ఇంట్లో ఎలక్ట్రికల్స్ లైట్స్ వెలిగించడం, గెస్ట్ ల ముఖాలను గుర్తుపట్టి ఇంటి తలుపులు తెరవడం లాంటి పనులు ఇది చక్కగా చేయగలదు. 
100 గంటల్లోనే కృత్రిమ మేథస్సు అభివృద్ధి 
ఈ కృత్రిమ మేథస్సును జుకెర్ బర్గ్ 100 గంటల్లోనే అభివృద్ధి చేశాడు. అది అతని ఖాళీ సమయాల్లోనే తయారు చేయడం విశేషం. ఐరన్ మ్యాన్ సినిమాల్లో కనిపించే కృత్రిమ మేథస్సు పేరునే దీనికి పెట్టారు. ఈ రోబో జుకెర్ బర్గ్ ఇంట్లో చక్కగా ఒదిగిపోగలదు. జార్విస్‌కు కొత్త విషయాలు నేర్పించడం కష్టం. మరో వెయ్యి గంటలు కష్టపడినా కొత్త విషయాలు తనకు తానుగా నేర్చుకునే కృత్రిమ మేథస్సును సిద్ధం చేయలేనేమో అని జుకెర్ బర్గ్ అన్నారు. గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు అధునాతన డ్రోన్లు, హెడ్ సెట్లు విక్రయించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. జుకెర్ బర్గ్ ఈ కృత్రిమ మేథస్సును రూపొందించి తన సత్తా చాటారు. ఇప్పుడీ సెల్‌ఫోన్‌ ఆప్షన్‌ ప్రపంచవ్యాప్తంగా క్రేజీగా మారింది. 

 

18:36 - December 21, 2016

విశాఖ : కడసారి చూపు కోసం... ఎదురుతెన్నులు.. మృతదేహం కోసం పడిగాపులు...బతుకు బండలైనా..కుటుంబం రోడ్డున పడ్డా...చివరిచూపు కోసం పోరాటం తప్పడం లేదు.  సముద్రమంత దుఃఖంతో...తమ వాడి మృతదేహం కోసం కుటుంబం నిరీక్షిస్తోంది.. 
జులైలో మలేషియా వెళ్లిన పలివెల రాము
బతుకుదెరువు కోసం విశాఖ జిల్లా.. నక్కపల్లికు చెందిన పలివెల రాము.. జులైలో హెల్పర్ పనికి మలేసియా వెళ్లాడు. దీని కోసం గాజువాకలోని విజయ దుర్గా ఏజన్సీస్‌కు రెండు లక్షల రూపాయలు కూడా చెల్లించాడు. అయితే కొద్ది రోజుల క్రితం రాము తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తనకు ఇక్కడ బాగోలేదనీ..హెల్పర్ పనికి అని పిలిచి ఇష్టం వచ్చిన పనులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తమ కుమారుడిని వెనక్కు రప్పించాల్సిందిగా రాము తల్లిదండ్రులు విజయ దుర్గ ఏజెన్సీ ప్రతినిధులను కోరారు. దీనికి ఆ కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు.
రాము చనిపోయినట్టు వార్త
ఏదో ఒకటి చేసి తమ కొడుకుని ఇంటికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోన్న కుటుంబ సభ్యులకు రాము చనిపోయినట్టు వార్త వచ్చింది. డిసెంబర్‌ మూడో తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మలేషియా నుంచి సమాచారం అందించారు.  వాట్సాప్‌లో ఫొటోలు..కూడా పంపించారు. దీంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రెండు రోజుల క్రితం తమతో మాట్లాడిన వ్యక్తి ఎలా చనిపోతాడని ఆవేదన వ్యక్తం చేశారు.
17 రోజులైనా రాని మృతదేహం
చనిపోయినట్టు సమాచారం వచ్చి 17 రోజులు అవుతున్నా రాము మృతదేహం ఇప్పటి వరకు రాలేదు. కనీసం మృతదేహాన్ని రప్పించేందుకు విజయ దుర్గ ఏజెన్సీ ప్రతినిధులు కానీ.. ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శవం కోసం అడిగితే ..ఈరోజు వస్తుంది..రేపు వస్తుందని కాలయాపన చేస్తున్నారు. దీంతో రాము కుటుంబ సభ్యులు తమకు చివరిచూపైనా దక్కుతుందా అని వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని..విజయ దుర్గ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ  నక్కపల్లీ ఎమ్మార్వో ఆఫీసు ముందు ఆందోళన కూడా చేశారు.
రోడ్డున పడిన భార్యాపిల్లలు, తల్లిదండ్రులు  
రాము మృతితో ఆయన భార్య.. పిల్లలు.. తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. వారిని చూసుకునే నాధుడే లేక అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలో రాము మృతికి కారణమైన వారిపై చర్యులు తీసుకోవాలని..కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

18:31 - December 21, 2016

నిర్మల్ : గ్రామ ప్రజలంతా కలిసి.. దరిద్రలక్ష్మిని సాగనంపారు..   పాత చీపుర్లు.. పాత బట్టలు.. తట్టలు...చెప్పులతో... డప్పు వాయిద్యాలతో కలిసికట్టుగా పొలిమేర దాటించారు.  పంటలు ఇంటికొచ్చే సమయానికి జేష్ఠా దేవిని బయటకు పంపించారు. వింతగా ఉన్నా.. ఇది నిజం..
దరిద్రలక్ష్మిని సాగనంపిన గ్రామస్థులు
నిర్మల్‌ జిల్లా.. ఖానాపూర్‌లో మరుగున పడిపోయిన ఓ వింత ఆచారాన్ని గ్రామస్థులు ఇప్పుడు మళ్లీ ఆచరించారు.  తరతరాలుగా సాగి...తర్వాత కాలంలో మరుగున పడిపోయిన ఓ ఆచారం..ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో గ్రామస్థులు పాత ఆచారాన్ని మళ్లీ అవలంబించారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నాలుగు గంటలకు గ్రామంలోని సుమారు 15 వందల మంది యువకులు... గ్రామపెద్దలు.. డప్పు వాయిద్యాలతో దరిద్ర లక్ష్మీని గ్రామం నుంచి సాగనంపారు. ఇంట్లో ఉన్న పాత చీపురులు.. బట్టలు.. తట్టలు..పాత చెప్పులు పట్టుకుని వెళ్లి గ్రామానికవతల విడిచిపెట్టి వచ్చారు. అనంతరం గ్రామ పొలిమేరలో స్నానాలు చేశారు. అనంతరం ఇంటి నుంచి తెచ్చుకున్న కొత్త బట్టలు ధరించి..ఇంటి గడప వద్ద కొబ్బరికాయ కొట్టి సిరిలక్ష్మికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. 
పాత వస్తువు పొలిమేర అవతల పారవేత
పంటలు పండి...కొత్త ధాన్యాన్ని ఇంటికి తీసుకువచ్చే సమయంలో పూర్వీకులు ఈ విధానాన్ని అవలంబించేవాళ్లని గ్రామస్థులు చెబుతున్నారు.. ఇంట్లో ఉండే పనికిరాని.. పాత వస్తువును గ్రామస్థులందరూ పొలిమేర అవతల పారేసి వస్తే.. గ్రామానికి పట్టిన దరిద్రం వదిలేస్తుందని నమ్మకమని గ్రామపెద్దలు చెప్పారు. గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మళ్లీ ఈ విధానాన్ని అవలంబించామని చెబుతున్నారు.
20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు 
20 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఇప్పుడు గ్రామంలో నిర్వహించారు.  కొన్ని ఇబ్బందులున్నా.. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. అయితే ఈ విధానం గమ్మత్తుగా ఉందని యువకులు అంటున్నారు.

 

హామీలు నెరవేర్చడంలో అలస్యం సర్వసాధారణం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : దేశంలో రూ.16 వేల 500 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం టీఆర్ ఎస్ మాత్రమేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏపీలో రైతు రుణమాఫీ అమలు కావడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చడంలో అలస్యం జరగడం సాధారణమన్నారు. దీనికెంటో ప్రభుత్వం ఏదో నేరం చేసినట్లు విపక్షాలు విమర్శించడం తగదన్నారు. 

తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు అరెస్టుకు రంగం సిద్ధం...

చెన్నై : తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావును అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. రేపు రామ్మోహన్ రావును అరెస్టు చేసే అవకాశం ఉంది. రామ్మోహన్ రావు బంధువుల ఇంట్లో వంద కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

18:17 - December 21, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో వ్యవసాయరంగంపై వాడీవేడి చర్చ జరుగుతోంది. అధికార, విపక్షాలు వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. టీఆర్ ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 
టీఆర్ ఎస్ ఆఫీస్ లో వాచ్ మెన్ గా పని చేస్తా : కోమటిరెడ్డి 
రైతుల పుణ్యమా అని టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిందని... వారికి అన్యాయం చేయొద్దని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. టీఅసెంబ్లీలో వ్యవసాయరంగంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. వేరే పార్టీల్లో గెలిచి అనేక మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరారని చెప్పారు. అందులో ఒక్క ఎమ్మెల్యేను రుణమాఫీ చేయని ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేసి గెలవమనండి చూద్దాం అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి మిర్యాలగూడ ఎమ్మెల్యే డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. ఒకవేల మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకుంటే తాను టీఆర్ ఎస్ ఆఫీస్ లో వాచ్ మెన్ గా పని చేస్తానని చెప్పారు. జానారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యేను గెలిపించారని గుర్తు చేశారు. దీనికి మిర్యాలగూడ ఎమ్మెల్యే స్పందిస్తూ.. దమ్ముంటే వెంకట్ రెడ్డిని రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవమనండి.. ఒక వేల గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలు మానుకుంటాని సవాల్ విసిరారు. అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని విమర్శించారు. రైతులకు మినిమం మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చలేదని చెప్పారు. రైతులపై దృష్టి పెట్టి, ఆదుకోవాలన్నారు. అన్నదాతను బిక్షగాడిగా మార్చితే రైతులు క్షమించరని తెలిపారు. నాలుగు నుంచి ఐదు నెలలుగా మంచినీరు లేక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల సమస్యల తీరే వరకు వరకు వృధా ఖర్చు మానుకోవాలని హితవు పలికారు. మిగిలిన నాలుగో విడత రుణమాఫీని వెంటనే చెల్లించాలని.. దశల వారిగా చెల్లించవద్దని చెప్పారు. ఎర్రవల్లికి ట్రాక్టర్లు ఇచ్చేందుకే రెండన్నరేళ్ల  సమయం తీసుకుంటే.. మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పార్టీపై అధికార పార్టీ సభ్యులు చేసిన విమర్శలకు స్పందిస్తూ ..కాంగ్రెస్ అచేతన అవస్థలో లేదని..మళ్లీ పుంజుకుంటామని వెంకట్ రెడ్డి చెప్పారు.
రూ.16,500 కోట్ల రుణమాఫీ చేశాం : సీఎం కేసీఆర్ 
దేశంలో రూ.16 వేల 500 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం టీఆర్ ఎస్ మాత్రమేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏపీలో రైతు రుణమాఫీ అమలు కావడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చడంలో అలస్యం జరగడం సాధారణమన్నారు. దీనికెంటో ప్రభుత్వం ఏదో నేరం చేసినట్లు విపక్షాలు విమర్శించడం తగదన్నారు. 
రుణమాఫీ జరగాలన్నదే మా అభిలాష : జానారెడ్డి 
రైతులకు త్వరగా రుణమాఫీ జరగాలన్నదే మా అభిలాష అని జానారెడ్డి అన్నారు. తమ మాటలకు కేసీఆర్ సరిగా అర్థం చేసుకోలేదని చెప్పారు. 
రైతులకు పగటిపూటనే 9 గంటల విద్యుత్ : మంత్రి పోచారం..
రైతులకు పగటిపూటనే 9 గంటల విద్యుత్ ను ఇస్తున్నామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎక్కువ మంది సభ్యులు ఇన్ ఫుట్ సబ్సిడీ పైన మాట్లాడారని తెలిపారు. 2009.... 2013 మధ్య ఇవ్వాల్సిన ఇన్ ఫుట్ సబ్సిడీని టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. 

 

17:45 - December 21, 2016

తమిళనాడు : టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. బ్లాక్ మనీ కేసులో చెన్నైలో సిబిఐ అరెస్టు చేసింది. శేఖర్ రెడ్డి ఇంట్లో రూ.130 కోట్ల నగదు, 171 కిలోల బంగారం పట్టుబడింది. శేఖర్ రెడ్డి అనుచరుడు ప్రేమ్ శ్రీనివాస్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. వీరిద్దరికి జనవరి 3 వరకు రిమాండ్ విధించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి అరెస్టు...

తమిళనాడు : టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. బ్లాక్ మనీ కేసులో చెన్నైలో సిబిఐ అరెస్టు చేసింది. శేఖర్ రెడ్డి ఇంట్లో రూ.130 కోట్ల నగదు, 171 కిలోల బంగారం పట్టుబడింది.

 

17:21 - December 21, 2016

హైదరాబాద్ : దేశంలో రూ.16 వేల 500 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం టీఆర్ ఎస్ మాత్రమేనని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో వ్యవసాయరంగంపై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం మాట్లాడారు. ఏపీలో రైతు రుణమాఫీ అమలు కావడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చడంలో అలస్యం జరగడం సాధారణమన్నారు. దీనికెంటో ప్రభుత్వం ఏదో నేరం చేసినట్లు విపక్షాలు విమర్శించడం తగదన్నారు. 

 

రాహల్ బ్లఫ్ మాస్టర్ - బీజేపీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై రాహుల్ చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ బ్లఫ్ మాస్టర్ అంటూ ఎద్దేవా చేసింది. ఆయన ఆరోపణలు ప్రజలు పట్టించుకోరని పేర్కొంది.

16:50 - December 21, 2016

హైదరాబాద్ : రైతుల పుణ్యమా అని టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిందని... వారికి అన్యాయం చేయొద్దని కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. టీఅసెంబ్లీలో వ్యవసాయరంగంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. వేరే పార్టీల్లో గెలిచి అనేక మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరారని చెప్పారు. అందులో ఒక్క ఎమ్మెల్యేను రుణమాఫీ చేయని ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేసి గెలవమనండి చూద్దాం అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి మిర్యాలగూడ ఎమ్మెల్యే డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. ఒకవేల మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకుంటే తాను టీఆర్ ఎస్ ఆఫీస్ లో వాచ్ మెన్ గా పని చేస్తానని చెప్పారు. జానారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యేను గెలిపించారని గుర్తు చేశారు. దీనికి మిర్యాలగూడ ఎమ్మెల్యే స్పందిస్తూ.. దమ్ముంటే వెంకట్ రెడ్డిని రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవమనండి.. ఒక వేల గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలు మానుకుంటాని సవాల్ విసిరారు. అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని విమర్శించారు. రైతులకు మినిమం మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చలేదని చెప్పారు. రైతులపై దృష్టి పెట్టి, ఆదుకోవాలన్నారు. అన్నదాతను బిక్షగాడిగా మార్చితే రైతులు క్షమించరని తెలిపారు. నాలుగు నుంచి ఐదు నెలలుగా మంచినీరు లేక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల సమస్యల తీరే వరకు వరకు వృధా ఖర్చు మానుకోవాలని హితవు పలికారు. మిగిలిన నాలుగో విడత రుణమాఫీని వెంటనే చెల్లించాలని.. దశల వారిగా చెల్లించవద్దని చెప్పారు. ఎర్రవల్లికి ట్రాక్టర్లు ఇచ్చేందుకే రెండన్నరేళ్ల  సమయం తీసుకుంటే.. మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పార్టీపై అధికార పార్టీ సభ్యులు చేసిన విమర్శలకు స్పందిస్తూ ..కాంగ్రెస్ అచేతన అవస్థలో లేదని..మళ్లీ పుంజుకుంటామని వెంకట్ రెడ్డి చెప్పారు.

 

మోడీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. 2013లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ సహారా నుండి రూ. 2.5 కోట్లు తీసుకున్నారని, ఆరు నెలల్లో 9 విడతలుగా మోడీ డబ్బు తీసుకున్నారని పేర్కొన్నారు.

సిద్ధార్థ సింగ్ కు పవన్ కౌంటర్..

హైదరాబాద్ : బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జీ సిద్దార్థ నాథ్ సింగ్ కు సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కౌంటర్ ఇచ్చారు. పెద్దనోట్ల రద్దు..ఇతర విషయాలపై 'పవన్' ట్విట్టర్ ద్వారా పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై సిద్ధార్థ్ సింగ్ విమర్శలు గుప్పించారు. దీనిపై బుధవారం పవన్ ట్విట్టర్ ద్వారా పలు ట్వీట్స్ చేశారు. లెక్కలేనంత మంది అమాయకుల చావులకు కారణమైన పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎలా వచ్చిందని సూటిగా ప్రశ్నించారు. విస్తృత రాజకీయ అనుభవం, రాజ్యాంగ నిపుణత కలిగిన పార్టీ నాయకుల నుండి నగదు రద్దులాంటి తప్పుడు నిర్ణయం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

16:40 - December 21, 2016

తెలుగు హీరోలకు రీమేక్స్ అంటే మహామోజు. ప్రతి ఎడాది పదుల సంఖ్యలో పొరుగు సినిమాలు మనదగ్గర రీమేక్ అవుతుంటాయి. కేవలం సేమ్ గేమ్ కోసమే కొందరూ హీరోలు ఈ రీమేక్ పై ఫోకస్ చేస్తుంటారు. హీరోకి కచ్చితంగా సక్సెస్ అవసరమొచ్చో లేక దర్శక నిర్మాతలు సొంత కథలతో రిస్క్ ఎందుకనో పక్కా ఇండస్ట్రీస్ సక్సెస్ ల వైపు చూస్తుంటారు. అలా ఈ ఎడాది తెలుగులో వచ్చిన రీమేక్స్ ఏంటో వాటి ఫలితాలు.. ఈ ఎడాది డజన్ వరకు రీమేక్ సినిమాలు వచ్చాయి. టాప్ హీరో చిన్న హీరో అనే తేడా లేకుండా అందరూ రీమేక్స్ బాటపట్టారు. కొందరూ స్టోరీకి ఫిదా అయి రీమేక్ చేస్తే, మరికొందరూ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఎంచుకున్నారు.అయితే ఈ రీమేక్స్ లో ఒకటి ఆరా తప్పిస్తే పెద్దగా ఆడినవి లేకపోవడం గమనించదగ్గ విషయం.

ఊపిరి..
'నాగార్జున’, 'కార్తీ' కాంబినేషన్ లో వచ్చిన 'ఊపిరి' మూవీ రీమేక్ గా తెరకెక్కిన చిత్రమే. ఫీల్ గుడ్ మూవీగా ప్రశంసలు అందుకున్న 'ఊపిరి' సినిమా యావత్తు చిత్ర పరిశ్రమ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది. అంతేకాదు విమర్శకుల ప్రశంసలతో పాటు ఈ చిత్రం ఆడియన్స్ మెప్పు కూడా పొందింది. 'ఊపిరి' హాలీవుడ్ మూవీ ది ఆన్ టచబుల్స్ కి రీమేక్ గా తెరకెక్కింది. హాలీవుడ్ కి కాపీ పేస్ట్ సాగే ఈ మూవీని తెలుగు దనానికి తగ్గట్టుగా మార్చి దర్శకుడు వంశీపైడిపల్లి సక్సెస్ అందుకున్నాడు. 'నాగ్' కెరీర్ లో ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ప్రేమమ్..
తండ్రి లాగే 'నాగ చైతన్య' కూడా రీమేక్ ని ఎంచుకుని మంచి సక్సెస్ కొట్టాడు. ప్లాప్స్ తో డీలా పడిన 'చైతూ' మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ప్రేమమ్' మూవీని అదే టైటిల్ తో రీమేక్ చేసి సూపర్ హిట్టు అందుకున్నాడు. ఈ చిత్రంతో 'నాగ్' వారసుడు ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నాడు. 'కార్తికేయ' ఫేం చందు మొండేటి 'ప్రేమమ్' రీమేక్ ని తెలుగు అనుగుణంగా మలచడంలో సఫలం అయ్యాడు. 'శృతిహాసన్’, 'మడోన్న’, 'అనుపమ పరమేశ్వరన్' నటించిన ఈ చిత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. సక్సెస్ కోసం చాలా కాలం వెయిట్ చేసిన 'నాగ చైతన్య'ను ఈ రీమేక్ సక్సెస్ తో ఊపిరిపీల్చుకున్నాడు.

'ఈడోరకం ఆడోరకం’...
తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మరో రీమేక్ 'ఈడోరకం ఆడోరకం’. గత ఎడాది డైనమైట్ రీమేక్ ఈ మంచు బాబుకి షాక్ ఇస్తే ఈ ఎడాది 'ఈడో రకం ఆడోరకం' మాత్రం ఈ హీరోని ఆనందంలో ముంచేసింది. 'మంచు విష్ణు’, 'రాజ్ తరుణ్’, 'హెబ్బా పటేల్’, 'సోనారిక భండోరియా' కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ అడల్ట్ కంటెంట్ తో బాక్సాపీసుని కుమ్మేసింది. 'నాగేశ్వర్ రెడ్డి' దర్శకత్వం వహించిన 'ఈడో రకం ఆడోరకం' పంజాబీ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ కి నవ్వుల్లో ముంచేత్తింది. సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విష్ణుని ఈ రీమేక్ గట్టున పడేసింది.

అక్కినేని సమంత్..
మేనమామ నాగార్జున, బావమరిది నాగచైతన్యకే కాదు అక్కినేని మనవడు 'సుమంత్' కి కూడా రీమేక్ బాగానే కలిసొచ్చింది. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న 'సుమంత్' ఈ ఎడాది 'నరుడా డోనరుడా' అంటూ బాలీవుడ్ సూపర్ హిట్టు 'విక్కి డోనర్' ని రీమెక్ చేశాడు. లోబడ్జెట్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద లాభాలు తెచ్చిపెట్టింది. 'అక్కినేని' ఫ్యామిలీ...మంచు ఫ్యామిలీనే కాదు మెగా ఫ్యామిలీ కూడా ఈ ఎడాది రీమేక్స్ పైనే ఆధాపడింది. మరో విశేషమేమిటంటే తండ్రికొడుకు 'నాగార్జున’, 'నాగ చైతన్య' రీమేక్స్ నే నమ్ముకుంటే మెగా తండ్రి కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు కూడా రీమేక్ నే నమ్ముకోవడం విశేషం.

ధృవగా చెర్రీ..కత్తితో చిరు..
'బ్రూస్ లీ' తో దెబ్బతిన్న 'రామ్ చరణ్' ఎలాగైనా హిట్టు కొట్టాలని 'ధృవ' చిత్రం రీమేక్ తో వచ్చాడు. అనుకున్నట్టే 'చెర్రీ' ఈ రీమేక్ తో మంచి రిజల్ట్ రాబట్టాడు. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం వసూళ్ల వర్షం కురిపిస్తుంది. 'ధృవ' సినిమా తమిళ సూపర్ హిట్టు 'తని ఒరువన్' కి రీమేక్ గా రూపొందింది. ఈ రీమేక్ కోసం 'చరణ్' గెటప్ విషయంలో మేకోవర్ చూపించి ఫస్ట్ ఇంప్రెన్షన్ కొట్టేశాడు. 'మగధీర' తరువాత 'చెర్రీ' 'ధృవ' సినిమాతో హిట్టు కొట్టడమే కాకుండా అందరి ప్రశంసలు అందుకున్నాడు. 9ఏళ్ల తరువాత రీ ఏంట్రీ ఇస్తున్న మెగాస్టార్ కూడా సేమ్ గేట్ ఆడుతున్నాడు. 'చిరు' రీ ఏంట్రీ పై ఆడియన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ 'మెగాస్టార్' మాత్రం మాగ్జిమం గ్యారెంటీ అనే ఉద్దేశ్యంతో 'కత్తి' రీమేక్ ని ఎంచుకున్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.

నిరాశే..
ప్లాప్స్ పడిన ప్రతిసారి 'అల్లరి నరేష్' రీమేక్ తో సక్సెస్ కొట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి 'అల్లరోడు' ఎంచుకున్న రీమేక్ దెబ్బేసింది. కన్నడ విక్టరీ మూవీకి రీమేక్ గా వచ్చిన 'సెల్పీరాజా' 'నరేష్' ని నిరాశపరిచింది. అంతేకాదు ఈ మూవీతో 'అల్లరోడు' విమర్శకుల నోళ్లకు పని చెప్పినట్లైంది. 'అల్లుడు శీను' తో గ్రాండ్ ఏంట్రీ ఇచ్చిన 'బెల్లంకొండ సాయిశ్రీనివాస్' సెకండ్ మూవీ కోసం సేమ్ జోన్ ట్రై చేశాడు. కానీ ఈ యంగ్ హీరో ట్రై చేసి సేమ్ గేమ్ నిరాశపరిచింది. తమిళ హిట్టు సుందరపాండ్యన్ కి రిమేక్ గా వచ్చిన 'స్పీడున్నోడు' మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. రీమేక్ తో సక్సెస్ గాడిలో పడాలని ప్లాన్ చేసిన మరో హీరో 'సందీప్ కిషన్' కి కూడా చేదునే మిగిలింది. 'రన్' అంటూ తమిళ రీమేక్ తో ముందుకు వచ్చాడు. కానీ రన్ బాక్సాఫీసు వద్ద పరుగులు తీయలేకపోయింది.

అగ్ర హీరోల రీమెక్ లు..
నారావారబ్బాయి 'రోహిత్' నటించిన రెండు రీమేక్స్ బాక్సఫీసు వద్ద చతికిలపడ్డాయి. తమిళంలో 50కోట్లు సాధించిన మాన్ కరాటేను 'తుంటరి' రీమేక్ చేసిన 'నారా రోహిత్' కి నిరాశనే మిగిలింది. ఇక మరో రీమేక్ శంకర్ కూడా ఈ నారాబాబుని గట్టేక్కించలేకపోయింది. ప్రొడ్యూసర్ వారసుడిగా ఏంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్వినీ కూడా రీమేక్ తో సక్సెస్ కొట్టాలని ఆశపడ్డాడు. కానీ ఈ యంగ్ హీరో ఆశలు ఆవిరైపోయాయి. తమిళంలో ఘనవిజయం సాధించిన రైట్ రైట్ మూవీ తెలుగులో మాత్రం నిరాశ పరిచింది. ఈ ఎడాది 10 సినిమాలను రీమేక్స్ చేస్తే కేవలం నాలుగు సినిమాలే విజయాలు అందుకున్నాయి. అయితే రీమేక్స్ సక్సెస్ రేట్ ఎలా ఉన్న వచ్చే ఎడాది కూడా రీమెక్స్ జోరు బాగానే కనిపిస్తుంది. వచ్చే ఎడాది 'చిరంజీవి' 'కత్తి' రీమేక్ తో 'వెంకటేష్' 'గురు' రీమేక్ తో రెడీగా ఉన్నారు. మరి వచ్చే ఎడాది రీమేక్స్ రిజల్ట్ ఎలా ఉంటాయో చూడాలి....

16:16 - December 21, 2016

టాలీవుడ్ కి కొత్త సినిమాల విషయంలో బోలెడంత ధైర్యం ఇచ్చింది 'రామ్ చరణ్ ధృవ’. కంటెంట్ బాగుంటే భారీ చిత్రాలను రిలీజ్ చేయచ్చనే భరోసాని మేకర్స్ లో కలిగించింది. డీమానిటైజేషన్ ఈ సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది ? అసలు ఎందుకు ఇంత ధైర్యం చేసి ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చిందనే దానిపై చెర్రీ ఇప్పుడు క్లారిటి ఇచ్చాడు. డీమానిటైజేషన్ తర్వాత తెలుగు రిలీజైన తొలి భారీ చిత్రం 'ధృవ’. ఒపెనింగ్స్ అనుకున్న రేంజ్ కంటే కాస్త తక్కువగానే వచ్చాయి. 'చెర్రీ' ప్లాప్ మూవీ 'బ్రూస్ లీ' తొలి రోజు రూ. 12కోట్లు వసూల్ చేస్తే సూపర్ హిట్టు టాక్ తెచ్చుకున్న 'ధృవ' మాత్రం 10కోట్లు మాత్రమే వసూల్ చేసింది. దీంతో 'ధృవ' లాంగ్ రన్ కలెక్షన్లు ఎలా ఉంటాయో అని మెగా టీం కంగారు పడింది. కానీ డీమానిటైజేషన్ లో కూడా ఈ చిత్రం తొలి వీకెండ్ లోనే 25కోట్లు రాబట్టింది. ఇక సెకెండ్ వీకెండ్ లో 'ధృవ' ఈజీగా రూ. 40కోట్లకు పైగా వసూల్ చేయనున్నట్లు ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పుల్ ఖుష్ అవుతున్న 'చెర్రీ' సినిమాను ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఎందుకు రిలీజ్ చేశాడో క్లారిటి ఇచ్చాడు.

సుకుమార్ దర్శకత్వంలో...
మెగాస్టార్ రీ ఏంట్రీ మూవీ 150వ చిత్రం సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి ఉండడంతో, కచ్చితంగా గ్యాప్ ఉండాలి. అందుకే ధైర్యం చేసి 'ధృవ' సినిమాను రిలీజ్ చేసినట్లు చెప్పాడు. ఓపెనింగ్స్ 15-20శాతం తగ్గుతాయని ముందే మెగా టీం అంచనా వేసిందట. అయితే అనుకున్న దానికంటే ఒపెనింగ్స్ బాగానే తగ్గాయని మెగా వారసుడు చెప్పుతున్నాడు. కానీ మౌత్ టాక్ కారణంగా రెండో రోజుకల్లా మూవీ బాగా పుంజుకుని హౌస్ ఫుల్స్ పడడం హ్యపీగా ఉందని 'రామ్ చరణ్' సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఓవర్సీస్ కలెక్షన్లపై కూడా 'చెర్రీ' స్పందించాడు. 'మగధీర' సినిమా తరువాత ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ కలెక్షన్లు దాటడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన మెగా వారసుడు 'ధృవ'పై పూర్తి నమ్మకం ఉందని అందుకే యూఎస్ ప్రీమియర్స్ కి అంటెండ్ అయి అక్కడి ఆడియన్స్ ని కలుసుకున్నామని చెప్పాడు. ఇక రాబోయే సినిమాల సంగతులు కూడా 'చరణ్' చెప్పుకొచ్చాడు. మైత్రీ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా సంక్రాంతి తర్వాత ప్రారంభం అవుతుందని చెప్పాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ మూవీ అని క్లారిటి ఇచ్చాడు. ఈ మూవీతో సుకుమార్ మరో లెవల్ కి వెళుతాడని సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.

16:12 - December 21, 2016

చెన్నై : తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలో డిశ్చార్జ్ చేస్తారని డీఎంకే ప్రకటన చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని సీపీఐ నేత డి.రాజా, పీఎంకే చీఫ్ రామ్ దాస్ పరామర్శించారు. ఈనెల 15 నుంచి ఆస్పత్రిలోనే కరుణానిధి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

75 శాతం రుణమాఫీ అయిపోయింది-కేసీఆర్..

హైదరాబాద్ : 75 శాతం రుణమాఫీ అయిపోయిందని, మిగతా శాతం వెంటనే ఇచ్చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

16:01 - December 21, 2016

హైదరాబాద్ : రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు సరైన సహకారం లేదన్నారు. గత రెండేళ్లలో తెలంగాణ రైతులు అధికంగా నష్టపోయారని తెలిపారు. పంటలు నష్టపోతే పంటల బీమా పథకం వర్తిస్తుందన్నారు. ఇరిగేషన్, మత్స్య పరిశ్రమలు వంటి వాటికి కేంద్రం ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు. జన్ ధన్ పథకం కింద కోట్లాది మందికి ఖాతాలు తెరిపించామని తెలిపారు. 
పజల్ బీమా యోజన పథకం కింద కేంద్రం పంటల బీమాను తీసుకొచ్చిందన్నారు. 

ఆంధ్రా పాలకులకు రేవంత్ వత్తాసు - హరీష్..

హైదరాబాద్ : విద్యుత్ రంగంపై చర్చ జరిగినప్పుడు తప్పుడు లెక్కలు చెప్పి సభను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకులకు ఒత్తాసు పలుకుతున్నారని, రేవంత్ రెడ్డి ఏపీ సభలో మాట్లాడుతున్నారో లేక తెలంగాణ సభలో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని హరీష్ డిమాండ్ చేశారు.

రుణమాఫీ ఎందుకు చేయలేదు - కోమటిరెడ్డి..

క్ష్మి రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, కేసీఆర్ అందరికీ వరాలు కురిపిస్తున్నారని టి.కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు వెళ్తే చాలా మంది టీఆర్ఎస్ నేతలకు డిపాజిట్లు కూడా దక్కవని, రైతు సమస్యలు తీరే వరకు వృధా ఖర్చులు మానుకోవాలని పేర్కొన్నారు.

15:43 - December 21, 2016

మంచిర్యాల : సీపీఎం మహాజన పాదయాత్ర విజయవంతంగా 66వ రోజుకు చేరుకుంది. ఈ రోజు పాదయాత్ర దుబ్బగూడెం, మందమర్రి, మేడారం, పులికుంట... బొప్పలగుట్ట, గద్దెరాగడి, మంచిర్యాలలో సాగనుంది. కాగా ఈ మహాజన పాదయాత్రకు దోమగూడ, కాశిపేట ఓపెన్‌కాస్ట్‌ వ్యతిరేక పోరాట బృందం సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా 'ఓపెన్‌ కాస్ట్‌ వ్యతిరేక పోరాటానికి మా మద్దతు ఉంటుందని.. పోరాటంలో మేం భాగమవుతామని' సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. 

 

రైతుల హామీలు అమలు కాలేదు - రేవంత్..

హైదరాబాద్ : రైతులకు ఇచ్చిన కేసీఆర్ హామీలు అమలు కాలేదని టి.టిడిపి సభ్యుడు రేవంత్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై శాసనసభలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక 16 లక్షల 5వేల వరిసాగు తగ్గిందని, 2015-16 లో తెలంగాణలో 898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో రాష్ట్రానికి రెండో స్థానంలో ఉందని, ఆత్మహత్య చేసుకున్న 40 మంది రైతు కుటుంబాలకు మాత్రమే రూ. 6లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చారని పేర్కొన్నారు. రైతులకు నూటికి నూరు శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

 

15:36 - December 21, 2016

విజయవాడ : భారతదేశంలో అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. వెయ్యి, 500 నోట్లతో ఇది మరింత ఎక్కువైందన్నారు. అందుకే  తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం... వెయ్యి, 500 నోట్ల రద్దు చేయాలని కేంద్రానికి విన్నవించామని తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందిపడ్డ వాస్తవమేనని .... వృద్ధులైతే మరింత ఇబ్బంది పడ్డారని చెప్పారు. క్యూలైన్‌లో చనిపోయిన వారిని చూసి బాధేసిందన్నారు. అందుకే ఇక నుంచి పెన్షన్‌ను వారి ఇంటికే పంపిస్తామని చెప్పారు.
 

 

ప్రభుత్వం వృదా ఖర్చు మానుకోవాలి - కోమటిరెడ్డి..

హైదరాబాద్ : వృదా ఖర్చులు మానుకుని రైతులకు మేలు చేయాలని టి.కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై శాసనసభలో చర్చ జరుగుతోంది. అన్నింటినీ అన్ని ఇచ్చి నల్గొండ జిల్లాను పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాకు ఒక్క ట్రాక్టర్ ఇవ్వలేదని, గత సంవత్సరంలో ఇచ్చిన ట్రాక్టర్లకు ఈ సంవత్సరం ఇస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు తొలుత నీళ్లు వచ్చే విధంగా చూడాలని, వృదా ఖర్చులు మానుకోవాలని హితవు పలికారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా ఉంటున్నారో చూడాలని సూచించారు.

15:30 - December 21, 2016

ఉదయం లేవగానే చాలా మందికి టీ లేనిదే రోజు గడిచినట్టు అనిపియ్యదు. ఆఫీసుకు..ఇతర పనుల్లో ఉన్నా కాఫీలు..టీలు అలా కానిస్తుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా..అలసట చెందినా టీ తాగాలని అనిపిస్తుంటుంది. మరికొందరు చిప్స్ ఇతరత్రా నమిలేస్తూ ఉంటుంటారు. ఈ రెండు అలవాట్లు ప్రమాదకరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పదేపదే టీలు తాగడం వల్ల శరీరంలో ఆక్సిడెంట్లు పెరిగిపోతాయని, ఊబకాయంతో పాటు క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. టీలు..కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తాగాలని, అది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని సూచిస్తున్నారు. వారాల తరబడి ఫ్రిజ్ లో ఉన్నవి కాకుండా తాజా కూరగాయాలు, కూరలు తినాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలను దూరంగా ఉండవచ్చునని అంటున్నారు నిపుణులు. మరి మీరేమంటారు..

15:28 - December 21, 2016

కొద్దిగా బయట తిరిగి వచ్చే సరికి ముఖం నల్లగా మారుతుంటుంది. వేసవి కాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్న వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ముఖం కాంతివంతంగా తయారయ్యే అవకాశం ఉంది. వంటింట్లో దొరికే పదార్థాలతోనే సమస్యను అధిగమించవచ్చు.
టమాటో గుజ్జు చర్మంపై మంచి ప్రభావం కనిపిస్తుంది. గుజ్జును ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకోవాలి. టాన్ పోవడంతో పాటు మంచి మెరుపు వస్తుంది. కీరదోస రసానికి గ్లిజరిన్, గులాబీ నీరు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోవడానికి ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మం రంగు మెరుపుగా మారే అవకాశం ఉంది. చిటికెడు పసుపు, ఒక స్పూన్ పాల పొడి, రెండు చెంచాల తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిపోయేంత వరకు ఉండాలి. అనంతరం కడిగేసుకోవాలి. ఓట్స్ ని పొడి చేసుకుని అందులో కొంచెం మజ్జిగ వేసుకుని మురికి పేరుకున్న చోట ఆ మిశ్రమంతో బాగా రాయాలి. కొబ్బరి నీళ్లతో ముఖాన్ని..చేతుల్ని శుభ్రం చేసుకుంటే నలుపుదనం పోతుంది. అంతేగాకుండా చర్మం మృదువుగా మారుతుంది.

టీఆర్ఎస్ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తా – కోమటిరెడ్డి..

హైదరాబాద్ : టీఆర్ఎస్ హాయాంలోనే రైతులు అధికంగా బాధ పడుతున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరైనా అధికారంలో ఉన్న వారు రాజీనామా చేసి తిరిగి గెలుపొందితే రైతులు మీ పక్కన ఉంటారని అనుకుంటానన్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని, ఇలా చేస్తే టీఆర్ఎస్ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

కరుణా క్షేమం - కావేరీ వైద్యులు..

చెన్నై : కరుణానిధి క్షేమంగా ఉన్నట్లు కావేరీ ఆసుపత్రి పేర్కొంది. ఈ మేరకు ఆయన ఫొటోను విడుదల చేశారు. వేగంగా ఆయన కోలుకొంటున్నారని, తదుపరి చికిత్సలు పూర్తయిన అనంతరం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన..

ఢిల్లీ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. రజనీగంధ (కవితా సంపుటి) రచించిన పాపినేని శివశంకర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఫిబ్రవరిలో ఈ అవార్డును బహుకరించనున్నారు. శివశంకర్ స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు (మం) నెక్కల్లు గ్రామం. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన నాగళ్ల గురు ప్రసాద్ చౌదరికి భాషా సమ్మాన్ అవార్డు లభించింది.

15:17 - December 21, 2016

హైదరాబాద్ : శాసనమండలిలో వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్‌, ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ మధ్య మాటల తూటాలు పేలాయి. తెలంగాణ రాష్ట్రం తాము పెట్టిన భిక్షని షబ్బీర్‌అలీ చెప్పగా.. ... ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఇంత వరకు టీఆర్‌ఎస్‌ ఆదుకోలేదని షబ్బీర్‌ విమర్శిస్తే... అమరవీరుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ లేదని కేటీఆర్‌ దుయ్యబట్టారు. 

 

తమ హాయాంలోనే రూ. 400 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ - షబ్బీర్..

హైదరాబాద్ : కాంగ్రెస్ హాయాంలోనే రూ. 400కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదలయ్యాయని, కానీ రాష్ట్రపతి పాలన కారణంగా ఆ నిధులు ఇవ్వలేపోయినట్లు శాసనసమండలిలో షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారని తెలిపారు. సోయాబీన్ వేసుకోవాలని ప్రభుత్వం పేర్కొనడం జరిగిందని, రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర రావడం లేదని సభకు తెలిపారు. దీనికి బాధ్యత ప్రభుత్వానిదా ? వ్యవసాయ మంత్రిదా ? అని ప్రశ్నించారు. కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

15:12 - December 21, 2016

తమిళనాడు : ఐటీ దాడులపై తమిళనాడు సీఎం పన్నీర్‌ సెల్వం మంత్రులతో అత్యవసరసమావేశం ఏర్పాటు చేశారు.. సీఎస్‌ రామ్మోహన్‌ రావు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలపై చర్చించారు. మరోవైపు రామ్మోహన్‌ రావు ఇంటిదగ్గర భారీగా సీఆర్ పీఎఫ్ బలగాల్ని మోహరించారు. అటు రామ్మోహన్‌రావు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై అన్నానగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. తెల్లవారుజామున ఐదున్నరగంటలనుంచి... సీఎస్ కార్యాలయం, ఇంటితోపాటు... మొత్తం 13చోట్ల అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.. రామ్మోహన్‌రావు కుమారుడు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. చెన్నైతోపాటు బెంగళూరు, చిత్తూరులోకూడా సోదాలు జరుపుతున్నారు.. వందమంది ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు చేస్తున్నారు.. రామ్మోహన్‌ రావు గత సీఎం జయలలితతోపాటు.. పన్నీర్‌ సెల్వంకుకూడా సన్నిహితుడు.. గతవారం శేఖర్‌ రెడ్డి నివాసంలో దొరికిన పత్రాల ఆధారంగా సీఎస్‌ ఇంటిపై అధికారులు దాడులు చేశారని తెలుస్తోంది.. శేఖర్‌ రెడ్డితో రామ్మోహన్‌కు ఉన్న సంబంధాలపై అధికారులు ఆరాతీస్తున్నారు.. ప్రభుత్వంనుంచి శేఖర్‌రెడ్డికి ఈ మెయిల్స్ వెళ్లినట్లుకూడా తెలుస్తోంది.. రామ్మోహన్‌ రావు భారీగా డబ్బును బంగారం రూపంలోకి మార్చారని... అలాగే శేఖర్‌ రెడ్డితోకలిసి ఇసుక కాంట్రాక్టుల్లో అక్రమాలు చేశారని ఆరోపణలొస్తున్నాయి.. తర్వాత ఐటీ దాడుల టార్గెట్‌ శశికళే అంటూ తమిళనాడులో ప్రచారం జరుగుతోంది..  

 

15:00 - December 21, 2016

ఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ భేటీ ముగిసింది. కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కార్మికుల జీతాలను బ్యాంకుల ద్వారానే చెల్లించేలా ఈ ఆర్డినెన్స్‌ రాబోతోంది. అలాగే రైల్వే, టెలికాం, గనులు తదితరశాఖలకు నోటిఫిషన్‌ జారీ కోసం ఇండియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  
సాయిబాబు (సీఐటీయూ)..
'ఆర్డినెన్స్‌ ద్వారా కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్య. బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలి. ఆర్డినెన్స్ ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. అర్డినెన్స్ ను దొడ్డిదారిన తేవడం అప్రజాస్వామికమని' అని తెలిపారు.  

 

14:29 - December 21, 2016

'ప్రిన్స్' మహేష్ బాబు ల్యాండ్ మార్క్ మూవీకి సర్వం సిద్దమైనట్లు సమాచారం. ప్రిన్స్ ని హీరోగా లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ తో పాటు 'మహేష్' తో మల్టీస్టార్ మూవీ తీసిన ప్రొడ్యూసర్ సంయుక్తంగా నిర్మించనున్నారట. ఇక ఈ ల్యాండ్ మార్క్ మూవీ ఓ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. 'మహేష్ బాబు' మైల్ స్టోన్ మూవీకి సంబంధించి గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతోందంట. ఇప్పటి వరకు 22 సినిమాలు కంప్లీట్ చేసిన 'ప్రిన్స్' ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో 23వ సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమాను సమ్మర్ కానుక గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ వెంటనే మహేష్ 24వ సినిమాను కొరటాలశివ డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఆ మధ్య వీరి మూవీ ముహుర్తం కూడా జరుపుకుంది. ఇక ఈ తరువాత చేయబోయే ల్యాండ్ మార్క్ 25వ సినిమాకి కూడా అంతా సిద్దమైనట్లు సమాచారం.

25వ సినిమా అంటేనే..
ఇండస్ట్రీలో 25వ సినిమా అంటే ప్రిజిస్టియస్ గా తీసుకుంటారు. అయితే తన 25వ సినిమాను కూడా 'ప్రిన్స్' చాలా గ్రాండ్ గా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడట. అందుకే తనను హీరోగా లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ 'అశ్వినీదత్' ని ఈ మూవీని నిర్మించే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. 'అశ్వినీదత్' పాటు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి మూవీ నిర్మించిన 'దిల్' రాజు కూడా ఈ మూవీలో పార్టనర్ గా చేరినట్లు తెలుస్తోంది. 'మహేష్ బాబు' 25వ సినిమాకి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. 'ఊపిరి' లాంటి మెమరబుల్ సక్సెస్ తో ఇండస్ట్రీని ఆకర్షించిన ఈ దర్శకుడు 'ప్రిన్స్' ల్యాండ్ మార్క్ మూవీ కోసం ఓ ఫీల్ గుడ్ స్టోరీని రెడీ చేసినట్లు వినిపిస్తోంది. స్టోరీ విన్న 'మహేష్' వెంటనే దర్శకుడికి ఒకే కూడా చెప్పాడట. ఈ స్టోరీ అమెరికా బేస్డ్ గా సాగే చక్కటి ఫ్యామిలీ మూవీ అని సమాచారం. వచ్చే ఎడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లుతుందని వినికిడి.

కష్టాల్లో రైతులు - కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో వ్యవసాయరంగంపై చర్చ జరుగుతోంది. కష్టాల్లో ఉన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించడం జరుగుతుందని, కానీ ప్రభుత్వం నుండి ప్రజలకు సరైన సహకారం లేదన్నారు. గత రెండేళ్లలో తెలంగాణ రైతులు అధికంగా నష్టపోయారని సభకు తెలిపారు. ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే పంపిణీ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత జీవితాలు మారుతాయని రైతులు భావించారని, ఈ దిశగా రైతులను ఆదుకోవాల్సినవసరం ఉందన్నారు.

14:00 - December 21, 2016

న్యాయ సలహాలు..సందేహాలకు నివృతి కల్పించే మైరైట్ కార్యక్రమం ఈరోజు కూడా మన ముందుకు వచ్చేసింది. న్యాయ సలహాలు సందేహాలను తెలిపేందుకు అడ్వకేట్ పార్వతి మనముందున్నారు. ఈరోజు హిందూ వివాహ చట్టం..షరతులు.. అనే అంశంపై పార్వతి గారు మాట్లాడేందుకు సిద్ధంగా వున్నారు. కాగా హిందూ వివాహ చట్టం 1955లో వచ్చినప్పటికీ, ఈ చట్టం అమల్లోకి రాకముందు, వచ్చిన తరువాత జరిగిన వివాహములు రద్దు చేసుకుని విడాకులు కావాలని భార్య/భర్త కోర్టును కోరే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఇదే అంశంపై పార్వతిగారు తెలిపే విషయాల కోసం ఈ వీడియోను చూడండి..

13:53 - December 21, 2016

ఢిల్లీ : బ్యాంక్ డిపాజిట్ దారులకు ఆర్బీఐ ఊరట కలిగించింది. రూ. 5వేలు మాత్రమే డిపాజిట్ చేయాలన్న షరతును ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఈ అంశంపై ఈ నెల 19 విడుదల చేసిన సర్క్యులర్ ను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. రూ5వేల పాత కరెన్సీని ఒకేసారి డిపాజిట్ చేయాలంటూ గతంలో ఆర్బీఐ కండిషన్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతకు మించి ఎక్కువ ఎమౌంట్ వేయాలంటే కారణాలు తెలిపాలంటూ సర్క్యులర్ పేర్కొన్న సంగతి తెలిసందే. వీటిని ఉపసంహరించుకున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది.

13:46 - December 21, 2016

తమిళనాడు : అన్నా డీఎంకే నేతల్లో ఐటీ దాడులు వణుకుపుట్టిస్తున్నాయి.. తమిళనాడు ఐటీ రామ్మోహన్‌రావు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. సాక్షాత్తూ..రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై ఐటీ దాడులు చేపట్టం సంచలనం కలిగిస్తోంది. చూస్తుంటే ఈ దాడులు జయలలిత ప్రియనెచ్చెలి శశికళను టార్గెట్ చేయనున్నట్లుగా కూడా అవకాశం లేకపోలేదు. ఐటీ దాడుల నేపథ్యంలో సీఎం పన్నీర్ సెల్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

మొత్తం 13చోట్ల అధికారులు తనిఖీలు
చెన్నై అన్నా నగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు జరుపుతున్నారు..సీఎస్ కార్యాలయం, ఇంటితోపాటు... మొత్తం 13చోట్ల అధికారులు తనిఖీలు జరుపుతున్నారు..ఈ క్రమంలో ఆయన నివాసం వద్ద భారీగా ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు భారీగా మోహరించాయి. డీఎంకే నేతల్లో ఈ దాడులు వణుకు పుట్టిస్తున్నాయి. రామ్మోహన్‌రావు కుమారుడు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు.. చెన్నైతోపాటు బెంగళూరు, చిత్తూరులోకూడా సోదాలు జరుపుతున్నారు.. వందమంది ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు చేస్తున్నారు.. రామ్మోహన్‌ రావు గత సీఎం జయలలితతోపాటు.. పన్నీర్‌ సెల్వంకుకూడా సన్నిహితుడు.. గతవారం శేఖర్‌ రెడ్డి నివాసంలో దొరికిన పత్రాల ఆధారంగా సీఎస్‌ ఇంటిపై అధికారులు దాడులు చేశారని తెలుస్తోంది.. శేఖర్‌ రెడ్డితో రామ్మోహన్‌కు ఉన్న సంబంధాలపై అధికారులు ఆరాతీస్తున్నారు.. ప్రభుత్వంనుంచి శేఖర్‌రెడ్డికి ఈ మెయిల్స్ వెళ్లినట్లుకూడా తెలుస్తోంది.. రామ్మోహన్‌ రావు భారీగా డబ్బును బంగారంరూపంలోకి మార్చారని... అలాగే శేఖర్‌ రెడ్డితోకలిసి ఇసుక కాంట్రాక్టుల్లో అక్రమాలు చేశారని ఆరోపణలొస్తున్నాయి..

రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తోంది : స్టాలిన్
ప్ర‌ధాన కార్శ‌ద‌ర్శి రామ్మోహ‌న్‌రావు ఇంట్లో ఆదాయ‌ప‌న్ను శాఖ‌ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇంటి వ‌ద్ద భారీగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. సీఎస్‌పై ఐటీ శాఖ దాడులు నిర్వ‌హిస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రతిప‌క్ష పార్టీ నేత‌లు అన్నాడీఎంకే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌కు గురిపెట్టారు. డీఎంకే నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే పార్టీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.త‌మిళ‌నాడు రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ప్ర‌భుత్వ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిపై ఐటీ శాఖ‌ దాడులు చేయ‌డం ఇంతవరకు జరగలేదని, ఇదే ప్ర‌థ‌మ‌మ‌ని ఆయ‌న అన్నారు. సీఎస్ నివాసంపై ఐటీ దాడులు నిర్వ‌హిస్తుండ‌డం రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  

సంక్షోభంలో వ్యవసాయ రంగం - ఉత్తమ్..

హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడిందని టి.కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ పేర్కొన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక రైతులు బాగుపడుతామని ఆశించారని తెలిపారు.

13:42 - December 21, 2016

వరుసగా డిజాస్టర్స్ తో హీరోయిన్ గా 'కాజల్ అగర్వాల్' శకం ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ ఈ బ్యూటీ భారీ ఆఫర్లతో కుమ్మేస్తోంది. తెలుగు తమిళం అనే తేడా లేకుండా ఈ బ్యూటీ రిపీట్ కాంబినేషన్స్ ని రిపీట్ చేస్తోంది. విజయ్ తో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన కాజల్ మరో మూవీలో నటించబోతుందట. ఇంతకీ కాజల్ నటిస్తున్న కొత్త మూవీస్ ఏంటో హావ్ ఏ లుక్. ఈ ఎడాది కాజల్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన రెండు బడా సినిమాలు 'సర్ధార్ గబ్బర్ సింగ్', 'బ్రహ్మోత్సవం' బాక్సఫీసు వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో ఇక టాలీవుడ్ లో 'కాజల్' కి ఛాన్స్ లు రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ సక్సెస్ ఫెల్యూర్స్ తో సంబంధం లేకుండా దర్శకనిర్మాతలు ఈ బ్యూటీకి అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'చిరంజీవి'కి జోడిగా 'ఖైదీ నెంబర్ 150'లో నటిస్తోంది. వీటితో పాటు మరో రెండు క్రేజీ సినిమాల్లో ఈ బ్యూటీనే హీరోయిన్ గా తీసుకున్నారంట.

విజయ్ తో..
'కాజల్' ని తమ సినిమాల్లో రిపీట్ చేయడానికి టాప్ హీరోలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే 'ఎన్టీఆర్' తో మూడు సినిమాలు చేసింది. బృందావనం, బాద్ షా, టెంపర్ మూవీలో యంగ్ టైగర్ తో జోడి కట్టిన ఈ బ్యూటీ లేటేస్ట్ గా నాలుగో సారి జోడి కట్టబోతోంది. 'జనతా గ్యారేజ్' లో 'పక్కా లోకల్' అంటూ 'కాజల్' ఆ మూవీకి బూస్టింగ్ ఇచ్చింది. ఇప్పుడు దర్శకుడు బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించబోయే మూవీలో 'కాజల్' వన్ ఆఫ్ ది హీరోయిన్ గా సెట్ అయినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ తో కూడా కాజల్ మరోసారి నటించబోతోంది. గతంలో ఈ బ్యూటీ విజయ్ సరసన ఆమె 'జిల్లా’, 'తుపాకి' సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు కూడా అక్కడ ఘన విజయాలను అందుకున్నాయి. ఆ సెంటిమెంట్ తోనే విజయ్ తదుపరి సినిమాలో ఆమెను తీసుకున్నారట. శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాకి అట్లీ కుమార్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

13:37 - December 21, 2016

హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డిని టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి కలిశారు.. పలు అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.. జానాకు జేసీ కొన్ని సూచనలు కూడా ఇచ్చారు.. ప్రభుత్వంపై మీరు సరిగా పోరాడటంలేదని స్పష్టంచేశారు.. విభజన సమయంలో సీమలోని రెండు జిల్లాల్ని కలుపుకోవాలని చెప్పినా వినలేదని గుర్తుచేశారు.. అప్పుడు రెండు జిల్లాల్ని కలుపుకొనిఉంటే కాంగ్రెస్‌ అధికారంలోకివచ్చిఉండేదని అన్నారు.. అలాగే నోట్ల రద్దుతో గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.. 

35 లక్షల 30 వేల మందికి రుణమాఫీ - మంత్రి పోచారం..

హైదరాబాద్ : వ్యవసాయ రంగంపై మంత్రి పోచారం చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'సబ్సిడీ రైతులకు వ్యవసాయ పనిముట్టు ఇస్తున్నాం..35 లక్షల 30 వేల మందికి రైతు రుణమాఫీ..రైతు రుణమాఫీకి రూ. 12.105 కోట్లు..పౌలీ హౌస్ ల సబ్సిడీని 75 శాతానికి పెంచాం..పసుపు సాగులో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం..2015-16 సంవత్సరానికి 5 లక్షల భూ సార పరీక్షలు చేయడం జరిగింది...తెలంగాణలో 44 భూసార పరీక్షా కేంద్రాలున్నాయి..రైతులకు అధిక రాయితీలు కల్పిస్తున్నాం'...అని తెలిపారు.

13:33 - December 21, 2016

విజయవాడ : అధికారులు, ప్రజాప్రతినిధుల్లో పనితీరు మెరుగుపడితే ఆశించిన ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సమష్టి కృషి జరిగితే వందశాతం ఫలితాలు వస్తాయన్నారు. ఈ ఏడాది 15శాతం వృద్ధిని టార్గెట్‌గా పెట్టుకోగా.. ఇప్పటికే 12.23శాతం సాధించామన్నారు. రాబోయే 15ఏళ్లపాటు ఈ వృద్ధి ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి తిరుగుండదన్నారు. కొన్ని శాఖలు ఉత్తమ ఫలితాలు సాధిస్తోంటే.. మరికొన్ని శాఖలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్నారు. అందుకే ప్రతిఒక్కరూ పనితీరు, నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. తమకు ఐదేళ్లకొకసారి ఎన్నికల రూపంలో పరీక్షలు ఉంటాయని.. అక్కడ నెగ్గకపోతే ఇన్నాళ్లూ చెప్పిందంతా ఒక చరిత్రగానే మిగిలిపోతుందన్నారు. 

ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కార్మికులకు చెల్లింపులు బ్యాంకుల ద్వారా చేయాలని ఆర్డినెన్స్ జారీ చేసింది.

 

13:31 - December 21, 2016

హైదరబాద్ : ప్రశ్నోత్తరాల సమయంలో హైవే బార్స్‌, వైన్‌ షాపులపై వివిధ పక్షాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా జాతీయ రహదారులపై ఉన్న వైన్‌ షాపులను తొలగిస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఈ విషయంపై హోమంత్రి నాయిని మాట్లాడుతు..-జాతీయ రహదారులపై వైన్‌ షాపులను తొలగిస్తాం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని తెలిపారు. 

13:25 - December 21, 2016

హైదరాబాద్ : ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం కింద పదకొండు సాగునీటి ప్రాజెక్ట్‌లకు కేంద్రం నుంచి 537 కోట్ల రూపాయల గ్రాంటు వచ్చిందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. మిగిలిన 690 కోట్ల గ్రాంటు మరో ఏడాదిలో వచ్చే అవకాశం ఉందని ప్రశ్నోత్తరాల సమయంలో సభదృష్టికి తెచ్చారు. మిగిలిన నిధులను FRBMతో లింకు లేకుండా నాబార్డు నుంచి రుణం రూపంలో సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

13:18 - December 21, 2016

తమిళనాడు : తమిళనాడులోని అన్నా డీఎంకే నేతల్లో ఐటీ దాడులు వణుకుపుట్టిస్తున్నాయి.. తమిళనాడు సీఎస్ రామ్మోహన్‌రావు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. చెన్నై అన్నా నగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.. సీఎస్ కార్యాలయం, ఇంటితోపాటు... మొత్తం ఏడుచోట్ల అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.. రామ్మోహన్‌ రావు గత సీఎం జయలలితతోపాటు.. పన్నీర్‌ సెల్వంకుకూడా సన్నిహితుడు.. గతవారం శేఖర్‌ రెడ్డి నివాసంలో దొరికిన పత్రాల ఆధారంగా సీఎస్‌ ఇంటిపై అధికారులు దాడులు చేశారని తెలుస్తోంది.. రామ్మోహన్‌ రావు భారీగా డబ్బును బంగారంరూపంలోకి మార్చారని... అలాగే శేఖర్‌ రెడ్డితోకలిసి ఇసుక కాంట్రాక్టుల్లో అక్రమాలు చేశారని ఆరోపణలొస్తున్నాయి.. 

13:13 - December 21, 2016

హైదరాబాద్ : రైతులకు మద్ధతు ధర ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం తెలిపారు. ధాన్యం నిల్వ చేసుకునేందుకు గిట్టుబాటు ధర వచ్చేందుకు రూ.1024 కోట్ల ఖర్చుతో గోదాములను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 44 భూసార కేంద్రాలున్నాయని 2015..16 ఏడాదికి మట్టి నమూనాలను సేకరించామని తెలిపారు. రైతులను ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రైతాంగ అవసరాలను గుర్తించి మిషన్ కాకతీయ కింద 16వేల చెరువులను రూ.4వేల కోట్ల తో పునరుద్ధరించామని తెలిపారు. కోటి ఎకరాలకు నీరిచ్చేవిధంగా మిషన్ భగీరథ చేపట్టిందని తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఉపయోగించి దిగుబడి పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

మంత్రులతో సీఎం పన్నీర్ సెల్వం అత్యవసర సమావేశం..

చెన్నై : సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రులుతో సీఎం పన్నీర్ సెల్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

వెనక్కి తగ్గిన ఆర్బీఐ..

ఢిల్లీ : రూ. 5వేల డిపాజిట్లపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. పరిమితి లేకుండా ఎంతైనా డిపాజిట్ చేసుకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 19వ తేదీన జారీ చేసిన సర్క్యూలర్ ను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది.

13:00 - December 21, 2016

కేరళ కుట్టి 'అనుపమ పరమేశ్వరన్' మరో గోల్డెన్ ఛాన్స్ పట్టేసినట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. ఇప్పటికే యంగ్ టైగర్ నటించే అవకాశం కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో బిగ్ చాన్స్ అందిపుచ్చుకున్నట్లు సమాచారం. కేరళ కుట్టి 'అనుపమ పరమేశ్వరన్' 'అ..ఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన విషయం తెలిసిందే . ఈ మూవీలో గయ్యాళి పిల్లగా నటించిన తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది. ఈ సినిమా సక్సెస్ తో 'అనుపమ'కు వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. 'ప్రేమమ్' ఒరిజినల్ లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో 'ప్రేమమ్'లో కూడా సేమ్ క్యారెక్టర్ లో నటించింది. ప్రస్తుతం 'శర్వానంద్' కి జోడిగా 'శతమానం భవతి'లో నటిస్తున్న ఈ చిన్నది త్వరలోనే 'ఎన్టీఆర్' తో పాటు మరో బిగ్ స్టార్ తో నటించే బంఫర్ ఆఫర్ పట్టేసింది.

చరణ్ సినిమాలో..
అనుపమ పరమేశ్వరన్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందే సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించబోతుంది. ఇప్పుడు ఈ బ్యూటీ మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. మెగా హీరో నటించే ఛాన్స్ పట్టేసినట్లు సమాచారం. మెగా హీరోతో నటించనున్న సినిమా హిట్టు అయితే కనుక హీరోయిన్ గా ఈ బ్యూటీ గ్రాఫ్ మారినట్లే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.'చరణ్' తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో కొనసాగుతుంది. ఇందులో 'అనుపమ పరమేశ్వరన్' ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు వినిపిస్తుంది. దాదాపు ఆమె ఎంపిక ఖరారైనట్టేనని చెబుతున్నారు. అయితే ఈ బ్యూటీనే హీరోయిన్ నా లేక మరో హీరోయిన్ ఉంటుందా అనేది తెలియాల్సింది.

12:54 - December 21, 2016

బాలీవుడ్ మిస్టర్ ఫర్ పెక్ట్ తెలుగు స్టార్స్ తో నటించాలని ఆశపడుతున్నాడట. అంతేకాదు రాజమౌళి డ్రీమ్ మూవీ మహాభారతంలో నటించాలని ఉందని క్లారిటి ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో తనకు సూట్ అయ్యే పాత్ర గురించి కూడా మిస్టర్ ఫర్ పెక్ట్ వివరించాడు. క్యారెక్టర్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడే హీరో 'అమీర్ ఖాన్’. అందుకే బాలీవుడ్ లో ఈ హీరో అందరూ మిస్టర్ ఫర్ పెక్ట్ అంటారు .అందుకు తగ్గట్టే ఈ అమీర్ లుక్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. తర్వలో తన కొత్త మూవీ 'దంగల్' రిలీజ్ కాబోతోంది. రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ లో భాగంగా హైదారాబాద్ కి వచ్చిన అమీర్ అనేక ఇంట్రెటింగ్ విశేషాలు చెప్పాడు.

మల్టీ స్టారర్ చిత్రం వస్తుందా ?
'దంగల్' ప్రమోషన్స్ లో భాగంగా 'అమీర్ ఖాన్' రాజమౌళి డైరెక్షన్ లో మూవీ చేయాలనే ఆశను వ్యక్తం చేశాడు. అంతేకాదు జక్కన్న కలల సినిమా మహాభారతంలో నటించేందుకు తను సిద్దమంటూ ఇండికేషన్స్ ఇచ్చాడు. మహాభారతంలో తనకు కర్ణుడు, కష్ణుడి పాత్రలంటే ఇష్టమని చెప్పిన 'అమీర్' కర్ణుడి అరడుగుల అజానుభావుడు కనుక నేను సెట్ కానని అసలు విషయం చెప్పాడు. ఇక జక్కన్న మహాభారతంలో ఛాన్స్ ఇస్తే కృష్ణుడిగా నటిస్తానని ఓపెన్ అయ్యాడు. రాజమౌళి సినిమాతోనే కాకుండా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉందనే ఆశను కూడా బయటపెట్టాడు. చిరు.పవన్ అంటే తనకెంతో ఇష్టమని ఆ ఇద్దరితో మల్టీస్టార్ మూవీస్ లో నటించాలని ఉందని, అయితే బలమైన స్టోరీస్ తో ఎవరూ వచ్చిన తను సిద్దమేనని చెప్పాడు. ఇక కోలీవుడ్ లో రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందనే విషయాన్ని కూడా బాలీవుడ్ స్టార్ తెలిపాడు. మరి అమీర్ ఖాన్ తన ఇష్టాన్ని చెప్పాడు కాబట్టి ఎవరైనా దర్శకనిర్మాతలు మన స్టార్స్ తో ఈ స్టార్ ని కలిపి మల్టీస్టార్ ప్లాన్ చేస్తారో చూడాలి.

12:53 - December 21, 2016

టీఎస్పీఎస్సీ ద్వారా జీహెచ్ఎంసీ ఖాళీల భర్తీ - కేటీఆర్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని శాసనమండలిలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 533 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు, గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాలన్నారు. డ్రైపోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోందని, నగరానికి రెండు వైపులా 2 డ్రై పోర్టుల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు.

12:47 - December 21, 2016

తూర్పుగోదావరి  : వైసీపీ లో మరో వికెట్ డౌన్ కానుంది. పామర్రు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు పెను మార్పులను సంతరించుకున్నాయి. పామర్రు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. కానీ ఉప్పులేటి రాకను వర్ల రామయ్య వ్యతిరేకిస్తున్నారు. ఆమె రాకతో పార్టీకి నష్టం కలుగుతుందనీ..అధిష్టానానికి ఆయన సూచిస్తున్నారు. మరోపక్క కల్పనను సముదాయించేందుకు వైసీపీ అధిష్టానం తీవ్రంగా యత్నిస్తోంది. 2004లో టీడీపీ నుంచి కల్పన రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ తరఫున నిడుమోలు నుంచి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి పాటూరి రామయ్యపై ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో రెండోసారి కూడా టీడీపీ టికెట్‌పై పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేసి దాస్‌ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

రైతులకు బ్యాంకులు రుణాలివ్వడం లేదు - షబ్బీర్..

హైదరాబాద్ : రైతులకు బ్యాంకులు రుణాలివ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో ఐదో రోజు బుధవారం నాడు కొనసాగిన సమావేశాల్లో వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధాన జీవనాధారం వ్యవసాయమని, సంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. 35 లక్షళ మంది రైతులకు 4 దశల్లో రుణమాఫీ అన్నారని, తొలి విడతలో కనీసం 50 శాతం మంది రైతులకు రుణమాఫీ చేసి ఉంటే ఇబ్బందులు ఉండేవి కాదనవ్నారు.

వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత - మంత్రి తుమ్మల..

హైదరాబాద్ : శాసనమండలిలో ఐదో రోజు బుధవారం నాడు కొనసాగిన సమావేశాల్లో వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చిందని, తెలంగాణలో 44 భూసార పరీక్షా కేంద్రాలున్నాయన్నారు. పంటల భీమా పథకాన్ని విజయంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతు యూనిట్ గా పంటల భీమా పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి చొప్పున 1000 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం జరిగిందన్నారు. రైతులకు పంట రుణమాఫీ అమలు చేసినట్లు తెలిపారు.

కార్యకర్తలతో మోదీ ముఖాముఖి ..

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ గురువారం వారణాసిలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని వారణాసిలో ప్రాచీన దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించనున్నారు. అనంతరం డీజిల్ లొకోమోటివ్ వర్క్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో 20వేల మంది పార్టీ కార్యకర్తలతో ప్రధాని ముఖాముఖిలో పాల్గొననున్నారు. 2017 యూపీలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు మోదీ వారితో ముఖా ముఖీ కార్యక్రమం నిర్వహించనున్నారు. 

టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యే..!

విజయవాడ : పామర్రు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీసీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమౌతున్నారు. ఈ నెల 25వ తేదీన టిడిపి కండువా కప్పుకొనేందుకు సిద్ధమౌతున్న ఉప్పులేటిని బుజ్జగించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కల్పనను టిడిపిలోకి ఆహ్వానించవద్దని టిడిపి నేత వర్ల రామయ్య సూచిస్తున్నట్లు, టిడిపి పెద్దలు వర్ల రామయ్యను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

జానాతో టిడిపి ఎంపీ జేసీ భేటీ..

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ నేత జానారెడ్డిని టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వంపై మీరు సరిగ్గా పోరాడడం లేదని, రెండు జిల్లాల్ని కలుపుకుని ఉంటే బాగుండేదని జేసీ పేర్కొన్నారు. విభజన సమయంలో సీమలోని రెండు జిల్లాలను కలుపుకుని ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదని తెలిపినట్లు తెలుస్తోంది. నోట్ల రద్దుతో పల్లెల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

హోటల్లో అగ్నిప్రమాదం..6గురు మృతి..

మహారాష్ట్ర : గోండియాలోని ఓ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జానాతో జేసీ భేటీ..

హైదరాబాద్ : ఏపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఈ రోజు ఉద‌యం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ప్ర‌త్య‌క్షమ‌య్యారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డితో కాసేపు ముచ్చ‌టించారు. తెలంగాణ స‌ర్కారుపై కాంగ్రెస్ నేత‌లు సరిగా పోరాడడం లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. జానారెడ్డితో మాట్లాడుతూ పలు జోకులు పేల్చారు. రాయలసీమలోని రెండు జిల్లాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో కలిపి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వ‌చ్చేద‌ని అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు - నాయినీ..

హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైవేలపై మద్యం షాపుల నిషేధానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు

జరిమానాల ద్వారా రూ.11.8 కోట్ల ఆదాయం - కేటీఆర్..

హైదరాబాద్ : ఇసుక అక్రమ రవాణాల్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై వేటు వేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జరిమానాల రూపంలో ప్రభుత్వానికి రూ. 11.8 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రకటించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టామన్నారు.

11:53 - December 21, 2016
11:50 - December 21, 2016

60 జూ.కళాశాలలకు నిధులు మంజూరు - కడియం..

హైదరాబాద్ : 60 జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని డిప్యూటి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అన్ని జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ సిస్టమ్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు, జూనియర్ కాలేజీల్లో గత ర రెండేళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని తెలిపారు.

బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రత్యేక జీవో - ఇంద్రకిరణ్ రెడ్డి..

హైదరాబాద్ : బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రత్యేక జీవోను తీసుకొచ్చామని, బ్రాహ్మణ సంఘం ఏర్పాటుకు స్థల సేకరణ చేయడం జరిగిందని మంత్రి ఇంద్రకిరణ్ పేర్కొన్నారు. బ్రాహ్మణుల జీత, భత్యాల అంశంపై అధ్యయనం చేసేందుకు సీఎం ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ వేశారని తెలిపారు. బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఏడాదికి రూ. 100 కోట్లు ఇస్తున్నట్లు, 1805 ఆలయాల్లో అర్చకులకు నెలకు రూ. 6వేలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

11:43 - December 21, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు తరువాత..నగదు రహిత లావాదేవీలపై కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కార్మిక శాఖలో నగదు రహిత లావాదేవాలను ప్రోత్సహించేదిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఖాతాలు, చెక్కుల ద్వారా కార్మికుల జీతాలు తప్పనిసరి చేసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. వేతన చెల్లింపుల చట్టం 1936 కు సరవరణల్ని కేంద్రం చేయనుంది. చట్ట సవరణల్ని ఆర్డినెన్స్ రూపంలో కేంద్ర తీసుకురానుంది. ఇందులో భాగంగా ఏ కంపెనీ యాజమాన్యమైనా, తమ ఉద్యోగులకు వేతనాలను చెక్కులు లేదా ఈ-పేమెంట్ రూపంలో చెల్లించవచ్చు. దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నగదు రహిత చెల్లింపుల వ్యవస్థకు మారేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపకరిస్తుంది. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే, యాజమాన్యం తమకు నచ్చిన పద్ధతిలో చెల్లింపులు జరుపుకోవచ్చు.

11:27 - December 21, 2016

హైదరాబాద్ : ఉదయం నిలబడి వుంటే 11 గంటలకు బ్యాంక్ వారు టోకెన్లు ఇస్తున్నారనీ..డబ్బులు తీసుకునేందుకు మరునాడు రావాల్సివస్తోందని తార్నాకలోని ఎస్బీహెచ్ బ్యాంక్ ఖాతారులు వాపోతున్నారు. ఉదయం నుండి పడిగాపులు పడితే రూ.4వేలు మాత్రమే వస్తున్నాయనీ..రోజువారీ ఖర్చులకు సరిపోవటంలేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో నగదు కష్టాలపై చర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు చెబుతున్నారు తప్ప ఆచరణలో కనిపించటంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పాత పెద్ద నోట్లు రద్దు అయిన 43 రోజులయ్యింది. కానీ ఇంతవరకూ ప్రజలకు నగదు..చిల్లర కష్టాలు మాత్రం తీరటంలేదు. పలు ఏటీఎం ల వద్ద అవుటాప్ సర్వీస్ బోర్డులు..బ్యాంకులలో నో క్యాష్ బోర్టులు దర్శమిస్తున్నాయి. 

కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కార్మిక శాఖకి సంబంధించి వేతన చెల్లింపుల చట్టం 1936కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ ను కేంద్ర కేబినెట్ తేనుంది. కార్మిక శాఖలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించాలని యోచిస్తోంది.

నగదురహిత రాష్ట్రంగా మార్చడానికే ఏపీ పర్స్ - కేఈ..

విజయవాడ : కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. మొదటి అర్ధ సంవత్సరం ఫలితాలపై విశ్లేషణ జరిగింది. గడిచిన ఆర్నేళ్లకు 12.23 శాతం వృద్ధి రేటు సాధించామని ఇది దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ అని మంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నగదు రహిత రాష్ట్రంగా మార్చడానికే ఏపీ పర్స్ ప్రారంభించినట్లు తెలిపారు.

 

12.23 శాతం వృద్ధి రేటు - బాబు..

విజయవాడ : ఇప్పటి వరకు 12.23 శాతం వృద్ధి రేటు సాధించడం జరిగిందని, సంవత్సరకాలంలో పట్టిసీమను పూర్తి చేయడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి చేశామన్నారు. అన్ని శాఖల్లో జవాబుదారీతనం పెంచాలని విజయవాడ కలెక్టర్ల సమావేశంలో సూచించారు.

వ్యవసాయ రంగంలో ఆశాజనకంగా వృద్ధి రేటు- యనమల..

విజయవాడ : వ్యవసాయరంగంలో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని, ఈ ఏడు సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని మంత్రి యనమల పేర్కొన్నారు. పారిశ్రామిక సెక్టార్ లో తయారీ రంగం వృద్ధి రేటు బాగుందని, సేవారంగంలో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ఏపీలో పట్టణీకరణ జరిగితే సేవా రంగంలో టూరిజం వృద్ధి రేటు మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డీమానిటైజేషణ్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి 30 శాతం రెవెన్యూ పడిపోయిందని మంత్రి యనమల పేర్కొన్నారు.

11:14 - December 21, 2016

విజయవాడ : కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. నగదు వృద్ధి రేటుపై కలెక్టర్లకు చంద్రబాబు సూచనలు చేస్తున్నారు. ఈ విషయంపై ప్రతీ మూడు నెలలకోసారి పున:సమీక్షించుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ సమర్థవంత నైపుణ్యాన్ని పొందించుకోవాలనీ..అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వానికి హాఫ్ ఇయర్లీ పరీక్షలు పూర్తయ్యాయన్నారు. ఈ కాలంలో రాష్ట్ర వృద్ధిరేటు టార్గెట్ 15 శాతంగా పెట్టుకున్నామనీ.. ప్రస్తుతం 12.23 శాతం సాధించామని తెలిపారు.  

మెట్టుగూడ వద్ద కారులో మంటలు..

హైద‌రాబాద్‌ : మెట్టుగూడ వ‌ద్ద ఓ కారులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ర‌హ‌దారి వ‌ద్ద ఉన్న ప్ర‌యాణికులు భయాందోళనలకు లోనయ్యారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని కారులో మంట‌లార్పుతున్నారు. దీంతో ర‌హ‌దారిపై సుమారు 2 కిలో మీట‌ర్లు వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

10:57 - December 21, 2016
10:56 - December 21, 2016
10:52 - December 21, 2016

విజయవాడ : కాసేపట్లో విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో కలెక్టర్ల సమావేశం ప్రారంభంకాబోతోంది.. రెండంకెల వృద్ధిరేటు, ప్రజలకు సంతృప్తికలిగేలా పాలన అందించడంపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచనలు అందించబోతున్నారు.. అలాగే మొదటి అర్థ సంవత్సరం ఆర్థిక ఫలితాలను కూడా విశ్లేషించబోతున్నారు.. విభాగాలవారీగా నిర్దేశించిన పురోగతి, సాధించిన ఫలితాలపైనా చర్చించనున్నారు.. నోట్ల రద్దు అనంతర పరిస్థితులపైనా ఈ రెండురోజుల సమావేశంలో చర్చించబోతున్నారు.. 

10:48 - December 21, 2016
10:45 - December 21, 2016

తమిళనాడు : అన్నా డీఎంకే నేతల్లో ఐటీ అధికారులు వణుకు పుట్టిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం తమిళవాసి..టీటీడీ పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంలో దాడులు చేసిన అధికారులకు విస్మయంపొందే ఆస్తులు బైటపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏకంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీనే టార్గెట్ చేసిన ఐటీ దాడులు చేపట్టింది. చెన్నైలోని అన్నానగర్ లోని ఆయన నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇసుక రీచ్ ల్లో రామ్మెహన్ రావు ప్రధాన సూత్రధారిగా వున్నాడు. భారీగా డబ్బును బంగారంగా మార్చారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఐటీ ఈ సోదాలు చేపట్టింది. ఏడు ప్రాంతాల్లో 100మంది ఐటీ అధికారులు ఐటీ దాడులు కొనసాగిస్తున్నారు. రామ్మెహన్ రావుతో పాటు అతనితో పాటు సత్ సంబంధాలున్న పలువురు నేతల నివాసాల్లో కూడా తనిఖీ చేయాలనే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. తమిళవాసి..టీటీడీ పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంలో దాడులు చేసిన అధికారులకు విస్మయంపొందే ఆస్తులు బైటపడిన విషయం తెలిసిందే. దాదాపు 170 కిలోల బంగారం..రూ.100కోట్లు పట్టుబడిన నగదు..ఇవి కాకుండా ఇంకా పలు ల్యాండ్ పత్రాలు బైటపడిన విషయం తెలిసిందే. శేఖర్ రెడ్డి పలువురికి బినామీగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా రాష్ట్ర సీఎస్ నివాసంలోనే ఐటీ సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఇక క్రింది స్థాయివారిపై ఈ దాడులు కొనసాగే అవకాశాలున్నట్లుగా సమచారం.

10:43 - December 21, 2016

ఢిల్లీ : నగరంలోనే ప్రతిష్టాత్మక  యూనివర్శిటీ   జేఎన్ యూలో ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నజీబ్ అదృశ్యమైన విషయం తెలిసిందే. నజీబ్ అదృశ్యమై 65 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యల్ని కొనసాగిస్తునేవున్నారు. అయినా నజీబ్ ఆచూకీ దొరకలేదు. నజీబ్ ఆచూకీ గురించి సమాచారం అందించినవారికి రూ.10లక్షల బహుమానాన్ని కూడా పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో నజీబ్ స్నేహితులకు..రూమ్ మేట్స్ కు పాలీగ్రాఫ్ పరీక్షలు చేయనున్నారు. దీనికి సంబంధించి నగరంలోని రోహిణి ఎఫ్ ఎస్ ఎల్ ల్యాబ్ లో పరీక్షలకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. కాగా జేఎన్ యూలో విద్యార్ధులు అదృశ్యం అవ్వటం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. 

10:41 - December 21, 2016

విజయవాడ : నగరంలోని వన్ టౌన్ లోని బంగారం దుకాణాలపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. వందల కోట్ల రూపాయల మేరకు బంగారం కొనుగోళ్ళపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా నోట్ల రద్దు అనంతరం బంగారు కొనుగోలు చేసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మంగళవారం నుండి ఈ దాడులు కొనసాగుతున్నాయి. కాగా పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్ మనీతో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై దృష్టి పెట్టిన ఈడీ..ఐటీ అధికారులు ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. 

10:39 - December 21, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం పది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. తర్వాత జీరో అవర్‌లో చేపడ్డారు. అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై లఘు వ్యవధి చర్చ నిర్వహిస్తారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష సభ్యులు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యారు. రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు వ్యూహ రచన చేశాయి. ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. కొమురవెల్లి మల్లన్నకు సమర్పించిన కోడె దూడలను ఆలయ అధికారులు కబేళాలకు అమ్ముతున్న అంశంపై టీడీఎల్పీ వాయిదా తీర్మానం ఇచ్చింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై బీజేపీ వాయిదా తీర్మానం ప్రతిపాదించింది.

 

10:38 - December 21, 2016

హైదరాబాద్ : కేంద్ర పాత పెద్దనోట్లు రద్దు చేసిన నేటికి 43 రోజులయ్యింది. కానీ ఇంతవరకూ ప్రజలకు నగదు కష్టాలుతీరటంలేదు. ఎప్పటికప్పుడు నగదు కష్టాలకు తగిన చర్యలు తీసుకుంటున్నామంటూ అధికారులు..ప్రజాప్రతినిధులు మాటలతో ఊదరగొడుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించటంలేదు. ప్రతీరోజూ బ్యాంకుల వద్ద ఏటీఎంల వద్ద లైన్లలో నిలబడ్డ జనం బారులు తీరి నిలబడేవుంటున్నారు. పనులను మానుకుని లైన్లలో నిలబడినా పూర్తిస్థాయిలో మాత్రం నగదు అందటంలేదని వాపోతున్నారు. పలు ప్రాంతాలలో అయితే దాదాపు 90 శాతం ఏటీఎంలు పనిచేయటంలేదు. చిల్లర లేమితో చిరు వ్యాపారులు అల్లాడిపోతున్నారు. రైతన్నలు సాగు వేయటానికి చేతిలో పైకం లేక ఏం చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరోపక్క పండిన పంటను అమ్ముకోలేని స్థితిలో కూడా అన్నదాత అల్లాడిపోతున్నాడు. పండిన పంట అమ్ముకుంటేనే మరోపంట వేసుకునేందుకు చేతిలో డబ్బులొస్తాయి. ఈ స్థితిలో పంట వేసేందుకు భయపడుతున్నాడు. 43 రోజులైన నగదు కష్టాలు తీరకపోవటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజల్లోనూ కేంద్ర ప్రభుత్వంపై అసహనం పెరుగుతోంది. ప్రత్యామ్నాయాలు చూపకుండా తమకు ప్రత్యక్ష నరకం చూపుతున్నారని ప్రధాని మోదీపై జనం మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తర్నాకలోని ఏక్సిస్ బ్యాంక్ వద్ద ప్రజలు బ్యాంకులో నిలబడి వున్నారు. వారేమంటున్నారో తెలుసుకుందాం..

10:38 - December 21, 2016

మంచిర్యాల : కోమరంభీం జిల్లాలో చాలా సమస్యలున్నాయని... వాటిని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని సీపీఎం నేత తమ్మినేని అన్నారు. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని ప్రభుత్వం గాలికొదిలేసిందని, దీంతో పేదలు ఇంగ్లీష్‌ మీడియంలో చదివే అవకాశం లేకుండా పోయిందని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.

65వ రోజులు..1700ల కి.మీటర్లకు పాదయాత్ర
పదండి ముందుకు.. పోదాం పోదాం అంటూ.. జనం బాట పట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 65వ రోజు పూర్తి చేసుకుంది. సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ప్రజల్ని చైతన్య పరుస్తూ పాదయాత్ర 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 65వ రోజుకు చేరుకుంది. ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి మొదలైన పాదయాత్ర.. మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించింది. రెబ్బెన, గోలేటి ఎక్స్‌రోడ్, పులికుంట, తక్కెళ్లపల్లిరోడ్డు.. రేపల్లివాడ, ఐబీ చౌరస్తా, బోయపల్లి, బెల్లంపల్లిలో పర్యటించిన పాదయాత్ర బృందానికి అడుగడుగునా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.

ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం : తమ్మినేని
టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, దళితులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ్మినేని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. అందరూ ఏకమై ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని తమ్మినేని హెచ్చరించారు. 65వ రోజు పాదయాత్ర 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయా‌త్రకు పలు ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లును వెంటనే తెరిపించాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. పేపర్‌ మిల్లుపై ఆధారపడ్డ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ఆయన లేఖలో కోరారు. 

10:36 - December 21, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దుతో అష్టకష్టాలుపడుతున్న సామాన్యులపై బ్యాంకు ఉద్యోగసంఘాలు బాంబు పేల్చాయి.. ఈ అంశంలో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. బ్యాంకులతో సంబంధం లేకుండా కోట్ల రూపాయల నగదు బడాబాబులకు చేరడంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. నగదు కష్టాలకు బ్యాంకులు, సిబ్బంది ఎంత మాత్రం కారణం కాదని.. యూనియన్లు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 28న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, జనవరి 2, 3తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని.. సంఘాలు ప్రకటించాయి. దీనిపై ఇప్పటికే ఆర్‌బీఐకి లేఖ ఇచ్చినట్టు సంఘం నాయకులు తెలిపారు. 

10:33 - December 21, 2016

మెక్సికో: సిటీలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా మార్కెట్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ పేలుడులో 27 మంది చనిపోయారు. మరో 70మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. క్రిస్‌మస్‌, న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేయడానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో బాణాసంచా దుకాణాలు పూర్తిగా దగ్దమయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడుపై మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్‌పెనా నియోటో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కిలో బంగారం స్వాధీనం..

పెదపల్లి : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్దనోట్లతో బంగారం కొనేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను మంగళవారం పెద్దపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.28 లక్షల విలువైన కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ పేర్కొన్నారు.

10:32 - December 21, 2016

మిషన్ భగీరథపై మంగళవారం అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి ఈటెల మాట్లాడే సందర్భంలో 'నా తెలంగాణ' అనడంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 'నా తెలంగాణ కాదు.. మన తెలంగాణ అనాలి' అంటూ హితబోధ చేశారు. జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి మొదలుపెట్టారు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది. ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్లిన నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందే తప్ప మరేమీకాదని..తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టే మిమ్మల్ని ప్రతిపక్షంలోనూ మమ్మల్ని అధికారంలోనూ కూర్చోబెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. దీనిపై జానారెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించటంలో కాంగ్రెస్ పాత్ర కీలకమనీ..ఇది అధికారపక్షం గమనించాలని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత),దుర్గాప్రసాద్ (టీ.టీడీపీ నేత), నడిపల్లి సీతారామరాజు (ప్రముఖ విశ్లేషకులు) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

టీఆర్ఎస్ నేత నివాసంలో భారీ నగదు..

హైదరాబాద్‌ : టీఆర్ఎస్ నేత ఇంట్లో కట్టల కొద్దీ కొత్త నోట్లు పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని విఠల్‌వాడీలో ఉంటున్న గాంధీనాయక్ ఇంట్లో 16న అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో రూ. 40 లక్షల విలువైన కొత్త రూ. 2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అధికారులు మీడియాకు వెల్లడించారు. మీర్‌పేటలోని వెంకటేశ్వరనగర్ కాలనీలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో అధికారులు దాడులు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

రైల్వే ట్రాక్ పై తెగిపడ్డ విద్యుత్ వైర్లు..

నెల్లూరు : వెంకటాచలం వద్ద రైల్వే విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. ఇదే మార్గంలో జమ్ము-కశ్మీర్‌కు వెళ్తున్న ఆర్మీ రైలు నిలిచిపోయింది. దీంతో గూడూరు-నెల్లూరు మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఏసీబీ వలలో రెడ్డిగూడెం ఎస్సై..

కృష్ణా : ఏసీబీ వలలో ఓ పోలీసు చేప పడింది. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం ఎస్సై వీరవెంకట సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. ఓ వాహనదారుడి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నోట్ల మార్పిడి ముఠా పేరుతో కొందరు యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చిన ఎస్సై వారి బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తిరిగి ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారి నుంచి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

పొలాల్లో భారీగా కారం బస్తాలు..

ఖమ్మం : మండలం వెంకటగిరి గ్రామ పరిధిలోని పొలాల్లో సుమారు 150 కల్తీకారం బస్తాలను మంగళవారం స్థానికులు గుర్తించారు. అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 15 రోజుల క్రితం ఈ బస్తాలు పడేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

గోల్డ్ షాపులపై ఈడీ, ఐటీ తనిఖీలు..

విజయవాడ : వన్ టౌన్ లోని బంగారం దుకాణాలపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. వందల కోట్ల రూపాయల మేరకు బంగారం కొనుగోళ్ళపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా నోట్ల రద్దు అనంతరం బంగారు కొనుగోలు చేసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మంగళవారం నుండి ఈ దాడులు కొనసాగుతున్నాయి. 

ఆస్ట్రేలియాలో భూకంపం..

ఆస్ట్రేలియా : ఉత్తర ఆస్ట్రేలియా, ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపతీవ్రత 6.5గా నమోదైనట్లు యూఎస్ సిస్మాలజిస్టులు వెల్లడించారు. భూప్రకంపనలతో ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

ఘర్షణలో 25మందికి గాయాలు..

పశ్చిమబెంగాల్: హౌరా జిల్లాలోని ధూలాగఢ్‌లో రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 25మందికి గాయాలయ్యాయి. మతపరమైన ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

ఆర్టీఏ తనిఖీలు..10బస్సులు సీజ్..

హైదరాబాద్: నగర శివారులోని ముత్తంగి వద్ద రవాణాశాఖ అధికారులు ఇవాళ ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులను అధికారులు సీజ్ చేశారు.

ఢిల్లీలో మారో దారుణం! ..

ఢిల్లీ : నేరాలకు నెలవుగా దేశ రాజధాని మారిపోయింది. ఏదో సమయంలో ఏదోక ప్రాంతంలో ఢిల్లీ నగరం నేరాలను ఆలవాలంగా తయారయ్యింది.ఈ క్రమంలోనే నజఫర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. 17ఏళ్ళ బాలికను ఆమె బాయ్ ఫ్రెండ్ తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం పరారయ్యాడు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో వున్న నిందితుడికోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.

సీపీఐ జాతీయ సమావేశాలు..

హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారం నుంచి హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి. మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జాతీయ కార్యవర్గ, పార్టీ కౌన్సిల్‌ సభ్యులు, పార్టీ అగ్ర నాయకులు పాల్గొననున్నారని ఆపార్టీ నాయకులు తెలిపారు.

తమిళనాడు సీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు..

చెన్నై : తమిళనాడు సీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపుతోంది. చెన్నై అన్నానగర్ లోని అతని ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నజీబ్ ఎక్కడ ?

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థి నజీబ్ అదృశ్యమై 65 రోజులు గడుస్తోంది. ఆయన ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. దీనితో ఢిల్లీ పోలీసులు నజీబ్ అహ్మద్ హాస్టల్ రూమ్ మేట్స్ కు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రోహిణి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో పరీక్షలకు ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినా నజీబ్ ఆచూకి మాత్రం లభ్యం కాలేదు. నజీబ్ ఆచూకి గురించి సమాచారం ఇస్తే రూ. పదిలక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

బాలికను కాల్చి చంపిన బాయ్ ఫ్రెండ్..

ఢిల్లీ : నజఫర్ నగడ్ లో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికను బాయ్ ఫ్రెండ్ తుపాకితో కాల్చి చంపాడు. తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణం కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. హైదరాబాద్ లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ ఏజెన్సీ లంబసింగిలో 1, చింతపల్లిలో 3 డిగ్రీలు, పాడేరులో 7, మినుమలూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

టి.అసెంబ్లీ నేటి వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. పలు పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కొమురెల్లి మల్లన్నకు భక్తులు సమర్పించే కోడెలను కబేళాలకు విక్రయిస్తుండడంపై టిడిపి వాయిదా తీర్మానం..ఎస్పీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని బీజేపీ..చేనేత సమస్యపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..

09:26 - December 21, 2016

చిరంజీవి..లారెన్స్..వీరిద్దరి కలయికలో అదిరిపోయే డ్యాన్స్ ఎన్నో చూశాం. 'చిరు' స్టెప్స్ వేస్తే థియేటర్ లో అభిమానులు ఊగిపోతుంటారు. అలాంటి స్టెప్స్ వెనుక 'లారెన్స్' ఉంటాడు. 'హిట్ల‌ర్‌' మూవీలో ''అబీబీ అబీబీ’’.. అంటూ 'చిరు' వేసిన స్టెప్పులు క‌నుల ముందు క‌దులాడ‌తాయి. 'ఇంద్ర‌'లో '’దాయి దాయి దామ‌… కులికే కుంద‌నాల కొమ్మ‌'' సాంగ్‌లో వీణ స్టెప్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌. ''కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి'’…,''మ‌న్మ‌ధ మ‌న్మ‌ధ'’ సాంగ్స్‌ అంటే లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ గుర్తుకొస్తుంది. మళ్లీ చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ కి స్టెప్పులందించారంట. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీజర్...ఓ సాంగ్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. చ్రితంలోని ఓపెనింగ్ సాంగ్ కు తానే డ్యాన్స్ మాస్టర్ నని 'రాఘవ లారెన్స్' వెల్లడించాడు. తిరుపతికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. చాలాకాలం తరువాత 'చిరంజీవి' సినిమాకు మళ్లీ కొరియోగ్రాఫర్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి అభిమానుల్లాగే తాను ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాను హీరోగా నటించిన 'శివలింగం' షూటింగ్ పూర్తయ్యిందని, వచ్చే ఏడాది జనవరి నుండి తన సోదరుడితో రూపొందే చిత్రానికి దర్శకత్వం వహిస్తానని 'లారెన్స్' పేర్కొన్నారు. మరి 'చిరు' తో 'లారెన్స్' ఎలాంటి స్టెప్పులు వేయించాడో చూడాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

09:22 - December 21, 2016

‘రాంగోపాల్ వర్మ'..వివాదాలకు కేరాఫ్ అడ్రస్..ఎప్పుడు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో తెలియదు. ఆయన ట్విట్టర్ ద్వారా పలు ట్వీట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇదే నా చివరి సినిమా అని...బై టాలీవుడ్..అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా గర్వపడే సినిమాలు చేస్తానంటూ 'రాంగోపాల్ వర్మ' ప్రకటించారు. చివరి తెలుగు సినిమా 'వంగవీటి' అని చెప్పడం జరిగిందని, కానీ అన్నమాట మీద నిలబడనని అందరికీ తెలిసిందేనంటూ వ్యాఖ్యానించారు. ఆయన దర్శకత్వం వహించిన 'వంగవీటి' సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నగరంలో 'శివ' టు 'వంగవీటి' అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు సినీ అతిరథ మహారథులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. ఈ సందర్శంగా 'వర్మ' మాట్లాడుతూ...ప్రస్తుతం తనలో నిజాయితీ మెరుగవుతోందని, ముందు ముందు గర్వంగా చెప్పుకొనే సినిమాలు తీస్తానన్నారు. 'రాజమౌళి'కి ప్రామిస్ చేస్తున్నట్లు, తన మీద తానే ఒట్టేసుకుని చెబుతున్నట్లు తెలిపారు. విజయవాడలో చదువుకునేప్పుడు వంగవీటి రంగా ర్యాలీ చూసినట్లు , గాంధీని హత్యచేసినప్పుడు అక్కడికి వెయ్యి గజాల దూరంలోనే ఉన్నానన్నారు. సినిమాల్లో నేను వయోలెన్స్ ను టేకప్‌ చేయడానికి ఉన్న కారణాలవని చెప్పుకొచ్చారు. 'శివ' కథకూ, 'వంగవీటి' కథకూ సంబంధం లేదు. హిట్‌ తీసినంత మాత్రాన అది రాదని, 'నాగార్జున' నన్ను నమ్మి, నా వెనుక నిల్చొని 'శివ' చేశాడని తెలిపారు.

09:06 - December 21, 2016

సినీ నటుడు 'పవన్ కళ్యాణ్' సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్నారు. బిజీగా ఉంటూనే రాజకీయాల వైపు కూడా ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళంలో 2014లో విజయం సాధించిన 'వీరమ్' రీమెక్ గా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఫొటోలు ఇప్పటికే సోషల్ మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. తాజాగా 'శివ బాలాజీ' ‘అజయ్' ఇతరులతో 'పవన్' ఉన్న ఫొటో దర్శనమిచ్చింది. ‘పవన్' తో భోజనం చేసిన అనుభవాన్ని మాటల్లో వర్ణించలేనని 'శివ బాలాజీ' పేర్కొన్నాడు. ‘పవన్ కళ్యాణ్' తో కలిసి భోజనం చేస్తున్న ఫొటోలను 'శివ బాలాజీ' పోస్టు చేశాడు. ఈ ఫొటోలో శివ బాలాజీతో పాటు అజయ్, చైతన్య, కమల్ కామరాజు ఉన్నారు. కొసరికొసరి 'పవన్' భోజనాన్ని వడ్డించారని, ఈ సంతోషాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదని పేర్కొన్నాడు. ఈ చిత్రంలో 'పవన్' కు వీరు తమ్ముళ్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది.
బాబీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో అందాలతార శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రం ఫ్లాపు తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో 'పవన్‌' అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తర్వాత 'పవన్‌' వరుసగా త్రివిక్రమ్‌, నేసన్‌లతో రెండు చిత్రాను చేయనున్నాడు. 'కాటమరాయుడు' చిత్రాన్ని మార్చి 28వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట.

సీపీఐ జాతీయ సమావేశాలు..

హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారం నుంచి హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి. మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జాతీయ కార్యవర్గ, పార్టీ కౌన్సిల్‌ సభ్యులు, పార్టీ అగ్ర నాయకులు పాల్గొననున్నారని ఆపార్టీ నాయకులు తెలిపారు.

శ్రీవారి నోట్లు మేం తీసుకోం..

తిరుమల : శ్రీవారి పాతనోట్లను తీసుకునేందుకు బ్యాంకులు నిరాకరించాయి. శ్రీవేంకటేశ్వరుడి హుండీ ద్వారా మంగళవారం నాడు రూ.2.47 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో పాత ఐదొందలు, వెయ్యినోట్లు దాదాపు రూ.90 లక్షల వరకు ఉన్నాయి. నిత్యం వచ్చే హుండీ కానుకలను స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులో టీటీడీ జమచేస్తుంటుంది. ఈ క్రమంలో ఈ నెల 30 లోపు ఒకేసారి పాతనోట్లను జమ చేయాలనే షరతు పెట్టాయి బ్యాంకులు. ఈ నేపథ్యంలో ఆర్బీఐకి ఒక లేఖ రాయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.  

07:08 - December 21, 2016

పెద్ద నోట్లు రద్దు చేసి 40 రోజులైనా అన్నదాత కష్టాలు తీరడం లేదు. రోజురోజుకీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఓ ఖరీఫ్ పంట చేతికొచ్చింది. మరోవైపు రబీ పనులు సాగుతున్నాయి. ఖరీఫ్ పంట అమ్ముకుందామంటే కొనేవాళ్లు లేరు. అమ్మిన ధాన్యానికి క్యాష్ ఇచ్చేవారు లేరు. బ్యాంక్ లో వేసిన డబ్బులు తీసుకోలేని దురావస్థ. దీంతో కూలీలకు డబ్బుల చెల్లించలేని పరిస్థితి. అన్నదాత ఆగమాగమై పోతున్నాడు. ఖరీఫ్ సీజన్ ముగుస్తూ, రబీ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న విభిన్న పరిస్థితులపై ఇవాళ్టి జనపథంలో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నేత నాగబోయిన రంగారావు తెలిపే విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

07:07 - December 21, 2016

మంచిర్యాల : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్ర 65వ రోజు పూర్తి చేసుకొని మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించింది. సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ప్రజల్ని చైతన్య పరుస్తూ పాదయాత్ర 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో పాదయాత్రకు బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. గిరిజన జిల్లాల్లో ఆదివాసీలకు న్యాయం జరగడంలేదని..ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన..ఆదివాసి సమస్యలను వివరించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత గిరిజనుల కష్టాలు రెట్టింపయ్యాయంటున్న బండారు రవికుమార్‌ విమర్శించారు. ఆదివాసీల కష్టాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.సరైన వైద్యం, రోడ్డు సౌకర్యం లేక ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారనీ..రిజర్వేషన్లు అమలుకాకపోవడంతో గిరిజనులు అనేక కష్టాలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

06:57 - December 21, 2016

హైదరాబాద్ : తెలంగాణను సంపూర్ణంగా డిజిటల్ పేమెంట్స్, క్యాష్ లెస్ స్టేట్ గా మార్చాలంటే ఒకే పరిష్కారం సరిపోదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. టి-వ్యాలెట్‌, నగదు రహిత లావాదేవీలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భేటికి ఉప ముఖ్యమంత్రి మహ్మమూద్ అలీ, ఈటెల రాజేందర్, జూపల్లి క్రిష్టారావు, మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు.

బ్యాంకర్లు స్వైపింగ్‌ మిషన్ల సరఫరా పెంచాలి : మంత్రి కేటీఆర్‌
బ్యాంకర్లు స్వైపింగ్ యంత్రాల సరఫరా పెంచాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రజలు, వ్యాపారులతో కలిసి పనిచేయాలని కేటీఆర్ బ్యాంకర్లకు సూచించారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో టీ-వ్యాలెట్, నగదు రహిత లావాదేవీలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పలు కంపెనీలు కేబినెట్ సబ్ కమిటీకి తమ వ్యాలెట్ల సేవలు, పనితీరును వివరించాయి.

బ్యాంకర్లు ప్రజలు, వ్యాపారులతో కలిసి పని చేయాలి : కేటీఆర్‌
నగదు రహిత లావాదేవీలకు ఒకే పరిష్కారం సరిపోదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పరిష్కార మార్గాలకు వివిధ కంపెనీలతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆన్‌లైన్, డిజిటల్ ప్రభుత్వ చెల్లింపులకు రుసుములు లేకుండా చేస్తామని చెప్పారు. వినియోగదారులు, వ్యాపారుల మధ్య తక్కువ రుసుములుండాలని సూచించారు. త్వరలో టీ-వ్యాలెట్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

ఉచితంగా అన్లైన్ లేదా డిజిటల్ చెల్లింపుల సౌకర్యం : కేటీఆర్
ముఖ్యంగా సిద్ధిపేటలో డిజిటల్ చెల్లింపుల కోసం చేపట్టిన కార్యక్రమాలు, బ్యాంకుల సహకారం, ప్రజల్లో వచ్చిన చైతన్యం వంటి అంశాలపై ఉప సంఘం చర్చించింది. వ్యాలెట్లకు ఉన్న సెక్యూరిటీ, సర్వర్ల సేప్టీలపై పలు కంపెనీలతో చర్చించారు. ఈ నెల కాలంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయని వ్యాలెట్ల ప్రతినిధులు మంత్రి వర్గ ఉప సంఘానికి వివరించారు. బ్యాంకు ప్రతినిధులు పొస్ మెషీన్ల సరఫరా పెంచాలని, ప్రజలు, ముఖ్యంగా వ్యాపారులతో కలిసి పనిచేయాలని మంత్రి కోరారు. ప్రభుత్వ లావాదేవీలన్ని ప్రజలకు ఉచితంగా అన్లైన్ లేదా డిజిటల్ చెల్లింపుల సౌకర్యం కల్పిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

వ్యాలెట్ మీద మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష
బ్యాంకర్లు, వ్యాలెట్ల ప్రతినిధులతో సమావేశం ముగిసిన తర్వాత టి-వ్యాలెట్ మీద మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష నిర్వహించింది. టి వ్యాలెస్ సేవలను అందించేందుకు ముందుకు వచ్చిన పలు కంపెనీల ప్రతినిధులు వారు తయారు చేసిన వ్యాలెట్ల సేవలు, పనిచేసే తీరుని ప్రదర్శించి చూపించారు. 

06:54 - December 21, 2016

హైదరాబాద్ : డిసెంబర్‌ మాసం వచ్చిందంటే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ శోభ సంతరించుకుంటుంది. చర్చిలు విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సందడి ముందే నెలకొంది. ఇరు రాష్ట్రాల ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో తెలంగాణ సర్కార్‌ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తే.. విజయవాడలో ఏపీ ప్రభుత్వం క్రిస్మస్‌ సంబరాలను అధికారికంగా జరిపింది.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ శోభలో సీఎంలు
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ శోభ సంతరించుకుంది. ఇరు రాష్ట్రాలు అధికారికంగా క్రిస్మస్‌ వేడుకలు జరిపాయి. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో తెలంగాణ సర్కార్‌ క్రిస్మస్‌ వేడుకలు జరిపింది. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. అటు ఏపీలోని విజయవాడలో ప్రభుత్వం క్రిస్మస్‌ వేడుకలు జరిపింది. ఈ సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేసీఆర్
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో క్రైస్తవులకు ప్రభుత్వం అన్నిరకాలుగా చేయూత అందిస్తుందని సీఎం అన్నారు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా కేసీఆర్‌.. పేద క్రైస్తవ సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో మంత్రులతో పాటు బిషప్‌లు, క్రైస్తవ ప్రముఖులు పాల్గొన్నారు.

పేదలకు ఉచితంగా సరకులు పంపిణీ
ప్రతి పేదవాడు సంతోషంగా బతకడానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుక పేరుతో పేదలకు ఉచితంగా సరకులు పంపిణీ చేశారు. అన్ని పండగలను అందరూ సోదరభావంతో ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని పేదలందరికీ టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని బాబు తెలిపారు.

ఒకే రోజు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ వేడుకలు
ఒకే రోజు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ వేడుకలు అధికారికంగా జరిగాయి. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా క్రైస్తవ భక్తి గీతాలు సభికులను అలరించాయి.

బాణసంచా కేంద్రంలో అగ్రిప్రమాదం..

మెక్సికో : బాణసంచా తయారీ కేంద్రంలో అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందారు. మరో 70మందికి పైగా గాయపడ్డారు. 

Don't Miss