Activities calendar

20 December 2016

క్రిస్టియన్ల మీద దాడులు సహించం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : క్రిస్టియన్ల మీద దాడులను సహించమని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్ బీ స్టేడియంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సర్వమతస్తులు సుఖంగా జీవించాలన్నదే ప్రభుత్వ ధ్వేయమన్నారు. 

ఎల్ బీ స్టేడియంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు

హైదరాబాద్ : ఎల్ బీ స్టేడియంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. 

21:57 - December 20, 2016

చెన్నై : చెన్నై టెస్ట్‌లో టీమిండియాకు పోటీనే లేకుండా పోయింది. చెపాక్‌లోనూ ఇంగ్లీష్‌ టీమ్‌కు కొహ్లీ అండ్‌ కో చెక్‌ పెట్టింది. తొలి రెండు రోజులు ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్‌కు  మిగతా మూడు రోజుల్లో ఆల్‌రౌండ్‌ షోతో భారత్‌కు చెక్‌ పెట్టింది. ఆఖరి టెస్ట్‌ చివరి రెండు రోజుల్లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌....సిరీస్‌తో పాటు 2016 సీజన్‌ను విజయంతో ముగించింది. 
సిరీస్‌ భారత్ కైవసం... 
ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియాకు తిరుగేలేకుండా పోయింది. చెన్నై టెస్ట్‌నూ ఇంగ్లీష్‌ టీమ్‌కు కొహ్లీ అండ్‌ కో చెక్‌ పెట్టింది. ఆఖరి టెస్ట్‌ చివరి రెండు రోజుల్లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌....సిరీస్‌తో పాటు 2016 సీజన్‌ను విజయంతో ముగించింది. 
జడేజా స్పిన్‌ మ్యాజిక్‌ 
చెపాక్‌లో తొలి రెండు రోజులు ఇంగ్లండ్‌ ఆధిపత్యం ప్రదర్శించగా...మిగతా మూడు రోజుల్లో ఆతిధ్య భారత్‌ పెద్ద సంచలనమే సృష్టించింది. మూడో రోజు రాహుల్‌ సెంచరీ, నాలుగో రోజు కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌సెంచరీతో ఒక్క సారిగా పోటీలో నిలిచిన భారత్‌....ఐదో రోజు జడేజా స్పిన్‌ మ్యాజిక్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్‌ జట్టు తేలిపోయింది. ఓపెనర్లు అలిస్టర్‌ కుక్‌, జెన్నింగ్స్‌ 40 ఓవర్ల పాటు పోరాడినా....జడేజా జాదూ ముందు నిలబడలేకపోయారు. జో రూట్‌, మొయిన్‌ అలీ, బెన్‌స్టోక్స్‌ వంటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌ బోల్తా కొట్టించిన జడేజా భారత్‌ను విజయానికి చేరువ చేశాడు. 
విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర 
జో బట్లర్‌ ఆఖర్లో ఒంటరిపోరాటం చేసినా ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. టెస్టుల్లో 6వ సారి 5 వికెట్ల ఫీట్‌ రిపీట్‌ చేసిన జడేజా ...7 వికెట్లు తీసి భారత్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్‌ 75 పరుగుల తేడాతో  నెగ్గిన భారత జట్టు టెస్ట్‌ సిరీస్‌ను విజయంతో ముగించింది.
ఇంగ్లండ్‌ను బ్రౌన్‌ వాష్‌ చేసిన భారత్‌ 
5 మ్యాచ్‌ల సిరీస్‌ను  4-0తో నెగ్గిన భారత్‌....ఇంగ్లండ్‌ను బ్రౌన్‌ వాష్‌ చేసింది. 2012 టెస్ట్‌ సిరీస్‌లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రస్తుత సిరీస్‌తో భారత్‌ బదులుతీర్చుకుంది.
కరుణ్‌ నాయర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు
ట్రిపుల్‌ సెంచరీతో మ్యాచ్‌ను మలుపు తిప్పి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యంగ్‌గన్‌ కరుణ్‌ నాయర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.  గత 18 మ్యాచ్‌ల్లో ఓటమంటూ లేకుండా విరాట్‌ సారధ్యంలోని  భారత జట్టు సాధించిన 15వ విజయం కావడం విశేషం. టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగేలేదని ఇంగ్లండ్‌ సిరీస్‌తో మరోసారి రుజువైంది. మరి కొహ్లీ అండ్‌ కో ఇదే జోరు కొనసాగిస్తే టెస్టు ఫార్మాట్‌లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

 

21:52 - December 20, 2016

ఢిల్లీ : రద్దయిన పెద్ద నోట్లను ఒకేసారి డిపాజిట్‌ చేస్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, పదేపదే చేస్తూ వెళితే మాత్రం ప్రశ్నల్ని ఎదుర్కొనక తప్పదని కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. పాత నోట్లను డిపాజిట్‌ చేసే విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని, త్వరగా పాత నోట్లను జమ చేసుకోవాలని అన్నారు. 5 వేలకు మించిన మొత్తాన్ని 30వ తేదీ లోపు ఒకసారి మాత్రమే జమ చేయాలని ఆర్‌బీఐ తాజాగా నిబంధన విధించిన నేపథ్యంలో జైట్లీ వివరణ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు కష్టాలు త్వరలోనే తీరుతాయని...  డిమాండ్‌కు సరిపోయేంత డబ్బు అందుబాటులో ఉందన్నారు. దేశంలో నగదు రహిత లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. డిజిటల్‌ లావాదేవీలు జరిపే వ్యాపారులకు కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది. డిజిటల్‌ ద్వారా 2 కోట్లు టర్నోవర్‌ చేసే వ్యాపారులకు పన్నులో 2 శాతం మినహాయింపునివ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

21:49 - December 20, 2016
21:48 - December 20, 2016
21:46 - December 20, 2016

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసాకి కేంద్రంపై విరుచుకుపడ్డారు. గతకొద్దిరోజులు ఒక్కో అంశంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్న పవన్ ఇవాళ నోట్ల రద్దుపై ప్రశ్నలు సంధించారు. నోట్ల రద్దును ఒక ఫార్సుగా వర్ణిస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
నోట్ల రద్దుపై ట్విట్టర్‌లో స్పందించిన పవన్‌కళ్యాణ్‌
పెద్ద నోట్ల రద్దుపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని... ఈ నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరిగి కర్నూలుకు చెందిన బాలరాజు సహా అనేక మంది మృతి చెందారని.. అలాంటి వారు ఎందరో ఉన్నారని... వారి మృతికి ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ కారణమని ఆరోపించారు. 
నోట్ల రద్దు వల్ల నల్లకుబేరులకు ఏం నష్టం జరగలేదని వెల్లడి
నోట్ల రద్దు వల్ల నల్ల కుబేరులకు జరిగిన నష్టం ఏమీ లేదని,  పైగా మీ దయవల్ల బ్యాంకు ఉద్యోగులు నల్ల కుబేరుల జాబితాలో చేరారని పేర్కొన్నారు. క్యూలో నిల్చుని అమాయకులు చనిపోతుంటే.. నల్ల కుబేరులు మాత్రం ఇంట్లోనే కూర్చుని కోట్లకు కోట్లు ఇంట్లోకి తెచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. 
దేశంలో డిజిటల్‌ లావాదేవీలు సాధ్యమేనా?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 69 ఏళ్ల తర్వాత కూడా మలమూత్రాలు చేతులతో ఎత్తే మన దేశంలో నగదు రహిత లావాదేవీలు సాధ్యమేనా? అని ప్రశ్నించారు. నోట్ల ఉపసంహరణ దేశంలో పేద, బడుగు, రోజువారీ కూలీలు, గృహిణులు, చిరు వ్యాపారులపై ఎంత ప్రభావం పడిందో మీకు తెలుసా..? అని ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. 
పవన్ ట్వీట్లపై స్పందించిన సిద్ధార్ధనాథ్ సింగ్
మరోవైపు పవన్ ట్వీట్లపై ఏపీ బీజేపీ ఇంచార్జ్ సిద్ధార్ధనాథ్ సింగ్ స్పందించారు. పవన్ ట్వీట్లను చూస్తుంటే అతనికి రాజకీయ పరిజ్ఞానం లేదని.. పలు అంశాలపై అధ్యయనం చేయలేదని తెలుస్తోందన్నారు. గోవధ నిరోధక చట్టాన్ని బీజేపీ తీసుకురాలేదని.. రెండు దశాబ్దాలుగా ఈ చట్టం ఉందని పవన్‌కు హితవు పలికారు. తామిచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి, హోదాకు గల 5 తేడాలను చెప్పమని పవన్‌ను ఎప్పుడో అడిగానని.. కానీ ఇంతవరకు పవన్‌ నుంచి సమాధానం రాలేదని ఎద్దేవాచేశారు. మొత్తమ్మీద ఇంతకాలం మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ పరిణామం ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి. 

21:41 - December 20, 2016

హైదరాబాద్ : మిషన్‌ భగీరథపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. వాటర్‌ గ్రిడ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించగా.. పనులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని సర్కార్‌ కౌంటర్‌ ఇచ్చింది. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో కోటి ఎకరాలను మాగాణిగా మార్చేందుకు, ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేసేందుకు కంకణం కట్టుకున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.  
మిషన్‌ భగీరథపై వాడివేడి చర్చ 
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నాలుగోరోజు మిషన్‌ భగీరథపై వాడివేడిగా చర్చ జరిగింది. మిషన్‌ భగీరథపై ప్రతిపక్ష సభ్యులు లెవనెత్తిన ప్రశ్నలు, అనుమానాలపై మంత్రులు సమాధానాలు చెప్పారు. వాటర్‌ గ్రిడ్‌ టెండర్లలో కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా తప్పుపట్టారు. వాటర్‌ గ్రిడ్‌ టెండర్లలో అవినీతి జరిగితే రుజువులు చూపించాలన్నారు. ప్రభుత్వంపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తే.. పరువునష్టం దావా వేస్తామన్నారు. 
మిషన్‌ భగీరథ డీపీఆర్‌పై అనుమానాలు : భట్టివిక్రమార్క
మిషన్‌ భగీరథ డీపీఆర్‌పై అనేక అనుమానాలున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క అన్నారు. నిధులు సమీకరణ, వ్యయంపై పారదర్శకత అవసరమన్నారు. రెండుమూడు రెట్లు అంచనాలు పెంచి టెండర్లు పిలుస్తున్నారని... 42వేల కోట్ల నిధులు ఎలా సమీకరిస్తున్నారని ప్రశ్నించారు. మిషన్‌ భగీరథ టెండరింగ్‌ విధానం ఉద్దేశపూర్వకంగా వేసినట్లు ఉందన్నారు. టెండర్లపై అవసరమైతే హౌజ్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. 
మిషన్‌ భగీరథ పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలి : సున్నం రాజయ్య 
మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజలపై అదనపు పన్నులు, భారాలు వేయకూడదని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ కోరారు. ఈ పథకానికి ఖర్చుచేసే ప్రతి పైసాకూ కూడా లెక్క ఉండాలని కోరారు. మిషన్‌ భగీరథ పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని కోరారు. భద్రాచలం పట్టణానికి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరుని అందించాలని విజ్ఞప్తి చేశారు.
జానా, కేటీఆర్ మధ్య వాదోపవాదాలు
ఇక అంతకుముందు మంత్రి ఈటల మాట్లాడే సందర్భంలో 'నా తెలంగాణ' అనడంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 'నా తెలంగాణ కాదు.. మన తెలంగాణ అనాలి' అంటూ హితబోధ చేశారు. అయితే, జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి మొదలుపెట్టారు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగా లెదర్‌పార్క్‌ : మంత్రి కేటీఆర్ 
హైదరాబాద్‌లో వాయు, జల, శబ్ద కాలుష్యం నివారణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగా లెదర్‌పార్క్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో స్థాపించిన లెదర్‌ పార్క్‌లు ఆశించిన మేర ఫలితాలనివ్వలేదన్న మంత్రి కేటీఆర్ లెదర్‌ పార్కులన్నింటినీ పునరుద్ధరిస్తామన్నారు. 
ఏపీ ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను నియంత్రించాలి : శ్రీనివాస్ గౌడ్  
ఏపీ నుంచి వస్తున్న ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో తెలంగాణ ఆర్టీసీకి నష్టం వస్తోందని, అందువల్ల ఏపీ ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను నియంత్రించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. ఏపీ పరిపాలనా న్యాయస్థానంలో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేసేందుకు వీలు కల్పించే బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 
అవినీతికి అస్కారం లేకుండా చూడాలి : ప్రతిపక్ష సభ్యులు 
మొత్తంగా మిషన్‌ భగీరథ నిర్వహణలో ఎలాంటి అవినీతకి అస్కారం లేకుండా చూడాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. తెలంగాణలోని అన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకూ తాగునీరు అందించాలని కోరారు. 

 

21:33 - December 20, 2016

70 వేల విషపు బావులు కోరలు చాస్తున్నాయా ? ప్రకృతి, ప్రజలను మింగనున్నాయా ? డెల్టా భవిష్యత్తేంటి ?పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం కాళ్ల, భీమవరం మండలం వీరవాసరం, ఏడు లక్షల ఎకరాలు సాగుకు దూరం, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో 70 వేల గ్యాస్ బావులు తవ్వేందుకు పథకం, ఏ సమాచారం లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ, నీళ్లు అడుగంటి ఏడారిగా మారుతుంది. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దా....

 

21:15 - December 20, 2016

కుతకుత ఉడికిన కుందూరు జానాలు... టీఆర్ సోళ్లను కడిగేసిన కాంగ్రెస్ నేత, తెర్సుకోవోతున్న బెడ్ రూం ఇండ్ల దర్వాజలు... ఎర్రవెల్లి, నర్సన్నపేట కాడ పండుగలు, జనం నెత్తిమీద గ్యాస్ బండ పెట్టిన మోడీ.. పది లక్షలు దాటితే సబ్సిడీలు కటింగ్, స్పీకర్ సారు దండం ఎత్తుకపోయిన ఎమ్మెల్యే... త్రిపుర అసెంబ్లీ సమావేశాలల పగటేషకాడు, దళిత నేతను అవమానిస్తున్న పెద్దోళ్లు....కడప జిల్లా పరిషత్ చైర్మన్ అవస్థలు, ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడించిన గొర్లు...కూటి కాడి తిండి గుంజుకున్నరని లొల్లి..  ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

టాటా గ్లోబల్ బేవరేజస్ స్వతంత్ర డైరెక్టర్ పదవికి అనల్జిత్ సింగ్ రాజీనామా

ఢిల్లీ : టాటా గ్లోబల్ బేవరేజస్ స్వతంత్ర డైరెక్టర్ పదవికి అనల్జిత్ సింగ్ రాజీనామా చేశారు. 

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

సికింద్రాబాద్ : చిలకలగూడ పీఎస్ పరిధి మెట్టుగూడలో విషాదం నెలకొంది. అయ్యప్పపడిపూజ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ షాక్ తో కళ్యాణ్, శివ అనే యువకులు మృతి చెందారు. 

20:57 - December 20, 2016

మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీకాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ , బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, సీపీఎం నాయకురాలు రమాదేవి పాల్గొని, మాట్లాడారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చిల్లర సమస్య తీవ్రంగా ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:53 - December 20, 2016

హైదరాబాద్ : రోజుకో మాట.. పూటకో నిర్ణయం... కీలక శాఖల మధ్య పొంతనలేని ప్రకటనలు... నోట్ల రద్దు పాట్లు సామాన్యులకు తలపోట్లు తెస్తున్నాయి. కేంద్ర అనాలోచిత నిర్ణయాలు ప్రజల్లో గందరగోల పరిస్థితిని సృష్టిస్తున్నాయి. 
నవంబర్ 8న రూ.500, 1000 నోట్ల రద్దు
నవంబర్ 8 .. రాత్రి 8 గంటల 15 నిమిషాలు... దేశంలో ఇప్పుడు చలామణీలో ఉన్న 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నాం... వాటికి కేవలం డిపాజిట్ మాత్రమే చేసుకోవాలి.. ఇది ప్రధాని మోదీ ప్రకటన. ఆ ప్రకటన చేసి నేటికి 42 రోజులు... కానీ మోదీ తీసుకున్న నిర్ణయానికి ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సవరణలు, మినహాయింపులు, నిబంధనల పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్లు... 51. ఒక నిర్ణయానికి 51 సవరణలా.. అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయం అంత అనాలోచితమనే కదా అర్థం. 
రూ. 5000 మించితే ఒకే సారి డిపాజిట్ 
తాజాగా తీసుకున్న నిర్ణయమేమిటంటే... 5000 రూపాయలకు మించితే వాటిని ఒకే సారి డిపాజిట్ చేయాలి. అదే సమయంలో వాటికి సంబంధించిన కారణం కూడా చెప్పాలి. ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో కారణం చెప్పాలి. ఆ గడువు కూడా డిసెంబర్ 30 వరకే.  ముందు వెనుక ఆలోచించకుండా తీసుకున్న ఓ తప్పుడు దుందుడుకు నిర్ణయం ఇప్పుడు సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. ఎప్పుడు ఏ సవరణ వస్తుందో తెలియక ప్రజల్లో తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది.  ఇప్పటికే నోట్లు దొరకక, ఉన్న నోట్లు చలామణిలో లేక.. బిక్కు బిక్కు మంటూ దిక్కులు చూస్తున్న సామాన్యుడికి కేంద్రం నిజంగా పగటి పూటే చుక్కలు చూపిస్తోంది. 
సడన్‌గా డిసెంబర్ 2 కే పరిమితం
డిసెంబర్ 30 వరకు నాలుగు వేల వరకు నగదును మార్పిడి చేసుకోవచ్చంటూ తీసుకున్న నిర్ణయాన్ని నవంబర్ 24న వెనక్కి తీసుకున్నారు. డిసెంబర్ 15 వరకు పాత నోట్లు పెట్రోల్ బంక్ లు, ఎయిర్ పోర్టుల్లో చలామణిలో ఉంటాయని చెప్పి .. ఆ గడువును సడన్‌గా డిసెంబర్ 2 కే పరిమితం చేశారు. ఇక విత్ డ్రా పరిమితిని రోజుకు పదివేలు, వారానికి 20 వేలు అని నవంబర్ 9 న ప్రకటించి.. నాలుగు రోజులకే అంటే డిసెంబర్ 13కే వెనక్కి తీసుకున్నారు. వారంలో విత్ డ్రా పరిమితిని 24 వేలకు పెంచారు.  
5 సార్లు నిబంధనల్లో మార్పు 
నగదు మార్పిడికి సంబంధించి ఇప్పటి వరకు 5 సార్లు నిబంధనల్లో మార్పు చేశారు. పాత నోట్ల వాడకంపై రూల్స్ ఇప్పటికి 7 సార్లు సవరణ చేశారు. మొత్తం మీద మోదీ నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఆర్బీఐ, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ సవరణలతో 51 సార్లు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఇక వెయ్యి నోటు సంగతి సరే .. వెయ్యి నోటు రావోచ్చని ఆర్థిక శాఖ అధికారులు చెబితే.. నాకు తెలియదంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమాచారమిచ్చారు. ఇదే జైట్లీ.. నల్ల ధనం ఎంత వెనక్కి వస్తుందో అధికారిక లెక్కలు, అంచనా లేదని పార్లమెంట్‌లో రాతపూర్వక సమాధాన మిచ్చారు.
నోట్ల మొత్తంపై పొంతనలేని లెక్కలు
అలాగే ఇప్పటి వరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత నోట్ల మొత్తంపై ఎస్‌బీఐ ఒక లెక్క చెబితే.. ఆర్బీఐ, ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ మరో లెక్క చెప్పడం... ఎంత క్లారిటీ లేకుండా వ్యవస్థలు పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే సరైన హోం వర్క్, ప్రణాళిక లేకుండా నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంపై వివరణ ఇవ్వాలని లోక్ సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కెవీ థామస్ ఆర్ బీ ఐ, ఆర్థిక శాఖకు నోటీసులు జారీ చేశారు. జనవరి రెండో వారంలో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేశారు.

 

తెలంగాణ డిజిటల్ చెల్లింపులపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ

హైదరాబాద్ : తెలంగాణ డిజిటల్ చెల్లింపులపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. సిద్ధిపేటలో డిజిటల్ చెల్లింపులకు చేపట్టిన కార్యక్రమాలు 
బ్యాంకుల సహకారం, ప్రజల చైతన్యం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల పెంపుపై మొబైల్ వ్యాలెట్ కంపెనీలతో చర్చిస్తున్నారు. 

20:42 - December 20, 2016

ఖమ్మం : మూఢనమ్మకాలు కొందరిని మూర్ఖులను చేస్తుంది.. అనుమానం.. అపోహలతో రక్తం చిందిస్తున్నారు..పచ్చని పల్లెల్లో అరాచకం సృష్టిస్తున్నారు.. పచ్చని పైర్లలో రక్తాన్ని పారిస్తున్నారు... కేవలం అనుమానంతో జరుగుతున్న ఎన్నో ఘోరాలు గ్రామాల్లో చిచ్చు రేపుతున్నాయి... ఖమ్మం జిల్లాలో మరో దారుణం జరిగింది.
కిరాతకం 
రోజూ రాత్రి భోజనం చేసి పొలం వద్ద నిద్రపోయేవాడు..ఆ రోజు వెళ్లిన వృద్దుడు ఉదయాన్నే ఇంటికి రాలేదు..దీంతో కుటుంబీకులు ఏం జరిగిందని వెళ్లి చూస్తే రక్తపు మడుగులో కన్పించాడు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి నెపంతో 70సంవత్సరాల వృద్ధుడిని దుండగులు దారుణంగా చంపేశారు. తిరుమలాయపాలెం  మండలం రాజారంలో ఈ ఘటన కలకలం రేపింది.
వృద్ధుడు దారుణ హత్య  
రాజారం గ్రామానికి చెందిన 70 ఏళ్ల  పేర్ల ముత్తయ్య పొలందగ్గర గుడిసెలో నిద్రిస్తుండగా అర్థరాత్రి దుండగులు దారుణంగా కొట్టిచంపినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. హత్యజరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
హత్యపై పలు అనుమానాలు            
జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు తీసుకున్న పోలీసులు మాత్రం పాత కక్షలని చెబుతున్నప్పటికీ మూఢనమ్మకాలతోనే ఈ దారుణం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి... అయితే వృద్దుడిని చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతోనే చంపినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

 

20:36 - December 20, 2016

కడప : 60 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు దొంగతనానికి పాల్పడింది. ఎందుకో తెలుసా..? అయితే మీరే చూడండి. ఓ వైపు కన్న కొడుకుకు నయం కానీ ఆనారోగ్యం. మరోవైపు పక్కింట్లో వెక్కిరిస్తున్న బంగారు నగలు ఆమెలో ఆశలు రేపాయి. సులువుగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఓ వృద్ధురాలిని దొంగను చేసింది...ఆరుపదుల వయస్సులో చోరీ చేసి కటకటాలపాలయింది...ఇది కడపలోని ఓ వెటరన్‌ కిలాడీ క్రైం కహానీ...
ఇంట్లో కొడుక్కి ఆరోగ్యం బాగోలేదు..
పోలీసుల వెనకాల రెండు చేతులతో మొక్కుతున్న ఈ వృద్దురాలే వెటరన్‌ కిలాడీ... వృద్ధురాలి కొడుకు అనారోగ్యంతో మంచానపడ్డాడు.. సంపాదనలేక..ఆస్పత్రిలో చూపించుకోలేక..ఆ వృద్దురాలు పక్కింట్లో నగలు దోచేసింది..ఆరు నెలల తర్వాత ఈ విషయం బయటపడింది...
జులై 13న భారీ చోరీ...
కడప నగరంలోని అరవిందనగర్ నివాసముంటున్న మధురాంతంకం శశికళ రిమ్స్ లో హెడ్ నర్స్ గా పనిచేస్తోంది. తన ఇంట్లో దాచిన 70 తులాలు బంగారు నగలు కన్పించలేదు...దీంతో జూలై 14వ తేదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది...శశికళ ఇంటికి ప్రక్కన నివాసముంటున్న 63 ఏళ్ల లక్ష్మిదేవి ఇంటికి వస్తూ వెళ్తుండేది..ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె కోసం ఆరా తీయగా కన్పించలేదు..ఆ రోజు నుంచి లక్ష్మీదేవి కన్పించకపోవడంతో ఆమెనే ఈ చోరీ చేసిందని అనుమానించి గాలింపు చేపట్టారు...శశికళ డ్యూటీకీ వెళ్లిన సమయంలో ఆమె తల్లి వృద్దురాలుకు సపర్యాలు చేయడానికంటూ వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోని నగలను తస్కరించింది...వాటిలో కొంత నగలు అమ్మేసి సొమ్ము చేసుకుని కొడుకు వైద్యానికి వాడింది... ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో లక్ష్మీదేవి నుంచి  48తులాలు బంగారు నగలు స్వాధీనం చేసుకోని రిమాండ్ కు తరలించారు. సాయం చేసేందుకు ఎన్నో సంస్థలున్నాయి..ఉచితంగా వైద్యం చేసే ప్రభుత్వాస్పత్రులున్నాయి..కాని ..ఆ వృద్దురాలు చేసిన తప్పుకు జైలుపాలయింది.

 

20:29 - December 20, 2016

చిత్తూరు : తిరుపతి నగరాన్ని విశాఖపట్టణం, విజయవాడ తరహాలో అభివృద్ధి చేసేందుకు టీటీడీ సిద్ధంగా ఉందని టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చదలవాడ మీడియాకు వివరించారు. రేణిగుంట జంక్షన్‌ నుంచి కాలూరు క్రాస్ వరకు తిరుపతి సుందరీకరణకు 10కోట్ల రూపాయలు కేటాయించమాన్నారు. శ్రీవారి అదనపు పోటులో పనిచేస్తున్న 176  మంది కార్మికుల కాంట్రాక్ట్‌ కాలపరిమితి మరో ఏడాది పొడిగించామని తెలిపారు. మూడు నెలలకు అవసరమైన 11లక్షల కొబ్బరికాయల కొనుగోలుకు 86లక్షలు మంజూరు చేశామన్నారు. 

 

20:26 - December 20, 2016

హైదరాబాద్ : ఏపీలో కరెన్సీ కష్టాలు తీర్చాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌కు విన్నవించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన ఆయన పెద్దనోట్ల రద్దు తదనంతర పరిస్థితులను వివరించారు. ఏపీలో 14 వేల 740 కోట్లు అందుబాటులోకి తెచ్చారని.. అయితే జనాభా ప్రకారం 24 వేల కోట్లు అవసరం ఉందన్నారు. ఈ డబ్బు తెప్పించేందుకు గవర్నర్‌ కృషి చేయాలన్నారు. పెద్దనోట్ల రద్దు విషయం సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని మరోసారి జగన్‌ విమర్శించారు. నోట్ల రద్దుతో పెద్దగా ఒరిగేదేమీ లేదన్న జగన్‌ జనవరి మొదటి వారంలోనూ ఇదే పరిస్థితి ఉంటే పార్టీలో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

20:20 - December 20, 2016

హైదరాబాద్ : బీజేపీకి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ట్వీట్ చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. పవన్ ట్వీట్లను చూస్తుంటే అతనికి రాజకీయ పరిజ్ఞానం లేదని.. పలు అంశాలపై అధ్యయనం చేయలేదని తెలుస్తోందన్నారు. గోవధ నిరోధక చట్టాన్ని బీజేపీ తీసుకురాలేదని.. రెండు దశాబ్దాలుగా ఈ చట్టం ఉందని పవన్‌కు హితవుపలికారు. తామిచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి, హోదాకు గల 5 తేడాలను చెప్పమని పవన్‌ను ఎప్పుడో అడిగానని.. కానీ ఇంతవరకు పవన్‌ నుంచి సమాధానం రాలేదని ఎద్దేవాచేశారు. పవన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవ్వాలనే ఆసక్తి తనకు లేదని సిద్ధార్థ తెలిపారు. 

 

20:15 - December 20, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్‌ చేశారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఇవాళ నోట్ల రద్దుపై ఆర్బీఐ తీరును ప్రశ్నించారు. నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై మండిపడ్డారు. కర్నూలులో బాలరాజు తరహాలో.. చాలా మంది నోట్లు అందక చనిపోయారని.. వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నగదుపై పూర్తిగా లావాదేవీలు జరిగే దేశంలో ఒక్కసారిగా క్యాష్‌ లెస్ లావాదేవీలు ఎలా సాధ్యమని ఆర్బీఐ గవర్నర్‌నుపవన్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఐదో ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పాతనోట్ల డిపాజిట్ల మీద తాజా ఆంక్షలపై సీపీఎం అభ్యంతరం

ఢిల్లీ : పాతనోట్ల డిపాజిట్ల మీద తాజా ఆంక్షలపై సీపీఎం పొలిట్ బ్యూరో అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ.5 వేలకు మించిన డిపాజిట్లను ఒక్కసారే అనుమతిస్తామంటూ కేంద్రం, ఆర్ బీఐ ప్రకటించటం ప్రజా ప్రజావ్యతిరేకమని చెప్పింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపింది.

జెన్ స్పేస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : మాదాపూర్ లోని జెన్ స్పేస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. జనరేటర్ వేడెక్కడంతో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు ఫైరింజన్లతో సిబ్బంది మంటలార్పుతున్నారు. 

నవంబర్ 8 తర్వాత 677 దాడులు : ఐటీ శాఖ

హైదరాబాద్ : నవంబర్ 8 తర్వాత 677 దాడులు చేశామని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. పలువురు వ్యక్తులకు 3 వేలకు పైగా నోటీసులు జారీ చేశామని చెప్పారు. రూ.428 కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగదుతో రూ.86 కోట్ల కొత్త నోట్లు వచ్చాయన్నారు. ఈనెల 19నాటికి రూ.3,185 కోట్లకు పైగా లెక్కల్లో చూపని ఆదాయం గుర్తించామని తెలిపారు. 

 

19:51 - December 20, 2016

భూపాలపల్లి : ప్రాణాపాయంలో ఉన్న  జంతువునో.. పక్షినో చూస్తే.. మనలో చాలామంది విలవిల్లాడిపోతారు. ఆ జీవి ప్రాణాలు నిలపడానికి ప్రయత్నిస్తాం. కానీ.. కళ్లముందే ఓ యువకుడు నెత్తుడిమడుగులో కొట్టుకుంటున్నా ఆ ప్రజాప్రతినిధికి కనికరం లేకుండా పోయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదాన్ని కళ్లారా చూసిన మంత్రి చందూలాల్‌ కనీసం కారుదిగకుండా వెళ్లిపోవడంపై  ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  
మంత్రి తీరుపై విమర్శలు 
అక్కడ రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటుండగా.. ఆపక్కనే కారులో చూసీ చూడనట్లుగా వెళ్లిపోయారు తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్‌. ప్రజాపత్రినిధిగా కాకున్నా..  ఓ మనిషిగా కూడా స్పందించని మంత్రిగారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నల్లకాలువ క్రాస్‌రోడ్‌లో రోడ్డు ప్రమాదం 
జయశంకర్‌ భూపాలపల్లిజిల్లా పాలంపేటదగ్గరలోని నల్లకాలువ క్రాస్‌రోడ్‌లో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పాలంపేటలోని రామప్ప టెంపుల్‌కు  తన ఇద్దరు మిత్రులతో కలిసి వెళ్లి వస్తున్న మధుసూదనాచారి ఇలా రోడ్డుప్రమాదానికి గురైయ్యాడు. బైక్‌పై వెళ్లుతున్న వారిని ఎదురుగా వస్తున్న టాటాఏస్‌ వాహనం ఢీకొట్టడంతో.. మధుసూదనాచారి అక్కడికక్కడే మృతి చెందగా.. స్నేహితులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదేసమయంలో మంత్రి అజ్మీరా చందూలాల్‌ కాన్వాయి అక్కడికి చేరుకుంది. మంత్రిగారు  వచ్చారు కదా.. బాధితులకు తక్షణ సహాయం అందుతుంది అనుకున్న స్థానికులకు ఆవేదనే మిగిలింది. కనీసం కారు ఆపకుండా  వెళ్లిపోతున్న మంత్రిగారి తీరును ఓ యువకుడు ఇలా తన సెల్‌ఫోన్‌ కెమెరాతో క్లిక్‌ మనిపించి.. సోషల్‌ మీడియాలో పెట్టేశాడు.
ఘటనపై స్పందించిన మంత్రి చందూలాల్‌
ఇదే విషయంపై మంత్రిగారు స్పందించిన తీరు మరింత విస్మయం గొలుపుతోంది.  నిజానికి తాను కారు ఆపి బాధితులకు సహాయం చేయాల్సి ఉందని.. కానీ.. తన బంధువొకరు ప్రాణాపాయంలో ఉన్నారని ఫోన్‌ రావడంతోనే తాను ఈ ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని మంత్రి గారు వివరణ ఇచ్చారు. దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు చెలరేగుతున్నాయి..ప్రాణం ఎవరిదైనా విలువైనదేకదా..! మంత్రిగారు తన బంధువుకోసం ఆతృత పడటం సహజమే..! అయినా.. కళ్లముందు ప్రాణంకోసం విలవిల్లాడుతున్న వ్యక్తిని పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 

 

19:45 - December 20, 2016

ఆదిలాబాద్ : సీపీఎం నాయకులు చేపట్టిన మహాజన పాదయాత్ర 65వ రోజుకు చేరుకుంది. నేడు 14వ జిల్లాలోకి ప్రవేశించనున్నది. ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి ప్రవేశించనున్న ఈ పాదయాత్ర.. రెబ్బెన, గోలేటి ఎక్స్‌రోడ్, పులికుంట, తక్కెళ్లపల్లిరోడ్డు.. రేపల్లివాడ, ఐబీ చౌరస్తా, బోయపల్లి, బెల్లంపల్లిలో పర్యటించనున్నారు. కోమరంభీం జిల్లాలో చాలా సమస్యలున్నాయని... వాటిని ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారని సీపీఎం నేత తమ్మినేని అన్నారు. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు.    

 

19:41 - December 20, 2016
19:40 - December 20, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దుతో 40 రోజుల నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రధాన బ్యాంకుల ముందు సీపీఎం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 
సామాన్య ప్రజలు రోడ్లుపాలు : సీపీఎం  
పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను రోడ్లుపాలు చేసిందని సీపీఎం ఆగ్రహం వ్యక్తంచేసింది. నగదు విత్‌డ్రా పరిమితిని తక్షణమే ఎత్తివేయాలని తెలంగాణలోని అన్ని ప్రధాన బ్యాంకుల ముందు  ధర్నా నిర్వహించింది. 
మోదీ సర్కార్‌కు ప్రజలు ఫుల్‌స్టాప్‌ : జూలకంటి
నగదు కష్టాలను తీర్చకపోతే మోదీ సర్కార్‌కు ప్రజలు ఫుల్‌స్టాప్‌ పెడతారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు అవస్థలు పడుతోంటే...  కేంద్ర సర్కార్‌ రోజుకో  కొత్త నిబంధన తీసుకొస్తోందని మండిపడ్డారు. మోదీ నిర్ణయాలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. నగదు కష్టాలు తీర్చాలని కోరుతూ.. హైదరాబాద్‌ గోల్కొండ ఎక్స్‌రోడ్‌లోని హెచ్ డీఎఫ్ సీ, ఫిల్మ్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌ ఎదురుగానూ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు.  
స్తంభించిన దేశ ఆర్ధిక వ్యవస్థ : ముకుంద రెడ్డి
నోట్ల రద్దుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదని సీపీఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి ముకుంద రెడ్డి అన్నారు. నగరంలోని సీబీఐ, ఆంధ్రా బ్యాంక్ మేయిన్ బ్రాంచ్‌ల ఎదుట ధర్నా నిర్వహించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని ఆరోపించారు. 
వనపర్తి ఎస్‌బీహెచ్‌ ఎదుట సీపీఎం నేతలు ధర్నా 
నోట్ల రద్దుతో పెధ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. సమస్యను వెంటనే పరిష్కరించాలని వనపర్తి జిల్లా ఎస్‌బీహెచ్‌ ఎదుట సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. బ్యాంకుల్లోని తమ నగదును తీసుకోవడానికి రోజుల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సిన దుస్థితిని మోదీ కల్పించాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. నోట్ల రద్దు సమస్యలను తక్షణమే పరిష్కారించాలని..నగదు విత్‌డ్రాపై పరిమితిని ఎత్తివేయాలని..  లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పార్టీ నాయకులు కేంద్రాన్ని హెచ్చరించారు. 
               

19:35 - December 20, 2016

హైదరాబాద్ : వాటర్‌ గ్రిడ్‌ టెండర్లలో కాంట్రాక్టర్లు అవినీతి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ తప్పుపట్టారు. వాటర్‌ గ్రిడ్‌ టెండర్లలో అవినీతి జరిగితే రుజువులు చూపించాలన్నారు. ప్రభుత్వంపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తే.. పరువునష్టం దావా వేస్తామన్నారు. మరిన్ని ఆసక్తిర విషయాలు వీడియోలో చూడండి.. 

 

19:31 - December 20, 2016

హైదరాబాద్ : మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ పథకం నిర్వహణలో ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం... ప్రతి కార్యక్రమం నిర్వహణలో పారదర్శకత పాటిస్తోందని పేర్కొన్నారు.  

 

19:27 - December 20, 2016

హైదరాబాద్ : అమెరికా విద్య, ఉద్యోగాలకు తెలుగువారు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉద్యోగాల కల్పనపై చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. ట్రంప్‌ వ్యాఖ్యలు... అమెరికాలో చదువుతున్న, చదువుకునేందుకు సిద్ధమవుతున్న విద్యార్ధులు ఆందోళన నెలకొంది.   
అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ట్రంప్ వ్యాఖ్యలు 
ఉద్యోగాల కల్పనపై అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ చేసిన వాఖ్యలు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికాలో ఇప్పటికే చదువుతున్న, చదువుకునేందుకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు.  
ట్రంప్ వ్యాఖ్యలపై చర్చ నీయాంశం 
స్ధానికులకే ఉద్యోగాలని అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం సమయంలోనే ట్రంప్ ప్రకటించినా...అదో ఎన్నికల హమీగానే అందరూ భావించారు. భారత్, చైనాతో పాటు ఆసియా దేశాల నుంచి వివిధ వీసాలపై వస్తున్న వారి స్థానంలో స్వదేశీ ఉద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రంప్  వ్యాఖ్యలు  చేశారు. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ అమెరికాలోని నిపుణులకు దక్కాల్సిన అవకాశాలన్నింటినీ హెచ్1బీ వీసాలపై దేశంలో ప్రవేశిస్తున్న  ప్రవాసులు ఎగరేసుకుపోతున్నారు. అమెరికాలోని ఉపాధి అకాశాలు ముందుగా అమెరికన్లకే దక్కాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. 
ట్రంప్ వ్యాఖ్యలతో గందరగోళం 
అమెరికాలో 9.5 లక్షల మంది భారత్ కు చెందిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉన్నారు. ఏటా అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థుల్లో 15.9 శాతం మంది భారతీయులే ఉన్నారు. అమెరికాలో నాలుగువేల వరకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఉన్నాయి. ప్రపంచ అగ్రశ్రేణి వంద విశ్వవిద్యాలయాల్లో 46 అమెరికాలోనే ఉన్నాయి. రెండేళ్ల చదువుకు అయిదేళ్ల వీసా ఇస్తారు. కోర్సులో చేరిన 11 నెలల తర్వాత నిబంధనల ప్రకారం ఉద్యోగం చేసుకోవచ్చు.ప్రపంచంలో అమెరికాది బలమైన ఆర్థిక వ్యవస్థ కావడంతో ఎక్కువగా ఉద్యోగావకశాలు దొరకడంతో  భారతదేశం ప్రజలు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా విదేశీ విద్య కోసం అమెరికాకు వెళుతుంటారు. మన దేశం నుంచి 2 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ప్రతి సంవత్సరం 25 వేల మంది అమెరికాకు వెళుతున్నారు. చదువు పూర్తయ్యాక కూడా ఉద్యోగాలు చేస్తున్న వారున్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇకపై ఈ అవకాశాలు దూరమైతే పరిస్థితి ఏంటనే ఆందోళన తెలుగు రాష్ట్రాల ప్రజలను వెంటాడుతోంది. 
అమెరికాకు తగ్గిన దరఖాస్తుల సంఖ్య
కొందరు ముందు జాగ్రత్తగా కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకోవడంతో గత ఏడాది కంటే 30 శాతం అదనంగా ఈ దేశాలకు దరఖాస్తులు పెరిగాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది అమెరికాకు దరఖాస్తుల సంఖ్య తగ్గింది. జనవరి 20న ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు తరువాతి పరిణామాలను అనుసరించి జనవరి, ఫిబ్రవరిలో దరఖాస్తుల చేసేందుకు మరికొందరు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఇదీలా ఉంటే సాంకేతిక నైపుణ్యం ఉండే భారతీయుల సేవలు అమెరికాకు తప్పకుండా అవసరమని.... నైపుణ్యం ఉన్న వారు భయపడాల్సిన పనిలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

19:22 - December 20, 2016

ఢిల్లీ : హస్తినలో ఓ కసాయి తల్లి తన యేడాదిన్నర బిడ్డకు నరకం చూపించింది. చిన్నారని కూడా చూడకుండా.. చితకబాది కిందపడేసింది. అంతటితో ఆగకుండా కాళ్లతో తన్నింది. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిందని ఆ మహిళ అత్త పోలీసులకు తెలపడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

19:18 - December 20, 2016

విజయవాడ : రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని ఏపీ సీపీఎం నేత బాబురావు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎమ్మార్వో ఆఫీస్‌ ముందు ఆ పార్టీ ధర్నా నిర్వహించింది. టీడీపీ ప్రభుత్వం బడాబాబులకు వందల ఎకరాల భూములు కట్టబెడుతూ.. పేదలకు నిలువ నీడలేకుండా చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోకుంటే ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని  హెచ్చరించారు. 

 

పెద్ద నోట్ల రద్దుపై ట్వీట్ చేసిన పవన్

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కర్నూలు నాగరాజుతో సహా అనేక మంది మరణాలకు పెద్ద నోట్ల కారణమని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో మరణించిన వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

 

సారంగపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీలు

జగిత్యాల : సారంగపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధులకు హాజురు కాని యూడీసీ పురుషోత్తమ్ పై సస్పెన్షన్ వేటు పడింది.   

17:36 - December 20, 2016

'అమీర్ పేటలో' మూవీ టీంతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రం హీరో హీరోయిన్  శ్రీ, అశ్వినిలు మాట్లాడారు. సినిమా వివరాలను తెలిపారు. పలు ఆసక్తిర విషయాలు వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:07 - December 20, 2016

హైదరాబాద్ : 'మీరు ఆంధ్రా కాంట్రాక్టర్లను తయారు చేశారని..తాము తెలంగాణ కాంట్రాక్టర్లను తయారు చేశామని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి... మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎపిలో కొంతమంది కాంట్రాక్టర్లకే న్యాయం చేశారని...తాము తెలంగాణలోని చిన్న కాంట్రాక్టర్లతోపాటు అందరికి న్యాయం చేశామని చెప్పారు. జీవో 987..తీసుకొచ్చి చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేశామని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అవినీతి జరిగిందని ఆధారాలు ఏవైనా ఉంటే చెప్పాలన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమని, అవసరమైతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ప్రధాని తొలిసారి రాష్ట్రానికి వస్తానంటే రావొద్దని లేఖ రాయడం కాంగ్రెస్ కే చెల్లిందని విమర్శించారు. 'మా దగ్గర ఆధారాలు లేవు.. ఆరోపణలు చేస్తాం.. ప్రభుత్వంపై బురద జల్లుతాం...' అనే ధోరణితో కాంగ్రెస్ సభ్యులు వ్యవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము తప్పులు చేస్తే పలు వేదికలున్నాయని.. వాటిపై తాము చేసిన తప్పులను ఆధారాలతో నిరూపించండని కాంగ్రెస్ సభ్యులకు కేసీఆర్ సవాల్ విసిరారు. 

 

ఎమ్మెల్యేలు ఇన్ ఛార్జీలకు బాబు క్లాస్..

విజయవాడ : టిడిపి వర్క్ షాప్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. నేతలు సరిగ్గా పనిచేయకుంటే పక్కన పెడుతామని హెచ్చరించారు. నేతలు చేసే తప్పులను ఉపేక్షిస్తే పార్టీ మునుగుతుందని, విబేధాలు వీడి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.

16:47 - December 20, 2016

నెల్లూరు : జిల్లాలో దారుణం జరిగింది. దర్గామిట్టలో సైరాభాను అనే మహిళపై ఉన్మాది కిరోసీన్ పోసి నిప్పంటించాడు. రెండు నెలలుగా బాధితురాలిని ఫోన్లో ఇర్ఫాన్ పఠాన్ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు యువతి చెప్పడంతో వారు ఇర్ఫాన్‌ని మందలించారు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు ఆమెపై కిరోసిన్‌తో దాడిచేశాడు. ప్రస్తుతం ఆమె నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందింతుడిని కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందింతుడిని అదుపులోకి తీసుకున్నారు. 

 

తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. ఉదయం ప్రశ్నోత్తరాలు అనంతరం జీరో అవర్, మధ్యాహ్నం మిషన్ భగీరథపై లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

16:45 - December 20, 2016

విజయవాడ : వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే రాష్ట్రంలోని పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టామని ఏపీ మంత్రి గంటాశ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఏ జిల్లాకు ఏ రంగంలో వెనకబడి ఉంది.. దానిని ఎలా అధిగమించాలనే దానిపై వర్క్‌షాప్‌లో చర్చించామని ఆయన తెలిపారు. టీడీపీ మెంబర్‌షిప్ విషయంలో తాను ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కడప జిల్లా ముందంజలో ఉందని గంటా వెల్లడించారు. 

 

16:41 - December 20, 2016

విజయవాడ : ఎన్నికల్లో ఇకనుంచి సమర్ధులైన అభ్యర్ధులనే నిలపనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. డమ్మీలను ఎన్నికల్లో నిలిపితే.. ప్రజలు తమను డమ్మీలను చేసే ప్రమాదముందన్నారు. అందుకే సమర్ధవంతమైన నేతలనే ఎన్నికల్లో నిలపుతామని పార్టీ క్యాడర్‌కు సూచించారు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ వర్క్‌షాప్‌లో చంద్రబాబు  ప్రారంభోపన్యాసం చేశారు.  పార్టీకి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమర్ధనాయకత్వం అవసరం అన్నారు.  పార్టీ పదవుల్లో కొనసాగుతున్న వారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.  ప్రభుత్వ పాలనపై తానూ మూడు నెలలకు ఒకసారి పరీక్ష రాస్తున్నానని చెప్పారు. దీని ద్వారా  ప్రజల ఆకాంక్షలను ఏమేరకు నెరవేరుస్తున్నామో తెలుసుకోగలుతున్నామని చెప్పారు.

 

16:35 - December 20, 2016

హైదరాబాద్ : ఏపీ పరిపాలనా న్యాయస్థానంలో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేసేందుకు వీలు కల్పించే బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తరుపున రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ బిల్లును ప్రతిపాదించారు. 

 

ఆధారాలు బయటపెట్టాలి - కేటీఆర్..

హైదరాబాద్ : అవినీతి జరిగిందని ఆధారాలు ఏవైనా ఉంటే చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమని, అవసరమైతే పరువు నష్టం దావా వేస్తామన్నారు. ప్రధాని తొలిసారి రాష్ట్రానికి వస్తానంటే రావొద్దని లేఖ రాయడం కాంగ్రెస్ కే చెల్లిందని విమర్శించారు.

మిషన్ భగీరథలో అవాస్తవాలు - ఉత్తమ్..

హైదరాబాద్ : ఒక్క ఎంపీ ఉన్న టీఆర్ఎస్ వల్లే లోక్ సభలో తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందా అని టి.కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ ప్రశ్నించారు. ఇన్ టెక్స్ వెల్ టెండర్లలో రూల్స్ మార్చారని, దమ్ముంటే ఇన్ టెక్స్ వెల్ టెండర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులను ఆంధ్రనేతలకు అప్పగించారని, వాటర్ గ్రిడ్ టెండర్లలో అవినీతికి పాల్పడ్డారని, దమ్ముంటే అవినీతి జరగలేదని చెప్పాలని సూచించారు. ప్రధానికి లేఖ రాసిన మాట వ్తాసవమని అంగీకరించారు. మిషన్ భగీరథలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొనడం జరిగిందన్నారు.

16:25 - December 20, 2016

హైదరాబాద్ : ప్రతి గిరిజన గ్రామానికి తాగునీరు ఇవ్వాలని సీపీఎం ఎమ్మెల్మే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మిషన్ భగీరథ పథకంపై జరుగుతున్న చర్చ సందర్భంంలో ఆయన మాట్లాడారు. పథకంలో అవినీతికి తావులేకుండా ప్రభుత్వం చూడాలన్నారు. పథకం అమలు పారదర్శంగా ఉండాలని కోరారు. రూ.42 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తారు నీరు ఇవ్వాలని కోరారు. డీపీఆర్ విధానాన్ని వెంటనే ప్రకటించాలని సూచించారు.

 

16:16 - December 20, 2016

చెపాక్ : చివరి టెస్టు...మ్యాచ్ డ్రా గా ముగుస్తుందా ? లేక భారత్ విజయం సాధిస్తుందా ? లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు ఒక వికెట్ పోకుండా 97 పరుగులు చేసింది. దీనితో మ్యాచ్ రసకందాయంలో పడింది. చివరకు మలుపు తిరిగింది. భారత బౌలర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఏడు వికెట్లు సాధించి పతనాన్ని శాసించాడు. చివరకు భారత్ అద్భుత విజయం సాధించింది. వరుసగా 18 టెస్టు మ్యాచ్ ల్లో భారత్ జయభేరి మోగించింది. 1992 తరువాత వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసుకుంది. ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించింది.

ఆలీ..బెన్ స్టోక్స్..
మంగళవారం ఆఖరి రోజు. 12/0 ఓవర్ నైట్ స్కోర్ తో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది. కెప్టెన్ కుక్, జెన్సింగ్స్ ఆచితూచి బాధ్యాతయుతంగా ఆడారు. తొలి సెషన్ లో వికెట్ పోకుండా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరి వికెట్ తీయాలని భారత బౌలర్లు కష్టపడ్డారు. తొలి వికెట్ కు కుక్..జెన్సింగ్స్ లు 103 పరుగులు జోడించారు. రెండో సెషన్ ప్రారంభమైంది. భారత బౌలర్లు ఈ సెషన్ లో విజృంభించారు. ఒక పరుగు చేస్తే అర్ధ సెంచరీ నమోదు కావాల్సిన తరుణంలో కుక్ (49) ను జడేజా వెనక్కి పంపాడు. కొద్దిసేపటిలోనే జెన్సింగ్ (54) వెనుదిరిగాడు. 110 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 126 పరుగుల వద్ద రూట్ వికెట్ ను జడేజా తీశాడు. మొయిన్ ఆలీ భారత బౌలర్లను ఎదుర్కొని పరుగులు రాబట్టేందుకు కృషి చేశాడు. ఇతనికి కొద్దిసేపు బెన్ స్టోక్స్ సహకారం అందించాడు. వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతారా అనే సందేహం అభిమానుల్లో కలిగింది. 63 పరుగులను జోడించడంతో ఇంగ్లండ్ గాడిలో పడ్డట్టే కనిపించింది.

జడేజా విజృంభజన..
కానీ మొయిన్ (44) ను జడేజా అవుట్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అనంతరం బెన్ (23) కూడా అవుట్ అయ్యాడు. పూర్తిగా మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చేసినట్లేనని అభిమానులు భావించారు. అభిమానుల ఆశలకు తగట్టే భారత బౌలర్లు విజృంభించారు. వరుసగా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 207 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రధానంగా జడేజా ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పరాజయానికి కారకుడయ్యాడు. జడేజా ఏడు, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మిశ్రాలు తలా ఒక వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్ కోహ్లికి లభించగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరుణ్ నాయర్ కు దక్కింది. భారత్ కు వరుసగా 18 వ టెస్టు విజయం. 2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం.

ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ : 477 ఆలౌట్..
భారత్ మొదటి ఇన్నింగ్స్ : 759/7.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 207 ఆలౌట్.

16:16 - December 20, 2016

శునకాలు ఎంత హైట్ ఉంటాయి..? కొన్ని కుక్కలు ఎత్తుగానే ఉంటాయి. మరికొన్ని చిన్నవిగానే ఉంటాయి. అంటారు కదా. ఈ ఫొటోలో చూస్తున్న 'శునకం' హైట్ చూస్తే పరేషాన్ కావాల్సిందే. ఈ భారీ శునకం ముందు ఇతర శునకాలు చిన్నబోతాయి. ప్రపంచంలోనే అతి పెద్ద శునకంగా రికార్డులకెక్కింది. దీని పేరు ‘ఫ్రెడ్డీ’. బ్రిటన్ దేశానికి చెందిన క్టెయిరీ స్టోన్ మ్యాన్ ఈ ‘ఫ్రెడ్డీ’ని పెంచుకుంటున్నాడు. దీని పొడవు ఎంత తెలుసా మీకు..ఏకంగా ఏడు అడుగుల ఆరు అంగుళాలు కాగా బరువు 92 కిలోలు. ఇది మాములు తిండి తినదంట. ప్రతి సంవత్సరం 12,500 పౌండ్లు ఖర్చు పెడుతానని యజమాని పేర్కొన్నాడు. రెస్టెడ్ చికెన్, పీనట్ బటర్ తో చేసే టోస్టులంటే ఈ ఫ్రెడ్డీకి ఇష్టమంట. అంతేగాకుండా బాగా అల్లరి కూడా చేస్తుందని, దీనిబారిన పడే వస్తువు మిగలదంట. పలు సోఫా సెట్లు, ఇతర వస్తువులు ధ్వంసం చేసినా తనకు 'ఫ్రెడ్డీ'పై కోపం లేదని పేర్కొంటున్నాడు.

భారత్ విక్టరీ..

చెపాక్ : ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చెపాక్ లో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఐదు టెస్టు సిరీస్ ను 4-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కరుణ్ నాయర్ కు దక్కింది.

ఇంగ్లండ్ తొలి, రెండో ఇన్నింగ్స్ : 477, 207 ఆలౌట్.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 759/7.

15:59 - December 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో మిషన్ భగీరథపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నీళ్లతో చెరువులు నింపడం మంచి విషయమే కానీ అనుత్పాదక రంగంపై ఖర్చు పెట్టడం సరికాదని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. ప్రాధాన్యత లేని, అనుత్పాదక రంగాలపై ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. రూ.42 వేల కోట్లు అనుత్పాదక రంగంపై ఖర్చు పెట్టడం సరికాదని హితవు పలికారు. దశల వారిగా చేపట్టాలన్నారు.

15:52 - December 20, 2016

హైదరాబాద్ : నగదు విత్ డ్రాపై పరిమితిని ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గోల్కొండ క్రాస్ రోడ్డులో ఆ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ సర్కార్ పై జూలకంటి మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చిల్లర దొరకక నానా అసవ్థలు పడుతున్నారని తెలిపారు. మోడీ నిర్ణయానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. వీరంతా..కార్పొరేట్ శక్తులకు, నల్లకుబేరులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగదు సమస్య తీర్చకపోతే మోడీ ప్రభుత్వానికి ప్రజలు ఫుల్ స్టాప్ పెడతారని హెచ్చరించారు. 

 

విజయానికి చేరువలో భారత్..

చెన్నై : చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. కేవలం రెండు వికెట్ల దూరంలో ఉంది. ఇంగ్లండ్ జట్టు 200 పరుగుల వద్ద 8వ వికెట్ ను కోల్పోయింది. ఇంకా పది ఓవర్లు మిగిలి ఉండగా, భారత్ స్కోరును చేధించేందుకు ఇంగ్లండ్ 81 పరుగులు చేయాల్సి ఉంది. పిచ్ టర్న్ కు సహకరిస్తుండడంతో రవీంద్ర జడేజా చెలరేగి ఐదు వికెట్లు తీయగా, అతనికి మరో స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక వికెట్ తీసి సహకరించాడు.

మోడీపై రాహుల్ విసుర్లు..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దుస్తులు మార్చినట్లే ఆర్బీఐ నిబంధనలు మారుస్తోందని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

15:48 - December 20, 2016
15:47 - December 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో మిషన్ భగీరథపై వాడివాడి చర్చ జరుగుతోంది. అధికార, విపక్షాలు వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. మిషన్ భగీరథ పథకం అమలు సక్రమంగా లేదని విపక్షాలు విమర్శించాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మిషన్ భగీరథలో రూ.42 కోట్లు అవకతవలు జరిగాయని ఆరోపించారు. టెండర్ల వివరాలను బయటపెట్టాలన్నారు. మిషన్ భగీరథ టెండర్ల వివరాలు సభలో పెట్టాలని చెప్పారు. టెండర్లపై హౌస్ కమిటీ వేయాలని అన్నారు. ప్రజా సమస్యలు చెప్పేందుకు ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి వాపోయారు. ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు. జానారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ సభ్యులు అభ్యతరం చెప్పారు. జానారెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి : సునితా
ప్రభుత్వ విప్ సునితా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహా వ్యక్తి కాబట్టే మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పులివెందులకు నీరు తీసుకెళ్లారని, చంద్రబాబు హయాంలో కుప్పంకు నీరు తీసుకెళ్లారని, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చిత్తూరు జిల్లాలకు నీరు తీసుకెళ్లారని పేర్కొన్నారు. గతంలో నల్లగొండకు నీరు ఇచ్చి ఉంటే జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉండేదా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథపై చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు మిషన్ కాకతీయపై చర్చ పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ సభ్యులకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. చాలా కన్ ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైందని కనుక నిరూత్సాహంలో ఉండడంలో అర్థం ఉందని చురకలంటించారు. కాంగ్రెస్ హయాంలో బాగా నీరిస్తే నల్గొండలో ఫ్లోరైడ్ ఎందుకు ఉందని నిలదీశారు. ఆదిలాబాద్ జిల్లాలో మంచినీరు లేక ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని వాపోయారు. తమ ప్రభుత్వం తెలంగాణలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి అందిస్తుందని చెప్పారు. ప్రజలు ఆదరించారు కాబట్టి తాము ఇప్పుడు ఇక్కడ ఉన్నామని తెలిపారు. 

బాబు గాంధీ మహ్మాత్ముడు కాడు - జేసీ దివాకర్..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫీసర్లలతో బాబు పాలిస్తున్నారని, ఆఫీసర్ల రాజ్యం వద్దని చంద్రబాబుకు చాలా సార్లు చెప్పడం జరిగిందన్నారు. చంద్రబాబు ఈ పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందేనని, కేవలం చంద్రబాబు వల్లే పార్టీ అధికారంలోకి రాలేదన్నారు. పిలిస్తే జనం రావడానికి చంద్రబాబు గాంధీ మహాత్ముడు కాడని, పయ్యావుల కేశవ్ గుర్తింపు లేకపోతే తమలాంటి వాళ్ల పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు. ఆనాటి పరిస్థితుల్లో జగన్ సీఎం అవుతాడని అనుకున్నామని, జగన్ కు పదవి రావడం ఏపీకి మేలు కాదని భావించి టిడిపిలో చేరడం జరిగిందన్నారు.

తాగు,సాగునీరివ్వడమే లక్ష్యం - కేటీఆర్..

హైదరాబాద్ : తాగునీటి కొరత తీర్చేందుకు మిషన్ భగీరథ చేపట్టడం జరిగిందని, ఇంటింటికి తాగునీరు, సాగునీరవ్వడమే లక్ష్యమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథపై శాసనసభలో జరిగిన లఘు చర్చలో కేటీఆర్ సమాధానం చెప్పారు. నల్గొండ ప్రపంచానికి ప్రయోగశాలగా మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇళ్లు కట్టించాకే నీళ్లివ్వండి - ఆర్.కృష్ణయ్య..

హైదరాబాద్ : మిషన్ భగీరథ అనుత్పాదక పథకమని, ఇళ్లులేని 22 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించాకే ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సూచించారు. అప్పులతో కాకుండా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మిషన్ భగీరథను చేపట్టాలన్నారు. అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు.

15:28 - December 20, 2016

శీతాకాలం..ఈ కాలంలో రోగాలు వ్యాపిస్తుంటాయి. చలి..జ్వరం..పొడిదగ్గు వేధిస్తుంటాయి. రాత్రి సమయంలో పొడి దగ్గు అధికంగా వస్తుంటుంది. మరి పొడి దగ్గు పోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి ? దగ్గు నుండి ఉపశమనం పోందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

  • పొడి దగ్గు అధికంగా వస్తుంటే కొంచెం తలకు..గొంతుకు జండుబామ్ రాసుకుని కొద్ది సమయం పాటు విశ్రాంతి తీసుకోవాలి.
  • రాత్రి పడుకొనే ముందు ఒక చెంచా తేనెను తాగాలి. ఇలా తాగడం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేనెను సేవించడం వల్ల గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది.
  • పొడి దగ్గు ఉపశమనానికి అల్లం నీళ్లు ఎంతగానో దోహదపడుతుంది. కొంచం అల్లం ముక్క వేసి బాగా మరించాలి. ఇలా మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • రాత్రి పడుకొనే ముందు పొడి దగ్గు అధికంగా వేధిస్తుంటే అల్లం టీ తాగాలి. దీనివల్ల తొందరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది. దీనితో పాటు గోరువెచ్చగా గ్రీన్ టీ తాగినా ఫలితం ఉంటుంది.
  • లవంగాలను గాని తానికాయలను కాని నెయ్యిలో వేయించి నోటి పక్కన పెట్టుకుని రసం మింగుతుంటే దగ్గు తగ్గుతుంది.
  • వాసాపత్రాల రసాన్ని రెండు చెంచాల పరిమాణంలో నెయ్యి, మిశ్రీలను కలిపి తీసుకోవాలి.
  • చిటికెడు పిప్పళ్లఫల చూర్ణానికి రెండు చిటికెళ్ల సైంధవ లవణం కలిపి వేడినీళ్లతో రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

ప్రతి గిరిజన గ్రామానికి నీరివ్వాలి - సున్నం రాజయ్య..

హైదరాబాద్ : ప్రతి గిరిజన గ్రామానికి తాగునీరవ్వాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. అవినీతికి తావులేకుండా ప్రభుత్వం చూడాలని, రూ. 42వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరవ్వాలని పేర్కొన్నారు. వెంకటాపురం మండలం, దుమ్ముగూడెంలోని పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు చేయడం లేదని, నీళ్లు వచ్చే విధంగా చేయాలని సూచించారు. డీపీఆర్ విధానాన్ని వెంటనే అమలు పరచాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ అపర భగీరథుడు - రసమయి..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అపర భగీరథుడని రసమయి బాలకృష్ణ పేర్కొన్నారు. మిషన్ భగీరథను దళితుల ఆత్మగౌరవంగా భావిస్తున్నట్లు, గతంలో పెద్దోళ్లు ఒక చోట నీళ్లు..పేదలు ఒక చోట నీళ్లు తాగిన రోజులు చూడడం జరిగిందన్నారు. ప్రజలందరూ కలిసి ఒకే చోట నీళ్లు అందించాలని, చేపట్టిన గొప్ప పథకం మిషన్ భగీరథ అని తెలిపారు. పైపుల్లో పైసలు చూసిన వారికి పైసలే కనబడుతాయి తమకు మాత్రం నీళ్లు కనబడుతున్నాయన్నారు.

మిషన్ భగీరథ చాలా మంచి పథకం - ప్రభాకర్..

హైదరాబాద్ : మిషన్ భగీరథ చాలా మంచి పథకమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ అమలులో ప్రభుత్వంపై గురుతర బాధ్యత ఉందని, గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

టిటిడి పాలక మండలి కీలక నిర్ణయాలు.

చిత్తూరు : టిటిడి పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 10 కోట్లతో తిరుపతి రోడ్ల సుందరీకరణ..176 మంది పోటు కార్మికుల కాంట్రాక్ట్ పొడిగింపు..150 మంది టిటిడి డ్రైవర్లకు రూ. 24,500 జీతం పెంపు..క్షురకులకు ఫీజు రేటు రూ. 11కు పెంపు..పిఠాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం పునరుద్ధరణ..త్వరలో 447 మంది అర్చకులు, పరిచారకుల పోస్టుల భర్తీ..చేయాలని నిర్ణయాలు తీసుకుంది.

వింజమూరులో మహిళల దారుణ హత్య..

నెల్లూరు : వింజమూరులో దారుణం చోటు చేసుకుంది. నాగరత్నమ్మ, సుబ్బమ్మ అనే ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. కత్తులతో పొడిచి దుండగులు హత్య చేశారు. భూ వివాదమే కారణమని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

13:59 - December 20, 2016

హైదరాబాద్ : సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తెలంగాణ..అంటూ మంత్రి ఈటెల చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో దుమారం చెలరేగింది. నాలుగో రోజు మధ్యాహ్నం మిషన్ కాకతీయపై చర్చ జరిగింది. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. మధ్యలో మంత్రి ఈటెల జోక్యం చేసుకుని మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జానా తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొనడం జరిగిందని, ఒకానొక సందర్భంలో తనింటికి కేసీఆర్ వచ్చారని, ఇద్దరం కూర్చొని మాట్లాడడం జరిగిందన్నారు. తెలంగాణ సాధించడానికి ఏమైనా సిద్ధమని కేసీఆర్ కు ఆనాడు చెప్పడం జరిగిందన్నారు. లోపాలను ప్రభుత్వం సరి చేసుకోవాలని, తాము తలుచుకుంటే అధికారంలో ఉన్నప్పుడే టీఆర్ఎస్ ను అణిచివేసే వాళ్లమని జానా వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు చెప్పేందుకు ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదని, ప్రభుత్వం తీరు సరిగ్గా లేదన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కొంత దుమారం చెలరేగింది.

13:57 - December 20, 2016

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబుపేలుళ్లతో నరమేధం సృష్టించిన ఉగ్రమూకలకు ఉరిశిక్ష పడింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో విధ్వంసానికి పాల్పడింది ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ సభ్యులేనని న్యాయస్థానం ఈ నెల 13వ తేదీనే ఎన్‌ఐఏ న్యాయస్థానం నిర్ధారించింది. 2013, ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో రాత్రి 7 గంటలకు జరిగిన జంట పేలుళ్లలో 19 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. జంట పేలుళ్ల కేసులో అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హడ్డీ, జియా ఎర్‌ రెహమాన్‌ అలియాస్‌ వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ మోనూ, యాసిన్‌ భత్కల్‌, ఐజాజ్‌ షేక్‌లను నేరస్థులుగా నిర్ధారించిన ఎన్‌ఐఏ కోర్టు.. వారికి ఉరిశిక్ష విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. శిక్ష పడ్డ నిందితుల్లో ఏ1గా ఉన్న రియాజ్ భత్కల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రియాజ్‌ భత్కల్‌ పాకిస్థాన్‌లో ఉన్నట్లు గట్టిగా వాదిస్తున్న ఎన్‌ఐఏ.. ఇంటర్‌పోల్‌ నోటీసు కూడా జారీచేసింది. దేశంలో ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులపై నేరం రుజువైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. దోషులకు పడిన శిక్షపై బాధితులేమంటున్నారో వీడియోలో చూద్దాం..

13:53 - December 20, 2016

హైదరాబాద్ : నీదా తెలంగాణా? అందరిదా ? అని సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. మిషన్ భగీరథపై మంత్రి ఈటెల జోక్యం చేసుకోవడం..ఆయన ఇచ్చిన విషయాలపై జానా స్పందించారు. ఈటెల మాటల్లో..నా తెలంగాణ అంటున్నారని, ఇది చాలా అభ్యంతకరమన్నారు. నువ్వు తెచ్చావా తెలంగాణ అంటూ ప్రశ్నించారు. మన బిడ్డలు..మన తెలంగాణ..ప్రజలకు చేస్తున్న కృషి చెప్పడంలో అభ్యంతరం లేదన్నారు. ఈ తెలంగాణ ప్రజల ఆశలు..ఆకాంక్షల కొరకు రాష్ట్రం ఏర్పడిన సంగతి...అడిగిన వారిలో కూడా మీరు (టీఆర్ఎస్) కూడా భాగమేనన్నారు. తెలంగాణలో సింహభాగం కాంగ్రెస్ దేనని, దీనిపై మంత్రి కేటీఆర్ కూడా జోక్యం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరు జిల్లా పథకానికి ఏడు వేల కోట్లు ఇచ్చారని, నా తెలంగాణ అని కాంగ్రెస్ అనుకోలేదని, 69లో ఉద్యమం వస్తే 370 పిల్లలను పిట్టల్లా కాల్చారని, తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు.

13:48 - December 20, 2016

హైదరాబాద్ : నీళ్ళ కోసం పైపులేస్తున్నారా? లేదా పైపులున్నాయనీ నీళ్లు పంపిస్తున్నారా ? అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా మిషన్ భగీరథపై మంత్రి కేటీఆర్ మిషన్ భగీరథపై చర్చ ప్రారంభించారు. దీనిపై సభలో హాట్ హాట్ గా నడిచింది. ఈ సందర్భంగా భట్టి ఈ విధంగా స్పందించారు.  నీళ్ళ కోసం పైపులేస్తున్నారా? లేదా పైపులున్నాయనీ నీళ్లు పంపిస్తున్నారా ? అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఒక్క వైరా రిజర్వాయర్ నుండి 20 కిలో మీటర్ల వాటర్ పంపింగ్ చేస్తున్నారనీ..200 నుండి 205 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారన్నారు. డీపీఆర్ పై ఎన్నో అనుమానాలున్నాయని వాటిని నివృతి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. భగీరథ టెండర్ల వివరాలను బైటపెట్టాలని భట్టి డిమాండ్ చేశారు. రూ.42వేల కోట్లలో భారీ అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. అవుసరం లేని ప్రాంతంలో పైపులు వేసి అనవసర ఖర్చులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భట్టి విర్కమార్క విమర్శలపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే జిల్లాకోసం రూ.7వేల కోట్లు ఖర్చుపెట్టారన్నారు. డీపీఆర్ సంబంధించి అన్నీ వివరాలు ఆన్ లైన్ లో వుంచామనీ దీంతో వారి అనుమానాలు తీర్చుకోవచ్చన్నారు. రాష్ట్రంలో తాగునీటి కొరతను తీర్చేందుకు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కలుషిత నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ఉద్ఘాటించారు. ప్రజలందరికీ శుద్ధి చేసిన తాగు నీరందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

కోడి గుడ్డుమీద ఈకలు పీకుతారా? : ఈటెల
ప్రతీ తండాలోనూ ప్రతీ మనిషి 100 లీటర్ల ఇచ్చేందుకు ఈ మిషన్ భగీరథ పనులను చేపట్టామని మంత్రి ఈటెల పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రతీ ఇంటికీ నీరివ్వకపోతే ఓట్లు అడగమని ప్రకటించిన ఘనత..ధైర్యం మా ప్రభుత్వానిదేనని ఈటెల స్పష్టం చేశారు. మిషన్ భగీరథకు అన్ని ప్రాంతాలను నుండి అభినందనలు వస్తుంటే అనవసరంగా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటికోసం తెలంగాణ ఆడబిడ్డలు రోడ్డు ఎక్కే పరిస్థితుల రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తెలంగాణ మీదేనా మాది కాదా? : జానారెడ్డి
ప్రతీమాటకూ మా తెలంగాణ..మా తెలంగాణ అంటున్నారు తెలంగాణ అంటే మీదేనా? మాది కాదా అని కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేసిన సూచనల్ని తీసుకోవాలని సూచించారు. పాలనలో వున్న లోపాలను సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ అందరిదీనన్నారు. సోనియా గాంధీకి పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి తెలిపామనీ..రాష్ట్రం సిద్ధంచేందుకు కాంగ్రెస్ పార్టీది కీలక పాత్ర అనీ..అది అధికార పక్షం విస్మరించటం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మిమ్మల్ని అణచాలనుకుంటే మాకెంత సమయం పట్టదన్నారు.ప్రజాసమస్యలు మాట్లాడుతుంటే ప్రభుత్వం విపక్షాలను అవకాశం ఇవ్వట్లేదని విమర్శించారు. ప్రభుత్వం తీరు సరిగాలేదన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వామపక్షాలు యత్నిస్తుంటే కనీసం సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. 

ఆంధ్రాకు తెలంగాణకు బలవంతపు పెళ్లి చేశారు : కేటీఆర్ 
దీనికి అడ్డుకుని నా తెలంగాణ అని కాంగ్రెస్ ఏనాడూ అనుకోలేదన్నారు. అందుకే ఈనాడు ఆంధ్రాకు తెలంగాణకు బలవంతపు పెళ్లి చేశారనీ ..తెలంగాణ బిడ్డల్ని పిట్టల్ని కాల్చేసిన ఘనత కూడా కాంగ్రెస్ కారణమన్నారు. అందుకే మిమ్మల్ని అక్కడ ప్రతిపక్షంలోనూ మమ్మలల్ని ఇక్కడ అధికారపక్షంలోనూ కూర్చోపెట్టారన్నారు. మిమ్మల్ని అణచాలనుకుంటే మాకెంత సమయం పట్టదని జానారెడ్డి మాటలకు కేటీఆర్ మండిపడ్డారు. జాతీయ పార్టీ కాస్తా..ప్రతిపక్ష పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ అందరిదీ - జానారెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఈటెల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అందరిదీ అని, నాది అని మంత్రి ఈటెల పేర్కొన్నారు. నాది తెలంగాణ ఎలా అంటారు అంటూ జానారెడ్డి ప్రశ్నించారు. మిషన్ కాకతీయ పై చర్చ కాస్త పక్కదారి పట్టింది.

ప్రతింటికి శుద్ధి నీరు - కేటీఆర్..

హైదరాబాద్ : ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తామని, చాలా జిల్లాలో ఫ్లోరైడ్ మోతాదును మించి ఉందని...మిషన్ భగీరథ పైపులైన్లతో పాటు ఫైబర్ గ్రిడ్ కేబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని కేటాయించినట్లు, గోదావరి, కృష్ణా బేసిన్ లో 42.67 టీఎంసీల నీటి పనులను 26 ప్రధాన సెగ్మెంట్లుగా విభజించడం జరిగిందన్నారు. గ్రావిటీ ఆధారంగానే 98 శాతం నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 19 ఇంటెక్స్ వెల్స్ లో 8 ఇంటెక్స్ వెల్స్ పూర్తయ్యాయన్నారు. 544 సంపుల్లో 111 సంపుల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. ఇప్పటి వరకు 714 ఆవాసాలకు నీరందుతోందన్నారు.

నకిలీ విత్తనాల కంపెనీలపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీలను కేసుల జాబితాలో చేర్చాలని హైకోర్టు ఆదేశించింది.

ఒక్క చిత్తూరు జిల్లాకు మాత్రమే రూ. 7 కోట్లు - కేటీఆర్..

హైదరాబాద్ : 2009-14 సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలో చాలా మంది మంత్రులుగా ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయపై సభలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాకు ఏడు కోట్ల రూపాయలు కేటాయించి కేబినెట్ లో ఆమోదించింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు.పది జిల్లాలకు ఎంత ఖర్చు పెట్టాలని, అనుమానాలు ప్రజల్లో లేవని, అపోహలు ప్రతిపక్షం కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్నారు. అంతా ఆన్ లైన్ లో ఉన్నాయని, వివరాలు చూసుకోవాలని భట్టికి సూచించారు.

 

నీళ్ల కోసం పైపులా..పైపుల కోసం నీళ్లా - భట్టి..

హైదరాబాద్ : నీళ్ల కోసం పైపులా..పైపుల కోసం నీళ్లా అని టి.కాంగ్రెస్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శాసనసభలో మిషన్ కాకతీయపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో మల్లు పలు ప్రశ్నలు సంధించారు. వైరా రిజర్వాయర్ నుండి నీటిని రివర్స్ ద్వారా నీటిని పంప్ చేస్తున్నారని, వైరా రిజర్వాయర్ ఉన్న నీటిని 16 కి.మీటర్ల దూరం వరకు రివర్స్ పంపింగ్ జరుగుతోందని, కోటి 80లక్షలు అవుతోందని, దాదాపు 45 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.

13:05 - December 20, 2016

రాంగోపాల్ వర్మ..నిత్యం ఏదో వివాదం..వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఇతరుల చిత్రాలు..ఇతరుల అభిప్రాయాలపై కామెంట్స్ చేస్తూ ఉంటుంటాడు. ఆయన తీస్తున్న చిత్రాలు సైతం వివాదాస్పదమౌతుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తీసిన చిత్రం 'వంగవీటి' చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవలే 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై 'వర్మ' ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో 'ఖైదీ నెం.150'కి పోలికే లేదు అంటూ 'వర్మ' కామెంట్స్ చేయడం కలకలం రేపింది. మెగాస్టార్ అభిమానుల నుండి గట్టిగానే సమాధానం చెప్పారు. మెగాస్టార్ అభిమానులు చేసిన ట్వీట్స్ తో 'వర్మ' మరికొన్ని ట్వీట్స్ చేశారు. తాను కూడా 'మెగాస్టార్' అభిమానినే అని 'వర్మ' చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ బాహుబలి, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు వర్మ పేర్కొన్నాడు.

12:59 - December 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కేంద్రం 8 వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించడం పట్ల సర్కార్‌ సంతోషం వ్యక్తం చేసింది. ప్రతిపాదిత పనులకు సంబంధించి చర్యలు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే కేంద్రానికి డిపిఆర్‌లు అందించిన నేపథ్యంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

తెలంగాణ రోడ్లపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి
తెలంగాణ రోడ్లపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్లు సరిగ్గా లేక జాతీయ రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. నిధులు విడుదల కాక జాతీయ రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. దీంతో రోడ్లపై ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం జరిగిన ఐఆర్సీ సదస్సులో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వరాల జల్లు కురిపించారు.

రోడ్ల అభివృద్ధి కోసం రూ. 8వేల కోట్లు
రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి కోసం 8వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. గతంలో భారత రహదార్ల మహాసభలలో పాల్గొన్న ఆయన.. తెలంగాణపై వరాలు కురిపించారు. రోడ్ల అభివృద్ధి కోసం డీపీఆర్‌ రూపొందించి ఖచ్చిత్తమైన అంచనాలతో నివేదికలు రూపొందించి ఆ నివేదికలు సత్వరమే డిపార్ట్‌మెంట్‌లో అందజేయాలని సూచించారు.

కేంద్రానికి డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు
ఖమ్మం - సూర్యాపేట, ఖమ్మం-కోదాడ, సంగారెడ్డి - నాందేడ్, మంచిర్యాల చంద్రాపూర్, కరీంనగర్ - వరంగల్ రూట్ల మధ్య రహదార్ల అభివృద్ధికి 8వేల కోట్లు వినియోగించనున్నారు. అయితే ప్రస్తుతం కేంద్రమంత్రి ప్రకటించినా సదరు ప్రతిపాదిత రహదార్ల విషయంలో ఇప్పటికే కేంద్రానికి డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు అందాయి. దీనిపై కేంద్రం సైతం సానుకూలంగా స్పందిస్తూ వస్తూనే ఉంది.

కసరత్తు వేగవంతం చేసిన రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ
అయితే ఐఆర్సీకి ముఖ్య అతిధిగా హాజరైన నితిన్ గడ్కరీ స్వయంగా రాష్ట్రానికి 8 వేల కోట్లు ఇస్తామని ప్రకటించడంతో ప్రక్రియ వేగవంత చేసేందుకు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్రం సూచించిన విధంగా చర్యలు ప్రారంభించి వీలైనంత త్వరగా నిధులు రాబట్టేందుకు చొరవ తీసుకుంటోంది. 

12:54 - December 20, 2016

తమిళనాడు : అమ్మ జ్ఞాపకాలతో తమిళనాడు ఇంకా కన్నీరు పెడుతూనే ఉంది. వేలాదిమంది అమ్మ అభిమానులు జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. ఇక అమ్మపై అభిమానంతో కొందరు వినూత్నంగా అంజలి ఘటిస్తున్నారు. ఆర్కేనగర్‌కు చెందిన చెఫ్ ఇనియన్ 68 కిలోల ఇడ్లీని తయారు చేసి జయ సమాధి వద్ద ఉంచి తన అభిమానాన్ని చాటుకున్నారు. జయకు ఇష్టమైన ఇడ్లీతోపాటు ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేశారు. తన కళ ద్వారా అమ్మకు ఇస్తున్న మలి వీడ్కోలు నివాళి అని ఆయన చెప్పారు. 

12:52 - December 20, 2016

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్‌, భారతికి హైకోర్టులో ఊరట లభించింది. తమ ఆస్తులను ఈడీ అటాచ్‌మెంట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తుల జప్తుపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆస్తుల జప్తుపై స్టే విధించింది. అపిలేట్‌ అథారిటీ నిర్ణయం తీసుకునే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. జగన్‌కు చెందిన మొత్తం 749 కోట్లను ఈడీ అటాచ్‌మెంట్ చేసింది. ఇందులో భారతీ సిమెంట్స్‌కు సంబంధించిన 170 కోట్ల నగదు డిపాజిట్లను తన ఖాతాలోకి ఈడీ మళ్లించుకుంది. 

మిషన్ కాకతీయపై నిఘా..పర్యవేక్షణ ఉండాలి - పొంగులేటి..

హైదరాబాద్ : శాసనమండలిలో మిషన్ కాకతీయపై స్వల్పకాలిక చర్చ జరిగింది. పనులపై నిరంతర నిఘా, పర్యవేక్షణ ఉండాలని టి.కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని, ఖమ్మంలో కాకతీయుల నాటి లకారం చెరువు కబ్జాకు గురైందని, చెరువుల కబ్జాలపై విజిలెన్స్ విచారణ చేయించాలని సూచించారు. కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపాలని, ఇందులో సాంకేతిక సహకారం వినియోగించడం ఆహ్వానించదగిందేనన్నారు.

మిషన్ కాకతీయ సత్ఫలితాలిచ్చింది - హరీష్..

హైదరాబాద్ : శాసనసమండలి సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితం మిషన్ కాకతీయపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. మిషన్ కాకతీయ సత్ఫలితాలు ఇచ్చిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరిగాయని, ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. రాష్ట్రంలోని చెరువులన్నింటినీ జియో ట్యాగింగ్ చేసి వివరాలన్నీ ఆన్ లైన్ అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మిషన్ కాకతీయ పనులు విజయవంతంగా సాగాయని సభకు తెలిపారు.

పెద్దనోటు రద్దుపై పాక్ యోచన..

ఢిల్లీ : పెద్దనోటును రద్దు చేయాలనే పాక్ యోచిస్తోంది. బ్లాక్ మనీని అరికట్టడానికి రూ. 5వేల పెద్ద నోటును రద్దు చేయాలని పాక్ సెనేట్ తీర్మానం చేసింది. పాకిస్తాన్ ముస్లింలీగ్ సెనేటర్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి పార్లమెంట్ ఎగువసభలో మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు.

చండీఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు..

హైదరాబాద్ : చండీఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 26 డివిజన్లలో బీజేపీ - అకాళీదల్ 17, కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలుపొందాయి.

హైకోర్టుకు వెళ్లిన జగన్ దంపతులు..

హైదరాబాద్ : ఈడీ అటాచ్ చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై స్టే విధించాలని జగన్ దంపతులు హైకోర్టుకు వెళ్లారు. ఆస్తుల జప్తుపై అపిలేట్ అథార్టీ నిర్ణయం తీసుకొనే అంత వరకు స్టే కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ. 749 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. రూ. 170 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు షేర్లను తమ ఖాతాల్లోకి ఈడీ బదిలీ చేసుకుంది.

12:33 - December 20, 2016

ఆదిలాబాద్ : మార్పు అనివార్యం. అది తెలిసినప్పుడు.. మార్పు దిశగా ప్రయాణం అవశ్యం. తద్వారా విజయమూ సాధ్యం. ఇదీ ఆదిలాబాద్‌ జిల్లా ముక్రాకే గ్రామస్థుల నవ్య నినాదం. ఇంతకీ ఏంటా మార్పు..? ఏదిశగా వారి పయనం.? వారు సాధించిన ఘన విజయం ఏంటి..? వాచ్‌ దిస్ స్టోరీ.

మార్పును స్వాగతించిన ఆదర్శ గ్రామం..
మార్పును స్వాగతించిన ఆదర్శ గ్రామం.. ప్రతి ఒక్కరిలో మూర్తీభవించిన చైతన్యం..చిన్నా పెద్దా కృషితో నగదు రహితమైన గ్రామం..విప్లవాత్మక మార్పులో మేము సైతం అంటూ ముందుకు సాగిన జనంఇదీ ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్థుల్లో వెల్లివిరిసన నవ చైతన్యం. నగదు కష్టాల నుంచి ఉపశమనానికి నగదు రహిత లావాదేవీలే శరణ్యమన్న ఏలికల అంతరంగాన్ని అర్థం చేసుకున్న ఈ గ్రామస్థులు విప్లవాత్మక మార్పును స్వాగతించారు. అందరూ బాగుండాలి.. అందులోనూ మేము ముందుండాలి అన్న భావనతో ఈ గ్రామస్థులంతా నగదు రహిత లావాదేవీలపైపు మళ్లారు.

నగదు రహిత లావాదేవీల్లో దూసుకు పోతున్న ముక్రాకేవాసులు
పెద్ద నోట్ల రద్దు దరిమిలా.. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతూ.. సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ ఖర్చులకు కూడా చేతిలో నగదు లేక సతమతమవుతున్నారు. పెద్దనోట్లను రద్దు చేసిన కొత్తల్లో ముక్రాకే గ్రామస్థులూ ఇదే తరహా వేదనను అనుభవించారు. అదే తరుణంలో ప్రభుత్వ సూచనతో.. చిల్లర కష్టానికి నగదు రహిత లావాదేవీలే శరణ్యమని గట్టిగా నమ్మారు. ఆ దిశగా అడుగులు వేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం గ్రామాన్ని స్పూర్తిగా తీసుకుని.. ముక్రాకేని .. సంపూర్ణ నగదు రహిత లావాదేవీల గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు అక్కడి ప్రజలు.

ముక్రేకే గ్రామానిది ఒకే మాట ఒకే బాట..
నగదు రహిత లావాదేవీలపై సంపూర్ణ అవగాహన పెంచుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ముక్రాకేవాసులు. 650 మంది జనాభా గల ముక్రాకే ప్రజలది ముందునుంచీ ఒకేమాట ఒకేబాట. గ్రామంలో ఏ సమస్య వచ్చినా.. అంతా కలిసి చర్చించి పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకునే వారు. ఇప్పుడు చిల్లరకు కష్టమొచ్చిన వెంటనే.. ప్రత్యామ్నాయ నగదు రహితంపై దృష్టి సారించారు. వీరికి స్వచ్చంద సంస్థ- సీఎస్‌సీ సంపూర్ణ సహకారాన్ని అందించింది. ఈ సంస్థ ప్రతినిధులు నగదు రహిత లావాదేవిలపై అవగాహన కల్పించడమే కాకుండా.. వారం రోజుల పాటు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ దీనిపై అవగాహన కల్పించారు. స్వైపింగ్ మిషన్ వాడకం, మొబైల్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులు, పేటీఎం వాడకం వంటి నగదు రహిత లావాదేవీ విధానాలను నేర్పారు.

కంప్యూటర్‌ విద్యపై కూడా అవగాహన
మార్పును స్వాగతించడంలో ముక్రాకే ప్రజలు ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటారు. గతంలో కూడా గ్రామస్థులంతా కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించి.. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు కంప్యూటర్‌ విద్యపైనా గతంలోనే గ్రామస్థులందరూ అవగాహన పెంచుకున్నారు. దీంతో ముక్రాకే వందశాతం డిజిటల్‌ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి పెద్దగా శ్రమ అవసరం లేకుండాపోయింది.

160 కుటుంబాలు అండ్రాయిడ్‌ ఫోన్‌
గ్రామంలోని కిరాణ షాపులో కూడా మొబైల్‌ ద్వారా చెల్లింపులు చేసేలా నగదు రహిత లావాదేవిలపై చక్కగా అవగాహన పెంచుకున్నారు. వంద శాతం నగదు రహిత లావాదేవిలు జరిపేలా గ్రామంలో ఉన్న 160 కుటుంబాలు అండ్రాయిడ్‌ ఫోన్‌ సదుపాయంతో లావాదేవిలు జరుపుతుండటం విశేషం.

వందశాతం నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న ముక్రాకే
నగదు రహిత లావాదేవిలపై అవగాహన సదస్సు ముగింపు కార్యక్రామానికి హాజరైన స్థానిక ఎంపీ నగేశ్‌ సైతం గ్రామస్తుల ముందుచూపు, చైతన్యం, సామాజిక స్పృహను అభినందించారు. అంతటా నగదు రహిత లావాదేవిలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ముక్రాకే గ్రామస్తులంతా ఏకతాటిపై నిలిచి మార్పును స్వాగతించడం నిజంగా హర్షనీయం.

 

12:13 - December 20, 2016
12:10 - December 20, 2016

హైదరాబాద్ : ఆంధ్రా బస్సుల వల్ల తెలంగాణకు రోజుకు ఆర్టీసీకి రూ.కోటి నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఆంధ్రా నుండి దాదాపు వెయ్యి బస్సుల వరకూ ప్రయివేటు బస్సులు నడుస్తున్నాయనీ..ఆర్టీసీ బస్సులు దాదాపు 800ల బస్సులు నడుస్తున్నాయన్నారు. ఆంధ్రా తెలంగాణ ఒప్పందం ప్రకారం ఫిఫ్టీ ఫిప్టీ నిబంధన ప్రకారం నడవాలనీ..దీనిమీద మా ప్రిన్సిపల్ గారు ఆంధ్రా సెక్రటరీకు లేఖ రాశారని తెలిపారు. అలాగే చీఫ్ సెక్రటరీగారు కూడా లేఖ రాశారని తెలిపారు. దీంతో తెలంగాణలో దాదాపు 3లక్షల వాహనాలు సింగిల్ పర్మిట్ తో నష్టలపాలవుతున్నాయని తెలిపారు. కాబట్టి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన కోరారు. దీనికి సంబంధిత మంత్రి సమాధానమిస్తూ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

11:57 - December 20, 2016

విజయవాడ : భవానీ దీక్ష విరమణకు వచ్చిన భక్తులతో విజయవాడ ఇంద్రకీలాద్రి పోటెత్తింది. దీక్ష విరమణ కోసం దుర్గగుడిలో విస్తృత ఏర్పాటు చేస్తారు. అర్చకులతో కాకుండా గురు భవానీలతోనే దీక్ష విరమించే ఏర్పాట్లు చేస్తామంటున్న విజయవాడ దుర్గగుడి ఈవో సూర్యక్రమారితో పేర్కొన్నారు. నేటి నుంచి ఐదు రోజులు పాటు దీక్షల విమరణ కొనసాగుతుందనీ -ఈవో సూర్యకుమారి పేర్కొన్నారు. దీక్ష విరమణకు విస్తృత ఏర్పాటు చేశామని తెలిపారు. గురు భవానీలతోనే దీక్ష విరమణ, అర్చకుల ప్రమేయం లేదన్నారు.మూడువేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. 

11:54 - December 20, 2016

త్రిపుర : అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ వద్ద ఉండే మూడు సింహాల గదను లాక్కొని టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్‌రాయ్ బర్మన్ బయటకు పరుగులు తీశారు. సుదీప్ చేతిలో ఉన్న మూడు సంహాల గదను తీసుకునేందుకు అసెంబ్లీ మార్షల్స్ ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. 

ఆర్టీసీకి కోటి నష్టం - శ్రీనివాస్ గౌడ్..

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సంస్థకు కోటి రూపాయల నష్టం వస్తోందని టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. నాలుగో రోజు శాసనసభా సమావేశాల్లో జీరో అవర్ అంశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా నుండి తెలంగాణకు..తెలంగాణ నుండి ఆంధ్రకు బస్సులు నడుస్తున్నాయని, జేసీ దివాకర్ రెడ్డి బస్సులు తిరుగుతున్నాయన్నారు. విచ్చలవిడిగా ప్రైవేటు బస్సులు నడవడానికి వీల్లేదన్నారు. ఆన్ లైన్ బుకింగ్ పెట్టి బజాప్త రోజు నడుపుతున్నారని, ఆంధ్రా నుండి 850 బస్సులు నడుస్తున్నాయన్నారు. ఒప్పందం ప్రకారం 50-50 నడవాలని, లేఖలు రాసినా స్పందనలేదన్నారు.

కేంద్రం వేరే...రాష్ట్రం వేరే కాదు - మంత్రి ఈటెల..

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం వేరు..రాష్ట్ర ప్రభుత్వం వేరు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నుల రూపంలో కేంద్రానికి నిధులు ఇస్తుందన్నారు. కేంద్రం నిధులను గ్రామ పంచాయితీలకు ఇస్తున్నట్లు, గ్రామ స్వరాజ్యం రానిదే బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. తమకు రాష్ట్రం మొత్తం ఒక్కటేనని, రాష్ట్ర అభివృద్ధే అజెండా అని, బంగారు తెలంగాణ సాధనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

11:43 - December 20, 2016

బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్ తల్లిదండ్రులు అయ్యారు. కరీనా కపూర్ కు పండంటి మగబడ్డ జన్మించాడు. ఈ రోజు ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో మగబిడ్డకు కరీనా జన్మనిచ్చింది. తల్లి, కుమారుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఈ సందర్భంగా బ్రీచ్ క్యాండీ వైద్యులు తెలిపారు.
2012లో సైఫ్, కరీనాలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సైప్ కు ఇది రెండో పెళ్లి. తొలి పెళ్లి నటి అమృతా సింగ్ తో జరిగింది. వీరికి కుమార్తె సారా, కుమారుడు ఇబ్రహీంలు జన్మించారు. కాగా కరీనాకు మాత్రం మొదటి మ్యారేజ్. కరీనాకు మగబిడ్డ జన్మించడంపై పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

11:38 - December 20, 2016

హైదరబాద్ : డీఎస్సీ నియామకాలు ఎప్పుడు చేపడతారో తెలిపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రశ్నించారు. 23వేల తరగతి గదులు అదృశ్యమైనపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని ఆమె తెలిపారు. విద్యావవస్థను మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలిపాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరిందని తెలిపారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు మొట్టికాయలు వేసిన సంగతిని గుర్తు చేశారు. దీనికి మంత్రి కడియం శ్రీహరి ఎడ్యుకేషన్ పై చర్చించేందుకు సిద్ధంగా వుందన్నారు.  

శాసనసభలో జీరో అవర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. ఈ ప్రశ్నోత్తరాలు 11.30 వరకు కొనసాగాయి. అనంతరం విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. అనంతరం జీరో అవర్ ను కొనసాగించారు.

తగ్గిన 54వేల మంది విద్యార్థులు - జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : ఈ సంవత్సరం 54వేల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, మౌలిక వసతులు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎనిమిది వారాల్లోపూ పూర్తి చేసి నివేదిక అందించాలని సుప్రీం రాష్ట్రానికి ఆదేశించడం జరిగిందన్నారు. ఇది వాస్తవమో కాదో చెప్పాలని మంత్రి సమాధానం చెప్పాలని సూచించారు.

డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారు - డీకే అరుణ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ ఎప్పుడూ నిర్వహిస్తారని టి.కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ పేర్కొన్నారు. నాలుగో రోజు సమావేశాల్లో విద్యపై విపక్షాలు పలు ప్రశ్నలు సంధించారు. స్కూల్స్ లో ఉపాధ్యాయులు లేకపోవడం..నియమించిన విద్యావాలంటర్లీను ఆలస్యంగా నియమించడం..నియమించిన వారికి జీతాలివ్వకపోవడంతో వారు మధ్యలోనే మానివేస్తున్నారని తెలిపారు. డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారని సూటిగా ప్రశ్నించారు. మే నెలలో నిర్వహించి టీచర్ల నియామకాలు చేపడుతామని మంత్రి కడియం పేర్కొన్నారని గుర్తు చేశారు.

11:28 - December 20, 2016

విజయవాడ : పేద విద్యార్థుల చదువుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీటీపీ మేథో మధన సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..టీడీపీ నియమ నిబద్ధలుకలిగిన పార్టీ అని ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీతనంలో పనిచేయాలన్నారు. స్మార్ట్ పల్స్ సర్వే ద్వారా అన్ని వివరాలు ప్రభుత్వం వద్ద వుందని తెలిపారు. నిర్ధిష్ట లక్ష్యంతో పార్టీ ముందుకు పోవాలని సూచించారు. ఎన్ని సవాళ్లు వచ్చినా దృఢసంకల్పంతో ముందుకెళ్లామన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పాదయాత్ర చేశానని, 208 రోజుల పాటు పాదయాత్ర చేశానని తెలిపారు. టీడీపీ జనచైతన్యయాత్రలు విజయవంతమయ్యాయన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌గా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇప్పటికే 62లక్షల సభ్యత్వం నమోదు అయ్యాయన్న బాబు గత ఏడాది కన్నా ఎక్కువ సభ్యత్వ నమోదే లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని రకాల పెన్షన్ల విషయంపై పూర్తి సమాచారం తమ వద్ద వుందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. 

11:24 - December 20, 2016

హైదరబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు లేవని గ్రామమేదో చెప్పాలని మంత్రి ఈటెల సవాల్ చేశారు. అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామనీ..ఉమ్మడి రాష్ట్రంలో తన నియోజకవర్గంలో రూ.కోటి కోసం వందలసార్లు మంత్రుల వద్దకు తిరిగానని పేర్కొన్నారు. 2017కల్లా తెలంగాణలో బోర్లు వేసుకోవాల్సి పరిస్థితి వుండదనీ..ఒక్క రూపాయి కూడా మంచినీటి కోసం ఖర్చు చేయాల్సిన అవుసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా మంత్రి ఈటెల బీజేపీ ఎమ్మెల్యేక కిషన్ రెడ్డి ప్రశ్నకు సమాధానం చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో జూపల్లి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదని తెలిపారు. మహాత్మాగాంధీ కలల సాకారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. 13, 14వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులను గ్రామ పంచాయతీలకు నేరుగా తరలించామని తెలిపారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అడ్డుతగిలారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా గ్రామపంచాయితీలకు కేటాయించిన నిధులపై దేనికి ఎంత కేటాయించారో తెలిపారలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కొనసాగతున్న ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా.. ఏక గ్రీవ పంచాయితీలకు ఇవ్వాల్సిన నిధులు ఎందుకు ఇవ్వటంలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

గ్రామాల అభివృద్ధిపై వాగ్వాదం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గ్రామాల అభివృద్ధి అంశంపై స్వపక్ష, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ పంచాయితీలకు ఎన్ని నిధులు ఇచ్చారని, ఏకగ్రీవ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై మంత్రి ఈటెల స్పందించారు. కేంద్రం వేరే..రాష్ట్రం వేరే అనే వేరేగా చూడవద్దని సూచించారు. గ్రామాలు అభివృద్ధి కావడం లేదని అనడం సబబు కాదన్నారు. గ్రామీణ ప్రాంతంలో రూ. 50 లక్షలు, రూ. కోటి రూపాయలతో రోడ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. 14 ఫైనాన్స్ కమిషన్ ఒక రూపాయి కేటాయించడం లేదని, మండల పరిషత్, జిల్లా పరిషత్ కూడా ముఖ్యమైనవన్నారు.

కూరగాయాల మార్కెట్లను ఆధునీకరిస్తాం - హరీష్..

హైదరాబాద్ : శాసనసమండలిలో హరీష్ రావు మాట్లాడారు. కూరగాయాల మార్కెట్లను ఆధునీకరిస్తామని, రైతు బజార్ లో క్యాష్ లెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, తాజా కూరగాయాలను తక్కువ ధరకు అమ్మేందుకు 'మన కూరగాయాల' పథకం తీసుకొచ్చామన్నారు. అవసరమైన మేర సిబ్బందిని నియమించి విద్యుత్ సరఫరాలో లోటు లేకుండా చూస్తామన్నారు.

టిడిపి వర్క్ షాప్..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. సభ్యత్వ నమోదు, జన చైతన్య యాత్రపై చర్చ జరుగుతోంది. విలువలు, విశ్వసనీయతతో కూడిన పార్టీ టిడిపి అని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వంతో జవాబుదారితనం తీసుకరావాలని సూచించారు. నిర్దిష్ట లక్ష్యంతో ప్రతొక్కరూ ముందుకెళ్లాలని, ఒక్ పద్ధతి ప్రకారం ముందుకెళుతున్నామన్నారు. ఎక్కడా విసుగు, విరామం లేకుండా పనిచేయడం జరుగుతోందని, సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లామే తప్ప ఎక్కడా వెనుకగడుగు వేయలేదన్నారు.

రైతులకు 2.58 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు - జగదీశ్ రెడ్డి..

హైదరాబాద్ : విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణకు అవసరమైన మేర సిబ్బందిని నియమిస్తున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే పట్టణ ప్రాంతాల్లో 6 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 24గంటల్లో పునరుద్ధరించాలని ఆదేశించడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయం కోసం రైతులకు 2.58 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు.

 

10:42 - December 20, 2016

హైదరాబాద్ : మిస్‌వరల్డ్ 2016 టైటిల్‌ను పోర్టారికోకు చెందిన 19 ఏళ్ల స్టైఫెన్ డెల్‌ సొంతం చేసుకుంది. ఈ పోటీలకు ఆయా దేశాల నుంచి మొత్తం 116 మంది పాల్గొన్నారు. వీరిందరినీ వెనక్కి నెట్టి డెల్‌ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. పోర్టారీకో దేశానికి మిస్‌వరల్డ్ కిరీటం రావడం ఇది రెండోసారి. ఈ పోటీల్లో ఫైనల్‌కు చేరిన వారిలో కెన్యా, ఫిలిప్పీన్స్ భామలు కూడా ఉన్నారు.

10:39 - December 20, 2016

హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రం కొనసాగుతోంది. నగరంలో కాలుష్యంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ మాట్లాడుతూ..నగరంలో కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోందనీ..దీంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కాలుష్యంలో హైదరాబాద్ 24వస్థానంలో వుందన్నారు. కాలుష్య నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటో తెలిపాలని ఆయన డిమాండ్ చేశారు. పంజాగుట్ట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉంటోందని, ఆస్తమా రోగులు పెరుగుతున్నారనీ..నగరంలో కాన్సర్ రోగులు కూడా పెరుగుతున్నారనీ కాలుష్యంపై అవగాహన కల్సించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవుసరముందని సూచించారు.  దీనికి కేటీఆర్ వివరణ ఇస్తూ.. కాలుష్య నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందనీ..క్లీనింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీ హైదరబాద్ కు మొదటిస్థానం వచ్చిందని తెలిపారు.

 

కాలుష్యం నివారణ చర్యలేవీ - అసుదుద్దీన్..

హైదరాబాద్ : నగరంలో అధికంగా కాలుష్యం వ్యాపిస్తోందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ప్రశ్నించారు. నాలుగో రోజు ప్రారంభమైన సమావేశాల్లో కాలుష్యంపై ఆయన పలు ప్రశ్నలు అడిగారు. ఏషియాలో కాలుష్యంలో హైదరాబాద్ 24 స్థానంలో కొనసాగుతోందని, కాలుష్యం నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గార్బైజ్ కాలుష్యంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని, పంజాగుట్ట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉంటోందని, ఆస్తమా రోగులు అధికంగా ఉంటున్నారని సభకు తెలిపారు.

10:23 - December 20, 2016

హైదరబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నాలుగోరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ లో నెలకొల్పే మెగా లెదర్ పార్క్ పై మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. లెదర్ పార్క్ నిధులు..కేటాయింపులపై ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ..లెదర్ పార్కులో కేంద్రం వచ్చిన నిధులు ఆర్మూర్ నియోజవకర్గానికి కేటాయించాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దళిత బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే విధంగా చూడాలని జీవన్ రెడ్డి కోరారు. ఆర్మూరులో లెదర్ పార్క్ .. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం చెపుతూ రాష్ట్రంలో 9 లెదర్ పార్కులు కేటాయించబడ్డాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటికోసం 117 ఎకరాలు సేకరించామనీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆశించన మేరకు ఫలితాలు సాధించని కారణంగా మెగా లెదర్ పార్క్ కు అనుసంధానం చేసి పలువురికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఘన్ పూర్ లో 20 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగో రోజు ప్రారంభమైన సమావేశాల్లో లెదర్ పార్క్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. వరంగల్ లో 5-6 తోళ్ల పరిశ్రమలు పనిచేస్తున్నాయని, మెగా లెదర్ పార్కులో రూ. 270 కోట్లు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందన్నారు. కేంద్ర నిధుల కోసం డీపీఆర్ దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెడుతుందని, రానున్న రెండేళ్లలో ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు.

లెదర్ పార్కులో కేంద్ర నిధులు కేటాయించాలి - జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : లెదర్ పార్కులో కేంద్రం వచ్చిన నిధులు ఆర్మూర్ నియోజవకర్గానికి కేటాయించాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దళిత బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే విధంగా చూడాలని జీవన్ రెడ్డి కోరారు.

20వేల మందికి ఉపాధికి అవకాశం - కేటీఆర్..

హైదరాబాద్ : ఘన్ పూర్ లో 20 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగో రోజు ప్రారంభమైన సమావేశాల్లో లెదర్ పార్క్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. వరంగల్ లో 5-6 తోళ్ల పరిశ్రమలు పనిచేస్తున్నాయని, మెగా లెదర్ పార్కులో రూ. 270 కోట్లు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందన్నారు. కేంద్ర నిధుల కోసం డీపీఆర్ దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెడుతుందని, రానున్న రెండేళ్లలో ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ప్రారంభమైన సమావేశాల్లో తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. స్టేషన్ ఘన్ పూర్ లోని లెదర్ పార్కు అంశంపై తాటికొండ రాజయ్య ప్రశ్నలు లేవనెత్తారు.

సీపీఎం మహాజన పాదయాత్ర 65వ రోజు..

ఆసిఫాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర 65వ రోజుకు చేరుకుంది. నేడు రెబ్బెన, గోలేటి ఎక్స్ రోడ్, పులికుంట, తక్కెళ్లపల్లి రోడ్డు, రేపల్లివాడ, ఐబీ చౌరస్తా, తాండూరు, బోయపల్లి, బెల్లంపల్లిలో పర్యటన జరగనుంది. నేడు మంచిర్యాలలో పాదయాత్ర అడుగు పెట్టనుంది.

జనవరి 15 వరకు 78 రైళ్లు రద్దు..

ఢిల్లీ : దేశ రాజధానిలో దట్టంగా పొగ మంచు అలుముకుంది. జనవరి 15 వరకు 78 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. పొగమంచు కారణంగా ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. 34 రైళ్లు ఆలస్యంగా, 7 రైళ్ల సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లోకల్ రైళ్లను నెమ్మదిగా నడపాలని డ్రైవర్లకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయం నుండి 6ఇంటర్నేషనల్, 3 డొమెస్టిక్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 3 డొమెస్టిక్ విమాన సర్వీసులు రద్దయ్యాయి.

 

టిడిపి, బిజెపి వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో విపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లపై టిడిపి, బీసీ సబ్ ప్లాన్ పై బీజేపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

09:58 - December 20, 2016

ఢిల్లీ : ఉత్తర భారతం గజగజ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో భారీగా మంచుకురుస్తోంది. శ్రీనగర్‌లో మైనస్‌ 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పేసింది.

ఉత్తర భారత్‌లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఉత్తర భారతదేశం వణికిపోతోంది. కశ్మీరులోయలో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరాయి.. జలాశయాలు గడ్డ కట్టేయడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఈ సీజన్లోనే అత్యల్పంగా శ్రీనగర్‌లో మైనస్‌ 4.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. లేహ్‌, లడఖ్‌లలో ఇది మైనస్‌ 12డిగ్రీలుగా నమోదైంది.

ఒడిశాలో స్తంభించిన జనజీవనం
అటు ఒడిశాలోని తూర్పుతీరప్రాంతంలో సాధారణ జనజీవనం స్తంభించింది.. ఫుల్బని, కంథమాల్‌లో ఈసీజన్లోనే అత్యల్పంగా ఐదు డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదైంది. టెంపరేచర్‌ పడిపోవడంతో చేపలు, పక్షులు భారీసంఖ్యలో మృత్యువాత పడ్డాయి. పంజాబ్‌, హర్యానాలో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని పలుజిల్లాల్లో మైనస్‌ 1.9 నుంచి మైనస్‌ ఒక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఢిల్లీని కప్పేసిన మంచుదుప్పటి
దేశ రాజధాని ఢిల్లీని మంచుదుప్పటి కమ్మేసింది. సమీపంలోని దృశ్యాలను కూడా చూడలేనంతగా పొగమంచు కప్పుకుంది. దీంతో విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. 14 విమానాలు, 24 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 5 రైళ్లను అధికారులు రీషెడ్యూల్‌ చేశారు... ఒక రైలును రద్దు చేశారు. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఉత్తరాదిని చలి చంపేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే జనవరిలో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు.. 

09:53 - December 20, 2016

హైదరాబాద్ : ప్రజలకు కరెన్సీ కష్టాలు ఇంకా తీరడంలేదు. పెద్దనోట్లు రద్దు చేసి 42 రోజులైనా సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. నగదు కోసం రోజూ బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు 90 శాతానికి పైగా ఏటీఎంలు మూతపడ్డాయి. సామాన్యుడి నుంచి ఉద్యోగస్తుల వరకు నగదు కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇక రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. పెట్టుబడులకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నారు. రోజులో సగం బ్యాంకుల దగ్గరే గడిచిపోతోంది. అప్పు ఇచ్చేవారులేక, చేతిలో నగదులేక సాగుబడి ఇబ్బందిగా మారింది. చిరు వ్యాపారులకు చిల్లర చింత తప్పడం లేదు. ఈ కష్టాలు చాలవన్నట్టు రోజుకు 5వేలకు మించి డిపాజిట్‌ చేయొద్దన్న ఆర్బీఐ నిబంధన సామాన్యులను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో కేంద్ర సర్కార్‌పై ప్రజల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది. ఈ క్రమంలో అబిడ్స్ లోని ఎస్బీహెచ్ వద్ద ఎటువంటి పరిస్థితులున్నాయో చూడండి..

09:49 - December 20, 2016

హైదరాబాద్ : నేడు నాలుగవరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాలలో భాగంగా నేడు పలు వాయిదా తీర్మానాలను సభలో విపక్షాలు ప్రవేశపెట్టానున్నాయి. డబుల్ బెట్ రూమ్ ఇళ్ళపై టీడీపీ..బీసీ సబ్ ప్లాన్ పై బీజేపీ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం. విపక్షాలనుఅన్ని రకాలుగా టార్గెట్ చేస్తున్న అధికార పక్షం ఈ తీర్మానాలపై ఎలా స్పందించనుందో వేచి చూడాలి..

09:48 - December 20, 2016

నెల్లూరు : కలెక్టరేట్‌ ప్రాంగణంలోని పౌరసరఫరాల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ఉదయం మార్నింగ్ వాక్ కు వచ్చిన స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సచారం అందించారు. ఐదు అగ్నిపమాపక యంత్రాలతో సంఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. కాగా చంద్రన్న కానుకల పథకంలో అవినీతి అక్రమాల నేపథ్యంలో కావాలనే అగ్నిప్రమాదానికి గురి అయ్యేలా చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు కొట్టిపడేస్తున్నారు. అన్ని వివరాలను ఆన్ లైన్ లో డేటా మొత్తం సేవ్ అయివున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది వుండదనీ అధికారలు పేర్కొంటున్నారు. ప్రమాదంలో దగ్థమైన ఫైల్స్ అన్నీ సుమారు 20,30 సంవత్సరాలకు చెందిన ఫైల్స్ దగ్థం అయినట్లుగా తెలుస్తోంది. 

09:46 - December 20, 2016

ఉత్తరప్రదేశ్ : పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోది, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవినీతిని అడ్డుకునేందుకు తాము ప్రయత్నిస్తే ...విపక్షాలు పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నాయని మోది విమర్శించారు. నోట్ల రద్దు పేరిట ప్రధాని పేదల రక్తాన్ని పిండుతున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు.

పెద్ద నోట్ల రద్దు చుట్టే తిరుగుతున్న యూపీ ఎన్నికల ప్రచారం
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పెద్ద నోట్ల రద్దు చుట్టే తిరుగుతోంది. జౌన్‌పుర్‌లో జరిగిన ఎన్నికల సభలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధానిని టార్గెట్‌ చేశారు. నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని పేదలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. దేశంలో అవినీతి, నల్లధనాన్ని నిర్మూలించేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని, ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తామన్నారు. అయితే నవంబర్‌ 8న మోది ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల పేదలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని పేర్కొన్నారు. 99 శాతం పేద ప్రజలతో ప్రధాని చెలగాటమాడుతున్నారని విమర్శించారు. నోట్ల ర‌ద్దుతో పేద‌లను అడగకుండానే మోది వారి ర‌క్తం తాగుతున్నార‌ని విమర్శించారు. పేదల డబ్బును పెద్దలకు ఇవ్వడమే నోట్ల రద్దు వెనక ఉన్న అసలు ఉద్దేశమని రాహుల్‌ ధ్వజమెత్తారు.

భారత్‌లోని దొంగలు చాలా తెలివికలవారు: రాహుల్
నల్లధనమంతా నగదు రూపంలో లేదని రాహుల్‌ అన్నారు. భారత్‌లోని దొంగలు చాలా తెలివికలవారు, పొదుపు పరులని పేర్కొన్నారు. 6 శాత నల్లధనం మాత్రమే నగదు రూపంలో ఉందని...మిగతా నల్లధనమంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, బంగారం, విదేశీ అకౌంట్లలో మూలుగుతోందని తెలిపారు. నల్లధనం కేవలం 50 కుటుంబాల వద్దే ఉందని రాహుల్‌ చెప్పారు.

విపక్షాలపై ధ్వజమెత్తిని ప్రధాని మోదీ..
ప్రధాని మోది కాన్పూర్‌లో జరిగిన పరివర్తన్‌ ర్యాలీలో విపక్షాలను దుయ్యబట్టారు. అవినీతి, నల్లధనాన్ని రూపుమాపేందుకు కేంద్రం పోరాడుతుంటే పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నవారికి పెద్దనోట్ల రద్దు మింగుడుపడడం లేదన్నారు. అవినీతికి అనుకూలంగా కొద్దిమంది నేతలే ఉన్నారని, మెజారిటీ ప్రజలు అవినీతిని వ్యతిరేకిస్తున్నారని మోది పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలన్న అభిప్రాయాన్ని మోది వ్యక్తం చేశారు. దీనిపై అన్నిపార్టీలతో చర్చించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయనున్నట్లు మోది పేర్కొన్నారు.

09:45 - December 20, 2016

గుంటూరు : అనంతవరప్పాడు గ్రామంలో నగదు రహిత సేవలపై అవగాహన సదస్సు జరిగింది. సక్కు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు నగదు రహిత సేవలపై బ్యాంకు అధికారులు అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్లు తెరిచి డెబిట్, క్రెడిట్ కార్డులు అందించారు. ఈ వ్యాలెట్ సేవలను ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. ఏపీలో తొలి నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సక్కు గ్రూప్ నిర్వాహకులు ఈ కార్యక్రమం చేపట్టారు. 

09:44 - December 20, 2016

కొమురంభీం : జిల్లాలో పులిమడుగ ప్రాజెక్ట్ సాధన కోసం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్‌ల కోసం భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపడుతూ.. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను విస్మరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎర్రజెండా ఎప్పటికీ అండగా ఉంటుందని తమ్మినేని చెప్పారు.

64వ రోజు నాటికి పాదయాత్ర 1670 కిలోమీటర్లు పూర్తి
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 64వ రోజు కొమురంభీమ్‌ జిల్లాలో పర్యటించింది. జిల్లాలోని మానిక్‌గూడ, జెండాగూడ, ఆసిఫాబాద్‌ ఎక్స్‌రోడ్‌, జనకాపూర్‌, ఆసిఫాబాద్‌, ఈదులవాడ, బూరుగూడ, మోతుగూడ, కైర్‌గాం,ఎడవెల్లి, కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్ వరకు కొనసాగింది. 64వ రోజు నాటికి పాదయాత్ర 1670 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆసిఫాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆసిఫాబాద్‌ పేపర్‌ మిల్లు కార్మికులు, గిరిజనులు తమ సమస్యలను పాదయాత్ర బృందానికి విన్నవించుకున్నారు. గిరిజనులు పోడు భూములపై తమ సమస్యలను తమ్మినేని బృందానికి చెప్పుకున్నారు.

పులిమడుగ ప్రాజెక్ట్ సాధన కోసం సర్కార్ పై ఒత్తిడి..
పులిమడుగ ప్రాజెక్ట్ సాధన కోసం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్‌ల కోసం భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపడుతూ.. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను విస్మరిస్తోందని విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరిగినప్పుడే అసలైన న్యాయం: తమ్మినేని

తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరిగినప్పుడే తెలంగాణలో సామాజిక న్యాయం జరిగినట్లని పాదయాత్ర రథసారది తమ్మినేని అన్నారు. ఆశావర్కర్లు, మున్సిపల్‌ వర్కర్లలో నూటికి 95 మంది బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారని, వారందరూ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తమ్మినేని అన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకే అధికంగా అన్యాయం: తమ్మినేని
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకే అధికంగా అన్యాయం జరిగిందని గిరిజన సంఘం నాయకుడు నైతం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు.. ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించారని ఆయన విమర్శించారు. కొమురంభీం ప్రాజెక్టు కింద లక్షా పదివేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలని నైతం రాజు డిమాండ్‌ చేశారు.

కొమురంభీం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
అడ సమీపంలోని కొమురంభీం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. ఆదివాసీల భూములకు నీరందడం లేదని, ఇదేనా గిరిజనులపై మీ ప్రేమ అని తమ్మినేని కేసీఆర్‌ను లేఖలో ప్రశ్నించారు. ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.  

 

09:43 - December 20, 2016

హైదరాబాద్ : విదేశాల నుండి భారీగా బంగారం తరలిస్తుడటం..కస్టమ్స్ అధికారులు పట్టుకోవటం సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. షార్జా నుండి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద అరకిలోకి పైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

09:41 - December 20, 2016

బెర్లిన్‌ : జర్మనీలోని బెర్లిన్‌లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. బెర్లిన్‌లో అత్యంత రద్దీగా ఉండే క్రిస్మస్‌ మార్కెట్‌లోకి ట్రక్‌ దూసుకెళ్లిన ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు కారణమైన ట్రక్‌ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పాకిస్థాన్‌ లేదా అఫ్గనిస్థాన్‌ జాతీయుడై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శరణార్థిగా జర్మనీలో ప్రవేశించినట్టు గుర్తించారు. దీనిని ఉగ్రవాద దుశ్చర్యగా భావిస్తున్నారు. కుట్ర కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఫ్రాన్స్ లో కూడా ఇదే తరహాలో ట్రక్ తో దాడి చేసిన దాడిలో దాదాపు 90మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దాడిలో మృతి చెందినవారికి అధ్యక్షుడు సంతాపాన్ని తెలిపారు. 

09:40 - December 20, 2016

తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ పోరుబాటపట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి హైదరాబాద్ లోని సిఎం క్యాంప్ ఆఫీసు వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. రేపు గజ్వేల్ లో ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ఈ నెల 23న హైదరాబాద్ చేరుకుంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే, ఈ నెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామంటున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు. ఇంతకీ తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాదయాత్రకు కారణం ఏమిటి? కాంట్రాక్ట్ లెక్చరర్స్ ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్స్ నేత డాక్టర్ సురేష్ 10టీవీ స్టూడియోకి వచ్చారు. తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాదయాత్ర చేపట్టటానికి కారణాలేంటి? అనే అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

09:38 - December 20, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ ఖేహర్ నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ వచ్చే ఏడాది జనవరి 3న పదవీ విరమణ చేయనున్నారు. 64 సంవత్సరాల ఖేహార్,.సిక్కు మతం నుంచి చీఫ్ జస్టిస్ పదవి చేపట్టబోతున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. జనవరి 4న బాధ్యతలు చేపట్టనున్న ఖేహర్..ఆ పదవిలో 2017 ఆగస్టు 27 వరకు కొనసాగుతారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపైన, ఎన్‌.జె.ఏ.సి. చట్టంపైన, సహారా అధిపతి సుబ్రత రాయ్ కేసుల్లో సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు ధర్మాసనాల్లో ఖేహర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జె.ఎస్ ఖేహర్..గతంలో కర్ణాటక, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 

09:38 - December 20, 2016

హైదరాబాద్ : ఆర్థికలోటు నుంచి బయటడి..ఆదాయం పెంచుకోవడంపై జీహెచ్‌ఎంసీ దృష్టి పెట్టింది. ఇందుకోసం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ప్రాపర్టీటాక్స్, ట్రేడ్‌ లైసెన్స్ పేమెంట్స్‌ను ఆన్‌లైన్‌లో చెల్లించిన వారికి మెగా లక్కీ డ్రా ప్రకటించింది. తద్వారా నగరవాసుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఆదాయం పెంచడంపై జీహెచ్‌ఎంసీ దృష్టి
నోట్లరద్దుతో పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల కోసం జీహెచ్‌ఎంసీ చేసిన ప్రయత్నం ఫలించింది. బంపర్‌ ఆఫర్ పేరుతో బల్దియా ప్రకటించిన స్కీమ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించిన వారికి నగదు బహుమతులు అందజేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.

లక్కీడ్రా ద్వారా విజేతలను ప్రకటించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన ఆన్‌లైన్‌ చెల్లింపులకు వస్తోన్న అనూహ్య స్పందనపై కమిషనర్ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించని వారి సంఖ్య 23 శాతం పెరిగిందని తెలిపారు. పన్నులు చెల్లించిన వారిలో లక్కీ డ్రా ద్వారా విజేతలను ప్రకటించారు. అల్వాల్‌కు చెందిన రాజేష్‌కుమార్‌కి 50 వేల రూపాయల నగదు బహుమతి లభించింది. అలాగే 10 వేల బహుమతులు రెండు, 2 వేల 500 రూపాయల బహుమతులు 8 మందికి ప్రకటించారు. మరో 8 మందికి 2వేల 500 కన్సలేషన్ బహుతులు ప్రకటించారు.

లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారితో ఫోన్ చేసిన కమిషనర్
లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారితో కమిషనర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆన్‌లైన్ విధానాన్ని ఎన్నుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ చెల్లింపులపై నగర ప్రజల్లో ఎంత మేర అవగాహన ఉందో తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నించారు.

మరింత అభివృద్ది యత్నిస్తున్నాం : జనార్థన్ రెడ్డి
బల్దియాలోని అవకతవకలను సరిచేసి..మరింత అభివృద్ది సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని కమిషనర్ తెలిపారు. అందులో భాగంగానే ఫోర్జరీ సంతకాలు చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ తయారు చేసిన వారిపై కేసులు నమోదు చేసి, విచారిస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీని అవినీతిరహితంగా మార్చేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. 

09:36 - December 20, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలోని చనాకా-కొరాటా ప్రాజెక్టును మరో ఆరునెలల్లో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగపై చేపట్టిన ఈ ప్రాజెక్టుపై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి ఈ అంశంపై అధికారులతో చర్చించారు.

యుద్ధ ప్రాతిపదికన చనాకా-కొరాటా ప్రాజెక్టు ..
రాష్ట్ర ప్రభుత్వం చాలెంజింగ్‌గా తీసుకున్న చనాకా-కొరాటా ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధఙకారులను ఏదేశించారు. ప్రతినెలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. ఎప్పుడు ఏయే పనులు చేయాలనే దానికి అనుగుణంగా క్యాలెండర్ రూపొందించుకోవాలని తెలిపారు. ఆరునెలలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక నెలవారీ అమలు తీరును రచించుకొని అమలు చేయాలని చెప్పారు. పనుల పురోగతిపై ప్రతిరోజు వాట్సాప్ ద్వారా రిపోర్టు చేయాలని ఆదేశించారు.

జనవరి మొదటివారంలో చనాకా-కొరాటా తనిఖీలు : హరీశ్‌రావు
చనాకా-కొరాటా పనులతో పాటు సాత్నాల అక్విడెక్ట్ పనులు కూడా ఏకకాలంలో పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నిర్ణీత పనులు చేయడంలో విఫలమైతే ఏజెన్సీల నుంచి నష్టపరిహారం రాబట్టాలని అన్నారు. సాంకేతిక పరమైన మంజూరీల ప్రక్రియతోపాటు టెండర్లను సకాలంలో పూర్తి చెయ్యాలని చెప్పారు. జనవరి మొదటివారంలో తాను చనాకా-కొరాటా ప్రాజెక్టు సైట్‌ను తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు.

పనుల పురోగతిపై ప్రతిరోజు వాట్సాప్ ద్వారా రిపోర్టు చేయాలి: హరీశ్‌రావు
పంప్‌హౌస్‌లకు చెందిన సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ట్రాన్స్‌కో అధికారులతో సమన్వయం చేసుకొని ..పనులు పూర్తి చేయాలని సూచించారు. జనవరి నుంచి పనులను ముమ్మరం చేయాలని అన్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి డిజైన్లు, డ్రాయింగ్‌ పనులను త్వరితగతిన అందించాలని సెంట్రల్ డిజైన్స్ సి.ఈ.ని ఆదేశించారు. కాంక్రీటు పంపులు తదితర ఆధునిక యంత్రాలను సమకూర్చుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

09:36 - December 20, 2016

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌పై వాడీవేడి చర్చ సాగింది. ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణకు విపక్షాలు డిమాండ్‌ చేశాయి.కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. అరాచక శక్తులను ఎక్కడ ఉన్న అణచివేస్తామని, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. నయాం కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ సీబీఐకి అప్పగించేది లేదని ..కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నగేశ్ కుమార్ (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు), గోవర్థన్ రెడ్డి ( టీఆర్ఎస్ నేత), శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ వీడియో ను చూడండి..

09:35 - December 20, 2016

టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ పాడుతున్న తారలు ఎందరో ఉన్నారు. అందులో అగ్ర హీరోలు కూడా ఉండడం విశేషం. చిరంజీవి, నాగార్జున..ఇలా ఎంతో మంది హీరోలు గాత్రం అందించారు. ఇటీవలే 'నిర్మల కాన్వెంట్' చిత్రంలో 'నాగార్జున' పాట పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో విక్టరీ 'వెంకటేష్' చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'గురు' లో పాట పాడబోతున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. దర్శకుడు..సంగీత దర్శకుల కోరిక మేరకు 'వెంకీ' అంగీకరించినట్లు టాక్. బాలీవుడ్ లో విజయం సాధించిన 'సాలా ఖడూస్' కి రీమెక్ గా 'గురు' చిత్రం రూపొందుతోంది. ‘రితికా సింగ్' ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే. చిత్రానికి సంబంధించిన ఓ పాటలో 'వెంకీ' వేసిన స్టెప్స్ తో టీజర్ విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' చిత్రంలో వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో 'క్రిష్' తోనూ ఓ మూవీ చేసేందుకు 'వెంకటేష్' రెడీ అయ్యారని టాక్.

09:34 - December 20, 2016

బాలకృష్ణ నటించిన వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్ర ఆడియోను తిరుపతిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 'క్రిష్' దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫస్ట్‌ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈ నెల 26న తిరుపతిలో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాలతో సహా తెలుగు రాష్ట్రాల్లోని 100 థియేటర్లలో చిత్ర ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ పై భారీ స్పందన వస్తోంది. అద్భుతమైన స్పందన లభిస్తోందని, తిరుపతిలో నిర్వహించనున్న ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథులుగా హాజరవుతారని చిత్ర యూనిట్ పేర్కొంది. హేమామాలిని, శ్రియ, కబీర్‌బేడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో నటిస్తున్నారు.

గవర్నర్ తో భేటీ కానున్న జగన్..

హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ని వైసీపీ అధినేత జగన్ భేటీకానున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్‌ కు వివరించనున్నారు. 

బతుకమ్మకు ఖండాంతర ఖ్యాతి..

హైదరాబాద్ : తెలంగాణ బతుకమ్మకు ఖండాంతర ఖ్యాతి లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మను ఎత్తుకున్న ఫొటోతో బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఓ పోస్టల్ స్టాంప్ విడుదలైంది. స్టాంప్‌పై బతుకమ్మ శుభాకాంక్షలు అని తెలుగులో రాసి ఉండడం విశేషం. ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి, అభినయ్, జాగృతి ఉపాధ్యక్షులు సోమవారం కవితను తెలంగాణలో భవన్‌లో కలిసి పోస్టల్ స్టాంప్‌ను అందజేశారు.

09:33 - December 20, 2016

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' ఈనెల 27వ తేదీన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా అభిమానులకు ఓ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అతను వివాహం చేసుకుంటాడా ? లేక ఇతరత్రా వార్తలున్నాయా అని అభిమానులు ఎదురు చూశారు. తన బర్త్ డే సందర్భంగా పర్సనల్ యాప్‌ను రిలీజ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని 'కిక్' స్టార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. బీయింగ్ హ్యూమన్ పేరుతో ఉన్న కోటు, తలపై క్యాప్‌ను పెట్టుకుని ఉన్న ఫొటోను 'సల్లూ' పోస్టు చేశాడు. డిసెంబర్ 27న నా యాప్ బర్త్ డే..మీ కోసమే అంటూ ట్వీట్ చేశాడు. తన అభిమానులతో సల్మాన్ వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ కానున్నాడు. సల్మాన్ ప్రస్తుతం 'ట్యూబ్ లైట్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ చిత్రంలో చైనీస్ నటి 'ఝూ ఝూ' జోడిగా నటిస్తోంది.

చలి దుప్పట్లో ఢిల్లీ..

ఢిల్లీ: ఢిల్లీలో దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా 34 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏడు రైళ్ల రాకపోకల వేళల్లో మార్పు చేశారు. ఆరు విదేశీ, మూడు దేశీయ విమానాల రాకపోకలు ఆలస్యంగా ఉంది. పొగమంచు కారణంగా మూడు దేశీయ విమాన సర్వీసులు రద్దు చేశారు.

చెత్త వేస్తే జేబు ఖాళీ..

ఢిల్లీ : బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే పదివేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ హెచ్చరించింది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల(2016) ప్రకారం చెత్తాచెదారాన్ని సేకరించి నిర్దేశిత ప్రాంతానికి తరలించే బాధ్యత అధికారులదేనని ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. మునిసిపల్ ఘన వ్యర్థాలు, చెత్తాచెదారం సమస్యలు ఢిల్లీలోనే అధికమని పేర్కొంది.

అనంతలో దొంగల బీభత్సం..

 

అనంతపురం : జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి జ్యువెలరీ షాపులో చోరీ చేస్తుండగా ఇద్దరు దొంగలను పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4 సెల్ ఫోన్స్, రూ.10వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. 

శంషాబాద్ లో భారీగా బంగారం పట్టివేత..

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అధికారులు బంగారంతో పాటు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడి వద్ద అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం..

నెల్లూరు : కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు గదుల్లో వున్న ఫైల్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పించేందుకు యత్నిస్తున్నాయి. 

నెల్లూరు కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం..

నెల్లూరు : కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు గదుల్లో వున్న ఫైల్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పించేందుకు యత్నిస్తున్నాయి. 

07:12 - December 20, 2016

హైదరాబాద్ : 2013 ఫిబ్రవరి 21 హైదరాబాద్‌ చరిత్రలో చీకటిరోజుగా మిగిలింది. ఆర్తనాదాలు, రక్తపు మడుగుల్లో ఎన్నో జీవితాలు ఆరిపోయాయి. ఉగ్రవాదుల ఘాతుకానికి ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లు నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

భాగ్యనగరం రక్తసిక్తమైన రోజది..
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్... ఫిబ్రవరి 21, 2013, గురువారం రాత్రి 7 గంటలు.. ముష్కర మూకల మారణ హోమం..వరుసగా రెండు బాంబు పేలుళ్లు...రెప్పపాటులో భారీ బీభత్సం...చిధ్రమైన దేహాలు...మిన్నంటిన క్షతగాత్రుల హాహాకారాలు.. దగ్దమైన వాహనాలు.. తగులబడిన దుకాణాలు... చారిత్రాత్మక భాగ్యనగరం రక్తసిక్తమైన రోజది..

19 మంది మృతి..130 మందికి పైగా గాయాలు..
హైదరాబాద్‌ సిటీలో రద్దీ ప్రదేశమైన దిల్‌సుఖ్‌నగర్‌ను టార్గెట్‌ చేస్తూ బాంబులు పేల్చడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చూస్తుండగానే క్షణాల్లో అంతా బూడిదైపోయింది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు బీభత్సం సృష్టించాయి. వెంకటాద్రి థియేటర్‌ దగ్గర మొదటి పేలుడు జరిగిన 3 నిమిషాల్లోనే ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌ వద్ద రెండో పేలుడు చోటుచేసుకుంది. సైకిల్‌లో బాంబులు అమర్చి ముష్కరులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో మొత్తం 19 మంది మృతిచెందగా.. 130 మందికి పైగా గాయపడ్డారు.

3 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు
దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల విజువల్స్‌ను ప్రపంచానికి అతివేగంగా అందించడంలో 10 టీవీ విజయవంతమైంది. 10 టీవీ ఎయిర్‌లోకి రాకముందే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు పొందింది.

07:04 - December 20, 2016

టర్కీ : టర్కీలో రష్యా రాయబారిని తిరుగుబాటు దారుడు కాల్పి చంపాడు. ఓ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆండ్రీ కర్లోవ్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన టర్కీలోని అంకారా సిటీలో జరిగింది. వెనకనుంచి వచ్చిన ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆండ్రీ అక్కడిక్కడే ప్రాణాలు కొల్పోయారు. ఈ ఘటనను ఉగ్రచర్యగా భావిస్తున్నట్లు మాస్కోలోని రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది.

గవర్నర్ తో భేటీ కానున్న జగన్..

హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ని వైసీపీ అధినేత జగన్ భేటీకానున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్‌ కు వివరించనున్నారు. 

బతుకమ్మకు ఖండాంతర ఖ్యాతి..

హైదరాబాద్ : తెలంగాణ బతుకమ్మకు ఖండాంతర ఖ్యాతి లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మను ఎత్తుకున్న ఫొటోతో బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఓ పోస్టల్ స్టాంప్ విడుదలైంది. స్టాంప్‌పై బతుకమ్మ శుభాకాంక్షలు అని తెలుగులో రాసి ఉండడం విశేషం.

ప్రజలపై దూసుకెళ్ళిన ట్రక్..9మంది మృతి..

బెర్లిన్‌ : క్రిస్మస్ మార్కెట్లో ప్రజలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది.ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. కైసెర్ విల్హెమ్ మెమోరియల్ చర్చ్ వద్ద జరిగిన ఈ ఘటనలో 9 మంది మృతి చెందారని, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వెనక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss