Activities calendar

17 December 2016

22:00 - December 17, 2016

దుబాయ్ : బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. ఇవాళ జరిగిన సెమీస్‌లో దక్షిణ కొరియా షట్లర్‌ జి హ్యూన్‌సుంగ్‌ చేతిలో ఓటమిపాలైంది.. మ్యాచ్‌ ప్రారంభం నుంచి హ్యూన్‌సుంగ్‌ దూకుడు కనబరిచింది. కళ్లు చెదిరే స్మాష్‌లు, హాప్‌ వ్యాలీలతో చెలరేగింది. మొదటి సెట్‌ను హ్యూన్‌సుంగ్‌ గెలవగా.. రెండో సెట్‌ను సిందు చేజిక్కించుకుంది. ఫలితం నిర్ణయించే మూడో సెట్‌లో పోరు హోరాహోరిగా సాగింది. చివరికి 15-21 పాయింట్స్‌ తేడాతో మూడోసెట్‌ను సింధు కోల్పోయి పరాజయం పొందింది.

21:58 - December 17, 2016

తమిళనాడు : డీఎంకే అధినేత వైగోకు చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. చెనైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి పరామర్శించేందుకు వచ్చిన వైగోను డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. వైగో కారుపై రాళ్లు రువ్వి, ఈయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎంకే,బీఎండీకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

21:54 - December 17, 2016

తూర్పుగోదావరి : పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఊడిగం చేస్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. పరిశ్రమాధినేతల ఎంగిలి మెతుకులకు పాలకులు ఆశపడుతున్నారని మండిపడ్డారు. బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన దివీస్‌లాంటి కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు.
దివీస్‌ ఫార్మా ప్రాంతంలో రాఘువులు పర్యటన
దివీస్‌ ఫార్మా నిర్మాణాన్ని ప్రతిపాదించిన గ్రామాల్లో.. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పర్యటించారు. పంపాదిపేట, దానవాయిపేట గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజల సహనానికి ప్రభుత్వం పరీక్ష పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివీస్‌ను తన్ని తరిమేసేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. కాలుష్య పరిశ్రమలకు ఊడిగం చేస్తోన్న చంద్రబాబు, యనమల రామకృష్ణుడిలాంటి వారికి ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు.

పారిశ్రామికవేత్తల ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నారు : రాఘవులు
పారిశ్రామికవేత్తల ఎంగిలి మెతుకులకు పాలకులు ఆశపడుతున్నారని రాఘవులు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకంటే పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే వారికి ముఖ్యమయ్యాయని ధ్వజమెత్తారు. పాలకులు స్వప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ గ్రామాలను శ్మశానం చేసేందుకు పూనుకున్నారని ఆరోపించారు.

సభ కోసం 8సార్లు దరఖాస్తు లు..నిరాకరించిన పోలీసులు
దివీస్‌ ప్రతిపాదిత ప్రాంతంలో బహిరంగ నిర్వహించుకోవడానికి దివీస్‌ వ్యతిరేకపోరాట కమిటీ నాలుగు నెలలుగా ప్రయత్నిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా సభ జరుపుకుంటామని 8సార్లు దరఖాస్తు పెట్టుకున్నా పోలీసులు నిరాకరించారు. నాలుగు నెలలపాటు 144 సెక్షన్‌ విధించి అక్కడ ఎలాంటి కార్యకలాపాలకు అనుమతివ్వడం లేదు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు నాలుగుమార్లు పర్యటించి సభను నిర్వహించాలని ప్రయత్నించినా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దివీస్‌ వ్యతిరేకపోరాట కమిటీ చివరకు కోర్టును ఆశ్రయించడంతో సభ జరుపుకోవడానికి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో రాఘవులు దివీస్‌ వ్యతిరేక ఆందోళన నిర్వహిస్తున్న గ్రామాల్లో పర్యటించి బహిరంగసభను నిర్వహించారు.

రాఘవులు రాకతో దివీస్‌ ప్రతిపాదిత ప్రాంత ప్రజల్లో భరోసా
రాఘవులు రాకతో దివీస్‌ ప్రతిపాదిత ప్రాంత ప్రజల్లో భవిష్యత్తుపై భరోసాను నింపింది. ప్రభుత్వం బలవంతంగా భూములు కాజేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుని తీరుతామన్న రాఘవులు వ్యాఖ్యలు రైతాంగానికి మనోధైర్యం కలిగించాయి. తుదకంటా పోరాడి జీవనోపాధిని నిలుపుకుంటామని దివీస్‌ బాధితులు తెలిపారు. 

21:48 - December 17, 2016

విశాఖ : విశాఖనగరం పెట్టుబడులకు అనువైన ప్రదేశమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. రానున్న రోజుల్లో ఉక్కు నగరం ఫార్మాస్యూటికల్‌ రాజధానిగా మారుతుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని బాబు స్పష్టం చేశారు.

పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. 68వ భారత ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న చంద్రబాబు.. రానున్న రోజుల్లో విశాఖ ఫార్మాస్యూటికల్‌ రాజధానిగా మారుతుందన్నారు. ఫార్మా రంగంలో పెట్టుబడులకు విశాఖ అనువైన ప్రాంతమని.. ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. విశాఖలో జరుగుతున్న సదస్సుతో ఫార్మా అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. దేశంలోనే మొట్టమొదటి వైద్య పరికరాల కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ఉడా చిల్డ్రన్స్‌ ఎరినా ప్రాజెక్టును ప్రారంభించిన చంద్రబాబు,వెంకయ్యనాయుడు
విశాఖలో 22 కోట్లతో నిర్మించిన ఉడా చిల్డ్రన్స్‌ ఎరినా ప్రాజెక్టును చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఆధునాతన టెక్నాలజీతో నిర్మించిన ఈ థియేటర్‌లో వెయ్యి మంది కూర్చుని వీక్షించే అవకాశం ఉంది. అంతేకాకుండా పిల్లల కోసం ప్రత్యేక 'జూ'ను కూడా ఏర్పాటు చేశారు. చిల్డ్రన్స్‌ ఎరినా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు.. నల్లధనంపై మోదీ చేస్తున్న పోరాటం ఎంతో పవిత్రమైందని అన్నారు. నల్లధనంపై పోరుకు కొందరు అవకాశవాదులు అడ్డుపడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నవ్యాంధ్ర కలలు సాకారమవుతాయన్నారు. 

సంజీవయ్య లా కాలేజీ తొలి స్నాతకోత్సవంలో బాబు
విశాఖలోని దామోదరం సంజీవయ్య లా కాలేజీ తొలి స్నాతకోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్వీ రమణతో పాలు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 43 మందికి పట్టాలు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి 50 ఎకరాల భూమి,.. 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రోజురోజుకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు న్యాయవాదులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు సూచించారు.

ఫిన్‌టెక్‌ టవర్‌ను ప్రారంభించి చంద్రబాబు
అనంతరం చంద్రబాబు.. ఫిన్‌టెక్‌ టవర్‌ను ప్రారంభించారు. విశాఖలో సైబర్‌ నేరాలకు తావులేని, బ్యాంకింగ్‌ రంగంలో పటిష్టమైన భద్రతకు అనువైనకార్యకలాపాలు ఈ టవర్‌లో నిర్వహిస్తారని సీఎం తెలిపారు.. డిజిటల్‌ కరెన్సీ ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో.. ఫిన్‌టెక్‌ త్వరలోనే ప్రధాన పాత్ర పోషిస్తుందని చంద్రబాబు తెలిపారు. 

21:45 - December 17, 2016

హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌పై అసెంబ్లీ అట్టుడికింది. ఈ అంశాన్ని సభలో చర్చించాలంటూ కాంగ్రెస్‌, తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మాలను స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ ఈ రెండు పార్టీల సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో అసెంబ్లీ స్తంభించింది. దీంతో తొమ్మిది మంది కాంగ్రెస్‌ సభ్యులతోపాటు ఇద్దరు టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్‌ చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్‌, టీడీపీ
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సత్వరం చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్‌, టీడీపీ సభ్యుల డిమాండ్‌పై తెలంగాణ అసెంబ్లీ అట్టుడికింది. ఈ అంశంపై వాయిదా తీర్మానలను ప్రతిపాదించిన కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు సభ ప్రారంభమైన వెంటనే చర్చకు పట్టుపట్టారు. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి వెళ్లి, నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి.

కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై హరీశ్ రావు ఆగ్రహం
కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్న కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలంటూ మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ పై మండి పడ్డ జానారెడ్డి
కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌పై సీఎల్‌పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వానికి మెజారిటీ ఉందని అప్రజాస్వామికంగా వ్యవరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్‌లోకి వెళ్లని మల్లు భట్టివిక్రమార్కను కూడా సస్పెండ్‌ చేయడాన్ని తప్పుపట్టారు. మరోవైపు స్పీకర్‌ పరిధిలోని ఫిరాయింపుల అంశాన్ని వివాదాస్పదం చేస్తున్న కాంగ్రెస్‌ వైఖరిపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ పరిస్థితిపై చర్చ
పార్టీ ఫిరాయింపుల అంశంపై టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు కూడా పట్టుపటి సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో వీరిని కూడా సస్పెండ్‌ చేశారు. అనంతరం ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. టీ విరామానంతరం.. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ పరిస్థితిపై సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా సీఎల్‌పీ నేత జానారెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి జదీశ్‌రెడ్డి మధ్య విమర్శల యుద్ధం కొనసాగింది.

ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సుముఖత
విద్యుత్‌ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య సహా వివిధ పక్షాల సభ్యులు... విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు, సింగరేణి కాలరీస్‌లో విధులు నిర్వహిస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు డిమాండ్‌ చేయగా.. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గృహ, పారిశ్రామిక అవసరాలకు 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్నామని, వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన కరెంట్‌ సరఫరా చేస్తున్నామని మంత్రి జగదీశ్వరరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. విద్యుత్‌ అంశంపై చర్చ ముగిసిన తర్వాత స్పీకర్‌ మధుసూదనాచారి సభను సోమవారానికి వాయిదా వేశారు. 

వైగోను అడ్డుకున్న డీఎంకే కార్యకర్తలు..

తమిళనాడు : డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించేందుకు వెళ్లిన ఎండీఎంకే నేత వైగోను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితం ఆయన వెళ్లారు. అయితే, ఆసుపత్రిలోకి వెళ్లనీయకుండా ఆయన వాహనాన్ని డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ప్రస్తుతం కావేరి ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఏపీలో భారీగా వైద్య పోస్టుల భర్తీ..

అనంతపురం: రాష్ట్రంలో త్వరలోనే 1400 వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య వైద్య సేవల కింద ఇప్పటివరకు కోటి 30లక్షల మందికి వైద్యసేవలు అందించినట్టు చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రూ.8కోట్ల 63లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న 50 పడకల ఆసుపత్రి భవనం నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు.

ఐబీ..‘రా’ లకు కొత్త చీఫ్ లు..

ఢిల్లీ : భారత్ కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కొత్త చీఫ్ ల పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘రా’ కుఅనిల్ దస్మానాను,‘ఐబీ’ కు రాజీవ్ జైన్ ను కొత్త చీఫ్ లుగా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘రా’ చీఫ్ గా రాజేంద్ర ఖన్నా, ‘ఐబీ’ చీఫ్ గా దినేశ్వర్ శర్మ వ్యవహరిస్తున్నారు. ఆయా చీఫ్ లుగా దస్మానా, జైన్ లు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. 

20:52 - December 17, 2016

తెలంగాణ అసెంబ్లీల రచ్చ రచ్చ..హస్తంపార్టీటోల్లనీ..సైకిల్ పార్టీ ఓల్లనీ బైటికి గెంటేసిన గులాబోల్లు.. నోట్ల రద్దుపై మోదీని తిట్టుకుంటున్న జనాలు..ప్రధాని మోదీ సారుని కలుసుకోని పెండ్లిలోల్లకి రూ.2.50లచ్చలీయమని ...మోదీ సారుకు గామాట నేనే సెప్పినానని కేసీఆర్ సారు గంటున్నడు..కేసీఆర్ ఇంటిమీదనంట అందరి కళ్లు పడుతున్నాయంట..దవాఖాల ముందు పోటీపడతాన్న తమిళనాడు సీఎంలు..కొమిరెల్లి మల్లన్న సామిని లేపేసి కొత్త సామిని పెడతానంటున్న జనగామ ఎమ్మెల్యే.. ఇసొంటి ముచ్చట్లు సానా ఉన్నయ్ వీడియో సూడుండ్రి.. 

20:37 - December 17, 2016

తమిళనాడు : చెన్నై టెస్ట్‌లో ఇంగ్లండ్‌ జట్టు ఆధిపత్యం రెండో రోజు సైతం కొనసాగింది. మిడిల్‌ ఆర్డర్‌లోమొయిన్‌ అలీ సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో పాటు లోయర్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పోరాడటంతో భారీ స్కోర్‌ నమోదు చేసిన ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు సవాల్‌ విసిరింది. 4 వికెట్లకు 284 పరుగులతో రెండోరోజు బ్యాటింగ్ కొనసాగించిని ఇంగ్లండ్‌ జట్టు ఓవర్‌ నైట్‌ స్కోర్‌కు మరో 193 పరుగులు జోడించింది. మొయిన్‌ అలీ 146 పరుగులకు ఔటైనా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ లయామ్ డాసన్‌,ఆదిల్ రషీద్‌ హాఫ్ సెంచరీలు నమోదు చేసి ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 8వ వికెట్‌కు డాసన్‌, రషీద్‌ 109 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌ జట్టు 477 పరుగులు చేసింది.భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌ శర్మ,ఉమేష్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు చెన్నై టెస్ట్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.

 

20:35 - December 17, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గడువులోగా తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓవర్‌టైం పనిచేస్తోందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధాని 50 రోజుల గడువు కోరారాని, ఆ గడువులోగా సాధారణ స్థితి తెచ్చేందుకు కేంద్రం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని జైట్లీ పేర్కొన్నారు. ఫిక్కీ 89వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన నిర్ణయమన్నారు. దీన్ని అమలుచేయడానికి ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలన్నారు. సమీప కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా, భవిష్యత్తులో నోట్ల రద్దు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్థికవ్యవస్థ తీరు ఎంతో బాగుందని, భవిష్యత్తులో పరిస్థితి మరింత మెరుగవుతుందని జైట్లీ భరోసా ఇచ్చారు. 

20:32 - December 17, 2016

హైదరాబాద్ : జ‌నసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజుకో అంశం లేవనెత్తుతూ ట్విట్టర్ వేదికగా బీజేపీ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే గోవ‌ధ, రోహిత్ వేముల ఆత్మహత్య అంశాల‌పై బీజేపీని ప్రశ్నించిన జనసేనాని, ముడో రోజు దేశభక్తికి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలుచేశారు. పార్టీల విధానాల ఆధారంగా దేశభక్తిని అంచనా వేయవద్దన్నారు ప‌వ‌న్.

బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించిన జనసేనాని పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీపై ప్రశ్నలు వర్షం కురిపిస్తునారు. అయితే ఇప్పటి వ‌ర‌కూ అనేక ప్రజా స‌మ‌స్యల‌పై త‌నదైన శైలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప‌వ‌న్ దేశ వ్యాప్తంగా ఐదు ప్రధాన అంశాల‌పై ట్విట్టర్ వేదిక‌గా ప్రశ్నలు సంధించారు. గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాల‌పై వ‌రుస‌గా ప్రభుత్వాన్నినిల‌దీస్తాన‌న్న ప‌వ‌న్ గోవ‌ధ, రోహిత్ వేముల ఆత్మహత్య, తాజాగా దేశభక్తితో బీజేపీ ప్రభుత్వంపై ప్రశ్నల బాణాలు ఎక్కుపెట్టారు. కుల‌, మ‌త, వ‌ర్గ, ప్రాంత‌, భాషా భేదాలు లేకుండా దేశంలోని పౌరుడు, రాజ‌కీయ పార్టీలు ముందుకు వెళ్లడ‌మే దేశ‌భ‌క్తి అని ఆయ‌న ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశభ‌క్తి అనేది ఓ రాజ‌కీయ‌ పార్టీకి చెందిన అంశంగా ఉండ‌కూడ‌ద‌ని అన్నారు.

విలువలతో కూడిన మానవ సంబంధాలే దేశభక్తి : - ప‌వ‌న్
విలువలతో కూడిన మానవ సంబంధాలే దేశభక్తికి నిజమైన అర్థమని ప‌వ‌న్ అన్నారు. అధికారంలోని పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడినంత మాత్రాన దేశభక్తి లేనట్టు కాదని స్పష్టంచేశారు. రాజకీయ పార్టీలు సమావేశాలను జాతీయ గీతాలాపనతో ఎందుకు ప్రారంభించ‌డంలేద‌ని ప‌వ‌న్ ప్రశ్నించారు. కుటుంబం, స్నేహితులతో కలిసి సినిమా చూడటం కూడా దేశభక్తికి పరీక్షావేదిక కాకూడ‌ద‌న్నారు. చ‌ట్టాలను చేసేవారు.. వాటి గురించి ప్రచారం చేసేవారు.. వాటిని ఆచ‌రించరా అంటూ ప్రశ్నించారు. ముందు వారు ఆచ‌రించి అందరికీ ఆదర్శంగా నిలవొచ్చు కదా అని పవన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు...తాను అడుగుతాన‌న్న ఐదు అంశాల‌కు సంభంధించి ఇప్పటికే మూడు అంశాల‌పై ప్రశ్నలు సంధించిన ప‌వ‌న్ ఆదివారం ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై స్పందిస్తాన్నారు.

 

20:28 - December 17, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుకు సంబంధించి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదిని మళ్లీ టార్గెట్‌ చేశారు. ప్రధాని చెప్పినట్లుగా 50 రోజుల్లో పరిస్థితి కుదుటపడే ప్రసక్తే లేదని...బ్యాంకు ఖాతాలో జమ చేసిన మీ డబ్బులు మరో 3 నెలల తర్వాత కార్పోరేట్ల జేబుల్లోకి వెళ్లనున్నాయని రాహుల్‌ తెలిపారు. పెద్దనోట్ల రద్దు ద్వారా నల్లధనం, ఉగ్రవాదాన్ని అరికడతామని చెప్పిన ప్రధాని ఇపుడు -నగదు రహిత విధానాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. నగదు రహిత విధానం ద్వారా వినియోగదారులకు నష్టమేనని...ప్రతి చెల్లింపుపై 5 శాతం డబ్బు కార్పేరేట్ల ఖాతాల్లోకి వెళ్లనుందని హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటనకు ముందే ప్రధాని తనకు కావలసినవారికి ముందే చెప్పేశారని ఆరోపించారు. సెప్టెంబర్‌లో 6 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ కావడమే ఇందుకు నిదర్శనమన్నారు.

 

20:25 - December 17, 2016

ఢిల్లీ : అగస్టా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ఎస్పీ త్యాగికి ఈ నెల 30 వరకు పాటియాల కోర్టు జుడీషియల్‌ కస్టడీ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో త్యాగితో పాటు ఆయన సోదరుడి వరుసైన సంజీవ్‌, లాయర్‌ గౌతమ్‌ ఖైతాన్‌లను సీబీఐ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టింది. దీంతో కోర్టు వారికి డిసెంబర్ 30వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. 3 వేల 600 కోట్ల విలువ చేసే వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ వ్యవహారంలో త్యాగి కీలకపాత్ర పోషించారన్నది ఆరోపణ. ఈ మొత్తం వ్యవహారంలో 450కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. గతవారం త్యాగితో పాటు మరో ఇద్దరిని సిబిఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

20:23 - December 17, 2016

జమ్ముకశ్మీర్‌ : ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. శ్రీనగర్‌- జమ్మూ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. పుల్వామా జిల్లా పాంపోర్‌ వద్ద ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఘటనా స్థలం నుంచి ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 

రాజకీయపార్టీల పన్ను మినహాయంపుపై సీబీడీటీ స్పష్టత..

ఢిల్లీ: రాజకీయ పార్టీలకు పన్ను మినహాయింపుపై సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. నమోదైన రాజకీయ పార్టీలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఐటిచట్టం సెక్షన్ 13 ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. నమోదైన పార్టీలు ఆదాయం, ఖాతాలను కచ్చితంగా నిర్వహించాలి. విరాళాలకు సంబంధించిన రికార్డులు పార్టీలు నిర్వహించాలి. రూ.20వేలకు పైబగడి విరాళాలు ఇచ్చిన వ్యక్తుల విరాలాలు నమోదు చేయాలి. ప్రతి రాజకీయపార్టీ ఖాతాలను సీఏలు ఆడట్ చేయాలని ఆదేశించింది. విరాళాలకు సంబంధించి పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 

 

20:03 - December 17, 2016

నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మంచి ఖుషీగా వున్న నటుడు..రాపర్..డాన్సర్..నోయల్ ఆసక్తికర అంశాలను తెలిపాడు. సినిమా గురించే బాస్కెట్ బాల్ నేర్చుకున్నాను. రాజ్ తరుణ్ పై నాకు చాలా కోపంగా వుందన్నాడు నోయల్..హెబ్బా పటేల్ ను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాని నోయల్ తెలిపారు. ఇంతకీ ఎందుకు ఇలా అన్నాడు ఏంటీ మ్యాటర్ తెలుసుకోవాలంటే ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే. నోయల్ తో మాట్లాడుతుంటే అస్సలు సమయమే తెలీనీయకుండా పంచ్ లపై పంచ్ లు వేసేస్తుంటాడు..హాయిగా నవ్విస్తుంటాడు..మరి నోయల్ తో నవ్వుల్ని పంచుకోవాలంటే ఈ వీడియో చూడండి.. 

అమృతసర్ నుండి సిద్ధూ పోటీ?..

పంజాబ్ : క్రికెటర్ సిద్ధూ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. పంజాబ్ లోని అమృతసర్ నుండి పోటీచేసే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా బీజేపీలోంచి బైటకు వచ్చిన సిద్ధూ కాగా గతకొంతకాలం క్రితం కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.  

ఎంసీఏ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా..

ముంబై : క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. క్రికెట్ సమూల ప్రక్షాళనకు ఉద్దేశించి జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ, దాని అనుబంధ యూనిట్లలోని అధికారులు, బాధ్యులకు వయసు, కాలపరిమితి ఉండాలని లోధా కమిటీ సిఫారసులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కాగా, రాజకీయాలతో పాటు బీసీసీఐ, దాని అనుబంధ యూనిట్లలో శరద్ పవార్ కొనసాగుతున్నారు. 2005 నుంచి 2008 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. 2010-12 వరకు ఐసీసీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త..

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. హెల్త్ స్కీం లో భాగంగా 13 కార్పొరేట్ ఆసుపత్రులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఉద్యోగులకు, నెన్సనర్లు, జర్నలిస్టులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వీరందరికీ కార్పొరేట్ వైద్యం అందనుంది. 

సీఐటీయూ ఘనవిజయం..

సంగారెడ్డి : పటాన్ చెరు పెన్నార్ పరిశ్రమ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఐటీయూ ఘనవిజయం సాధించింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు ఘనవిజయం సాధించారు.

20ఏళ్ళ పోరాటం ఫలించింది..

హైదరాబాద్ : హిమాయత్ సాగర్, ఉస్మాన్ నగర్ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలకు నీరు అందించే అంశం ఉన్న జీవో నంబర్ 111ను పున:సమీక్షించాలని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇరవై ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటం ఫలించిందని..ఈ జీవోపై సమీక్షించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిందని అన్నారు. ఈ ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించి ఒక నివేదిక ఇవ్వాలని ఆమె కోరారు. 

18:59 - December 17, 2016
18:55 - December 17, 2016

తూర్పుగోదావరి : నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల దగ్గర సరిపడా నగదు లేకపోవడంతో వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి. రద్దు నిర్ణయంతో క్లాత్ మార్కెట్‌ వ్యాపారం డీలాపడిపోయింది. పండగల సీజన్ కావడంతో ప్రజల దగ్గర ఉన్న కొద్దిపాటి నగదుతోనే షాపింగ్‌కు వస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని... మరో సంవత్సరం వరకు వ్యాపారం కోలుకోలేని పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. రాజమండ్రిలోని బొమ్మనా రాజ్ కుమార్ షాప్ యజమాని ఈ అంశంపై ఏమంటున్నారో చూద్దాం..

18:53 - December 17, 2016

విశాఖ : మలేషియాలో మృతిచెందిన వలస కూలీ మృతదేహన్ని స్వగ్రామానికి తెప్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని కుటుంబసభ్యులు ముట్టడించారు. నక్కపల్లి గ్రామానికి చెందిన పలివెల రాము ఉపాధి కోసం కొద్ది కాలం క్రితం మలేషియా వెళ్లాడు.. ఈ నెల 3వ తేదీన రాము మృతిచెందాడన్న వార్త అతని కుటుంబసభ్యులకు అందింది. రాము మృతదేహన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రభుత్వాధికారులను రాము బంధువులు కోరారు. 2వారాలవుతున్నా... అధికారులు మృతుదేహం తెప్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ... కుటుంబసభ్యులు సీపీఎం ఆధ్వర్యంలో... నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే అధికారులు జోక్యం చేసుకొని రాము మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకురావాని వారు డిమాండ్ చేసారు .    

18:50 - December 17, 2016

నెల్లూరు: ఓ మహిళ అవయదానం చేసి ఆదర్శప్రాయంగా నిలిచింది. చిట్టమూరుకు చెందిన మర్రి చెంగమ్మ అనే మహిళ ఈ నెల 12 తేదీన బైక్ నుంచి పడి తీవ్రంగా గాయపడింది. ఓ ప్రైవేటు హస్పిటల్‌లో చికిత్స అందిస్తుండగా బ్రైయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులను అవయదానానికి ఒప్పించారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి గుండెను చెన్నైలోని మలార్ ఆసుపత్రికి... లివర్‌ను విశాఖ అపోలో హాస్పటల్‌కు.. కిడ్నీలలో ఒకటి తిరుపతి స్పిమ్స్.. మరోకటి నెల్లూరు బొల్లినేని ఆసుపత్రికి.. కళ్లను నెల్లూరు మోడ్రన్ ఆసుపత్రికి తరలించారు. 

18:44 - December 17, 2016

విశాఖ : రానున్న రోజుల్లో విశాఖపట్నం ఫార్మాస్యూటికల్‌ రాజధానిగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 68వ భారత ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఫార్మారంగంలో పెట్టుబడులకు విశాఖ అనువైన ప్రాంతమన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ మేథస్సు కలిగిన యువత, నిపుణులైన అనుభవజ్ఞులు ఉన్నారన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. భారత ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ విశాఖలో జరుగుతుండటం.. రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు.. ఫార్మా పరిజ్ఞానంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను చంద్రబాబు ప్రారంభించారు.

18:40 - December 17, 2016

సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో సవతి తల్లి వేధింపులకు ఓ బాలిక బలైంది. ఎల్లారెడ్డి పేట మండలం బండలింగం పల్లి గ్రామానికి చెందిన రాములు, బాలమణి దంపతుల కూతరు దివ్య. దివ్య తల్లి బాలమణి మృతిచెందడంతో స్వప్న అనే మహిళను రాములు రెండో వివాహాం చేసుకున్నాడు. రాములు కూడా అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందడంతో దివ్యను సవతి తల్లి తరుచూ వేధించేది. గత కొన్ని నెలలుగా ఈ వేధింపులు ఎక్కవకావడంతో దివ్య మనస్థాపానికి గురైంది. ఇవాళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోని ఆత్మహత్యకు పాల్పడింది.

18:38 - December 17, 2016

హైదరాబాద్ : ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫీజుల దోపిడీని అరికట్టాలని తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయని అసోసియేషన్ నేతలు మండిపడ్డారు. ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫీజుల దోపిడీని నియంత్రించడానికి కృషి చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ కిషన్‌పై యాజమాన్యాలు బెదిరింపులకు దిగుతున్నాయన్నారు. కిషన్‌కు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. తక్షణమే ఫీజుల నియంత్రణ కోసం ఓ చట్టం తీసుకురావాలని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నారాయణ, ప్రకాశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

18:36 - December 17, 2016
18:33 - December 17, 2016

హైదరాబాద్ : వ్యక్తుల కన్నా సాహిత్యం ఎంతో ముఖ్యమని.. వ్యక్తులు ఉన్నా, లేకున్నా అక్షరం నిలిచి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి అన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ సాహితి సాహిత్యోత్సవం కార్యక్రమానికి రమణాచారితో పాటు కొలకనూరి ఇనాక్‌, శివారెడ్డి, సుద్దాల అశోక్‌తేజ, ఎన్‌.గోపి, తెలకపల్లి రవి, మాదాల రవి అథితులుగా పాల్గొన్నారు. ఇలాంటి ఫెస్ట్‌కు హాజరుకావడం చాలా సంతోషంగా ఉందని.. ఫెస్ట్‌ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాల్సిన అవసరముందన్నారు. 

18:29 - December 17, 2016

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సంతకం ఫోర్జరీ అయ్యింది. మారంరాజు రాఘవరావు అనే వ్యక్తి ఈ ఫోర్జరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు, రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీట్లు మంజూరైనట్లుగా గవర్నర్ పేరిట నకిలీ లేఖలు సృష్టించిన రాఘవరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడికి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది. కాగా గతంలోకూడా రాఘవరావు పలు చీటింగ్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. 

గవర్నర్ నరసింహన్ సంతకం ఫోర్జరీ..

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ సంతకం ఫోర్జరీ అయ్యింది. మారంరాజు రాఘవరావు అనే వ్యక్తి ఈ ఫోర్జరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు, రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీట్లు మంజూరైనట్లుగా గవర్నర్ పేరిట నకిలీ లేఖలు సృష్టించిన రాఘవరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 

18:19 - December 17, 2016

ఆదిలాబాద్ : రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ఇల్లు ఇచ్చినట్లు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినట్లు నిరూపిస్తే.. తానిప్పుడే పాదయాత్ర వదిలిపెడతానని తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే.. రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పిన టీఆర్‌ఎస్‌ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చినా... రైతుల రుణాలు మాఫీ కాలేదని, కేజీటూ పీజీ విద్య, డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం అమలు కాలేదని తమ్మినేని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా... కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తమ్మినేని అన్నారు. అట్టడుగు వర్గాల వారంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని తమ్మినేని అన్నారు. 

18:14 - December 17, 2016

హైదరాబాద్ : అసెంబ్లీలో సభ్యుల సస్పెన్షన్‌పై శాసనసభా పక్ష నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్పీకర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. వెల్‌లోకి రాకముందు ఎలా సస్పెన్షన్ చేస్తారని ప్రశ్నించారు..తమను సభలో అడ్డుకుంటే ప్రజల మధ్యలో తేల్చుకుంటామన్నారు. సభకు వచ్చి సమయాన్ని వృథా చేసుకునే కంటే ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తెలపటమే సరైందన్నారు. అసలు సభకు ఎందుకు వచ్చామని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సభ ప్రారంభమైన కొద్ది సేపటికే 9మంది కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ మధుసూధనాచారి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.ఈ విషయంపై జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

18:09 - December 17, 2016

హైదరాబాద్ : ప్రజా సమస్యలు చర్చించకుండా కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడుతున్నందుకే 9మంది కాంగ్రెస్‌ సభ్యుల్ని సస్పెన్షన్‌ చేయాల్సి వచ్చిందని సభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆనాడు అసెంబ్లీలో తెలంగాణ పేరు ఎత్తితేనే తమను సస్పెండ్‌ చేశారని..అలాంటి సభలో ఇవాళ ప్రజా సమస్యలు చర్చిద్దామంటే అదే కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడుతున్నారని హరీష్‌రావు అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సభ్యులను ఒక్కరోజు వరకు సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందని మంత్రి వివరించారు.

శాసనసభ సమావేశాల రెండో రోజు 9మంది కాంగ్రెస్ సభ్యులపై వేటు
తెలంగాణ శాసనసభ సమావేశాల రెండో రోజు కాంగ్రెస్ సభ్యులపై వేటుపడింది. వాయిదా తీర్మానంపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద నినాదాలు చేశారు. దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. విలువైన సభాసమయాన్ని కాంగ్రెస్‌ వృథా చేస్తోందన్నారు. ప్రజల సమస్యలపై చర్చిస్తున్నప్పుడు కాంగ్రెస్‌ అడ్డుకోవడం సరికాదన్నారు. ఉనికిని చాటుకునేందుకే కాంగ్రెస్‌ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. 9మంది కాంగ్రెస్‌ సభ్యులను ఒక రోజు సస్పెండ్‌ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు డి.కె.అరుణ, మల్లు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్‌, గీతారెడ్డి, చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, జీవన్‌రెడ్డిలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

18:04 - December 17, 2016

కరీంనగర్ : సర్వారెడ్డి పల్లెలో ఎల్లంపల్లి పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో నీరు భారీగా పైకి ఎగిసిపడుతోంది. ఈ దృశ్యాన్ని గ్రామస్తులు ఆశ్యర్యంగా తిలకిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి పైప్ లైన్ ద్వారా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. అయితే ఉదయం ఈ పైపులైన్ గేట్ వాల్ పగిలిపోవడంతో నీరంతా ఎగిసి పడుతూ... గ్రామంలోని చెరువులోకి చేరుతుంది. అయితే చెరువు పూర్తిగా నిండితే... నీరంతా పంట పొలాల్లోకి చేరి నష్టపోయే ప్రమాదముందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందించినా.. ఇంతవరకు స్పందించలేదని స్థానికులు తెలిపారు.

చిన్నమ్మతో రాములమ్మ..

తమిళనాడు : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళతో ప్రముఖ సినీ నటి..మాజీ ఎంపీ విజయశాంతి భేటీ అయ్యారు. జయ నివాసం పోయెస్ గార్డెన్ కు వెళ్లిన విజయశాంతి... శశికళతో భేటీ అయ్యారు. అన్నాడీఎంకే పార్టీని ముందుండి నడిపించాలని.. జయ నిర్వహించిన బాధ్యతలను స్వీకరించాలని శశికళను ఈ సందర్భంగా విజయశాంతి కోరారు. అంతకు ముందు మెరీనా బీచ్ లోని జయలలిత సమాధిని విజయశాంతి దర్శించుకున్నారు. సమాధిపై పూలమాల వేసి, జయలలితకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమ్మ మృతి తీరని లోటు అని అన్నారు. 

ఉగ్ర కాల్పుల్లో 3గురు జవాన్లు మృతి..

జమ్ముకశ్మీర్‌ : పుల్వామా జిల్లా పాంపోర్‌లోకి మరోసారి ఉగ్ర‌వాదులు ప్రవేశించారు. అ ప్రాంతంలోని ఓ ఆర్మీ కాన్వాయ్‌పై విచక్షణారహితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ దాడిలో ముగ్గురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు సంబంధిత అధికారులు ప్ర‌క‌టించారు. అక్క‌డ జ‌న‌స‌మూహం కూడా ఉండ‌డంతో ఎదురుకాల్పుల‌కు దిగ‌డానికి జ‌వాన్లు ఆలోచించార‌ని, దీంతో అక్క‌డి నుంచి ఉగ్ర‌వాదులు పారిపోయార‌ని అన్నారు. ఉగ్ర‌వాదుల‌ కోసం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించాయని చెప్పారు. 

నోట్ల మార్పిడి..ఆర్బీఐ అధికారులు అరెస్ట్..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో జరుగుతున్న అక్రమలావాదేవీలను అరికట్టాలని సూచించాల్సిన ఆర్‌బీఐ అధికారులే అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ పోలీసుల‌కి ప‌ట్టుబ‌డుతున్నారు. నోట్ల మార్పిడి కేసులో నాలుగు రోజుల క్రితం బెంగ‌ళూరులో ఆర్‌బీఐ అధికారి మైఖేల్ అరెస్టు కావడం సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరులో మ‌రో ఇద్ద‌రు ఆర్‌బీఐ అధికారులు అరెస్ట‌య్యారు. వారిలో ఒక‌రు ఆర్‌బీఐలో సీనియ‌ర్ స్పెష‌ల్ అసిస్టెంట్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోన్న వ్య‌క్తి కాగా, మ‌రొక‌రు స్పెష‌ల్ అసిస్టెంట్ ఆఫ్ క్యాష్ డిపార్ట్‌మెంటుగా ప‌నిచేస్తున్నారు.

న్యూ గినియాలో భారీ భూకంపం..

న్యూ గినియా : పపువా న్యూ గునియా తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో ఈ రోజు భారీ భూకంపం సంభ‌వించిన‌ట్లు పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. పపువాలోని టరోన్‌ కు తూర్పున 46 కిలో మీటర్ల దూరంలో, 103 కిలో మీటర్ల లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. ఈ భారీ భూకపం ప్ర‌భావంతో పపువా న్యూ గునియా సమీప ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 

ఇది మోదీ విపత్తు : రాహుల్ గాంధీ

ఢిల్లీ : నోట్ల రద్దును మానవ నిర్మిత విపత్తుగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వర్ణించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం విఫలమైందనీ..50 రోజుల్లో పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాదని ఆయన అన్నారు. మోదీ నిర్ణయాల వల్ల దేశంలో ఆర్థిక విపత్తును సృష్టించారు. ఇది మోదీ విపత్తుగా రాహుల్ గాంధీ అభివర్ణియించారు. నోట్ల రద్దు వల్ల ఇప్పటి వరకు 100 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని రాహుల్ పేర్కొన్నారు.

17:21 - December 17, 2016

18.12.16 ఆదివారం విజయవాడలో మానవతావాదుల మహాసహ్మేళనం కార్యక్రమం జరుగనుంది. ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించిన 14 గ్రంథాలను నాస్తిక కేంద్రం ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. తెలుగునాట నాస్తిక, హేతువాద, వర్తమాన అంశాలపై సదస్సులు జరుగనున్నాయి. మూఢనమ్మకాలను అంతమొంతించేందుకు శాస్త్రీయ పరమైన అవగాహన సందస్సులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 10టీవీ చర్చను చేపట్టింది. ఈచర్చలో శాస్త్రీయ అంశాలను ప్రసారం చేస్తున్నా ప్రముఖులు పాల్గొన్నారు. నాస్తిక కేంద్ర నిర్వాహకులు ( డాక్టర్ విజయం),ఏపీ జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షులు (డాక్టర్ చల్లా రవికుమార్), ఉషారాణి ( ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు మానవతావాదుల మహాసహ్మేళనంలో ఎటువంటి శాస్త్రీయ పరమైన అంశాలను ప్రస్తావించనున్నారు? సమాజానికి శాస్త్రీయత ఎంత అవసరమో వక్తల మాటల్లో తెలుసుకుందాం..

బాంబుదాడిలో 13మంది సైనికులు మృతి..

ట‌ర్కీ : సైనికుల బ‌స్సుపై కారు బాంబు దాడి జ‌రిగింది. కైస‌రి న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఈ దాడిలో సుమారు 13 మంది సైనికులు మృతిచెందారు. మ‌రో 48 మంది గాయ‌ప‌డ్డారు. స్థానిక మార్కెట్‌కు బ‌స్సులో వ‌చ్చిన సైనికుల‌ను దుండ‌గులు టార్గెట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో సాధార‌ణ పౌరులు కూడా గాయ‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. కారు బాంబు ధాటికి బ‌స్సు భారీ స్థాయిలో ధ్వంస‌మైంది. ఇటీవ‌లే ఇస్తాంబుల్‌లో జ‌రిగిన దాడిలో 44 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే.

ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్ర కాల్పులు..

జమ్మూకశ్మీర్ : పుల్వామా జిల్లాలోని ప్యాంపోర్ సెక్టార్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేపట్టాయి.

 

పగిలిన ఎల్లంపల్లి పైప్ లైన్..

కరీంనగర్ : గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి వద్ద ఎల్లంపల్లి పైపులైన్ మరోసారి పగిలిపోయింది. 40 మీటర్ల మేర నీరు ఎగిసిపడింది. అక్కడికి చేరుకున్న అధికారులు నీటి సరఫరాను ఆపి మరమ్మతులు చేపట్టారు. ఇక ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు సమీప గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.

17:00 - December 17, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దుతో 500, 1000 రూపాయల నోట్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ప్రజల చేతిలో ఉన్న కాస్తోకూస్తో నోట్లలో అధిక శాతం బ్యాంకుల్లో డిపాజిట్‌ అయి పోయింది. నల్ల కుబేరులు సైతం అక్రమ మార్గంలో వాటిని మార్చుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. కొత్త నోట్లతో పాటు రద్దైన పాత నోట్లకు కూడా డిమాండ్‌ పెరిగిపోయింది. కొన్ని కంపెనీలు ప్రీమియం చెల్లించి మరీ పాత నోట్లను తీసుకుంటున్నాయి.

6 శాతం ప్రీమియం చెల్లించి పాత నోట్లను తీసుకుంటున్నారు
ఎందుకు పనికిరావు అనుకున్న పాత నోట్లకు ఇప్పుడు గిరాకీ పెరిగిపోయింది. కొన్ని కంపెనీలు 6 శాతం ప్రీమియం చెల్లించి మరీ పాత నోట్లను తీసుకుంటున్నాయి. దాదాపు 90 శాతం వరకు రద్దైన పాత నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి. మిగిలిన 10 శాతం పాత నోట్ల కోసం కంపెనీలు పాకులాడుతున్నాయి.

500, 1000 రూపాయల నోట్లను ప్రీమియం
500, 1000 రూపాయల నోట్లను ప్రీమియం చెల్లించి మరీ తీసుకునేందుకు కొన్ని కంపెనీలు, ప్రయత్నిస్తున్నాయి. పుస్తకాల్లో చూపించిన సంపాదనకు అనుగుణంగా నగదు నిల్వలు చేతుల్లో లేని వ్యక్తులు పాత నోట్లను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కంపెనీలు బ్యాలెన్స్‌ షీట్లలో కొంత క్యాష్‌ ఇన్‌ హ్యండ్‌ కింద చూపిస్తారు. వారి అవసరాల కోసం అప్పటికప్పుడు వాడుకునేందుకు ఈ డబ్బును ఉపయోగిస్తారు. వీటి లెక్కలు కూడా పక్కాగానే ఉండాలి. కానీ అనుకోకుండా పెద్ద నోట్ల రద్దు కంపెనీలకు తలనొప్పిగా మారింది. క్యాష్‌ ఇన్‌ హ్యాండ్‌ కింద చూపించిన డబ్బు కూడా బ్యాంకుల్లో జమ చేయాలి. లేకుంటే ఐటి శాఖ నుంచి ప్రశ్నలను ఎదుర్కోవాలి, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు జవాబు చెప్పుకోవాలి. డిసెంబర్‌లోగా బ్యాంకుల్లో జమచేయాల్సి రావడంతో కంపెనీలు రద్దయిన పాత నోట్ల కోసం పాకులాడుతున్నాయి. 6 శాతం వరకు ప్రీమియం చెల్లించి మరీ పాత నోట్లను తీసుకుంటున్నారు.

40 శాతం కమీషన్‌ ఇచ్చి పాత నోట్లను మార్చుకుంటున్న అక్రమార్కులు
నల్ల కుబేరులు పాత నోట్లను మార్చుకొని కొత్త నోట్లను పొందేందుకు 40 శాతం వరకు కమీషన్‌ ఇస్తే.. 6 శాతం ప్రీమియం ఇచ్చి మరీ కంపెనీలు పాత నోట్లను తీసుకుంటున్నాయి. 

16:54 - December 17, 2016

నాగర్ కర్నూల్ : అప్పాయిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పాయిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. విద్యార్ధులు కలువ పూలకోసం చెరువులోకి దిగడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. స్కూలుకని వెళ్ళిన బిడ్డలను శవాలుగా చూడటంతో వారి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా స్కూలుకు వెళ్లిన విద్యార్ధులు అటు తల్లిదండ్రులకు గానీ, ఇటు ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వకుండా ఈత కోసం వెళ్లి మృతి చెందుతున్న ఘటనలు తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే. అమాయకత్వంతోనో..మూర్ఖత్వంతోనో వీరు చేసే ఇటువంటి చర్యలకు వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. 

16:37 - December 17, 2016

హైదరాబాద్ : అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినంతమాత్రాన దేశభక్తి లేనట్లు కాదని పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా బీజేపీ పార్టీని ప్రశ్నించారు. బీజేపీ పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ అస్త్రాన్ని సంధించారు. గత రెండు రోజుల నుండి ట్వీట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలను కేంద్ర ప్రభుత్వంపై సంధిస్తున్నారు. ఐదు అంశాలపై ట్వీట్ ద్వారా స్పందిస్తానని తెలిపిన పవన్ కళ్యాణ్ నేడు దేశ భక్తి గురించి ట్వీట్ చేశారు. ఇప్ప‌టికి వాటిలో రెండు అంశాల గురించి ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. గురువారం నాడు గోవ‌ధ, శుక్రవారం నాడు రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య గురించి బీజేపీని నిల‌దీసిన ప‌వ‌న్.. నేడు మూడో అంశమైన దేశభ‌క్తిపై స్పందించారు. కుల‌, మ‌త, వ‌ర్గ‌, ప్రాంత‌, భాషా భేదాలు లేకుండా దేశంలోని పౌరుడు, రాజ‌కీయ పార్టీలు ముందుకు వెళ్ల‌డ‌మే దేశ‌భ‌క్తి అని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. దేశభ‌క్తి అనేది ఓ రాజ‌కీయ‌ పార్టీల విధానల ఆధారంగా అంచనావేయవద్దని ఆయన పేర్కొన్నారు.దేశభ‌క్తి అనేది మనిషిలో విలువ‌ల‌తో, మాన‌వతతో కూడి ఉండే అంశమ‌న్నారు. రాజ‌కీయ పార్టీలు త‌మ పార్టీ మీటింగ్‌ల‌ను జాతీయ‌గీతంతో ఎందుకు ప్రారంభించ‌ట్లేదనీ..సినిమా థియేట‌ర్‌ల‌లో మాత్ర‌మే పాడాల‌ని ఎందుకు చెబుతున్నార‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. కాగా గురువారం నాడు గోవధ, శుక్రవారం నాడు హెచ్ సీయూ ఆత్మహత్య చేసుకున్న స్కాలర్ విద్యార్థి రోహిత్ వేములపై స్పందించిన విషయం తెలిసిందే. రేపు ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ ట్వీట్ చేయనున్నారు.

దేశ భక్తిపై పవన్ కళ్యాణ్ ట్వీట్..

హైదరాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ముందు ఇటీవ‌లే ఐదు అంశాలను ఉంచిన జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికి వాటిలో రెండు అంశాల గురించి ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. గురువారం నాడు గోవ‌ధ, శుక్రవారం నాడు రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య గురించి బీజేపీని నిల‌దీసిన ప‌వ‌న్.. నేడు మూడో అంశమైన దేశభ‌క్తిపై స్పందించారు. కుల‌, మ‌త, వ‌ర్గ‌, ప్రాంత‌, భాషా భేదాలు లేకుండా దేశంలోని పౌరుడు, రాజ‌కీయ పార్టీలు ముందుకు వెళ్ల‌డ‌మే దేశ‌భ‌క్తి అని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 

16:11 - December 17, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఐరన్ యార్డ్ విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉంది. రోజుకు 4 నుంచి 5 కోట్ల రూపాయల వ్యాపారం ఈ ఐరన్ యార్డ్ నుంచి సాగుతోంది. సుమారు 450 షాపుల ద్వారా 1200 మంది వ్యాపారులు, 4 వేల మంది కార్మికులు ఈ ఐరన్ యార్డ్ ను నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్నారు. అలాంటిది నోట్ల రద్దుతో 37 రోజులుగా తీవ్ర సంక్షోభంలో ఐరన్ యార్డ్ చిక్కుకుంది. దినసరి ఖర్చులకు కూడా వ్యాపారం చేయలేని దీనవస్థకు ఐరన్ యార్డ్ చేరుకుంది. ఒక్కో షాపులో రోజుకు టన్ను సరుకు కూడా అమ్మకాలు చేయలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు కార్మికులు ఉదయాన్నే ఐరన్ యార్డ్ కు రావడం, సాయంత్రం వరకు ఎదురుచూడటం దీనవస్థలో ఇళ్లకు చేరుకోవడం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం ఈ వీడియో చూడండి..

16:08 - December 17, 2016

తమిళనాడు : దివంగత సీఎం జయలలిత గొప్ప నాయకురాలని సినీనటి విజయశాంతి కొనియాడారు. జయలలిత లాంటి సేవా తత్పరత కలిగిన మరో మహిళను దేశం ఇక చూడబోదని అన్నారు. చెన్నైలోని మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్ద విజయశాంతి నివాళుల అర్పించారు. జయతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కొంతమంది అనవసరంగా జయమృతిపై అనుమానాలు లేవనెత్తుతున్నారని... పార్టీని చీల్చే ఈ కుట్రలో అన్నాడీఎంకే కార్యకర్తలు బలికావద్దని సూచించారు.

15:58 - December 17, 2016

తూర్పుగోదావరి : పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఊడిగం చేస్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. కోస్టల్ కారిడార్ పేరుతో పారిశ్రామిక కేంద్రంగా తయారుచేస్తానంటున్న ప్రభుత్వం పచ్చని పల్లెల్ని శ్మశానంగా మార్చేందుకు యత్నిస్తోందని విమర్శించారు. అమెరికాలో ఫార్మా పరిశ్రమల్ని తరిమివేస్తున్నారనీ..అటువంటి పరిశ్రమల్ని ఇక్కడ నెలకొల్పటమంటే ప్రజల జీవితాలలో ఆటలాడుకొన్నట్లేనన్నారు. ప్రజల శ్రేయస్సుకంటే విదేశీ కంపెనీలు విదిల్చే ఎంగిలి మెతుకుల కోసం ప్రభుత్వం పాకులాడుతోందని విమర్శించారు. దివీస్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపొతే యనమల రామకృష్ణను ప్రజలు తరిమేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. పారిశ్రామికవేత్తల ఎంగిలిమెతుకులకు పాలకులు ఆశపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించొద్దన్ని సీసీఎం జాతీయ నేత బీవీ రాఘవులు ప్రభుత్వానికి సూచించారు.

15:47 - December 17, 2016

హైదరబాద్ : సింగరేణి కాలరీస్‌తోపాటు, విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సమస్యలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

విద్యుత్‌ కోతలు లేకుండా చర్యలు : జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా విద్యుత్‌శాఖ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిందన్నారు ఆ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఉన్న 2700 మెగవాట్ల విద్యుత్‌ లోటును అధిగమించేందుకు ప్రభుత్వరంగ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆ సమస్యను పరిష్కరించామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా విద్యుత్‌ పోకుండా హైదరాబాద్‌లో విద్యుత్‌ వలయాన్ని ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. 

15:41 - December 17, 2016

హైదరాబాద్ : నానక్‌రాంగూడలో బిల్డింగ్‌ కూలిన తర్వాత జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాలు, కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ముసారాంబాగ్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బిల్డింగ్‌ ను అధికారులు కూల్చి వేశారు. ఎలాంటి అనుమతి లేకుండా భారీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. కూల్చివేత పనులు ప్రారంభించారు. 

15:39 - December 17, 2016

హైదరబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌.. ఇలా చెబితేనే ఎంతో గొప్పగా అనిపిస్తోంది కదూ.. కాని పేరులోనే గ్రేట్‌ కనబడుతోందనేది సిటీపబ్లిక్‌ టాక్‌. అడుగడుగునా చేతులు తడపందే పని జరగని పరిస్థితి నెలకొంది. అడ్డదిడ్డంగా అనుమతులిస్తూ.. వ్యవస్థను బ్రష్టుపట్టిస్తున్న అవినీతి అధికారులపై ప్రభుత్వం పోకస్‌ పెట్టింది.

జీహెచ్‌ఎంసీలో ప్రకంపనలు

నానక్‌రామ్‌గూడలో బిల్డింగ్‌ కూలిన సంఘటనతో జీహెచ్‌ఎంసీలో ప్రకంపనలు మొదలయ్యాయి. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో కొందరు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

కాసుల కక్కుర్తితో అడ్డదిడ్డంగా అనుమతులు
నోట్లకట్టలకు ఆశపడిన కొందరు అధికారులు .. టౌన్‌ప్లానింగ్‌ డిపార్డ్‌మెంట్‌ను బ్రష్టుపట్టించారని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. భవన నిర్మాణాలకు అడ్డదిడ్డంగా అనుమతులు ఇస్తూ.. జనం ప్రాణాలమీదికి తెస్తున్నారని ప్రభుత్వం సీరియస్‌ అయింది. కాసులకు కక్కుర్తిపడే వారిని ఏరిపారేయాలని నిర్ణయిండంతో.. అవినీతి చేపలు తెగ టెన్షన్‌ పడుతున్నాయి.

రహస్య మీటింగ్‌లు .. రాయబారాలు ..
కొందరి నిర్వాకం వల్ల మొత్తం కార్పొరేషన్‌కే చెడ్డపేరు వస్తుండడంతో జీహెచ్‌ఎంసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీంతో ఎవరి పోస్టింగ్‌కు ఎసరు వస్తుందోనని కిందిస్థాయి అధికారుల్లో గుబులు మొదలైంది. తమ పేర్లు బయటికి రాకుండా.. ఉన్నతాధికారుల వద్దకు రాయబారాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే టౌన్‌ప్లానింగ్ అధికారులంతా.. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్టు తెలుస్తోంది.

టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో కత్తెరింపులు ఖాయం..!
ప్రభుత్వం మాత్రం.. అవినీతిపరులపై సీరియస్‌గా దృష్టిపెట్టడంతో.. త్వరలో టౌన్‌ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో కత్తెరింపులు ఖాయం..అనే చర్చలు జరుగుతున్నాయి. అవినీతి ఆరోపణలొస్తున్న వెస్ట్‌జోన్‌, ఈస్ట్‌జోన్‌లతోపాటు నార్త్‌జోన్లలో కొందరు అధికారుల కుర్చీలకు అపుడే వైబ్రేషన్స్‌ మొదలైనట్టు తెస్తోంది. ఏళ్లకు ఏళ్లు ఒకే దగ్గర పనిచేస్తున్న అధికారులపై ఏక కాలంలో బదిలీవేటు వేసేందుకు కమిషనర్‌ స్థాయిలో జాబితాకూడా తయారైనట్టు సమాచారం.మొదట బదిలీ.. లేదంటే సరెండర్‌. దానికీ దారిలోకి రాకుంటే.. సస్పెన్షన్‌.. ఇదే ఫార్ములాతో ప్రక్షాళన మొదలవడంతో... జీహెచ్‌ఎంసీలో వేటు ఎవరికో అనే గుసగుసలు గుప్పుమంటున్నాయి. 

15:36 - December 17, 2016

తూర్పుగోదావరి : దివీస్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపొతే యనమల రామకృష్ణను ప్రజలు తరిమేసే పరిస్థితి వస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు అన్నారు. కాకినాడలోని దివీస్‌ బాధిత ప్రాంతాల్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల సహనాన్ని పరీక్షించొద్దని రాఘవులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా ఆప్రాంత ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. వీరికి సీపీఎం పార్టీ అండగా వుండి వారి సమస్యలపై నిరంతరం పోరాడతున్న విషయం తెలిసిందే.

15:25 - December 17, 2016

హైదరాబాద్ : ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బైటకు గెంటివేస్తాం అనే విధంగా అధికారపక్షం బెదిరింపులకు పాల్పడుతున్నారనీ.. జీ హుజూర్ అంటేనే సభలో వుండనిస్తారని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం బాకాలు కొడుతోందని ఎద్దేవా చేశారు. అధికారపక్షం బీఏసీలో ఒక నిర్ణయం చేస్తారు..సభలో మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తాము ఏం మాట్లాడినా విపక్షాలు గమ్మునుండాలనే ధోరణితో ప్రభుత్వం వుందన్నారు. జై తెలంగాణతోనే సెంటిమెంట్ తోనే ప్రభుత్వం కొనసాగుతోందని ఆమె ఎద్దేవా చేశారు.ప్రతీ అంశంలోనూ నియంతృత్వ ధోరణితో ప్రవర్తిస్తోందన్నారు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన ప్రొ.కోదండరామ్ ను కూడా పక్కన పెట్టేసి..ప్రజలను సెంటిమెంట్ లో నిర్భంధించి మోసపూరిత పాలనను కొనసాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సభాధ్యక్షుడికి స్వంత ఆలోచన అనేది లేకుండా ప్రభుత్వం కట్టివేసి కూర్చోపెట్టారని విమర్శించారు. ప్రతిపక్షాల సస్పెన్షన్...అధికార పార్టీ నిరంకుశత్వానికి ప్రత్యక్షసాక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై చర్చుకు పట్టుబట్టిన తమను సస్పెండ్ చేయడం సరికాదని తెలిపారు. అవినీతి రహిత పాలనే తమ ధ్యేయమని చెబుతున్న టీఆర్‌ఎస్..పార్టీ ఫిరాయింపులపై చర్చకు ఎందుకు వెనకాడుతోందన్నారు. కాగా అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. 

15:13 - December 17, 2016

హైదరాబాద్ : అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌ రెడ్డి, మంత్రి పోచారంమధ్య హాట్‌ హాట్‌ డిస్కషన్‌ నడిచింది.. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం బాగాలేదని పోచారం చెప్పారంటూ కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఒక మంత్రి మాట్లాడాల్సిన పద్దతి ఇదేనా అని ప్రశ్నించారు.. ఈ పథకంపై మంత్రికే సానుకూల దృక్పధం లేకపోతే రైతులకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.. ఈ అంశంపై స్పందించిన మంత్రి... తాను స్కీం బాగాలేదనలేదని స్పష్టం చేశారు.. కొన్ని నిబంధనలు మార్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు..

15:07 - December 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలో 24 కొత్త అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు.. మంత్రి కేటీఆర్‌.. ప్రస్తుతంఉన్న నాలుగు డెవలప్‌మెంట్‌ అథారిటీలకు ఇవి అదనమని స్పష్టం చేశారు.. ప్రణాళికబద్దమైన అభివృద్ధికోసం ఈ అథారిటీల ఏర్పాటు అంశం ప్రతిపాదనలో ఉందని చెప్పారు..

రోడ్డుప్రమాదాల నివారణకు చర్యలు: మహేందర్‌ రెడ్డి
రోడ్డుప్రమాదాల నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామని.. మంత్రి మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు.. డ్రైవర్లకు శిక్షణకోసం సిరిసిల్లలో అతిపెద్ద శిక్షణా కేంద్రం ఏర్పాటుచేశామని గుర్తుచేశారు.. ఈ కేంద్రంలో దాదాపు 30వేలమందికి ట్రైనింగ్‌ ఇస్తున్నారని స్పష్టం చేశారు.. 

14:57 - December 17, 2016

హైదరాబాద్ : నల్లధనం నియంత్రణ ఒక్క నోట్ల రద్దుతోనే ఆగదని... సీఎం కేసీఆర్‌ అన్నారు.. నోట్ల తర్వాత అక్రమంగా కొన్న బంగారానికికూడా లెక్కలుచూపాల్సిఉంటుందని చెప్పుకొచ్చారు.. ఆన్‌లైన్‌ అంటే బ్రహ్మవిద్యకాదని... ప్రయత్నిస్తే అన్నీ సాధ్యమేనని శాసనమండలిలో తెలిపారు..నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని... సీఎం కేసీఆర్‌... శాసనమండలిలో ప్రకటించారు.. నల్లధనం నిరోధానికి మరిన్ని చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు.. తెలంగాణలో నగదురహిత లావాదేవీలకోసం చర్యలు చేపట్టామని వివరించారు..

ఛలోక్తులతో నవ్వులు పూయించిన కేసీఆర్

మండలిలో సీఎం కేసీఆర్‌ ఛలోక్తులు సభలో నవ్వులు పూయించాయి.. సామాన్య మహిళల బంగారం జోలికొస్తే తెలంగాణలాంటి ఉద్యమాన్ని తానే చేపడతానని కేసీఆర్‌ సభలో అన్నారు.. అలాగే ప్రధాని మోదీని కలిసేందుకు తాను వెళితే బ్లాక్‌మనీని మార్చుకునేందుకు వెళ్లానని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారని సరదాగా వ్యాఖ్యానించారు..

14:53 - December 17, 2016

కృష్ణా : గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ డేవిడ్‌రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుషోత్తపట్నం సమీపంలోని పంటపొలాల్లో ఆయన రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలు, అధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మృతదేహం వద్ద సూసైడ్‌లెటర్ దొరికిందని..దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

ఆధారాల్లేని డబ్బు, నగలను తీసుకుంటారు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : దొంగ బంగారం ఉన్న వారి దగ్గర మాత్రమే బంగారం లాక్కుంటారని కేసీఆర్ తెలిపారు. బినామీలు, ఆధారాలు లేని డబ్బు, నగలు కేంద్రం తీసుకుంటుందని చెప్పారు. వారసత్వ నగలను ఎవరు అమ్ముకోరని చెప్పారు. వారసత్వ నగలు కేంద్రం తీసుకుంటే అందరి కంటే ముందు తానే వ్యతిరేకిస్తానని చెప్పారు. 1985 లో ఎమ్మెల్యేలు ఆస్తులు ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. నగదు రహిత లావావేవీల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సమస్యలు వస్తాయని ప్రధానికి స్వయంగా చెప్పారని తెలిపారు.

14:12 - December 17, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రజలను డిజిటలైజేషన్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తుంది... అసలు ఎంత వరకు నగదు రహిత లావాదేవీలు చేయడానికి అవకాశం ఉంది... 80 శాతం వరకు నగదుతోనే క్రయవిక్రయాలు నడిచే భారత్‌లో కార్డు సిస్టం ఎంతవరకు సాధ్యపడుతుంది.... వేలిముద్రలతో వేలల్లో కార్డులను ఎలా ఉపయోగిస్తారు...? అక్షరాలు తెలియని గ్రామీణ భారతంలో ఆన్‌లైన్ విధానం ఎలా సాధ్యపడుతుంది... ఇలాంటి నేపథ్యంలో అభివృద్ధికి అక్షరానికి ఆమడ దూరంలో ఉన్న హైదరాబాద్‌ మెహిదిపట్నంలోని బోజుగుట్ట వద్ద తాజా పరిస్థితిలను 
వీడియోలో చూద్దాం..

14:10 - December 17, 2016

ఆదిలాబాద్ : సామాజిక న్యాయమే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర కొమురంభీం జిల్లాలోకి ప్రవేశించింది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్ర..ఆసేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద 1600 కిలోమీటర్ల మైలురాయిని పూర్తిచేసుకుంది. ఈమేరకు ఆయన జాన్ వెస్లీ టెన్ టివితో మాట్లాడారు. అటవీహక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసిపుడే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పారు.

 

14:06 - December 17, 2016

హైదరాబాద్ : దొంగ బంగారం ఉన్న వారి దగ్గర మాత్రమే బంగారం లాక్కుంటారని కేసీఆర్ తెలిపారు. శాసనమండలిలో పెద్ద నోట్ల రద్దుపై ఆయన ప్రసంగించారు. బినామీలు, ఆధారాలు లేని డబ్బు, నగలు కేంద్రం తీసుకుంటుందని చెప్పారు. వారసత్వ నగలను ఎవరు అమ్ముకోరని చెప్పారు. వారసత్వ నగలు కేంద్రం తీసుకుంటే అందరి కంటే ముందు తానే వ్యతిరేకిస్తానని చెప్పారు. 1985 లో ఎమ్మెల్యేలు ఆస్తులు ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. నగదు రహిత లావావేవీల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సమస్యలు వస్తాయని ప్రధానికి స్వయంగా చెప్పారని తెలిపారు.

 

13:56 - December 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టడంతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. విలువైన సభాసమయాన్ని కాంగ్రెస్‌ వృథా చేస్తోందన్నారు. ప్రజల సమస్యలపై చర్చిస్తున్నప్పుడు కాంగ్రెస్‌ అడ్డుకోవడం సరికాదన్నారు. ఉనికిని చాటుకునేందుకే కాంగ్రెస్‌ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. 9మంది కాంగ్రెస్‌ సభ్యులను ఒక రోజు సస్పెండ్‌ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు డి.కె.అరుణ, మల్లు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్‌, గీతారెడ్డి, చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, జీవన్‌రెడ్డిలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్సన్‌ : మంత్రి హరీష్ రావు 
ప్రజా సమస్యలు చర్చించకుండా కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడుతున్నందుకే 9మంది కాంగ్రెస్‌ సభ్యుల్ని సస్పెన్షన్‌ చేయాల్సి వచ్చిందని సభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆనాడు అసెంబ్లీలో తెలంగాణ పేరు ఎత్తితేనే తమను సస్పెండ్‌ చేశారని..అలాంటి సభలో ఇవాళ ప్రజా సమస్యలు చర్చిద్దామంటే అదే కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడుతున్నారని హరీష్‌రావు అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సభ్యులను ఒక్కరోజు వరకు సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందని మంత్రి వివరించారు. అసెంబ్లీలో సభ్యుల సస్పెన్షన్‌పై శాసనసభా పక్ష నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్పీకర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. వెల్‌లోకి రాకముందు ఎలా సస్పెన్షన్ చేస్తారని ప్రశ్నించారు..
టీడీపీ సభ్యులు రేవంత్‌ రెడ్డి, సండ్ర సస్పెన్షన్
సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారంటూ టీడీపీ నేతలు రేవంత్‌ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యను ఒకరోజు సభనుంచి సస్పెండ్ చేశారు.. ఈ ఇద్దరు సభ్యులను సస్పెండ్‌ చేయాలంటూ మంత్రి హరీశ్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు.. ఆ తర్వాత ఆందోళన విరమించాలని రేవంత్‌ రెడ్డి, సండ్రకు స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు.. అయినా వారు నిరసన ఆపకపోవడంతో సభనుంచి ఒకరోజు సస్పెన్ష్ చేశారు..
పార్టీ ఫిరాయింపులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి : కిషన్‌రెడ్డి 
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ త్వరగా నిర్ణయం తీసుకోవాలని బిజేపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై వివిధ కోర్టుల్లో ఉందని..దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవలన్నారు. ఇదే అంశంపై స్పీకర్‌ మధుసూధనాచారి స్పందిస్తూ...పార్టీ ఫిరాయింపు అంశం పరిశీలనలో ఉందన్నారు. 
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారన్న రేవంత్ 
శాసనసభలో ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని  టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై చర్చకు పట్టుబట్టడితే..ఇలా చేయడం సరికాదని చెప్పారు. సస్పెన్షన్‌ పై ఆలోచించాల్సిన స్పీకర్..అధికారపార్టీకే అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు. 
ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రద్దు : మంత్రి మహేందర్‌ రెడ్డి
ఆటో, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని... మంత్రి మహేందర్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.. పలు రకాల ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రద్దుచేశామని గుర్తుచేశారు.. ఈ వాహనాలకు సబ్సిడీకూడా ఇచ్చేందుకు సిద్ధంగాఉన్నామని చెప్పారు. 

 

13:50 - December 17, 2016

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆసుపత్రి హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయనకు కృత్రిమశ్వాస అందిస్తున్నట్టు కావేరి ఆసుపత్రి ఈడీ అరవిందన్‌ తెలిపారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆయన.. గురువారం నుంచి ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు. ప్రత్యేక డాక్టర్లబృందం పర్యవేక్షణలో  కరుణానిధికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు కరుణానిధిని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలసుకున్నారు. 

 

13:47 - December 17, 2016

ఢిల్లీ : భారత స్టార్‌ షెట్లర్‌ .. పీవీ సింధు బీడబ్ల్యూ ఎఫ్‌ సూపర్‌ సిరీస్‌  ఫైనల్స్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. స్పెయిన్‌ కు చెందిన ప్రపంచ నెంబర్‌ వన్‌..కరోలినా మారిన్‌ పై విజయం సాధించింది. ఈ గెలుపుతో ఒలింపిక్స్‌ ఫైనల్లో  ఓటమికి  ప్రతీకారం తీర్చుకొంది సిందు . గ్రూప్‌-బిలో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో 21-17.. 21-13తో వరుస గేముల్లో మారిన్‌ను చిత్తు చేసింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన  సింధు.. కళ్లు చెదిరే స్మాష్‌లు, హాఫ్‌ వ్యాలీలతో మారిన్‌ను  ముప్పుతిప్పలు పెట్టింది. సెమీస్‌లో సింధు దక్షిణ కొరియా షట్లర్‌ జి హ్యూన్‌ సుంగ్‌తో తలపడనుంది. 

 

13:39 - December 17, 2016

ఆదిలాబాద్ : ఎర్రజెండా చేతబట్టి.. ప్రజాబాట పట్టిన సీపీఎం పాదయాత్ర.. పల్లెలు, తండాలను పలకరిస్తోంది. అడుగడుగునా ప్రజల సమస్యలను ఆలకిస్తూ.. మీ వెంటే మేమున్నామని భరోసా కల్పిస్తోంది. అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్‌ పాలనలో.. రెండున్నరేళ్లు గడుస్తున్నా గిరిజన తండాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమని తమ్మినేని అన్నారు.
ఒరిగిందేం లేదన్న తమ్మినేని
తెలంగాణ వస్తే బతుకులు బాగు పడతాయని ఆశించిన వారికి ఒరిగిందేం లేదని.. తమ్మినేని వీరభద్రం అన్నారు. స్వరాష్ట్రం సిద్ధించినా.. ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సీపీఎం మహాజన పాదయాత్ర 61వ రోజు కొనసాగింది. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపం వద్ద పాదయాత్ర బృందం నివాళులర్పించింది. 
కేసీఆర్‌ పాలనలో ఘోర నిర్బంధం : తమ్మినేని 
ఎన్‌కౌంటర్లే ఉండవన్న కేసీఆర్‌ పాలనలో.. ఘోర నిర్బంధం అమలవుతుందన్నారు తమ్మినేని వీరభద్రం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని కేసీఆర్‌ గాలికొదిలేశారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదివాసీల పోడుభూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయ్నతిస్తోందని పాదయాత్ర బృంద సభ్యుడు రాజు అన్నారు. టైగర్‌ జోన్‌ పేరుతో ఆదివాసీలను తరలించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని నిర్మించాలన్నారు. 
చిన్న ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం : తమ్మినేని
తమ్మినేని బృందాన్ని వికలాంగులు, పింఛనుదారులు, ఆదివాసీలు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమకు పట్టాలు ఇప్పించేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పులిమడుగు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలా చూడాలని కోరగా.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తమ్మినేని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ చిన్న ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగుతున్న సీపీఎం పాదయాత్రకు ఆదివాసీలు, గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రకు అడుగడుగున్న గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలికారు. 

13:38 - December 17, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల టెండర్లలో భారీ అవినీతికి పాల్పడుతోందని బిజేపి నేత నాగం జనార్థన రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల అవినీతిపై పోరాటానికి కలిసిరావాలంటూ నాగం జనార్థన్ రెడ్డి టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని కోరారు. ఇతర ప్రతిపక్షాలను కూడా కలుపుకుని ప్రాజెక్టుల అవినీతిపై పోరాటానికి నాగం జనార్థన్ రెడ్డి సిద్ధమయ్యారు. 
టీఆర్ఎస్ విధానాలపై నాగం పోరుబాట 
పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలను ఎండగట్టేందుకు బీజేపీ సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రీడిజైనింగ్ ద్వారా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి వుందని, ఈ విషయాన్ని ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని నాగం జనార్థనరెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ ద్వారా వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న నాగం జనార్థన్‌ రెడ్డి... తన పోరాటానికి ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.
టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డితో నాగం భేటీ
ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతిపై పోరాటానికి రెడీ అయిన నాగం జనార్థన్‌రెడ్డి... టీడీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎల్పీ నేత రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతోపాటు, ఇతర టీడీపీ నేతలతో భేటి అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాల్లో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పోరాటానికి సహకరించాలని కోరారు. టెండర్లలో కూడా అర్హతలేని కంపెనీలకు కట్టబెట్టారని నాగం జనార్థనరెడ్డి ఆరోపించారు. త్వరలోనే వామపక్ష పార్టీలను కలుపుకుని, ఒకే వేదికపై నుండి ఈ పోరాటం చేయాలని నాగం జనార్థనరెడ్డి భావిస్తున్నారు.
సానుకూలంగా స్పందించిన టీడీపీ
నాగం జనార్థన్‌ రెడ్డి పోరాటానికి సహకరించేందుకు టీడీపీ కూడా సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై తాము చేస్తున్న పోరాటానికి, నాగం జనార్థన రెడ్డి అంశం కూడా కలిసివస్తుందని టీడీపీ భావిస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రీడిజైన్ ల పేరుతో ప్రజా ధనం దోచుకుంటున్నారని టీడీపీ కూడా గత కొంత కాలంగా ఆరోపణలు చేస్తోంది. దీంతో అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలపై చర్చకు పట్టుబట్టాలని కూడా టీడీపీ భావిస్తోంది. మొత్తంమీద అధికార టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇరిగేషన్ టెండర్ల నుంచి అన్ని అంశాలపై ప్రజల్లో టీఆర్ఎస్ విధానాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి.

 

టీ.శాసనమండలిలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలిలో పెద్ద నోట్ల రద్దుపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. 

 

13:22 - December 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలిలో పెద్ద నోట్ల రద్దుపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై పెద్దనోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అంశం కేంద్రం పరిధిలోనిదని... కేంద్రప్రభుత్వ పాలసీలను విమర్శించే హక్కు రాష్ట్ర అసెంబ్లీకి లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుపై సలహాలు, సూచనలు చేసే వీలుందని.. కానీ చర్చించే అవకాశం లేదన్నారు. సభలో లేని వ్యక్తుల ప్రస్తావన తేవొద్దని సూచించారు. అనంతరం కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు చేసిన డిసెంబర్ 8 దినం భారతదేశానికి బ్లాక్ డే అని అన్నారు. 

 

13:15 - December 17, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో ఆయన ప్రపంగించారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై పెద్దనోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అంశం కేంద్రం పరిధిలోనిదని... కేంద్రప్రభుత్వ పాలసీలను విమర్శించే హక్కు రాష్ట్ర అసెంబ్లీకి లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుపై సలహాలు, సూచనలు చేసే వీలుందని.. కానీ చర్చించే అవకాశం లేదన్నారు. సభలో లేని వ్యక్తుల ప్రస్తావన తేవొద్దని సూచించారు. 

 

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై పెద్దనోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. 

 

13:01 - December 17, 2016

హైదరాబాద్ : టీప్రభుత్వం ఒంటెత్తు పోకడపోతుందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందన్నారు.  నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శిస్తుందని చెప్పారు. మంత్రి హరీష్ తమల్ని సస్పెండ్ చేయమని సూచించగానే... ఆలోచన చేయకుండా స్పీకర్ తమను సస్పెండ్ చేశారని వాపోయారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పేదొకటి.. చేసేదొకటని.. కేసీఆర్ కు ఇది కొత్త కాదన్నారు.ఇప్పటికైనా స్పీకర్ సభను సక్రమంగా జరపాలన్నారు. 

 

డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలి : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. 

ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్ల పన్ను రద్దు : మహేందర్ రెడ్డి

హైదరాబాద్ : ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్ల పన్ను రద్దు చేశామని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఆటోలు, ట్రాక్టర్లకు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. దాదాపు 7 లక్షల మందికి రుణాలు కూడా మాఫీ చేశామని తెలిపారు. 

12:55 - December 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.  డ్రైవింగ్ స్కూల్స్ పటిష్టంగా పని చేయడం లేదని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వాహనాల పార్కింగ్ వసతులు లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సింగిల్ పర్మిట్ విధానం వల్ల డ్రైవర్లు, ఓనర్లకు మేలు జరుగుతందని చెప్పారు. డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. 

 

12:50 - December 17, 2016

హైదరాబాద్ : ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్ల పన్ను రద్దు చేశామని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. ఆటోలు, ట్రాక్టర్లకు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. దాదాపు 7 లక్షల మందికి రుణాలు కూడా మాఫీ చేశామని తెలిపారు. 

 

స్పీకర్ కార్యాలయానికి వెళ్లేందుకు రేవంత్, సండ్ర యత్నం

హైదరాబాద్ : స్పీకర్ కార్యాలయానికి వెళ్లేందుకు టీడీపీ సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ప్రయత్నించారు. మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. 

12:36 - December 17, 2016

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల అంశంపై టీ.అంసెంబ్లీలో దుమారం రేగింది. వాయిదా తీర్మాణాలు, పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్, టీడీపీలు పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ 9మంది కాంగ్రెస్ సభ్యులను, ఇద్దరు టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. దీంతో సభలో దుమారం రేగింది. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు సస్పెన్షన్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. 
కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్
తెలంగాణ అంసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సమావేశాల నుంచి 9 మంది కాంగ్రెస్ సభ్యులను ఒకరోజుపాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో పార్టీ పిరాయింపులపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకుండా ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ మధుసూధనాచారి 9 మంది కాంగ్రెస్ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. డీకే.అరుణ, జీవన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, గీతారెడ్డి, సంపత్ కుమార్, భట్టి విక్రమార్క, రామ్మోహన్ రెడ్డి, పద్మావతి, చిన్నారెడ్డిలను ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ పై కాంగ్రెస్ 
సభ్యులు మండిపడ్డారు. 
సస్పెన్షన్ సరికాదు : జానారెడ్డి 
తమ సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తమ 
సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని చెప్పారు. సభలో అధికార పార్టీకి మెజార్టీ ఉందని సస్పెండ్ చేయడం తగదని హితవు పలికారు. పార్లమెంట్ లోనే విపక్షాలు ఆందోళన చేస్తే సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకు లేదా ..? అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ సభ్యులు అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చే బదులు ప్రజల్లోకి వెళ్లడం మంచిదనిపిస్తుందని వాపోయారు. 
తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ : మంత్రి హరీష్ రావు 
సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రజా సమస్యలు చర్చించకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగకుంటే.. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగకూడదా.. అని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించారని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో 'జై తెలంగాణ' అంటే సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. 
టీడీపీ సభ్యుల సస్పెన్షన్
అంసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సమావేశాల నుంచి ఇద్దరు కాంగ్రెస్ సభ్యులను ఒకరోజుపాటు స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో పార్టీ పిరాయింపులపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకుండా ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ రేవంత్ రెడ్డి, సండ్రవెంకటవీరయ్యలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ పై టీడీపీ సభ్యులు మండిపడ్డారు. పశ్నిస్తే తమను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.

 

12:27 - December 17, 2016

హైదరాబాద్ : తమ సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమని కాంగ్రెస్ నాయకురాలు డీకే.అరుణ అన్నారు. రెండు నిమిషాల్లో తమను సస్పెండ్ చేశారని చెప్పారు. ప్రతిపక్షాల సస్పెన్షన్.. అధికారి పార్టీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ఈమేరకు ఆమె టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. 'ఇంకా తెలంగాణ పదంపైనే బతుకుతున్నారు.. మీ బతుకు చెడ' అని టీఆర్ ఎస్ సభ్యులను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. 'జై తెలంగాణ' పదంపై బతకడం మానేయండని టీఆర్ ఎస్ సభ్యులకు సూచించారు. తెలంగాణ అనే పదంతో టీసర్కార్  ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ పదంతో ఇంకా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన కోదండరాంను ఏ గతి చేశారని నిలదీశారు. 'కోదండరాం లేకపోతే మీకు సీఎం కుర్చి వచ్చి ఉండేదా.. అని నిలదీసింది. స్పీకర్ చేతులు కట్టేశారని పేర్కొన్నారు. సభా నియమాలను అధికార పార్టీ సభ్యులు సక్రమంగా పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తప్పా అని అన్నారు. ప్రజా సమస్యల చర్చించ వద్దా అని అడిగారు. అధికార పార్టీ ఏదీ చెబితే దానికి తాము తల ఊపాలా అని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే బాధ్యత ప్రతిపక్షాలకు ఉందన్నారు. 

 

12:24 - December 17, 2016

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల అంశంపై సభలో మాట్లాడినందుకు తమను సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంలోకి వెళ్లిన..వారిని, వెళ్లని వారిని కూడా స్పీకర్ సస్పెండ్ చేశారని మండిపడ్డారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు తమను సస్పెండ్ చేయాలని సూచింన వెంటనే..స్పీకర్ గుడ్డిగా తమను సస్పెండ్ చేశారని చెప్పారు. ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. టీఆర్ ఎస్, కాంగ్రెస్ కు ఇచ్చినట్లుగా తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడినందుకు సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. జిల్లా పునర్విభజనపై తమ అభిప్రాయాలను చెప్పకుండా చేశారు. స్పీకర్ సభ్యుల హక్కులను కాపాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో సభ్యుల అభిప్రాయాలను స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని ఎద్దేవా చేశారు. సభలో ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతునొక్కారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చి..సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

టీ.అసెంబ్లీలో 9 బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో 9 బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. ఆయా బిల్లులపై సభ్యులు చర్చిస్తున్నారు. 

 

సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలి : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : పార్టీ పిరాయింపుల అంశం సభలో మాట్లాడినందుకు సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో సభ్యుల అభిప్రాయాలను స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని ఎద్దేవా చేశారు. సభలో ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతునొక్కారని మండిపడ్డారు. 

 

11:22 - December 17, 2016

హైదరాబాద్ : సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రజా సమస్యలు చర్చించకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగకుంటే.. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగకూడదా.. అని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించారని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో 'జై తెలంగాణ' అంటే సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. 

 

కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ బాధాకరం : జానారెడ్డి

హైదరాబాద్ : తమ సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తమ సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని చెప్పారు. సభలో అధికార పార్టీకి మెజార్టీ ఉందని సస్పెండ్ చేయడం తగదని హితవు పలికారు. పార్లమెంట్ లోనే విపక్షాలు ఆందోళన చేస్తే సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకు లేదా ..? అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ సభ్యులు అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 
 

11:11 - December 17, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ పై ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. తమ సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని చెప్పారు. సభలో అధికార పార్టీకి మెజార్టీ ఉందని సస్పెండ్ చేయడం తగదని హితవు పలికారు. పార్లమెంట్ లోనే విపక్షాలు ఆందోళన చేస్తే సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. 'ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకు లేదా' ..? అని ప్రశ్నించారు. స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెల్ లోకి రాకముందే ఎలా సస్పెండ్ చేస్తారని మండిపడ్డారు. టీఆర్ ఎస్ సభ్యులు అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చే బదులు ప్రజల్లోకి వెళ్లడం మంచిదనిపిస్తుందన్నారు. 

 

 

10:50 - December 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సమావేశాల నుంచి ఇద్దరు కాంగ్రెస్ సభ్యులను ఒకరోజుపాటు స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో పార్టీ పిరాయింపులపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకుండా ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ రేవంత్ రెడ్డి, సండ్రవెంకటవీరయ్యలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ పై టీడీపీ సభ్యులు మండిపడ్డారు. పశ్నిస్తే తమను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.

 

10:45 - December 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సమావేశాల నుంచి 9 మంది కాంగ్రెస్ సభ్యులను ఒకరోజుపాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో పార్టీ పిరాయింపులపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకుండా ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ మధుసూధనాచారి 9 మంది కాంగ్రెస్ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. డీకే.అరుణ, జీవన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, గీతారెడ్డి, సంపత్ కుమార్, భట్టి విక్రమార్క, రామ్మోహన్ రెడ్డి, పద్మావతి, చిన్నారెడ్డిలను ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ పై కాంగ్రెస్ 
సభ్యులు మండిపడ్డారు. 

 

టీడీపీ సభ్యుల సస్పెన్షన్

హైదరాబాద్ : తెలంగాణ టీఅసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటయ్య వీరయ్యలను ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. 

 

ఒకరోజుపాటు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

హైదరాబాద్ : తెలంగాణ టీఅసెంబ్లీ సమావేశాల నుంచి కాంగ్రెస్ సభ్యును స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒకరోజు పాటు 9 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. 

09:45 - December 17, 2016
09:41 - December 17, 2016
09:41 - December 17, 2016

హైదరాబాద్ : పెద్దనోట్లు రద్దై 39 రోజులైంది. అయినా కరెన్సీన కష్టాలు మాత్రం తీరలేదు. ఏ.. ఏటీఎం చూసినా..ఏ బ్యాంకుకెళ్లినా సీన్‌ మాత్రం ఏమాత్రం మారడంలేదు. అవే క్యూలైన్లు, అవే కష్టాలు. జీతం పడి 15 రోజులు దాటినా ఉద్యోగస్థులు తమ జీతాన్ని తీసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు అటు ఉద్యోగులు, ఇటు సామాన్యులు.గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడలేక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సొమ్మసిల్లి పడిపోతున్నారు. మరికొంతమంది అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో క్యాష్‌ లేకపోవడంతో నిత్యావసరాలు, పాలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు శ్రీమంతుల ఇళ్లలో కోట్ల కొద్ది కొత్త కరెన్సీ బయటపడడాన్ని చూస్తున్న సామాన్యులు ఇదేంటని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. పెద్దోడికి ఒక న్యాయం,..పేదోడికి ఒక న్యాయమా అంటూ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆర్బీఐ, ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం మరో రెండు వారాల్లో అన్నీ సర్దుకుంటాయని చెప్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నగదు లావాదేవీలే సమస్యకు పరిష్కారమని సూచిస్తున్నాయి. 

 

09:36 - December 17, 2016

విజయవాడ : 20 సంవత్సరాలుగా రెండు లక్షల మంది రైతులను ఆదుకుంటున్న హెరిటేజ్‌ కంపెనీపై వైఎస్‌ జగన్‌ ఆరోపణలు చేయడం సమంజసం కాదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. వేలాది మంది హెరిటేజ్‌లో ఉద్యోగాలు పొందారని.. అలాంటి సంస్థపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.  అవసరమైతే ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని.. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని అన్నారు. 

 

09:35 - December 17, 2016

పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ నేత శ్రీనివాస్, బీజేపీ నాయకురాలు పాదూరి కరుణ పాల్గొని, మాట్లాడారు. నోట్ల రద్దుతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ సమాధానం చెప్పడానికి నిరాకరించారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..    

 

09:30 - December 17, 2016

హైదరాబాద్ : నేడు రెండో రోజు తెలంగాణ సమావేశాలు జరుగనున్నాయి. మరికాసేపట్లో సమావేశాలు ప్రారంభం కానున్నాయ. సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఇవాళ విద్యుత్ అంశంపై చర్చించన్నారు. ప్రభుత్వం 9 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు జీతభత్యాల పెంపు, తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సవరణ బిల్లు, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు సహా తొమ్మిది బిల్లులను సర్కార్ ప్రవేశపెట్టనుంది. ఈమేరకు టీఆర్ ఎస్ సభ్యులు జీవన్ రెడ్డి టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటట్లోనే.... పవర్ పై పవర్ ఫుల్ చర్చ జరుగనుంది. ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. గతంలో కరెంట్ అడిగితే గుర్రాలతో తొక్కించారు, కాల్పులు జరిపారు. మేము విద్యుత్ ను ఎల్లవేళలా ఇస్తున్నాం. ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా..? లేదా..? అనేది ముఖ్యం. చేయని పనులపై సర్కార్ ను నిలదీయండి' అని జీవన్ రెడ్డి చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నేడు రెండో రోజు టీ.అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఉ.11.30 గంటల వరకు ప్రశ్నోత్తరాలు, అనంతరం జీరో అవర్.. మ.12 గంటల నుంచి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై లఘు చర్చ జరుగనుంది. సభలో 9 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనమండలిలో నోట్ల రద్దుపై చర్చ జరుగనుంది. 

 

నేడు చెన్నైకి రాహుల్ గాంధీ

తమిళనాడు : నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైకి వెళ్లనున్నారు.  కావేరీ ఆస్పత్రిలో కరుణానిధిని రాహుల్ పరామర్శించనున్నారు.

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

ఢిల్లీ : హస్తినను పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. 52 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 12 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు.

పెద్ద నోట్లు రద్దై 39 రోజులైనా తీరని నగదు కష్టాలు

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దై 39 రోజులైనా ఇంకా నగదు కష్టాలు తీరడం లేదు.  95 శాతం ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంల ముందు భారీ క్యూలు కొనసాగుతున్నాయి.

09:03 - December 17, 2016

చిత్తూరు : తిరుపతిలో 104వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి 3 నుంచి 7 వరకు   తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఈ సమావేశాలు జరుగనున్నాయి.  వీటి ఏర్పాట్లపై యూనివర్సిటీ అధికారులతో  చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 
జాతీయ సైన్స్‌ సమావేశాలను ఘనంగా జరుపుతాం: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో తీరిక లేకుండా గడిపారు. మొదటగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హస్పట్‌లను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం తిరుపతి వేదికగా 104వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు సంబధించిన ఏర్పాట్లుపై యూనివర్శిటీ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశాలు జనవరి 3 నుంచి 7 వరకు జరగనున్నాయి.  
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అతిథ్యం 
జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అతిథ్యం ఇవ్వనుంది. 104వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను ఘనంగా నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.   సైన్స్‌పట్ల పిల్లలకు ఆసక్తి కలిగించేలా వీటిని జరుపుతామన్నారు.
తిరుపతిలో బర్డ్ ఆస్పత్రి భవనం ప్రారంభం
అంతకు ముందు చంద్రబాబు .. బాలాజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సర్జరీ బర్డ్‌ పేరుతో ఏర్పాటైన ఆస్పత్రి భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు.. తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రి ఉండటం సంతోషకరమన్నారు.. వైద్యంకోసం ఈ ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాల్ని వాడుతున్నారన్నారు. తిరుపతి పర్యటనలో సీఎం చంద్రబాబు హస్పటల్ ప్రారంభోత్సవం...జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల పై యూనివర్సిటీ అధికారులతో సమీక్షా సమావేశాలతో తీరిక లేకుండా గడిపారు. 

 

08:58 - December 17, 2016

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో డ్రగ్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టయింది. మైత్రీనగర్‌లోని ఓ ఇంటిపై నార్కోటిక్‌ సెల్‌ అధికారులు పోలీసుల సాయంతో దాడులు చేశారు. కోటి రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 100 కేజీల ఎస్టిలోఫాం, డులాక్సిటిన్‌, లివొసిటరిన్‌తో పాటు మరికొన్ని డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కృష్ణా జిల్లాకు చెందిన గడ్డం కృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడు

కూకట్‌పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో డ్రగ్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టయింది. మైత్రీనగర్‌లోని ఓ ఇంటిపై నార్కోటిక్‌ సెల్‌ అధికారులు పోలీసుల సాయంతో దాడులు చేశారు. కోటి రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 

08:56 - December 17, 2016

హైదరాబాద్ : నగదు కోసం పేదల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.  38 రోజులైనా  కరెన్సీ కష్టాలు తీరడం లేదు. ఏ బ్యాంక్‌కు వెళ్లినా అవే క్యూలైన్లు, అవే కష్టాలు. అటు ఉద్యోగులు, ఇటు సామాన్యులు నగదు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అటు  ప్రభుత్వ సంస్థలూ నష్టాలు చవిచూస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వ సంస్థలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం  
పెద్దనోట్ల రద్దు ప్రభావం ఏపీలో ప్రభుత్వ సంస్థలపై పడింది. రవాణాశాఖకు భారీగా నష్టం వాటిల్లినట్టు మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. ఆర్టీసీకి 45కోట్లు, ట్రాన్స్‌పోర్టుకు 10కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అయితే ఆర్టీసీ నష్టాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు శిద్ధా రాఘవరావు చెప్పారు.
ఎక్సైజ్‌శాఖపైనా పెద్దనోట్ల రద్దు ప్రభావం 
పెద్దనోట్ల రద్దు ఏపీ ఎక్సైజ్‌శాఖపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నోట్లరద్దు కారణంగా నవంబర్‌ నెలలో ఎక్సైజ్‌శాఖ 12శాతం ఆదాయం కోల్పోయినట్టు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.  ఈ నష్టాన్ని నివారించేందుకు  చాలా షాపుల్లో స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  తద్వారా ఆదాయం పెంచుకుంటామన్నారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనాలోచిత నిర్ణయం : మల్లాది విష్ణు
పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనాలోచిత నిర్ణయమని కాంగ్రెస్‌నేత మల్లాది విష్ణు అన్నారు.  కేంద్ర నిర్ణయంతో  సామాన్యులు అల్లాడిపోతున్నారని చెప్పారు.  మోదీ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే వెనకేసుకొస్తున్నారని.. ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  ఈనెల 23న వెలగపూడిలో నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు.
ప్రజలు అష్టకష్టాలు 
మరోవైపు పెద్దనోట్ల రద్దుతో ప్రజల అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఏ ఏటీఎం చూసినా.. ఏ బ్యాంకుకు వెళ్లినా  జనం క్యూలైన్లే  కనిపిస్తున్నాయి. నగదు కోసం పడిగాపులు కాస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పరిస్థితి మరింత దయనీయం
రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. వ్యవసాయ ఖర్చుల కోసం అన్నదాతలు బ్యాంకుల  చుట్టూ తిరుగుతున్నారు. పెట్టుబడి కోసం ఎక్కడ అప్పు దొరకక, బ్యాంకులో సరిపడ నగదు ఇవ్వకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని 38 రోజులైనా కరెన్నీ కష్టాలు తప్పకపోవడంతో ప్రభుత్వంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  నగదు నరకం తమకు ఇంకెన్నాళ్లని ప్రశ్నిస్తున్నారు. 

08:51 - December 17, 2016

ఢిల్లీ : నల్లధనం వివరాల వెల్లడికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఇవాల్టి నుంచి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని కేంద్రం అమలులోకి  తెస్తోంది. 2017 మార్చి 31 వరకు గరీబ్ కల్యాణ్ యోజన పథకం కొనసాగుతుందని రెవెన్యూశాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఇప్పటికే అనుమానిత డిపాజిట్లపై 3వేల మందికి నోటీసులు ఇచ్చామన్నారు. మొత్తం  రూ316 కోట్ల నగదు, రూ.70 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. ఆస్తులు ప్రకటించకుండా దాడుల్లో దొరికితే కఠన చర్యలు తీసుకుంటామని అధియా హెచ్చరించారు. ఆ డబ్బును పీఎంజీకేవై స్కీంకు మళ్లిస్తామన్నారు. నల్లధనం వివరాలు వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన  తెలిపారు. ఈ మెయిల్ ద్వారా నల్లకుబేరుల వివరాలు చెప్పవచ్చని... నల్లధనం వెల్లడించేందుకు మరో అవకాశం ఇస్తున్నాం అధియా ప్రకటించారు.  

 

08:49 - December 17, 2016

ఢిల్లీ : వాహనదారులకు మరోసారి మోడీ సర్కార్‌ పెట్రో షాక్‌ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌పై 2 రూపాయల 21 పైసలు, డీజిల్‌పై రూపాయి 79 పైసలు పెంచారు. పెట్రోల్‌, డీజిలు ధరలు పెరగడంతో  దేశవ్యాప్తంగా వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు
దేశంలో నగదు కష్టాలు కొనసాగుతుండగానే..మోదీ సర్కార్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచతూ జనాలకు మరో ఝలక్‌ ఇచ్చింది. లీటర్ పెట్రోల్ పై 2.21 పైసలు, డీజిల్ పై 1.79 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.  దీనికి తోడు రాష్ర్టాలు విధించే ట్యాక్స్‌లు అదనంగా ఉంటాయి. అయితే చమురు ఎగుమతి చేసే ఒపెక్ దేశాలు చమురు సరఫరాను తగ్గించాలని నిర్ణయించడంతో పెట్రో ధరలు భారీగా పెరగనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తి విషయంలో ఒపెక్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం భారత్ ను వణికిస్తోంది. చమురు ధరలను నియంత్రించే ఉద్దేశంతో జనవరి 1 నుంచి తమ  ఉత్పత్తులు తగ్గించేందుకు ఒపెక్ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. రోజుకి 1.2 మిలియన్ బారెళ్ల చొప్పున ఉత్పత్తి తగ్గించాలన్నది ఒపెక్ లోని 13 దేశాల మధ్య అంగీకారం కుదిరింది. రాబోయే కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
హైదరాబాద్‌లో 73 దాటిన లీటర్‌ పెట్రోల్‌ ధర
ఇటీవలే పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరగగా, డీజిల్ ధరలు తగ్గాయి. ఇప్పటికే కరెన్సీ కష్టాలతో అల్లాడుతున్న ప్రజలకు ధరల పెంపు మరింత భారం కానుంది. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర 73 దాటింది. తాజా పెంపుతో జూలై-2015 తర్వాత పెట్రోల్ ధర గరిష్ట  స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు అందుబాటులోనే ఉన్నప్పటికీ భారత్లో మాత్రం పెట్రోల్ రేటు పెరిగిపోతుండం గమనార్హం. ధరల పెంపుపై పూర్తి నిర్ణయాన్ని చమురు కంపెనీలకే కట్టబెట్టిన నేపథ్యంలో గత అక్టోబర్ నుంచి ఇంధన ధరల్లో పెరుగుదల, తరుగుదలలు గణనీయంగా చోటుచేసుకుంటున్నాయి. 

 

పెరియార్ నదిలో పడి నలుగురు గల్లంతు

కేరళ : విహార యాత్రలో విషాదం నెలకొంది. పెరియార్ నదిలో పడి నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ముగ్గురు విద్యార్థులు, రిసార్ట్ యజమాని ఉన్నారు. 

 

నేడు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

విశాఖ : నేడు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 

Don't Miss