Activities calendar

16 December 2016

21:53 - December 16, 2016

కరీంనగర్ : చారిత్రక నేపథ్యమున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటించడం తన పూర్వజన్మ సుకృతమని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తను నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ రిలీజింగ్‌ సభలో ఆయన మాట్లాడారు. వర్తమాన తరంతో పాటు.. భావి తరాలకూ శాతకర్ణి విశేషాలు అందించాలన్న సదుద్దేశంతో తెరకెక్కించిన ఈ సినిమా అందరి అభిమానాన్నీ చూరగొంటుందని బాలయ్య అభిప్రాయపడ్డారు.

డైలాగులతో అదరగొట్టిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్ఠాత్మక వందో చిత్రం.. గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని తిరుమల 70MM థియేటర్‌లో.. శుక్రవారం సాయంత్రం.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దర్శకుడు క్రిష్‌ ఆధ్వర్యంలో... చిత్రం హీరో బాలకృష్ణ ముఖ్య అతిథిగా అభిమానుల సందోహం నడుమ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. చారిత్రక నేపథ్యమున్న సినిమాలో నటించడం పట్ల నందమూరి బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. బాలకృష్ణ.. ఎప్పటిలాగే.. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంలోనూ.. తనదైన శైలిలో డైలాగులు పలికి అభిమానులను అలరించారు.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు
గౌతమీపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్‌.. కోటి రతనాల వీణ తెలంగాణలో.. కోటిలింగాల సాక్షిగా బాలయ్య వందోచిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ట్రైలర్‌ రిలీజ్‌కు ముందు.. ఉదయం, నందమూరి బాలకృష్ణ జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట దర్శకుడు క్రిష్‌ కూడా ఉన్నారు. బాలకృష్ణ... జగిత్యాలలోనే ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గౌతమీపుత్ర శాతకర్ణి.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. 

21:47 - December 16, 2016

గుంటూరు : చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు వైఎస్‌ జగన్‌. చంద్రబాబు మోసపూరిత పాలనకు అడ్డుకట్ట వేయాలంటే అందరూ ఏకం కావాలని గుంటూరు జిల్లాలో పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్‌రెడ్డి నరసరావుపేటలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈసందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

చంద్రబాబు పాలనతో ప్రజలంతా విసిగెత్తిపోయారు
చంద్రబాబు పాలనతో ప్రజలంతా విసిగెత్తిపోయారని.. చంద్రబాబు మోసపూరిత పాలనకు అడ్డుకట్ట వేయాలంటే అందరూ ఏకం కావాల్సిన అవసరముందన్నారు వైఎస్‌ జగన్‌. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్‌లాంటి యువకులు ముందుకు రావాల్సిన అవసరముందన్నారు.

సుద్దపల్లిలో దీక్ష చేస్తున్న రైతులకు జనగ్ పరామర్శ
అంతకుముందు చేబ్రోలు మండలం సుద్దపల్లిలో దీక్ష చేస్తున్న రైతులను పరామర్శించారు. రైతుల కడుపుకొట్టి చెరువు మట్టితో టీడీపీ నేతలు వ్యాపారాలు చేస్తున్నారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారన్నారు. గత మూడు రోజులుగా రైతులు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్‌ ఆరోపించారు. బాధితులకు వైఎస్‌ఆర్‌ పార్టీ అండగా ఉంటుందని.. చెరువులో మైనింగ్‌ వెంటనే నిలిపివేయకపోతే. తానే దీక్ష చేస్తానని జగన్‌ హెచ్చరించారు.

సర్పంచ్‌ కోటేశ్వరరావు కారును దగ్ధం చేయడంపై జగన్ ఆగ్రహం
అంతకుముందు విజయవాడ శివారులో నిడమనూరులో పర్యటించిన జగన్‌.. సర్పంచ్‌ కోటేశ్వరరావు కారును దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట విననివారిపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఒక సర్పంచిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం.. ఆఫీసుకు తాళం వేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇదే పద్ధతి కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని జగన్‌ హెచ్చరించారు.

 

21:43 - December 16, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి స్వాగతించారు. అసెంబ్లీ ప్రారంభం రోజునే.. పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌... నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. నోట్ల రద్దు తర్వాత వచ్చే పరిణామాలపై నిపుణులతో చర్చించకుండా మోదీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. నోట్ల రద్దును వ్యతిరేకించిన ఎంఐఎం, సీపీఎంలు.. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పెద్ద నోట్ల రద్దు అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ
ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ సభలో ప్రకటించారు. పెద్దనోట్లు రద్దు వంద శాతం అమల్లోకి వస్తే దేశంలో అద్భుతాలు జరుగుతాయన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం ఇక్కడ విమర్శించడం సరికాదని సూచించారు.

నోట్ల రద్దుపై ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దు : కేసీఆర్
నోట్ల రద్దుపై ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేయవద్దని కేసీఆర్‌ సూచించారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై కొంతమేర ఉందన్నారు. అయితే ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రజలంతా నగదు రహిత లావాదేవీల వైపు దృష్టి సారించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న నగదు ఇబ్బందులను ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లామన్నారు సీఎం.

సామన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు : జానారెడ్డి

ఏ టార్గెట్‌తో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారో ఆ లక్ష్యాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డి.. అయితే అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల సామన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిపుణులతో చర్చించి ముందు జాగ్రత్తలు తీసుకుని.. అమలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మోదీ నిర్ణయాన్ని స్వాగతించాలి : కిషన్ రెడ్డి
దేశంలో అవినీతిని అంతమొందించాలంటే మోదీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందన్నారు.

పెద్ద నోట్ల రద్దు వ్యతిరేకించిన ఎంఐఎం
ఇక పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వ్యతిరేకించారు. నోట్ల రద్దుతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దేశ ఆర్థికవ్యవస్థ పట్టాలు తప్పిందన్నారు.

పెద్ద నోట్లను రద్దు చేయలేదని.. మార్పిడి మాత్రమే : రేవంత్

కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయలేదని.. మార్పిడి మాత్రమే చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం నోట్లు రద్దు అయ్యాయని ప్రకటనలో పేర్కొందని.. దానిని సరిచేసుకోవాలని రేవంత్‌ సూచించారు.

పెద్ద నోట్ల రద్దు సీపీఎం వ్యతిరేకిస్తోంది : రాజయ్య
పెద్ద నోట్ల రద్దు తీరును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని సున్నం రాజయ్య తెలిపారు. అత్యధికంగా నిరక్ష్యరాస్యులు ఉన్న రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా సాధ్యమో చెప్పాలని రాజయ్య డిమాండ్‌ చేశారు.

నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : కేసీఆర్
శాసనసభలో పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చ ముగింపు సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. మంచి జరుగుతుందనే ఆశించే నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దేశంలో ఆర్థిక లావాదేవీలన్నీ నగదుతోనే నడుస్తుంటాయని ప్రజల ఇబ్బందులను తొలగించాలంటే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. కేసీఆర్‌ ప్రసంగం అనంతరం స్పీకర్‌ మధుసూదనాచారి సభను శనివారానికి వాయిదా వేశారు.

21:37 - December 16, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై ఎలాంటి చర్చ జరుగకుండానే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే సభ సజావుగా సాగకపోవడానికి విపక్షాలే కారణమని కేంద్రమంత్రి అనంతకుమార్‌ విమర్శించారు. వేసవికాలంలో జరిగే పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేలా చూస్తామన్నారు.

పార్లమెంట్‌ ఉభయ సభలు నిరవధిక వాయిదా
పార్లమెంట్‌ ఉభయ సభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. శుక్రవారం లోక్‌సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఆ తర్వాత వెంటనే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ జీరో అవర్‌ చేపట్టారు. అనంతరం దివ్యాంగుల హక్కుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. శీతాకాల సమావేశాల చివరి రోజున ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై స్వల్ప చర్చ జరిగింది. దివ్యాంగుల రిజర్వేషన్‌ శాతాన్ని 4 నుంచి 5కు పెంచే సవరణకు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ సభ్యులు డివిజన్‌ కోరగా ఓటింగ్‌లో వీగిపోయింది. ఆ తర్వాత కొన్ని ప్రతిపాదనలతో ప్రధాని మోదీ సమక్షంలో దివ్యాంగుల హక్కుల బిల్లు ఆమోదం పొందింది. ఆ వెంటనే సభను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నిరవధిక వాయిదా వేశారు.

పెద్దనోట్ల రద్దుపై జరగని చర్చ
నవంబర్‌ 16న ప్రారంభమైన లోక్‌సభలో పెద్దనోట్ల అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచించాయి. నోట్ల రద్దుపై చర్చకు పలుమార్లు విపక్షాలు పట్టుబట్టాయి. సభలోనే ఆందోళన నిర్వహించాయి. ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్‌ చేశాయి. అయినా పెద్దనోట్లరద్దుపై ఎలాంటి చర్చ జరుగలేదు. సభకు మోదీ పలుమార్లు హాజరైనా ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. దీంతో నోట్లరద్దుపై ఎలాంటి చర్చ జరుగకుండానే సమావేశాలు ముగిశాయి. అంతేకాదు.. ఏ అంశంపైనా లోక్‌సభలో సమగ్రంగా చర్చ జరగలేదు.

నిరవధికంగా వాయిదాపడ్డ రాజ్యసభ
రాజ్యసభ కూడా నివరధికంగా వాయిదా పడింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ప్రకటించారు. రాజ్యసభలోనూ పెద్దనోట్ల రద్దుపై ఎలాంటి చర్చ జరగలేదు. శీతాకాల సమావేశాలు మొత్తం పెద్దనోట్లు రద్దు అంశం చుట్టూనే తిరిగినా అధికారపక్షం చర్చ మాత్రం జరుపలేకపోయింది. అధికార, విపక్ష పార్టీలు నువ్వానేనా అన్నట్టు ఆధిపత్య ధోరణి కనబర్చడంతో ఈసారి సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిసిపోయిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు
సభలు సజావుగా సాగకపోవడానికి విపక్షాలే కారణమని కేంద్రమంత్రి అనంతకుమార్‌ ఆరోపించారు. నెలరోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో లోక్‌సభ కేవలం 17.04శాతం మాత్రమే పనిచేసిందని... రాజ్యసభ 20.61శాతం నడిచిందని తెలిపారు. ఈ సమావేశాల్లో లోక్‌సభలో నాలుగు, రాజ్యసభలో ఒక బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. వేసవికాలంలో జరిగే పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేలా చూసకుంటామని ఆయన తెలిపారు. మొత్తానికి ఎలాంటి ఫలితాలు ఇవ్వకుండానే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి.

21:34 - December 16, 2016

ఢిల్లీ : తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్నారు.. పాలక పక్షం తనను పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని ఆగ్రహించారు...! ఇలా తన కామెంట్స్‌తో రాజకీయవర్గాల్లో ఉత్సుకతను నింపిన రాహుల్‌గాంధీ అనూహ్య చర్యతో మొత్తం వ్యవహారాన్ని తుస్సుమనిపించారు. రాహుల్‌ చర్య వల్ల.. విపక్షాల ఐక్యతకు భంగం వాటిల్లిందన్న ప్రచారం మీడియాలో హోరెత్తింది.

మాట్లాడితే భూకంపం వస్తుందన్న రాహుల్‌
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయం.. మరోసారి చర్చనీయాంశమైంది. తాను మాట్లాడితే భూకంపం వస్తుందని.. ప్రధాని మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారం తనవద్ద ఉందని ప్రకటనలు గుప్పించిన రాహుల్‌.. పార్లమెంటు సమావేశాల చివరి రోజున.. అనూహ్యంగా ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. నోట్ల రద్దు అంశంపై కాంగ్రెస్‌తో కలిసి పోరాడుతున్న బీజేపీయేతర విపక్షాల నేతలెవరికీ చెప్పకుండా.. రాహుల్‌.. మోదీతో భేటీ కావడం చర్చనీయాంశమైంది.

గాంధీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకూ ర్యాలీ ప్రతిపాదన
పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రజల ఇబ్బందుల గురించి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని విపక్షాలు అంతకుముందే నిర్ణయించాయి. పార్లమెంటు భవన్‌లోని గాంధీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకూ ర్యాలీగా వెళ్లాలన్న కాంగ్రెస్‌ ప్రతిపాదనకు, ఆర్జేడీ, జేడీయూ, సమాజ్‌వాదీ, బీఎస్పీ, సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర జాతీయ పార్టీలన్నీ ఆమోదం తెలిపాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో.. రాహుల్‌గాంధీ మాటమాత్రంగానైనా చెప్పకుండా.. ర్యాలీకి కొద్దిసేపటి ముందు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దీంతో వామపక్షాలు సహా, ఎస్పీ, బీఎస్పీ, ఎన్‌సీపీ లు చివరి నిమిషంలో ర్యాలీ నుంచి తప్పుకున్నాయి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా మిగిలిన పార్టీల నాయకులనే వెంటబెట్టుకుని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.

యూపీ రైతుల రుణమాఫీ కోసమే మోదీతో భేటీ : రాహుల్‌
ఉత్తర ప్రదేశ్‌ రైతుల సమస్యలను చర్చించేందుకే ప్రధానిని కలిశానని రాహుల్‌ వివరణ ఇచ్చినా.. కాంగ్రెసేతర పక్షాలు సంతృప్తిని చెందలేదు. బీఎస్పీ నేతలైతే తమ రాష్ట్ర సమస్యలపై తమను కలుపుకోక పోవడం ఏంటని ప్రశ్నంచారు. ఈ తరుణంలో రాష్ట్రపతిని కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న భావనతోనే ర్యాలీకి దూరంగా ఉన్నట్లు సీపీఎం ప్రకటించింది.

విపక్షాల ఆగ్రహానికి గురైన రాహుల్‌..
తన చర్యతో విపక్షాల ఆగ్రహానికి గురైన రాహుల్‌.. పోనీ ప్రధాని నుంచి సానుకూల హామీని పొందారా అంటే అదీ లేదు. తరచూ ఇలా భేటీ కావాలన్న సూచన మాత్రమే దక్కింది. తన విజ్ఞప్తిపై మోదీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని సాక్షాత్తు రాహుల్‌గాంధీయే వెల్లడించారు.

రాహుల్‌ చర్యతో విస్తుపోతున్న కాంగ్రెస్‌ సీనియర్లు
మొత్తానికి ప్రధానిని ఇరుకున పెట్టే సమాచారం ఉందన్న రాహుల్‌.. ఇలా అనూహ్యంగా మోదీతో భేటీ కావడంపై విపక్ష నేతలే కాదు.. కాంగ్రెస్‌ సీనియర్లూ విస్తుపోతున్నారు. నోట్ల రద్దుపై విపక్షాల ఐక్య ఉద్యమాన్ని రాహుల్‌ చర్య నీరుగార్చిందన్న భావన వ్యక్తమవుతోంది. 

21:28 - December 16, 2016

ఢిల్లీ : వాహనదారులపై మరోసారి పెట్రో వడ్డన పడింది. చమురు కంపెనీలు మరోసారి పెట్రోలు ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 2 రూపాయల 21 పైసలు,.. లీటర్‌ డీజిల్‌పై రూపాయి 79 పైసలు పెంచాయి. పెరిగిన కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 

మరోసారి పెట్రో వడ్డన..

ఢిల్లీ : పెట్రో ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ.2.21 పైసలు, డీజిల్ పై రూ.1.79పైసలు పెరిగాయి. పెరిగిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, చమురు ఎగుమతి చేసే ఒపెక్ దేశాలు చమురు సరఫరాను తగ్గించాలని నిర్ణయించడంతో ‘పెట్రో’ధరలు భారీగా పెరగనున్నాయనే వార్తలు హల్ చల్ చేశాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.6కు పెరగనుందని, వాహనచోదకులు జాగ్రత్తపడాలనే వార్తలు వినిపించడం తెలిసిందే.

బ్యాంకు మేనేజర్ పై దాడి..

హైదరాబాద్: నయాపూల్‌లో ఎస్‌బీహెచ్ బ్యాంకు మేనేజర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల్లో ఒకరైన ఎస్‌బీహెచ్ ఖాతాదారుడికి ఫోన్ చేసిన ఆన్‌లైన్ మోసగాళ్లు పిన్ నంబర్ అడిగి ఖాతాదారుడి రూ.25 వేలు స్వాహా చేశారు. బ్యాంకు మేనేజరే మోసానికి పాల్పడ్డాడనే అనుమానంతో నిందితుడు దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

21:00 - December 16, 2016

పండిత పుత్ర పరమ శుంఠ అన్నట్లుగా వుంది లోకేసు బాబు యవ్వారం..సొంతపార్టీని సోయలేకుండా తిడతాటడు..తెలంగాణ అసెంబ్లీల నిమ్మలమైన వాతావరణం వుందల్లా..కడిగిపారేత్తాం..సీరి చింతకి కట్లేత్తామని బీరాలు పలికిన సర్కారు..సల్లంగా చర్చలు జరిపినాది. బతుకుతెరు కొట్లను కొట్టిపడేత్తాన్న బల్దియా బాబులు...మరి సిన్మీ ఈరో నాగార్జున ఎన్ కన్వెన్షను జోలికెందుకెల్లలే? పండిత పుత్ర పరమ శుంఠ అన్నట్లుగా వుంది లోకేసు బాబు యవ్వారం..సొంతపార్టీని సోయలేకుండా తిడతాటడు..మరోపక్క పవన కళ్యాణ్ ట్విట్లర్ల యుద్ధం చేస్తాండు..నల్లగుడ్డ కట్టుకోని మౌనవ్రతం సేత్తన్న హనుమంతన్న..చదువుల అమాత్యులు కడియం సారు ఇంటి ముట్టడికి విద్యార్థుల యత్నం..అరెస్ట్ జేసిన పోలీసోల్లు.. చిలకలూరి పేటలో దేవుళ్ళను కిడ్నాప్ జేసిన దొంగోల్లు..అరెస్ట్ పోలీసోల్లు..ఎతికి పట్కవచ్చి స్టేషన్ల పెట్టిన పోలీసోల్లు..గదే రాములోరి ఫ్యామిలీని సీతమ్మ..రామయ్య ..లచ్చమన్న పంచలోహ విగ్రహాలను దొంగలు కిడ్నాప్ చేసిండు..గదే ఎత్తికెల్లారు..పాములనుపట్టిన పోరగాల్లు..

20:45 - December 16, 2016

పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తున్న సందర్భంగా.. అవినీతిని అంతం చేసేందుకు.. నల్లధనాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. విపక్షాలు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. మన్మోహన్‌సింగ్‌, దివంగత ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించి మాధవ్‌ గుంగుట్లే రాసిన పుస్తకంలోని వాక్యాలను ఆయన చదివి వినిపించారు. 1971లో నోట్ల రద్దు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ఆలోచించారని మోదీ విమర్శించారు. ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ సహా.. వామపక్షాల నేతలనూ ఆయన తన ప్రసంగంలో విమర్శలు గుప్పించారు. వామపక్షాలపైనా ఆక్రోశం వెళ్లగక్కారు. గతంలో వామపక్ష నేతలు చేసిన ప్రసంగాలను చదివి వినిపిస్తూ... వామపక్షాలు నోట్లరద్దును రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ అంశంపై టెన్ టీవీ చర్చ నిర్వహించింది. ఈ చర్చలో బాబూరావు (సీపీఎం నేత) పుష్పలీల (మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత) ఇందిర (కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. వక్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను క్లిక్ చేయండి..

ముద్రగడ మరో ఉద్యమానికి రంగం సిద్ధం..

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఈ నెల 18నుంచి దశలవారీగా ఉద్యమం చేయనున్నట్టు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. జనవరి 25న పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. 18న 13 జిల్లాల్లో కంచాలు, గరిటెలతో శబ్ధాలు చేస్తూ నిరసన, 30న ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం, జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన, జనవరి 25న పాదయాత్ర చేయనున్నట్టు వివరించారు. ఈ నెల 18న తాడేపల్లి గూడెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్టు తెలిపారు.

వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్ జూనియర్ హాకీ ..

ఢిల్లీ: జూనియర్ హాకీ ప్రపంచకప్ ఫైనల్‌కు భారత జట్టు చేరుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుపై నెగ్గింది. 2001 తరువాత జూనియర్ హాకీ ప్రపంచకప్ ఫైనల్‌కు భారత జట్టు చేరుకుంది. ఈ నెల 18న ఫైనల్‌లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.

19:53 - December 16, 2016

ఢిల్లీ : అవినీతి అంతం, నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ సహా.. వామపక్షాల నేతలనూ ఆయన తన ప్రసంగంలో విమర్శలు గుప్పించారు.

మన్మోహన్‌, ఇందిరాగాంధీలపై మోదీ విమర్శనాస్త్రాలు
పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్షాల ఆందోళనలపై ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా.. అవినీతిని అంతం చేసేందుకు.. నల్లధనాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. విపక్షాలు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని ఆయనన్నారు. ఈ సందర్భంగా మన్మోహన్‌సింగ్‌, దివంగత ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించి మాధవ్‌ గుంగుట్లే రాసిన పుస్తకంలోని వాక్యాలను చదివి వినిపించారు. 1971లో నోట్ల రద్దు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ఆలోచించారని మోదీ విమర్శించారు.

వామపక్షాలపైనా మోదీ ఆక్రోశం
బీజేపీ పార్లమెంటరీ పార్టీని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. వామపక్షాలపైనా ఆక్రోశం వెళ్లగక్కారు. గతంలో వామపక్ష నేతలు చేసిన ప్రసంగాలను చదివి వినిపిస్తూ... వామపక్షాలు నోట్లరద్దును రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వల్లే పారదర్శకత : -మోదీ
దేశ ప్రజలంతా డిజిటల్‌ బాట పట్టాలని, నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వల్ల పారదర్శకత ఏర్పడుతుందని అన్నారు. వ్యాపారుల డిజిటల్‌ లావాదేవీల ఆధారంగా.. వారి గత ఖాతాలను వెలికి తీస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మోదీ తోసిపుచ్చారు. వ్యాపారుల గత ఖాతాలను తవ్వితీసే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు.

డిజిటల్‌ లావాదేవీల ప్రోత్సాహానికి బహుమతుల పథకం -మోదీ
డిజిటల్‌ లావాదేవీల ప్రోత్సాహానికి బహుమతుల పథకాన్ని ప్రకటించామని, దీని గురించి పార్టీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల 50 రోజుల వరకు ఇబ్బందులు తప్పవని.. నవంబర్‌ 8వ తేదీనే తాను ప్రకటించానని.. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోందని.. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని మోదీ తెలిపారు. 

19:49 - December 16, 2016

విజయనగరం : ప్రముఖ హీరోయిన్‌ ప్రణీత విజయనగరంలో సందడి చేసింది. ఆల్ఫా గ్రాండ్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రణీత.. కాసేపు అభిమానులను అలరించింది. ప్రణీతను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. తొలిసారి విజయనగరం వచ్చానని.. ఇక్కడకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రణీత.

19:46 - December 16, 2016

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తనదైన శైలిలో ప్రశ్నిస్తాన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఐదు అంశాలపై వరుసగా ఐదురోజులు తన ప్రశ్నలుంటాయన్న పవన్ రెండవ రోజు రోహిత్ వేముల అంశంపై వరుస ట్వీట్లు చేశారు. వేధింపుల వల్లే రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

రోహిత్‌ వేముల అంశంపై వరుస ట్వీట్లు చేసిన పవన్
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య అంశంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌లో స్పందించారు. శుక్రవారం రోహిత్‌ వేముల అంశంపై వరుస ట్వీట్లు చేశారు. లక్షలాది ఇతర భారతీయుల్లాగే రోహిత్‌ బీజేపీను వ్యతిరేకించారు. అంతమాత్రాన బీజేపీ అతడిని వేధించాలా? అని ప్రశ్నించారు. ఓ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించనంత మాత్రాన వ్యక్తులను వేధించే లైసెన్సు వారికి ఎవరిచ్చారు? అని పవన్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. పైగా అతడు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలుపుతున్నపుడు ఎలా జోక్యం చేసుకుంటారు? అని తన ప్రశ్నలను సంధించారు. ఇది బీజేపీకే కాదు ఏ పార్టీకైనా వర్తిస్తుందని పవన్ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.

కేంద్రం విద్యార్థుల దృక్పథాల మధ్య భేదంగానే చూడాల్సింది: పవన్
రోహిత్ వేమలు ఒకవేళ ఆ పరిస్థితుల్లో తొందరపడి కాషాయీకరణ గురించి విశ్వవిద్యాలయంలో తన వ్యతిరేక వర్గంతో ఏమన్నా అని వున్నా.. కేంద్రం దాన్ని విద్యార్థుల దృక్పథాల మధ్య భేదంగానే చూడాల్సి ఉందన్నారు.. ఒక వేళ వారి శత్రుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందనుకుంటే సంబంధిత విభాగం ద్వారా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందని పవన్ అన్నారు. కానీ కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుందో కారణం తెలియడం లేదు పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కేంద్రం వ్యక్తిగతంగా తీసుకోవడంతో రోహిత్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది: పవన్
కేంద్రం ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడంతో రోహిత్‌ వేములకు క్యాంపస్‌ నుంచి సస్పెన్షన్‌తో పాటు వెలివేత శిక్ష పడింది. అదే అతడిని ఆత్మహత్యకు పురికొల్పిందని పవన్ అన్నారు. తన వర్గంనుంచి అవసరమైన నైతిక బలం లభించకపోవడం కూడా అందుకు మరో కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సమానత్వానికి తావు లేదని తెలియడం వల్ల అతనికి కోపం, నిరాశ కలిగివుంటాయన్నారు పవన్. మానవీయ దృక్పథంతో మంచి కౌన్సెలింగ్‌ లభించి ఉంటే తాత్విక చింతన గల ఒక తెలివైన విద్యార్థి ప్రాణాలు కాపాడుకునేవాళ్లమని పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రోహిత్‌ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ రాజకీయం చేయడం విచారకరం : పవన్
రోహిత్‌ వేముల ఆత్మహత్యను బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ రాజకీయం చేయడం పట్ల పవన్ విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రోహిత్ ఆత్మహత్య అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటే మరోవైపు బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆయన దళితుడు కాదని నిరూపించడంలో నిమగ్నమయ్యాయని పవన్ విమర్శించారు. అయితే అందరూ ఒక ప్రశ్నను మాత్రం మర్చిపోయారు.. భవిష్యత్తులో యువత ఇలా నిరాశా నిస్పృహలతో ప్రాణాలు తీసుకోకుండా చూడాలంటే ఏం చేయాలనే విషయాన్ని వారు విస్మరించారన్నారు. ఎప్పటికైనా మన యూనివర్శిటీలు విద్యా వేదికలుగా నిలుస్తాయని.. రాజకీయ పార్టీలకు యుద్ధభూములు కావని ఆశిస్తానంటూ పవన్ ముగించారు. పవన్ శనివారం దేశభక్తి అంశంపై తనదైన శైలిలో ప్రశ్నలు సంధించనున్నారు.

19:40 - December 16, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బుట్టా రేణుక కోరారు. నల్లధనం నియంత్రణలో వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని సూచించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకునేముందు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఆలోచించి ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు.

19:36 - December 16, 2016

గుంటూరు : జిల్లాలోని.. పలు ప్రాంతాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈరోజు పర్యటించారు. చెరువులో మైనింగ్‌కు వ్యతిరేకంగా సుద్దపల్లిలో రైతులు చేస్తున్న దీక్షను.. సందర్శించి.. మద్దతు పలికారు. ఇక్కడ మైనింగ్‌ వెంటనే నిలిపివేయాలని .. లేదంటే తనే దీక్ష చేస్తానని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. రైతులు కడుపుకొట్టి.. చెరువు మట్టితో టీడీపీ నేతలు వ్యాపారాలు చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. అనంతరం జిల్లాలోని నరసరావుపేటలో జరగబోయే బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. జగన్‌ సమక్షంలో కాసు మహేష్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు.

19:33 - December 16, 2016

చిత్తూరు : 104వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను ఘనంగా నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సైన్స్‌పట్ల పిల్లలకు ఆసక్తి కలిగించేలా వీటిని జరుపుతామన్నారు. జనవరి 3 నుంచి 7 వరకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో సైన్స్‌ సమావేశాలు జరుగనున్నాయి. వీటి ఏర్పాట్లపై యూనివర్సిటీ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.  

నోట్ల మార్పిడి కేసులో ఎస్సై అరెస్ట్..

మెదక్ : నిజాయితీగా వుండాల్సిన పోలీసులు అవినీతికి పాల్పడితే..నీతి తప్పితే ఇదిగో ఈ ఎస్సైకి పట్టిన గతే పడుతుంది.నోట్ల మార్పిడి ముఠాతో కలిసి మోసానికి పాల్పడిన కేసులో మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎస్సై ఆనంద్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. రూ.91.78 లక్షలు లూటీ చేసిన కేసులో ఆనంద్ గౌడ్ తో పాటు కాళ్ల కల్ వార్డు మెంబర్ వెంకటేష్, మరో ముగ్గురిని తూప్రాన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.34.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు రిమాండ్ విధించారు.

19:20 - December 16, 2016

అందరూ కొత్తవారితో వస్తున్న సినిమా `అమీర్ పేట‌లో` కెరీర్ కోసం అమీర్ పేట వచ్చినవారి జీవన శైలిని అభివర్ణిస్తూ తీసిన సినిమా అమీర్ పేటలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'శ్రీ' హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన అమీర్ పేటలో సినిమా.ప్రస్తుతం యూత్ జీవన శైలి..సాఫ్ట్ వేర్ ఉద్యోగం..వంటి లక్ష్యంతో అమీర్ పేట వచ్చిన యూత్ ఎక్కడో ఓ చోట ఈ సినిమా మ్యాచ్ అవుతుంది. ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉంది? కొత్తవారు చేసిన ఈ ప్ర‌య‌త్నం ప్రేక్షకులను ఎంత వ‌ర‌కూ ఆక‌ట్టుకొంది? అనేది తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..టెన్ టీవీ ఇచ్చిన రేటింగ్ చూడాలంటే కూడా ఈ వీడియో చూసి తీరాల్సిందే..

19:06 - December 16, 2016

తొలిసారిగా కామెడీ స్టార్ 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్ లో నటించిన 'మీలో ఎవడు కోటీశ్వరుడు' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ సినిమా ' మీలో ఎవరు కోటీశ్వరుడు'. కామెడీ నటుడు పృథ్వీ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, శృతిసోథీ, సలోనిలు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. తొలిసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పృథ్వీకి మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ అందించిందా..? సత్తిబాబు, తన కామెడీ ఫార్ములాతో మరోసారి ఆకట్టుకున్నాడా..? లేదా అనే విషయం తెలుసుకోవాలా. టెన్ టీవీ అ సినిమాకు ఎంత రేటింగ్ ఇచ్చిందో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.. 

18:57 - December 16, 2016

లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన కామెడీ ఎంటర్ టైనర్ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ . బండి భాస్కర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ జనాన్ని మెప్పించిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. టాలీవుడ్ లో కొత్త కొత్త దర్శకులు, అందులోనూ కుర్ర దర్శకులు వస్తుండడం వల్ల ఒక విధంగా మంచే జరుగుతోంది. కొత్తగా ఆలోచిస్తున్నారు, కొత్తగా తీయాలని ఆలోచిస్తున్నారు, జనానికి ఏది కావాలో అదే ఇవ్వాలనుకుంటున్నారు, నేల విడిచి సాము చేయకుండా ఉన్నంతలోనే సినిమాని జనరంజకంగా మలిచి నిర్మాతలకు కాసులు కురిపించాలని తపిస్తున్నారు. అలాంటి ఓ మంచి ప్రయత్నమే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరుకూ ప్రేక్షకుల్ని నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు కొత్త దర్శకుడు బండి భాస్కర్. అంతేకాదు కథను ఏమాత్రం డీవియేట్ చేయకుండా, తనేం చెప్పాలనుకున్నాడో అదే విషయాన్ని చాలా సెన్సిటివ్ గా స్మూత్ గా చెప్పాడు దర్శకుడు. ఒకమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించి ఫైనల్ గా ఒకర్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోవడం చాలా ఫన్నీ పాయింట్ . అలాంటి ఫన్నీ ఆలోచనతోనే బోలెడన్ని కామెడీ సీన్స్ రాసుకొని ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని అందించాడు దర్శకుడు. ఈ సినిమాకు టెన్ టీవీ ఇచ్చింన రేటింగ్ కోసం ఈ వీడియో చూడండి..

18:49 - December 16, 2016
18:45 - December 16, 2016

ఆదిలాబాద్‌ : జిల్లాలోని పులిమడుగు ప్రాజెక్టు సాధన కోసం సీపీఎం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హమీ ఇచ్చారు. సీపీఎం పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించేటట్లు ప్రయత్నిస్తామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కమీషన్లకు ఆశపడి పెద్ద ప్రాజెక్టులపైనే ప్రభుత్వం దృష్టిసారిస్తోందని విమర్శించారు.  

18:40 - December 16, 2016

ఢిల్లీ : అవినీతి అంతం, నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ సహా.. వామపక్షాల నేతలనూ ఆయన తన ప్రసంగంలో విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించి మాధవ్‌ గుంగుట్లే రాసిన పుస్తకంలోని వాక్యాలను చదివి వినిపించారు. 1971లో నోట్ల రద్దు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ఆలోచించారని మోదీ విమర్శించారు. 

మార్కెట్ యార్డ్ పై రైతుల దాడి..

మహబూబ్ నగర్ : నారాయణపేట మార్కెట్ యార్డ్ పై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కందిపంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

లంచం తీసుకుంటూ పట్టుపడ్డ సీవో..

ప్రకాశం : మార్కాపురం వాటర్ షెడ్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ సీవో త్రిపురారెడ్డి పట్టుపడ్డాడు.

జయ మృతిపై శశికళకు హైకోర్టు నోటీసులు..

తమిళనాడు : దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళకు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జయలలిత మృతి..అపోలో ఆసుపత్రిలో ఆమెకు అందిన వైద్యం విషయాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని శశికళకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా జయలలిత మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కోర్టులో పిటీషన్లు జారీ అవుతున్న క్రమంలో ఈ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. కాగా జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందిన విషయం తెలిసిందే. 

17:53 - December 16, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని ఏజెంట్‌గా మాట్లాడారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ ముందు ప్రజల కష్టాలు, ఇబ్బందులను తెలుసుకోవాలని సూచించారు. కేంద్ర నిర్ణయంతో అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

17:38 - December 16, 2016

ఢిల్లీ : నల్లకుబేరులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. బ్లాక్ మనీ వెల్లడించేందుకు కేంద్రం ఓ మెయిల్ ఐటీని రూపొందించింది. శనివారం నుండి నల్లధనాన్ని తెల్లగా మార్చుకొనే స్కీంను ప్రవేశ పెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆర్థిక శాఖ 50 శాతం పన్ను చెల్లించి నల్లధనాన్ని తెల్లగా మార్చుకొనే వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. శనివారం నుండి మార్చి 31,2017 వరకూ రెండో విడత ఐడీఎస్ స్కీమ్ వర్తించనున్నట్లుగా కేంద్రం తెలిపింది. నల్లకుబేరుల వివరాలు..వారి పేర్లు చెప్పినవారి వారి వివరాలను గోప్యంగా వుంచుతామని కేంద్రం ప్రకటించింది. వాటికి సంబంధించిన వివరాలు తెలిపేందుకు ఓ మెయిల్ ఐటీని కూడా కేంద్రం రూపొందించినట్లుగా పేర్కొంది. కాగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం అనంత‌రం నిర్వ‌హిస్తోన్న సోదాల్లో నల్ల ‌కుబేరుల వద్ద భారీ మొత్తంలో డబ్బు ప‌ట్టుబ‌డుతున్న నేప‌థ్యంలో కేంద్ర మ‌రో ప్ర‌క‌ట‌న‌ చేసినట్లుగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా జరుపుతున్న లావాదేవీలపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు నిఘా ఉంచారని తెలిపింది.

17:22 - December 16, 2016
17:06 - December 16, 2016

హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలపై జీహెచ్ ఎంసీ కొరడా ఝుళిపించింది. ఈ క్రమంలో దిల్ సుక్ నగర్, మలక్ పేట ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ..ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా అధికారులు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంత వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ తొలగిస్తున్న విషయం తెలిసిందే. కాగా నగరంలో పలు ప్రాంతాలలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు నాణ్యతా లోపంతో కూలిపోయి నిరుపేద కూలీలు అసువులు బాసిన విషయం తెలిసిందే. 

దిల్ సుఖ్ నగర్ లో ఆక్రమణల కూల్చివేత..

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. శుక్రవారం సాయంత్రం ఫుట్ పాత్ లపై వెలిసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. మలక్ పేట నుండి దిల్ సుఖ్ నగర్ వరకు ఆక్రమణలను తొలగించారు. వ్యాపారులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

16:58 - December 16, 2016

ఢిల్లీ : లోక్‌సభ నివధికంగా వాయిదాపడింది. నవంబర్‌ 16న ప్రారంభమైన లోక్‌సభలో పెద్దనోట్ల రద్దుపై ఎలాంటి చర్చ జరుగలేదు. విపక్ష సభ్యులు ఈ అంశంపై పలుమార్లు చర్చకు పట్టుబట్టారు. ప్రధాని మోడీ మాట్లాడాలని కోరారు. అయినా పెద్దనోట్ల రద్దుపై ఎలాంటి చర్చ జరుగలేదు. పలుమార్లు సభకు ప్రధాని మోడీ హాజరుఅయినా ఎలాంటి ప్రసంగం చేయలేదు. దీంతో పెద్దనోట్ల రద్దుపై ఎలాంటి చర్చ జరుగలేదు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ఏ అంశంపైనా సమగ్రంగా చర్చ జరుగలేదు.
ఆధిపత్య ధోరణి కొనసాగిన రాజ్యసభ
రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. ఇవాళ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే సభను వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ప్రకటించారు. నవంబర్‌ 16న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు మొత్తం పెద్దనోట్ల రద్దు అంశం చుట్టూనే తిరిగాయి. ప్రధాని మోదీ సభకు హాజరై పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చలో పాల్గొనాలని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అధికార, విపక్ష పార్టీలు నువ్వానేనా అన్నట్టు ఆధిపత్య ధోరణి కనబర్చడంతో ఈసారి సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

16:55 - December 16, 2016

గుంటూరు : ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్ల దాడులను ప్రోత్సాహించేందుకే..దేశభక్తిపై పిచ్చి నిబంధనలు పెడుతున్నారని.. ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. అలాగే నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా 120 మంది చనిపోయారని.. వీటిని మోదీ చేసిన హత్యలుగానే భావించాలని అన్నారు.

నల్లధనం తెల్లగా మార్చుకొనే స్కీం..

ఢిల్లీ : రేపటి నుండి నల్లధనాన్ని తెల్లగా మార్చుకొనే స్కీంను ప్రవేశ పెడుతున్నట్లు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి వెల్లడించారు. 50 శాతం పన్ను చెల్లించి నల్లధనాన్ని తెల్లగా మార్చుకొనే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. మార్చి 31 వకరు ఈ స్కీం అమలు ఉంటుందన్నారు. నోట్ల రద్దు అనంతరం జరిగిన లావాదేవీలపై విచారణ చేపడుతామని ఈమెయిల్ ద్వారా నల్లధనంపై సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఇప్పటి వరకు 393 కోట్ల నల్లధనం జప్తు చేస్తామన్నారు.

16:52 - December 16, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారన్నారు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. ఈ నిర్ణయం అమలులో కొన్ని సమస్యలుఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు.. త్వరలో ఇవన్నీ పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.. నోట్లరద్దుపై తాము చర్చకు సిద్ధమని ప్రకటించినా... ప్రతిపక్షాలు చర్చ చేపట్టకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు..

లంచం తీసుకుంటూ పట్టుబడిన వాటర్ షెడ్ సీవో...

ప్రకాశం : మార్కాపురం వాటర్ షెడ్ కార్యాలయంపై ఏసీబీ దాడి చేసింది. రూ. 20వేలు లంచం తీసుకుంటున్న సీవో త్రిపురారెడ్డిని పట్టుకున్నారు.

16:49 - December 16, 2016

చిత్తూరు : తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రి ఉండటం సంతోషకరమన్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... బాలాజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సర్జరీ బర్డ్‌ పేరుతో ఏర్పాటైన ఆస్పత్రి భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు.. వైద్యంకోసం ఈ ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాల్ని వాడుతున్నారని చెప్పుకొచ్చారు.. ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్లను చంద్రబాబు అభినందించారు..

తొలి రోజు ముగిసిన ఆట..

చెన్నై : భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 284/4. బోయ్ రూట్ 88, జానీ బైర్ స్టో 49 పరుగులు చేశారు. మోయిన్ ఆలీ 120, స్ట్రోక్స్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. జడేజాకు మూడు వికెట్లు, ఇశాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

 

సౌర విద్యుత్ స్కాంలో ముగ్గురికి జైలు శిక్ష..

చెన్నై : సౌర విద్యుత్ కుంభకోణం కేసులో ముగ్గురికి జైలు శిక్ష పడింది. సరిత, బిజు రాధాకృష్ణన్ కు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.

16:17 - December 16, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ..పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు.డిజిటల్ లావాదేవీలతో సైబర్ క్రైమ్ పొంచివుందన్నారు. అనాలోచిత నిర్ణయంతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు.ఇది ప్రజాహక్కుల ఉల్లంఘనేన్నారు. తెలంగాణలో తొమ్మిది వేల గ్రామాలు ఏటీఎంల పరిధిలో లేవనీ..బ్యాంకులు..పోస్టాఫీసులు లేని గ్రామాలు నాలుగు వేలకు పైగా ఉన్నాయని అన్నారు.  

నగరంలో మళ్లీ ఐసీస్ కలకలం..

హైదరాబాద్ : నగరంలో మళ్లీ ఐసీస్ కలకలం రేగింది. ఐసీస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిరియా వెళ్లిన ఇద్దరు గుర్బాన్, రెహ్మాన్ లు యువకులను టర్కీలో హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు. గుర్బాన్ ది హైదరాబాద్ కాగా రెహ్మాన్ ది వరంగల్ అని తెలుస్తోంది.

16:16 - December 16, 2016

నల్లగొండ : నాలుగుసార్లొచిన్నా అయిన బ్యాంకులో పైసల్లేవంటున్నారనీ...నా అంగీఅంత మట్టికొట్టకపోయుందనీ..సాగు ఖర్చులకు కూడా చేతిలో పైసల్లేవనీ పొలం పనినుండే బ్యాంకు కొచ్చినానని అయిన మా పైసలు మాకివ్వటంలేదని ఓ రైతు వాపోయాడు. ఎక్కడో ఊర్ల నుండి వచ్చినామనీ నాలుగుసార్లు వచ్చినానీ..ఇంటి కర్చులకు ఏమాత్రం సరిపోవటంలేదనీ ఈ తిరుగుడతో ఇంట్లో పిల్లల్ని చూసుకోలేక బ్యాంకుల చుట్లూ తిరగలేక కూలిపన్లు మానుకోని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నామనీ ఓ మహిళ వాపోయింది. పెద్దనోట్ల రద్దు కష్టాలు ఇంకా కొనసాగుతూనేఉన్నాయి.. నోట్ల రద్దుతర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.. వ్యవసాయ ఖర్చులకోసం అన్నదాతలు బ్యాంకులచుట్టూ తిరుగుతున్నారు.. 

16:14 - December 16, 2016
16:13 - December 16, 2016
16:07 - December 16, 2016

జగిత్యాల : జగిత్యాల జిల్లాలో హీరో బాలకృష్ణ పర్యటించారు. శాతవాహనుల రాజధానిగా వర్థిల్లిన కోటిలింగాలలోని కోటేశ్వరస్వామికి దర్శకుడు క్రిష్‌తో కలిసి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. శాంతి కోసం దేశాన్ని ఐక్యం చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను భావి తరాలకు తెలియజెప్పాలన్న సదుద్దేశంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. దర్శకుడు, రచయిత 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని అందమైన దృశ్యకావ్యంగా తెరకెక్కించారని కొనియాడారు. అయితే సాయంత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. 

16:01 - December 16, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యపై పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో స్పందించారు. రోహిత్‌ బీజేపీని వ్యతిరేకించారన్న ఆయన.. అంతమాత్రాన అతన్ని వేధిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు అందరికి ఉందన్న పవన్‌ .. రోహిత్‌ అంశాన్ని బీజేపీ ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుందో చెప్పాలన్నారు. రోహిత్‌ పై విధించిన సస్పెన్షన్‌ అతడి ఆత్మహత్యకు దారితీసిందని పవన్‌ అభిప్రాయపడ్డారు. రోహిత్‌ మరణాన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ రాజకీయం చేశాయని మండిపడ్డారు. వర్శిటీలు రాజకీయ పార్టీలకు యుద్ధభూమి కాకూడదని పవన్‌కల్యాణ్‌ అన్నారు..కాగా జనసేన పవన్ కళ్యాణ్ ఐదు రోజుల పాటు ఐదు అంశాలపై ట్వీట్ చేస్తానని ఆయన తెలిపిన విషయం తెలిసిందే. గురువారం నాడు గోవధపై స్పందించిన పవన్ శుక్రవారం నాడు హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న స్కాలర్ విద్యార్థి రోహిత్ వేములపై ట్వీట్ ద్వారా స్పందించారు. మరో మూడు అంశాలపై అంటే దేశభక్తి, నోట్లరద్దు వంటి అంశాలపై ఆయన మరో మూడు రోజులపాటు ట్వీట్ చేయనున్నారు. 

16:01 - December 16, 2016

చలికాలం..చర్మం పాడవుతూ ఉంటుంది. చర్మ సంరక్షణకు ఏవో క్రీములు, మందులు ఇతరత్రా వాడుతుంటారు. లేనిరోగాలు తెచ్చుకుంటుంటారు. వండే పదార్థాల్లోనే కాకుండా పండ్లతో కూడా చర్మం పాడు కాకుండా ఉంచుకోవచ్చు. అలాంటి పండ్లలో కొన్ని..మీ కోసం..

దానిమ్మ : ఈ పండు చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పోషక విలువలు మెండుగా ఉంటాయి. ముఖంపై మడతలు, మొటిమలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానిమ్మ పండులను తినడం వల్ల చర్మ కణాలను బిగుతుగా ఉంచుతుంది.

స్టాబెర్రీ : ఈ పండులో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ పండు తినడం వల్ల నీరసం దరి చేరదు. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు చర్మాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది. ఈ పండును క్రీములు..పదార్థాలు తయారు చేయడంలో వాడుతుంటారు.

బొప్పాయి : ఈ పండులో విటమిన్ ఎ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. చర్మ సంరక్షణకు యాంటీ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇందులో పైపైన్ ఎంజెమ్ మృత కణాలను తొలగించడానికి సహాయ పడుతుంది. చర్మ కణాలకు అవసరమైన ఎంజెమ్ లను ఉత్పత్తి చేస్తుంది.

అరటి : అరటి పండులో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇందులో విటమిన్ ఇ, సి ఉంటాయి. చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి.

ఆపిల్ : విటమిన్ సి ఉండడం వల్ల మొటిమలు, ముతలు రాకుండా కాపాడుతుంది. నల్లమచ్చల సమస్య కూడా దూరం అవుతుంది. పొడిబారిన చర్మం గల వారు ఆపిల్ పండు తినాలి.

సీతాఫలం : విటమిన్ ఎ, సి ఈ పండులో ఉంటాయి. కొత్త కణాల ఉత్పత్తి చేయడానికి ఈ పండు ఉపయోగపడుతుంది. చర్మానికి మంచి స్ర్కబ్ లా పనిచేస్తుంది. ప్రీ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తాయి.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శనివారానికి వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, పెద్దనోట్ల రద్దుపై చర్చ జరిగింది.

15:48 - December 16, 2016

హైదరాబాద్ : టీఎస్‌ అసెంబ్లీలో నోట్లరద్దుపై మాట్లాడుతూనే తనదైనశైలిలో శాసనసభాపక్ష నేత జానారెడ్డి నవ్వులపువ్వులు పూయించారు.. నోట్ల రద్దు అంశంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా పాతనోట్ల రద్దు అనంతరం తను బ్యాంకు వెళ్లి తెచ్చుకున్న రెండు వేల నోట్లతో అవసరం నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాననీ..అక్కడ జరిగిన ఓ సంఘటనను ఆయన వివరించారు. నగదు చెల్లించాల్సిన సమయంలో అలవాటు ప్రకారంగా వెయ్యి నోట్లను కుని నాలుగు రెండు వేల నోట్లను వారు తిరిగి సార్ మీరిచ్చింది ఎనిమిదివేలిచ్చారు అనగానే ఖంగుతిన్నాననీ తరువాత నవ్వుకున్నాని తెలిపారు. అలవాటు ప్రకారం వెయ్యి నోటను కుని రెండువేల నోట్లు నాలుగిచ్చినాని చెప్పగానే అనుభవనాల్ని చెప్పగానే సభ నవ్వులతో నిండిపోయింది.... అలాగే నోట్లరద్దుపై సీఎం కేసీఆర్‌ అంతర్గతంగా బాధపడుతున్నారని... తాను బహిర్గతంగా బాధపడుతున్నానంటూ సభలో జోక్స్ వేశారు..స్వైపింగ్ నేనూ నా భార్య కూడా నేర్చుకోవాలనగానే సభలో మరోసారి నవ్వులు విరిసాయి.

15:37 - December 16, 2016

విశాఖ : నోట్ల రద్దుతో సామాన్యులు కొత్త కరెన్సీ కోసం నానా అగచాట్లు పడుతుంటే అక్రమార్కులు మాత్రం యదేచ్చగా తమ చేతివాటానికి పనికల్పిస్తున్నారు. నిబంధనలకు విర్ధుంగా రూ.25లక్షల నగదు మార్పిడి చేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణ చేపట్టింది. రూ.25లక్షలు మార్పిడి జరిగినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పోస్ట్ మాస్టర్ లలిత, ట్రెజరర్ శామ్యూల్ జాన్సన్ లను అధికారులు విచారిస్తున్నారు. ఈ నగదు ఎవరికి ఇచ్చారనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా విశాఖపట్నం కేంద్రంగా పెద్ద మొత్తంలో న్యూ కరెన్సీ తరలుతున్నట్లుగా పోలీసులు,సీబీఐ అధికారులు భావిస్తున్నారు. విశాఖలో ఆంధ్రా ఎస్బీఐ బ్యాంకు తప్ప మరే బ్యాంకులు కూడా ఏటీఎంలో నగదు పెట్టటంలేదని విషయాన్ని కూడా అధికారులు గుర్తించారు. దీంతో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. నగదు మార్పిడిలో అవకతవకలు నిజమేనని నిర్ధారణ కావడంతో సీబీఐ వీరిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసింది.

అవినీతి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం - మోడీ..

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అవినీతి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం అని, కాంగ్రెస్ చట్టాలు చేస్తుంది కానీ అమలు చేయదని విమర్శించారు. డిజిటల్ లావాదేవీలు చేసే వారికి బహుమతులు ఇస్తామని, చిన్న వ్యాపారులకు కేవలం 6 నిమిషాల్లో లోన్లు వస్తాయన్నారు. నోట్ల రద్దుతో సమస్యలు వస్తాయని ముందే చెప్పడం జరిగిందని, నోట్ల రద్దుపై ప్రజల నుండి సహకారం వచ్చిందన్నారు. 50 రోజుల సమయం ఇవ్వాలని ప్రజలను కోరడం జరిగిందని, సమస్యలు ఒక్కొక్కటి తగ్గుతూ వస్తున్నాయన్నారు.

మంచి జరుగుతుందనే నోట్ల రద్దును స్వాగతించినా - కేసీఆర్..

హైదరాబాద్ : మంచి జరుగుతున్నప్పుడు అందరూ సమర్థించాలని, మంచి జరుగుతుందనే ఆశించి నోట్ల రద్దును సమర్థించినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో కొన్ని సమస్యలుంటాయని ప్రధాని ముందే చెప్పారని, సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలని కోరినట్లు తెలిపారు. వంద శాతం క్యాష్ లెస్ లావాదేవీలు ప్రపంచంలో ఎక్కడా లేదని, కొంతమంది బంగారంపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. వందశాతం నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాదన్నారు. నగదు రహిత లావాదేవీలంటే కేవలం స్వైప్ మిషన్లు కాదని, దేశంలో ఉన్న స్వైపింగ్ మిషన్లు కేవలం 15లక్షలన్నారు.

రూ. 2900 కోట్లు స్వాధీనం..

ఢిల్లీ : నోట్ల రద్దు తరువాత ఐటీ అధికారులు 586 తనిఖీలు చేశారు. దాడుల్లో 850 కోట్ల విలువైన బంగారం, రూ. 2900 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన నగదులో రూ. 300 కోట్లు కొత్తవి ఉన్నాయి.

పెద్దనోట్ల రద్దుపై హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు సుప్రీంకు బదిలీ..

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను విచారించడానికి ఐదుగురు జడ్జీలతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో దాఖలైన కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులలో విచారణనను సుప్రీం నిలిపివేసింది.

 

బర్డ్ ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు...

తిరుపతి : బర్డ్ ఆసుపత్రిలో ఓపీ విభాగం ఆపరేషన్ థియేటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆసియాలో అత్యుత్తమ ఆర్థోపెడిక్ ఆసుపత్రిగా బర్డ్ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామన్నారు.

 

15:15 - December 16, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని ఎంఐఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని  ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు.డిజిటల్ లావాదేవీలతో సైబర్ క్రైమ్ పొంచివుందన్నారు. అనాలోచిత నిర్ణయంతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు.ఇది ప్రజాహక్కుల ఉల్లంఘనేన్నారు. తెలంగాణలో తొమ్మిది వేల గ్రామాలు ఏటీఎంల పరిధిలో లేవనీ..బ్యాంకులు..పోస్టాఫీసులు లేని గ్రామాలు నాలుగు వేలకు పైగా ఉన్నాయని అన్నారు.  

15:07 - December 16, 2016

మెగాస్టార్ 'చిరంజీవి' చాలా ఏళ్ల క్రితం మేకప్ వేసుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేసుకొంటోంది. ఇటీవలే చిత్ర టీజర్ కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్ ఆడియో వేడుకలపై నిమగ్నమైంది. డిసెంబర్ 25వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ వేదికపై సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. స్టేడియంలో వేడుకలు నిర్వహించకూడదని స్పోర్ట్ అసోసియేషన్ వారు పేర్కొంటున్నట్లు ఇందుకు కోర్టు ఆర్డర్ చూపిస్తున్నారని టాక్ వినిపించింది. 2015లో ఇచ్చిన ఒక ఆర్డర్ ప్రకారం మున్సిపల్ స్టేడియంను కేవలం ఆటలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కోసమే వాడాలని..కాని అందుకు మినహాయింపుగా ఎటువంటి ఫంక్షన్స్ ముఖ్యంగా ఫిలిం ఫంక్షన్స్ ఇక్కడ జరప కూడదు అన్న ఆర్డర్ ఉంది అని కొందరు వాదిస్తున్నట్లు టాక్. ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తే సమస్యలు ఏర్పడుతాయని, చిత్ర యూనిట్ ఆలోచనలో పడినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. అక్కడనే ఆడియో నిర్వహిస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

14:54 - December 16, 2016

తెలుగు ఇండస్ట్రీలో 'శివ' చిత్రంతో 'రాం గోపాల్ వర్మ' ఓ ట్రెండ్ ను సృష్టించాడు. అప్పటి వరకు మూస పద్దతిలో సాగుతున్న విలనీజానికి ఇతను కొత్త భాష్యం చెప్పాడు. చైన్లు, హాకీ స్టిక్స్ లాంటి ఆయుధాలు సినీ రంగానికి పరిచయం చేశాడు. కాలేజీల్లో అప్పట్లో వీటిని మెయింటేన్ చేయడం ఫ్యాషన్ అయ్యింది. అప్పటి వరకు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న 'నాగార్జున'కు కూడా బ్రేక్ ఇచ్చాడు. మాఫియా, కామెడీ, హర్రర్, థ్రిల్లర్ సినిమాలు తీయడంలో 'వర్మ' దిట్ట. ముక్కుసూటిగా మాట్లాడే 'వర్మ' ట్విట్టర్లో ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తూ సినీ ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల వారిపై సెటైర్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా కొందరి జీవితాలను తెరకెక్కిస్తున్నారు. ‘వంగవీటి' సినిమా తీస్తున్న 'వర్మ'పై పలు విమర్శలు వినిపించాయి. వంగవీటి కుటుంబంతో కూడా 'వర్మ' చర్చలు సైతం జరిపారు. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
తాజాగా మరో చిత్రం తీయబోతున్నట్లు ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. ‘శశికళ' పేరును రిజిష్టర్ చేసుకొచ్చినట్లు ట్వీట్స్ చేశారు. ఇటీవలే మృతి చెందిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి 'జయలలిత'కు 'శశికళ' స్నేహితురాలు అనే సంగతి తెలిసిందే. ఓ రాజకీయ వేత్తకు చాలా దగ్గరైన ప్రియమైన స్నేహితురాలిదే అయినా పూర్తి కల్పితం అని తెలిపారు. జయ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంటూనే శశికళ అంటే ఆమెకన్నా ఎక్కువ గౌరవమని పేర్కొన్నారు.

14:43 - December 16, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజ్యయ్య మాట్లాడుతూ..నోట్ల రుద్దును సీపీఎం పార్టీ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ నిరక్షరాస్యులు చాలామంది వున్నారనీ..నోట్ల రద్దుపై వారు పడుతున్న కష్టాలకు భరోసాని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు వెంటనే చేపట్టాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సూచించారు.నోట్లు రద్దు చేసిన అనంతరం అన్ని తరగతు ప్రజలపై పడిందనీ..దీనికి సామాన్యులు తీవ్రంగా కష్టాలు ఎదుర్కొంటున్నారని..దీనికి సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవుసరముందన్నారు. సామాన్యుల కష్టాలకు ఇప్పటికైనా తీరేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. నోట్ల రద్దుతో  సమాజం అస్తవ్యస్థంగా తయారయ్యిందన్నారు. రాష్ట్రంలో నూటికి సుమారు 70 శాతం వ్యవసాయంపై ఆధారపడివారున్నారనీ.. రైతుల నుండి చిరువ్యాపారస్థుల వరకూ పడుతున్న కష్టాలకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 

14:24 - December 16, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేయలేదనీ..కేవలం పాతనోట్లను ప్రభుత్వం ఉపసంహరించి అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సరైన సలహాలు సూచలను అందించేందుకు సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరంవుందన్నారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా పాతనోట్లను ఉపసంహరించుకోవటం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు నగదు రహిత లావాదేవాలను ప్రజలపై బలవంతంగా రుద్దటం సరైందకాదన్నారు. అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించటంకోసం పాత నోట్ల ఉపసంహరణ మంచిదే కానీ అమలులో తీవ్రమైన లోపాలున్నాయనీ..కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందనీ..సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని సూచించారు. దీనికి బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అడ్డుపడ్డారు. దీనిపై నా అభిప్రాయాన్ని వెలిబుచ్చుతుంటే అడ్డుపడటం సరికాదనీ..అభిప్రాయాన్ని చెప్పే హక్కు తమకుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నోట్ల రద్దు..దేశంలో నెలకొన్న పరిస్థితులు..ఇబ్బందులపై చర్చ జరుగుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. 

పెద్ద నోట్ల రద్దుకు సీపీఎం వ్యతిరేకం - సున్నం రాజయ్య..

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దును సీపీఎం వ్యతిరేకిస్తోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుపై ఆయన శాసనసభలో మాట్లాడారు. నగరంలో తెల్లవారుజాము నుండే ఏటీఎం వద్ద క్యూలో నిలబడుతున్నారని, భవన నిర్మాణ కార్మికులు..అసంఘటిత రంగ కార్మికులు.. పేదలు..రైతులు..చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలన్నారు. కూలీచ్చే పరిస్థితి లేదని, అప్పులు పుట్టడం లేదన్నారు.

నోట్లు రద్దు కాలేదు - రేవంత్..

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేయలేదని కొత్త నోట్లను తీసుకొచ్చిందని టిడిపి సభ్యుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాతనోట్లను ఉపసంహరించుకుని కొత్తనోట్లను వినియోగంలోకి తెచ్చిందన్నారు. పెద్దనోట్ల రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన స్టేట్ మెంట్ లో సవరణ చేయాలని సూచించారు. 90 శాతం వరకు నగదు లావాదేవీలు జరుగుతాయని, అంగన్ వాడీల నుండి మహిళా సమాఖ్య వరకు నగదు వాడుతుంటారని ఇది నల్లధనం కాదన్నారు. నల్లధనం ఇతరవత్రా వాటిని నిర్మూలించాలంటే ఇతర మార్గాల్లో రావాల్సి ఉంటుందన్నారు. నోట్ల రద్దు అనంతరం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల సమాజంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

బీజేపీకి వత్తాసు పలకకండి - అక్బరుద్దీన్..

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు విషయంలో బీజేపీకి వత్తాసు పలకాల్సినవసరం లేదని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమం సమయంలో నగరంలో చాలా సమస్యలు ఏర్పడ్డాయని, చాలా నష్టపోయారన్నారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు వల్ల నగరంలో చాలా ఇబ్బందులు ఎర్పడుతున్నాయని, పాతబస్తీలో చాలా మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అన్ని పార్టీల వారితో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు..సలహాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రపతిని కలిసిన విపక్షాలు..

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని విపక్షాలు కలిశాయి. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు ఉన్నారు.

డోన్ లో ఆంధ్రాబ్యాంకులో పడిపోయిన వృద్ధురాలు..

కర్నూలు : డోన్ లో ఆంధ్రా బ్యాంకు వద్ద సుంకులమ్మ అనే వృద్ధురాలు సృహతప్పిపడిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు మృతి చెందింది.

 

పెద్ద నోట్ల రద్దు వల్ల అన్ని రంగాలకు మేలు - కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు వల్ల అన్ని రంగాలకు మేలు జరుగుతుందని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు శాంతియుతంగా తమ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని. ఇలా చేయడం వల్ల పేదోడు నవ్వుతున్నారని తెలిపారు.

14:01 - December 16, 2016

రిసోర్స్ ఫర్ ఉమెన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు జమీలానిషాత్ తో మానవి ముఖాముఖి నిర్వహించింది. రిసోర్స్ ఫర్ ఉమెన్ స్వచ్ఛంద సంస్థ ముస్లీం యువతులకు అండగా ఉంది. రైట్ టూ చాయిస్ నినాదంతో ముస్లీం మహిళలకు కౌన్సిలింగ్ ఇస్తుంది. 18 సం.ల నుంచి బాధిత మహిళలకు జమీలానిషాత్  అండగా ఉంటుంది. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:52 - December 16, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌ కార్యకలాపాలు స్తంభించడం పట్ల బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో పరిస్థితి చూస్తుంటే పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజీనామా చేయడమే మేలన్పిస్తోందని పేర్కొన్నారు. ఆఖరు రోజైనా సభ సజావుగా సాగుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అద్వాని మరోసారి తీవ్ర అసంతృప్తి 
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వాని మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. లోక్‌సభలో పెద్దనోట్ల రద్దుపై ఎలాంటి చర్చ జరగకుండానే సభ శుక్రవారానికి వాయిదా పడింది. లోక్‌సభ వాయిదా పడ్డ తర్వాత కూడా అద్వాని 20 నిముషం పాటు సభలోనే కూర్చున్నారు. సభ జరుగుతున్న తీరు చూస్తుంటే, పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజీనామా చేయడమే మేలనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, స్మృతీ ఇరానీల ముందు అద్వాని తన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుపై చర్చ జరగాలన్నారు. ఇరుపక్షాల నేతలతో మాట్లాడి చివరి రోజైనా లోక్‌సభ సమావేశం సజావుగా జరిగేందుకు స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని మాజీ ఉప ప్రధాని సూచించారు. సభ ఓడిపోతే అందరికీ చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. 
నేటితో ముగియనున్న సమావేశాలు
నవంబర్‌ 16న ప్రారంభమైన పార్లమెంట్‌ ఉభయసభల సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచి నోట్లరద్దుపై ఒక్కరోజు కూడా చర్చ జరిగింది లేదు. పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించడంలో అటు ప్రభుత్వం, ఇటు విపక్షాలు రెండూ విఫలమయ్యాయి.
ప్రణబ్‌ముఖర్జీ తీవ్ర అసంతృప్తి 
పార్లమెంట్‌ సమావేశాలకు ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువుంది. ఈ సమావేశాల్లో 10 ముఖ్యమైన బిల్లులపై చర్చ జరిపి వాటిని ఆమోదించాల్సి ఉండగా, ఇప్పటివరకు నాలుగు బిల్లులు మాత్రమే ఆమోదానికి నోచుకున్నాయి. సభలు జరుగుతున్న తీరుపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

 

13:49 - December 16, 2016

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షులు కరుణానిధి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబసభ్యులు కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. యూరిన్ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ ఇబ్బందులతో కరుణానిధి  బాధపడుతున్నారు. గత 15 రోజుల్లో కరుణానిధి రెండవ సారి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం కావేరి ఆస్పత్రిలో డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  

 

13:47 - December 16, 2016

ఆదిలాబాద్ : సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర ఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలో గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో చేస్తున్న మహాజన పాదయాత్ర ఆదిలాబాద్‌ జిల్లాలో 60వ రోజు కొనసాగింది. అంకోలి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో కొనసాగింది. 
పాదయాత్రకు ఆదివాసీలు, గిరిజనులు ఘన స్వాగతం 
ఇక మహాజన పాదయాత్రకు ఆదివాసీలు, గిరిజనులు ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్యాలతో పాదయాత్ర వెంట నడిచారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పాదయాత్ర బృందానికి మొర పెట్టుకున్నారు. గ్రామాల్లో కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవని ఏకరువు పెట్టారు. రోడ్లు, వైద్య సౌకర్యాలు లేవన్నారు. ఇదిలావుంటే పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములను సైతం లాక్కుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. 
ఎన్నో పోరాటాలకు అండగా గిరిజనులు : తమ్మినేని
ఎన్నో పోరాటాలకు గిరిజనులు అండగా నిలిచారని.. ఎన్నో ఉద్యమాలు గ్రామాల నుంచి పుట్టాయని తమ్మినేని వీరభద్రం అన్నారు. పేదలకు ఎప్పటికీ ఎర్రజెండా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. టీఆర్‌ఎస్‌ పేదలకు చేసిందేమీ లేదన్నారు. ఇంకా అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం దారుణమన్నారు తమ్మినేని. రోజురోజుకు ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రకు గ్రామాల్లో అనూహ్య స్పందన లభిస్తోంది. పాదయాత్ర బృందం దృష్టికి అనేక సమస్యలు తీసుకువస్తున్నారు. 

 

13:38 - December 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై చర్చ జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ర్టానికి రూ.5 వేల కోట్ల చిన్న నోట్లను ఇవ్వాలని ఆర్ బీఐకి లేఖ రాశామని తెలిపారు. బ్యాంకుల వద్ద మహిళలు, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని బ్యాంకర్లను కోరినట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలు జరుపడానికి సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు. సిద్దిపేటలో పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు కృషి చేస్తోందని చెప్పారు.
పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు : జానారెడ్డి
పెద్దనోట్ల రద్దు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. సభ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రానికి వివరించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తాం.. కానీ ప్రజలు సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించాలన్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన చాలా తక్కువ మందికి ఉందన్నారు. దేశంలో అక్షరాస్యత 60 శాతం ఉందన్నారు. అరుణ్ జైట్లీ నగదు రహిత లావాదేవీలు పూర్తిగా అమలు చేయడం సాధ్యం కాదన్నారు. రైతులు, కుటీర పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించాలన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తాను బహిర్గతంగా బాధపడుతున్నా... కేసీఆర్ అంతర్గతంగా బాధపడుతున్నారని చమత్కరించినప్పుడు సభలో నవ్వులు వెల్లివెరిసాయి. రైతుల్లో చాలా మందికి బ్యాంకు అకౌంట్ లేదన్నారు. నోట్ల రద్దు కేంద్రం పరిధిలోనిది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అనాలోచితం అనే హక్కు శాసనసభకు లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రిగా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

13:14 - December 16, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేశారు. శుక్రవారం నుండి శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దుపై కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. అనంతరం దానిపై చర్చ జరిగింది. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ర్టానికి రూ.5 వేల కోట్ల చిన్న నోట్లను ఇవ్వాలని ఆర్ బీఐకి లేఖ రాశామని తెలిపారు. బ్యాంకుల వద్ద మహిళలు, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని బ్యాంకర్లను కోరినట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలు జరుపడానికి సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు. సిద్దిపేటలో పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు కృషి చేస్తోందని చెప్పారు.

కేంద్రానికి లేఖలు..
ప్రజల బాధకాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం చేసే దిశగా ముందుకెళుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తాను సమావేశమై పలు సలహాలు..సూచనలు అందచేసినట్లు తెలిపారు. రూ. 5వేల కోట్ల రూపాయలను పంపించాలని సీఎస్ రాజీవ్ శర్మ గతంలోనే లేఖలు రాయడం జరిగిందన్నారు. ఆసరా ఫించన్ల విషయంలో ఇబ్బందులు..రైతులు, చిన్న వ్యాపారులు, దినసర కూలీల ప్రభావాన్ని లేఖలో ప్రస్తావించడం జరిగిందన్నారు. నూతన సీఎస్ కూడా లేఖలు రాయడం జరిగిందన్నారు. ఆర్థిక శాఖ మంత్రి కూడా చిన్న నోట్లు పంపించాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు. పాత నోట్ల ద్వారా చెల్లింపులు చేయాలన్న దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఆర్ బీఐ 19, 019 కోట్ల రూపాయలు పంపించిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాట్లు, నగదు రహిత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని పలు సంస్థలు తేల్చాయన్నారు. ఇందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగిందని, అంతేగాక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈఎస్ వ్యాలెట్ ను త్వరలో తీసుకొస్తామని, నగదు రహితంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేసీఆర్ వెల్లడించారు

13:07 - December 16, 2016

'గౌతమి పుత్రశాతకర్ణి' మూవీ కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక్క నందమూరి ఫ్యాన్స్ అనే కాదు సిని ఇండస్ట్రీ యావత్తు ఈ చిత్రం రిలీజ్ కోసం అంతే ఆత్రుతగా ఎదురుచూస్తోంది. 'బాలయ్య' వందో చిత్రం కావడం, అందులోనూ చారిత్రాక నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కావడంతో 'శాతకర్ణి'పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్..టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ కు 26 లక్షలకు పైగా వ్యూస్ లభించడం విశేషం. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని టాక్. వంద లోకేషన్స్ లో ఒకేసారి విడదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వెలగటూరు (మం) కోటిలింగాల ఆలయంలో సినీ నటుడు బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ట్రైలర్ విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో కనిపిస్తుండగా హేమమాలిని, శ్రియ, కబీర్ బేడీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ఆ థియేట్రికల్ ట్రైలర్ ఎలాంటి సంచనాలు సృష్టిస్తోందో వేచి చూడాలి.

13:05 - December 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు సమయం ముగిసింది. సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి సంబంధిత మంత్రులు సమాధానాలు చెప్పారు. అనంతరం స్పీకర్ జీరో అవర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలన్నారు. 1179 ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అనంతరం టీఆర్ ఎస్ సభ్యుడు మాట్లాడుతూ ట్రాఫిక్, గ్రేహౌండ్స్ ఉద్యోగులకు 30 శాతం అవెన్స్ లు ప్రభుత్వం ఇస్తుందన్నారు. హోంగార్డులకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. చాలిచాలని జీవంతో అవస్థలు పడుతున్న హోంగార్డులను ఆదుకోవాలని చెప్పారు. కానిస్టేబుల్స్ కు కల్పిస్తున్న అలవెన్స్ లను హోంగార్డులకు కల్పించాలన్నారు. ఉన్నతాధికారులు హోంగార్డులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై స్పందించిన హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హోంగార్డులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. బీజేపీ సభ్యుడు ప్రభాకర్ మాట్లాడుతూ నానక్ రాంగూడలోని దేవాలయ భూమిని అన్యాక్రాంతం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ భూములను అక్రమించుకునే కుట్ర 
జరుగుతోందన్నారు.

 

పెద్దనోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం - జానా..

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు అంశంపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

 

12:57 - December 16, 2016

ప్రేమించానంటూనే ప్రియురాలిని ఓ బ్రోకర్ చేతిలో పెట్టిన ప్రియుడు..మూడేళ్లుగా అమాయకురాలిని వ్యభిచారం చేయిస్తున్న దుర్మార్గుడు..

ప్రేమించాడు..ఆ తరువాత వ్యభిచారం కూపంలోకి నెట్టాడు. ప్రియురాలిని బ్రోకర్ కు అప్పచెప్పాడు. దీని ద్వారా డబ్బు సంపదించాడు. మూడేళ్లుగా ఈ అమానుషం జరుగుతోంది. అమాయకురాలితో దందా చేయించి డబ్బుతో సెటిల్ అయ్యాడు. ఇంత చేసిన ఈ దుర్మార్గుడు వివాహానికి సిద్ధమయ్యాడు. వారానికి రూ. 50 వేలు తన పేరున వసూలు చేసేవాడు. ప్రస్తుతం నయవంచన చేసిన ఈ ప్రియుడు మొహం చాటేశాడు. న్యాయం కోసం ఈ అభాగ్యురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ అమానుష ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. మరి మోసపోయిన ఈమెకు న్యాయం చేస్తారా ? లేదా ? అనేది చూడాలి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:50 - December 16, 2016

చిత్తూరు : సీఎం చంద్రబాబు బస్సులో పొగలు వెలువడ్డాయి. తిరుపతిలో స్విమ్స్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుండి బస్సులో బయల్దేరారు. మార్గంమధ్యలో ఆవిలాల వద్ద బస్సులో పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన అధికారులు చంద్రబాబును దింపేశారు. అనంతరం కారులో తిరుపతికి చంద్రబాబు బయలుదేరారు. 

 

రోహిత్ వేములపై పవన్ ట్వీట్స్..

హైదరాబాద్ : రోహిత్ వేముల అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. రోహిత్ వేముల బీజేపీని వ్యతిరేకించారని, వ్యతిరేకించినంత మాత్రానా వేధించాలా ? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందన్నారు. రోహిత్ అంశాన్ని బీజేపీ వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుందని, రోహిత్ పై విధించిన సస్పెన్షన్ ఆత్మహత్యకు దారి తీసిందన్నారు. ఆవేదన, ఆక్రోశంపై కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే తెలివైన విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదన్నారు. యూనివర్సిటీలు రాజకీయ పార్టీలకు యుద్ధ భూమి కాకూడదని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

రోహిత్ వేములపై పవన్ ట్వీట్స్..

హైదరాబాద్ : రోహిత్ వేముల అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. రోహిత్ వేముల బీజేపీని వ్యతిరేకించారని, వ్యతిరేకించినంత మాత్రానా వేధించాలా ? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందన్నారు. రోహిత్ అంశాన్ని బీజేపీ వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుందని, రోహిత్ పై విధించిన సస్పెన్షన్ ఆత్మహత్యకు దారి తీసిందన్నారు. ఆవేదన, ఆక్రోశంపై కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే తెలివైన విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదన్నారు. యూనివర్సిటీలు రాజకీయ పార్టీలకు యుద్ధ భూమి కాకూడదని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

కోటి లింగాల ఆలయంలో బాలయ్య పూజలు..

జగిత్యాల : వెలగటూరు (మం) కోటిలింగాల ఆలయంలో సినీ నటుడు బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ట్రైలర్ విడుదల కానుంది.

పెద్దనోట్ల రద్దు కేంద్రం పరిధిలోనిది - కేసీఆర్..

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర పరిధిలో చర్చ కాదని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో ప్రజలకు ఇబ్బందులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఇబ్బందులపై చర్చించాలని బీఏసీలో విపక్షాలకు సూచించడం జరిగిందన్నారు. ప్రధాన మంత్రి..కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా చర్చ ఉండవద్దని సూచించారు.

పెద్దనోట్ల రద్దుకు టి.సర్కార్ సుముఖం - కేసీఆర్..

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో ఓ ప్రకటన చేశారు. నల్లధనం పూర్తిగా కట్టడి చేసేలా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించడం జరుగుతోందన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం స్వాగతిస్తోందని, ప్రజల బాధకాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం చేసే దిశగా ముందుకెళుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తాను సమావేశమై పలు సలహాలు..సూచనలు అందచేసినట్లు తెలిపారు.

 

12:17 - December 16, 2016

కొడుకును కనివ్వలేదని చిత్ర హింసలు..15 ఏళ్ల వైవాహిక బంధంలో గొడవలు..ఇద్దరు కూతుళ్లతో పాటు భార్యపై కక్ష..ఢిల్లీ న్యాయవాది అరాచకంపై వీడియో..

వారసుడు కావాలన్న కోరిక ఇంకా తీరలేదు. ఇద్దరూ కూతుళ్లే..ఈ పిల్లలు కూడా స్కూల్ కు వెళుతున్నారు. అయినా అతనిలో మాత్రం కోరిక తీరలేదు. కక్ష పెంచుకున్న ఇతను కొడుకును కనివ్వలేదని భార్యకు నిత్యం నరకం చూపిస్తున్నాడు. మధ్యలో సొంత కూతుళ్లపై దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. చిత్ర హింసలు భరించలేని కూతురు రహస్యంగా వీడియో తీసి పోలీసులను ఆశ్రయించింది. ఇదంతా ఎవరో చేసింది కాదు దేశ రాజధానియైన ఢిల్లీలో ఓ న్యాయవాది. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

బాబు బస్సులో పొగలు..

చిత్తూరు : సీఎం ప్రయాణిస్తున్న బస్సులో పొగలు రావడం కలకలం రేపింది. దీనితో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడి నుండి బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆవిలాల వద్ద బస్సులో పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన అధికారులు చంద్రబాబు నాయుడిని దింపేశారు. అనంతరం కారులో తిరుపతికి చంద్రబాబు బయలుదేరారు. స్విమ్స్ లో జరిగే ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

12:06 - December 16, 2016

అవహేళన చేశాడని ఆవేశం..పరిష్కారమయ్యే సమస్యపై పైశాచికం..తోటి విద్యార్థిని దారుణంగా చంపిన స్టూడెంట్స్...

అహం..ఆవేశం ఈ రెండు కలుస్తే అనర్థమే. ఎన్నో కుటుంబాల్లో చిచ్చుకు కారణం అదే. ఎన్నో వ్యవహరాల్లోనూ వినాశానికి కూడా కారణం అదే. ఆవేశం అనేది దుర్మార్గులుగా మార్చేస్తుంది. పరిష్కారానికి మార్గాలున్నా అహం మరింత జఠిలం చేస్తుంది. దీని ద్వారా నష్టపోవడమే కాకుండా వేరే వారిని కూడా నష్టపరుస్తున్నారు. నెల్లూరులో ఐదేళ్ల తరువాత ఓ హత్య కేసులో న్యాయస్థానం తీర్పును చెప్పింది. ఇందులో ఆ నలుగురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ నలుగురు విద్యార్థులు ఆవేశంతో చేసిన తప్పిదమే. చివరకు ఏం సాధించారు. ఓ తల్లికి కడుపుకోత పెట్టిన వారు. తమ కుటుంబంలో కూడా చీకటిని నింపారు. నెల్లూరులో అవహేళన చేశాడన్న చిన్న కారణతో తోటి విద్యార్థిని మరో ముగ్గురితో కలిసి విద్యార్థి దారుణంగా హత్య చేశాడు. ఐదు సంవత్సరాల తరువాత కోర్టు తీర్పును చెప్పింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.....

టి.అసెంబ్లీ టీ బ్రేక్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో మొదటి రోజు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. అనంతరం జీరో అవర్ ని స్పీకర్ కొనసాగించారు. కొద్దిసేపు తరువాత స్పీకర్ టీ బ్రేక్ నిచ్చారు.

 

11:54 - December 16, 2016

తెలుగులో వచ్చిన 'రఘువరన్ బీటెక్' చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఇక్కడ ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా చిత్రం రూపొందుతోంది. దీనికి 'వీఐపీ-2’ పేరు పెట్టారు. ఇందులో కూడా 'ధనుష్' హీరో. ‘రజనీకాంత్' కుమార్తె 'సౌందర్య' దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గురువారం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ‘రజనీకాంత్' క్లాప్ నిచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘రజనీకాంత్' సతీమణి 'లత'తో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా 'ధనుష్' ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు. మామగారైన 'రజనీకాంత్' ను ఉద్దేశించి..’ఇంతకుమించి మీ వద్ద ఇంకేం కోరుకోగలనని..కృతజ్ఞతలు తలైవా అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాజ్యసభ నిరవధిక వాయిదా..

ఢిల్లీ : చివరి రోజు కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. రాజ్య‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. నోట్ల రద్దుపై ఇవాళ విపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ హామీద్ అన్సారీ వెల్లడించారు.

నల్ల బ్యాడ్జీతో మైదానంలోకి బ్యాట్స్ మెన్స్..

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపంగా క్రికెటర్లు నల్ల బ్యాడ్జీని ధరించారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ నేడు ప్రారంభమైంది.

టి.అసెంబ్లీ జోరో అవర్ ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు కొనసాగుతున్నాయి. తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. జీరో అవర్ కొనసాగుతోంది.

11:40 - December 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు పలు అంశాలపై మాట్లాడుతున్నారు. ఈసందర్భంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ మొదటి దశ పనుల్లో అవినీతి జరిగిందో లేదో తేల్చాలని డిమాండ్ చేశారు. ఖర్చు పెట్టిన నిధులెన్ని..? జరిగిన పనులెన్ని..? తెలపాలన్నారు. హైటెక్ సిటీలో చెరువులను ఆక్రమించి ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నారని.. అక్కినేని నాగార్జునపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. 
ప్రతి చెరువు పునరుద్ధరణ : మంత్రి హరీష్ రావు 
అనంతరం మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ మొదటి దశ మిషన్ కాకతీయ పనులకు 2,595 కోట్లు, రెండో దశకు రూ.3130 కోట్లు కేటాయించామని తెలిపారు. జననవి చివరి వారంలో మిషన్ కాకతీయ మూడోదశ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి చెరువు పునరుద్ధరణ జరగాలన్నారు. మిషన్ కాకతీయ పథకాన్ని ప్రజలు సొంత పథకంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియ ఆన్ లైన్ ల్లోనే జరుగుతుందన్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో 169 చెరువులున్నాయిని తెలిపారు. హైటెక్ సిటీ చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకునే హక్కు జీహెచ్ ఎంసీకే ఉందన్నారు. ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహించదన్నారు. 36,911 చెరువులను ఇప్పటి వరకు జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు. మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయిన్నారు.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : ఈటెల 
2015 జనవరి నుంచి విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. అన్ని పాఠశాలలతోపాటు హాస్టళ్లలో కూడా సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సన్నబియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే కాలంలో ఒక్కగింజ కూడా పాడవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వడ్లకు ధర కేంద్రం నిర్ణయిస్తుందని చెప్పారు. 34 వేల పాఠశాలల్లో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంటర్, డిగ్రీ కాలేజీల్లోనూ సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రతిపాదన ఉందన్నారు. సన్న బియ్యం పెట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో తినే విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.
నిమ్స్ లో వెంటిలేటర్స్ అందుబాటులో లేవు : డీకే అరుణ
నిమ్స్ లో వెంటిలేటర్స్ అందుబాటులో లేవని కాంగ్రెస్ నాయకురాలు డీకే.అరుణ అన్నారు. పూర్తి వైద్య సేవలు పేదలకు అందించాలన్నారు. అన్ని వ్యాదులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పనిచేయడం లేదు : రామ్మోహన్ 
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పనిచేయడం లేదని రామ్మోహన్ తెలిపారు. ఆరోగ్యశ్రీలో రాజీవ్ బొమ్మ తొలగించారన్నారు. 
ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించాలి : సంపత్  కుమార్ 
ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించాలని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ అన్నారు. కర్నూలకు వైద్యం కోసం వెళ్లే తెలంగాణ వారికి ఆరోగ్య వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శ్రీ అందుబాటులో ఉన్న ఆస్పత్రుల వివరాలను వెల్లడించాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ నుంచి తొలగించిన వ్యాధులను మళ్లీ చేర్చాలని కోరారు. ఆరోగ్యశ్రీ పేదల పాటి వరం అని ప్రభాకర్ అన్నారు.
నిమ్స్ లో వైద్య సేవలు మెరుగుపర్చాలి : సండ్ర 
ఏపీలో కూడా ఆరోశ్రీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నిమ్స్ లో వైద్య సేవలు మెరుగుపర్చాలన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పని చేయడం లేదన్నారు. 
జిల్లా ఆస్పత్రుల్లో కూడా ఐసీయూలు : మంత్రి లక్ష్మారెడ్డి
గత ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేశాయని మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. సీఎం చొరవతో ప్రభుత్వ ఆస్పత్రులో వసుతులు మెరుగయ్యాయని తెలపారు. జిల్లా ఆస్పత్రుల్లో కూడా ఐసీయూలు ఏర్పాటు చేశామని చెప్పారు. 322 ఆస్పతుల్లో ఆరోగ్య సేవలు కొనసాగుతున్నాయిని చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు మెరుగపర్చాం కానీ.. తగ్గించలేదన్నారు. వనపర్తి జిల్లా ఆస్పత్రిలో సౌకర్యాలు లేవని చిన్నారెడ్డి అన్నారు. 
యాదవులకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలి  : ఆర్.కృష్ణయ్య
అత్యధికంగా 26 లక్షల జనాభా కలిగిన కులం గొల్లమని ఆర్.కృష్ణయ్య అన్నారు. యాదవులకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం కుల వృత్తులను ఆదుకోవాలనే సంకల్పంతో ఉందన్నారు.
సీఎం చొరవతో కేంద్రం నుంచి 400 కోట్లు : మంత్రి తలసాని..
సీఎం చొరతవో 400 కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సొసైటీలకు తెలంగాణ సర్కార్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమాలు ప్రతి గొల్ల కురుమలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కుల వృత్తులను ఆదుకోవాలనే సంకల్పంతో ఉందని తెలిపారు. రైతు సమస్యలపై రేవంత్ రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.

 

11:40 - December 16, 2016

టాలీవుడ్..బాలీవుడ్..వివిధ వుడ్ లో నటించే హీరోలు..హీరోయిన్స్ సినిమాల్లో నటిస్తూనే వ్యాపారంలో కూడా అడుగుపెడుతుంటారు. కొంతమంది సక్సెస్ కాగా మరికొంతమంది సక్సెస్ కాలేక పోతుంటారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ యంగ్ హీరో 'సందీప్ కిషన్' వచ్చి చేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో 'వివాహ భోజనంబు' పేరిట ఓ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. గురువారం సాయంత్రం ఈ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది. సినీ నటి 'రెజీనా' ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అచ్చమైన తెలుగు వంటకాల రుచిని ఈ రెస్టారెంట్ లో చూపెట్టనున్నారు. అద్వితీయమైన రుచులను అతిథులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ రెస్టారెంట్ ను ప్రారంభించినట్టు సందీప్ తెలిపాడు. గతంలో ఎన్నడూ చూడని రుచులను ఈ రెస్టారెంట్ లో చూస్తారని చెప్పారు.

సర్కార్ ఆసుపత్రులను గత ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయి - లక్ష్మారెడ్డి..

హైదరాబాద్ : సర్కార్ ఆసుపత్రులను గత ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయని శాసనసభలో మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శీతాకాల సమావేశంలో విపక్షాలు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. వైద్యులు, సాఫ్ట్ రిక్రూట్ మెంట్ గతంలో జరగలేదని, ప్రభుత్వం వచ్చిన అనంతరం ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి మెరుగుపడిందన్నారు. నేషనల్ లెవల్ లో ఇటీవలే జాతీయ అవార్డు తీసుకోవడం జరిగిందని, 20 శాతం ప్రభుత్వాసుపత్రుల వచ్చే వారి సంఖ్య పెరిగిందన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని యదావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 322 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఎన్ని గుండె ఆపరేషన్లు చేశారు - కోమటిరెడ్డి..

హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ కింద గుండె ఆపరేషన్లు ఎన్ని చేశారని టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి ప్రశ్నించారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు.

తొలగించిన వ్యాధులను ఆరోగ్య శ్రీలో చేర్చాలి - సంపత్ కుమార్..

హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ నుండి తొలగించిన వ్యాధులను మళ్లీ చేర్చాలని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ అందుబాటులో ఉన్న ఆసుపత్రుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కర్నూలుకు వైద్యం కోసం వెళ్లే తెలంగాణ వారికి ఆరోగ్య వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

11:18 - December 16, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్ది సేపటికే లోక్ సభ వాయిదా పడింది. సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. నేటితో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి.

 

పెన్షన్ కోసం వచ్చి మహిళ మృతి..

శ్రీకాకుళం : వజ్రపుకొత్తూరు (మం) దేవునల్తాడ ఆంధ్రాబ్యాంకు వద్ద పెన్షన్ డబ్బుల కోసం వచ్చి లక్ష్మమ్మ అనే మహిళ మృతి చెందింది.

11:13 - December 16, 2016

మోడీని కలిసిన రాహుల్ బృందం..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బృందం కలిసింది. రైతుల సమస్యలపై మోడీతో బృందం చర్చించింది.

11:10 - December 16, 2016

ఢిల్లీ : నేటితో పార్లమెంట్ సమవేశాలు ముగియనున్నాయి. బీజేపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ దిశానిర్ధేశం చేశారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని కలిశారు. రైతు రుణమాఫీపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

అన్ని వ్యాధులకు ఆరోగ్య శ్రీ వర్తించాలి - డీకే అరుణ..

హైదరాబాద్ : నిమ్స్ లో వెంటిలేటర్స్ అందుబాటులో లేవని, పూర్తి వైద్య సేవలు పేదలకు అందించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సూచించారు. అన్ని వ్యాధులకు ఆరోగ్య శ్రీ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ప్రశ్నోత్తారలపై ఆయన మాట్లాడారు.

నిమ్స్ కు రూ. 100 కోట్ల బకాయిలు -జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రులకు సంబంధించిన అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, అందులో నిమ్స్ కు రూ. 100 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ప్రశ్నోత్తారలపై ఆయన మాట్లాడారు.

 

రాష్ట్రంలో వైద్యం పడకేసింది - ఎమ్మెల్యే రామ్మోహన్..

హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యం పడకేసిందని ఎమ్మెల్యే రామ్మోహన్ విమర్శించారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, ఈ అక్రమాలపై ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే రామ్మోహన్ పేర్కొన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ప్రశ్నోత్తారలపై ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, కాంగ్రెస్ సర్కార్ ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టిందని, ఆరోగ్య శ్రీలో రాజీవ్ బొమ్మను ప్రభుత్వం తొలగించిందని తెలిపారు.

11:01 - December 16, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దై 39 రోజులైనా నగదు కష్టాలు తీరడం లేదు. నగదు కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 95 శాతం ఏటిఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంల ముందు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. క్యూలైన్ లలో నిలబడలేక అవస్థలు వృద్ధులు పడుతున్నారు. మరో రెండు వారాట్లో సర్దుకుంటాయని కేంద్రం చెబుతుంది. డిజిటల్ లావాదేవీలే సమస్యలకు పరిష్కారమని  కేంద్రం అంటుందోంది. కరెన్సీ కష్టాలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:56 - December 16, 2016

చెన్నై : ఇండియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య 5వ టెస్ట్‌కు  రంగం సిద్ధమైంది. ముంబై టెస్ట్‌లో సంచలన విజయం సాధించిన విరాట్‌ ఆర్మీ ఆఖరి  టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌తో పాటు ప్రస్తుత సీజన్‌ను విజయంతో ముగించాలని తహతహలాడుతోంది. అంచనాలకు తగ్గట్టుగా రాణించి టీమిండియా ఆధిపత్యానికి చెక్‌ పెట్టి ఓదార్పు విజయం సాధించాలని కుక్‌ అండ్‌ కో  పట్టుదలతో ఉంది. 

ఇండియా-ఇంగ్లండ్‌  టెస్ట్‌ సిరీస్‌లోని  క్లైమాక్స్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.5 మ్యాచ్‌ల సిరీస్‌లోని అసలే మాత్రం ప్రాధ్యాన్యం లేని ఆఖరి మ్యాచ్‌కు చెన్నె చెపాక్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. 

వైజాగ్‌, మొహాలీ, ముంబై టెస్ట్‌ల్లో మోత మోగించిన కొహ్లీ అండ్‌ కో ఆఖరి టెస్ట్‌లోనూ నెగ్గి తీరాలని తహతహలాడుతుండగా....మరోవైపు ఆతిధ్య జట్టు ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలని కుక్‌ అండ్‌ కో పట్టుదలతో ఉంది.   

ఇరు జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో ఇంగ్లండ్‌దే పై చేయిగా ఉన్నా...ప్రస్తుతం టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియా ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తోందో అందరికీ తెలిసిందే. గత 17 టెస్టుల్లో ఓటమంటూ లేని టీమిండియా...ఆఖరి టెస్ట్‌లోనూ అదే స్థాయిలో చెలరేగాలని పట్టుదలతో ఉంది.
భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌ బలోపేతంగా 
కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు టెస్ట్‌ స్పెషలిస్ట్‌లు, టాప్‌ క్లాస్‌ స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లతో పవర్‌ఫుల్‌గా ఉంది. మురళీ విజయ్‌,పుజారా  కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో కెప్టెన్‌ కొహ్లీ జట్టును ముందుండి నడిపిస్తుండటంతో భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌ బలోపేతంగా ఉంది. అంతంత మాత్రంగానే రాణిస్తోన్న అజింక్యా  రహానే,రాహుల్‌ పూర్తి స్థాయిలో చెలరేగితే భారత బ్యాటింగ్‌కు తిరుగుండదు. 

అశ్విన్‌,జడేజా,జయంత్‌ యాదవ్‌ వంటి మేటి స్పిన్నర్లతో భారత స్పిన్‌ బౌలింగ్‌ విభాగం ఎప్పటిలానే పటిష్టంగా ఉంది.  మొహాలీ టెస్ట్‌లో భారత స్పిన్ త్రయం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌ విజయంలో కీలక పోషించిన సంగతి తెలిసిందే. అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌, జయంత్‌ యాదవ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన భారత జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరో వైపు ఇంగ్లండ్‌  జట్టు ప్రస్తుత సిరీస్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించింది లేదు. బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నా....ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది.అలిస్టర్‌ కుక్‌,జో రూట్ స్థాయికి తగ్గట్టుగా భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతుండటంతో ఇంగ్లండ్‌ జట్టు తేలిపోతోంది.  ప్రధానంగా  భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. 

స్పిన్నర్లు మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ ఫర్వాలేదనిపిస్తోన్నా... స్పీడ్‌ గన్‌ జేమ్స్‌ యాండర్సన్‌,అంతగా ప్రభావం చూపలేకపోతుండటంతో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విఫలమవుతోంది.ప్రతికూలతలన్నీ అధిగమించి చివరి టెస్ట్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని ప్లాన్‌లో ఉంది.


స్పిన్నర్లకు అనుకూలించే చెపాక్‌ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఫామ్‌ చూస్తుంటే....చెన్నై టెస్ట్‌లోనూ  టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఆఖరి టెస్ట్‌లోనూ నెగ్గి  కొహ్లీ అండ్‌ కో  సిరీస్‌తో పాటు ప్రస్తుత సీజన్‌ను విజయంతో ముగిస్తుందో లేదో చూడాలి. 

10:54 - December 16, 2016
10:53 - December 16, 2016
10:49 - December 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరు దేశానికే ఆదర్శంగా నిలవాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు ఆకాంక్షించారు. సమావేశాలు పొడిగించేందుకు మాకు అభ్యంతరం లేదని...విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఆయన మాటల్లోనే చూద్దాం..
'సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగాలి. సమావేశాలు పొడిగించేందుకు మాకు అభ్యంతరం లేదు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు మేం రెడీ. డబుల్‌బెడ్ రూం ఇళ్లు, ఎన్నికల మెనిఫెస్టో, నయీం ఎన్‌కౌంటర్‌..
అంశం ఏదైనా చర్చకు మేం సిద్ధం. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపుతాం, ప్రత్నామ్నాయాలు ఏర్పాటు చేస్తాం' అని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:49 - December 16, 2016

టాలీవుడ్ కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా పేరొందిన నటుల్లో 'జగపతి బాబు' ఒకరు. ప్రస్తుతం ఈయన రూటు మార్చారు. విలన్ గా అవతారమెత్తి సరికొత్త ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. ఆయన టించిన చిత్రాలు మంచి పేరే తెచ్చుకున్నారు. స్టైలిష్ విలన్ క్యారెక్టర్ కు 'జగపతి' కేరాఫ్ అడ్రస్ గా మారారు. పలువురు హీరోల చిత్రాల్లో విలన్ గా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘లెజెండ్' చిత్రం ద్వారా తొలిసారి విలన్ పాత్రలో కనిపించారు. దర్శకుడు 'బోయపాటి శ్రీను' తాజా చిత్రంలో 'జగపతిబాబు' ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 'బెల్లకొండ సాయిశ్రీనివాస్' కథానాయకుడిగా 'బోయపాటి శ్రీను' దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఓ కీలక పాత్ర కోసం 'జగపతి'ని ఎంపిక చేశారు. ప్రస్తుతం విశాఖలో రెండో షెడ్యూల్ జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణం పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో 'జగపతి' కూడా షూటింగ్ లో పాల్గొన్నారని తెలుస్తోంది. 'రకూల్‌ ప్రీత్‌సింగ్’, 'ప్రగ్యా జైస్వాల్' కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలోని తమిళ హీరో 'శరత్‌కుమార్' కూడా ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వీరు పాత్రలు ఎలా ఉంటాయో ? ప్రేక్షకులను ఎలా అలరిస్తారో వేచి చూడాలి.

సన్నబియ్యం పంపిణీలో అక్రమాలు సహించం - ఈటెల..

హైదరాబాద్ : సన్నబియ్యం పంపిణీలో అక్రమాలు జరిగితే ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి ఈటెల పేర్కొన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సన్నబియ్యం పంపిణీ..ఇతరత్రా అంశాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటెల సమాధానం చెప్పారు.

10:37 - December 16, 2016

పెద్ద నోట్ల రద్దు వస్త్ర వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని గుండ శ్రీనివాస్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'నోట్ల రద్దు తర్వాత అన్ని రంగాల్లోనూ నిరాశామేఘాలు కమ్ముకున్నాయి. ఏ వ్యాపారిని పలకరించినా, తమ బాధ, వేదన వెళ్లగక్కుతున్నారు. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడే వస్త్ర దుకాణాలు సైతం వెలవెలబోతున్న దృశ్యాలు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత వస్త్ర వ్యాపారం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జనవరి చివరి వారంలో మిషన్ కాకతీయ ఫేజ్ 3 పనులు..

హైదరాబాద్ : మొదటి మిషన్ కాకతీయ పనులకు 2595 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. జనవరి చివరి వారంలో మూడో దశలు జరుగుతాయన్నారు. రెండో దశకు రూ. 3130 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

10:33 - December 16, 2016
10:30 - December 16, 2016

నోట్ల రద్దు టెక్స్ టైల్ రంగానికి పెనుశాపంగా మారుతోంది.  వ్యాపారాలు పడిపోవడంతో వస్త్ర వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.  మరో నెల రోజుల్లో సంక్రాంతి పండుగ వున్నా కొత్త స్టాక్ తెచ్చుకోలేని స్థితిలో వస్త్ర వ్యాపారులు చిక్కుకున్నారు. టైలర్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసేవారు, శారీ ఫాల్స్ కుట్టేవారు, చేతిపనిచేసేవారు ఇలా అనేకమంది ఉపాధికి గండికొట్టింది నోట్ల రద్దు వ్యవహారం.
పెద్ద నోట్ల రద్దుతో కష్టాలు
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో టెక్స్ టైల్ రంగానిది కీలకపాత్ర. మన దేశ జీడీపీలో టెక్స్ టైల్ రంగం వాటా 5శాతం దాకా వుంది.  టెక్స్ టైల్ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే మనది రెండో స్థానం. మన దేశ ఎగుమతుల్లో 11శాతం టెక్స్ టైల్ రంగం నుంచే వుండడం విశేషం.  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నాలుగు నుంచి ఆరు కోట్ల మంది ఈ రంగం మీద ఆధారపడి వున్నారు. ఇప్పుడు వీరి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతోంది. రాబోయే రోజులు ఎలా వుంటాయోనన్న ఆందోళన వీరిని చుట్టుముట్టింది. ఈ ఆదుర్ధానికి కారణం నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మరుక్షణం నుంచి తీవ్రంగా ప్రభావితమవుతున్న రంగాలలో టెక్స్ టైల్ రంగం  కూడా వుంది.  ఒక్కసారిగా కరెన్సీ సమస్య తలెత్తడంతో వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు పడిపోయాయి.  చీరలు, బ్లౌజ్ పీస్ లు, చుడీదార్ లు, ధోవతిలు, లుంగీలు, ప్యాంట్లు, షర్టులు, చివరకు చిన్న పిల్లల దుస్తుల అమ్మకాలు కూడా పడిపోయినట్టు వస్త్రదుకాణాల వారు చెబుతున్నారు. 
పడిపోయిన బట్టల అమ్మకాలు  
బట్టల అమ్మకాలు పడిపోవడంతో దాని ప్రభావం దర్జీల మీద, ఎంబ్రాయిడరీ వర్కర్స్ మీద కూడా పడుతోంది. చివరకు చీరలకు పాల్స్, బ్లౌజ్ లు కుట్టే పని కూడా దొరకడం లేదంటూ ఈరంగంలోని మహిళలు ఆవేదన చెందుతున్న దృశ్యమే దేశమంతటా కనిపిస్తోంది. వస్త్రాల అమ్మకాలు పడిపోవడంతో సహజంగానే బట్టల మిల్లుల్లో ఉత్పత్తి తగ్గిస్తున్నారు.  చాలామంది వస్త్రాల తయారీని సగానికి సగం తగ్గించారు. దీంతో వర్కర్లకు వారంలో రెండు మూడు రోజులకు మించి పని దొరకడం లేదు.  టెక్స్ టైల్ రంగంలో అత్యధిక శాతం క్యాష్ బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు క్యాష్ కు కొరత రావడంతో యావత్ పరిశ్రమ ఉక్కిరిబిక్కరవుతోంది.  చివరకు దీని ప్రభావం పత్తి సాగే రైతుల మీద కూడా పడుతోంది. వస్త్రాల వ్యాపారం పడిపోవడం, గిరాకీ తగ్గడం, కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో పత్తి కొనుగోళ్లు కూడా తగ్గిపోయాయి.  వస్త్ర వ్యాపారం పడిపోవడంతో తమ దగ్గర పనిచేసే వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతోందన్న  ఆందోళన వస్త్ర వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. షాపు కిరాయి, కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో పలువురు వస్త్ర వ్యాపారులు చిక్కుకున్నారు. ఇది పండుగల సీజన్.  మరో పది రోజుల్లో క్రిస్మస్, ఆ తర్వాత సంక్రాంతి పండుగలున్నాయి. . ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు కొనుక్కునే పండుగలివి. కొత్త మోడల్స్, కొత్త వెరైటీల కోసం కొనుగోలుదారులు వెదుకుతుంటారు. కానీ, వ్యాపారాలు పడిపోవడంతో కొత్త స్టాక్ తీసుకురాలేని పరిస్థితి ఎదురైందంటున్నారు వస్త్ర వ్యాపారులు. 

మిషన్ కాకతీయపై రేవంత్ ప్రశ్నలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మిషన్ కాకతీయపై టి.టిడిపి సభ్యుడు రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. ఫేజ్ 1, ఫేజ్ 2 కింద ఎంత నిధులు..ఎంత ఖర్చు పెట్టారో ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ కన్వేషన్ సెంటర్ లో సినీ నటుడు అక్కినేని నాగార్జున నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు.

10:17 - December 16, 2016

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోడీ ఏం సాధించారని వక్తలు అశ్నించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, కాంగ్రెస్ నేత కైలాష్, బీజేపీ నేత టి.ఆచారి, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రదాని ఎందుకు తీసుకున్నారో.. ఇంతవరకు పార్లమెంట్ లో చెప్పలేదన్నారు. ప్రజల సమస్యలు చూస్తుంటే ప్రభుత్వ అసమర్ధత బయటపడుతుంది. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద సమస్య ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు. ఆర్ బీఐ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ప్రధాని తీసుకున్నారని తెలిపారు. నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:16 - December 16, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నాణ్యత, భద్రత ప్రమాణాలతో మెరుగైన రోడ్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జరిగే ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 77వ వార్షిక సమావేశాలను ఆయన ప్రారంభించారు.
సమావేశాలను ప్రారంభించిన మంత్రి తుమ్మల  
తెలంగాణ రాష్ట్రం తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల ఘనంగా ప్రారంభించారు. హెటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 77వ వార్షిక సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ర్టాలతో పాటు విదేశాల నుంచి కూడా ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, వంతెనల నిర్మాణ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై సమావేశాల్లో చర్చలు జరుగుతాయి.
హైదరాబాద్ లో నిర్వహించటం గర్వకారణం : మంత్రి తుమ్మల 
ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశం హైదరాబాద్ లో నిర్వహించటం తమకు గర్వకారణమని అన్నారు మంత్రి తుమ్మల. ఇతర దేశాల కన్నా తెలంగాణలో రోడ్స్, భవనాల నిర్మాణం మిన్నగా ఉండాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు. రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం 12,500 కోట్లు రహదారుల నిర్మాణానికి కేటాయించిందని మంత్రి తుమ్మల వివరించారు. 
ఆధునిక పద్ధతులు, టెక్నాలజీ ఉపయోగం 
ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రధానంగా రహదారి నిర్మాణంలో ఆధునిక పద్ధతులు, టెక్నాలజీ ఉపయోగం, పర్యావరణ పరిరక్షణ, ప్రమాదాల నివారణపై చర్చిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే టెక్నికల్‌ సెషన్స్‌ను తెలంగాణ సీఎస్‌ ప్రదీప్‌ చంద్ర ప్రారంభిస్తారు. పలు రాష్ట్రాలు ఉపయోగించే పద్ధతులు, దేశ విదేశాల్లో రోడ్ల నిర్మాణంపై నిపుణులు చర్చించనున్నారు. దీనికి సంబంధించి సమావేశాల్లో తీర్మానాలు చేస్తారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఈనెల 17న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు.  

 

మిషన్ కాకతీయపై కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు..

హైదరాబాద్ : మిషన్ కాకతీయపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మిషన్ కాకతీయ..చెరువుల పునరుద్ధరణపై సభ్యులు పలు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నోత్తరాలు గంటన్నర పాటు కొనసాగనున్నాయి.

10:14 - December 16, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రదు చేసి 37 రోజులు గడిచిపోయింది. ప్రజలకు కరెన్సీ కష్టాలు తీరకపోగా, రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నా ఉద్యోగులు జీతాలు, పెన్షనర్లు పించన్లు తీసుకోలేని దుస్థితి దాపురించింది. కార్మికులు దాచుకున్న కష్టార్జితం అవసరానికి  అందని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వెరసి నగదు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. 
మోదీ నిర్ణయంపై జనం ఆగ్రహం
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తొలగిపోయే సూచనలు కనిపించడం లేదు. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల దగ్గర రోజురోజుకు క్యూలైన్లు పెరుగుతున్నాయే కానీ తగ్గడంలేదు. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై జనం విరుచుకుపడుతున్నారు. 
బ్యాంకులు, ఏటీఎంల దగ్గర జనం పడిగాపులు 
నగదు కోసం బ్యాంకుల దగ్గర నాలుగు గంటలు వేచివున్నా రేషన్‌ పద్ధతిలో రెండు వేలు లేదా మూడు వేల రూపాయలకు మించి ఇవ్వడంలేదు. డబ్బు కోసం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలైన్ల ఘర్షణలు, గొడవలు తప్పడం లేదు. బ్యాంకుల దగ్గర ధర్నాలు, నిరసనలు ఎక్కువ అవుతున్నాయి. 
ప్రజల అవస్థలు వర్ణనాతీతం
ఏటీఎం కేంద్రాల్లో నగదు అందుబాటులో లేక, బ్యాంకుల్లో మూడు, నాలుగు గంటలు నిలుచున్నా  పరిమితంగానే డబ్బులు ఇస్తుండటంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అన్ని పనులు మానుకుని ఎన్నిరోజులు ఈ పాట్లు అంటూ మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. బ్యాంకుల్లో  జీవితం తెల్లారిపోతోందని ఆవేవన వ్యక్తం చేస్తున్నారు. 
బడా బాబుల వద్ద కట్టు కట్టలుగా కొత్త కరెన్నీ నోట్లు 
నేతలు, బడా బాబుకుల కొత్త కరెన్నీ నోట్లు కట్టు కట్టలుగా ఎలా వెళుతున్నాయని జనం ప్రశ్నిస్తున్నారు. రెండు వేల రూపాయల కోసం బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల దగ్గర గంటల కొద్దీ నిలుచునే దయనీయ పరిస్థితులకు దేశాన్ని దిగజార్చిన ప్రధాని మోదీపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. 
పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ మౌనదీక్ష 
పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల సిండికేట్‌ బ్యాంకు  దగ్గర మౌనదీక్ష జరిగింది. మాజీ ఎంపీ  వీ హనుమంతరావుతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
బ్యాంక్యుల తీరుపై ప్రజలు అసంతృప్తి 
ఐదు వందల రూపాయల  నోట్లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తే కొంత వరకు కష్టాలు తీరతాయని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఈ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫమవుతున్న బ్యాంక్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

10:09 - December 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడీగా సాగబోతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను శాసన సభలో ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. టీడీపీ ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వ్యూహం రచిస్తోంది.
మాటల తూటాలు పేలే అవకాశాలు 
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల తూటాలు పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు సమష్టిగా ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై.. ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతమేరకు నెరవర్చారో ఆధారాలతో సహా సభ ముందు ఉంచేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. అలాగే కాంగ్రెస్‌..బీజేపీలు కూడా ప్రభుత్వ వాస్తవ రూపాన్ని ప్రజలకు చూపిస్తామని అంటున్నాయి. ప్రధానంగా ఇటీవల సీఎం ప్రారంభించిన నూతన గృహ సముదాయం కోసం పెట్టిన ఖర్చు.. విలాసవంతమైన విధానాల గురించి చర్చిస్తామని చెప్పుకొస్తున్నారు. 
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాల గురి 
ప్రభుత్వానికి సంబంధించి మొత్తం 18 వైఫల్యాలపై ప్రశ్నిస్తామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెబుతున్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటుందని.. నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోకపోవడం.. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు.. ప్రాజెక్ట్‌ల రీ డిజైనింగ్‌ వల్ల పెరుగుతున్న అంచనా వ్యయం తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ రాబట్టాలని టీడీపీ అనుకుంటోంది. అలాగే జిల్లాల పునర్విభజనతో తలెత్తుతున్న సమస్యలపై నిలదీసేందుకు టీడీపీ రెడీ అయింది. వీటితో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 90రోజుల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వు ఇచ్చిన నేపథ్యంలో సభాపతి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రశ్నించాలని టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది. 
ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అధికారి రెడీ 
అయితే శాసనసభలో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ కూడా రెడీ అవుతోంది. అందుకోసం మంత్రి హరీష్‌రావుకు తగిన తర్ఫీదునిచ్చి.. రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 

నేడు నరసరావు పేటలో వైసీపీ బహిరంగ సభ

గుంటూరు : నేడు నరసరావు పేటలో వైసీపీ బహిరంగ సభ జరుగనుంది. జగన్ సమక్షంలో కాసు మహేష్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అంతకుముందు టి.టిడిపి సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళలుర్పించారు.

తెలంగాణలో అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వివక్షాలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలిచ్చాయి. రైతులకు మద్దతు ధర, ఇన్ పుట్ సబ్సిడీ, నకిలీ విత్తనాలు, పంట నష్టపరిహారంపై టిడిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. 12 శాతం ముస్లిం రిజర్వేషన్ తో బీసీలకు అన్యాయం జరుగుతుందని బీజేపీ...పెద్దనోట్ల రద్దు అనంతర పరిమాణాలపై శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి.

కొమురెల్లి ఆలయ ఏఈవో సస్పెండ్..

సిద్ధిపేట : కొమురెల్లి ఆలయ ఏఈవో అంజయ్య రాసలీలపై ఉన్నతాధికారులు స్పందించారు. సహా ఉద్యోగినితో అంజయ్య రాసలీలలు కొనసాగించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఉన్నతాధికారులు వారిద్దరినీ సస్పెండ్ చేశారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద టి.టిడిపి ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళుర్పించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి టి.టిడిపి ఎమ్మెల్యేలు బయలుదేరారు. నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..

చెన్నై : భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

07:12 - December 16, 2016

హైదరాబాద్ : నేటి నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. రెండున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని సభ ముందు ఉంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు మంత్రులు  దీటుగా  సమాధానం చెప్పేలా ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సర్కారు సర్వసనద్ధమైంది. విధాన నిర్ణయాల్లో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్షాలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో, సర్కారు కూడా వ్యూహాత్మంగా ముందుకు పోవాలని నిర్ణయించింది.  
సమగ్ర సమాచారంతో మంత్రులు సిద్ధం 
అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలకు సమగ్ర సమాచారంతో మంత్రులు సిద్ధమయ్యారు. రెండున్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సభ ముందు ఉంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అన్ని విషయాల్లో అధికార పక్షమే  పైచేయి సాధించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేసే విధంగా మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా, ఆందోళనలు చేపట్టినా, నిరసనలు వ్యక్తం చేసినా అన్నింటికీ సమాధానం చెప్పేలా మంత్రులను సిద్ధం చేశారు. అసెంబ్లీలో అన్ని విషయాలపై అర్థవంతమైన చర్చ జరగాలన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. ఏ అంశంపై కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని వేలెత్తిచూపే అవకాశం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే... తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. 
 

నేడు ప్రధాని మోడీని కలవనున్న రాహుల్ గాంధీ

ఢిల్లీ : ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోడీని రాహుల్ గాంధీ కలవనున్నారు. రైతుల సమస్యలపై మోడీని కలవనున్నారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలవనుంది. 

 

నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతలతో ప్రధాని మోడీ భేటీ

ఢిల్లీ : నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. పార్టీ ఎంపీలను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడనున్నారు. 

 

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. పెద్ద నోట్ల రద్దు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగనుంది. 

 

నేడు జూనియర్ హాకీ సెమీ ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా ఢీ

హైదరాబాద్ : నేడు జూనియర్ హాకీ సెమీ ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా ఢీకొననున్నాయి.  

Don't Miss