Activities calendar

13 December 2016

22:03 - December 13, 2016
22:01 - December 13, 2016
21:59 - December 13, 2016
21:57 - December 13, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత.. భారీ మొత్తంలో కొత్త కరెన్సీ బయట పడుతోంది. మొన్నటి శేఖర్‌రెడ్డి ఉదంతం మరవక ముందే తాజాగా బెంగళూర్‌లో ఆర్బీఐ అధికారి అరెస్ట్‌ అయ్యారు. కమీషన్‌ తీసుకుని కోటిన్నర రూపాయల కొత్త కరెన్సీని అక్రమంగా మార్పిడి చేయడంతో మైకేల్‌ అనే ఆర్బీఐ అధికారిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ వ్యవహారంలో మైకేల్‌తో పాటు మరో ఇద్దరిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. 

1.5 కోట్లు.. 

అక్రమ నోట్ల మార్పిడి వ్యవహారంలో రిజర్వ్ బ్యాంకు సీనియర్‌ అధికారిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. బెంగళూరులో ఆర్బీఐ అధికారితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కమీషన్‌ తీసుకుని 1.5 కోట్ల రూపాయల పాత నోట్లకు కొత్త కరెన్సీ ఇచ్చినట్లు సదరు అధికారిపై ఆరోపణలున్నాయి. ఈ దాడుల్లో ఈడీ అధికారులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.    ఆర్బీఐలో సీనియర్‌ స్పెషల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కే. మైకేల్‌... ఇటీవల పాత ఐదు వందలు, వేయి రూపాయల నోట్లను మార్చినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా 6 లక్షల విలువ గల పాత నోట్లకు కొత్త 100 రూపాయల కరెన్సీ మార్పిడి చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడయింది. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు సరఫరా చేయాల్సిన నగదులో తక్కువ ఉన్నట్లు గుర్తించిన అధికారులు మైకేల్‌ను అనుమానించి విచారించారు. విచారణలో కమీషన్‌పై నగదు మార్పిడి పాల్పడ్డట్లు తేలడంతో.. సీబీఐ అధికారులు మైకేల్‌పై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం మైకేల్‌ను ఆరు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ బయటపడుతుండటంతో... ఆర్బీఐ నిఘా పటిష్టం చేసింది. ఏయిర్‌పోర్టులు, చెక్‌పోస్టులు, బ్యాంకులపై నిఘా పెంచింది. 

ఈ నెలాఖరుకు సీబీఎస్ ఈ బోర్డు మీటింగ్..

ఢిల్లీ : ఈనెలాఖరుకు సీబీఎస్ ఈ బోర్డు సమావేశం జరగనుంది. 2017-18 విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ ఈ పరీక్ష తప్పనిసరి చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టానికి సవరణలు చేస్తామని, వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రతిపాదనలు పెడుతామన్నారు.

 

ఈనెల 16న నర్సారావుపేటలో వైసీపీ బహిరంగసభ..

గుంటూరు : ఈనెల 16న నర్సరావుపేటలో వైసీపీ బహిరంగసభ నిర్వహించనుంది. ఈ సభకు వైసీపీ అధ్యక్షుడు జగన్ హాజరు కానున్నారని వైసీపీ నేత బోత్స పేర్కొన్నారు. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి జగన్ సమక్షంలో పార్టీలో చేరుతారని తెలిపారు. 

పాతబస్తీలోని ఇంటర్నెట్ కేంద్రాలపై పోలీసుల దాడులు..

హైదరాబాద్ : పాతబస్తీలోని ఇంటర్నెట్ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పలు కేంద్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైనర్లకు అనుమతినిచ్చిన నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

 

20:34 - December 13, 2016

పనిచేసే సత్తా ఉంది..దమ్ముంది..పని ఉంది. పనిచేస్తే చేతికి వచ్చే డబ్బుతోనే సమస్యలు అంతా. కార్మికులు రోజు మొత్తంగా పనిచేస్తే వచ్చేది రూ. 400 నుండి రూ. 500. కానీ ఈ నోటే ప్రస్తుతం కార్మికుడి పొట్ట కొడుతోంది. పనులు లేక ఉట్టిగా కూర్చుంటున్నరు. పెద్దనోట్ల రద్దు అనంతరం వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి తెలుసుకొనేందుకు ‘మల్లన్న’ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో గ్రానైట్ కార్మికుల బాధను బాహ్య ప్రపంచానికి తెలియచేశాడు. రోజు పనిచేస్తే రూ. 500 వస్తుంది..నెలకు రూ. 9-10 వేల వరకు ఇంటి ఖర్చు ఉంటుందని ఓ కార్మికుడు పేర్కొన్నాడు. రూ. 2వేల నోటుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, డబ్బులు లేకుంటే ఎలా బతకాలని వాపోయారు. ఏ కంపెనీలలో కూడా సంతోషంగా ఉన్నామని కార్మికుడు చెప్పలేదని 'మల్లన్న' తెలిపాడు. 50 రోజుల్లో మొత్తం మారుస్తామని చెప్పిన పాలకులు నెల రోజుల్లో ఎంత మార్పు వచ్చిందో ఆలోచించాలని అభిప్రాయం తెలిపారు. ఏబీసీడీలే రావు..ఆన్ లైన్ ట్రాన్స్ ఎలా చేస్తామని అక్కడి కార్మికులు పేర్కొన్నారు. కార్మికుల బాధలు..కష్టాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:28 - December 13, 2016

పెద్దనోట్ల రద్దు ప్రభావం ఏ రంగాలపై కనబడుతోంది ? ఆయా రంగాల్లో పనిచేసే కార్మికుల కష్టాలు ఎలా ఉన్నాయి అనే దానిపై 'మల్లన్న' దృష్టి సారించాడు. వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల కష్టాలను..నష్టాలను ప్రజలకు తెలియచేస్తున్నాడు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాకు 'మల్లన్న' చేరుకున్నాడు.పెద్ద నోట్ల రద్దు ప్రభావం పరిశ్రమలపై ఎలా పడింది ? రద్దుతో ఏమన్నా నష్టం కలిగిందా ? లేదు లాభం కలిగిందా ? అనే దానిపై 'మల్లన్న' అడిగి తెలుసుకున్నాడు. అందులో భాగంగా టెన్ టివి ప్రతినిధితో 'మల్లన్న' మాట్లాడాడు. గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకపోయిందని, రెండు వేల ఫ్యాక్టరీలు కునారిల్లే పరిస్థితి నెలకొంది అని ప్రతినిధి పేర్కొన్నారు. 500 ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. కార్మికులు, గ్రానైట్ యాజమాన్యాలు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో క్లిక్ చేయండి. 

20:24 - December 13, 2016

కూరగాయలు కొనటానికి స్వైపింగ్..పచారీ కొట్లో పేటీఎం..షాపింగ్ మాల్ లో డెబిట్ కార్డ్.. మనీ ట్రాన్స్ ఫర్ కు ఆన్ లైట్ ట్రాన్సాక్షన్.. అంతా క్యాష్ లెస్.. ఓన్లీ ఆన్ లైన్..వినటానికి బానే ఉంది.. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలౌతోందా? వైరస్ లు మాల్ వేర్ లు కుప్పలు తెప్పలుగా పొంచి ఉన్నాయా? మీ స్మార్ట్ ఫోన్ ని కబళించే ప్రయత్నాలు చేస్తున్నాయా? ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా …. ఎకౌంట్ లో సొమ్ముతో పాటు, వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్.. అంతా ఊడ్చేసే ప్రమాదం ఉందా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..క్లీన్ మాస్టర్, మెమోరీ బూస్టర్, స్టాప్ వాచ్ , వైఫై ఎన్ హాన్సర్... ఏమిటివన్నీ అంటున్నారా? ఇవన్నీ వస్తూ వస్తూ స్మార్ట్ ఫోన్ శత్రువులను వెంటబెట్టుకొచ్చే యాప్ లు. పొరపాటున వీటిని మీ ఫోన్ లో రానిస్తే ఇక జరిగే ప్రమాదం ఊహించలేరు. ఇవే కాదు ఇలాంటి యాప్ లు ఇంకా చాలా ఉన్నాయి.

సైబర్ భద్రతా ప్రమాణాలు..
వైరస్ దాడులు పొంచి ఉన్నాయి..సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు..నేరాల సంఖ్య పెరుగుతోంది.. ఏ యాప్ లో ఏ ముప్పు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో క్యాష్ లెస్ ఇండియా కు పెద్ద సవాలే కనిపిస్తోంది. గూలిగన్ మీ ఎకౌంట్ గుట్టు రట్టు చేయాలని చూస్తోంది.. ఆకర్షణీయమైన యాప్ ల పేర్లతో సర్రున దూసుకొస్తోంది. పేమెంట్ గేట్ వే ల రూపంలో మాయ చేయటానికి తయారవుతున్నాయి. క్యాష్ లెస్ అయ్యే ఆరాటంలో కొంచెం ఆత్రపడినా అసలుకే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఓ పక్క కరెన్సీ అందుబాటులో లేదు.. ఏటీఎంలు తెల్లమొహం వేసి నిలబడ్డాయి..బ్యాంకులు భరోసా ఇవ్వటం లేదు. క్యాష్ లెస్ వైపు వెళ్లటానికి ఎన్నో అడ్డంకులు, మరెన్నో ప్రమాదాలు పొంచి ఉన్న పరిస్థితి.. ఇవన్నీ కలిసి సామాన్యుణ్ని దిక్కుతోచని స్థితిలో పడేస్తున్నాయి. క్యాష్ లెస్ తో దేశానికి జరిగే మేలు మాట తర్వాత...వైరస్ లు మాల్ వేర్ లతో స్మార్ట్ ఫోన్ మునిగిపోయే ప్రమాదం మాత్రం చాలా ఉంది. వినియోగదారులను టెక్నికల్ గా అప్ డేట్ చేయటమే కాదు.. సైబర్ భద్రతా ప్రమాణాలు పెంచకపోతే ఊహించని అనర్థాలను అనేకం ఎదుర్కోక తప్పదు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:14 - December 13, 2016

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 'ధృవ' దుమ్మురేపుతోంది. మొదటి రోజునే హిట్టు టాక్ ను సొంతం చేసుకున్న 'ధృవ'కి ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. కంప్లీట్ గా తనను తాను మార్చుకున్న 'చెర్రీ' నటనకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా మారడం ఖాయం అంటున్నారు. 'బ్రూస్ లీ' తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్న 'చెర్రీ' రీమేక్ కోసం ఇంత టైం స్పెండ్ చేయటం గురించి ఫాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నా అవుట్ పుట్ చూసాక మాత్రం హ్యాపీగా ఉన్నారు. జూనియర్ 'ఎన్టీఆర్' ఏడాదికి రెండేసి సినిమాలతో వస్తుంటే 'చెర్రీ' మాత్రం ఒక్క సినిమాతోనే అడ్జస్ట్ కమ్మని చెప్పడం కూడా వాళ్ళకు నచ్చడం లేదు. అందుకే వాళ్ళను సంతృప్తి పరిచే విషయంలో రాజీ పడకుండా ఎంత రిస్క్ చేయడానికైనా సై అంటున్నాడు మెగా హీరో.

కసరత్తులు..
‘ధృవ' కోసం కఠినమైన కసరత్తులు ఎన్నో చేసిన 'రామ్ చరణ్' తన బాబాయ్ ని కూడా గుర్తుకు తెచ్చాడు. 'పవన్ కళ్యాణ్' కూడా ఇదే తరహాలో 'తమ్ముడు' సినిమా కోసం కష్టపడటం ఎవరూ మర్చిపోలేదు. కథ డిమాండ్ చేసింది అనే కారణంతో ఇలా వర్క్ ఔట్స్ చేయటం పట్ల 'మంచు విష్ణు' లాంటి ఇతర హీరోలు కూడా ప్రశంసలు కురిపించారు. 'ధృవ' తర్వాత 'చెర్రీ' మూవీ సుకుమార్ తో సెట్ అయిన సంగతి తెలిసిందే. 'నాన్నకు ప్రేమతో' సక్సెస్ తర్వాత 'సుకుమార్' కు సైతం వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది. ఇన్నాళ్ళు 'రాంచరణ్' మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ మీద బిజీగా ఉన్న సుక్కు ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసాడని తెలుస్తోంది. ముందు సైన్సు ఫిక్షన్ అన్నారు కాని అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

హీరోయిన్ ఎవరు ?
మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో 'చెర్రీ'ని కొత్తగా చూపించేలా స్క్రిప్ట్ రాసుకున్నాడు సుకుమార్. మరీ ట్రెండీగా వెళ్తే ఏమవుతుందో ఇంతకు ముందే 'ఆరంజ్' వీ పాఠాలు నేర్పింది కాబట్టి ఈ సారి అలాంటి రిస్క్ ఏమి చేయట్లేదని టాక్. అధికంగా పల్లెటూరి నేపధ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో మైండ్ గేమ్ లాంటి కాన్సెప్ట్ ఏది సుక్కు పెట్టడం లేదని, అలా చేయడమే 'నాన్నకు ప్రేమతో' సినిమాని మాస్ ఆడియన్స్ ని దూరం చేసిందని దృష్టిలో పెట్టుకున్నారని వార్త. ఇన్నేసి జాగ్రత్తలు తీసుకుంటున్నా హీరోయిన్ సమస్య మాత్రం తేలడం లేదు. 'రాశి ఖన్నా' అనుకున్నారు కాని ఇంకా ఏ మాట బయటికి చెప్పడం లేదు. 'సమంతా'ను కూడా కన్సిడర్ చేసారు కానీ రిలీజ్ టైం కంతా తనకు పెళ్లై పోతే అది సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకుంటున్నారంట. మరి దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటాడో చూడాలి.

19:59 - December 13, 2016

సందేశాత్మక చిత్రాల్ని కమర్షియల్ ట్రాక్ ఎక్కించే దర్శకుల్లో 'క్రిష్' ముందు వరసలో ఉంటాడు. ఇప్పుడీ దర్శకుడు ఒక ప్రతిష్టాత్మకమైన చారిత్రక చిత్రమైన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చేయబోతున్న సినిమా మీద కూడా 'క్రిష్' ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధపెడుతున్నాడు. ఒక సీనియర్ హీరోతో 'క్రిష్' తరువాత సినిమా ఉంటుందని టాక్. 'బాలయ్య' ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ దర్శకుడు 'క్రిష్' తన మీద నమ్మకం ఏ మాత్రం వమ్ము కాకుండా ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. కొత్తగా తనకు పెళ్ళైనా అందుకోసం ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా తన టైం మొత్తం ఈ సినిమాకే స్పెండ్ చేస్తున్నాడు. తను ఇస్తానన్న క్వాలిటీ గురించి ఏ మాత్రం రాజీ పడకుండా అనుకున్నది అనుకున్నట్టు వచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు 'క్రిష్’. 'శాతకర్ణి' బిజినెస్ భారీ ఎత్తున జరగడంలో మొదటి కారణం 'బాలయ్య' అయితే మిగిలిన రెండో కారణం 'క్రిష్' మాత్రమే. తెలుగు తెరపై చారిత్రాత్మక పురుషుడి కథను చూసి కొన్ని దశాబ్దాలు అయిన దరిమిలా మిగిలిన బాషా నిర్మాతలు కూడా దీనివైపు ఆసక్తిగా చూస్తున్నారు.

మోక్షజ్ఞ..
కన్నడ స్టార్ హీరో 'శివరాజ్ కుమార్' ఇందులో ప్రత్యేక పాత్ర చేయడంతో కర్ణాటకలో కూడా భారీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలోనే భారీ ఎత్తున ఆడియో ఫంక్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. తిరుపతి వేదికగా జరిగే ఆడియో ఫంక్షన్ కు డేట్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇక 'శాతకర్ణి' తర్వాత క్రిష్ ఏ సినిమా చేస్తాడు అనే దాని మీద అందరికి రకరకాల సందేహాలు ఉన్నాయి. నందమూరి వారసుడు 'మోక్షజ్ఞ' తెరకు పరిచయం చేసే కార్యాన్ని బాలకృష్ణ క్రిష్ చేతుల్లో పెట్టాడు అనే వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. కాని అది చిన్న టాస్క్ కాదు కాబట్టి తనకు టైం ఇమ్మని అడిగాడట క్రిష్.

వెంకీ నుండి గ్రీన్ సిగ్నల్..
అందుకే ఇంతలోపు 'వెంకటేష్' కోసం రాసుకున్న ఓ సబ్జెక్టు వినిపిస్తే వెంటనే 'వెంకీ' నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. దీంతో ఆ స్క్రిప్ట్ ను ఇంప్రూవ్ చేసే పనిని శాతకర్ణి విడుదల అయ్యాక మొదలు పెట్టబోతున్నాడని తెలుస్తోంది. 'వెంకీ' రీసెంట్ గా 'గురు' షూటింగ్ పూర్తి చేసుకుని రిలాక్స్ అవుతున్నాడు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 26 విడుదల కానుంది. ఆ తర్వాత తిరుమల కిశోర్ దర్శకత్వంలో 'ఆడాళ్ళు మీకు జోహార్లు' మూవీ చేయబోతున్నాడు. 'నిత్య మీనన్' హీరోయిన్. దాని తర్వాత క్రిష్ మూవీ. ఇది సోషియో ఫాంటసీ అని తెలిసింది. వెంకటేష్ 'దేవిపుత్రుడు' తర్వాత నటించబోయే సోషియో ఫాంటసీ మూవీ ఇదే.

19:40 - December 13, 2016

ఎక్కడ చూసినా... నగదు కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గంటలకొద్దీ క్యూలో ఉన్నా చివరికి ఉత్తి చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది. అసహనం కోల్పోతున్న ప్రజలు పలుచోట్ల బ్యాంకర్లపై తిరగబడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడ్డ గందరగోళం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. దేశ వ్యాప్తంగా ఇంకా ప్రజలు క్యూ లైన్లలో నిలబడి అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో పాపారావు (ఆర్థికరంగం నిపుణులు), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), ఎస్. కుమార్ (బీజేపీ), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు ఎవరికి ప్రయోజనం కలిగిస్తున్నాయో వక్తలు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:35 - December 13, 2016

ఎన్నాళ్లీ నగదు కష్టాలు. ఎప్పుడు తీరేను ఈ నోట్ల పాట్లు. ఎక్కడ చూసినా... నగదు కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గంటలకొద్దీ క్యూలో ఉన్నా చివరికి ఉత్తి చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది. అసహనం కోల్పోతున్న ప్రజలు పలుచోట్ల బ్యాంకర్లపై తిరగబడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడ్డ గందరగోళం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. దేశ వ్యాప్తంగా ఇంకా ప్రజలు క్యూ లైన్లలో నిలబడి అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. 3 రోజుల విరామం తరువాత తెరుచుకున్న బ్యాంకుల ముందు ఉదయం నుంచే భారీ క్యూలు కనిపించాయి.

నెల్లూరులో..
నెల్లూరు నగరంలోని బార్కాస్‌ ఎస్‌బీఐ బ్రాంచిలో ఖాతాదారులకు బ్యాంకు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. మూడు రోజుల తర్వాత గంటల కొద్దీ క్యూలో నిల్చున్నా రెండు వేలు ఇవ్వడంతో ఖాతాదారులు సిబ్బందితో గొడవకు దిగారు. బడా బాబులకు కోట్లకు కోట్లు ముట్టజెప్పి సామాన్య ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారని మూకుమ్మడిగా తిరగబడ్డారు. విజయవాడలో ఏటీఎంల వద్ద గంటల కొద్ది నిలబడ్డా... నగదు దొరకని పరిస్థితి ఉంది. కనీసం పాల ప్యాకెట్లకు, టీ తాగడానికి కూడా చిల్లర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లో..
రోజురోజుకు పెరుగుతున్న నగదు కష్టాలకు నిరసనగా హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని ఎస్‌బీహెచ్‌ బ్యాంకు ముందు యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని నిబంధనలున్నా..బ్యాంకు సిబ్బంది పట్టించుకోవడం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్లలో నిలుచుకున్న ఖాతాదారులకు వాటర్‌ బాటిళ్లు అందజేసి తమ నిరసన తెలిపారు.

జగిత్యాల..
మూడు రోజుల సెలవుల అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలో బ్యాంకుల ముందు ప్రజలు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. గంటల కొద్ది లైన్లలో నిలుచున్నా తమ వద్దకు వచ్చే వరకు డబ్బులు అందడం లేదని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతపురం..
నోట్ల రద్దు ప్రకటించి 35 రోజులు గడిచినా.. సామాన్య ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రదాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని అనంతపురం స్టేట్‌ బ్యాంకు వద్ద సీపీఎం ధర్నా నిర్వహించింది. సామాన్య ప్రజలు రోజుల తరబడి క్యూల్లో నిలుచుని నోట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. సంపన్నులకు మాత్రం కోట్ల రూపాయల కట్టలు ఇంటికి వచ్చి చేరుతున్నాయని సీపీఎం విమర్శించింది. ప్రతి ఖాతాదారునికి రోజుకు 10 వేల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యకర్తలు, ఖాతాదారులు ధర్నా నిర్వహించారు. నగదు కోసం వెళితే బ్యాంకర్లు ఖాతాదారులకు సహకరించడం లేదని ప్రధాని మోదీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

కుదేలైన పరిశ్రమలు..
నగదు కష్టాలతో హైదరాబాద్ బాలానగర్‌లో చిన్న, సూక్ష్మ పరిశ్రమలు కుదేలయ్యాయి. ఓ వైపు పెరిగిన ముడి సరుకులు కొనలేక, మరోవైపు కార్మికులకు జీతాలు ఇవ్వలేక పరిశ్రమల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తగ్గిన వ్యాపారంతో ఆర్డర్స్‌ రాక.. ఒకవేళ వచ్చినా... నగదు అందుబాటులో లేక పోవటంతో ఆందోళన చెందుతున్నారు. నగదు కోసం బ్యాంకులో నిలబడితే ఇక్కడ పని దొరకదని.. ఆ రోజు పనిలేక పోవటంతో రోజు కు వచ్చే 3 ,4 వందలు కుడా నష్టపోతామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెదక్ నర్సాపురంలో..
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో బ్యాంకులు తెరవక ముందే ప్రజలు నగదు కోసం క్యూలు కట్టారు. డిపాజిట్లు చేయడానికి, నగదు తీసుకోవడానికి వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉదయమే బ్యాంకుకు వచ్చి క్యూలో నిలబడ్డ వృద్ధులు..ఓపిక నశించి లైన్లలోనే కూర్చోని విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.

చిరు వ్యాపారుల కష్టాలు..
చిరు వ్యాపారుల కష్టాలయితే చెప్పనలవి కాకుండా పెరిగిపోతున్నాయి. రెండువేల రూపాయల నోటకు చిల్లర దొరక్క వ్యాపారాలు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నాయి. ఎక్కడ చూసినా ఏటీఎం, బ్యాంకుల ముందు క్యూలు కడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా.. నగదు కష్టాల నిట్టూర్పులే వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా... కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై.. సామాన్యులు భగ్గుమంటున్నారు. 

19:29 - December 13, 2016

ఆకులూ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. చిన్న..పెద్ద..ముసలి ఇలా అన్ని వయస్సుల వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. అలాంటి కొన్ని ఆకులు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తాయో చదవండి...

తమలపాకులు : తమలపాకులో ఫోలిక్ యాసిడ్, ఏ విటమిన్, విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఫైబర్‌ అంటే పీచు పదార్థం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. తమలపాకు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అంతేగాకుండా యాంటాక్సిడెంట్‌గా పని చేస్తుంది.

కరివెపాకు : చాలా మంది కూరగాయల్లో ఉపయోగించే కరిపాకును పడేస్తుంటారు. కానీ ఈ కరివెపాకును తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఎన్నో విధానాలైన ఔషధ విలువలు ఇందులో ఉన్నాయి. బ్లడ్ షుగర్ ఉన్న వారు ప్రతి రోజు కరివెపాకును తినడం వల్ల వ్యాధి అదుపులోకి వస్తుంది. కొబ్బరినూనెలో కరివెపాకును మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు వత్తుగా పెరిగే అవకాశం ఉంది.

పుదీనా : ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏ, విటమిన్ సి గుణాలు అధికంగా ఉంటాయి. పొటనొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనాతో చారు చేసుకోవడం వల్ల మల్లబద్ధకం, పొట్ట శుభ్రపడడం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడుతుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. పుదీనా ఆకుల పేస్టుతో దంతాలను తోమడం వల్ల తెల్లగా మెరిగిసిపోతాయి. పుదీనా శరీరాన్ని రక్తాన్ని శుభ్రం చేస్తుంది.

తులసి : ఇంట్లో పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. తులసి మేలు చేసే అంతాఇంతా కాదు. ఔషధ విలువలు మెండుగా ఉంటాయి. దగ్గు..జలుబు..జ్వరాలను తులసి ఆకుతో చెక్ పెట్టవచ్చు. 

పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో ఉన్న పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. మూడు రోజుల పాటు విప్ జరగనుంది. డిసెంబర్ 15వ తేదీన బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. 

సర్పంచ్ లతో ప్రభుత్వం చర్చలు జరపాలి - కోదండరామ్..

హైదరాబాద్ : సర్పంచ్ లకు నిధులు, విధులు, హక్కులు ఉండాలని అప్పుడే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ప్రొ. కోదండరామ్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు చేయాలని, సర్పంచ్ లతో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లిస్తుండడంతో గ్రామాల అభివృద్ధి కుంటు పడుతోందన్నారు. 

కాంగ్రెస్ తో అఖిలేష్ పొత్తు ?

ఉత్తర్ ప్రదేశ్ : కాంగ్రెస్ పార్టీతో సీఎం అఖిలేష్ పొత్తు కుదుర్చుకుంటారా ? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే మెజార్టీ సాధిస్తామని చెబుతూనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే 300 స్థానాలకు పైగా గెలుస్తామన్నారు. పొత్తులపై ములాయందే తుది నిర్ణయమన్నారు. 

ప్రకాశం జిల్లాలో పొంగుతున్న వాగులు..

ప్రకాశం : జిల్లాలో పలు వాగులు పొంగుతున్నాయి. కందుకూరు, పామూరు, సింగరాయకొండ, ఒంగోలు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. కందుకూరులో ఎర్రవాగు పొంగడంతో ప్రశాంతినగర్ నీట మునిగిపోయింది. జరుగుమల్లి (మం) పచ్చవం - కొత్తపాలెం మధ్య నల్లవాగు పొంగిపొర్లుతోంది. వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకపోయింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. ట్రాక్టర్ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పొన్నలూరులో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నలుగురు రైతులు నీటి ఉధృతిలో చిక్కుకున్నారు. కొండెపి (మం) కట్టుబడిరవారిపాలెం వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

వర్దా తుపాన్ పై బాబు సమీక్ష..

విజయవాడ : వర్దా తుపాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శ్రీహరికోట షార్ కేంద్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్ నష్టాలు, పునరుద్ధరణ చర్యలపై అధికారులు వివరించారు. స్టేట్ వైడ్ వాటర్ అడిట్ పై కూడా వివరించారు.

 

18:54 - December 13, 2016
18:37 - December 13, 2016

విశాఖపట్టణం : పెద్దనోట్ల రద్దు నిర్ణయం బెల్లం అమ్మకాలపై తీవ్ర ప్రభావంచూపింది. విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్‌ వ్యాపారులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. జనాలు లేక ఎగుమతులు తగ్గిపోయి ఇబ్బందులు అనుభవిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాంటే వీడియో క్లిక్ చేయండి. 

18:34 - December 13, 2016

విజయవాడ : మల్టీ నేషనల్‌ కంపెనీలకు అనుకూలమైన విధానాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని సీపీఎం నేతలు మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు వల్ల విదేశీ కంపెనీలకే లబ్ధి చేకూరుతుందని.. క్యాష్‌లెస్‌ విధానం మల్టీ నేషనల్‌ కంపెనీల కోసమేనని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజా ఉద్యమాలకు దోహదపడే.. విజ్ఞాన కేంద్రాల అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. ముందుగా మాకినేని బసవపున్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బసవ పున్నయ్య పేరుతో విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సీతారాం ఏచూరి అన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల విదేశీ కంపెనీలకు లబ్ధి చేకూరుతుందే తప్ప సామాన్యులకు ఎలాంటి లాభం లేదని ఆయన అన్నారు. మల్టీ నేషనల్‌ కంపెనీల కోసమే...మోదీ ప్రభుత్వం క్యాష్‌లెస్‌ విధానాన్ని అమలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన మతోన్మాదం - రాఘవులు..
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ విజ్ఞాన కేంద్రం ఉండడం చాలా అవసరమని భావించి...బసవ పున్నయ్యగారి పేరు మీద కేంద్రాన్ని ప్రారంభించామని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. దేశంలో అభివృద్ధిని అడ్డుకునే శక్తులు పుంజుకుంటున్నాయని ప్రపంచ వ్యాప్తంగా మతోన్మాదం పెరిగిపోయిందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపైనే వాపక్షాలు ఉద్యమిస్తాయని రాఘవులు స్పష్టం చేశారు. నైపుణ్యాన్ని పెంపొందించేందుకు విజ్ఞాన కేంద్రాలు ఉపయోగపడుతాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు చెప్పారు. ప్రజా ఉద్యమాలకు విజ్ఞాన భవనాలు కేంద్ర బిందువులుగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియం, గట్టిపాటి కోటేశ్వరరావు గ్రంథాలయాలను ప్రారంభించారు.

18:31 - December 13, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి కావాలంటే.. నిర్దేశిత లక్ష్యాన్ని.. ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమయం తక్కువగా ఉన్నందున పెండింగ్ పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను బాబు ఆదేశించారు. ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణం పనులను వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. కాంక్రీట్ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పగా, జనవరి 7 నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలన్నారు.

రూ. 52 లక్షల రూ. 2వేల కొత్తనోట్ల స్వాధీనం..

హైదరాబాద్ : నగరంలో కొత్త రెండు వేల నోట్లు భారీగా పట్టుబడుతున్నాయి. తాజాగా రూ. 52 లక్షల కొత్త రూ. 2వేల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 10మందిని అదుపులోకి తీసుకున్నారు. 

పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్..

ఢిల్లీ : రాజ్యసభ, లోక్ సభ లోని పార్టీ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. రేపు పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించనుంది. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం..

చిత్తూరు : తిరుపతిలోని శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరుగుతోంది. ధ్వజస్తంభం, పరివారద దేవతుల ఆలయాల్లో దీపోత్సవాన్ని నిర్వహించారు. 

షా ఘోష్ హోటల్ లో కల్తీ జరుగుతోందని ప్రచారం...

హైదరాబాద్ : రాయదుర్గం షా ఘోష్ హోటల్ లో కల్తీ జరుగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. 

చంద్రలోక్ కాంప్లెక్స్ ఘటనపై జేఎన్టీయూ బృందం నివేదిక..

హైదరాబాద్ : చంద్రలోక్ కాంప్లెక్సులో రెయిలింగ్ కూలడంపై జేఎన్టీయూ బృందం నివేదిక తయారు చేసింది. నిర్వాహణ సక్రమంగా లేనందువల్లే రేలింగ్ కూలిందని నిర్ధారించింది. రూప్ టాప్ పై నీరు నిలవడంతో గోడ దెబ్బతిన్నదని వెల్లడించింది. 

మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంపై సీఎం నష్టపరిహారం..

మధ్యప్రదేశ్ : రాజ్ ఘర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మృతుల్లో 4గురు స్కూల్ విద్యార్థులున్నారు. ఆటో రిక్షాను బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 25వేల పరిహారాన్ని ప్రకటించారు. 

18:13 - December 13, 2016

టాలీవుడ్ యంగ్ హీరోల్లో 'నితిన్' కూడా ఒకరు. ఇతను నటించిన సినిమాలు విజయవంతం అవుతున్నాయి. దీనితో సినిమాలను ఆచూతూచి ఎంచుకుంటున్నారు. 'నితిన్' కు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' అంటే ఎంతో అభిమానం. పవన్ అంటే తనకు ఎంతో ఇష్టం అని 'నితిన్' పలు సందర్భాల్లో కూడా పేర్కొన్నారు. అంతేగాకుండా ఆయన నటించిన సినిమాల్లో 'పవన్' పాటలను రీమెక్ చేశారు కూడా. ఇదిలా ఉంటే పవన్ తన బ్యానర్ లో 'నితిన్' తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ - సుధాకర్ రెడ్డి - త్రివిక్రమ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. ఈ సినిమాలో 'నితిన్' లుక్ ఎలా ఉంటుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా 'నితిన్' లుక్ చూసిన వారందరూ ఆశ్చర్యపోయారంట. అఖిల్ అక్కినేని - శ్రేయా భూపాల్ నిశ్చితార్థానికి 'నితిన్' కూడా వచ్చాడు. బాగా పెరిగిపోయిన గడ్డంతో 'నితిన్' కనిపించాడు. మరి ఈ చిత్రం కోసం ఇలా పెంచాడా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. 

18:09 - December 13, 2016

విశాఖపట్టణం : నగదు రహిత లావాదేవీలు ప్రోత్సాహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటుంటే జిల్లాలోని పలు ఆసుపత్రులు వీటిని పట్టించుకోవడం లేదు. స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కానీ కేజీహెచ్ దగ్గర డాల్ఫిన్ డయాగ్నిస్టిక్ సెంటర్ మాత్రం ప్రభుత్వ సూచనలు..రోగుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. క్రెడిట్, డెబిట్ కార్డులను అనుమతించడం లేదు. నగదు ఇస్తేనే చికిత్సలు చేయడం జరుగుతుందని యాజమాన్యం పేర్కొంటోంది. అత్యవసర చికిత్సలకు కూడా నగదు కావాలని పేర్కొంటుండడం గమనార్హం. దీనితో నగదు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిపోర్టు వచ్చిన తరువాత నగదు ఇస్తామని, చికిత్స చేయాలని రోగులు పేర్కొంటున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏటీఎంలు..బ్యాంకుల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. ఏటీఎంలలో నగదు లేకపోవడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. డాల్ఫిన్ డయాగ్నిస్టిక్ సెంటర్ యాజమాన్యం వైఖరిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

17:46 - December 13, 2016

ఆదిలాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర 58వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర బృందానికి ప్రజలు అడుగడుగునా సాదర స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వృత్తి కులాల ప్రజలను పెత్తందారులు, అగ్రవర్ణాలు అణగదొక్కుతున్నాయని ఎంబీసీ నేత ఆశయ్య ఆరోపించారు. ఎంబీసీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బృంద సభ్యుడు ఆశయ్య డిమాండ్ చేశారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:43 - December 13, 2016

సిద్ధిపేట : అవినీతి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కోరారు. అధికారులెవరైనా లంచాలు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఎవరికీ లంచాలు ఇవ్వవద్దని సూచించారు. సిద్ధిపేట జిల్లాలోని మిట్టపల్లి, నర్మెట, హుస్నాబాద్‌లో పర్యటించిన హరీశ్‌రావు... పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. మిట్టపల్లి రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సభలో జీవో నంబర్‌ -59 కింద లబ్దిదారులకు పట్టాలు అందజేశారు. 

17:42 - December 13, 2016

హైదరాబాద్ : సామాజిక న్యాయం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన... ఎన్నికల్లో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని ఆరోపించారు. సామాజిక న్యాయం - సమగ్ర అభివృద్ధిపై శాసనసభలో చర్చ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చర్చకు అవకాశం ఇవ్వాలని కోరతామన్నారు. ఇందుకు విపక్ష సభ్యులు కూడా సహకరించాలన్నారు. 

యూపీ ఉద్యోగులకు అఖిలేష్ గాలం..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర ఉద్యోగులకు సీఎం అఖిలేష్ యాదవ్ గాలం వేశారు. ఏడో వేతన సంఘం సిఫార్సులకు ఆమోదం తెలిపారు. 21 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. యూపీలో ప్రారంభ వేతనం రూ. 18 వేలు గరిష్ట వేతనం రూ. 2.25 లక్షలుగా ఉండనుంది.

 

బాబు బ్యాంక్ ఆఫీస్ నియామకాలపై విమర్శలు..

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి బ్యాంక్ ఆఫీస్ నియామకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హతలతో నిమిత్తం లేకుండా నిధుల దుర్వినియోగం అయ్యిందని, సమాచారం శాఖ ద్వారా 25 మందికి అవుట్ సోర్సింగ్ పోస్టులు కల్పించినట్లు..దీని ద్వారా నెలకు రూ. 13లక్షల డబ్బు వృధా అయ్యిందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. 

17:23 - December 13, 2016

హైదరాబాద్ : నగరంలో వెలిసిన అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు దృష్టి సారించారు. ఇటీవలే నీట మునిగిన బండారి లే అవుట్ లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. తుర్కపల్లి చెరువుకు ఆనుకుని బండారి లే అవుట్ ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది బిల్డర్లు నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్ మెంట్ లు నిర్మించారు. దీనితో రెండు మాసాల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాలతో బండారి లే అవుట్ నీట మునిగిన సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణాల వల్లే ఇలా జరిగిందని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం హెచ్ఎంఏడీ అధికారులు బండారి లే అవుట్ కు జేసీబీలతో చేరుకున్నారు. అనంతరం అక్రమంగా నిర్మాణం చేస్తున్న అపార్ట్ మెంట్లను కూల్చివేస్తున్నారు. 120కిపైగా ఉన్న అపార్ట్ మెంట్ లలో 32 అపార్ట్ మెంట్లను అక్రమ కట్టడాలని గుర్తించారు. పది అపార్ట్ మెంట్లను ఇటీవలే కూల్చివేశారు. తాజాగా మరో 8 అపార్ట్ మెంట్లను కూల్చివేశారు. కొన్ని అపార్ట్ మెంట్ లలో ఉన్న కుటుంబాలను ఖాళీ చేయించారు. ముగ్గురు బిల్డర్లు వచ్చి అధికారులను అడ్డుకున్నారు. వీరిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కడియం నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : డిప్యూటి సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరుగుతోంది. మంత్రులు కేటీఆర్, తలసాని, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి లు హాజరయ్యారు. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుపై చర్చించారు. 

16:57 - December 13, 2016

'మీలో ఎవరు కోటీశ్వరుడు'..ఒక ఐడియా ఇస్తే కోటి రూపాయలు ట్యాగ్ లైన్. ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలుసుకొనేందుకు హీరో నవీన్ చంద్ర..హీరోయిన్ సలోనితో టెన్ టివి ముచ్చటించింది. పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర విశేషాలను తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

కేంద్రానికి ఎన్నికల సంఘం కీలక సిఫారసు..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు ఒకటికి మించిన స్థానాల్లో పోటీ చేస్తుండటం తెలిసిందే. దీని వల్ల ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ఏ అభ్యర్థి అయినా కేవలం ఒకే స్థానం నుంచి పోటీ చేయాలనే చట్ట సవరణ తీసుకురావాలని సూచించింది. ఒక వేళ రెండు స్థానాల్లో పోటీ చేసే నిబంధనను కొనసాగించాలనుకుంటే... గెలిచిన అభ్యర్థి, రెండో స్థానానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు కారణమైతే... ఆ ఎన్నికకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వానికి చెల్లించేలా నిబంధన తీసుకురావాలని సూచన చేసింది.

నల్లధనం మిథ్య : జైపాల్ రెడ్డి

హైదరాబాద్ : నల్ల ధనం అనేది మథ్య అని..ప్రధాని మోదీ దాన్ని పట్టుకోవలనుకోవటం అంతకటే మిథ్య అని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. పాత పెద్ద నోట్ల వ్యవహరా నీళ్లు లేని బావిలో పడ్డట్లుగా వుందని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో పేదలకు, మధ్య తరగతి ప్రజలకే నష్టం జరిగిందన్నారు. 

కశ్మీర్ సీఎం ముఫ్తీ సంచలన నిర్ణయం!!

జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులంటే తమకు చాలా ప్రేమ అని నిరూపించుకుంది. భద్రతా దళాల చేతిలో ఎన్‌కౌంటర్ అయిన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ కుటుంబానికి పరిహారం ప్రకటించి కలకలం రేపింది. ఏకంగా రూ.4 లక్షలు ఉగ్రవాది కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత జమ్ముకశ్మీర్ రగిలిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే రాష్ట్రం సాధారణ పరిస్థితుల్లోకి వస్తున్నవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.

నగదు సమస్యలకు త్వరలోనే పరిష్కారం : జైట్లీ

ఢిల్లీ : దేశంలో నగదు రహిత వ్యవస్థను ప్రోత్స‌హించ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని ఆయ‌న చెప్పారు. తాము తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని. ఆర్‌బీఐ ప్ర‌జ‌ల‌కు స‌రిప‌డేటంత న‌గ‌దును త్వ‌ర‌లోనే బ్యాంకులకు సరఫరా చేస్తుందని చెప్పారు. తాము తీసుకున్న నిర్ణ‌యంపై పార్లమెంట్‌లో చర్చించ‌డానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

రిజర్వేషన్లపై బీసీ కమిషన్ అభిప్రాయసేకరణ..

హైదరాబాద్ : రాష్ట్రంలోని బీసీ ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల పెంపుపై ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ప్రజా విచారణ - అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు బీసీ కమిషన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. బీసీ కమిషన్ నూతన కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజా విచారణ చేపడుతామని కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు తెలిపారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో కళకళలాడాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 182.58 పాయింట్లు లాభపడి 26,697.82 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 8,221.80 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. సెన్సెక్స్‌ 97 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 8,200 స్థాయికి చేరడమే కాకుండా 30.15 పాయింట్లు లాభపడింది. సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలకానున్న నేపథ్యంలో మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారని విశ్లేషకులు పేర్కొన్నారు.

16:26 - December 13, 2016

సర్పంచ్ లకు హక్కులుండాలి : కోదండరాం

హైదరాబాద్ : గ్రామ సర్పంచ్ లకు నిధులు, విధుల విషయంలో హక్కులు వుండాలని..అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని టీ.జాక్ అధ్యక్షులు ప్రొ.కోదండరామ్ పేర్కొన్నారు. సర్పంచ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయాలని..ప్రభుత్వం సర్పంచ్ లతో చర్యలు జరపాలని సూచించారు. కేంద్రం పంచాయితీలకు ఇచ్చే నిధులు మళ్లించటంతో గ్రామాల అభివృద్ధి కుటుంబడుతోందని ఆయన పేర్కొన్నారు. 

16:22 - December 13, 2016

ఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన దానిపై కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజుజుపై కాంగ్రెస్ పలు అవినీతి ఆరోపణలు గుప్పించింది. రిజుజు పాత్రపై అనుమానాలున్నాయని, వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేసింది. రిజుజుకు సంబంధించిన ఆడియో టేపులను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా మీడియాకు వినిపించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులో రిజుజు కజిన్ గోవోయ్ రిజు సబ్ కాంట్రాక్టర్ గా ఉండడం గమనార్హం. ప్రాజెక్టు నిర్మాణంలో రూ. 450 కోట్ల అవినీతి జరిగిందని సీవీసీ నివేదిక ఇచ్చింది. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలను రిజుజు ఖండించారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు అరుణాచల్ ప్రదేశ్ కు వస్తే చెప్పుతో కొడుతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ కజిన్ లేరని రిజుజు పేర్కొన్నారు.  

నిర్లక్ష్యానికి బలైపోతున్న ప్రాణాలు..

హైదరాబాద్ : నగరంలో అధికారుల..కాంట్రాక్టర్ల ధన దాహానాకి నిరుపేద కూలీలు బలైపోతున్నారు. నానక్ రామ్ గూడలో నిర్మాణంలో వున్న భవనం కూలి పలువురు నిరుపేద కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు తాజాగా సికింద్రా బాద్ లో నిర్మాణంలో వున్న ఓ భవనం రెయిలింగ్ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు.సికింద్రాబాద్‌లోని..చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ భవనం గోడ కూలి ఓ వ్యక్తి మరణించిన నేపథ్యంలో ఘటనా స్థలాన్నీ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ , మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు. జేఎన్‌టీయూ ఇంజనీర్లతో కమిటీ వేసి వారు అందజేసిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మేయర్‌ చెప్పారు.

16:10 - December 13, 2016

హైదరాబాద్ : నగరంలో ఏ భవనం ఎప్పుడు కూలుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. నానక్ రాంగూడ ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని చంద్రలోక్ కాంపెక్స్ లో చివరి అంతస్తుపై నుండి ఓ గోడ కిందకు పడిపోయింది. దీనితో ఓ వ్యక్తి మృతి చెందాడు. మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సందిర్శంచిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దీనితో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వెంటనే కాంప్లెక్స్ ను సీజ్ చేసేశారు. జేఎన్టీయూకు సంబంధించిన నిపుణులు ఘటనా ప్రదేశాన్ని సందర్శించి నివేదిక అందించిన అనంతరం కాంప్లెక్స్ ను తెరవాలా ? వద్దా ? అనేది నిర్ణయిస్తామని మేయర్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీలో వందలాది కమర్షియల్ భవనాలు..వేలాది షాపులు, కార్యాలయాలున్నాయనే సంగతి తెలిసిందే. ఇందులో 30-40 ఏళ్ల కిందట నిర్మాణమైన భవనాలు కూడా ఉన్నాయి. సికింద్రాబాద్, బేగంబజార్, మొజంజాహి మార్కెట్, కింగ్ కోటి, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో పురాతన భవనాలున్నాయి. వీటి నిర్మాణం ఎలా ఉందో అధికారులు గమనిస్తూ ఉండాల్సి ఉంటుంది. అధికారులు, భవన యజమానులు నిర్లక్ష్యంగా ఉండడంతో ప్రమాదాలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు తమ్మినేని లేఖలు..

ఆదిలాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16 నుండి జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని లేఖలు రాశారు. సామాజిక న్యాయమే కేంద్రబిందువుగా..అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని లేఖ తమ్మినేని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆకాంక్షలను సభలో ప్రస్తావించాలని ప్రజాప్రతినిధులను కోరారు. అసెంబ్లీ సమావేశాలు 25 రోజుల పాటు నిర్వహించాలన్నారు. 

యూపీఏ స్కామ్ లపై విచారణే లేదు : జైట్లీ

ఢిల్లీ : యూపీఏ ప్రభుత్వ పాలనలో భారీ కుంభకోణాలు జరిగాయనీ..నల్లధనంతో పాటు ఏ ఒక్క స్కాంపై కూడా విచారణ ఇంతవరకూ జరగలేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. దేశ భవిష్యత్తు కోసమే పాత పెద్దనోట్ల రద్దు తీసుకున్నామనీ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ చట్టసభల్లో ఆందోళన చేసోంది తప్ప చర్చకు రావటం లేదని ఎద్దేవా చేశారు. అవినీతిపై యుద్ధ చేసేందుకు మా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కాంగ్రెస్ కు మింగుడుపడటంలేదన్నారు. 

సహనం కోల్పోతున్న ప్రజలు ..

విశాఖ : బ్యాంకుల ముందు ఖాతాదారులకు తిప్ప‌లు త‌ప్ప‌ట్లేదు. నోట్ల క‌ష్టాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి కానీ త‌గ్గ‌డం లేదు. ప్రజల సహనం అంతు చూసేంత వరకూ నోట్ల తిప్పలు తప్పేలా లేవు. బ్యాంకుల వద్ద ఏటీఎంల వద్ద క్యూలో నిల్చున్నవారు ఎవరికి వారు తమ పని అయిపోవాలనే క్రమంలో ఘర్షణలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే గోపాలపట్నం యూనియన్ బ్యాంక్ ఏటీఎం ముందు ఇద్దరు ఖాతాదారుల‌ మ‌ధ్య ఘర్షణ జరిగింది. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవ‌డం కోసం లైన్లో నిల్చున్న ఇద్దరు వ్యక్తుల మధ్య మాటామాటా పెరిగి ఒక‌రిపై ఒక‌రు చేతి చేసుకొని అక్కడే కొట్టుకున్నారు. 

వర్ధా పై రాజ్ నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష..

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అటు తమిళనాడు, ఇటు ఏపీలో వర్ధా తుపాను అనంతర పరిస్థితులు, సహాయక చర్యలపై సమీక్షించారు. వర్ధా తుపాను ధాటికి తమిళనాడులోని చెన్నై నగరంతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు తమిళనాడులోని ఎనిమిది మంది, చిత్తూరు జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

భవిష్యత్తు తరాలకు తెలిసేలా పోలవరం డాక్యుమెంటరీ..

అమరావతి : పోలవరం నిర్మాణంలోని ప్రతీ దశలోని పనులను చిత్రీకరించి డాక్యుమెంటరీ రూపంలో భద్రపరచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం నిర్మాణం గురించి భవిష్యత్ తరాలకు తెలిసేలా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేకు చర్యలు తీసుకోవాలని..చరిత్రలో పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయేలా వుండాలన్నారు. కాగా ఏపీ జీవనాడి అయిన పోలరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు చీఫ్ ఇంజనీరర్ రమేష్ తో సమీక్ష జరిపిన సందర్భంగా చంద్రబాబు ఈ ఆదేశాలను జారీ చేశారు.

15:39 - December 13, 2016
15:38 - December 13, 2016

చెన్నై : వర్ధా తుపాన్ ప్రభావం ఇంకా తమిళనాడును వీడడం లేదు. తీరం దాటిన సమయంలో తుపాన్ తీవ్ర బీభత్సాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా వాతావరణ అధికారులు మరో హెచ్చరిక జారీ చేశారు. రాగల 24గంటల్లో తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. తుపాన్ తీరం దాటిన అనంతరం చెన్నై పరిసర ప్రాంతాల్లో 114 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచినట్లు రికార్డైంది. సత్యపురంలో 38 సెం.మీ. కేవీపీ కాటికుప్పంలో 34 సెం.మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. 
కకావికలం..
వర్దా తుపాను తమిళనాడును కకావికలం చేసింది. గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులతో చెన్నైతోపాటు తమిళనాడు తీరప్రాంతం అతలాకుతలమైంది. ప్రధానంగా ఐదు జిల్లాల ప్రజలు వణికిపోయారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో చెన్నై తీరాన్ని దాటింది. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, విళుపురం, కడలూరు జిల్లాలను కుదిపేసింది. తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు, భీకరమైన గాలులకు వృక్షాలు నేలకూలాయి. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

15:33 - December 13, 2016

కార్డులు వద్దంటున్న డయోగ్నస్టిక్..

విశాఖ : నోట్ల రద్దుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దొరికిన పెద్దనోట్ల చిల్లర లభించక..నానా అగచాట్లు పడుతున్నారు. వైద్యం చేయించుకునే పరిస్థితి దాపురిస్తే వారి కష్టాలు వర్ణనాతీతంగా వున్నాయి. ఈ క్రమంలోనే అత్యవసర సేవలకు కూడా కార్డులను అనుమతించకుండా నగదు చెల్లించాల్సిందేనంటూ  విశాఖలోని డాల్ఫిన్ డయోగ్నస్టిక్ సెంటర్ లో డిమాండ్ చేస్తున్నారు. దీంతో రోగులు అటు చేతిలో నోట్లు లేక ఇటు కార్డులను అనుమతించకపోవటం నానా కష్టాలు పడుతున్నారు. 

15:31 - December 13, 2016

విశాఖపట్టణం : నోట్ల రద్దు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొనేందుకు బీజేపీ ఎంపీ హరిబాబు ప్రయత్నించారు. మంగళవారం విశాఖపట్టణంలోని సీతమ్మధార ఆంధ్రాబ్యాంకును సందర్శించారు. బ్యాంకులో నగదు సరిపడా అందని కారణంగా రూ. 13వేలు మాత్రమే పేమెంట్లు ఇవ్వబడుననే బోర్డును బ్యాంకు అధికారులు పెట్టారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష ఫీజు కడితే రూ. వేయి తెమ్మని పేర్కొంటున్నారని, కానీ తన దగ్గర రూ. 2వేలు ఉన్నాయన్నారు. ఎలా చెల్లించాలని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల్లో ఈ సమస్యలన్నీ తీరిపోతాయని ఎంపీ హరిబాబు పేర్కొన్నారు. 

15:26 - December 13, 2016

మహారాష్ట్ర : పెద్దనోట్ల రద్దు భారీ కుంభకోణం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి చిదంబంరం ఆరోపించారు. నాగ్ పూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా పట్టుబడుతున్న అక్రమ రూ. 2వేల నోట్లపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో 45 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విత్తనాలు, ఎరువులు కొనేందుకు రైతుల వద్ద డబ్బులు లేవని పేర్కొన్నారు. రోజు వారి కూలీల బతుకులు దుర్భరంగా మారాయని, కేంద్రం తప్పుడు నిర్ణయం వల్ల అవినీతి పరులకు, నల్లధనం కలిగిన వారికి కాకుండా సామాన్యులకు శిక్ష వేసినట్లుగా ఉందని విమర్శించారు. 

క్యాష్ లెస్ మోడల్ గా సిద్ధిపేట : ఈటెల

హైదరాబాద్ : పాత పెద్ద నోట్ల నేపథ్యంలో క్యాష్ లెస్ విధానికి ప్రభుత్వ పూర్తిగా మద్దతు తెలుపుతోందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిద్ధిపేటను మోడల్ క్యాష్ లెస్ గా తయారుచేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రజలకు డిజిటల్ లావీదేవీలు సులభతరం చేసేందుకు మొబైల్ లో కంపెనీలతో మాట్లాడి యాప్ లు ఉండే స్మార్ట్ ఫోన్ల తక్కువ ధరకే అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఆర్బీఐ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.కూలీలకు క్యాంపుల ఏర్పాటులో బ్యాంకులు సహకరంచాలని బ్యాంకులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

ఉబెర్ బైక్ ట్యాక్సీలను ప్రారంభించిన కేసీఆర్..

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉబెర్ బైక్ ట్యాక్సీలను ప్రారంభించారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, కేటీఆర్, ఉబెర్ సీఈవో ట్రావిస్ కలానిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఇప్పటికే నగరంలో ఉబెర్ ట్యాక్సీలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. 

కేంద్రమంత్రి కిర‌ణ్ రిజిజూపై అవినీతి ఆరోప‌ణ‌లు..

ఢిల్లీ: కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజూపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప‌వ‌ర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకున్న‌ట్లు ఇటీవ‌లే స్థానిక చీఫ్ విజిలెన్స్ ఆఫీస‌ర్ రిపోర్ట్‌ను విడుద‌ల చేశారు. ఆ జాబితాలో అనేక మంది ప్ర‌ముఖుల పేర్లు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజూపైన కూడా ఆరోప‌ణ‌లు వచ్చాయి. రిజ్జూ నియోజ‌క‌వ‌ర్గ‌మైన వెస్ట్ కామింగ్‌లోనే 600 మెగావాట్ల‌ జ‌ల విద్యుత్తు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అయితే దీనిపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది.

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సమీక్ష..

అమరావతి : ఏపీ జీవనాడి అయిన పోలరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. పోలవరం నిర్మాణ ప్రాంతం నుండి ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబుకు వర్చువల్ ఇన్ప్పెక్షన్ ను ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రమేష్ తెలియజేశారు. కాంక్రీటు ప్రారంభించటానికి అన్ని పరీక్షలను పూర్తిచేసినట్లుగా ఇంజనీర రమేష్ చంద్రబాబుకు తెలిపారు. 

15:09 - December 13, 2016

టాలీవుడ్ కండలవీరుడు 'రానా' యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే 'ఘాజీ' చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'రానా' నేవీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇది నీటిలో జరిగే యుద్ధం. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. 1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అప్పట్లో పాక్ ఉపయోగించిన సబ్ మెరైన్ పీఎన్ఎస్ ఘాజి. ఆ యుద్ధ సమయంలో విశాఖపట్టణం దగ్గర బంగాళాఖాతంలో భారత్ తన ప్రత్యర్థి దేశానికి చెందిన ఈ జలాంతర్గామిని జలసమాధి చేసింది. ఈ నేపథ్యంలో నడిచే కథలో 'రానా' నేవీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. నూతన దర్శకుడు సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో 'రానా' నేవీ డ్రెస్ ధరించి ఉన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ చిత్రం విడుదలకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. 

15:08 - December 13, 2016

న్యూఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజుజు చిక్కుల్లో పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పలు ఆరోపణలు గుప్పించింది. అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నామని చెబుతున్న బీజేపీకి ఈ వార్త శరాఘాతంలా తగిలినట్లైంది. హైడ్రోపవర్ ప్రాజెక్టులో కిరణ్ రిజుజు సోదరుడు పలు అవినీతికి పాల్పడ్డారని, ఆయన బంధువుల పేర్లతో దందాలు నడిపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇందుకు తమ వద్ద ఆడియో రుజువులున్నట్లు కాంగ్రెస్ పేర్కొంటోంది. కిరణ్ రిజుజు సోదరుడు లంచాలు తీసుకున్నట్లు, ప్రాజెక్టులు అంచనాలు పెంచేసిందని పేర్కొంటోంది. వెంటనే కేంద్ర మంత్రి పదవికి రిజుజు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఆరోపణలను రిజుజు ఖండించారు. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

15:02 - December 13, 2016

విజయవాడ : భారత దేశంలో అభివృద్ధి అడ్డుకునే శక్తులు పుంజుకుంటున్నాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. విజయవాడలో బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మతోన్మాద పెరిగిపోయిందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపైనే వాపక్షాలు ఉద్యమిస్తామని రాఘవులు స్పష్టం చేశారు. ప్రజలందరిని ఏకతాటిపైకి తీసుకురావాల్సన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధుతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కామ్రేడ్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

వడోదరలో రూ. 19.67 లక్షలు స్వాధీనం..

గుజరాత్ : రాష్ట్రంలో రూ. 19.67 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. వడోదరలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వాధీనం చేసుకున్న నగదులో రూ. 13 లక్షలు కొత్తనోట్లు ఉన్నాయి. 

14:55 - December 13, 2016

రోజురోజుకీ ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ మారిపోతోంది. నేటి తరం అమ్మాయిలు ట్రెండ్లీ డ్రస్ లను ఫాలో అవుతుంటారు. అది సంప్రదాయం దుస్తులైనా..ఆధునిక దుస్తులైనాసరే.. లాంగ్ లెంత్ ఫాక్స్..ఫోర్ లెంత్ ఫ్రాక్స్..లాంగ్ మిడీస్ తో ఈనాటి సొగసు మీ ముందుకు వచ్చేసింది. 

స్కాట్ ల్యాండ్ ప్రతినిధులతో కడియం భేటీ..

హైదరాబాద్ : స్కాట్ ల్యాండ్ ప్రతినిధులతో డిప్యూటి సీఎం కడియం భేటీ అయ్యారు. బోధనా విధానం మెరుగుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యనందించేందుకు అధిక సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 54 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 210 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మించడం జరుగుతోందని, మెరుగైన విద్య కోసం డిజిటల్ తరగతులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

రాయచోటి జడ్జీ వ్యాఖ్యలపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : రాయచోటి జడ్జి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. జడ్జీలందరూ అవినీతిపరులని రామకృష్ణ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. వివరణనివ్వాలని హైకోర్టు రామకృష్ణకు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఇన్ పర్సన్ గా రామకృష్ణ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

14:50 - December 13, 2016

వృద్ధాప్య అంటే ఒక జన్మలోనే మరో బాల్యంతో సమానం.వృద్ధాప్యం కొందరికి శాపమైతే మరికొంతరికి వరం..ఒంట్లో సత్తువ వున్నంతకాలం..అవయవాలు సహకరించినంత కాలం కష్టపడుతూనే వుంటారు కొందరు. మరికొందరూ ఈ వయస్సుని విశ్రాంతి తీసుకుంటూ గడిపేస్తుంటారు..కానీ వృద్ధాప్యాన్నే సృజనాత్మకతవైపు మళ్లించుకుని రాణించేవారు బహు అరుదుగా కనిపిస్తుంటారు. అటువంటి ఓ బాల్య బామ్మ సృజనాత్మకంగా పలు వస్తువులను తయారుచేస్తూ ఔరా అనిపించుకుంటోది..ఆ బామ్మ కధా కమామిషు ఏంటో చూద్దామా..90 ఏళ్ళ వయస్సును సైతం కళాఖండాలను సృష్టిస్తోన్న ఈ బామ్మది రంగారెడ్డి జిల్లా లోని లక్ష్మమ్మ చేతితో అవలీలగా తయారుచేసే ఈ కళాకృతులను చూస్తే ఔరా అనుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు..మరి లక్ష్మమ్మగారి కళాకృతులను మనం కూడా చూసేద్దామా..

14:36 - December 13, 2016

హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్టు వి. హనుమంతరావు సేవలు మరువలేనివని నవ తెలంగాణ ఎడిటర్‌ వీరయ్య, సీపీఎం నాయకుడు డీజే నరసింగరావు కొనియాడారు.. కలంపట్టినరోజునుంచి తుదిశ్వాసవిడిచేవరకూ సమాజంలో మార్పుకోసం కృషి చేశారని నివాళులు అర్పించారు.. దుష్టత్వంమీద కలం ఎక్కుపెట్టిన యోధులని గుర్తుచేసుకున్నారు.. హైదరాబాద్‌లోని హనుమంతరావు స్వగృహంలో ఆయన మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు..

14:34 - December 13, 2016

స్కూటర్...ఈ పేరు వింటేనే కుర్రకారుకి ఎక్కడాలేని హుషారు వచ్చేస్తుంది. అలాంటి స్కూటర్‌ను వేరే చోటికి తీసుకెళ్లాలంటే కొంచెం శ్రమ పడాల్సిందే. అదే దూర ప్రాంతాలకైతే ఇంకా కష్టం...మరి మడతపెట్టేస్తే....ఇదేదో హాలివుడ్‌ సినిమా యానిమేషన్ కాదు..నిజంగానే జరగబోతోంది...ఈ స్కూటరేంటి... మడతపెట్టడమేంటి... అనుకుంటున్నారా...అయితే మీరీ స్టోరీ చూడాల్సిందే. కొత్త కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని అబ్బురపరిచే చైనా మరో ప్రోడక్ట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. చైనా మొబైల్‌ దిగ్గజం షియోమీ మరో కొత్త ప్రోడక్ట్‌తో చైనా మార్కెట్లో సంచలనం సృష్టించబోతోంది. మొబైల్స్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ను విడుదల చేసే ఈ సంస్థ తాజాగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను డిసెంబర్‌ 15 నుంచి మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోంది.

భారత్ మార్కెట్లో..
షియోమి సంస్థ ప్రవేశపెట్టబోయే స్కూటర్‌కి నమూనా. ఈ స్కూటర్‌ను పూర్తిగా విమానాలకు ఉపయోగించే అల్యూమినియంతో తయారు చేశారు. 25 కి.మీల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలిగే ఈ స్కూటర్‌కు 280వాట్స్‌- ఎల్‌జీ 1850 ఈవీ లిథియం అయాన్‌ బ్యాటరీని ఏర్పాటు చేశారు. డబుల్‌ డిస్క్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌తో వేగాన్ని సులభంగా నియంత్రించొచ్చు. దీనికున్న మరో ప్రత్యేకత కేవలం ఒక్క బటన్‌ నొక్కి దీన్ని మడతపెట్టేయచ్చు. 13 కేజీల బరువుండే ఈ స్కూటర్‌ను సులభంగా ఓ చోటి నుంచి మరోచోటికి తీసుకెళ్లవచ్చు. బ్లూటూత్‌ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవడం ద్వారా స్కూటర్‌ వేగం, బ్యాటరీ జీవితకాలం వంటి అంశాలను తెలుసుకోవచ్చు. భారత కరెన్సీలో ఈ స్కూటర్‌ ధర దాదాపు 19వేల 500 రూపాయలు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే షియోమీ ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇలాంటి వాటిని కంపెనీ చైనాకు మాత్రమే పరిమితం చేస్తుంటుంది. 

14:33 - December 13, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని...చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ వద్ద ఈరోజు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి.. మేయర్‌ బోంతు రామ్మోహన్‌లకు పెద్ద ప్రమాదం తప్పింది. వారు పాత భవనాలను పరిశీలించిన వెళ్లిన కొద్ది సమయంలోనే.. చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ భవన గోడ కూలి కిందకు పడింది. దీంతో బల్దియా అధికారులు ఆ చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ను సీజ్‌ చేశారు. మరిన్ని వివరాలకు వీడియోలో చూడండి..

14:32 - December 13, 2016

ఢిల్లీ : నవంబర్‌, డిసెంబర్‌ వచ్చిందంటే చెన్నై వాసుల్లో వణుకుపుడుతోంది. ఈ రెండు మాసాల్లో ప్రకృతి ప్రకోపాలు చెన్నై ప్రజల్ని భయపెడుతున్నాయి. భారీ విధ్వంసమో..? పెను విషాదమో..? ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. గతేడాది డిసెంబర్‌లో చెన్నపట్నాన్ని తుఫాన్‌ అతలాకుతలం చేస్తే.. మళ్లీ అదే డిసెంబర్‌లో వర్దా వణికించింది. అసలే అమ్మ జయలలిత మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమిళనాడు వాసుల్ని తుఫాన్‌ భయబ్రాంతులకు గురి చేసింది. డిసెంబర్‌ నెల తమకు అచ్చిరావడం లేదని తమిళులు భావిస్తున్నారు. నిరుడు డిసెంబర్‌లో తుఫాన్‌ ప్రభావంతో చెన్నై జలమయమైంది. నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. దాన్నుంచి కోలుకునేందుకు తమిళనాడుకు చాలా నెలలే పట్టింది. అదే డిసెంబర్ లో చెన్నై ప్రకృతి ప్రకోపానికి గురైంది. 'అమ్మ' జయలలిత మరణించిన బాధలో ఉన్న చెన్నై వాసులకు.. వర్దా తుఫాన్ బీభత్సాన్ని చూపించింది. భవనాలే ఊగిపోయే విధంగా చెన్నైలో ఈదురు గాలులు వీయడంతో మనుషులు బయటకు రావాలంటేనే భయపడిపోయారు. ఈదురు గాలుల ధాటికి వందల ఏళ్ళ నాటి చెట్లు సైతం నేలకూలగా, రోడ్లపై ఉన్న కార్లు గాల్లోనే గింగరాలు తిరిగాయి.

వర్ధా హఢల్..
ప్రకృతి సృష్టించే బీభత్సాన్ని అడ్డుకోవడం ఎవరి సాధ్యమూ కాదనే విధంగా వర్దా తుఫాన్‌ చెన్నైను మరోసారి హడలెత్తించింది. భారీ ఈదురుగాలులతో కూడిన తుఫాన్‌ సరిగ్గా 22 ఏళ్ల క్రితం.. 1994 అక్టోబర్‌ 30న వచ్చింది. దాని తాకిడికి అప్పట్లో 26 మంది చనిపోయారు. నగరం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల ధాటికి టెలిఫోన్‌ స్తంభాలు, భారీవృక్షాలు కూలిపోవడంతో సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. నగరం మొత్తం అతలాకుతలమైంది. 2004లో పెను విపత్తును మిగిల్చిన ప్రళయం సునామీ కూడా డిసెంబర్‌ నెలలోనే తమిళనాడును ముంచెత్తింది. వేలాదిమందిని పొట్టన పెట్టుకున్న ఈ విపత్తు గుర్తొస్తే తమిళప్రజలు ఇప్పటికీ వణికిపోతుంటారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో డిసెంబర్ మాసం అంటేనే తమిళులు గుండెలు అరచేతిలో పట్టుకుంటున్నారు. సరిగ్గా ఏడాది కిందట నగరాన్ని వర్షాలు ముంచెత్తగా.. ఈ ఏడాది డిసెంబర్‌లో జయలలిత మరణం, వర్దా బీభత్సం తమిళుల గుండెలు అవిసిపోయేలా చేశాయి. 

14:30 - December 13, 2016

నెల్లూరు : వర్దా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసాయి. తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరులో మోస్తరు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్టు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతోంది. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

14:28 - December 13, 2016

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసును చర్లపల్లిలోని ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు విచారించింది. ఇండియన్ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థపై నేరాన్ని కోర్టు నిర్ధారించింది. ఆ సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను దోషులు తేల్చింది. బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రదారి రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉన్నారు. ఈ నెల 19న దోషులకు శిక్ష ఖరారు చేయనుంది. భత్కల్‌తో పాటు చర్లపల్లి జైలులో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులపై ఐపీసీ 302, 307, 324, 326, 121, 121ఏ, 122, 201, రెడ్‌విత్‌ 120 బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటితోపాటు 1980 పేలుడు పదార్థాల యాక్ట్‌ ప్రకారం 3, 5 సెక్షన్లతో పాటు దేశద్రోహ చట్టం 1967 ప్రకారం 18, 19, 20, 38(2), 39(2) సెక్షన్లపై ఎన్‌ఐఏ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. దీనిపై సుధీర్ఘ విచారణ చేపట్టిన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు.. 156 మంది సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. 

14:26 - December 13, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని.. చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ భవనం గోడ కూలీ ఓ వ్యక్తి మరణించిన నేపథ్యంలో ఘటనా స్థలాన్నీ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ , మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు. జేఎన్‌టీయూ ఇంజనీర్లతో కమిటీ వేసి వారు అందజేసిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మేయర్‌ చెప్పారు. అలాగే నిన్న మృతి చెందిన దుర్గయ్య కుటుంబానికి బల్దియా తరపున రెండున్నర లక్షల పరిహారం ప్రకటించారు.  

14:26 - December 13, 2016

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసును చర్లపల్లిలోని ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు విచారించింది. ఇండియన్ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థపై నేరాన్ని కోర్టు నిర్ధారించింది. ఆ సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను దోషులు తేల్చింది. బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రదారి రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉన్నారు. ఈ నెల 19న దోషులకు శిక్ష ఖరారు చేయనుంది. భత్కల్‌తో పాటు చర్లపల్లి జైలులో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులపై ఐపీసీ 302, 307, 324, 326, 121, 121ఏ, 122, 201, రెడ్‌విత్‌ 120 బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటితోపాటు 1980 పేలుడు పదార్థాల యాక్ట్‌ ప్రకారం 3, 5 సెక్షన్లతో పాటు దేశద్రోహ చట్టం 1967 ప్రకారం 18, 19, 20, 38(2), 39(2) సెక్షన్లపై ఎన్‌ఐఏ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. దీనిపై సుధీర్ఘ విచారణ చేపట్టిన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు.. 156 మంది సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. 

14:25 - December 13, 2016

ఢిల్లీ : నోటు రద్దు నిర్ణయం ఓ పెద్ద కుంభకోణమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. నవంబర్‌ 8న మోది సర్కార్‌ నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడం ద్వారా పేదలపై యుద్ధం ప్రకటించారని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో చిరు వ్యాపారులతో భేటీ అయ్యారు. నిజాయితీ పరులు క్యూలైన్లో నిలబడుతున్నారని, అక్రమార్కులు వెనకాల తలుపు నుంచి కోట్లాది రూపాయలు మార్చుకుంటున్నారని ఆరోపించారు. పేదల డబ్బుతో బ్యాంకులు నడుపుతున్నారని, కార్పోరేట్లకు 8 లక్షల కోట్లు మాఫీ చేశారని రాహుల్‌ తెలిపారు. పార్లమెంట్‌లో తమను మాట్లాడనిస్తే నోట్ల రద్దు వెనక ఉన్న అసలు విషయాన్ని బయటపెడతామన్నారు.

14:13 - December 13, 2016

విజయవాడ : పెద్దనోట్లు రద్దు అయి నెల రోజులు దాటిపోతోంది. కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. మూడు రోజులుగా బ్యాంకులకు సెలవులు రావడంతో మంగళవారం ఉదయం నుండే బ్యాంకులు..ఏటీఎంల వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. ఏటీఎంలో మాత్రం నగదు లేకపోతుండడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడినా నగదు దొరక్క పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాల్టీ వర్కర్లు, ఆటో కార్మికులు, ఇతరులు ఇక్కట్లకు గురవుతున్నారు. నాలుగు రోజుల నుండి ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నామని, క్యాష్ లేదని..అవుట్ ఆఫ్ సర్వీస్ అంటూ బోర్డులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగలు వస్తున్నాయని, డబ్బులు అందకపోవడంతో పండుగలు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:09 - December 13, 2016

సంగారెడ్డి : 'రూ.4వేలు ఇస్తే ఏం చేసుకోవాలి ? పిల్లల ఫీజులు..సరుకులు..ఇతరత్రా ఎలా తెచ్చుకోవాలి ? తమ డబ్బు తీసుకోవాలంటే ఇన్ని నిబంధనలు పెడుతరా' అంటూ ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి ఎస్ బీహెచ్ వద్ద ఖాతాదారులు ధర్నా నిర్వహించారు. గత మూడు రోజుల నుండి బ్యాంకులకు సెలవు కావడంతో మంగళవారం ఉదయం బ్యాంకు వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. కేవలం రూ. 4వేలు ఇస్తామని బ్యాంకు చెప్పడంతో ఆందోళన నిర్వహించారు. గేటు తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. 4 వేల రూపాయలే ఇస్తామని బ్యాంకులో బోర్డు పెట్టడంతో..ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు ముందు బైఠాయించి , కనీసం 10 వేల రూపాయలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

సీనియర్ ఆర్బీఐ అధికారి అరెస్టు..

బెంగళూరు : సీనియర్ ఆర్బీఐ అధికారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రూ. కోటి 51 లక్షల నోట్ల మార్పిడిలో నిందితులకు సహకరించారని ఆర్బీఐ అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ అధికారితో పాటు మరో ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. 

గాంధీ భవన్ లో పీవీ రాజేశ్వరరావు భౌతికకాయం..

హైదరాబాద్ : గాంధీ భవన్ కు పీవీ రాజశ్వరరావు భౌతకకాయాన్ని తరలించారు. అక్కడ రాజేశ్వరరావు పార్థివ దేహానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. 

యూపీఏ హాయాంలో పెద్ద స్కాంలు - జైట్లీ..

ఢిల్లీ : యూపీఏ హాయాంలో పెద్ద పెద్ద స్కాంలు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. నల్లధనంతో పాటు ఏ ఒక్క స్కాంపై కూడా విచారణ జరగలేదని, నోట్ల రద్దు దేశ భవిష్యత్ కోసం తీసుకున్న పెద్దనిర్ణయమని తెలిపారు. 

హావాలా వ్యాపారీ అరెస్టు..

బెంగళూరు : హావాలా వ్యాపారీని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం బెంగళూరులో వీరేంద్రను సీబీఐ అరెస్టు చేసింది. వీరేంద్ర నుండి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. 

13:29 - December 13, 2016

తిరుపతి..పవిత్ర పుణ్యక్షేత్రం.. దేశ..విదేశాలు..వివిధ రాష్ట్రాల నుండి ఎంతో మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం 'లడ్డూ'ను ప్రసాదంగా తీసుకుంటుంటారు. తిరుపతి లడ్డూ..అంటే ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. దీనికి సమానంగా ఏదైనా లడ్డూ ఉందా ? అంటే లేదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇది ప్రసాదం కావడం...రుచి కూడా ప్రత్యేకంగా ఉండటమే. కానీ ఈ లడ్డూకు కొత్త సమస్య వచ్చి ఏర్పడింది.

ఈ లడ్డూ ఆరోగ్యకరమైనదేనా ? దీనికి ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథార్టీ ఆఫ్ ఇండియా) వారి సర్టిఫికేట్ ఉందా ? ఈ సందేహాలు బెంగళూరుకు చెందిన టి.సత్యనారాయణకు వచ్చింది. వెంటనే ఆర్టీఐ కింద ఎఫ్ఎస్ఎస్ఏఐకు దరఖాస్తు చేశారు. లడ్డూకు సేఫ్టీ..స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉందా ? లడ్డూల తయారీలో తిరుమల తిరుపతి దేవస్థాని వారు చట్ట ప్రకారం నియమాలు పాటిస్తోందా తెలుపాలంటూ ఆర్టీఐ దరఖాస్తులో పేర్కొన్నారు. గతంలో లడ్డూలో మేకులు..ఇతరత్రా లభించాయని, ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు కావడం లేదని అనిపిస్తోందని పేర్కొన్నారు. లడ్డూ కవర్ మీద తయారీలో వాడిన పదార్థాళ గురించి సమాచారం..తయారు చేసిన తేదీ..తినేందుకు గడువు కూడా ఉండాలని లేఖలో తెలిపారు. వెంటనే ఎఫ్ఎస్ఎస్ఏఐ డైరెక్టర్ ఏపీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేఖ రాశారు. యాక్ట్ 2016 ప్రకారం 'లడ్డూ' ఆహారం నిర్వచనం కిందకు వస్తుందా ? అని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ ఆహారం నిర్వచనం కిందకు వస్తే రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు టిటిడితో సంప్రదింపులు జరిపారంట. లడ్డూ శాలను సందర్శించి తయారవుతున్న తీరును తనిఖీ చేయాలని కోరారు. కానీ దీనికి టిటిడి సుముఖంగా లేదని తెలుస్తోంది. పోటు అనేది పవిత్ర ప్రదేశమని, ఇతరులకు ప్రవేశం లేదని తేల్చిచెప్పారని తెలుస్తోంది. మరి చట్టంప్రకారం ఏమి జరుగుతోందో వేచి చూడాలి. 

13:10 - December 13, 2016

ఆదిలాబాద్ : సీపీఎం పాదయాత్ర ప్రమాదానికి పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ రాజకీయ పక్షపాతమే కారణమన్నారు.. ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. పాదయాత్రగురించి ప్రభుత్వానికి ముందే సమాచారం ఇచ్చినా ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.. పాదయాత్రకుముందు తన గన్‌మెన్‌ను ఉపసంహరించారని విమర్శించారు.. ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా మళ్లీ గన్‌మెన్‌ను ఇవ్వలేదన్నారు తమ్మినేని..

ఇచ్చోడ వద్ద పాదయాత్ర బృందంపైకి దూసుకొచ్చిన లారీ
సీపీఎం పాదయాత్ర బృందానికి ప్రమాదం ఏర్పడింది. పాదయాత్ర బృందంపైకి ఓ లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయలవ్వగా..వీరిలో గిరిజన నేత భీమ్ రావు పరిస్థితి విషమంగా వుంది. ఆదిలాబాద్ ఇచ్చోడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ క్రమశిక్షణ ప్రకారం నడిచి వస్తున్న పాదయాత్ర బృందంపైకి ఓలారీ వేగంగా దూసుకొచ్చింది. ప్రమాదం నుండి తేరుకున్న బృందం లారీ వెంటపడి లారీ డ్రైవర్ ను పట్టుకుని పోలీసులు సమాచారం అందించారు. కాగా గాయపడినవారిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడినవారి గిరిజన నేత భీమ్ రావు పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కాగా లారీ డ్రైవర్ గంజాయి మత్తులో వున్నట్లుగా తెలుస్తోంది. లారీలో గంజాయిని తరలిస్తున్నట్లుగా సీపీఎం పాదయాత్ర బృందం గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి లారీ ఎవరిది? గంజాయి ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

13:04 - December 13, 2016

సంగారెడ్డి : ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. మూడు రోజులు బ్యాంకులకు సెలవు కావడంతో ఖాతాదారులు బ్యాంకుకు భారీగా వచ్చారు. 4 వేల రూపాయలే ఇస్తామని బ్యాంకులో బోర్డు పెట్టడంతో..ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు ముందు బైఠాయించి , కనీసం 10 వేల రూపాయలైనా ఇవ్వాలని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

12:57 - December 13, 2016

ఆదిలాబాద్ : ఒక్క గాండ్రింపుతో మదపుటేనుగును సైతం పరుగులు పెట్టించే.. మృగరాజు ఇపుడు భయంతో వణికిపోతున్నాడు. మానవ మృగాల భారిన పడి ప్రాణాలు విడుస్తున్నాడు. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో మన జాతీయ మృగం పెద్దపులి ప్రమాదంలో పడింది. ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్దపులులకు రక్షణ లేకుండా పోయింది.

ఆదిలాబాద్‌ అడవుల్లో మృగవిలాపం..
ఆదిలాబాద్‌ అడవుల్లో మృగవిలాపం.. ఇక్కడ పులి గాండ్రించడంలేదు.. విలపిస్తోంది...వణికిపోతున్న పెద్దపులి..రాజసం ఉట్టిపడే బెబ్బులికి రక్షణ కరవు..గాండ్రింపుతో అడవిలో ఇతర జంతువులను హడలెత్తించే పెద్దపులి ఇపుడు నిలువునా వణికిపోతోంది.. మానవమృగాల ధాటికి గుండెలవిసేలా విలపిస్తోంది.. రాజసం ఉట్టిపడే బెబ్బులికి ఇపుడురక్షణ కరువైంది. వేటగాళ్ల భారినపడి..మన జాతీయజంతువు పెద్దపులి ప్రాణాలు వదులుతోంది.

మంచిర్యాల, నిర్మల్‌, కుమ్రంభీమ్‌ జిల్లాల్లో రెచ్చిపోతున్న వేటగాళ్లు
ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కుమ్రంభీమ్‌ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. మంచిర్యాలజిల్లాలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ వైరు తగిలి ఓ పులి మృత్యువాత పడింది. జిల్లాలోని పిన్నారం, లింగన్నపేట, నాంగంపేట్‌, బొప్పారంతోపాటు నక్కలపల్లి , శెటుపల్లి గ్రామప్రాంతాల్లో వేటగాళ్లు విద్యుత్‌ వైర్లు అమర్చి జంతువులను వేటాడుతున్నారు. అటు కుమ్రంభీమ్‌జిల్లా దహెగం మండలం చెడ్వాయి ప్రాంతంలో అటవీ వన్యప్రాణులను వేటాడి సొమ్ముచేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపంవల్లే పలులు వేటగాళ్ల భారిన పడుతున్నాయని స్థానికులు అంటున్నారు.ఇప్పటికైనా ఫారెస్ట్‌ అకారులు గట్టి చర్యలు తీసుకుని.. మన జాతీయ జంతువు పులిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 

రెచ్చిపోతున్న వేటగాళ్లు..
పులుల సంరక్షణా కేంద్రాల్లోనే వాటికి రక్షణలేకుండా పోయింది. అటవీ అధికారులు పటిష్టనిఘా పెడుతున్నా.. వేటగాళ్లకు కళ్లెం పడటంలేదు. మహరాష్ట్రలోని తాడోబా టైగర్‌రిజర్వ్‌నుంచి తెలంగాణలోని కవ్వాల్‌ సంరక్షణా ప్రాంతానికి పలులు వసల వస్తూ .. వేటగాళ్ల భారిన పడుతున్నాయి. వేటగాళ్లు , స్మగ్లర్లు రెచ్చిపోతుండటంతో.. వన్యప్రాణులకు నిలువనీడలేకుండా పోతోంది.

చంద్రపూర్‌జిల్లాలో 1999లో తాడోబా కేంద్రం ఏర్పాటు
తాడోబా... ఇది దేశంలోనే రెండో అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం. మహరాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో 1999లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 100 నుంచి 120 పులులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే.. 2014 నవంబర్‌ నుంచి నంచి 2015 జనవరి వరకు ..కేవలం రెండునెలల వ్యవధిలోనే నాలుగు పెద్దపులులు మృత్యువాతపడ్డాయి. అప్పట్లో సమీపంలోని వ్యవసాయ బావిలో పడి ఓ చిరుత చినిపోగా.. రోడ్డుదాటుతూ మరో చిరుత మృతి చెందింది. వేటగాళ్లు విషాహారాన్ని పెట్టడంవల్ల 2015 జనవరి 1న ఏకంగా 12చిరుత పులులు, 1 పెద్దపులి చిపోయాయి. తాడోబా అటవీ ప్రాంతంలో జరిగిన విషాదకర సంఘటనలే ఇపుడు ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. వేటగాళ్ల ఆగడాలకు అరుదైన వన్యప్రాణులు అసువులుబాస్తున్నాయి.

2012లో కవ్వాల్లో పులల సంరక్షణా కేంద్రం
కవ్వాల్‌ ప్రాంతం పులుల ఆవాసానికి అనుకూలంగా ఉందని .. కేంద్ర ప్రభుత్వం 2012లో ఈప్రాంతాలన్ని సంరక్షణా కేంద్రంగా గుర్తించింది. మహరాష్ట్రలోని తాడోబా నుంచి టైగర్స్‌ ఇక్కడికి వలస వస్తుండటంతో కవ్వాల్‌ను సంరక్షణా కేంద్రంగా ఏర్పాటు చేశారు. తాడోబా కంటే కవ్వాల్లోనే పులులకు రక్షణ ఎక్కువగా ఉందని భావిస్తున్న అధికారులకు .. వేటగాళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఏకంగా విద్యుత్‌ షాక్‌ ఇచ్చి మరీ పులులు ఇతర వన్య మృగాలను హతమర్చేస్తున్నారు.

వన్యప్రాణులను కాపాడాలంటున్న స్థానికులు
వేటగాళ ఆగడాలను అడ్డుకోడానికి అటవీ అధికారులు నిఘాను పెంచి.. వేటగాళ్ల పట్ల కఠినంగా వ్యవరించాల్సిన అవసరం ఉంది. మరోవైపు అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వ్యవసాయబావులు, ఇతర నీటి కుంటలకు రక్షణ కంచెలను ఏర్పాటు చేసి.. పులులు, ఇతర వన్యప్రాణులు మృతి చెందకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 

12:53 - December 13, 2016

హైదరాబాద్‌ : డీడీ కాలనీలో విద్యార్థి విజయ్‌ మతిస్తిమితం కోల్పోవడంపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. విజయ్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.. విజయ్‌పై దాడిచేసిన విద్యార్థులతోపాటు... సిబ్బందిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి.. ఆందోళనకుదిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న విజయ్‌... తరగతులు జరగడంలేదంటూ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదుచేశారు.. దీంతో ఆగ్రహించిన తోటివిద్యార్థులు విజయ్‌పై దాడికిదిగారు.. విజయ్‌ను చితకబాదుతున్నా అక్కడేఉన్న కాలేజ్‌, ఇంచార్జ్‌ వార్డెన్‌లు ఏమాత్రం పట్టించుకోలేదు.. తలకుబలమైన గాయాలైన విజయ్‌ మతిస్తిమితం కోల్పోయాడు.. అక్టోబర్‌లో ఈ ఘటన జరిగింది.. 

12:50 - December 13, 2016

డిజైనర్ శారీస్..లెటెస్ట్ నగలు లేవని ఓ పెళ్లి కూతురు పెళ్లి వద్దని ఖరాఖండిగా చెప్పేసింది. ఇది మరి దారుణం ఇలాంటి అమ్మాయి కూడా తమకు అక్కర్లేదని మగ పెళ్లివారు కూడా చెప్పారు. ఇంకేముంది మూడు ముళ్లు పడాల్సిన పెళ్లి కాస్తా ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ జిల్లాలోని హాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మీరట్ జిల్లా గవండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో హాపూర్ జిల్లాకు చెందిన సోనాలిక (పేరు మార్చడం జరిగింది) వివాహం నిశ్చయం జరిగింది. పెళ్లి కొడుకు వారు వధువు కు కొత్త బట్టలు..నగలు తీసుకొచ్చారు. ఇలాంటి నాసిరకమైన బట్టలు తెస్తారా ? పాతకాలపు నగలు వేసుకుని పెళ్లి చేసుకోవాలా ? అంటూ వధువు వలవల ఏడ్చేసిందంట. పెళ్లి కూతురు ఈ మాటలు చెప్పడంతో అక్కడున్న వారు హతాశులయ్యారంట. తమ కుటుంబాన్ని అవమానపరిచారని ఆడపెళ్లి వారు అనడంతో మగపెళ్లి వారికి ఆగ్రహం కల్పించింది. తమకు ఇలాంటి అమ్మాయి అవసరం లేదని మగపెళ్లి వారు చెప్పేశారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి విషయాలు కూర్చొని పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారంట. దీనితో ఊరి పంచాయతీ సమావేశమైంది. డిజైనర్ శారీస్, లెటెస్ట్ ట్రెండ్ నగలు లేకుండా పెళ్లి వద్దని వధువు మరోసారి చెప్పింది. తమకు ఈ అమ్మాయి వద్దు..పెళ్లి వద్దు..అంటూ మగపెళ్లి వారు పేర్కొన్నారు. దీనితో పెళ్లి కాస్తా ఆగిపోయింది. పెళ్లికొడుకు బృందం నష్టపరిహారం చెల్లించాకే ఊరి పొలిమేర దాటాలని షరతు విధించారు. దీనితో మగపెళ్లి వారు రూ. 1.5 లక్షలు చెల్లించి ఊరు పొలిమేర దాటారు. అదండి సంగతి..

12:32 - December 13, 2016

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఇండియన్ ముజాహిదీన్ సంస్థ‌పై నేరం నిర్ధార‌ణ అయిన‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది. మొత్తం ఆరుగురు నిందితుల‌పై నేరం రుజువయిన‌ట్లు చర్లపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తెలిపింది. ఈ నెల 21న దోషుల‌కు శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు తెలిపింది. మూడున్న‌రేళ్ల పాటు విచార‌ణ జ‌రిపిన ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాల‌ను కోర్టు ముందు ఉంచింది. ఇండియ‌న్ ముజాహిదీన్ ఉగ్ర‌వాదులు యాసిన్ భత్కల్ తోపాటు మరో ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొంది. ఎన్ఐఏ మొత్తం 5,244 మందిని సాక్షులుగా పేర్కొన్న విష‌యం తెలిసిందే.  కాగా 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే.  ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ జరిపిన పేలుళ్లలో 19 మంది మృతి చెందగా, మరో 131 మందికి గాయాలయ్యాయి. పేలుళ్లతో ఆరుగురికి సంబంధం ఉన్నట్లు ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) తేల్చింది. ఎన్‌ఐఏ కోర్టు మూడున్నరేళ్లు విచారణ జరిపింది. కేసుకు సంబంధించి మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 502 ఫైల్స్ ను  201 వస్తువులను ఎన్‌ఐఏ ఆధారాలుగా కోర్టుకు సమర్పించింది.

శంషాబాద్‌ నుండి పలు విమానాలు రద్దు..

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. శంషాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 7 విమానాలు, శంషాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన నాలుగు విమానాలు, జయపుర, విజయవాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సిన ఒక్కో విమానం రద్దు చేసినట్లు వెల్లడించారు. కొద్ది సేపటి క్రితం చెన్నై విమానాశ్రయం నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు పునరుద్ధరించారు.

12:10 - December 13, 2016

విజయవాడ : క్యాష్ లెస్ విధానం కోసం నోట్లను రద్దు చేయలేదనీ..మల్టీనేషనల్ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు క్యాష్ లెస్ విధానాన్ని అమలు చేస్తున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. నోట్ల రద్దు అనంతరం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు క్యాష్ లెస్ విధానాలపై ప్రజలు దృష్టి సారించాలని హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.  మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సీపీఎం జాతీయకార్యదర్శి సీతారాం ఏచూరి విజ్ఙాన కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతోపాటు చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియం, గట్టిపాటి కోటేశ్వరరావు గ్రంధాలయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు, సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధుతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కామ్రేడ్లు హాజరయ్యారు.  ఈ సందర్భంగా సీతారాం ఏచూరి నోట్ల రద్దు అంశంపై మాట్లాడారు. మాకినేని బసవపున్నయ్య, పిచ్చయ్యల పేర్లమీదుగా భవనాలను నిర్మించటం సంతోషకరంగా వుందని ఏచూరి తెలిపారు. అత్యాధునికి టెక్నాలజీతో విజ్ఞానకేంద్రాన్ని నిర్మించటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర కమిటీ నుండి విప్లవ అభినందనలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మించినందుకు అందరికి అభినందనలు తెలిపారు. కోటేశ్వరావుగారితో తను వున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఏచూరి గుర్తు చేసుకున్నారు. ఎంబీగారి జీవితం నుండి నోర్చుకోవాల్సిందిని నేటి పరిస్థితుల్లో చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ..సిద్ధాంత కర్తగా..పార్టీ బలోపేతానికి..సుందరయ్యగారితో కలిసి అయన చేసిన కృషి ప్రసంశనీయమన్నారు. బ్యాంకుల్లోనే డబ్బులు లేవంటున్న పరిస్థితుల్లో నల్లకుబేరుల ఇళ్ళల్లో మాత్రం కోట్ల కొద్దీ కొత్త కరెన్సీ దొరుకుతోందనీ ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. 

12:04 - December 13, 2016

ఆదిలాబాద్ : సీపీఎం పాదయాత్ర బృందానికి ప్రమాదం ఏర్పడింది. పాదయాత్ర బృందంపైకి ఓ లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయలవ్వగా..వీరిలో గిరిజన నేత భీమ్ రావు పరిస్థితి విషమంగా వుంది. ఆదిలాబాద్ ఇచ్చోడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ క్రమశిక్షణ ప్రకారం నడిచి వస్తున్న పాదయాత్ర బృందంపైకి ఓలారీ వేగంగా దూసుకొచ్చింది. ప్రమాదం నుండి తేరుకున్న బృందం లారీ వెంటపడి లారీ డ్రైవర్ ను పట్టుకుని పోలీసులు సమాచారం అందించారు. కాగా  గాయపడినవారిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడినవారి గిరిజన నేత భీమ్ రావు పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కాగా లారీ డ్రైవర్ గంజాయి మత్తులో వున్నట్లుగా తెలుస్తోంది. లారీలో గంజాయిని తరలిస్తున్నట్లుగా సీపీఎం పాదయాత్ర బృందం గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి లారీ ఎవరిది? గంజాయి ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

సీపీఎం పాదయాత్ర బృందానికి ప్రమాదం..

ఆదిలాబాద్ : సీపీఎం పాదయాత్ర బృందానికి ప్రమాదం ఏర్పడింది. పాదయాత్ర బృందంపైకి ఓ లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయలవ్వగా..వీరిలో గిరిజన నేత భీమ్ రావు పరిస్థితి విషమంగా వుంది. ఆదిలాబాద్ ఇచ్చోడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారినికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

విజయవాడలో ఎంబీ విజ్ఞానకేంద్రం ప్రారంభం..

విజయవాడ : మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు సీపీఎం నేతలు..రాష్ట్ర కార్యదర్శి మధు, పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు,నగర మేయర్ శ్రీధర్ హాజరయ్యారు.  

11:34 - December 13, 2016
11:32 - December 13, 2016

సంగారెడ్డి : పెద్ద నోట్ల రద్దుతో పల్లె కన్నీరు పెడుతోంది. యాసంగి పంటను నమ్ముకున్న రైతన్నలు పెట్టుబడికి డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బ్యాంకులు, ఏటీఎంలలో మనీ లేకపోవడంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై సంగారెడ్డి జిల్లాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరింత సమాచారానికి వీడియో చూడండి..

11:30 - December 13, 2016

తమిళనాడు : వర్దా తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మునిసిపల్ అధికారులు, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో మునిగిపోయారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు రంగంలోకి దిగి సహాయచర్యలు చేపడుతున్నాయి.

వర్దా తుపాను బీభత్సం
వర్దా తుపాను దెబ్బకు చెన్నై వణుకుతోంది. తుపాను ధాటికి గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో మురికివాడల్లో చిన్న చిన్న గుడిసెలు, రేకుల షెడ్లు నేలకూలాయి. ఇక్కడి ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నగరంలోని పెద్ద పెద్ద హోర్డింగులు విరిగిపడ్డాయి. ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే అప్రమత్తవడంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

200 అమ్మ క్యాంటీన్లలో ప్రజలకు భోజనం..10,000 మందిని రక్షించిన సహాయక బృందాలు
తుపాను కారణంగా నిరాశ్రయులైన వారికి, తుపాను బాధితులకు ఉచితంగా ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై నగరంలోని సుమారు 200 అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా అల్పాహారంతో పాటు, భోజనం, నీరు ప్రజలకు అందించడం ప్రారంభించారు. ఇప్పటికే పదివేల మందిని 176 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సముద్ర తీరానికి దగ్గర్లో ఉన్నవారిని కల్యాణ వేదికల వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రంగంలోకి దిగిన ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు
మరోవైపు ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. దాదాపు ఆరు బృందాలు రంగంలోకి దిగాయి. మరో బృందాన్ని రిజర్వ్‌లో ఉంచారు. వీటిలో ఓ బృందాన్ని తిరువళ్లూరులో మోహరించారు. అప్రమత్తమైన నావికాదళం రాజాలి, డేగా ఎయిర్‌స్టేషన్ల వద్ద విమానాలతో సిద్ధంగా ఉంది. అవసరమైతే ఉపయోగించేందుకు వీలుగా హార్బర్‌ సర్వే నిర్వహించేందుకు సర్వే షిప్‌ను రిజర్వ్‌లో ఉంచారు. విశాఖపట్నం వద్ద 22 డైవింగ్‌ జట్లను సర్వసన్నద్ధంగా ఉంచారు. శివాలిక్‌, కడ్మట్‌ నౌకల్లో సిద్ధంగా ఉన్న పది డైవింగ్‌ బృందాలతో పాటుగా అదనంగా మరో ఆరు బృందాలను తమిళనాడు, పుదుచ్చేరి నౌకా ప్రాంత ఫ్లాగ్‌ ఆఫీసర్‌ ఇప్పటికే సిద్ధంగా వుంచారు. 

11:26 - December 13, 2016

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట....ఆత్మకూరులో వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. చెన్నై- గూడూరు వెళ్లే రైళ్లను రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. 

11:23 - December 13, 2016

చిత్తూరు : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను వార్ధా తుఫాన్‌ కుదిపేసింది. భారీ ఈదురుగాలులు, కుండపోతగా కురిసిన వానలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. తిరుమల రహదారులు చెరువులను తలపించాయి. శ్రీవారి ఆలయంలోకి నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తిరుమల కొండపై భారీ వర్షాలు
వార్ధా తుపాను ప్రభావంతో తిరుమల కొండపై వర్షాలు దంచికొట్టాయి. జోరుగా వానలు కురవడంతో తిరుగిరులు తడిసిముద్దయ్యాయి. కొండపై రహదారులు గోదారులయ్యాయి. తిరుమాడ వీధుల్లోకి వర్షపు నీరు పోటెత్తింది. అటు ఆలయంలోకి భారీగా నీరు చేరడంతో.. విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో అంధకారంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు నీటిని తోడేశారు. ఏడుకొండలపై వార్ధా తుఫాన్‌ విరుచుకుపడింది. భారీ ఈదురుగాలుల బీభత్సంతో పలుచోట్ల హోర్డింగ్‌లు కుప్పకూలాయి.

12.సె.మీ వర్షం నమోదు..
తిరుమలలో కుంభవృష్టి కురిసింది. పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉడిపి మండపం దగ్గర చెట్టు విరిగిపడటంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో తిరుమలను దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో యాత్రికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో చలి తీవ్రత పెరగడంతో భక్తులు వణికిపోతున్నారు. తుపాను పరిస్థితిని టీటీడీ ఈవో సాంబశివరావు సమీక్షించారు. 

10:54 - December 13, 2016

హైదరాబాద్ : నగదు కష్టాలు 35వరోజుకు చేరాయి... మూడు రోజులు వరుస సెలవులు రావడంతో జనాలకు చుక్కలు కనిపించాయి.. చాలా ఏటీఎం లలో డబ్బులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు...మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకులు మంగళవారం తెరుచుకున్నాయి. ఉదయం నుండే బ్యాంకుల ముందు ఉదయం నుంచే భారీ క్యూలు దర్శనమివ్వనున్నాయి. పలు ఏటీఎంల ముందు అవుట్‌ ఆఫ్‌ సర్వీస్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈనేపథ్యంలో లక్డి కపూర్ లోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వద్ద ఉదయం నుండే ప్రజలు బ్యాంక్ వద్ద భారీ క్యూల్లో నిల్చున్నారు. 

10:46 - December 13, 2016

తమిళనాడు : వర్దా దక్షిణ భారత దేశాన్ని బెంబేలెత్తిస్తోంది.. ఈదురుగాలులు, భారీవర్షాలు హోరెత్తిస్తున్నాయి.. పెను తుఫాన్ తమిళనాడుపై విరుచుకుపడింది. 140 కిలోమీటర్ల వేగంతో గంటన్నర పాటు వర్దా బీభత్సం సృష్టించింది.. చెన్నై నగరం గజగజా వణికిపోయింది. వర్దా బీభత్సంతో చెన్నై వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.. పెద్ద శబ్దాలతో గాలులు వీయడంతో చెన్నై వాసులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల పైకప్పులు, కార్లు, ఆటోలు గాల్లోకి ఎగిరిపోయాయి. ఈ విధ్వంసంలో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసం కాగా, ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రైలు, రోడ్డు రవాణా నిలిచిపోగా, విమానాల రాకపోకలు సైతం స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో మోకాలులోతు నీరు రావడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది.

చెన్నై తీరాన్ని తాకిన వర్ధా తుపాను
సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య తుఫాన్ తీరాన్ని తాకిందని వాతావరణ విభాగం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో మీనంబాకంలో అత్యధికంగా 18 సెంటిమీటర్లు, చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురంలలో 10 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.. గాలుల ధాటికి వందల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రాకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. చెన్నైలో దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటు లోకల్ రైళ్లను సైతం రద్దు చేశారు.

స్తంభించిన రవాణా వ్యవస్థ..
తుఫాన్‌ ఎఫెక్ట్‌తో తమిళనాడులో రవాణా స్తంభించింది.. రోడ్లపై బస్సులు తిరగలేదు. విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 1994 తరువాత చెన్నై తీరాన్ని తాకిన అతి తీవ్రమైన తుఫాన్ ఇది అని వాతావరణ శాఖ చెప్పింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నాయి. భారీ వర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో ఓ మూడేళ్ల బాలుడు, నలుగురు మహిళల సహా ఎనిమిది మంది మరణించారు.

8వేల మందిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలింపు
లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 8వేల మందిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికి 95 శిబిరాల్లో ఆశ్రయం కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో 9వేల 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రెండు రాష్ర్టాల సీఎంలు పన్నీర్‌సెల్వం, చంద్రబాబులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే అన్ని రకాల సహాయమందిస్తామని హామీ ఇచ్చారు..

మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం
పన్నీర్ సెల్వం ప్రకటించారు. రైల్వే వ్యవస్థకు భారీగా నష్టం జరిగినట్టు సదరన్ రైల్వే తెలిపింది. రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయని, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నదని, దీంతో అనేక రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని రైల్వే అధికారి అనుపమ్ శర్మ తెలిపారు. మార్గమధ్యలో ఆగిపోయిన రైళ్లలో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. చెన్నై నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశామని అధికారులు చెప్పారు. విమానాశ్రయంలో ఈదురుగాలుల కారణంగా అద్దాలు పగిలిపోయాయని, ఒకచోట పైకప్పు కూడా దెబ్బతిన్నదని అధికారులు చెప్పారు. తుఫాన్ ప్రభావిత మూడు జిల్లాలకు బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మరో 24 గంటలకు వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్దా ప్రభావంతో వచ్చే 24 గంటల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది.. 

10:39 - December 13, 2016

పెద్ద నోట్లు రద్దు చేసి 34 రోజులు గడిచిపోయినా కరెన్సీ కష్టాలు మాత్రం తగ్గడం లేదు. చేతిలో చిల్లిగవ్వలేక కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న నోట్లు అందుబాటులో లేవు. రెండు వేల రూపాయల నోటుకు చిల్లర దొరకని పరిస్థితి. దీంతో రబీసీజన్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. రబీసీజన్‌కు ఎరవులు, విత్తనాలు కొనుగోలు చేయలేక రైతులు విలవిలలాడుతున్నారు. మరోవైపు డిజిటల్ ట్రాన్సట్రాక్షన్ వైపు ప్రజలు దృష్టి పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. డెబిట్, క్రెడిట్, వాలెట్ కార్డులు ఉపయోగించి పెట్రోలు బంకుల నుండి మిగతా అన్ని లావాదేవీలు డిజిటల్ చెల్లింపు చెల్లించిన వారికి నీతి అయోగ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారంరోజుకోసారి,మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీసి డిజిటల్ ట్రాన్సక్షన్ ద్వారా నగదు చెల్లించినవారికి 0.5 పర్సెంట్ తిరిగి సదరు ఖాతాదారుడికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఇది ఎంతవరకూ సాధ్యమవుతుంది? ఎంతమేరకు అమలు జరుగుతుంది? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నగేశ్ (సీనియర్ రాజకీయ విశ్లేషకలు)శ్రీరాములు (టీడీపీ నేత) , మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ నేత ) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

నగదు మార్పిడి ముఠా అరెస్ట్..

నగదు మార్పిడి ముఠా అరెస్ట్..కర్నాటక: కర్నాటకలో పాత నోట్లు మార్పిడి చేస్తున్న ఏడుగురు దళారులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏడుగురు దళారుల నుంచి రూ.93 లక్షల కొత్త కరెన్సీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల మార్పిడిలో పలు బ్యాంకు అధికారుల పాత్రపై ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నగదు మార్పిడి ముఠా అరెస్ట్..

నగదు మార్పిడి ముఠా అరెస్ట్..కర్నాటక: కర్నాటకలో పాత నోట్లు మార్పిడి చేస్తున్న ఏడుగురు దళారులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏడుగురు దళారుల నుంచి రూ.93 లక్షల కొత్త కరెన్సీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల మార్పిడిలో పలు బ్యాంకు అధికారుల పాత్రపై ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

10:14 - December 13, 2016

హైదరాబాద్ : నగరంలో కలకలం సృష్టించిన జంట పేలుళ్ళ కేసులో నేడు విచారణకు రానుంది. నేడు చర్లపల్లి జైలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. జంటపేలుళ్ళ నిందితులపై ఐపీసీ 2,307,324,326,121,121ఏ,1221,201, రెడ్ విత్ 120 బి సెక్షన్ల కింద ఎన్ ఐఏ కేసులు నమోదు చేసింది. వీటితో పాటు 1980 పేలుడు పదార్థాల యాక్ట్ ప్రకారం 3,5 సెక్షన్లను కూడా నమోదు చేసింది. దేశద్రోహ చట్టం 1967 ప్రకారం 18,19,2038 (2)39(2) సెక్షన్లపై ఎన్ఐఏ అభియోగ ప్రతాలు నమోదు చేసింది.  ఈ కేసులో  ఐదుగురు నిందితులకు మంగళవారం చర్లపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు  శిక్ష ఖరారు చేయనుంది  పేలుళ్ల ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో చర్లపల్లి జైలు వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు జరిగిన విషయం విదితమే. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ జరిపిన పేలుళ్లలో 19 మంది మృతి చెందగా, మరో 131 మందికి గాయాలయ్యాయి. పేలుళ్లతో ఆరుగురికి సంబంధం ఉన్నట్లు ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) తేల్చింది. ఎన్‌ఐఏ కోర్టు మూడున్నరేళ్లు విచారణ జరిపింది. కేసుకు సంబంధించి మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు  చేసింది. 502 దస్ర్తాలు, 201 వస్తువులను ఎన్‌ఐఏ ఆధారాలుగా కోర్టుకు సమర్పించింది.విచారణ అనంతరం న్యాయస్థానం నిందితులకు ఎటువంటి శిక్షలు ఖరారు చేయనుందో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

09:59 - December 13, 2016

నోట్ల రద్దుతో వ్యవసాయ కూలీలు అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏ రోజు సంపాదనతో ఆ రోజు జీవితాన్ని వెళ్లదీసే వ్యవసాయ కూలీలకు నోట్ల రద్దు పెనుశాపంగా మారింది. నోట్ల రద్దు తర్వాత వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చించేందుకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేత బి. ప్రసాద్‌ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమచారానికి వీడియో చూడండి..

09:56 - December 13, 2016

గుంటూరు : పార్టీలో ఉత్సాహం నింపేందుకు వైసీపీ అధినేత జగన్‌ కసరత్తు ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడడంతో .. ఏపీలోని పలు నియోజకవర్గాల్లో నాయకత్వలోపం ఏర్పడింది. దీన్ని పరిష్కరించేందుకు ఇతర పార్టీల నేతలను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌పార్టీల్లో అసంతృప్త నాయకులపై జగన్‌ దృష్టిపెట్టారు. దీంతో ప్రతిపక్ష వైసీపీలోకి క్రమంగా నాయకుల వలసలు ప్రారంభమైయ్యాయి.

ఆపరేషన్‌ రికవరీ ని మొదలు పెట్టిన వైసీపీ
ఆపరేషన్ ఆకర్ష్ తో తీవ్రంగా నష్టపోయిన వైసీపీ నష్ట నివారణ చర్యలను మొదలు పెట్టింది. సాధారణ ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉండడంతో ఇప్పటి నుంచే అసెంబ్లీ నియోజకర్గాలు, పార్లమెంట్ స్థానాలపై దృష్టి సారిస్తున్నారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పార్టీ చేపట్టిన గడపగడపకు వైసీపీ తో పాటు నాయకత్వ లోపం ఉన్న నియోజకవర్గాలను గుర్తించే పనిలో వైసీపీ నేతలున్నారు.

జిల్లాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న వైసీపీ అధినేత
జిల్లాల వారిగా అసంతృప్తులు ఉన్నా....కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా పార్టీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారపార్టీ గూటికి చేరుకోవడంతో ఆ లోటును భర్తీ చేసే పనిలో వైసీపీ ఉంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ గన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. అటు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి కూడా టీడీపీకి చెందిన కొందరు వైసీపీ కండువాలు కప్పుకున్నారు.

కృష్ణాజిల్లాలో బలపడేందుకు జగన్‌ వ్యూహం
మరోవైపు టీడీపీ కి పట్టున్న క్రిష్ణా జిల్లాపై పార్టీ అధినేత జగన్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారని..వైసీపీ నేతలు అంటున్నారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు లు వెల్లంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది.అధికార పార్టీపై పైచేయి సాధించేందుకు వైసీపీ చేస్తున్న ఆపరేషన్ రికవరీ తో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్న ధీమా కనిపిస్తోంది. 

09:52 - December 13, 2016

హైదరాబాద్ : రవాణాశాఖలో వందశాతం క్యాష్‌లెస్‌ విధానాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. నగదు రహిత విధాన్నాని అమలు చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. అన్ని శాఖల్లో నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... మంగళవారం అన్ని జిల్లాల ఆర్టీసీ, ట్రాన్స్‌పోర్టు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

09:48 - December 13, 2016

నెల్లూరు : వర్దా తుపాను ఏపీ లోని నాలుగు జిల్లాలో ప్రభావం చూపింది. తుపానుతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ కొద్దిపాటి నష్టం జరిగింది. తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారుల పడవ గల్లంతైంది. తుపాను పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు .. నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

అప్రమత్తమైన ఏపీ..
వర్దా తుపాను ఏపీలోకి కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపింది. నాలుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలో పడుతున్న వర్షాలు అనంతపురం, కర్నూలు జిల్లాకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఎనిమిది మందిని రక్షించి శ్రీహరికోట చేర్చిన షార్‌ సిబ్బంది
వర్దా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సూళ్లూరుపేట మండలంలోని కొటకట్ల సహా పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కావలి, వాకాడు, తడ ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. రెండు రోజుల క్రితం చేపలవేటకు బయలుదేరిన సముద్రంలో చిక్కుకుపోయిన 18 మంది తమిళ జాలర్ల 8 మందిని షార్‌ సిబ్బంది రక్షించి శ్రీహరికోటకు తరలించారు. తీవ్రగాలులకు కొన్నిచోట్ల గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని కూలిపోయాయి.

తిరుమల కనుమదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలి -ఈవో
తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.కార్వేటినగరం సీఐ మోహన్‌ అత్యవసర విధుల నిర్వహణకు పిచ్చటూరు డ్యామ్‌కు వెళుతుండంగా చెట్టు విరిగి పోలీసులు ప్రయానిస్తున్నవాహనంపై పడండి. దీంతో మోహన్‌ ఎడమచేయి విరగడంతో తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించారు. తిరుమలలో కుంభవృష్టి కురిసింది. పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉడిపి మండపం దగ్గర చెట్టు విరిగిపడటంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో చలి తీవ్రత పెరగడంతో భక్తులు వణికిపోతున్నారు. తుపాను పరిస్థితిని టీటీడీ ఈవో సాంబశివరావు సమీక్షించారు. కునుమదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొండచరియలు విరిగిపడితే తొలగించేందుకు జేసీబీ యంత్రాలతో సిద్ధంగా ఉండాలని ఇంజినీరింగ్‌ సిబ్బందికి సూచించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఆదేశించారు.

మత్స్యకారుల ఫైబర్‌ బోటు గుర్తింపు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చినమైనివానిలంక సముద్రంలో మత్స్యకారుల ఫైబర్‌ బోటు గల్లంతైనట్టు గుర్తించారు. బోటులో ఉన్న మత్స్యకారులను రక్షించేందుకు కాకినాడ నుంచి తీర ప్రాంత రక్షణ దళం ఓడలు చినమైనివానిలంక సముద్ర తీర ప్రాంతానికి చేరుకుంటున్నాయి. నరసాపురం జాయింట్‌ కలెక్టర్‌ చినమైనివానిలంక చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

చెరువులు, కుంటలు, వాగులు, వంకలకు గండ్లు పడకుండా చర్యలు : బాబు
వర్దా తుపాను పరిస్థితిన సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకల గట్లు తెగకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు. వర్షంనీరు వృధా కాకుండా పంటకుంటలు, చెరువుల్లో నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం వరకు అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు తుపాను తాకిడికి గురైన చెన్నైని ఆదుకునేందుకు చంద్రబాబునాయుడు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చారు. తమిళనాడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి కావాల్సిన సహాయాన్ని పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

09:41 - December 13, 2016

తమిళనాడు : వార్దా తుపాన్ తమిళనాడు రాష్ట్రాన్ని వణికించింది. ప్రచండ గాలులు చెన్నైలో బీభత్సం సృష్టించాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు తీర ప్రాంత ప్రజలను కకావికలం చేశాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది.

తమిళనాడును కకావికలం చేసిన వర్దా తుపాను..
వర్దా తుపాను తమిళనాడును కకావికలం చేసింది. గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులతో చెన్నైతోపాటు తమిళనాడు తీరప్రాంతం అతలాకుతలమైంది. ప్రధానంగా ఐదు జిల్లాల ప్రజలు వణికిపోయారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో చెన్నై తీరాన్ని దాటింది. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, విళుపురం, కడలూరు జిల్లాలను కుదిపేసింది. తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు, భీకరమైన గాలులకు వృక్షాలు నేలకూలాయి. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

ఎన్నూరులోని ఇందిరా గాంధీ కుప్పం, నెట్టుకుప్పం,
తీర ప్రాంతాల్లోని కొన్ని నివాస ప్రాంతాల్లోకి కెరటాలు చొచ్చుకుని వచ్చాయి. ముఖ్యంగా ఎన్నూరులోని ఇందిరా గాంధీ కుప్పం, నెట్టుకుప్పం, ముగత్తువార కుప్పం తదితర ప్రాంతాల్లోకి సముద్రపునీరు చొచ్చుకు రావడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల్లో నివసించే వందలాది జాలర్ల కుటుంబాలు ఇళ్లను వదిలి వివిధ పాఠశాలల్లో రెవెన్యూశాఖ ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకున్నారు. చెన్నై నగరం, శివార్లు కలుపుకుని 46 మత్య్సకార గ్రామాల్లో 50

ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. విద్యా సంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రయివేటు సంస్థలు సైతం ఉద్యోగులకు సెలవు లేదా ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఇవ్వాలని సూచించింది. చెన్నై నగరంలోని అనేక లోకల్‌ రైల్వేస్టేషన్లలో పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. రైళ్లు, సిటీ బస్సులు, లోకల్‌ రైళ్లను నిలిపివేశారు. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా తిరగకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.

చేపల వేటకు వెళ్లిన 10 మంది మత్స్యకారులు గల్లంతు
తుపాను దెబ్బకు తమిళనాడులో ఇప్పటి వరకు ఏడుగురు రైతులు మృత్యువాతపడ్డారు. మరోవైపు చేపల వేటకు వెళ్ళిన 10 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. విశాఖ నుంచి రెండు నౌకలు ఐఎన్ఎస్ శివానిక్,ఐఎన్ఎస్ కడ్మెట్ చెన్నై వెళ్లాయి. నౌకల్లో రబ్బరు బోట్లు, గజ ఈతగాళ్ళు ఉన్నారు. తిరువళ్ళూరు ప్రాంతంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. పౌర్ణమి కారణంగా అలల ఉధృతి అధికంగా ఉంది.

సీఎం పన్నీరు సెల్వంతో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్
చెన్నై నగరంలోని రోడ్లపై నడుములోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తగిలింది. రాష్ట్రంలో తుపాను పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం పన్నీర్ సెల్వంతో మాట్లాడారు. ఎలాంటి సాయానికైనా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. మొత్తమ్మీద వర్ధా తుపాను తమిళనాడును వర్షాలతో ముంచెత్తింది. మరో 24 గంటలపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

10కి చేరిన వర్థా మృతుల సంఖ్య..

తమిళనాడు : వార్ధా తుఫాను ధాటికి తమిళనాడులో 10 మంది మృతి చెందారు. చెన్నైలో నలుగురు, కాంచీపురంలో ఇద్దరు, తిరువళ్లూరులో ఇద్దరు, విల్లుపురం, నాగపట్టణం ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాలుల ధాటికి రహదారులపై విరిగిపడిన చెట్లను ఎన్డీఆర్ బృందాలు తొలగిస్తున్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. 

సినీ నటి ఇంట్లో చోరీ..

హైదరాబాద్‌ : కృష్ణనగర్‌లో నివసించే సినీనటి సంతోషిశ్రీ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.7వేల నగదుతోపాటు రెండు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డులను దొంగిలించినట్లు బంజారాహిల్స్ సీఎస్ లో సంతోషి ఫిర్యాదు చేసింది. కాగా దొంగను కొద్ది దూపం వెంబడించినా ఫలితం లేకుండా పోయిందని సదరు నటి పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నేడు దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ తుది తీర్పు ..

దిల్‌సుఖ్‌నగర్ : జంట బాంబు పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ సహా మరో నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. కేసును విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మొత్తం 5244 మందిని సాక్షులుగా పేర్కొంది. వీరిలో 156 మంది సాక్షుల వాంగ్మూలాన్ని రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు నమోదు చేసింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు గత నెల 7వ తేదీన ముగిశాయి. నేడు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Don't Miss