Activities calendar

12 December 2016

వర్ష బీభత్సానికి తమిళనాడులో ఏడుగురు మృతి

తమిళనాడు : చెన్నైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సానికి తమిళనాడులో ఏడుగురు మృతి చెందారు. తిరువళ్లూరు, కాంచిపురం, చెన్నైలో భారీ వర్షాలు పడ్డాయి. మీనంబాకంలో అత్యధికంగా 18 సెం.మీ వర్ష పాతం నమోదు అయింది. వేలచ్చిరి, తాంపీనగర్, ఏజీఏ కాలనీ, రామ్ నగర్, సైదాపేట, ఎన్నూరు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

 

21:51 - December 12, 2016

ఢిల్లీ : టాటా ఇండస్ట్రీ డైరెక్టర్‌ పదవి నుంచి కూడా సైరస్‌ మిస్త్రీని తొలగించారు. టాటా ఇండస్ట్రీ షేర్‌ హోల్డర్స్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిస్త్రీని బోర్డు నుంచి తప్పించాలని షేర్‌ హోల్డర్స్‌కు టాటా సన్స్‌ విజ్ఞప్తి చేసింది. సైరస్‌ కారణంగా టాటా గ్రూపు ముక్కలు ముక్కలుగా చీలిపోయే అవకాశముందని ఫిర్యాదు చేసింది. టాటా కంపెనీ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని అక్టోబర్‌లో తొలగించిన విషయం తెలిసిందే. కొత్త చైర్మన్‌ను ఎన్నుకునేవరుక రతన్‌ టాటా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు.

21:49 - December 12, 2016

చెన్నై : జాతీయగీతం ప్రదర్శించినపుడు నిలబడలేదన్న కారణంతో చెన్నైలోని ఓ సినిమా థియేటర్‌లో దాడి జరిగింది. ఆదివారం మార్నింగ్‌ షో సందర్భంగా థియేటర్‌లో జాతీయ గీతాన్ని ప్రదర్శించారు. అయితే 8 మంది విద్యార్థులు లేచి నిలబడలేదు. ఈ నేపథ్యంలో సినిమా విరామ సమయంలో కొందరు వ్యక్తులు ఆ విద్యార్థుల వద్దకు వెళ్లి జాతీయగీతం వచ్చినపుడు ఎందుకు నిలబడలేదని వాగ్వాదానికి దిగారు. సుమారు 20 మంది వారిపై దాడి చేశారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డవారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తి జాతీయగీతం సందర్భంగా లేచి నిలబడలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం ప్రదర్శించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కేసు నమోదైన తొలి ఘటన ఇది.

 

21:47 - December 12, 2016

ఢిల్లీ : 2 వేల రూపాయల నోటు త్వరలోనే రద్దవుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త, ఆర్థిక నిపుణుడు ఎస్‌.గురుమూర్తి చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రెండువేల నోటు ఎప్పుడైనా రద్దయ్యే అవకాశముందన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడే లోటును పూడ్చడానికే రెండు వేల నోట్లను ముద్రించారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో 5 వందల నోటే అతిపెద్ద నోటుగా ఉండనుందని తెలిపారు. నవంబర్‌8న మోది ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల అవినీతి నిర్మూలనకు దోహదపడుతుందన్నారు. త్వరలో రెండు వేల నోటును తొలగిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో గురుమూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 

21:45 - December 12, 2016

విజయవాడ : పెద్దనోట్ల రద్దుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుతో భారీ కుంభకోణం జరిగిందని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుపై విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కరెన్సీ కొరతతో సామాన్యులు నానా పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలాచోట్ల పెళ్లిల్లు ఆగిపోతున్నాయని... లైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దులో జరిగిన అక్రమాలపై అందరినీ కలుపుకుని ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. 

 

21:39 - December 12, 2016

సిరిసిల్లా : తాను అనుకున్న మేర అభివృద్ధి సిరిసిల్లాలో జరగడం లేదని తెలంగాణమంత్రి కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సిరిసిల్లా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి   ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. రాష్ట్రంలోనే  ఆదర్శ మున్సిపాలిటీగా సిరిసిల్లాను తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని కోరారు. సిరిసిల్లా పట్టణంలో  పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.  

21:37 - December 12, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రాజకీయ రచ్చకు వేదికగా మారకుండా ప్రజలకు సంబంధించిన సమస్యలపై విస్తృత చర్చ జరగాలన్నారు. అసెంబ్లీ సమావేశాల సన్నద్దతపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సభ్యులు లేవనెత్తే ఎలాంటి అంశంపై నైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి  హరీష్‌రావు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

 

21:33 - December 12, 2016

విజయవాడ : వర్దా తుపాను ఏపీలోని నాలుగు జిల్లాలో ప్రభావం చూపింది. తుపానుతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ కొద్దిపాటి నష్టం జరిగింది. తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారుల పడవ గల్లంతైంది. తుపాను పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. 
నాలుగు జిల్లాల్లో వర్షాలు 
వర్దా తుపాను ఏపీలోకి కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపింది. నాలుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలో పడుతున్న వర్షాలు అనంతపురం, కర్నూలు జిల్లాకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 
నెల్లూరు..ఈదురు గాలులతో కూడిన వర్షాలు 
వర్దా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సూళ్లూరుపేట మండలంలోని కొటకట్ల సహా పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కావలి, వాకాడు, తడ  ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. రెండు రోజుల క్రితం చేపలవేటకు బయలుదేరిన సముద్రంలో చిక్కుకుపోయిన  18 మంది తమిళ జాలర్ల 8 మందిని షార్‌ సిబ్బంది రక్షించి శ్రీహరికోటకు తరలించారు. తీవ్రగాలులకు కొన్నిచోట్ల గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని కూలిపోయాయి. 
చిత్తూరులో అక్కడక్కడ వర్షాలు 
తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.కార్వేటినగరం సీఐ మోహన్‌ అత్యవసర విధుల నిర్వహణకు పిచ్చటూరు డ్యామ్‌కు వెళుతుండంగా చెట్టు విరిగి పోలీసులు ప్రయానిస్తున్నవాహనంపై పడండి. దీంతో మోహన్‌ ఎడమచేయి విరగడంతో తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించారు.  తిరుమలలో కుంభవృష్టి కురిసింది. పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉడిపి మండపం దగ్గర చెట్టు విరిగిపడటంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.  దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో చలి తీవ్రత పెరగడంతో భక్తులు వణికిపోతున్నారు. తుపాను పరిస్థితిని టీటీడీ ఈవో సాంబశివరావు సమీక్షించారు. కునుమదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొండచరియలు విరిగిపడితే తొలగించేందుకు జేసీబీ యంత్రాలతో సిద్ధంగా ఉండాలని ఇంజినీరింగ్‌ సిబ్బందికి సూచించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి ఆదేశించారు. 
సముద్రంలో మత్స్యకారుల బోటు గల్లంతు 
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చినమైనివానిలంక సముద్రంలో మత్స్యకారుల ఫైబర్‌ బోటు గల్లంతైనట్టు గుర్తించారు. బోటులో ఉన్న మత్స్యకారులను రక్షించేందుకు కాకినాడ నుంచి తీర ప్రాంత రక్షణ దళం ఓడలు చినమైనివానిలంక సముద్ర తీర ప్రాంతానికి చేరుకుంటున్నాయి. నరసాపురం జాయింట్‌ కలెక్టర్‌ చినమైనివానిలంక చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో  సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. 
వర్దా తుపాను పరిస్థితిన సమీక్షించిన చంద్రబాబు
వర్దా తుపాను పరిస్థితిన సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకల గట్లు తెగకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు. వర్షంనీరు వృధా కాకుండా పంటకుంటలు, చెరువుల్లో  నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం వరకు అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు తుపాను తాకిడికి గురైన  చెన్నైని ఆదుకునేందుకు చంద్రబాబునాయుడు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చారు. తమిళనాడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి కావాల్సిన సహాయాన్ని పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

 

21:23 - December 12, 2016
21:22 - December 12, 2016

చెన్నై, తిరువళ్లూరు, కాంచిపురం పరిధిలో రేపు విద్యాసంస్థలకు సెలవు

తమిళనాడు : చెన్నై, తిరువళ్లూరు, కాంచిపురం పరిధిలో రేపు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

 

చెన్నైలో కొనసాగుతున్న సహాయక చర్యలు

తమిళనాడు : చెన్నైలో వర్ధా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 10,432 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది నేలకూలిన చెట్లను తొలగిస్తోంది.

 
 

తమిళనాడు సీఎంతో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ : తమిళనాడు సీఎం పన్నీరు సెల్వంతో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. వర్ధా తుపాను పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. 

 

వర్ధా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

అమరావతి : వర్ధా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత జిల్లాలో జరిగిన నష్టం తెలుసుకున్నారు. రేపటి వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

20:48 - December 12, 2016

పూతరేకుల పరిశ్రమపై పెద్ద నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపింది. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారం లేక కార్మికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్రేయపురంలోని పూతరేకుల తయారీ కార్మికులతో మల్లన్నముచ్చటించాడు. నోట్ల రద్దుతో తమ వ్యాపారం దివాల తీసిందని వాపోయారు. నోట్ల రద్దుతో పెద్ద వారికి లాభం తప్ప.. సామాన్యులకు ఎలాంటి లాభం లేదన్నారు. మోడీ నిర్ణయం తమను కష్టాలుపాల్జేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:41 - December 12, 2016

హైదరాబాద్ : హుద్‌ హుద్‌, బుల్‌ బుల్‌, లైలా...వర్ధా....ఈ పేర్లు వెరైటీగా ఉన్నాయి కదూ...ఇవన్నీ కూడా తుపాన్‌ల పేర్లు...వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి? ఎవరు నిర్ణయిస్తారు?
వర్దా అంటే ఎర్ర గులాబి అని అర్థం
హుద్‌ హుద్‌, కత్రీనా...లీజా..లైరీ...బుల్‌ బుల్‌...పైలిన్.. తుపాన్ వచ్చినప్పుడల్లా కొత్త పేరు కనిపిస్తుంటుంది. తాజాగా తమిళనాడు ఆంధ్రా తీరాన్ని తాకిన తుపాను పేరు వర్దా... వర్దా అంటే ఎర్ర గులాబి అని అర్థం.
1953 నుంచి తుపానులకు పేర్లు పెట్టడం ప్రారంభం 
చక్రవాత తుపానులకు పేర్లు పెట్టడం 1953 నుంచి ప్రారంభమైంది. అట్లాంటిక్‌ పరిధిలోని దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. హిందూ మహా సముద్రం తీరంలోని 8 సముద్ర తీర దేశాలు తుపాన్లకు పేరు పెట్టే విషయంలో ఓ ఒప్పందానికి వచ్చాయి. ఇందులో భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, మయన్మార్‌, మాల్దీవులు, శ్రీలంక, ఓమన్, థాయిలాండ్‌ దేశాలున్నాయి. 
ముందుగానే తుపాన్‌ల పేర్లు 
హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపాన్‌లకు 2004 నుంచి పేర్లు పెట్టడం ప్రారంభమైంది. ఈ దేశాలు ముందుగానే తుపాన్‌ల పేర్లను నిర్ణయిస్తాయి. సభ్యత్వ దేశాలు ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో మొదట వచ్చే అక్షరం ప్రకారం ఆ దేశం పేర్లను నిర్ణయించే అధికారం ఉంటుంది. తమ వంతు వచ్చినపుడు తుపాన్‌కు ఆ దేశం పేరు పెట్టడం రివాజుగా మారింది. వర్ద పేరును పాకిస్తాన్‌ పెట్టింది. దీనికన్నా ముందు వచ్చిన తుపాన్‌ హుద్‌ హుద్‌ పేరును ఒమాన్‌ దేశం ప్రకటించింది. అంతకు ముందు వచ్చిన ఫాలీన్ తుపానుకు థాయ్‌లాండ్‌ నామకరణం చేసింది.
ఇప్పటివరకు తుపాన్‌లకు 64 పేర్లు 
ఇప్పటివరకు తుపాన్‌లకు 64 పేర్లు పెట్టారు. భారత్‌ కూడా తన వంతు వచ్చినపుడు ఓ తుపాన్‌కు 'లహర్‌' అని పేరు పెట్టడం జరిగింది. ఇదండీ తుపాన్‌ పేర్ల కథా కమామిషు.

 

20:33 - December 12, 2016
20:32 - December 12, 2016
20:31 - December 12, 2016
20:22 - December 12, 2016

చెన్నై : వర్దా తుపాను చెన్నైలో బీభత్సం సృష్టించింది. జనజీవనంపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. గంటకు 140 కి.మీ. వేగంలో వీచిన పెను గాలులకు మహావృక్షాలు కూకటివేళ్లతో నేలకొరిగాయి, విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. చెన్నైలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మహానగరం జలసంద్రంగా మారింది.
చెన్నైలో 15 నుంచి 20 సె.మీ. వర్షపాతం  
బంగాళాఖాతంలో ఏర్పాడిన వర్దా తుపాను చెన్నై సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో గంటలకు 140 కి.మీ. వేగంతో  వీచిన పెను గాలులకు మహానగరం చిగురుటాకులా వణికిపోయింది.  తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో  15 నుంచి 20 సె.మీ. వర్షపాతం నమోదైంది. మరికొన్ని గంటలపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రం అల్లకల్లోంగా మారింది. 
నేలకూలిన భారీ వృక్షాలు 
వర్దా తుపాను ధాటికి వందలాది భారీ వృక్షాలు నేలకూలాయి. హోర్డింగ్‌లు, విద్యుత్‌ స్తంభాలు  కూలిపోయాయి. నేలకూలిన వృక్షాలు హోర్డింగ్‌లతో మహానగరంలో భయానక వాతావరణం నెలకొంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అడ్డదిడ్డాలుగా పడిన హోర్డింగ్‌లు, కూలిన వృక్షాలతో రోడ్లపై కాలు పెట్టాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలు విరిపోవడంతో కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గాడాంధకారం నెలకొంది. నేలకూలిన వృక్షాలు, హోర్డింగ్‌లు, విద్యుత్‌ స్తంభాలను తొలగించిన తర్వాతే  కరెంట్‌ సరఫరా పునరుద్ధరించే అవకాశాలున్నాయి. 
రైలు పట్టాలపై చేరిన వర్షం నీరు 
పలు ప్రాంతాల్లో విరిగిన వృక్షాలు, హోర్డింగ్‌లు రైల్వే ట్రాక్‌లపై పడ్డాయి. కొన్ని చోట్ల రైలు పట్టాలపైకి వర్షం నీరు చేరింది. దీంతో చెన్నై-గూడూరు మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్నిరైళ్లను రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంకొన్నింటిని దారి మళ్లించారు. నెల్లూరు జిల్లా సూళ్లురుపేట సమీపంలో రైలు పట్టాలు దెబ్బతినడంతో చెన్నై వెళ్లే కొన్ని రైళ్లను గూడూరు నుంచి రేణిగుంట మీదుగా పంపిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో దేశ, విదేశాల నుంచి చెన్నై చేరుకోవాల్సిన 25 విమానాలను హైదరాబాద్‌, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. వర్షాలు, పెనుగాలులు తగ్గిన  తర్వాత విమానాశ్రయాన్ని పునపుద్ధరించాలని  అధికారులు నిర్ణయించారు. 
ఊడిపడిన హోటల్‌ గ్లాసులు 
పెనుగాలులకు చెన్నైలోని హోటల్‌ హయత్‌ గ్లాసులు ఊడిపోయి దూరంగా పడ్డాయి. కొన్ని గ్లాసులు రోడ్డుపై నడుస్తున్నవారికి అతి సమీపంలో పడ్డాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ ఫారం పైకప్పు రేకులు కూడా పెనుగాలుకు లేచి పట్టాలపై పడ్డాయి. పెను గాలుల ప్రభానికి  రోడ్లపై ప్రయాణిస్తున్న కార్లు తిరగపడ్డాయి. 
మురికివాడల్లో కూలిన రేకుల షెడ్లు 
మురికివాడల్లో రేకుల షెడ్లు కూలిపోయి భారీ నష్టం జరిగింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పెను గాలులు, భారీ వర్షాలు తగ్గిన తర్వాత సహాయ, పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.  నష్టం వివరాలను సేకరించేందుకు  ప్రత్యేక అధికారుల బృందాలను నియమించింది. తుపాను ప్రభావం నుంచి చెన్నై తేరుకోవడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం
వర్దా తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మునిసిపల్ అధికారులు, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో మునిగిపోయారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు రంగంలోకి దిగి సహాయచర్యలు చేపడుతున్నాయి. 
సహాయక చర్యలు 
వర్దా తుపాను దెబ్బకు చెన్నై వణుకుతోంది. తుపాను ధాటికి గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో మురికివాడల్లో చిన్న చిన్న గుడిసెలు, రేకుల షెడ్లు నేలకూలాయి. ఇక్కడి ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నగరంలోని పెద్ద పెద్ద హోర్డింగులు విరిగిపడ్డాయి. ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే అప్రమత్తవడంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
200 అమ్మ క్యాంటీన్లలో ప్రజలకు భోజనం
తుపాను కారణంగా నిరాశ్రయులైన వారికి, తుపాను బాధితులకు ఉచితంగా ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై నగరంలోని సుమారు 200 అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా అల్పాహారంతో పాటు, భోజనం, నీరు ప్రజలకు అందించడం ప్రారంభించారు. ఇప్పటికే పదివేల మందిని 176 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సముద్ర తీరానికి దగ్గర్లో ఉన్నవారిని కల్యాణ వేదికల వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
రంగంలోకి దిగిన ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు
మరోవైపు ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. దాదాపు ఆరు బృందాలు రంగంలోకి దిగాయి.  మరో బృందాన్ని రిజర్వ్‌లో ఉంచారు. వీటిలో ఓ బృందాన్ని తిరువళ్లూరులో మోహరించారు. అప్రమత్తమైన నావికాదళం రాజాలి, డేగా ఎయిర్‌స్టేషన్ల వద్ద విమానాలతో సిద్ధంగా ఉంది. అవసరమైతే ఉపయోగించేందుకు వీలుగా హార్బర్‌ సర్వే నిర్వహించేందుకు సర్వే షిప్‌ను రిజర్వ్‌లో ఉంచారు. విశాఖపట్నం వద్ద 22 డైవింగ్‌ జట్లను సర్వసన్నద్ధంగా ఉంచారు.  శివాలిక్‌, కడ్మట్‌ నౌకల్లో సిద్ధంగా ఉన్న పది డైవింగ్‌ బృందాలతో పాటుగా  అదనంగా మరో ఆరు బృందాలను తమిళనాడు, పుదుచ్చేరి నౌకా ప్రాంత ఫ్లాగ్‌ ఆఫీసర్‌ ఇప్పటికే సిద్ధంగా వుంచారు. 

నగదు రహిత లావాదేవీలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇబ్రహీంపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచిందన్నారు. 

 

19:35 - December 12, 2016
19:30 - December 12, 2016

తూర్పుగోదావరి : బలవంతపు భూసేకరణ సరికాదని నిజ నిర్ధారణ కమిటీ బృందం అభిప్రాయపడింది. దివీస్ ప్రాజెక్టు నిర్మిత ప్రాంతంలో నిజ నిర్దారణ కమిటీ పర్యటించింది. రైతులు, వృత్తికారులు, మత్స్యకారులతో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కమిటీ సభ్యులు స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు సభ్యులు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని..వాస్తత పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. ఎపిలో ఆటవిక న్యాయం తాండవిస్తోందని మండిపడ్డారు. దివీస్ ల్యాబ్ వ్యతిరేకించే వారిని నరికేస్తామని వీరంగం చేస్తూ రాత్రి ఒక అతను మహిళపై కత్తితో దాడి చేశాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. మహిళను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు. ఎపి సర్కార్ దివీస్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దివీస్ యాజమాన్య రౌడీయిజం చేస్తుందని చెప్పారు. దివీస్ ల్యాబ్ ఏర్పాటు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ, ప్రభుత్వం యాజమాన్యానికి మద్దుతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

 

చెన్నైలో భారీ వర్షం

చెన్నై : వర్ధా తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది. చెన్నై...గూడూరు మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై..గూడూరు వెళ్లే రైళ్లను రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. చెన్నై..ఎగ్మోర్ మధ్య 17 రైళ్లను రద్దు చేశారు. చెన్నై కేంద్రంగా నడిచే లోకల్ రైళ్లన్నీ రద్దు అయ్యాయి.

 

19:10 - December 12, 2016
19:09 - December 12, 2016
19:05 - December 12, 2016
18:59 - December 12, 2016

ప్రకాశం : వర్దా తపాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో అధికారయంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది.  తీరప్రాంతంలోని లోతట్టు గ్రామాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చీరాల ఓడరేవులోని మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం  ఎఫ్‌ఎఫ్‌ఎంఏ  అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఇది తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు అక్కడి  వాతావరణ పరిస్థితులను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.

 

18:57 - December 12, 2016

తమిళనాడు : చెన్నైని వర్దా తుపాను అతలాకుతలం చేస్తోంది. తుపాను తీరం దాటడంతో.. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై నగరం చివురుటాకులా వణికిపోతోంది. తుపాను ప్రభావం నగరంపై దాదాపు నాలుగు గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలో 10 నుంచి 15 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు 
బలమైన గాలులకు చెన్నైలోని హోర్డింగ్‌లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు 300పైగా చెట్లు కూలినట్లు చెన్నై నగరపాలక సంస్థ తెలిపింది. వీటిని హుటాహుటిన తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజలు 
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం 176 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయచర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. భారీ వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకు వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్‌కు మళ్లిస్తున్నారు. సూళ్లూరుపేట సమీపంలో రైలు పట్టాలు దెబ్బతినడంతో విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లను గూడూరు, రేణిగుంట మీదుగా మళ్లిస్తున్నారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ప్రభావం 
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు సైన్యం సిద్ధమైంది. నౌకాదళం, నావికాదళం అప్రమత్తంగా ఉన్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు నావికాదళం హెలికాప్టర్లను సిద్ధం చేసింది. తుపాను ప్రభావం ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి.  

 

మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుమారుడు పీవీ.రాజేశ్వరావు కన్నుమూత

హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుమారుడు పీవీ.రాజేశ్వరావు కన్నుమూశారు. డిసెంబర్ 5న గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ సోమాజీగూడ యశోధ ఆస్పుత్రిలో రాజేశ్వరరావు చేశారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజేశ్వరరావు సికింద్రాబాద్ ఎంపీగా పని చేశారు. 

 

చెన్నైలో వర్ధా ధాటికి ముగ్గురు మృతి

తమిళనాడు : చెన్నైపై వర్ధా తుపాను విరుచుకుపడింది. తుపాన్ ధాటికి నగరంలో ముగ్గురు మృతి చెందారు. 200 వందలకు పైగా రోడ్లు ధ్వంసం అయ్యాయి. 200 చెట్లు, హోర్డింగ్స్ లు నేలకూలాయి. 37 విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి.

ఈదురు గాలులతో కూడిన వర్షాలు : ఐఎండీ

హైదరాబాద్ : ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. చెన్నైలో వర్ధా తుపాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షం పడుతుందన్నారు. మరో 12 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.  

18:25 - December 12, 2016

నెల్లూరు : వర్దా తుపాను బీభత్సం సృష్టించింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ గాలులకు ఓ డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన ట్యాంకర్‌ సిబ్బంది కిందపోతున్న డీజిల్‌ను డ్రమ్ముల్లోకి నింపారు. ఏమాత్రం ఫైర్‌ జరిగినా పెను ప్రమాదమే జరిగేది. 

 

చీరాల ఓడరేవులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక

ప్రకాశం : చీరాల ఓడరేవులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. 20 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. తీరం ప్రాంతంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. 

18:11 - December 12, 2016
18:10 - December 12, 2016

పశ్చిమగోదావరి : జిల్లా నరసాపురం మండలం చినమైనవానిలంక సమీపంలో మత్స్యకారుల బోటు చిక్కుకుపోయింది. బోటులో ఉన్న ముగ్గురు మత్స్యకారులను రక్షించేందుకు జిల్లా రెవిన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది.  వీరు చినమైనివానిలంకకు చెందిన మత్స్యకారులు కాదని గుర్తించారు. ఈ బోటు ఎక్కడ నుంచి వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. సముద్రంలో చిక్కుకున్న వారిని ముందుగా బయటకు తీసుకొచ్చిన తర్వాత వివరాలు సేకరించాలని నిర్ణయించారు. 

 

18:01 - December 12, 2016

చిత్తూరు : వర్దా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు చిత్తూరు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. తుపాను ప్రభావంపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చిత్తూరు కలెక్టరేట్‌లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను సురక్షింత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ముప్పుకు ఎక్కువగా ఆస్కారం ఉన్న శ్రీకాళహస్తి, నగరి, తంబళ్లపల్లి, సత్యవేడు, చిత్తూరు, కుప్పం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చినరాజప్ప అధికారులను ఆదేశించారు. 

 

18:00 - December 12, 2016

ప్రకాశం : వర్దా తుపానుతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీమంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. సహాయక చర్యల కోసం పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. వర్దాతుపానుపై ఒంగోలు కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష  నిర్వహించారు. తీరప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రజలకు నిత్యావసరాలు, మంచినీరు అందుబాటులో ఉండేలా  చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున పోలీస్‌ సేవాదళ్‌ సభ్యులను, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు.

 

17:55 - December 12, 2016

నెల్లూరు : వర్ధా తుపాను చెన్నై వద్ద తీరాన్ని తాకింది. చెన్నైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున్న అలలు ఎగిసిపడుతున్నాయి. ఇటు దక్షిణ కోస్తాంధ్రపై కూడా వర్ధా తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై తుపాను ప్రభావం చూపుతోంది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. 12 నుంచి 24 గంటల వరకు 
వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుతోంది. నెల్లూరు జిల్లాలోని తడ, తూళ్లూరుపేట, వాకాడు మండలాలపై తుపాను తీవ్రంగా పడింది. 6 నుంచి 8లక్షల మంది ప్రజలకు అసౌకర్యం కలిగింది. 126 గ్రామాలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎపి ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఆయా జిల్లా కలెక్టర్లు సహాయక చర్యల నిమిత్త అన్యిన ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:46 - December 12, 2016

తమిళనాడు : చెన్నైని వర్దా తుపాను అతలాకుతలం చేస్తోంది. తుపాను తీరం దాటడంతో.. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై నగరం చివురుటాకులా వణికిపోతోంది. తుపాను ప్రభావం నగరంపై దాదాపు నాలుగు గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలో 10 నుంచి 15 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
నగరంలో అలుముకున్న చీకట్లు 
బలమైన గాలులకు చెన్నైలోని హోర్డింగ్‌లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు 300పైగా చెట్లు కూలినట్లు చెన్నై నగరపాలక సంస్థ తెలిపింది. వీటిని హుటాహుటిన తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
176 పునరావాస కేంద్రాలు
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం 176 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయచర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. భారీ వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకు వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్‌కు మళ్లిస్తున్నారు. సూళ్లూరుపేట సమీపంలో రైలు పట్టాలు దెబ్బతినడంతో విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లను గూడూరు, రేణిగుంట మీదుగా మళ్లిస్తున్నారు.
రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, సైన్యం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు సైన్యం సిద్ధమైంది. నౌకాదళం, నావికాదళం అప్రమత్తంగా ఉన్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు నావికాదళం హెలికాప్టర్లను సిద్ధం చేసింది. తుపాను ప్రభావం ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి.  

 

17:40 - December 12, 2016

రంగారెడ్డి : జిల్లాలోని మైసిగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు మృతి చెందారు. దంపతులు తమ ఇద్దరు చిన్నారులతో బైక్ పై వెళ్తున్నారు. మార్గంమధ్యలో మైసిగండి వద్ద ప్రమాదవశాత్తు బైక్.. ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో దంపతులతోపాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

తెలంగాణ వ్యాప్తంగా 50 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా 50 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

కడ్తాల్ టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి : కడ్తాల్ టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైకు పై వెళ్తున్న నలుగురు మృతి చెందారు. 

 

15:54 - December 12, 2016
15:53 - December 12, 2016

తమిళనాడు : వర్ధా తుపాను చెన్నైపై విరుచుకుపడింది. చెన్నై తీరాన్ని దాటుతున్న వర్ధా తుపాను చెన్నైలో బీభత్సం సృష్టిస్తోంది. పలుప్రాంతాల్లో కుండపోత వర్షాలు కరుస్తున్నాయి. గంటకు 140 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీయడంతో ఎక్కడిక్కడ చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రవాణావ్యవస్థ  స్తంభించింది. మరోవైపు సాయంత్రం వరకూ ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై వర్ధా ప్రభావం తీవ్రంగా చూపుతోంది. పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు కావలి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 30 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. వార్దా తుఫాన్‌తో ఏపీ సర్కారు అప్రమత్తం అయింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

చెన్నైలో సముద్రం అల్లకల్లోలం

తమిళనాడు : వర్దా తుపాను చెన్నై తీరాన్ని దాటింది. చెన్నైలో సముద్రం అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. గంటలకు 140 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

 

నగదు రహిత లావాదేవీలపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్ : రవాణ, ఆర్టీసీలలో నగదు రహిత లావాదేవీలపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలోని అన్ని డిపార్టుమెంట్లలో కార్డ్ సిస్టమ్ తెస్తామని చెప్పారు. దీనిపై రేపు మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది పూర్తయ్యే సరికి 100 శాతం నగదు రహిత సేవలు అందిస్తామని పేర్కొన్నారు. 54 ఆర్టీసీ కార్యాలయాలు, 15 చెక్ పోస్టులలో స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చెప్పారు. ఆర్టీసీ బస్సులో పోస్ మిషన్లతో టిక్కెట్లు ఇస్తామన్నారు.

 

మచిలీపట్నంలో 110 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

కృష్ణా : మచిలీపట్నంలో సముద్రం 110 మీటర్లు ముందుకొచ్చింది. అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

 

శ్రీహరికోట షార్ తీర ప్రాంతంలో చిక్కుకున్న మత్స్యకారులు

నెల్లూరు : శ్రీహరికోట షార్ తీర ప్రాంతంలో తమిళనాడుకు చెందిన 18 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు.ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు 8 మందిని రక్షించారు. మగిలిన 10 మందిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 

తుమ్మలపెంట వద్ద 5 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం

నెల్లూరు : కావలి రూరల్ మండలం తుమ్మలపెంట వద్ద 5 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. 20...30 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి.

 

15:08 - December 12, 2016
15:07 - December 12, 2016

చెన్నై తీరాన్ని దాటిన వర్దా తుపాను

తమిళనాడు : వర్దా తుపాను చెన్నై తీరాన్ని దాటింది. వర్దా తుపాను చెన్సలో బీభత్సం సృష్టించింది. పట్టణంపై విరుచుకుపడింది. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 140 కి.మీవేగతంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. 

14:59 - December 12, 2016

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత బాలకాశి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నది రాజ్యాంగం ఆదర్శం. మన దేశ రాజ్యాంగ స్ఫూర్తికి మన ప్రభుత్వాలే తూట్లు పొడుస్తున్నాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, క్యాజువల్, డైలీ వేజ్, వర్క్ చార్జ్ ఇలా రకరకాల పేర్లు పెట్టి, అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ వ్యవహారం సాక్షాత్తు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేసింది. అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ కార్మిక సంఘాలు పోరుబాటపడుతున్నాయి. డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు'. ఈ అంశాలపై బాలకాశి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:46 - December 12, 2016

తమిళనాడు : వర్దా తుపాను చెన్నై తీరాన్ని దాటింది. వర్దా తుపాను చెన్నైలో బీభత్సం సృష్టించింది. పట్టణంపై విరుచుకుపడింది. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 140 కి.మీవేగతంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రవాణా వ్యవస్థ స్తంభించింది. సహాయక చర్యల నిమిత్తం మూడు ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. విజయవాడ నుంచి రేణిగుంట మీదుగా రైళ్లను మల్లించారు. నెల్లూరు నుంచి చెన్నై వెళ్లాల్సిన మెమో రైలును నిలిపివేశారు. సమాచార, సాంకేతిక వ్యవస్థ కూడా దెబ్బతింది. 150 గ్రామాలపై తపాను ప్రభావం చూపుతోంది. నెల్లూరు , ప్రకాశం జిల్లాలపై వర్దా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. నెల్లూరు జిల్లాపై జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

14:38 - December 12, 2016

మొదట బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. ఇప్పుడు క్యాష్ లెస్ సొసైటీ అంటున్నారు.  దీనిపై ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడాలని ప్రతిపక్షాలు కోరుతుంటే.. 'నన్ను మాట్లాడనీయడం లేదు' అంటూ ప్రధాని చెప్పడం హాస్యాస్పదం అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఒక దేశ ప్రధాని పార్లమెంట్ లో మాట్లాడుతా అంటే ఎవరైనా అడ్డుకుంటారా? అది సాధ్యమా? ఇంతకు మోడీ పార్లమెంట్ లో ఆ ప్రయత్నమే చేయకుండా మాట్లాడనీయట్లేదనడం ఆయన అసమర్థతకు నిదర్శనమని వక్తలు విశ్లేషించారు. ఆ రోజు మాట్లాడుతూ.. 50 రోజుల్లో సమస్య సర్థుకుంటుందని చెప్పిన మోడీ నేడు కూడా 50 రోజుల్లో సద్దుమనుగుతుందని చెప్పడాన్ని బట్టి వారి మాటల్లోని డొల్లతనం బయటపడిందన్నారు.  పెద్ద నోట్ల రద్దు-ప్రజల ఇబ్బంధులు..  ప్రభుత్వ పని తీరు మొదలైన అంశాలపై  10టీవీ న్యూస్ మార్నింగ్ లో ఆలోచింపజేసే డిస్కషన్ జరిగింది. ఈ చర్చలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, కాంగ్రెస్ ప్రతినిధి తులసిరెడ్డి, టీడీపీ ప్రతినిధి సాంబశివరావు, బీజేపీ ప్రతినిధి అడ్డెపల్లి శ్రీధర్ పాల్గొన్నారు. డిస్కషన్ చాలా ఆసక్తిగా, అర్థవంతంగా.. ఆలోచింపజేసేదిగా జరిగింది. పూర్తి డిస్కషన్ మీరు వీడియోలో చూడొచ్చు.

@page { margin: 2cm } p { margin-bottom: 0.25cm; line-height: 120% }

14:35 - December 12, 2016
14:20 - December 12, 2016

మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించాలని హీరోయిన్లు కోరుకుంటుంటారు. కొంతమందికి హీరోయిన్ గా అవకాశాలు దక్కాయి. దీనితో వారి సంతోషాలకు అవధులు ఉండవు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రంలో 'చిరు' పక్కన నటించే అవకాశం 'కాజల్' దక్కింది. ఈ సందర్భంగా 'చిరు'పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. సెట్ లో పూర్తిగా సరదాగా ఉంటారని, సెట్లో ఉన్న వారందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపారు. షూటింగ్ సమయంలో ఆయనతో సరదాగా జోకులు కూడా వేశానని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 'చిరంజీవి' గొప్ప డ్యాన్సర్ అంటూ కితాబిచ్చింది. తన డ్యాన్స్ లో కూడా చాలా మార్పు వచ్చిందని, సినిమా రిలీజ్ అనంతరం ఆ మార్పును చూడవచ్చని వ్యాఖ్యానించింది. ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపింది.
సురేఖ సమర్పణలో వివి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి చిత్రానికి రీమేక్. 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. 

14:11 - December 12, 2016

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద' పేరు పెట్టారు. వర్ద అంటే ఏమిటీ ? వర్ద అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్ధం. ఈ పేరును పాకిస్తాన్ సూచించింది.
గాలి వేగం గంటకు 39 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే పేర్లు పెట్టేవారు. కరేబియన్ దీవుల్లోని ప్రజలు రోమన్ కేథలిక్ క్యాలెండర్ ప్రకారం ఏ రోజు హరికేన్ లేదా తుపాను ప్రారంభమవుతుందో ఆ రోజు పేరును ఆ తుపానుకు పెట్టేవారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుపాన్లకు పేరు పెట్టడం 2000లో ప్రారంభమై 2004లో ఆచరణలోకి వచ్చింది. 
బంగాళాఖాతం, అరేబియా సముద్రం పరిధిలోని దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్ లు తుపాన్లకు పేరు నిర్ణయిస్తాయి. ఈ ఎనిమిది దేశాలు కలసి 64 పేర్లతో ఒక జాబితాను రూపొందించింది. ఈ జాబితా ప్రకారం న్యూఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం తుపానుకు పేరు నిర్ణయిస్తుంది.
హిందూ మహా సముద్రంలో వచ్చే తుపానులకు భారత దేశం అగ్ని, ఆకాశ్‌, బిజిలి, లాల్‌, లహర్‌, మేఘ్‌, సాగర్‌, వాయు అనే పేర్లు ఇచ్చింది. లైలా పేరును పాకిస్థాన్‌ పెట్టింది. థానే పేరును మయన్మార్‌ పెట్టింది. ఆయా దేశాల సామాన్యులు సులువుగా గుర్తు పెట్టుకునేందుకు, తుపానుల ప్రభావాన్ని చారిత్రకంగా నమోదు చేయడానికి తుపానులకు పేర్లు పెడతారు.1953లో అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫానులు వచ్చినపుడు హరికేన్స్, ట్రోపికల్ పేరుతో పిలిచారు. మనదగ్గర నీలం, హెలిన్, లెహెర్, ఫైలిన్, హూద్ హుద్, రౌనా వంటి తుపాన్ లు అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.
 

తుఫానులకు పేర్లు పెట్టటం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయటం తేలిక అవుతుందని నిపుణుల అంచనా. అందుకే పేర్లు పెడతారు. ఇప్పుడు వర్ద తుపాన్ ఎం చేస్తుందో చూడాలి. 

13:56 - December 12, 2016

షార్ తీర ప్రాంతంలో చిక్కుకున్న మత్స్యకారులు..

నెల్లూరు : శ్రీహరికోట షార్ తీర ప్రాంతంలో 18 మంది తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చిక్కుకున్నారు. 8మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. 10మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ప్రజలకు బయటకు రావద్దు - వాతావరణ శాఖ..

చెన్నై : వార్దా తుపాన్ నేపత్యంలో సాయంత్రం వరకూ చెన్నైలో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. చైన్నై తో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఆంధ్రాలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. 

13:52 - December 12, 2016

చెన్నై : వార్దా తుఫాన్ చెన్నై తీరాన్ని తాకింది. వార్దా తుపాను ప్రభావంతో చెన్నై మీనంబాకంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఉత్తర తమిళనాడులో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాహనాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మధ్యాహ్నం 3 గం. వరకూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌ ను తాత్కాలికంగా మూసివేశారు. తుపాను సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సాయంత్రం వరకూ ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. చైన్నై తో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఆంధ్రాలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. 

13:48 - December 12, 2016

నిర్మల్ : సామాజిక న్యాయమే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర ఇవాళ ఆదిలాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించనుంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పాదయాత్ర...ప్రస్తుతం 57వ రోజు నిర్మల్‌లో కొనసాగుతోంది. అయితే ఇవాళ మొత్తం పాదయాత్రలో అత్యధిక దూరం పర్యటించనుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని డెంగ్యూపూర్‌, రానాపూర్‌, వాంకిడి, యాపలగూడ, నేరడిగొండ, బోథ్‌ ఎక్స్‌రోడ్డు, కూట్తి, షాద్‌నంబర్‌, ఇస్లాంనగర్‌, ఇచ్ఛోడ గ్రామాల్లో మొత్తం 40 కిలోమీటర్ల దూరం పర్యటించనుంది. ఇప్పటివరకు సీపీఎం మహాజన పాదయాత్ర 1450 కిలోమీటర్లు సాగింది. ఇప్పటివరకు సాగిన పాదయాత్ర విశేషాలను మైనార్టీ సభ్యులు అబ్బాస్‌ టెన్ టివికి వివరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

శ్రీ చైతన్య కాలేజీలో దారుణం.

హైదరాబాద్ : డీడీ కాలనీ శ్రీ చైతన్య కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి విజయ్ పై విద్యార్థులు దాడి చేశారు. కాలేజీ అధ్యాపకురాలు ఈ దాడి చేయించిందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విజయ్ తల పగలడంతో 84 కుట్లు వేశారు. తలకు బలమైన గాయం కావడంతో విజయ్ వింతగా ప్రవర్తిస్తున్నాడు. సతీష్, నాగరాజులపై కాలేజీ యాజమాన్యానికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గత అక్టోబర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

13:38 - December 12, 2016

హైదరాబాద్ : కార్పొరేట్ కళాశాలల అరాచకాలు ఆగడం లేదు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా చైతన్య కాలేజీకి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ విద్యార్థిపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తలకు 84 కుట్లు పడడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైతన్య కాలేజీ యాజమాన్యం తమకు నరకం చూపించిందని విద్యార్థి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమలాంటి పరిస్థితి వేరే తల్లిదండ్రులకు రావద్దని వేడుకున్నారు. ఇలాంటి చర్యలపై ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే…
ఉప్పల్ లో నివాసం ఉంటున్న విజయ్ డీడీ కాలనీలో ఉన్న చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అక్టోబర్ 14వ తేదీన విజయ్ ను కొందరు విద్యార్థులు తీవ్రంగా కొట్టారు. కాలేజీ తరగతి గదిలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు టెన్ టివితో వివరాలు చెప్పారు. విజయ్ ను ఎవరో విద్యార్థులు కొట్టడంతో తలకు తీవ్రగాయామైందని తల్లి పేర్కొన్నారు. ముక్కు..చెవిలో నుండి రక్తం వచ్చినా శ్రీవాణి మేడం అక్కడనే కూర్చొబెట్టిందని వాపోయారు. తమకు సమాచారం అందడంతో నగరంలో ఉంటున్న తన సోదరుడిని కాలేజీకి పంపించడం జరిగిందని తెలిపారు. తాము ఊరి నుండి ఇక్కడకు చేరుకుని విజయ్ ను పలు ఆసుపత్రులకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. కక్ష పెట్టుకున్న కళాశాల ఇన్ చార్జ్ లు పిల్లలతో కొట్టిచ్చినట్లు ఎనిమిది గంటల సేపు అలాగే కూర్చోబెట్టారని, ఎందుకంత నిర్లక్ష్యం అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వలేదని, చివరకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం స్పందించిందని, ఆపరేషన్ చేయడంతో తమ బాబు బతికాడని తెలిపారు. కానీ ఒక నిర్జీవ పరిస్థితిలో ఉన్నాడని, నత్తిగా మాట్లాడడం..పిచ్చిగా ప్రవర్తించడం చేస్తున్నాడని తండ్రి వాపోయారు. రూ. పది లక్షలు ఇచ్చారని కాలేజీ యాజమాన్యం పేర్కొంటోందని, పది రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. ఇలాంటి ఘటన ఏ తల్లిదండ్రులకు రావద్దని వేడుకున్నారు.

శ్రీ వాణి మేడం చేయించింది - విద్యార్థి..
శ్రీవాణి మేడంపై తాను పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి విజయ్ పేర్కొన్నారు. ఇది మనస్సులో పెట్టుకుని ఇతర విద్యార్థులతో తనను కొట్టించిందని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ఆవేదన తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:26 - December 12, 2016

నెల్లూరు : వార్ధా తుపాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై కనిపిస్తోంది. కాసేపటి క్రితం చెన్నై తీరాన్ని తాకడంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్టణం జిల్లాలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అంతగా ప్రభావం చూపించదని తెలుస్తోంది. కావలి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 20-30 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. 6 కిలోమీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తుపాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అంతా అప్రమత్తం - జేసీ..
జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని నెల్లూరు జాయింట్ కలెక్టర్ అహ్మద్ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. తమిళనాడుకు దగ్గరలో ఉన్న సూళ్లూరుపేటలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ తో తాను పరిస్థితి సమీక్షించడం జరుగుతోందని తెలిపారు. అంతగా భారీ వర్షాలు కురవడం లేదని, కానీ ముందు జాగ్రత్తలో భాగంగా లోతట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వారికి భోజన, ఇతర వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. వాకాడులో 9 సెంటిమీటర్ల వర్షం కురిసిందని, వాకాడు, సూళ్లూరుపేటలో 50-60 కి.మీ.వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. తడ, సూళ్లూరుపేట, దొరవానిసత్రంతో పాటు మూడు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. 

13:22 - December 12, 2016
13:21 - December 12, 2016
13:21 - December 12, 2016
13:15 - December 12, 2016

చెన్నై : వార్ధా తుపాన్ చెన్నైపై విరుచకపడింది. తీరానికి అతీసమీపంలో దూసుకొస్తోంది. దీనిప్రభావంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 140 నుండి 150 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీనితో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సముద్ర తీర ప్రాంతంలో అలలు భారీగా ఎగిసి పడుతున్నాయి. బలమైన గాలులు వీస్తుండడంతో చెట్లు కూలిపోయాయి. దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పీనంబాకంలో కుంభవృష్టి కురుస్తోంది. మధ్యాహ్నం 3గంటల వరకు చెన్నై ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల కోసం రెండు పడవలను సిద్ధంగా ఉంచారు. మరో రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని సమాచారం. తుఫాన్ తో చెన్నైలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీపై వార్ధా ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో వర్షం కురుస్తుండడంతో కొండచరియలు విరిగి పడుతున్నట్లు తెలుస్తోంది.

 

కావలి వద్ద సముద్రం అల్లకల్లోలం..

నెల్లూరు : కావలి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 20-30 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. 6 కిలోమీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తుపాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం - ఎన్ డీఎంఏ..

చెన్నై : వార్ధా తుపాను తాకుతున్న నేపథ్యంలో కల్పకం అణువిద్యుత్ కేంద్రానికి ముప్పు సంభవిస్తుందన్న వార్తల నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ వివరణనిచ్చింది. ఈ మేరకు ఎన్డీఎంఏ ఉదయం ట్వీట్స్ చేసింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, తుపాన్ ను విజయవంతంగా ఎదుర్కొంటామని పేర్కొంది. 

చెన్నైని తాకిన వార్ధా తుఫాన్..

చెన్నై : తీవ్ర తుఫాన్ వార్ధా తీరాన్ని తాకింది. తీవ్ర తుపాన్ చెన్నైపై విరుచుక పడుతోంది. గంటకు 140 నుండి 150 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 

12:40 - December 12, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు అనంతరం నోట్లమార్పిడి ముఠాలు చెలరేగుతున్నాయి. రోజుకోక మోసం బయటకొస్తోంది. నోట్లను మార్పిడి చేసేందుకు వెళుతున్న ముగ్గురు వ్యక్తులను సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ. 29 లక్షల 76వేల నగదు, నాలుగు సెల్ ఫోన్ లను ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ భరత్ నగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పింగి వాసుగౌడ్, దిల్ సుఖ్ నగర్ లో ఉంటున్న మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి నోట్లను మార్పిడి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనితో బైక్ లో తరలిస్తుండగా వీరిని పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

12:33 - December 12, 2016

విశాఖపట్టణం : జిల్లాలో నగదు కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. పెద్దనోట్లను రద్దు చేసి నెల్ల రోజులు దాటుతున్నా సమస్యలు మాత్రం తీరడం లేదు. సరిపడ నగదు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వరుసగా బ్యాంకులకు సెలవలు రావడంతో సమస్యలు మరింత రెట్టింపవుతున్నాయి. సోమవారం ఉదయం సీతంబజార్ లో ఉన్న ఆంధ్రాబ్యాంకులో మూడు ఏటీఎంలు ఉంటే ఒకటే పనిచేస్తోంది. దీనితో ప్రజలు నగదు తీసుకోవడానికి క్యూలు కడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి టెన్ టివి ప్రయత్నించింది. వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వీడియో క్లిక్ చేయండి.

 

12:20 - December 12, 2016

చెన్నై : తీరానికి 105 కి.మీటర్ల దూరంలో వార్ధా తుపాన్ కేంద్రీకృతమైంది. తుపాన్ ప్రభావంతో చెన్నై ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 25 విమానాలను దారి మళ్లించారు. పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. చెన్నైకి మూడు ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు వెళ్ల‌గా, తిరువళ్లూరుకు రెండు బృందాలు, కాంచీపురం జిల్లాకు రెండు బృందాలు వెల్లాయి.తుపాను ప్ర‌భావిత ప్రాంత‌మ‌యిన‌ పుదుచ్చేరికి మ‌రో బృందం వెళ్లిన‌ట్లు పేర్కొన్నారు. ఇక‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖప‌ట్నానికి ఇప్ప‌టికే ఎన్డీఆర్ఎఫ్‌ బృందం చేరుకుంది. గుంటూరుకు మరో బృందాన్ని పంపించారు. అంతేగాక తుపాను ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు సాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ అదనపు బృందాలు అరక్కోణంలో మ‌రికొన్ని సిద్ధంగా ఉన్నాయి.

12:16 - December 12, 2016

పశ్చిమగోదారి : తుపాన్ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసినా మత్స్యకారులు వేటకు వెళుతున్నారు. వార్ధా తుపాన్ చెన్నైకి దగ్గరగా దూసుకొస్తోంది. దీని ప్రభావం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలం ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నలుగురు మత్స్యకారులు కనిపించడం లేదని సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. హెచ్చరికలు జారీ చేసిన అనంతరం వెళ్లారా ? లేక ముందే వెళ్లారా ? అనేది తెలియాల్సి ఉంది. 

నలుగురు మత్స్యకారుల గల్లంతు..

పశ్చిమగోదావరి : జిల్లాలో నర్సాపురం (మం) చిన మైనివానిలంకలో సముద్రంలోకి వెళ్లిన 4గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మత్స్యకారుల ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. 

చెన్నై తీరానికి చేరువలో వార్ధా తుపాన్..

చెన్నై : తీరానికి 105 కి.మీటర్ల దూరంలో వార్ధా తుపాన్ కేంద్రీకృతమైంది. తుపాన్ ప్రభావంతో చెన్నై ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 25 విమానాలను దారి మళ్లించారు. 

11:53 - December 12, 2016

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో '2.0' చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వీరి కాంబినేషన్ లో 'రోబో' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి~ సీక్వెల్ గా '2.0' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో 'ఏమీ జాక్సన్' కథాననాయికగా కనిపిస్తుండగా బాలీవుడ్ నటుడు 'అక్షయ్ కుమార్' విలన్ గా నటిస్తున్నారు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మాధ్యమాల్లో చిక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదలైన ఈ చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ 'చిరంజీవి' నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపు కొన్ని సంవత్సరాల తరువాత 'చిరు' 'ఖైదీ నెంబర్ 150’ సినిమాలో నటిస్తున్నారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవలు నటించిన చిత్రాలున్నాయి. ‘రానువ వీరన్', ‘మా పిల్లై'లో చిరంజీవి ప్రత్యేక పాత్ర పోషించారు. గతంలో 'మహేష్ బాబు' నటిస్తారని టాక్ వినిపించింది. ‘చిరంజీవి' ప్రత్యేక పాత్ర పోషిస్తారని కోలీవుడ్ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయం గురించి త్వరలోనే విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

విమానంలో సాంకేతిక లోపం..

హైదరాబాద్ : శంషాబాద్ - కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన 20 నిమాషాలకే ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. 148 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు. 

అత్యవసరంగా ల్యాండ్ అయిన ఓమన్ ఎయిర్ వేస్..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓమన్ ఎయిర్ వేస్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మస్కట్ నుండి చెన్నైకు విమానం వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. 

11:35 - December 12, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుపై పోరాడేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా ఏపీ పీసీసీ ప్రజాభిప్రేక సేకరణ జరుపుతోంది. ప్రజలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. సోమవారం నాడు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొంది. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరాతో పాటు పలువురు ఏపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు రఘువీరా దృష్టికి తీసుకొచ్చారు. ఎలక్షన్ ల కోసం ఈ రకంగా జిమ్మిక్కులు చేస్తున్నారని, చాలా దుర్మార్గమైన విషయమని ఒకరు పేర్కొన్నారు. ఒక వేయి నోటు రద్దు చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏటీఎంల వద్ద పోలీసులు ఎందుకు కొడుతున్నారని, ఎదురుతిరగాల్సినవసరం ఉందన్నారు. తాను ఉదయం జాబ్ చేస్తూ సాయంతం ఏటీఎం వద్ద క్యూలో నిలుస్తూ రెండో జాబ్ చేస్తున్నానని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. 

11:28 - December 12, 2016

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ అనంతరం 'ప్రిన్స్' ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వంద కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి సోషల్ మాధ్యమాల్లో పలు వార్తలు వెలువడుతున్నాయి. 'మహేష్' ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్. తన ప్రతి చిత్రంలో ఓ సామాజిక సమస్యను మురుగదాస్ చూపిస్తాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఓ సామాజిక సమస్యను చూపించనున్నారని, న్యాయవ్యవస్థలోని ఓ కీలకాంశాన్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి పలు టైటిల్స్ పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. తాజాగా 'సంభవామి' అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో చిత్ర యూనిట్ రిజిస్టర్ చేయించింది. దీనితో 'మహేష్' సినిమా పేరు 'సంభవామి' టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా విజయవంతమౌతుందా ? లేదా ? అనేది చూడాలి. 

చంద్రబాబు సమీక్ష..

విజయవాడ : వార్ధా తుఫాన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇస్రో వాతావరణ, విపత్తు నిర్వాహణ, జలవనరులు, విద్యుత్, రెవెన్యూ పోలీసు శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు..

ఢిల్లీ : ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. మంచు కారణంగా ఢిల్లీ రైల్వే శాఖ 82 రద్దు చేసింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. 

10:56 - December 12, 2016
10:52 - December 12, 2016
10:32 - December 12, 2016

ముంబై : టెస్టు సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ జట్టుపై ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 3-0 తేడాతో భారత్ సిరీస్ ను వశం చేసుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసింది. అనంతరం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 631 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జయంత్ యాదవ్ 104 పరుగులు చేయగా కోహ్లీ 235 పరుగులు సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లండ్ ను భారత్ కట్టడి చేసింది. జడేజా రెండు వికెట్లు తీయగా యశ్వంత్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ తీశారు. 

భారత్ విజయం..

ముంబై : ఇంగ్లండ్ పై భారత్ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 3-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. 

10:17 - December 12, 2016

నెల్లూరు : వార్ధ తుపాన్ దూసుకొస్తోంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. సూళ్లూరిపేట, నాయుడిపేట, వాసరి తదితర మండలాల్లో సోమవారం ఉదయం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ఇంకా తీరం దాటకముందే చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. వార్దా తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ గాలి వేగంతో పాటు, వర్ష తీవ్రత కూడా పెరుగుతోంది. కలెక్టరేట్ నుంచి మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సూళ్లూరుపేట, నెల్లూరులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రెవెన్యూ, పోలీసు, విద్యుత్, ఇతర శాఖలు అప్రమత్తమయ్యాయి. ఓ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ..ఆస్తి నష్టం కలుగకుండా చూడాలని సూచించారు. అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని, కూలిన కరెంటు స్తంభాలను వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

10:13 - December 12, 2016

కృష్ణా : మిలా ఉన్ నబీ పర్వదినాన ముగ్గురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జెండాలు కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఎమ్మార్ అప్పారావు కాలనీలో చోటు చేసుకుంది. మిలాదున్ నబీ పర్వదిన సందర్భంగా ముగ్గురు యువకులు సోమవారం ఉదయం జెండాలు కడుతున్నారు. జెండాలు కడుతుండగా ఇనుప రాడ్ విద్యుత్ తీగలకు తగిలింది. దీనితో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే నూజివీడు ఆసుపత్రికి తరలించారు. అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో వేరే ఆసుపత్రికి పంపించారు. కానీ మార్గమధ్యంలోనే వీరు కన్నుమూశారు. స్థానిక ఎమ్మెల్యే మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందే విధంగా చూస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. 

సిక్కోలు లో భూ ప్రకంపనాలు..

శ్రీకాకుళం : జిల్లాలో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. ఎచ్చెర్ల, పొందూరు, లావేరు మండలాల్లోని పలు చోట్ల 5 సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

పాదయాత్ర 58వ రోజు..

నిర్మల్ : మహాజన పాదయాత్ర 58వ రోజుకు చేరుకుంది. నేడు నేరడిగొండ, బోథ్ ఎక్స్ రోడ్డు, కూట్తి, షాత్ నంబర్, ఇస్లాంనగర్, యచోడలో పాదయాత్ర కొనసాగనుంది. ఆదిలాబాద్ జిల్లాకు పాదయాత్ర బృందం అడుగు పెట్టనుంది. 

09:42 - December 12, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు అయి 34 రోజులు దాటుతోంది. కానీ ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. చేతిలో డబ్బులు లేక నరకయాతన పడుతున్నారు. రెండు వేల రూపాయలకు చిల్లర దొరక్క అవస్థలు పడుతున్నారు. పూట గడవడమే కష్టంగా మారుతోందని పలువురు పేర్కొంటున్నారు. వ్యాపారాలు లేకపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కొనుగోలుదారుల లేక పలు వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

విజయవాడలో..
విజయవాడలో పరిస్థితి దయనీయంగా ఉంది. బందర్ రోడ్డులో ఉన్న ఏటీఎంలు మూతపడుతున్నాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల నుండి ఏటీఎంలు మూతపడి ఉన్నాయని, పిల్లలు దాచుకొనే డబ్బులను వాడుకోవాల్సిన దుస్థితి నెలకొని ఉందన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:38 - December 12, 2016

హైదరాబాద్ : నెల రోజులు దాటినా.. ప్రజలకు నగదు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే చేతిలో డబ్బుల్లేక తీవ్ర అవస్థలు పడుతున్న సామాన్యులకు మరిన్ని రోజులు మనీ కష్టాలు తప్పేట్టు లేదు. వరుసగా 3 రోజులకు బ్యాంకులకు సెలవు కావడం, ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులతో .. అన్ని వర్గాల ప్రజలు డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. శనివారం నుండి సోమవారం వరకూ వరుసగా మూడు రోజులు పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో జనాలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:31 - December 12, 2016

నిర్మల్ : సీపీఎం మహాజన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తమ్మినేని బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. నిర్మల్‌ జిల్లాలో ప్రవేశించిన పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో తమ దృష్టికి వచ్చిన ఎస్సారెస్పీ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని బహిరంగ లేఖ రాశారు. నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

56వ రోజు..
సామాజిక తెలంగాణే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 56వ రోజు పూర్తి చేసుకుంది. ఇప్పటికే 10 జిల్లాల్లో పూర్తయిన పాదయాత్ర.. ఈరోజు నిర్మల్‌లోకి ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి నిర్మల్‌ జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు పోచంపాడు, సోన్‌, గంజ్యాల్‌, కడ్తల్‌, చాకేరా, సోఫినగర్‌, నిర్మల్‌, చించోలి, డ్యాంగాపూర్‌లో 29 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర.. ఇప్పటికి సుమారు 1450 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

ఘన స్వాగతం..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వచ్చే ఏడాది మార్చి 19న హైదరాబాద్‌లో పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. గ్రామ గ్రామాన తమ్మినేని బృందానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. తమ సమస్యలను తమ్మినేని బృందానికి చెప్పుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని బృంద సభ్యుడు రమణ అన్నారు. పాదయాత్రకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీరాములు, సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమ సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ను కేసీఆర్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదని హేమ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అంగన్‌వాడీ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారని.. కేసీఆర్‌ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

హామీల అమలేవి ? 
కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని తమ్మినేని అన్నారు. సామాన్య ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఎస్సారెస్పీ నిర్వాసిత గ్రామాల్లోని సమస్యలపై తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. పాదయాత్రకు ఎమ్మార్పీఎస్‌, సామాజిక సంఘ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. 

09:16 - December 12, 2016

నెల్లూరు : జిల్లాపై వార్ధ తుపాన్ ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, తడ, సూళ్లూరు పేట, దొరవారిసత్రం, చిట్టమూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 155 తుపాన్ షెల్టర్లు, 450 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు జిల్లాకు చేరుకున్నాయి. వార్ధా ప్రభావిత గ్రామాల్లో విలేజ్ ఇన్ ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తీరం..వైపు..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను తీరంవైపు దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రం చెన్నై -పులికాట్‌ సరస్సు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. త్రీవరూపాన్ని సంతరించుకున్న వార్దా తుపాను.. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు- ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సహాయ పునరావాస చర్యలకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం.

భారీ వర్షాలు..
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారు జాము నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రతి గ్రామంలో విలేజ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసుల, అగ్నిమాపక...విద్యుత్‌ శాఖ అధికారులతో కలెక్టర్‌ ముత్యాలరాజు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. 

తీవ్ర తుపాన్ గా వార్ధ..

నెల్లూరు : వార్ధా తీవ్ర తుపాన్ గా కొనసాగుతోంది. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయం గా 290 కి.మీ. చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 220 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నై - శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 90-100 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయి. కృష్ణపట్నంలో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, కాకినాడ, విశాఖ పోర్టుల వద్ద 4వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

దివీస్ లో నేడు నిజనిర్ధారణ కమటీ పర్యటన..

తూర్పుగోదావరి : దివీస్ నిర్మాణ ప్రాంతంలో నేడు నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది. రైతులు, మత్స్యకారులతో కమిటీ సభ్యులు సమావేశం జరపనున్నారు.

 

దివీస్ లో నేడు నిజనిర్ధారణ కమటీ పర్యటన..

తూర్పుగోదావరి : దివీస్ నిర్మాణ ప్రాంతంలో నేడు నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది. రైతులు, మత్స్యకారులతో కమిటీ సభ్యులు సమావేశం జరపనున్నారు. 

08:03 - December 12, 2016

హైదరాబాద్ : ఏ దేశంలోనైనా రోడ్డుపై నడిచే వాహనాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. నెంబర్ ప్లేట్ సైతం కేటాయించడం కామన్.. ఓ దేశంలో ఏకంగా జంతువులకు సైతం రిజిస్ట్రేషన్లు నెంబర్ ప్లేట్లను కేటాయిస్తోంది. ఇదేంటనీ ఆశ్చర్య పోతున్నారా అయితే ఈ న్యూస్ చదవండి.

ఇరాన్ లో.. 
ఎలాంటి వాహనాలకైనా రిజిస్ట్రేషన్‌.. నెంబర్‌ప్లేట్‌ తప్పనిసరి. వాహనం.. వాహన యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు రిజస్ట్రేషన్‌లో పొందుపరుస్తారు. ఎప్పుడైనా ఆ వాహనం చోరీకి గురైనా.. ప్రమాదం జరిగినా.. నంబర్‌ ప్లేట్‌ ద్వారా వాహన యజమానిని గుర్తిస్తారు. అయితే.. ఇరాన్‌లో వాహనాలకే కాదు ఒంటెలకు కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌.. రిజిస్టర్డ్‌ లైసెన్స్‌ ప్లేట్‌ కేటాయిస్తోంది.

ఎందుకంటే.. 
ఇరాన్‌ వంటి దేశాల్లో ఒంటెలు అధికంగా ఉంటాయి. రోడ్లపై వాహనాలతో సమానంగా తిరుగుతుంటాయి. వీటి వల్ల బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌.. ఆఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ఒంటెలు దారి తప్పి.. మరికొన్ని పారిపోయి రోడ్లపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నాయట. దీంతో అక్కడి అధికారులు ఒంటెలను.. వారి యజమానుల్ని గుర్తించేలా వాటికి రిజిస్ట్రేషన్‌ చేసి లైసెన్స్‌ ప్లేట్లు కేటాయించాలని నిర్ణయించారు. మొదటి విడతలో ఇప్పటికే లక్ష ఒంటెలకు నంబర్‌ ప్లేట్లు కేటాయించారు. మరో 35వేల ఒంటెలకు లైసెన్స్‌లు కేటాయించే పనిలో ఉన్నారు. దీని ద్వారా ప్రమాదానికి గురైన ఒంటెలను పట్టుకుని వాటి యజమానులకు సమాచారం ఇవ్వొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు

హైదరాబాద్ : మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు దేశ ప్రజలకు 'మిలాద్-నబీ-నబీ' శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలు సోదరభావంతో మెలగాలని హన్సారీ ప్రజలని కోరారు. 

07:46 - December 12, 2016

హైదరాబాద్ : రైలు ప్రయాణం ఇకపై మరింత భారం కానుందా ? ట్రైన్‌ ఛార్జీలను పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందా ? ప్రస్తుత పరిస్థితులు చూస్తే,.అవుననే అంటున్నాయి రైల్వేవర్గాలు. మోదీ సర్కార్ రైలు ఛార్జీలను పెంచేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. రైలు ప్రయాణికులపై భద్రత పన్ను వడ్డించేందుకు సిద్ధమవుతోంది. దీంతో సామాన్య ప్రజలకు ఇకపై రైలు ప్రయాణం మరింత భారం కానుంది. 

భద్రత పన్ను వడ్డించేందుకు.. 

 ప్రయాణికులపై భద్రత పన్ను వడ్డించేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైల్వే భద్రతపరమైన అంశాలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు.. ప్రయాణికులపై ప్రత్యేకంగా పన్ను వడ్డించేందుకు రైల్వే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రైళ్లు పట్టాలు తప్పడం..ఇతర ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో పట్టాలు, సిగ్నలింగ్‌ వ్యవస్థలను మెరుగుపరచడం, క్రాసింగ్‌ల వద్ద భద్రతను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకంగా రాష్ట్రీయ రైల్‌ సంరక్ష నిధిని ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ భావించింది. ఇందుకోసం 1.19 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని ఆర్థికశాఖకు రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు ఇటీవల లేఖ రాశారు. అయితే ఆర్థికశాఖ అందులో 25శాతం మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించింది. మిగతా మొత్తం సొంతంగా సమకూర్చుకోవాలని రైల్వేను కోరింది. ఈ నేపథ్యంలో టిక్కెట్లపై ప్రత్యేకంగా భద్రత పన్ను వేసి ఈ నిధులు రాబట్టుకోవాలని రైల్వే భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏసీ-2, ఏసీ-1 టిక్కెట్లు ధరలు ఇప్పటికే అధికంగా ఉండటంతో వీటిపై మోస్తరుగా.. స్లీపర్‌, రెండోతరగతి, ఏసీ-3 టిక్కెట్లపై అధికంగా పన్ను వడ్డించనున్నట్లు పేర్కొన్నాయి. 

పెనుభారం..
మోడీ ప్రధాని అయ్యాక ఇప్పటికే పెద్దమొత్తంలో ట్రైన్  ఛార్జీలు పెంచారు. మరొకసారి కోట్లాది మంది ప్రయాణికులపై పెనుభారం మోపేందుకు మోదీ సర్కార్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో విలవిలలాడుతున్న సామాన్యుడిపై రైలు ఛార్జీల పేరుతో మరో వాత పెట్టేందుకు సమాయత్తమవుతోంది.   

07:36 - December 12, 2016

నారాయణ్ ఖేడ్ :  క్కడ ఏ ఎన్నికలు లేవు.. నాయకుల ప్రచారాలు అంతకంటే లేవు.. అయినా అక్కడ పెద్దపెద్ద ఫ్లెక్సీలు, కటౌట్‌లు దర్శనమిస్తున్నాయి. రోడ్డు, చౌరస్తాలు అనే తేడాలేకుండా గులాబీ బ్యానర్లు వెలిశాయి. ఇంతకీ   ఎక్కడా ఆ ఫ్లెక్సీల హడావుడి... ఎందుకా బ్యానర్ల బారు...  తెలుసుకోవాలంటే  ఈ స్టోరీ చూడాల్సిందే.. మెయిన్‌రోడ్డు, గల్లీలు అనే తేడాలేదు. రోడ్డు కనిపిస్తే చాలు.. ఇరువైపుల ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. ఏ రోడ్డు అన్నది కాదన్నయ్యా... ఫ్లెక్సీలు నింపామా లేదా  అన్నట్టుంది వీరి ధోరణి.

హన్మంతు భక్తి.. 
అసలు మ్యాటరేంటంటే... సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి నూతనంగా బిడెఖనె హన్మంతును చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. నియామక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎగిరి గంతేసిన హన్మంతు తనకు చైర్మన్‌ పదవి రావడానికి సహకరించిన నేతలను ప్రసన్నం చేసుకోవాలని భావించాడు. ఇందుకు ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలతో తన అభిమానాన్ని చాటుకున్నాడు. నారాయణఖేడ్‌లో పెద్దపెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు.  అంతేకాదు... దారులను, హోర్డింగ్‌లను  ఫ్లెక్సీలతో నింపేశారు.  రాజీవ్‌ చౌరస్తాలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అంతటితో ఆగకుండా ... ఆర్‌ అండ్‌ బీ రోడ్డును ధ్వంసం చేసి మరీ కటౌట్లు కట్టారు.

ముక్కున వేలేసుకుంటున్న జనం
నారాయణఖేడ్‌లో ఇంతకుముందెన్నడూ ఈ తరహాలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఎవరూ ఏర్పాటు చేయలేదు.  కానీ హన్మంతు మాత్రం నారాయణఖేడ్‌ను మొత్తం ఫ్లెక్సీలతో ముంచెత్తారు. వాటిని చూసిన జనం..ఇదేమి విచిత్రమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఓవైపు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌... హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను నిషేధించారు. తన బ్యానర్లు కూడా ఏర్పాటు చేయవద్దని అధికారులను ఆదేశించారు. అదే పార్టీకి చెందిన హన్మంతు మాత్రం దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన ఇష్టారీతిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.

07:14 - December 12, 2016

హైదరాబాద్ : మాటల యుద్ధానికి కౌంట్‌ డౌన్‌ మొదలవుతుంది. అస్త్రశస్త్రాలకు, వ్యూహ రచనకు సమయం ఆసన్నమవుతోంది.  తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంటుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబి పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తోంది.

హాట్.. హాట్... 
డిసెంబర్‌ 16 నుంచి జరగబోయే తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే అవకాశం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పొలిటికల్ విమర్శలను తీవ్రం చేస్తూ..సమావేశాలకు ముందే కాకపుట్టిస్తున్నాయి. సభలో పై చేయి సాధించేందుకు అధికార పార్టీ అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. విపక్ష పార్టీలకు చెక్ పెట్టే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రాజక్టుల రీడిజైనింగ్, కరెన్సీనోట్ల రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం నోరువిప్పడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండున్నరేళ్ల పాలనలో కెసిఆర్ ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేరాయని ప్రశ్నిస్తున్నాయి. ఆయా అంశాలపై అసెంబ్లీ సాక్షిగా అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. సోమవారం ఉదయం టీ టీడీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో టీ - టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి.. రైతు సమస్యలపై ప్రధాని, వ్యవసాయ మంత్రిని కలువనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సారి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది. 

కౌంటర్ కు రె'ఢీ'...
మరోవైపు విపక్షాలకు ధీటైన సమాధానం చెప్పేందుకు అధికార టీఆర్ఎస్ కూడా రంగం సిద్ధం చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు బ్రేకులు వేసేందుకు గులాబీ దళపతి పావులు కదుపుతున్నారు. శీతాకాల సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనపై ప్రగతి నివేదికలను కూడా అసెంబ్లీ వేదికగానే వెల్లడించాలని అధికార పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే  శాఖల వారీగా నివేదికలను సైతం సిద్ధం చేసుకుంటుంది. సమస్యల ప్రాతిపదికన అసెంబ్లీలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.  ప్రతిపక్షపార్టీలు అసెంబ్లీ సమావేశాలను పొడగించాలని డిమాండ్ చేస్తే...అందుకు తాము సుముఖంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి సంకేతాలు ఇస్తున్నారు. వాడీ వేడీగా జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పై చేయి పాలకపక్షానిదా లేక విపక్షాలదా అన్నది ప్రస్తుతానికి ఉత్కంఠ రేపుతోంది. 

07:01 - December 12, 2016

వైజాగ్ : అందాల విశాఖ నగరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు వేదిక కాబోతోంది. ఈనెల 17న వరుస ప్రారంభోత్సవాలతో నగరం సందడిగా మారనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొనబోతున్నారు. 
ఐటీ పార్క్, చిల్డ్రన్స్ థియేటర్ 
ఈనెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రుషికొండలో ఏర్పాటు చేసిన ఐటీపార్క్‌ ప్రారంభం కాబోతోంది. దాంతోపాటు ఉడాపార్క్‌లో తీర్చిదిద్దిన చిల్ట్రన్స్‌థీయేటర్‌ను కూడా సీఎం ప్రారంభిస్తారని.. దీనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా హాజరవుతున్నారు. అదేరోజు నగరంలో జరగనున్న 68వ ఫార్మాస్యూటికల్స్‌ సమావేశంలో కూడా వారు పాల్గొంటారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తర్వాత పోర్టుస్టేడియంలో జరగనున్న దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ స్నాతకోత్సంలోనూ చంద్రబాబు, వెంకయ్య పాల్గొననున్నారు. 

అంతర్జాతీయ కళాకారులతో..
ఈ ప్రారంభవోత్సవాల సందర్భంగా విశాఖను సంగీతఝరిలో ముంచెత్తడానికి పలువురు ఇంటర్నేషనల్‌ ఇన్‌స్ట్ర్‌మెంట్‌ కళాకారులతో మ్యూజికల్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రోనోమజుందార్‌, రాకేష్‌ చౌరాసియా, డ్రమ్స్‌ శివమణితోపాటు అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారిగా విండ్‌మ్యూజిక్‌ కళాకారులచే ప్రదర్శన జరగడం విశాఖ ప్రజలకు గర్వకారణమని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. మొత్తం 5 ముఖ్యమైన ప్రారంభోత్సవాలు ఉండటంతో ..ప్రభుత్వం పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈనెల 17న విశాఖ నగరం ప్రారంభోత్సవాలతో సందడిగా మారనుంది. 

దూసుకొస్తోంది.. జాగ్రత్త..

వైజాగ్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను తీరంవైపు దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రం చెన్నై -పులికాట్‌ సరస్సు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. త్రీవరూపాన్ని సంతరించుకున్న వార్దా తుపాను.. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు- ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతాల్లో వర్షాలు ప్రారంభం అయ్యాయి. సహాయ పునరావాస చర్యలకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం.

Don't Miss