Activities calendar

09 December 2016

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

భువనగిరి : ఘట్ కేసర్ మండలం ఎన్ ఎస్ పీ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

నానక్ రాంగూడంలో మరో మృతదేహం వెలికితీత

హైదరాబాద్ : నానక్ రాంగూడలో భవనం కూలిన ఘటనలో మరో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుల సంఖ్య ఐదుకు చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

21:53 - December 9, 2016
21:51 - December 9, 2016

మహారాష్ట్ర : ముంబై టెస్ట్‌ రెండో రోజు ఆటలోనూ ఇంగ్లండ్‌, ఇండియా జట్లు సమానంగా ఆధిపత్యం ప్రదర్శించాయి. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసి భారత్‌కు సవాల్‌ విసరగా....టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్‌ టీమ్‌కు ధీటుగా బదులిస్తోంది. అశ్విన్‌, జడేజా స్పిన్‌ మ్యాజిక్‌తో ఇంగ్లండ్‌ జట్టును 400 పరుగులకే కట్టడి చేసిన భారత్‌...తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం చేసింది. రాహుల్‌ తక్కువ పరుగులకే ఔటైనా....మురళీ విజయ్‌, పుజారా క్రీజ్‌లో పాతుకుపోయారు. అసలు సిసలు టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడిన ఇద్దరూ....రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించి భారత్‌ను పోటీలో నిలిపారు. 126 బంతుల్లో టెస్టుల్లో 15వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన విజయ్‌ 76 పరుగులతో, పుజారా 47 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో  రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్‌ కోల్పోయిన భారత్‌ 146 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 254 పరుగులు వెనుకబడి ఉన్నా భారత జట్టు...టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఇదే స్థాయిలో రాణిస్తే మ్యాచ్‌పై పట్టు బిగించగలుగుతుంది.  

 

21:47 - December 9, 2016

చెన్నై : టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి అక్రమ సంపాదన తవ్వేకొద్ది బయటపడుతోంది. చెన్నైలోని నలుగురు తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఐటీశాఖ అధికారుల సోదాలు చేస్తున్నారు. 6 ఇళ్లు, 2 ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 106 కోట్ల 52 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించింది. ఇందులో 9కోట్ల 63 లక్షలు కొత్త రెండు వేల నోట్లు కాగా.. 96 కోట్ల 89 లక్షలు పాత పెద్ద నోట్లు ఉన్నాయని తెలిపింది. 36 కోట్ల 29 లక్షలు విలువ చేసే 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. 12 వందల కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నామని ఆర్థిక శాఖ ప్రకటించింది. 

 

21:45 - December 9, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల ర‌ద్దుపై సుప్రీంకోర్టు కేంద్రంపై ప్రశ్నలు సంధించింది. నోట్ల ర‌ద్దు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు. బ్యాంకుల నుంచి వారానికి 24వేల రూపాయ‌లు మాత్రమే విత్ డ్రా చేయాల‌న్న ప‌రిమితి ఎందుకు విధించార‌ని సుప్రీంకోర్టు చుర‌క‌లు అంటించింది. దీనిపై కేంద్రం వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు విచార‌ణ‌ను 14వ తేదీకి వాయిదా వేసింది. 
సుప్రీంకోర్టులో విచారణ
పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియ‌ర్ న్యాయ‌వాది ప్రశాంత్ భూష‌ణ్‌, కేంద్రం త‌రుపున అటార్ని జ‌న‌ర‌ల్ ముఖుల్ రోహిత్గీ వాద‌న‌లు వినిపించారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లాయ‌ర్ ప్రశాంత్ భూష‌ణ్ వాద‌న‌లు వినిపించారు. పెద్ద నోట్ల ర‌ద్దుతో బ్యాంకుల్లో డ‌బ్బులేక ప్రజ‌లు క‌నీస అవ‌స‌రాల‌ను కూడా తీర్చుకునే ప‌రిస్థితిలో లేర‌ని వివ‌రించారు. ఏటీఎంల‌లో సాఫ్ట్‌వేర్ స‌మ‌ర్థవంతంగా చేయ‌లేద‌న్న ఆయ‌న‌.. కొత్త నోట్ల పంపిణీ విష‌యంలో స‌హ‌కార బ్యాంకుల ప‌ట్ల ప‌క్షపాతం చూపార‌ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
నోట్ల ర‌ద్దు నిర్ణయాన్ని స‌మ‌ర్థించుకున్న కేంద్రం 
అయితే పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స‌మ‌ర్థించుకుంది. మ‌రో ప‌ది నుంచి ప‌దిహేను రోజుల్లో అంతా స‌ర్దుమ‌ణుగుతుంద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. నోట్ల ర‌ద్దుపై ఎక్కడా ఒక్క కేసు కూడా న‌మోదు కాలేద‌ని చెప్పుకొచ్చింది. కావాల‌నే కొన్ని రాజ‌కీయ పార్టీలు వాస్తవాల‌కు మించి త‌మ గొంతును వినిపిస్తూ అల‌జ‌డి సృష్టించే ప్రయ‌త్నం చేస్తున్నాయ‌ని రోహిత్గీ వాదించారు. దీనిపై ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. వారానికి 24వేల రూపాయ‌లు మాత్రమే డ్రా చేసుకోవాల‌నే నిబంధ‌న‌పై ప్రశ్నించింది. నగదు రద్దుకు, పరిమితికి సంబంధం ఏంటని వివరణ కోరింది. ప్రతి ఒక్కరికి కొత్త న‌గ‌దు అందాల‌నే ప‌రిమితి విధించిన‌ట్లు కేంద్రం తెలిపింది. నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే నాటికి ప్రభుత్వం వద్ద ముందే సిద్ధం చేసిన కొత్త నోట్లేమీ లేవని అట‌ర్నీ జ‌న‌ర‌ల్ స్పష్టం చేశారు. ముందే ముద్రిస్తే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం లీక‌వుతుంద‌నే అలా చేశార‌ని చెప్పుకొచ్చారు. ఇరువురి వాద‌న‌లు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం... కేసు తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

21:39 - December 9, 2016

ఢిల్లీ : అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసు పెద్ద మలుపు తిరిగింది. వైమానికదళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. త్యాగి సోదరులు జూలీ, న్యాయవాది గౌతం ఖేతాన్‌లను కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంది.
సిబిఐ దర్యాప్తు ముమ్మరం 
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల స్కాంపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం జేసింది. ఈ స్కాంకు సంబంధించి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వైమానికదళ అధిపతి ఎస్పీ త్యాగిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్‌ ఖేతాన్‌తో పాటు త్యాగి సోదరుడు సంజీవ్‌ త్యాగి అలియాస్‌ జూలీని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ ఒప్పందంలో ఈ ముగ్గురు అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపించింది.  విచారణకు సహకరించకపోవడంతో వీరిని అరెస్ట్‌ చేసినట్లు సిబిఐ తెలిపింది. 
అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం
2010లో యూపిఏ హయాంలో వివిఐపిల కోసం 3 వేల 6 వందల కోట్లతో 12 హెలిక్యాప్టర్లను కొనుగోలు చేసేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదిరింది. ఇందులో 10 శాతం ముడుపులు చెల్లించినట్లు తెరపైకి వచ్చింది. మాతృ సంస్థ ఫిన్‌మెక్కానికా ఇటలీలో ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దర్యాప్తులో భారత్‌లోనూ ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2013లో ఈ ఒప్పందాన్ని యూపిఏ ప్రభుత్వం రద్దు చేసుకుంది.
త్యాగి కీలక పాత్ర 
హెలిక్యాప్టర్ల ఫ్లయింగ్‌ సీలింగ్‌ను 6 వేల మీటర్ల ఎత్తు నుంచి 4 వేల 5 వందల మీటర్ల ఎత్తుకు తగ్గించడంలో త్యాగి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో మాజీ ఎయిర్‌ చీఫ్‌ ఎస్పీ త్యాగితో పాటు ఈ స్కాంలో మొత్తం 13 మందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. త్యాగిని ఇదివరకే పలుమార్లు సిబిఐ ప్రశ్నించింది. ఈ నిర్ణయం సామూహికంగా తీసుకున్నదేనని త్యాగి చెప్పారు. అగస్టా మధ్య వర్తులతో ఆయన సోదరులకు పరిచయాలున్నాయన్న ఆరోపణలున్నాయి.
కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు : మిలాన్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌  
హెలిక్యాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని ఇటలీ లోని మిలాన్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ స్పష్టం చేసింది. ఇందులో భారత మాజీ వైమానికదళ అధిపతి ఎస్పీ త్యాగికి సంబంధం ఉందని పేర్కొంది. భారత అధికారులకు 90 నుంచి 225 కోట్ల వరకు ముడుపులు చెల్లించినట్లు తెలిపింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ చీఫ్‌ ఓర్సీని కూడా దోషిగా నిర్ధారించింది.

 

21:34 - December 9, 2016

ఆరోగ్య సమస్య ఏమిటీ తెలియదు.. అయినవాళ్లను అనుమతించలేదు.. కనీసం ఫొటో కూడా బయటపెట్టలేదు.. డిశ్చార్జ్ అన్నారు.. విగతజీవిగా బయటికొచ్చింది. ఆ 75 రోజుల్లో ఏం జరిగింది..? ఒక మరణం.. అనేక ప్రశ్నలు.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:24 - December 9, 2016

ఏఐసీసీ కార్యాలయంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

ఢిల్లీ : ఏఐసీసీ కార్యాలయంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఆజాద్, దిగ్విజయ్ సింగ్, ఓరా, ఎంపీ రాపోలు భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని ఆజాద్ అన్నారు. పేదలు, రైతులు, మహిళలు, కార్మికుల అభివృద్ధి లేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆఆర్ పాత్ర లేదన్నారు. 

ముసబ్దీలాల్ జూవెల్లర్స్ పై కేసు నమోదు

హైదరాబాద్ : బంజరాహిల్స్ లోని ముసబ్దీలాల్ జూవెల్లర్స్ పై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. నవంబర్ 8న రూ.100 కోట్ల బంగారం అమ్మకాలు జరిపినట్లు సోదాల్లో ఐటీ అధికారులకు యజమానులు లెక్కలు చూపించారు. ఇన్ కంట్యాక్స్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీకాంత్ ఫిర్యాదుతో సంస్థ డైరెక్టర్ లు నితిన్ గుప్తా, మల్లేష్, కైలాష్లతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

 

21:07 - December 9, 2016

సున్నంబట్టీ పరిశ్రమలపై పెద్ద నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపింది. పరిశ్రమ మరింత కష్టాల్లో పడింది. కూలీలు ఉపాధి కల్పోతున్నారు. రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారు. యంత్రాలు రావడంతో కూలీలకు పని లేకుండా పోయింది. కొత్త నోట్లు వచ్చే వరకు పాత నోట్లను కొనసాగించాలి అని కూలీలు కోరుకుంటున్నారు. పిడుగురాళ్లలోని సున్నంబట్టీ పరిశ్రమలో పని చేస్తున్న కూలీలతో మల్లన్నముచ్చటించాడు. ఈ సందర్భంగా కూలీలు తమ కష్టాలు, ఇబ్బందులను టెన్ టివితో మొరపెట్టుకున్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:05 - December 9, 2016
21:00 - December 9, 2016

హైదరాబాద్ : మహానగరంలో మనుషుల ప్రాణాలకు లెక్కలేకుండా పోతోంది. పొట్టకూటి కోసం భవన నిర్మాణ పనులకెళ్లిన కూలీల బతుకులు శిథిలమవుతున్నాయి. అధికారుల అలసత్వం, బిల్డర్ల ధనదాహానికి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో భవనాలు పేకమేడలా కూలిపోతున్నా బల్దియా పాఠాలు నేర్వడం లేదా? ఈ ప్రమాదాలకు ఫుల్‌స్టాప్‌ పడేదెప్పుడు? 
కుప్పకూలిన 7 అంతస్థుల భవనం  
హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడ ప్రాంతం..సమయం రాత్రి తొమ్మిది గంటలు..7 అంతస్తుల భవనం...పనులు ముగించుకున్న కార్మికులు సేద తీరుతున్నారు. సడన్‌గా పెద్ద శబ్దం రావడంతో భూకంపం వస్తుందేమోనని అంతా భయపడిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే వ్యవధి లేదు. బయటకు దూకే సమయం లేదు. అంతలోనే 7 అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం సెల్లార్‌లో ఉంటున్న 20 మంది కూలీలు శిథిలాల మధ్య ఇరుక్కుపోయారు. ఆర్తనాదాలతో, అరుపులతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భయానకంగా మారింది. కొందరు సజీవసమాధి కాగా.. మరికొందరు క్షతగాత్రులయ్యారు. 
నిర్మాణ పనులు నాసిరకం
నానక్‌రామ్‌గూడలో 7 అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోవడానికి కారణాలు ఏమిటి? నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టినా.. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు. తిలాపాపం తలపిడికెడు అన్నట్లుగా కూలీల మరణాలకు బాధ్యులెవరు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన తుల్జాపూర్‌ సత్యనారాయణ సింగ్‌ ఈ భవనం యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్‌ 6తో పాటు పైన పెంట్‌హౌస్‌ కూడా నిర్మిస్తున్నాడు. 2015 సెప్టెంబర్‌ నుంచి ఈ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సెల్లార్‌లో 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. నిర్మాణం నాసిరకంగా ఉందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 16 పిల్లర్లు నిర్మించినా.. పుట్టింగ్‌లు సరిగా లేవన్న  ఆరోపణలున్నాయి. మరోవైపు కూలిపోయిన అపార్టుమెంటును ఆనుకునే సుమధుర అనే నిర్మాణ సంస్థ మరో భారీ వెంచర్‌ నిర్మిస్తోంది. సెల్లార్‌ కోసం 50 అడుగుల లోతున తవ్వకాలు చేపట్టడం వల్లే 7 అంతస్తుల భవనం కుప్పకూలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. డైనమెట్లతో పేల్చి సెల్లార్‌ గుంత తీస్తుండడమే  ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిర్మాణదారుల నిర్లక్ష్యం, అత్యాశ 
ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసు.. గతంలో జరిగిన ఘోరాలు తెలుసు.. అన్నీ తెలిసినా నిర్మాణదారుల నిర్లక్ష్యం, అత్యాశ గ్రేటర్‌ హైదరాబాద్‌లో భవనాలు పేకమేడలవడానికి కారణాలవుతున్నాయి. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. నిర్మాణ సమయంలోనే కట్టడాలు కుప్ప కూలుతున్నాయి. బిల్డర్ల ధనదాహానికి ఎందరో కూలీలు బలవుతున్నారు. భవనాల నిర్మాణాలకు తీసుకునే అనుమతి ఒకటి అయితే చేపట్టే నిర్మాణాలు మరోలా ఉంటున్నాయి. నిర్మాణ లోపాలు గుర్తించి అరికట్టాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదన్నది బహిరంగ రహస్యం. మహానగరంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా బల్దియా పాఠాలు నేర్వడం లేదు. నిర్మాణంలో ఉన్న భవనాలు కూలుతున్నా పర్యవేక్షణ కొనసాగడం లేదు. కాంట్రాక్టర్లు ప్రమాణాలు వదిలేసినా కాసుల కక్కుర్తితో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
జులైలో ఫిల్మ్‌నగర్‌లో పోర్టికో కూలి ఇద్దరు మృతి 
ఈ ఏడాది జులైలో ఫిల్మ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై నివేదికతో పాటూ ప్రమాదాలకు దారితీస్తున్న సాంకేతిక అంశాలను జేఎన్‌టీయూహెచ్‌ నిపుణులు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న భవనాలు కుప్పకూలడానికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నైపుణ్యంలేని ఇంజినీరింగ్‌ పనులు, డిజైనింగ్‌ లోపాలే కారణమని తేల్చారు. వేగంగా పనులు పూర్తిచేయాలనే తొందరలో అంతస్తులపై అంతస్తులను నిర్మిస్తున్నారు. పరిమిత ఎత్తు దాటకుండా ఉండేందుకు  సెల్లారు కోసం మూడు నాలుగు అంతస్తుల లోపల వరకు తవ్వుతున్నారు. దీంతో నిర్మాణ భవనాల పక్కన ఉన్న కట్టడాలకు ఇది ముప్పుగా మారుతోంది. 
జులైలో పదిరోజుల వ్యవధిలో 4 వరుస ప్రమాదాలు 
ఈ ఏడాది జులై నెలలో పదిరోజుల వ్యవధిలో నాలుగు వరుస ప్రమాదాలు జరిగాయి. ఏడుగురు కూలీల ప్రాణాలు కోల్పోయారు. ఆగస్ట్ 2న చిలకలగూడలో పాత భవనం కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే నెలలో జూబ్లీహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనంలో.. మొదటి అంతస్తు పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. నిర్మాణ నాణ్యతను, అధికారుల పర్యవేక్షణ ఏపాటిదో చెప్పాయి. గత ఆగస్టులో మాదాపూర్‌లోనూ నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. గతేడాది జూన్‌ 23న షేక్‌పేటలోని సత్యాకాలనీలో నాలుగంతస్తుల భవనం కూలి ఇద్దరు గాయపడ్డారు. 2013 జూలై 9న సికింద్రాబాద్‌లో భవనం కుప్పకూలి 13 మంది చనిపోయారు. 2012 ఫిబ్రవరి 26న సికింద్రాబాద్‌ మొండా మార్కెట్‌ ప్రాంతంలో భవనం కూలి  ముగ్గురు మృత్యువాతపడ్డారు.
కూలిపోయేందుకు సిద్ధంగా 1,997 భవనాలు
కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న 1,997 భవనాలను జీహెచ్‌ఎంసీ గుర్తించినప్పటికీ వాటిలో1000 భవనాలను మాత్రమే తొలగించినట్లు తెలుస్తోంది. మిగతావాటిలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలుతున్నాయి. అమయాకుల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. అక్రమాలపై ఉక్కపాదం అంటూ చేసే ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నాయి. అనుమతుల్లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టినా.. కాసుల కక్కుర్తితో చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. మాముళ్ల మత్తు.. రాజకీయ పలుకుబడి.. వెరసి.. అక్రమ నిర్మాణాలపై కన్నెత్తి చూసేందుకే వెనుకంజ వేస్తున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం కాకుండా..అక్రమ నిర్మాణాల చేపడుతున్నవారిపై జీహెచ్‌ఎంసీ అధికారుల కొరడా ఝుళిపించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. 

 

20:46 - December 9, 2016
20:44 - December 9, 2016

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ : క్రిస్మస్, సంక్రాతి పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్... కాకినాడ మధ్య 15 ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 27 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 

 

జయలలిత మరణంపై అనేక ప్రశ్నలు : సినీ నటి గౌతమి

చెన్నై : తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని... వీటన్నింటికీ సమాధానాలు కావాలని ప్రముఖ సినీ నటి గౌతమి అన్నారు. ఈమేరకు ఆమె టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ 75 రోజుల్లో ఏ జరిగిందో తెలియాలన్నారు. ప్రధానికి లేఖ రాయడం అప్పటికప్పుడే వచ్చిన ఆలోచన అని తెలిపారు. 75 రోజుల్లో ఎవరూ ఆమెను కలవలేకపోయారని పేర్కొన్నారు. 'నా లేఖకు ప్రధాని స్పందిస్తారని' ఆశిస్తున్నానని చెప్పారు. తన లేఖ వెనుక ఎలాంటి వ్యూహాలు లేవన్నారు. 

 

20:28 - December 9, 2016

చెన్నై : జయలలిత మృతిపై ప్రముఖ సినీ నటి గౌతమి పలు అనుమానాలు వ్యక్తం చేశారు.  ఆమె మృతిపై పలు అనుమానాలను లేవనెత్తుతూ... ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. జయ ఆస్పత్రి పాలు కావడం, అక్కడ పూర్తిగా కోలుకున్నట్లు చెప్పడం, అంతలోనే ఉన్నట్టుండి మృతి చెందారనడం.. వీటన్నింటిపైనా ఆమె ప్రధానికి రాసిన లేఖలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. 
జయలలిత మృతిపై నటి గౌతమి పలు అనుమానాలు 
తమిళనాడు జయలలిత మృతిపై ప్రముఖ నటి గౌతమి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ కూడా రాశారు. జయలలిత ఆస్పత్రి పాలు కావడం, అక్కడ పూర్తిగా కోలుకున్నట్లు చెప్పడం, అంతలోనే ఉన్నట్టుండి మృతి చెందారనడం.. వీటన్నింటిపైనా ఆమె ప్రధానికి రాశారు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం అన్ని విషయాలనూ కప్పిపెట్టి ఉంచారని, ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎంత వీఐపీ, వీవీఐపీ వచ్చినా కూడా ఆమె ముఖాన్ని చూపించలేదని అన్నారు. అమ్మ ఆరోగ్యం పట్ల ఎంతో ఆందోళనతో వచ్చినవాళ్లంతా ఆమెను చూసే అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారని గౌతమి అన్నారు. 
ప్రధానికి గౌతమి లేఖ 
నిజానికి తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా పలువురికి జయలలిత ఆరోగ్యం, మృతి తదితర విషయాలపై అనుమానాలున్నా, ఎవరూ ఇలా బహిరంగంగా చెప్పలేదు. ఆమె మాత్రం నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాయడం సంచలనం రేకెత్తిస్తోంది. అందరికీ ప్రేమమూర్తి, తమిళనాడు ప్రభుత్వాధినేత్రి కూడా అయిన ఆమె ఆరోగ్యం విషయంలో ఇంత రహస్యం ఎందుకు పాటించాల్సి వచ్చిందని గౌతమి ప్రశ్నించారు. ఆమె వద్దకు వెళ్లకుండా నియంత్రించిన వాళ్లు ఎవరు, వాళ్లకున్న అధికారం ఏంటన్నారు. ఆమె ఆరోగ్యం చాలా పాడైనప్పుడు ఆమెకు అందించాల్సిన చికిత్సల గురించి నిర్ణయాలు తీసుకున్నవాళ్లు ఎవరని అడిగారు. ప్రజల మదిలో అలజడి రేపుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుల గురించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుందని గౌతమి తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటే కుదరదన్నారు. మోదీ తన ఆవేదనను పట్టించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 
జయలలిత మృతిపై కొన్ని ప్రశ్నలు : గౌతమి
జయలలిత మృతిపై  ఎన్నో ప్రశ్నలు తనను ఉక్కిరి బిక్కిరి చేశాయని, ఈ 75 రోజుల్లో అసలేం జరిగిందన్న ప్రశ్నలే తనను ప్రధానికి లేఖ రాసేలా చేసిందని ప్రముఖ సినీ నటి గౌతమి అన్నారు. ఎంతో మంది జయను కలవడానికి హాస్పిటల్‌కు వెళ్లినా.. ఆమెను కలవలేకపోయారని, అలా ఎందుకు జరిగిందన్నదే తన ప్రశ్న అని గౌతమి అన్నారు. ప్రజల మనిషి అయిన జయలలితకు   ఆసుపత్రిలో ఏం జరిగిందన్న పూర్తి వివరాలతో తనకు ప్రధాని నుంచి సమాధానం వస్తుందనే ఆశిస్తున్నానని గౌతమి తెలిపారు. 

 

20:19 - December 9, 2016

విశాఖ : వార్దా తుపాను విశాఖ తీరానికి  990 కిలోమీటర్ల దూరంలో..ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. రానున్న 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావం వల్ల కోస్తాప్రాంతంలో వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

20:17 - December 9, 2016

విజయవాడ : నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరహాలోనే విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ భవనాన్ని ఈనెల 13న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు వెల్లడించారు.  అభ్యుదయ భావజాలానికి కేంద్రంగా...శాస్ర్తీయ ఆలోచనలు పెంపొందించే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. 

 

20:15 - December 9, 2016

అనంతపురం : శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం మరిచిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో రాయల్ ఉత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా భిక్షాటన చేసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. రాయల ఉత్సవాలను జరుపుతామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

 

20:12 - December 9, 2016

పశ్చిమ గోదావరి : జిల్లాలో పరిశ్రమల వల్ల పెరిగిపోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా సీపీఎం ప్రజాభేరి పాదయాత్ర ఏలూరులో ముగిసింది. తణుకులో ప్రారంభం అయిన ఈ పాదయాత్ర 14రోజులుగా 16మండలాల్లో 420 కిలోమీటర్లు పైనే కొనసాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా... ఏలూరు కలెక్టరేట్ ముందు సీపీఎం నేతలు మహా ధర్నా చేపట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో..సీపీఎం నేతలు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. పరిశ్రమల పేరుతో జిల్లాను కాలుష్యమయం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.  

 

20:09 - December 9, 2016

విశాఖ : గంగపుత్రుల బతుకులు తెగిన గాలిపటంలా మారాయి. ఒడ్డుకు చేరిన చేపపిల్లాల విలవిల్లాడుతున్నాయి. మోడీ దెబ్బకు జీవనోపాధే ప్రశ్నార్థకంగా మారింది. కుటుంబాలు గడవక పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయి. పెద్ద నోట్ల రద్దుతో మత్స్యకారుల వ్యాపారాలు బేజారయ్యాయి. గిరాకీ లేక ఊసురుమంటున్నారు. ఆదుకున్నగంగమ్మే ఇప్పుడు కాదు పొమ్మంటుంటే.. ఏం చేయాలో తెలియక గుండెలు బాదుకుంటున్నారు. కేంద్ర నిర్ణయంతో రోడ్డునపడ్డ మత్స్యకారుల కుటుంబాల జీవన స్థితిగతులపై 10 టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌...! 
నోట్ల రద్దుతో కుదేలైన చేపల వ్యాపారం
500, వెయ్యి నోట్ల రద్దుతో మత్స్యకారుల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. వారి కుటుంబాలు గడవడం ప్రస్తుతం కష్టంగా మారింది. పెద్ద నోట్ల రద్దుతో విశాఖలో చేపల వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. బిజినెస్‌ లేక ప్రస్తుతం వ్యాపారాలు మానేశారు. వ్యాపారాలు సరిగ్గా లేకపోవడం వల్ల బోటు యజమానుల నుంచి చేపలు కొనుగోలు తగ్గించేశామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేపల అమ్మకాలపై 50 వేల మంది మత్య్సకారుల జీవనం 
గిరాకీ లేక ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు
విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది మత్య్సకారులు చేపల అమ్మకాలపై జీవనం సాగిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో గీరాకీ లేక అమ్మకం, కొనుగోలుదారుల పరిస్థితి చాలా దయనీంగా మారింది. నాడు హుదూద్‌ తుపాన్‌ సమయంలో చేపల వేట సాగక.. చేపలు దొరకని పరిస్థితి. ఇప్పుడేమో పుష్కలంగా చేపలు ఉండి కూడా డబ్బుల్లేక ఏకమొత్తంలో చేపలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 
గతంలో రోజుకు రూ.30 కోట్లు సాగిన వ్యాపారం
30 కోట్ల నుంచి  కోటి రూపాయలకు తగ్గిన బిజినెస్‌
విశాఖ జిల్లా వ్యాప్తంగా రోజుకు దాదాపు 30 కోట్ల చేపల వ్యాపారం జరుగుతుంది. ఇందులో ఎగుమతుల కంటే చిల్లర వ్యాపారమే ఎక్కువ. ఇప్పుడు చేపల సీజన్ కావడంతో మత్స్యకారులు మంచి బిజినెస్ జరుగుతుందని ఆశపడ్డారు. కానీ మోదీ నిర్ణయంతో రోజుకు 30 కోట్ల వ్యాపారం జరిగే చోట ప్రస్తుతం కోటి రూపాయల బిజినెస్ కూడా జరగటం లేదు. పెద్ద నోట్లు రద్దుతో వ్యాపారులు చేపలు కొనడం మానేశారు. కొనుగోలుదారులు కూడా 2వేల నోట్లు తీసుకురావడంతో వారికి చిల్లర ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
ఎండు చేపలు మార్కెట్‌ పరిస్థితి దయనీయం 
సీజన్ కావడంతో సముద్రంలో చేపలు సమృద్ధిగా దొరుకుతున్నా పెద్ద నోట్ల రద్దుతో అమ్మకాలు జరగడం లేదని సెంట్రల్ మైరేన్ ఫిషరీస్ సర్వేనే స్పష్టం చేస్తోంది. కనీసం డీజిల్‌ ఖర్చులకు కూడా డబ్బులు రాకపోవడంతో చాలామంది చేపల వేటకు వెళ్లడం మానేశారు. అటు మార్కెట్‌, ఇటు వీధుల్లో చేపల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. హర్బర్‌లో ఎండు చేపలు మార్కెట్‌ పరిస్థితి చాలా దయనీయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా చిల్లర కష్టాలు పరిష్కరించాలని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

19:58 - December 9, 2016

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ ఎయిర్‌ చీఫ్‌ ఎస్‌.పీ. త్యాగికి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసు ఉచ్చు బిగుసుకుంది. త్యాగిని సీబీఐ అరెస్టు చేసింది. అవినీతి ఆరోపణలపై త్యాగితో పాటు మరో ఇద్దర్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ముడుపుల వ్యవహారంలో ఎస్పీ త్యాగి, గౌతమ్‌ ఖేతన్‌, సంజీవ్‌ త్యాగిలను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

19:48 - December 9, 2016

హైదరాబాద్ : నానక్‌రాంగూడ బిల్డింగ్‌ కూలిన ఘటనలో మృతిచెందిన ఒక్కొక్కరికి 30లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వైసిపి అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన బొత్స.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతులది విజయనగరం జిల్లా కావడంతో బొత్స వారిని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేద కూలీలను పొట్టనపెట్టుకున్న భవన యజమాని, బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 

19:41 - December 9, 2016

సంగారెడ్డి : సాంకేతిక, వైద్య పరమైన విజ్ఞానాన్ని విద్యార్ధుల్లో పెంపోందించేందుకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడుతాయని హెచ్‌సీయూ వీసీ అప్పారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌజ్‌ అండ్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్‌లో యూనివర్సిటీ పరిధిలోని పాఠశాల విద్యార్ధులు భారీగా హజరయ్యారు. సాంకేతిక, వైద్య పరమైన పరిజ్ఞానానికి చెందిన 140 రకాల ప్రదర్శనలు విద్యార్ధులను అకట్టుకున్నాయి. 

 

ప్రదీస్ చంద్ర పదవీకాలం పొడిగించాలని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ ప్రదీస్ చంద్ర పదవీకాలం పొడిగించాలని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ నెలాఖరుతో ప్రదీప్ చంద్ర పదవీకాలం ముగియనుంది.

శిథిలాల తొలగింపు 50శాతం పూర్తి : జీహెచ్ ఎంసీ కమిషనర్

హైదరాబాద్ : నానక్ రాంగూడ భవన్ కూలిన ఘటనలో శిథిలాల తొలగింపు 50శాతం పూర్తి అయిందని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ  భవన నిర్మాణానికి జీహెచ్ ఎంసీ పర్మిషన్ లేదన్నారు. బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని చెప్పారు. అనుమతులు, నిర్మాణాల విషయంలో మార్పులు చేయాలన్నారు. రాత్రి వరకు శిథిలాల తొలగింపు కొనసాగుతోందని పేర్కొన్నారు. 

 

భవనం కూలిన ఘటనలో నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

హైదరాబాద్ : నానక్ రాంగూడలో భవనం కూలిన ఘటనలో నాలుగు మృతదేహాలకు ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి అయింది. నానక్ రాంగూడలో శిథిలాల తొలిగింపు కొనసాగుతోంది. 

19:14 - December 9, 2016
19:13 - December 9, 2016

హైదరాబాద్ : బ్యాంకుల దగ్గర ఖాతాదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డబ్బుల కోసం తెల్లవారుజాము నుంచి వెయిట్ చేస్తుంటే.. డబ్బులు లేవని అధికారులు చెప్పడంతో.. ఖాతాదారుల ఆగ్రహం బద్దలైంది. టోలిచౌకి వద్ద రోడ్డుపై బైఠాయించారు. బ్యాంక్ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాలుగు కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జనం.. రోడ్డుపై తిరుగుతున్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి డబ్బు ఇప్పిస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో... ధర్నా విరమించారు. 

 

19:11 - December 9, 2016

నాగర్‌కర్నూలు : కల్వకుర్తిలో పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది మోసానికి పాల్పడ్డారంటూ వాహనదారులు వాగ్వాదానికి దిగారు. వంద రూపాయల పెట్రోల్‌ పోయించుకున్నా..ఒక లీటర్‌ పెట్రోల్‌ రావడంలేదంటూ మండిపడ్డారు. పెట్రల్‌ను కొలిస్తే.. ఐదు వందల మిల్లీలీటర్లు తక్కువ వచ్చింది. దీంతో పెట్రోల్‌ యజమానిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బంక్ యజమాని మాత్రం ఎలాంటి మోసాలకు పాల్పడలేదని అంటున్నారు. 

 

19:08 - December 9, 2016

సంగారెడ్డి : నోట్ల రద్దు వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. పిల్లల పెళ్లిళ్లు చేయడానికి ప్రజలు అల్లాడుతుంటే.. కేంద్ర మంత్రుల పిల్లల పెళ్లిళ్లు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని విమర్శించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. డిసెంబర్ 31 తర్వాత కేంద్ర ప్రభుత్వం పతనమయ్యే స్థాయిలో ప్రజలు తిరగబడడం ఖాయమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:04 - December 9, 2016

హైదరాబాద్ : బిల్డింగ్ కూలిన ఘటనలో గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:53 - December 9, 2016

హైదరాబాద్‌ : నగర శివారులోని నానక్‌రాంగూడలో 7 అంతస్తుల భవనం కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇద్దరిని సహాయక సిబ్బంది రక్షించారు. శిథిలాల కింద మరో 10 మంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు వేగంగా కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు 10 అంబులెన్స్‌లను కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. 
కుప్పకూలిన ఏడంతస్తుల భవనం 
హైదరాబాద్‌ నగర శివారు నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికితీశారు. వాచ్‌మెన్‌ శివ, నారాయణమ్మ అనే మహిళ సహా మరో ఇద్దరి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. భవనం శిథిలాల కింద మరో 10 మంది చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాత్రి నుంచి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారికి కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. రాత్రి భవనంలో టైల్స్‌, ప్లంబింగ్‌ పనులు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని పనిచేస్తున్న కూలీలు చెప్తున్నారు.  
నలుగురి మృతదేహాలు వెలికితీత 
మృతులు చిలకపల్లికి చెందిన దంపతులు సాంబయ్య, పైడమ్మ, కుమార్తె గౌరీలుగా గుర్తించారు. మృతదేహాలను, తీవ్రగాయాలైన వారిని వెంటనే ప్రత్యేక అంబులెన్సుల్లో కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా విజయనగరం జిల్లా బలిజపేట మండలం చిలకపల్లి, సుభద్రతో పాటు ఛత్తీస్‌గఢ్‌ వాసులుగా తెలుస్తోంది.
భవన యజమానిపై కఠిన చర్యలు : కేటీఆర్ 
ఘటనా స్థలంలో సహాయక చర్యలను మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం భవన యజమాని సత్యనారాయణ సింగ్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. భవన యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. 
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా 
మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతదేహాలను ఉచితంగా వారి సొంత గ్రామాలకు తరలించేందుకు కూడా అంగీకరించింది. అలాగే దహనసంస్కారాలకు 20వేల రూపాయల సాయం చేయనుంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా బాధితులకు చంద్రన్న బీమా పథకం కింద 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 

 

18:45 - December 9, 2016

చిత్తూరు : త్వరలో తిరుపతి అర్బన్‌ జిల్లాలకు పోలీసుల కొరత తీరుస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. తిరుమలలో శ్రీవారిని సాంబశివరావు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో ఫిజికల్‌ టెస్టులకన్నా నాలెడ్జ్‌ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. 

18:41 - December 9, 2016

హైదరాబాద్ : నానక్‌రాంగూడలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన నేపథ్యంలో..కాంగ్రెస్‌ నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి కాంగ్రెస్‌పక్షనేత షబ్బీర్‌ అలీతో పాటు ఇతర నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాసిరకం పనులు, కాంట్రాక్టర్‌ అవినీతి వల్లే బిల్టింగ్‌ కుప్పకూలిందన్నారు. వెంటనే భవన యజమానితో పాటు కాంట్రాక్టర్‌ను అరెస్ట్‌ చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

 

18:37 - December 9, 2016

సంగారెడ్డి : పెద్ద నోట్లు రద్దై నెల దాటినా కరెన్సీ కష్టాలు తీరలేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు తీరుతూనే ఉన్నారు. అయినా క్యాష్ అందకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:32 - December 9, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దై 31 రోజులైనా నగదు కష్టాలు ఇప్పట్లో తీరేలా కన్పించడంలేదు. నగదు నిల్వలు సరిపడా లేకపోవడంతో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ఎస్బీహెచ్  బ్రాంచిలో ఖాతాదారులతో బ్యాంకు సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడంతో ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలకొద్ది క్యూలో నిల్చున్నా..చేతికి కనీసం 4వేలు కూడా అందడంలేదని..తమకు అనుకూలమైన వారికే బ్యాంకు సిబ్బంది నగదు ఇస్తున్నారని మండిడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాల్ని వీడియోలో చూద్దాం..

 

ముంబై మాటుంగాలో రూ.85 లక్షల నగదు సీజ్

మహారాష్ట్ర : ముంబైలోని మాటుంగాలో రూ.85 లక్షల నగదును సీజ్ చేశారు. గుర్ గావ్ లోనూ రూ.12 లక్షల కొత్త నోట్లను పోలీసులు పట్టుకున్నారు. 

 

టీ.అసెంబ్లీ శీతాకాల సమావేశాల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈనెల 16న ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్నాయి. శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరుగనున్నాయి. 

ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్ పీ త్యాగి అరెస్ట్

ఢిల్లీ : ఎయిర్ పోర్స్ మాజీ చీఫ్ ఎస్ పీ త్యాగిని అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసు లో సీబీఐ అరెస్టు చేసింది. త్యాగీతో పాటు గౌతమ్ కేతన్, సంజీవ్ త్యాగిలను కూడా సీబీఐ అరెస్టు చేసింది.

టోలీచౌక్ ఎస్ బీఐ వద్ద ఖాతాదారులపై లాఠీఛార్జి

హైదరాబాద్ : టోలీచౌక్ ఎస్ బీఐ వద్ద ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 ల మంది లైన్లో నిలబడితే డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహంతో బస్సులపై ఖాతాదారులు రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

16:57 - December 9, 2016

చెన్నై పొన్ను 'సమంత' పెళ్లెప్పుడంటే ఫైర్ అవుతుంది. అంతేకాదు మ్యారేజ్ ఎప్పుడునేది ఎవరికి చెప్పను. అసలు పెళ్లి చేసుకుంటానా లేదా అనేది కూడా చెప్పానంటుంది. ఈ బ్యూటీ ఈ రేంజ్ లో ఫైర్ అవ్వడానికి గట్టి రీజనే ఉందట. 'సమంత' పెళ్లి మాటెత్తగానే అంతెత్తున్న ఎందుకు ఎగురుతుందో ??? తమిళ చిన్నది 'సమంత' అక్కినేని కుర్రాడు 'నాగచైతన్య'తో హాట్ హాట్ లవ్ స్టోరీ నడిస్తున్న విషయం తెలిసిందే. అవును మేము లవ్ లో ఉన్నాం. ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడానికి ప్రస్తుతం డేటింగ్ కూడా చేస్తున్నామని 'సమంత' అఫిషియల్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. అంతేకాదు మాకు మా ఫ్యామిలీస్ సపోర్ట్ కావాల్సినంత ఉందని పెళ్లి కూడా చేసుకుంటామని ఢంకా బజాయించి చెప్పింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లి మాట ఎత్తితే ఫైర్ అవుతోంది. 

ఫీల్ అవుతున్న సమంత..
మ్యారేజ్ గురించి అడిగితే 'సమంత' ఫైర్ కావడానికి గట్టి కారణమే కనిపిస్తోంది. పెళ్లి ప్లాన్ చెప్పాక తనకు సినీ ఆఫర్స్ తగ్గిపోయాయని ఈ చెన్నై చిన్నది ఫీల్ అవుతోందంట. ఇటీవల ఓ ఇంగ్లీషు డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయంపై ఈ బ్యూటీ మాట్లాడింది. తన పెళ్లి విషయం ప్రకటించగానే ఆఫర్స్ రావడం తగ్గిపోయిందని, ఈ ఎడాది కూడా తన ఖాతాలోనే ఎక్కువ హిట్స్ ఉన్నాయని, కానీ 'అక్కినేని' లాంటి పెద్ద ఫ్యామిలీకి కోడలు కాబోతోందని ఎవరూ ఛాన్స్ ఇవ్వడం లేదని అసలు విషయం చెప్పి బాధపడిందట.

పెళ్లాయ్యాక కూడా నటిస్తానంటున్న సమంత..
పెళ్ళయ్యాక కూడా నటిస్తానని ముందే చెప్పానని, 'నాగ చైతన్య' కూడా ఈ విషయంలో తనకు చాలా సపోర్ట్ చేస్తున్నాడని 'సమంత' క్లారిటి ఇచ్చింది. అయిన కూడా 'చైతూ' తో మ్యారేజ్ అనే సరికి దర్శక నిర్మాతల మైండ్ సెట్ మారిపోయిందని ఈ బ్యూటీ చెబుతోంది. అన్నట్లు సమంత ఈ ఎడాది 24, అ..ఆ, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించింది. జనతా గ్యారేజ్ రిలీజై నాలుగు నెలలు దాటుతుంది. కానీ ఈ చిన్నదానికి కొత్తగా ఛాన్స్ లు రాలేదు. మొత్తానికి మ్యారేజ్ ఎఫెక్ట్ 'సమంత' కెరీర్ పై పడిందన్నమాట.

16:51 - December 9, 2016

'కొరటాల శివ' ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాడట. 'జనతా గ్యారేజ్' సినిమా విషయంలో జరిగిన పొరపాటుని రిపీట్ కాకుండా ఉండేలా ఈ హ్యట్రిక్ దర్శకుడు ఒకటి పది సార్లు క్లియర్ గా స్టడి చేస్తున్నాడు. ఇంతగా కొరటాల హైరానా పడటానికి కారణం ఏంటీ ? వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో 'కొరటాల శివ' టాలీవుడ్ ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. 'మిర్చి’, 'శ్రీమంతుడు’,'జనతా గ్యారేజ్' హ్యట్రిక్ సక్సెస్ లతో బడా డైరెక్టర్ గా టర్న్ తీసుకున్న 'కొరటాల శివ' మరోసారి 'మహేష్ బాబు' సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ ఈ మధ్య ఒపెనింగ్ జరుపుకుంది. ఈ మూవీ కోసం 'కొరటాల' చాలా కేర్ తీసుకుంటున్నాడట. 'కొరటాల శివ' తనకు తనే ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట. అదే దిశగా తన స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారట. 'మిర్చి' 'శ్రీమంతుడు' సినిమాలకు తొలి ఆటకే యూనానిమాస్ గా సూపర్ హిట్టు టాక్ వచ్చింది. కానీ 'జనతా గ్యారేజ్' విషయంలో మాత్రం తొలి రోజు డివైడ్ టాక్ వచ్చింది. పైగా క్రిటిక్స్ కు ఈ సినిమా పూర్తి సంతృప్తినివ్వలేదు. సో 'కొరటాల శివ’, 'ప్రిన్స్' తో చేయనున్న సినిమా విషయంలో ఇది రిపీట్ కాకుండా కథను ఒకటి పది సార్లు స్టడి చేస్తున్నాడట.

జాగ్రత్తలు..
ఎట్టి పరిస్థితుల్లోనూ 'మహేష్' తో చేయబోయే సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో సూపర్ హిట్టు టాక్ వచ్చేలా జాగ్రత్త తీసుకుంటున్నాడట. మూవీ ఒపెనింగో రోజే కొరటాల ఈ సినిమా టాలీవుడ్ లో ఇంత వరకు రానీ పాయింట్ తో తెరకెక్కుతుందని భారీ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. స్టోరీపై ఓ అంచనాకు రావడానికి దర్శకుడు కొన్ని సీన్స్ ని తన సన్నిహితులతో చెప్పాడట. సీన్స్ విన్న కొరటాల ప్రెండ్స్ వావ్ అంటూ సర్ ప్రైజ్ అయ్యారట. ఈ విధంగా 'మహేష్ బాబు'తో చేయనున్న మూవీ కోసం దర్శకుడు చాలా చాలా జాగ్రత్తపడుతున్నాడు. సినిమా షూటింగ్ కి ముందే హైప్ పెంచుతున్న 'కొరటాల శివ' ఎలాంటి మూవీ తీయబోతున్నాడో చూడాలి.

రాజస్థాన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: ఉజ్జర్లుతో పాటు మరికొన్ని కులాలకు రిజర్వేషన్ కల్పిస్తూ 2015 అక్టోబర్ లో రాజస్థాన్ అసెంబ్లీ బిల్ పాస్ చేసింది. ఉజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్ చెల్లదని రాజస్థాన్ హైకోర్టు తేల్చేసింది. 

16:46 - December 9, 2016

'బాలయ్య' ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియో రిలీజ్ వాయిదా పడింది. అయితే ఫ్యాన్స్ లో జోష్ పెంచడానికి యూనిట్ మంచి స్కెచ్ వేసింది. ఆడియో రిలీజ్ డేట్ వెనక్కి జరిగిన శాంపిల్ తో ఫ్యాన్స్ స్టన్ చేయాలని ప్లాన్ చేస్తోంది. 'నందమూరి బాలకృష్ణ' వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి పోస్ట్ పోన్ ల పర్వం కొనసాగుతోంది. మొదట ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 9న 100 థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ అంతా పాడైపోయింది. దీంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య క్లాషెస్ రాకుండా ఉండేందుకు ట్రైలర్ రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఆడియో రిలీజ్ డేట్ ని కూడా వాయిదా వేశారు.

శ్రియ..హేమామాలిని..
ఈ నెల 16న తిరుపతిలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియోను గ్రాండ్ చేయాలనుకున్నారు. అంతేకాదు ఈ ఆడియోకి ఏపీ సీఎం చంద్రబాబు నాయడుతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కూడా ఆహ్వానించారు. కానీ వీరిద్దరికీ డిసెంబర్ 16న వేరే ఇంపార్టెంట్ పనులు ఉండడంతో కుదరడం లేదట. వీరితో పాటు శాతకర్ణి తల్లిగా నటించిన అలనాటి డ్రీమ్ గాళ్ 'హేమమాలిని' కూడా రావడం కుదిరేలా లేదట. దీంతో ఈ డేట్ ని మార్చినట్లు సమాచారం. డిసెంబర్ 16న చీప్ గెస్ట్ లు రాలేకపోతుండడం వల్ల ఈ ఆడియోను డిసెంబర్ 22 లేదా 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ని ఆనందపర్చడానికి 16 వ తేదీని అపిషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ సినిమాకి శాంపిల్ ఉంటుందని యూనిట్ చెబుతోంది. 'క్రిష్' దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి బరీలో రిలీజ్ కానుంది. ఇందులో 'బాలయ్య' పక్కన 'శ్రియ' హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

పుట్టిన రోజు వేడుకలకు దూరంగా రజనీకాంత్

చెన్నై : పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉండాల సూపర్ స్టార్ రజనీకాంత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా 12న తన బర్త్ డే వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు సూపర్ స్టార్ రజనీ కాంత్ సూచించారు. జయలలిత మృతి నేపథ్యంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయవద్దని రజనీకాంత్ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు.

 

16:41 - December 9, 2016

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' లేటెస్ట్ మూవీ 'ధృవ'. తమిళ్ సినిమా 'తనీ ఒరువన్' రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సురేంద్రరెడ్డి దర్శకుడు. మరి 'రామ్ చరణ్' 'ధృవ'గా ఎలా మెప్పించాడు? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతోంది.. తెలియాలంటే .. చదవాల్సిందే..

బ్రూస్లీ డిజాస్టర్..
'బ్రూస్లీ' డిజాస్టర్ తో 'రామ్ చరణ్' పూర్తిగా డిఫెన్స్ లో పడ్డాడు. అందుకే మినిమమ్ హిట్టు కొట్టే సత్తా కలిగిన 'తనీ ఒరువన్' కథను ఏరికోరి మరీ ఎన్నుకున్నాడు. గతంలో ఎన్నడూ రాని ఒక యూనిక్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా స్ర్కీన్ ప్లే బేస్డ్ గా సాగే ఇలాంటి కథలు జనాన్ని బాగా కూర్చోబెడతాయి. 'ధృవ' ఆ విషయంలో బాగానే తన సత్తా చూపించింది. తమిళ్ కథను ఏ మాత్రం మార్చినా మెయిన్ సోల్ దెబ్బతింటుంది. అందుకే తమిళ్ సినిమాను యాజిటీజ్ షాట్ టు షాట్ దించేసారు. అయితే తమిళ్ లో 'జయం రవి' మామూలు హీరో కాబట్టి అందులో ఎమోషన్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక్కడ హీరో 'రామ్ చరణ్' కాబట్టి, జనాన్ని అంతగా ఎమోషన్స్ తో కదలించలేదనిపిస్తుంది. మొత్తం మీద 'రామ్ చరణ్' తన స్టైలిష్ యాక్షన్ తోనూ, సురేంద్రరెడ్డి స్టైలిష్ టేకింగ్ తోనూ, రత్నవేలు అద్బుతమైన ఛాయాగ్రహణంతోనూ సినిమాను నిలబెట్టేసారు.

కథ...
'ధృవ'కి చిన్నతనం నుంచి పోలీస్ అవ్వాలని యాంబినేషన్. ఆ యాంబిషన్ తోనే తన కోలీగ్స్ తో కాకుండా తనే ఒంటరిగా ఒక కేసును ఇన్వెస్ట్ గేట్ చేస్తాడు. ఎన్నో లింకుల్ని ఛేదించుకొని అసలైన నేరస్థున్ని గుర్తిస్తాడు. ఇక అతడ్ని అరెస్ట్ చేయడమే తరువాయి అనుకుంటూండగా.. అనుకోని విధంగా హీరో ఫ్రెండ్ చనిపోతాడు. అప్పుడే హీరోకి కూడా అనుకోని ఎదరుదెబ్బ తగులుతుంది. చివరికి 'ధృవ' ఆ కేసును ఎలా పరిష్కరించాడు. మైండ్ గేమ్ తో నేరస్థుణ్ణి ఎలా పట్టుకున్నాడన్నదే మిగతా కథ. విలన్, హీరో ఎత్తుకు పై ఎత్తులు తో సాగే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని కదలనీయకుండా కూర్చోబెడుతుంది. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే వల్ల సినిమాలో ఆడియన్స్ తమకు తెలియకుండానే లీనమైపోతారు.

పాత్రల తీరు తెన్నులు..
'ధృవ' పాత్రకు అతను బాగా సూటయ్యాడు. మామూలుగా 'చరణ్' సీరియస్ సన్నివేశాల్లో బాగా చేస్తాడు. 'ధృవ' కథ.. పాత్ర కూడా ఆ తరహావే కావడంతో ఎక్కడా పెద్దగా ఇబ్బంది పడలేదు. పాత్రకు తగ్గట్టుగా నటించాడు. ఎప్పట్లాగే యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఇక 'అరవింద్ స్వామి' గురించి చెప్పేదేముంది. సినిమా చూశాక అతను వెంటాడుతాడు. చాలా కాలం గుర్తుంటాడు. అతడి లుక్.. బాడీ లాంగ్వేజ్.. కాస్ట్యూమ్స్.. నటన.. అన్నీ చాలా రిఫ్రెషింగ్ గా.. ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇషికా పాత్రలో 'రకుల్ ప్రీత్' కూడా బాగా చేసింది. చలాకీ నటనతో ఆకట్టుకుంది. ఓ పాటలో ఆమె గ్లామర్ విందు చేసింది. ఐతే ఐపీఎస్ ట్రైనీగా ఆమె ప్రవర్తించే తీరు కొంచెం చిత్రంగా ఉంటుంది. ఇక్కడ పాత్ర ఔచిత్యం దెబ్బతింది. గౌతమ్ పాత్రలో 'నవదీప్' ఆకట్టుకున్నాడు. 'పోసాని' పాత్ర బాగుంది. అక్కడక్కడా ఆ పాత్ర నవ్విస్తుంది. ఐతే చివర్లో ఆ పాత్రను మరీ వెర్రి వెంగళప్పను చేసేశారు. 'నాజర్’.. 'షాయాజి షిండే'. వీళ్లంతా ఓకే. టోటల్ గా 'ధృవ' జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. 'తనీ ఒరువన్' సినిమా చూడని వాళ్లకైతే ఈ సినిమా గొప్పగా అనిపిస్తుంది. ముఖ్యంగా బి, సి జనం ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, స్ర్కీన్ ప్లే
రామ్ చరణ్ నటన
అరవింద స్వామి పెర్ఫార్మెన్స్
క్లైమాక్స్
ఛాయా గ్రహణం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :
ఎమోషన్ తక్కువగా ఉండడం
సంగీతం

రేటింగ్ : 2.5 / 5..

16:33 - December 9, 2016

'కాగితపు కరెన్సీ స్థానంలో డిజిటల్ కరెన్సీ'

ఢిల్లీ : కాగితపు కరెన్సీ స్థానంలో డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టనున్నట్లు లోక్ సభలో అర్జున్ మేఘవాల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ముడిసరుకు కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టామని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశపెట్టున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ కరెన్సీ నిర్ణీత గడువు ఐదేళ్లని, తొలి విడతగా కొచ్చి, మైసూర్, జైపూర్, స్లిమా, భువనేశ్వర్ లోరూ.10 ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెట్టనున్నామని అర్జున్ స్పష్టం చేశారు.

 

గౌతమి ఆరోపణలను కొట్టిపారేసిన అన్నాడీఎంకే

చెన్నై : గౌతమి లేఖ అన్నా డీఎంకే నేతలు స్పందించారు. జయలలిత మృతిపై ఎలాంటి కుట్ర లేదని అన్నాడీఎంకే నేతలు తేల్చేశారు. అలా గౌతమి ఆరోపణలను కొట్టిపారేశారు.

16:25 - December 9, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో నెల రోజులు గడుస్తున్నా ప్రజల కష్టాలు తీరడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో ఎక్కువ శాతం బ్యాంకులు, ఏటీఎంలు నోక్యాష్ బోర్డుతో కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు గంటల తరబడి వేచి ఉండలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఈమేరకు వృద్ధురాలు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే... 'ఎనిమిదిన్నరకు వచ్చిన...ఇప్పుడు 10.30 అవుతుంది'. నెల రోజుల నుంచి డబ్బుల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా, ఏం బ్యాంకులో.. ఏం మోడో అర్థం కావడం లేదు. జనాలను చంపేస్తున్నారు. ఉన్నోళ్లకు ఏం బాధల్లేవు.. లేనివారికి బాధలొస్తున్నాయి. చావాలా.... బతకాలా'... అని ప్రశ్నించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

రిజర్వులో నేషనల్ హెరాల్డ్ కేసు తీర్పు

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు ఈ నెల 26 వరకు రిజర్వులో ఉంచింది.

15:56 - December 9, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణమని.... దీన్ని తాను నిరూపిస్తానని.. కానీ ప్రభుత్వం తనకు ఆ అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నోట్లరద్దు అంశంపై లోక్‌సభలో తాను మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా... కేంద్రం తనను అనుమతించడం లేదని తెలిపారు. ఒకవేళ తాను మాట్లాడితే సభలో భూకంపం వస్తుందన్నారు. ఎక్కడ తమ పునాదులు కదిలిపోతాయోనన్న భయంతోనే ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుపై చర్చించకుండా తప్పించుకుంటోందని రాహుల్‌ విమర్శించారు. దేశమంతా ప్రసంగాలు ఇస్తున్న మోడీ, నోట్ల రద్దుపై చర్చించేందుకు భయపడుతున్నారని ధ్వజమెత్తారు.

15:52 - December 9, 2016

ఢిల్లీ : రాజ్యసభ కూడా బుధవారానికి వాయిదా పడింది. మధ్యాహ్నం రెండున్నరకు ప్రారంభమైన సభ... సభ్యులు లేక వెల వెల పోయింది. దీంతో సభలో కోరం లేనందున సభను వాయిదా వేయాలని కాంగ్రెస్ సభ్యులు ఆనంద్‌శర్మ డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ను కోరారు. సభ నడపాలన్నా...సభ వాయిదా పడాలన్న విపక్షాల చేతిలోనే ఉందని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ అన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కురియన్‌ సభలో కోరం లేనందున సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 

15:49 - December 9, 2016

ఢిల్లీ : తనపై అన్యాయంగా కేసులు పెట్టి..ఏమీ సాధించలేరని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పుపై ఆయన స్పందించారు. తానేమి తప్పు చెయ్యలేదని...అందువల్ల ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. విశ్వసనీయత అనేది మనిషికి చాలా ప్రధానమని చంద్రబాబు తెలిపారు. 

 

శిధిలాల నుండి మరో మృతదేహం వెలికితీత

హైదరాబాద్ : నానక్ రామ్ గూడ లో భవనం కూలిన ఘటనలో శిధిలాల నుండి మరో మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో ఇప్పటి వరకు నలుగురు మృత దేహాలను వెలికితీసినట్లయ్యింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

15:40 - December 9, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుపై ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభ బుధవారానికి వాయిదా పడింది. లోక్‌సభ ప్రారంభం కాగానే వియత్నాంకు చెందిన ప్రతినిధి మండలిని స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ సభకు పరిచయం చేశారు. అనంతరం పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సభ నివాళులర్పించింది. నోట్ల రద్దుపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభ 12 గంటల వరకు రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన సభలో ఎలాంటి మార్పు లేకపోవడంతో విపక్షాల గందరగోళం మధ్య సభను డిసెంబర్‌ 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు.

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

జమ్మూకశ్మీర్‌ : అనంతనాగ్‌ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఒక పౌరుడు మరణించాడు. మరికొందరు ఉగ్రవాదులు తప్పించుకున్నారన్న అనుమానంతో ఆ ప్రాంతాన్ని సైన్యం జల్లెడపడుతోంది.

15:34 - December 9, 2016

ముంబైలోని రూ.85లక్షల నగదు సీజ్

హైదరాబాద్: ముంబైలోని మాటుంగాలో రూ.85లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన డబ్బులో రూ. 73 లక్షలు రూ. 2 వేల నోట్లు వున్నాయి. మిగతావి రూ. 12లక్షలు, కొత్త రూ.100 నోట్లు వున్నాయి.

చాందినీచౌక్ యాక్సిస్ బ్యాంకులో ఐటీ శాఖ తనిఖీలు

ఢిల్లీ : చాందినీ చౌక్ లోని యాక్సిస్ బ్యాంకులో ఐటా శాఖ తనిఖీలు నిర్వహించింది. నవంబర్ 8 తర్వాత 15 ఖాతాల్లోకి రూ. 70 కోట్లు జమ అయినట్లు ఐటీ శాఖ గుర్తించింది.

15:17 - December 9, 2016

కడప : పట్టణంలోని ఏడురోడ్ల కూడలి వద్ద సుజాత హోటల్ వెనుకభాగం కూలింది. హోటల్ పని చేస్తున్న ముగ్గురు సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని పోలీసులు కాపాడారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఓ మహిళ శిథిలాల కింద చిక్కుకుంది. ఆమెను బయటికి తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

సూరత్ లో రూ.75లక్షల కొత్త కరెన్సీ పట్టివేత

గుజరాత్ : సూరత్ లో రూ.75లక్షల కొత్త కరెన్సీ పట్టుకున్నారు. కారులో తరలిస్తుండగా పోలీసులు కారుతో పాటు ఒకరిని పట్టుకున్నారు. గుర్గావ్లో రూ. 12 లక్షల కొత్త నోట్లను పోలీసులు పట్టుకున్నారు.

15:01 - December 9, 2016
15:00 - December 9, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని దివీస్‌ నిర్మాణ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పరిహారం ఇవ్వకుండా పొలాలు స్వాధీనం చేసుకోవడాన్ని రైతులు వ్యతిరేకించారు. చెట్లు నరకడాన్ని అడ్డుకున్న స్థానికులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి 10 మంది అరెస్ట్‌ అయ్యారు. పరిహారం ఇవ్వకుండా పొలాలు స్వాధీనం చేసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: నానక్ రామ్ గూడలో భవనం కూలిన ఘటనా స్థలాన్ని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, షబ్బీర్ అలీ పరిశీలించారు.

14:50 - December 9, 2016

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి 'జయ లలిత' మృతి అనంతరం ఆసక్తికర వార్తలు బయటకొస్తున్నాయి. ఆమె మృతి మిస్టరీగా మారిందని సోషల్ మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమ్మ పార్థీవ దేహం ఎడమ బుగ్గపై ఏర్పడిన నాలుగు రంధ్రాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె చెంపపై ఉన్న రంధ్రాలు ఏమిటీ ? అనే దానిపై చర్చ జరుగుతోంది. బుగ్గపై ఏర్పడిన రంధ్రాలు ఎమ్మాల్మింగ్ తో ఏర్పడ్డాయా ? ఇతర చికిత్స వల్ల ఏర్పడ్డాయా ? అనేది తెలియాల్సి ఉంది. ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు కుళ్లిపోకుండా ఉండేందుకు వైద్యులు ఎమ్మాల్మింగ్ చేస్తుంటారు. వివిధ రసాయనాలు శరీరంలోకి ఎక్కించి మందులతో శరీరాన్ని శుద్ధి చేయడమే ఎమాల్మింగ్ విధానం. సూది ద్వారా మందును శరీరంలోకి ఎక్కిస్తారు. గజ్జల్లో కాని..మెడ వెనుక భాగంలో కానీ ఇస్తారు. అయితే..జయ ఎడమ చెంపపై ఈ రంధ్రాలు ఏర్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రలో సీఎం జయలలిత చేరారు. అనంతరం వైద్యులు చికిత్స అందించారు. డిసెంబర్ 5వ తేదీన అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. జయ మృతితో తమిళనాడు మొత్తం విషాదంలో మునిగిపోయింది. మొత్తం 75 రోజుల సమయంలో జయకు సంబంధించిన ఏ ఫొటో కానీ, వీడియో కానీ బయటకు రాలేదు. 

గాంధీభవన్ లో ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

హైదరాబాద్ : గాంధీభవన్ లో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... అసెంబ్లీలో కాంగ్రెస్ ని కడిగి పారేస్తానని అవాకులు.. చెవాకులు పేలుతున్నాడని, అసెంబ్లీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని హెచ్చరించారు. సింగూరు ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేదలు, సామాన్యులు ఇబ్బంది పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ కక్ష సాధింపులకు పాల్పడుతోందని దానం నాగేందర్ ఆరోపించారు.

14:36 - December 9, 2016

'జయ'కు శశికళ స్లో పాయిజన్ ఇచ్చిందా ?

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి 'జయలలిత' మృతిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా సినీ నటి 'గౌతమి' ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. 'అమ్మ' మృతిపై ఎన్నో అనుమానాలున్నాయని లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు లాయర్ కృష్ణమూర్తి జయలలిత మృతి పట్ల శశికళపై అనుమానాలున్నాయని ఆడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సంచలనాలు సృష్టిస్తోంది. తాను శశికళపై కేసు పెట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లు ఆడియోలో పేర్కొన్నారు. జయ ఆస్తులను అపహరించాలనే ఉద్దేశ్యంతో జయను చంపేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. స్లో పాయిజన్ ఇచ్చిన విషయం తెలుసుకున్న 'జయ'..శశికళను బయటకు గెంటివేశారని పేర్కొన్నారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కృష్ణమూర్తి రిలీజ్ చేసిన ఆడియో నిజమా ? కాదా ? అనేది తెలియరావడం లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5వ తేదీన అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. జయ మృతితో తమిళనాడు మొత్తం విషాదంలో మునిగిపోయింది. గత సెప్టెంబర్ 22వ తేదీన అపోలో చేరిన జయ 75 రోజుల పాటు చికిత్స పొందారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియల్లో శశికళ పక్కనే ఉన్నారు. ఈమె జయకు అత్యంత సన్నిహితురాలుగా మెలిగింది. కృష్ణమూర్తి కేసు పెడుతారా ? లేదా ? అనేది కొద్ది రోజులు వెయిట్ చేయ్యక తప్పదు. 

చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారు : జగన్

ఒంగోలు : ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఆయన ఒంగోల్లో మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ నిధులు రూ.1300 కోట్ల కేటాయింపులకు గాను.. రూ. 500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని .. దీనిపై చంద్రబాబు పేదలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

13:58 - December 9, 2016

కస్తూర్భా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

కడప : వేముల కస్తూర్భా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. 20 మంది విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు.

13:57 - December 9, 2016

గత 35ఏళ్ళుగా మహిళా హక్కుల కోసం పోరాడతున్న పీవో డబ్ల్యు సంధ్య మానవి ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. విద్యార్ధి దశ నుండే పోరాటాల్లో దిగాననీ..తరువాత మహిళా హక్కుల కోసం గత 35 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని సంధ్య పేర్కొన్నారు. మహిళా హక్కులంటే ఏమిటి? వాటికోసం ఎటువంటి పోరాటాలు చేయాలి అనే  విషయాలపై  సంధ్య ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకునేందుకు  ఈ వీడియో చూడండి..

13:54 - December 9, 2016

ఢిల్లీ : విశాఖలో మైనింగ్ టెక్నాలజీ పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని ..పెట్రోలు వర్శిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. వాణిజ్య, విద్య, సాంకేతికత, పరిశోధన, సాంస్కృతిక రంగాల్లో సహకారంపై పశ్చిమ ఆస్ట్రేలియాతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకున్నామని చంద్రబాబు తెలిపారు. పశ్చిమ ఆస్ట్రేలియాతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.మైనింగ్ , ఎడ్యుకేషన్ రంగాల్లో ఎంవోయులు..డ్లెలాండ్ అగ్రికల్చర్ తో ఎన్జీరంగా వర్శిటీతో ఆస్ట్రేలియా ఎంవోయూ కుదిరిందర్నారు. కర్నూలులో ఐరన్ ఓర్ ఫ్యాక్టరీతో 5వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. గత సంవత్సరంలో వున్న ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు.ఏపీలో ఆటల రంగం పట్టిష్టంగా వుందన్నారు. దేశంలో ఏపీ బిగ్గెస్ట్ ఆక్వా రంగంగా తయారవుతోందని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే ఏపీ నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖలో మైనింగ్‌ ఎక్విప్‌మెంట్‌, సర్వీసెస్‌ పార్క్‌ ఏర్పాటుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకొచ్చినట్లు తెలిపారు.తూర్పు తీరంలో పోర్టుల అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. అక్వా కల్చర్‌ హబ్‌గా తయారయ్యే అనుభవం మన రాష్ట్రానికి ఉందన్నారు.

ఆటోను ఆర్టీసి బస్సు ఢీ : ముగ్గురి మృతి

తిరుపతి : మదనపల్లి - తిరుపతి జాతీయరహదారిపై ఆటోను ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ముగ్గురు మృతి చెందారు.

13:51 - December 9, 2016

నిజామాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో సామాజిక న్యాయం జరిగే వరకూ సీపీఎం అలుపెరగకుండా పోరాటం కొనసాగిస్తుందని మహాజన పాదయాత్ర బృంద సభ్యులు జాన్‌వెస్లీ తెలిపారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రకు నిజామాబాద్‌ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ్టికి పాదయాత్ర 54వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ 13వందల 70కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తైంది. నిజామాబాద్‌లో జిల్లాలో ఉన్న జోగినీలను ఆదుకుని.. వారికి సాగు భూమి, పెన్షన్లు అందజేయాలని పాదయాత్ర బృంద సభ్యులు జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. ఈ నెల 16 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో సామాజిక అంశాలపై అన్ని పార్టీల నేతలు చర్చించాలని డిమాండ్‌ చేశారు.రానున్న అసెంబ్లీలో అన్ని పార్టీలు సామాజిక అంశాలపై చర్చించాలని పాదయాత్ర సందర్భంగా జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం అమలు చేసే విధానంపై అందరూ చర్చించాలన్నారు. కుల వివక్షతో దళితులు అణిచివేతకు గురవుతున్నారు. ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ అమలు చేయాలనీ.. తెలంగాణలో జోగిని వ్యవస్థను నిర్మూలించాలని డిమాండ్ చేశారు,

13:48 - December 9, 2016

హైదరాబాద్‌ : నానక్‌రాం గూడ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య నాలుక్కి చేరింది. ఇద్దరిని సహాయక సిబ్బంది రక్షించారు. శిథిలాల కింద ఇంకా 8 మంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో వారిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతదేహాలను తరలిస్తుండగా.. బాధిత కుటుంబాలు అంబులెన్స్‌ను అడ్డుకున్నాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 

13:42 - December 9, 2016

జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంటీ ? ఆయన చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు ? హీరోయిన్ ఎవరు ? తదితర వివరాలు తెలుసుకొనేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అంతేగాకుండా 'జూనియర్ ఎన్టీఆర్' చిత్రంపై సోషల్ మీడియాలో తెగ కథనాలు కూడా వచ్చాయి. వీటన్నింటికీ 'కళ్యాణ్ రామ్' చెక్ పెట్టాడు. తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు. తన సోదరుడు ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని, దాన్ని తమ సొంత బ్యానర్ ఎన్టీఆర్ట్స్ పతాకంపై నిర్మించడం జరుగుతోందని ట్వీట్స్ చేశారు. ఈ చిత్రానికి 'బాబి' దర్శకత్వం వహిస్తున్నారని ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది మాత్రం 'కళ్యాణ్ రామ్' తెలుపలేదు. కామెడీ, యాక్షన్..పక్కా మాస్ కథతో ఈ చిత్రం తెరకెక్కనున్నదని తెలుస్తోంది.

బాబి..దర్శకుడు..
'సర్దార్' తో ఖంగుతిన్న 'బాబీ' చెప్పిన స్టోరీకి 'ఎన్టీఆర్' శాటిస్ఫై అయినట్లు ఇటీవలే పలు వార్తలు వచ్చాయి. 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తో షాక్ అయిన 'బాబీ' ఒక్క ఛాన్స్ అంటూ చాలా మంది హీరోలకు స్టోరీలు చెబుతున్నాడంట. 'రవితేజ' కోసం ఓ కథ రెడీ చేసి బడ్జెట్ ప్రాబ్లమ్స్ తో పక్కన పెట్టేశాడు. ఇప్పుడు 'ఎన్టీఆర్' కోసం ఈ దర్శకుడు ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్దం చేసి వినిపించాడంట. రీసెంట్ గా 'ఎన్టీఆర్' ను కలిసిన 'బాబీ'.. ఓ పవర్ ఫుల్ యాక్షన్ స్టోరీ వినిపించాడంట. స్టోరీ లైన్స్ విన్న 'ఎన్టీఆర్' వెంటనే పూర్తి స్టోరీని తీసుకురమ్మని చెప్పాడట. 'ఎన్టీఆర్' పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో దర్శకుడు 'బాబీ' పూర్తి స్టోరీని రెడీ చేశాడని టాక్. 

13:31 - December 9, 2016

కడప : పెద్ద నోట్లు రద్దు చేసి 31 రోజులైనా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏటీఎం చూసినా.. నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగదు కోసం బ్యాంకుల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. టోకన్‌ కోసం ఓ సారి, నగదు కోసం మరోసారి బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. మధ్యాహ్నానికే బ్యాంకుల్లో నగదు నిండుకుంటుంది. మరోవైపు నగదు కోసం క్యూల్లో నిలబడి వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఖాతాల్లో డబ్బులున్నా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో కడప సిండకేట్ బ్యాంక్ వద్ద ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. 

టి.వీసీల నియామకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : తెలంగాణలో వీసీల నియామకానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయవచ్చని సుప్రీం స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా సర్కార్ వ్యవహరిస్తోందని తెలిపింది. దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే నియామకాలు చేపడుతామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. 

పశ్చిమ ఆస్ట్రేలియాతో ఏపీ సర్కార్ అవగాహన ఒప్పందం..

న్యూఢిల్లీ : పశ్చిమ ఆస్ట్రేలియాతో ఏపీ సర్కార్ అవగాహన ఒప్పందం చేసుకుంది. మైనింగ్ ఎడ్యుకేషన్ వ్యవసాయ రంగాల్లో ఎంవోయూలు కుదుర్చుకుంది. డ్రైలాండ్ అగ్రికల్చర్ లో ఎన్జీ రంగా వర్సిటీతో ఆస్ట్రేలియాతో ఎంవోయూ కుదిరింది. కర్నూలుఓ్ల ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ..ఐదు వేల మందికి ఉపాధి కలగనుంది. విశాఖలో మైనింగ్ టెక్నాలజీ పరికరాల ఉత్పత్తి జరగనుంది. 

దివీస్ నిర్మాణంలో మరోసారి ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : దివీస్ నిర్మాణ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెట్లు నరకడాన్ని అడ్డుకున్న పోలీసులపై లాఠీఛార్జీ నిర్వహించారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పది మందిని అరెస్టు చేశారు.

 

13:06 - December 9, 2016

మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్' నటించిన 'ధృవ' శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. చిత్రం ఫస్ట్ హాఫ్ బాగానే ఉందని సోషల్ మాధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే ఇక్కడ చిత్రం రిలీజ్ అయ్యేసరికి 'చెర్రీ' అమెరికాలో ప్రత్యక్షమయ్యాడు. కేవలం అతడొక్కడే పోకుండా చిత్ర యూనిట్ ను కూడా తీసుకెళ్లాడంట. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేసిన 'అరవింద్ స్వామి' కూడా అమెరికాకు వెళ్లాడు. ఓ మల్టీఫ్లెక్స్ లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలో దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. తనకు ఈ రోజు చాలా టెన్షన్ గా ఉందని, సూరీ చాలా బాగ తెరకెక్కించారని తప్పకుండా అందరికీ నచ్చుతుందని 'రామ్ చరణ్' పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్ర యూనిట్ తో పాటు జబర్దస్త్ 'రష్మీ' కూడా పాల్గొనడం విశేషం.
తమిళంలో విజయవంతమైన 'తని ఒరువన్' చిత్రాన్ని 'రామ్ చరణ్' రీమెక్ చేశారు. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. 'రాంచరణ్‌' ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ సినిమా చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం 'చెర్రీ' తన బాడీ ఫిట్‌నెస్‌ దగ్గర్నుంచీ, ఆహారపు అలవాట్ల వరకూ ఎన్నో మార్పులు చేసుకున్నాడు. ఇక చిత్ర కథ ఆసక్తిని రేకేత్తిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. 

నోట్ల రద్దు అతిపెద్ద స్కాం - రాహుల్..

ఢిల్లీ : నోట్ల రద్దు దేశ చరిత్రలో అతి పెద్ద స్కాం అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై పార్లమెంట్ లో సమాధానం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని, చర్చ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కానీ ప్రభుత్వం సహకరించడం లేదని పేర్కొన్నారు. 

నానక్ రాం గూడ క్షతగాత్రులకు లక్ష పరిహారం - కేటీఆర్..

హైదరాబాద్ : నానక్ రాంగూడలో భవనం కూలిన ప్రాంతాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని పర్యవేక్షించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తామని, బాధితులను రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒకరి మృతదేహం లభ్యమైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందచేయడం జరుగుతుందన్నారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, క్షతగాత్రులకు రూ. లక్ష పరిహారం అందచేస్తామన్నారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామన్నారు. 

12:44 - December 9, 2016
12:38 - December 9, 2016

హైదరాబాద్ : నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూలిన ఘటన స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మంత్రి కేటీఆర్‌ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాసేపటి క్రితమే మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌పై వేటు వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

12:26 - December 9, 2016

'ఒకే ఒక్కడు'లో ఒక్క రోజు హీరోగా ఉన్నట్లు నాలుగు రోజులు సీఎంగా లోకేష్ ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ దీనిపై సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అనధికారికంగా కొన్ని రోజుల పాటు సీఎంగా లోకేష్ ఉండనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ టిడిపి జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు త్వరలో విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు కువైట్ తో పాటు అరబ్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఆయనతో పాటు 15 మంది బృందం కూడా పర్యటించనుంది. వాణిజ్య వ్యవహారాలు..ఇన్ ఫ్రా ప్రాజెక్టుల్లో ఉమ్మడి పెట్టుబడులపై బృందం అధ్యయనం చేయనుంది. సీఎం విదేశీ పర్యటనలకు వెళితే సంబంధిత మంత్రుల్లో ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తుంటారు. కానీ బాబు మాత్రం తన తనయుడైన లోకేష్ కు అనధికారికంగా సీఎం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు టాక్. కుర్చీలో కూర్చొకపోయినా సీఎం బాధ్యతలన్నీ లోకేష్ చూస్తారని ప్రచారం జరుగుతోంది. బాధ్యతలు అప్పచెప్పిన సమయంలో లోకేష్ ఎలా వ్యవహరిస్తారనే దానిపై బాబు దృష్టి పెట్టనున్నట్లు టాక్. 

నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్: నానక్‌రాంగూడలో ఆరంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికితీశారు. వాచ్‌మెన్ శివ, నారాయణమ్మ అనే మహిళ సహా మరో ఇద్దరి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. 14గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. శిథిలాల్లో ఉన్న వారికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అయితే భవనం కూలి 14గంటలు పైగా కావడంతో వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.

నేను మాట్లాడి తే భూకంపమే :రాహుల్ గాంధీ

 న్యూఢిల్లీ: నోట్ల ర‌ద్దు అంశంపై పార్ల‌మెంట్ స‌మాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నోట్ల ర‌ద్దు అంశంపై త‌న‌ను మాట్లాడిస్తే, ఎలాంటి భూకంపం వ‌స్తుందో మీరే చూస్తార‌ని రాహుల్‌ అన్నారు. దాదాపు నెల రోజులుగా ఇదే అంశంపై చ‌ర్చ చేప‌ట్టేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, కానీ ప్ర‌భుత్వం మాత్రం స‌హ‌క‌రించ‌డంలేద‌న్నారు. ప్ర‌ధాని మోదీ దేశ‌మంతా తిరిగి ప్ర‌సంగాలు చేస్తున్నార‌ని, కానీ లోక్‌స‌భ‌కు వ‌చ్చి మాట్లాడేందుకు భ‌య‌ప‌డుతున్నార‌న్నారు. 

చెన్నై ఎయిర్ పోర్టులో సూట్ కేసు కలకలం

హైదరాబాద్ : చెన్నై ఎయిర్ పోర్టులో సూట్ కేసు కలకలం రేగింది. అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్వ్కాడ్ ను పిలిపించి తనిఖీలు చేపట్టారు.

12:13 - December 9, 2016

ఢిల్లీ : శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజ్యసభలో విపక్షసభ్యుల ఆందోళన చేపట్టారు. పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని సభ్యులు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ పోడియం వద్ద నినాదాలు చేశారు. నోట్ల రద్దు అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనంటూ నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఇబ్బందులపై సభలో మంత్రి అవాస్తవాలు చెబుతున్నారని, పంటలు సాగు చేసేందుకు, కనీసం ఎరువులు కొనటానికి కూడా రైతుల వద్ద నగదు లేదని జైరాం రమేశ్‌ అన్నారు. పోడియం వద్ద సభ్యుల నినాదాలు హోరెత్తడంతో డిప్యూటీ ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు.

వచ్చే బుధవారానికి లోక్ సభ వాయిదా

ఢిల్లీ : లోక్ సభ వచ్చే బుధవారానికి వాయిదా పడింది. నోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

మృతులకు ఏపీ సర్కార్ ఎక్స్ గ్రేషియా..

హైదరాబాద్: నానక్‌‌రాంగూడలో భవనం కూలిన ప్రాంతాన్ని ఏపీ మంత్రి మృణాళిని శుక్రవారం పరిశీలించి... బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి మృణాళిని ప్రకటించారు.

రాజ్యసభ మ.2.30 వరకు వాయిదా

ఢిల్లీ : వాయిదా అనంతరం ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. వెంటనే విపక్షాల ఆందోళనతో రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా పడింది. లోక్ సభ కొనసాగుతోంది.

12:06 - December 9, 2016

ఢిల్లీ : గ్యాస్ కొట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధహస్తులు. ఇదే విషయాన్ని ఎల్ పిజి గ్యాస్ వ్యవహారం బయటపెట్టింది. తాము తీసుకున్న చర్యల కారణంగా 21 వేల కోట్లకు పైగా ఆదా అయిందంటూ నరేంద్రమోడీ చెబుతున్నదంతా గ్యాసేనంటూ కాగ్ రిపోర్ట్ మూడు నెలల క్రితమే తేల్చేసింది. నరేంద్రమోడీ హయాంలో అసలు ఆదా చేయకపోగా, 97 కోట్ల రూపాయలు నష్టం తెచ్చారంటూ గ్లోబల్ స్టడీస్ ఇన్సియేటివ్ సంస్థ అధ్యయనం కూడా స్పష్టం చేసింది.

దేశంలో 20 కోట్ల 41 లక్షల గ్యాస్ కనెక్షన్లు
పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం మన దేశంలో 20 కోట్ల 41 లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వినియోగదారులకు గ్యాస్ సిలెండర్లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. 2011 -12లో ఇచ్చిన గ్యాస్ సబ్సిడీల మొత్తం 29, 967 కోట్ల రూపాయలు కాగా, ఆ మరుసటి సంవత్సరం మరో పదివేల కోట్ల రూపాయలు పెరిగింది. 2013-14 సంవత్సరంలో అది ఏకంగా 50, 324 కోట్ల రూపాయలకు చేరింది.

19.55 మిలియన్ టన్నులు దాటిన గ్యాస్ వినియోగం..
మన దేశంలో ఏడాదికి గ్యాస్ వినియోగం 19.55 మిలియన్ టన్నులు దాటింది. మన దేశంలో పదిన్నర మిలియన్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుండగా, దాదాపు 9 మిలియన్ టన్నుల గ్యాస్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ప్రతి సిలిండర్ కి దాదాపు 116 రూపాయల చొప్పున ప్రభుత్వ సబ్సిడీ ఇస్తోంది. 2012-14 మధ్యకాలంలో గ్యాస్ సబ్సిడీల మొత్తం 40 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల రూపాయలకు చేరడంతో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సబ్సిడీ సిలెండర్ ల సంఖ్య పై పరిమితులు విధించింది. ఏడాదికి ఆరు సిలెండర్లు మాత్రమే సబ్సిడీపై ఇస్తామంటూ 2012 నవంబర్ లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఈ పరిమితిని 9 సిలెండర్లకు, 12 సిలెండర్లకు పెంచారు. మన దేశంలో ఏడాదికి 12 సిలెండర్లు మించివాడే వారు మూడు శాతంమంది మాత్రమే వుంటారన్న అంచనాలున్నాయి. గ్యాస్ సిలెండర్లను ఆధార్ తో అనుసందానం చేసే ప్రక్రియకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టగా, నరేంద్రమోడీ ప్రభుత్వం దానిని పూర్తిగా విస్తరించింది. గ్యాస్ సబ్సిడీల డబ్బులు వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్లలో వేసే విధానం అమలవుతోంది. దీనికి పహల్ అనే పేరు పెట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. సంపన్నవర్గాలు స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. గివ్ ఇట్ అప్ పేరుతో భారీ ప్రచారం నిర్వహించారు. దీనికి పెద్ద స్పందన రాలేదు. కేవలం కోటి మంది మాత్రమే స్వచ్ఛందంగా సబ్సిడీలు వదులుకున్నారు. దీంతో ఏడాదికి పది లక్షల రూపాయల ఆదాయం దాటినవారికి గ్యాస్ సబ్సిడీ రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం వీరి సంఖ్య 60 లక్షలు. వీరిలో కొందరు గివ్ ఇట్ అప్ లో సబ్సిడీలు వదులుకున్నారు. పహల్ పథకంతో పాటు తాము చేపట్టిన ఇలాంటి చర్యల వల్ల సబ్సిడీల భారం భారీగా తగ్గిందనీ, 21,260 కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు. 2013-14లో 50, 324 కోట్ల రూపాయలున్న గ్యాస్ సబ్సిడీలు, 2015-16లో 16 వేల కోట్లకు పరిమితం కావడంతో నరేంద్రమోడీ ప్రచారం నిజమోనన్న అభిప్రాయం కలగడం సహజం. అయితే, నరేంద్రమోడీ మాయాజాలన్ని కాగ్ నివేదిక గత ఆగస్టులోనే బయటపెట్టడం విశేషం. నిజానికి 2014 తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో చమురు, గ్యాస్ ధరలు భారీగా దిగివచ్చాయి. దీంతో వాటికి వెచ్చించే మొత్తం తగ్గింది. వాస్తవంగా ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఆదా అయ్యింది కేవలం 3500 కోట్లేనంటూ కాగ్ తేల్చేసింది. దీంతో పహల్ పథకం తీసుకొచ్చి, 21వేల కోట్లకు పైగా ఆదా చేశామంటూ ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్న మాటలన్నీ ఉత్త గ్యాసేనని కాగ్ రిపోర్ట్ తో తేలిపోయింది. అయితే, పహల్ పథకం అమలు చేయడానికీ, గివ్ ఇట్ అప్ ప్రచారానికి వెచ్చించిన మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటే ఓవరాల్ గా నరేంద్రమోడీ హయాంలో 97కోట్ల రూపాయల నష్టం మిగిలిందనేది గ్లోబల్ స్టడీస్ ఇన్సియేటివ్ అధ్యయనాల సారాంశం. మరోవైపు, ప్రతి నెలా 2 రూపాయల చొప్పున గ్యాస్ ధరను పెంచుతూ నొప్పి తెలియకుండా, వినియోగదారులపై భారం వేస్తోంది నరేంద్రమోడీ ప్రభుత్వం. 

12:02 - December 9, 2016

హైదరాబాద్ : ఉరిమురిమి మంగళం మీద పడ్డట్లు.. మోదీ నోట్ల రద్దు నిర్ణయం.. నల్లధనాన్ని బయటికి తేవడం మాటేమోగానీ.. సామాన్యుడి పాలిట ప్రాణాంతకంగా మారింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు వంద మంది.. నగదు కోసం క్యూలైన్లలో నిలిచి అక్కడే ప్రాణాలు కోల్పోయారు. బడాబాబులు, సంపన్నులకు ఎలాంటి కష్టం కలగకుండానే కోట్ల రూపాయల నగదు ఇంటికి వచ్చి చేరుతుంటే.. సామాన్యులు మాత్రం కేవలం రెండు వేల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరి.. ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు వదులుతున్నారు.

నెలరోజుల్లో దాదాపు 100 మంది వరకు మృతి
మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజల ప్రాణాలకు చేటు చేస్తోంది. నోట్ల రద్దు తర్వాత గడచిన నెలరోజుల్లోపే దాదాపు వంద మంది చిల్లర నోట్ల కోసం క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తూ.. ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వికలాంగులు, వృద్ధులు, మహిళలతో పాటు గర్బిణులూ గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారు. వీరిలో చాలామంది క్యూలైన్లలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఎస్‌బీహెచ్‌ వద్ద విజయలక్ష్మి అనే వృద్ధురాలు మృతి
మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా ఉయ్యూరులో... ఎస్‌బీహెచ్‌ వద్ద ఉదయం నుంచి క్యూలో నిలబడి విజయలక్ష్మి అనే వృద్ధురాలు మరణించింది. అలాగే చిత్తూరు జిల్లాలో రిటైర్డ్‌ ఉద్యోగి క్యూలైన్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లో క్యూ లైన్‌లో నిలబడి ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆమధ్య కర్నూలు జిల్లా నంద్యాలలో కూడా ఓ రిటైర్డ్‌ ఉద్యోగి.. బ్యాంకులోనే ప్రాణాలు కోల్పోయారు.

వరక గ్రామానికి చెందిన కోగా బెహరా అనే వృద్ధుడు మృతి
నెల రోజులైనా... కనీస ఖర్చులకు అవసరమైన నగదు కూడా దొరక్క జనం ఏటీఎం, బ్యాంకుల వద్ద గంటలు, రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో తిండితిప్పలు మానేసి అలసి పోతున్నారు. కనీసం బ్యాంకుల వద్ద తాగునీటి సౌకర్యం కూడా లేక ప్రాణాలు కోల్పోతున్నారు. బ్యాంకుల వద్ద పెరిగిన రద్దీ తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ వృద్ధుణ్ణి బలి తీసుకుంది. కవిటి మండలం బోరివంక లోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ వద్ద క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్న వరక గ్రామానికి చెందిన కోగా బెహరా అనే వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడున్నవారు ప్రథమ చికిత్స అందించే లోపే ఆయన మృత్యువాత పడ్డాడు.

గ్రిల్స్‌లో ఇరుక్కుని నక్క ఐలారెడ్డి వేళ్లు విరిగిపోయాయి..
బుధవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని ఎస్బీహెచ్ వద్ద గేటు తీయకముందే ఖాతాదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. బ్యాంకు అధికారులు షెట్టర్ తీసి గ్రిల్స్ గేట్ తెరుస్తుండగా ఖాతాదారులు ఒక్క సారిగా లోపలికి దూసుకెళ్లారు. గేటు తీస్తున్న సమయంలో పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి వచ్చిన సోమారంపల్లికి చెందిన నక్క ఐలారెడ్డి ఎడమచేతి రెండు వేల్లు గ్రిల్స్‌లో ఇరుక్కున్నాయి. తోపులాటలో వృద్ధుడి చిటికన వేలు సగం వరకు తెగిపోయింది. మరో వేలు చిట్లిపోయింది.

వాస్తవాన్ని గుర్తించి..ప్రజల ఇక్కట్లను తొలగించే చర్యలు చేపట్టాలని డిమాండ్
దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎం కేంద్రాల వద్దా ఇదే పరిస్థితి. ఎక్కడికక్కడ క్యూలు భారీగా పెరిగిపోతున్నాయి. బ్యాంకులకు వచ్చే మహిళలు, వృద్ధులకు కూర్చునే వసతి కూడా లేక చాలా మంది క్యూలైన్లలోనే ప్రాణాలు విడుస్తున్నారు. దాదాపు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాన్ని గుర్తించాలని, ప్రజల ఇక్కట్లను తొలగించే చర్యలను సత్వరమే చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

11:55 - December 9, 2016

చిత్తూరు : శీతాకాలం.. చలికి తట్టుకోలే భూమికూడా మంచుదుప్పటి కప్పేసుకుంటోంది. తెలతెల్లని మంచుతెరలు కమ్మేయడంతో చిత్తూరుజిల్లాలో సూర్యుడు కూడా ముఖంచాటేస్తున్నాడు. చిత్తూరునగరంతోపాటు చట్టుపట్టు ప్రాంతాల్లో ఉదయం 9గంటలైనా సూర్యకిరణాలు భూమిని చేరడంలేదు. పొగమంచు కారణంగా బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నెమ్మదిస్తున్నాయి. మరోవైపు దట్టంగా మంచు కురుస్తుండటంతో ..మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచు ఎక్కువగా కురిస్తే.. పూత రాలతుందంటున్నారు.

విజయ మాల్య ట్విట్టర్ ఖాతా హ్యాక్

న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ పరారైన లిక్కర్ కింగ్ విజయ్‌ మల్యా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ట్వీట్‌లో మాల్యా ధ్రువీకరించారు. రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన వ్యక్తులే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

11:50 - December 9, 2016

హైదరాబాద్ : నానక్ రామ్ గూడాలో కుప్పకూలిన ఘటనలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇప్పటి వరకూ ముగ్గురు మృతి చెందారనీ ..మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష పరిహారాన్ని ప్రకకటించిన మంత్రి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గాయపడిన వారికి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కూలిన భవనానికి చెందిన యజమాని ఓ మంత్రి దగ్గరి బంధువని వస్తున్న కథనాలపై కూడా ఆయన స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బాధితులను రక్షించేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నామన్నారు. మరోపక్క మృతులను తరలిస్తున్న అంబులెన్స్ ను బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కాగా రాత్రి నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరో తొమ్మిదిమంది వున్నట్లుగా అనుమానిస్తున్నారు. 

జయలలిత మృతి పై మోదీకి గౌతమి లేఖ

హైదరాబాద్ : తమిళనాడు సీఎం జయలలిత మృతి పలు అనుమానాలు వున్నాయని ప్రధాని మోదీ ప్రముఖ నటి గౌతమి లేఖ రాశారు. జయ మృతి వెనుక ఉన్న రహస్యాలు బయట పెట్టాలని ఆ లేఖలో ప్రధానిని గౌతమి కోరింది.

భవనం కూలిన ఘటనలో 3కి చేరిన మృతల సంఖ్య

హైదరాబాద్ : నానక్ రాం గూడ ఘటనలో మృతుల సంఖ్య 3కి చేరింది. మరో ఇద్దరిని సహాయక సిబ్బంది రక్షించింది. శిధిలాల కింద 9 మంది ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమకు న్యాయం చేయాలని మృతదేహాలను తరలించకుండా అంబులెన్స్ ను బాధిత కుటుంబాలు అడ్డుకున్నాయి.

11:34 - December 9, 2016

పెద్ద నోట్ల రద్దుతో పేదోడు..సామాన్యుడు ఇంకా కోలుకోలేదు. నెల రోజులవుతున్నా బ్యాంకులు..ఏటీఎంల ఎదుట ప్రజలు క్యూ కడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తోపులాట జరగడంతో పలువురికి గాయాలవతున్నాయి. అంతేగాకుండా తీవ్ర వత్తిడికి గుఐ కొంతమంది మృతి చెందుతున్నారు కూడా. కానీ ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం రెండు వేల రూపాయలు తీసుకోవడానికి గంటలు గంటలు నిలబడాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్తనోట్లను పంపిణీ చరేస్తామని, కొత్త 500 రూపాయల నోట్లు పెద్ద సంఖ్యలో వస్తాయని ప్రకటనలు గుప్పిస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రకటన వచ్చిన తరువాత ఏటీఎంల్లో డబ్బులు వచ్చినా ఒకటి..రెండు వారాల నుండి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నోట్లను తీసుకోవడానికి వస్తే ఏటీఎంలు వెక్కిరిస్తున్నాయి. నగరంలోని పలు ఏటీఎంలు మూతపడ్డాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది. బ్యాంకుల సెలవులతో మరిన్ని కష్టాలు రానున్నాయి. శనివారం రెండో శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. అలాగే ఆదివారం సాధారణ సెలవే. సోమవారం మహ్మదీయుల ప్రవక్త మహ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని షిల్లార్ ఉల్ నబీ పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు. దీనితో ఇప్పటికే కరెన్సీ కష్టాలతో మూలుగుతున్న ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

రాజ్యసభ మ.12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అంతేకాక పోడియం చుట్టుముట్టి ఆందోళన చేస్తున్నాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను మ.12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.

సోనియా కి పుట్టిన రోజుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం 70వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు మంచి ఆరోగ్యంతో కూడిన సుదీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

11:22 - December 9, 2016

విశాఖ : పూర్ణా మార్కెట్ అంటే అక్కినేని నాగార్జున నటించిన శివమణి సినిమా గుర్తుకొస్తుంది కదా..ఈ మార్కెట్ ఎంత ఫేమస్సో తెలిసిందే. నోట్ల రద్దు ఈ మార్కెట్ పై పెను ప్రభావాన్నే చూపింది. పెద్ద నోట్లు రద్దు చేసి 31 రోజులైనా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విశాఖపట్నంలోని పూర్ణా మార్కెట్‌ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో లక్షల్లో జరిగే వ్యాపారం ఇప్పుడు వేల రూపాయలకు పడిపోయింది. మార్కెట్‌కు వస్తున్న వారిలో ఎక్కువ మంది కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోట్లను తీసుకొస్తున్నారు. వీటికి చిల్లర ఇవ్వడం వ్యాపారులకు సమస్యగా మారింది. షాపుల్లో పని చేసే కూలీలకు కూడా వ్యాపారులు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దుపై వినియోగదారులు కూడా అసంతృప్తితో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏటీఎం చూసినా.. నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగదు కోసం బ్యాంకుల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. టోకన్‌ కోసం ఓ సారి, నగదు కోసం మరోసారి బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. మధ్యాహ్నానికే బ్యాంకుల్లో నగదు నిండుకుంటుంది. మరోవైపు నగదు కోసం క్యూల్లో నిలబడి వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఖాతాల్లో డబ్బులున్నా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో అందరూ రూ.2వేల నోట్లే తీసుకురావటంతో పూర్ణా మార్కెట్ లో వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది.

11:21 - December 9, 2016

అధిక బరువున్న వారి సమస్యలు అంతా ఇంత కావు. బరువు తగ్గించుకోవడానికి ఎక్సర్ సైజులు..డైటింగ్..ఇతరత్రా చేస్తుంటారు. ఇతరుల సలహాలు పాటిస్తూ సమస్యలు తెచ్చుకుంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు తగ్గే అవకాశాలున్నాయి. అంతేగాక ఆహార పదార్థాల విషయంలో కొన్ని నిబంధనలు పాటిస్తే సరిపోతుంది. అందులో 'బాదం' ముఖ్యస్థానం పోషిస్తుంది. బాదం తీసుకోవడం వల్ల శారీరకంగా..మానసికంగా మంచి శక్తినిస్తుందనే విషయం తెలిసిందే. నానబెట్టిన 'బాదం' పప్పు వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయంట. రాత్రి వేళ గుప్పెడు బాదం పప్పులను నీటిలో నానపెట్టిండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ బాదం పప్పులను తినేయండి. పొట్టు తీసి ఉంటే మంచిదే. ఇలా తినడం వల్ల కడుపు నిండిపోయిందనే భావన కలుగుతుంది. తెలియకుండానే ఆహారాన్ని తక్కువగా తీసుకుంటుంటారు. అదనపు కొవ్వు చేరదు..అలాగే కొవ్వు కూడా కరుగుతుంది. బాదంలో ఉండే పీచు, మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తులు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. 

11:20 - December 9, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు ఊరట లభించింది. చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేపట్టాలని ఏసీబీ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం శుక్రవారం ఆ ఉత్తర్వులను కొట్టివేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో చంద్రబాబుపై విచారణ అవసరం లేదన్న చంద్రబాబు తరపు న్యాయవాదితో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేవేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వినిపించిన వాదనలను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబుకు ఈ కేసులో ఊరట లభించింది. 

భవనం కూలిన ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్

హైదరాబాద్ : నానక్ రాంగూడ లో భవనం కూలిన ఘటనలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ మనోహర్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణ మోహన్ ను సస్పెండ్ చేసింది.

లోక్ సభ వాయిదా.

ఢిల్లీ : శీతాకాల పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభం అయిన వెంటనే విపక్షాల ఆందోళనలతో లోక్ సభ వాయిదా పడింది. రాజ్యసభ కొనసాగుతోంది.

ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో చంద్రబాబు క్యాష్ పిటిషన్ తీర్పు ఇచ్చింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేస్తూ విచారణ అవసరం లేదని చంద్రబాబు న్యాయవాది వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

ఈ రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు: టీటీడీ జేఈవో

తిరుమల: ఈ నెల 31, జనవరి 1, 7, 8, 9 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. 2017జనవరి 1, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి (జనవరి 8,9) పర్వదినాల ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశం జరిగింది. 

సీఎం మమతాకి కేంద్ర మంత్రిపారికర్ లేఖ

ఢిల్లీ : పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కేంద్ర మంత్రి పారికర్ లేఖ రాశారు. ఈ లేఖ లో సైనికులను వివాదంలోకి లాడం పై పారికర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

10:32 - December 9, 2016

విశాఖ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వార్ధా తుపాను..24 గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 12న కాకినాడ, నెల్లూరు మధ్య తీరం దాటనుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి కోస్తాంధ్రపై తుపాను తీవ్ర ప్రభావం చూపనుంది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.  

'నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీకి రూ.5వేల కోట్లు పంపండి'

ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. వీరి భేటీలో నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీకి రూ.5వేల కోట్లు పంపాలని, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాని జైట్లీని కోరినట్లు సమాచారం. 

10:26 - December 9, 2016

మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్ తేజ' నూతన చిత్రం 'ధృవ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజైంది. 'బ్రూస్ లీ' చిత్రం పరాజయం అనంతరం ఎలాగైనా హిట్ కొట్టాలని 'చెర్రీ' కసితో 'ధృవ' సినిమా చేశాడని టాక్. తమిళంలో విజయవంతమైన 'తని ఒరువన్' చిత్రాన్ని 'రామ్ చరణ్' రీమెక్ చేశారు. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. 'రాంచరణ్‌' ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ సినిమా చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం 'చెర్రీ' తన బాడీ ఫిట్‌నెస్‌ దగ్గర్నుంచీ, ఆహారపు అలవాట్ల వరకూ ఎన్నో మార్పులు చేసుకున్నాడు. ఇక చిత్ర కథ ఆసక్తిని రేకేత్తిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఉద్యోగంలోకి జాయిన్ కాక ముందునుంచే ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒంటరిగానే సేకరించడం మొదలు పెడతాడు హీరో. అప్పుడు అతడికి కొన్ని నిజాలు తెలుస్తాయి. ఏంటా నిజాలు అన్నది తెరమీద చూడాల్సిందే. సీన్ సీన్ కి ఆసక్తిని రేకెత్తించే ఈ సినిమా తమిళ్ వెర్షన్ లో విలన్ గా నటించిన 'అరవింద్ స్వామి' నే ఇందులో కూడా విలన్ గా నటిస్తుండడం విశేషం. 'రకూల్' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి టాక్ నే సంపాదించుకుందని తెలుస్తోంది. సినిమా మొత్తం బాగుందని ఆడియెన్స్ పేర్కొంటున్నారని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. మరి చిత్రం ఎలా ఉందో ? తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే. 

నిందితులు ఎవరైనా వదిలిపెట్టం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : నానక్ రామ గూడలో కట్టడంలో ఉన్న ఆరుఅంతస్థుల భవనం కూలి పోయింది. ఈ ఘటనలో నిందితులు ఎవరైనా వదిలి పెట్టం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శిధిలా తొలగాంపు ను పర్యవేక్షించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించిందని, మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామన్నారు.

అసెంబ్లీలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గొంతు నొక్కేసింది

హైదరాబాద్: అసెంబ్లీలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గొంతు నొక్కేసిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ...అన్ని వర్గాల ప్రజల సమస్యలపై టీడీపీ పోరుయాత్ర చేస్తోందని, ప్రతి రెండు నెలలకు ఒక సభ నిర్వహిస్తామని రేవూరి తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ లో సీపీఎం నిర్వహిస్తోన్న మహాజన పాదయాత్రకు టిడిపి మద్దతు తెలుపుతోందన్నారు. వరంగల్ జిల్లాలో సీపీఎం పాదయాత్ర ముగిసే వరకు టిడిపి శ్రేణులు తమ్మినేని వెంట నడుస్తాయి తెలిపారు. సామాజిక శక్తులు, రాజకీయ పార్టీలను కలుపుకుని ప్రభుత్వం పై పోరాడుతామన్నారు.

10:13 - December 9, 2016

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడంపై సినీ నటి 'గౌతమి' పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏకంగా లేఖ రాశారు. ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' తో సహజీవనం చేసిన 'గౌతమి' ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దాదాపు 75 రోజుల పాటు చికిత్స పొందిన 'జయ' మృతి చెందడం పట్ల అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి పలువురికి అనుమానాలున్నాయని తెలుస్తోంది. కానీ నటి 'గౌతమి' మాత్రం ఏకంగా ప్రధానికి లేక రాయడం కలకలం సృష్టిస్తోంది. ‘అమ్మ' ఆరోగ్యం విషయంలో మొత్తం కప్పి ఉంచారని, ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమె ముఖాన్ని ఎవరికీ చూపించలేదని పేర్కొన్నారు. తమిళనాడు సీఎం అయిన ఆమె ఆరోగ్య విషయంలో ఎందుకంత గోప్యత పాటించారని, ఆమెకు అందించాల్సిన చికిత్సల గురించి నిర్ణయాలు ఎవరు తీసుకున్నారని లేఖలో ప్రశ్నించారు. ప్రజల మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నాయకుల గురించి సమాచారాన్ని తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉంటుందని తెలిపారు. తన ఆవేదనను మోడీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇంకా లేఖలో పలు విషయాలు 'గౌతమి' తెలియచేశారు. 

10:06 - December 9, 2016

నిజామాబాద్ : పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా..సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర నిజామాబాద్‌లో జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికే 53 రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ఇప్పటివరకు 1350 కిలోమీటర్లు పర్యటించింది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు.

ఒక్క ఊళ్లో కూడా ఇల్లు కట్టిన దాఖలాలు లేవు : తమ్మినేని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పారని ..సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రైతుల రుణమాఫీ తోపాటు డబుల్‌ బెడ్‌రూంలపై ఊరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం .. ఒక్క ఊళ్లో కూడా ఇల్లు కట్టిన దాఖలాలు లేవని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న సీఎం కార్మికులను, రైతులను మోసం చేశారని తమ్మినేని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లల చదువులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను కూడా ఇవ్వడం లేదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.

పోడు భూములు లాక్కోవటం సమంజసమా : గిరిజన నేత నైతం రాజు
పల్లెపల్లెలో పర్యటిస్తున్న పాదయాత్ర బృందానికి ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. స్వరాష్ట్రం సిద్ధించినా సమస్యలు పరిష్కారం కావడం లేదని వినతుల ద్వారా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరితహారం పేరుతో గిరిజనుల పోడుభూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఆదివాసీ గిరిజన సంఘం నేత నైతం రాజు విమర్శించారు. గిరిజనులు పోడు భూముల్లో వ్యవసాయం చేసి అన్నం పెడుతుంటే... కేసీఆర్‌ వారి నుంచి భూముల్ని లాక్కోవడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌కు తమ్మనేని మరో లేఖ
53 వ రోజు నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర... తాటాపూర్‌, బాపూనగర్‌, నెహ్రూనగర్‌, జానకం పేట, సారంగాపూర్‌, అర్పపల్లిలో నిజామాబాద్‌ పట్టణాల్లో సాగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఎస్టీ సబ్‌ ప్లాన్‌ పై సీపీఎం సీఎం కేసీఆర్‌కు తమ్మనేని లేఖ రాశారు. ఇప్పటివరకు పాదయాత్ర మొత్తం 1350 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 

09:55 - December 9, 2016

హైదరాబాద్ : ప్రమాదం జరగటంపై హోంమంత్రి నాయిని తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు చర్యలుచేపడతామన్నారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని హోమంత్రి.. కమిషనర్ జనార్థన్ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 13 మంది కూలీలు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. రాత్రి నుంచి పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటనాస్థలాన్ని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు పరిశీలించారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దుర్ఘటనపై సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌కు ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు. సహాయకచర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఆరు కుటుంబాలకు చెందిన 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. భవనం కూలిన సమయంలో పెద్ద శబ్ధం రావడంతో భయాందోళనకు గురైనట్లు లోథా బస్తీవాసులంటున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న కూలీలంతా ఛత్తీస్‌గఢ్‌, విశాఖకు చెందినవారుగా తెలుస్తోంది. భవన యజమాని సత్యనారాయణసింగ్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. 

09:52 - December 9, 2016

హైదరాబాద్ : నానక్ రామ్ గూడలో భవనం కూలిన ఘటనలో బాధ్యులపై చర్యలకు..బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇంకా పలువురు మంత్రులు..ఎమ్మెల్యేలు ఈ ఘటన బాధాకరమని తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటువంటి ఘటనలు పలుమార్లు పునరావృతం అవుతున్నా వీరుమాత్రం ఉత్తర కుమారుడి కోతలు కోస్తూనే వున్నారు..నిరుపేదల బతుకులు కూలిపోతూనే వున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈప్రమాదంలో ఒకరు మృతిచెందగా సహాయక సిబ్బంది ఇద్దరిని రక్షించారు. శిథిలాల కింద మరో 13 మంది కూలీలు చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. వీరిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది. జీహెచ్‌ఎంసీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెండు జేసీబీల ద్వారా శిథిలాలను తొలగిస్తున్నారు. కాగా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం కేసీఆర్ మంత్రులను, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.రాత్రి నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హోమంత్రి నాయిని నర్శింహారెడ్డి, డిప్యూటీ సీఎం, మహమూద్ అలీ, మంత్రి పద్మారావు, జీహెచ్ ఎంసీ కమిషన్ జనార్థన్ రెడ్డి పలవురు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. 

నగరంలో కూలిపోయిన మరో భవనం..

నగరంలో మరో భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కూడా పొట్టకూటికోసం వచ్చిన కూలీలే బలయ్యారు. నగరంలో ఇటువంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసే నాయకులు అధికారులు భవనాలకు అనుమతులు ఇచ్చే సమయంలో గానీ..నిర్మాణంలోగానీ ఎటువంటి నిజాయితీ నాణ్యతా చూపించకపోవటంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి..శిథిలాలలో నిరుపేద కూలీల బతుకులు తెల్లారిపోతున్నాయి. ఇటువంటి ఘటనే నానక్‌రాంగూడలో చోటుచేసుకుంది. కేవలం 250 గజాల స్థలంలో ఏకంగా ఏడు అంతస్తుల భవనం గురువారం రాత్రి కుప్పకూలిపోయింది. ఈఘటనలో శిథిలాలలో పలువురు కూలీలు చిక్కుకుపోయారు.ఈ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న మంత్రులు అధికారులు..ఎమ్మెల్యేలు నాయకులు బాధిలకు న్యాయం చేసేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ భవన నిర్మాణంలో పాల్గొంటున్న దాదాపు 14 కూలీల కుటుంబాలు దీంట్లోనే నివాసంమున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు,ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి. ఇప్పటికే కొంతమందిని సహాయక బృందం రక్షించారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

నేడు ఓటుకు నోటు కేసులో బాబు పాత్రపై తీర్పు

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు పాత్రపై దర్యాఫ్తు చేయాలా? వద్దా? అన్న విషయమై నేడు హైకోర్టు తీర్పివ్వనుంది. ఈ కేసులో ఏసీబీ దర్యాఫ్తు సరిలేదంటూ, వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై చంద్రబాబు స్టే తెచ్చుకోగా, సుప్రీంకోర్టు కల్పించుకున్న సంగతి తెలిసిందే. 

రక్షణ రంగంలో ఇండియానే కీలకభాగస్వామి :అమెరికా

హైదరాబాద్ : భారత్ తమకు రక్షణ రంగంలో అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశమని అమెరికా అభివర్ణించింది. తన ఇండియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో సమావేశమైన అమెరికా రక్షణ మంత్రి ఆస్టన్ కార్టర్, మీడియాతో మాట్లాడుతూ, ఇరు దేశాలూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే దిశగా మరింత సహాయ సహకారాలు అందించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

09:37 - December 9, 2016

టాలీవుడ్ కు పరిచయమైన పలువురు హీరోలు..హీరోయిన్లు ఇతర వుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరిరీక్షించుకుంటుంటారు. అందులో కొందరు సక్సెస్ అవుతుంటారు. తమిళ..కన్నడ..మలయాళం..ఇతర భాషల్లో చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో 'త్రిష' చేరింది. టాలీవుడ్ అగ్ర హీరోలతో ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఎంట్రీ అయి దాదాపు 17 ఏళ్లు అవుతోంది. తమిళం. తెలుగు..కన్నడ..హిందీ భాషాల్లో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మలయాళ చిత్రసీమకు 'త్రిష' పరిచయం కాబోతోంది. నివీన్ పౌలి కథానాయకుడిగా శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో 'త్రిష' హీరోయిన్ గా నటించనుంది. మాలీవుడ్ లో అడుగు పెట్టడం పట్ల ఈ ముద్దుగుమ్మ ఆనందం వ్యక్తం చేస్తోంది. ట్విట్టర్ ద్వారా పలు ట్వీట్స్ చేసింది. మరి ఈ చిత్రం ద్వారా సక్సెస్ అందుకుంటుందా ? లేదా ? అనేది చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

09:36 - December 9, 2016

హైదరాబాద్ : పాత పెద్ద నోట్లు రద్దు చేసిన 30 రోజులు గడిచాయి..నేడు 31వరోజు కొనసాగుతోంది. ఏటీఎంలలో..బ్యాంకులలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రభావం ధనవంతులకంటే నిరుపేదలపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది.చిరువ్యాపారులు..కూలీలు..రైతులు..రైతు కూలీలు..చేనేతరంగం..పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్.. ఇలా నగదు కష్టాలు పడని రంగమంటూ లేకుండాపోయింది. రోజువారీ కూలీ చేసుకుని బతుకులు వెళ్ళదీసే అడ్డాకూలీల బతుకులు తీవ్ర సంక్షోభంలో పడిపోయాయి. పని దొరకక దొరికిన పనికి చెల్లుబాటయ్యే నోట్లు చేతికి రాక నానా అగచాట్లూ పడుతున్నారు. రెక్కాడితేనే గానీ డొక్కాడని అడ్డా కూలీలు నోట్ల రద్దుతో నానా అవస్థలు పడుతున్నారు. 

జైట్లీతో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, పెద్దనోట్ల రద్దు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

అందరి దృష్టీ హైకోర్టు వైపే ఎందుకు?..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు పాత్రపై దర్యాఫ్తు చేయాలా? వద్దా? అన్న విషయమై నేడు హైకోర్టు తీర్పివ్వనుంది. ఈ కేసులో ఏసీబీ దర్యాఫ్తు సరిలేదంటూ,వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై చంద్రబాబు స్టే తెచ్చుకోగా, సుప్రీంకోర్టు కల్పించుకున్న సంగతి తెలిసిందే. నెల రోజుల్లోగా వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. దీంతో అక్టోబర్ లో వాద ప్రతివాదనలు జరిగాయి. తీర్పు డిసెంబర్ 9కి వాయిదా పడింది...దీనిపై ఎటువంటి తీర్పు వెలువడనుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

పొగమంచుతో పలు విమానాలు ఆలస్యం..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ, గోవా, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖ వెళ్లాల్సిన విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. 

కూలినభవన ఘటనలో ఒకరు మృతి..

హైదరాబాద్‌: నగరంలోని నానక్‌రాంగూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఓ చిన్నారిని సహాయ బృందాలు రక్షించాయి. ఛత్తీస్ ఘడ్ కు చెందిన రేఖ అనే మహిళను శివను రక్షించారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు శిథిలాల కింద నుంచి తమను రక్షించాలంటూ క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో శిథిలాల కిందకు పైపుల ద్వారా ఆక్సిజన్‌ పంపుతున్నారు. బాధితులు ఛత్తీస్‌గఢ్‌, విజయనగరం జిల్లా బొబ్బిలి, చిలకలపల్లి వాసులుగా తెలుస్తోంది.

09:30 - December 9, 2016

నోట్ల రద్దు చేనేతరంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అసలే అంతంత మాత్రంగా వున్న చేనేత బతుకులు నోట్ల రద్దుతో మరింత దుర్భరంగా మారుతున్నాయి. సాధారణ రోజుల్లోనే చేనేత కార్మికులకు పోషకాహారలోపం వుండేది. ఇప్పుడు ఆ మాత్రం కూడా భుజించలేని పరిస్థితి ఎదురువుతోంది. నోట్ల రద్దు నేపథ్యంలో చేనేత రంగం కార్మికులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చించేందుకు చేనేత కార్మిక సంఘం నేత నర్సింహారెడ్డి వివరించారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

09:29 - December 9, 2016

గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ముఖ్యంగా స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామనీ..అవినీతిపరుల్ని వదిలిపెట్టమని సర్కార్ ఎప్పటికప్పుడు ఊకదంపుడు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. నానక్ రామ్ గూడలో గతనెల సెప్టెంబర్ లో నిర్మాణం ప్రారంభమైయింది. కేవలం 250 గజాల్లో ఏడంతస్థుల భవన నిర్మాణం చేపట్టారు. నిజాయితీగా వ్యవహరిస్తే ఇటువంటి భవనాలకు అనుమతులు వచ్చే అవకాశం లేదు. అనుమతులు గ్రాంట్ అవ్వటం..నిర్మాణం చేపట్టటం..రెండునెలల్లోనూ భవనం కూలిపోయింది. నిరుపేత కూలీల బతుకులు శిథిలాల్లో చిక్కుకుపోయాయి. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నంద్యాల నర్శింహారెడ్డి (సీపీఎం నేత),కైలాశ్ (టీ.పీసీసీ అధికార ప్రతినిథి),శ్రీనివాస్ (బీజేపీ నేత) పాల్గొన్నారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావని చర్చలో పాల్గొన్న సీపీఎం నేత నంద్యాల నర్శింహారెడ్డి పేర్కొన్నారు. మరింత సమచారం కోసం ఈ వీడియో చూడండి..

ఎయిర్‌పోర్టులో భారీగా నగదు పట్టివేత..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద రూ.10 లక్షల నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసకున్నారు. సదరు ప్రయాణికుడు గురువారం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. నిబంధనలకు విరుద్ధంగా పెద్దమొత్తంలో కరెన్సీని తరలించేందుకు ప్రయత్నిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ మేరకు అతని వద్ద ఉన్న కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 

కొనసాగుతున్న సహాయక చర్యలు..

హైదరాబాద్ : నానక్‌రామ్‌గూడలో కూలిన భవనం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించేందుకు పోలీసులు..ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరిని సురక్షితంగా రక్షించారు. మరో 13మంది శిథిలాలో చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. శిథిలాలలో చిక్కుకున్నవారికి ఆక్సిజన్ ను పంపిస్తూ వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. రాత్రి నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హోమంత్రి నాయిని నర్శింహారెడ్డి, డిప్యూటీ సీఎం, మహమూద్ అలీ, మంత్రి పద్మారావు, జీహెచ్ ఎంసీ కమిషన్ జనార్థన్ రెడ్డి పలవురు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. 

09:27 - December 9, 2016

హైదరాబాద్ : గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 13 మంది కూలీలు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. రాత్రి నుంచి పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటనాస్థలాన్ని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు పరిశీలించారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దుర్ఘటనపై సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌కు ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు. సహాయకచర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఆరు కుటుంబాలకు చెందిన 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. భవనం కూలిన సమయంలో పెద్ద శబ్ధం రావడంతో భయాందోళనకు గురైనట్లు లోథా బస్తీవాసులంటున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న కూలీలంతా ఛత్తీస్‌గఢ్‌, విశాఖకు చెందినవారుగా తెలుస్తోంది. భవన యజమాని సత్యనారాయణసింగ్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుందని.. ప్రమాద ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. భవన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

07:12 - December 9, 2016

హైదరాబాద్ : గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 13 మంది కూలీలు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. రాత్రి నుంచి పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటనాస్థలాన్ని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు పరిశీలించారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దుర్ఘటనపై సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌కు ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు. సహాయకచర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఆరు కుటుంబాలకు చెందిన 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. భవనం కూలిన సమయంలో పెద్ద శబ్ధం రావడంతో భయాందోళనకు గురైనట్లు లోథా బస్తీవాసులంటున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న కూలీలంతా ఛత్తీస్‌గఢ్‌, విశాఖకు చెందినవారుగా తెలుస్తోంది. భవన యజమాని సత్యనారాయణసింగ్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుందని.. ప్రమాద ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. భవన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

భవనం కూలిన ఘటనపై సీఎం కేసీఆర్ విచారం..

ఢిల్లీ : నానక్ రామ్ గూడలో భవనం కూలిన ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయాన్ని తీసుకోవాలని హైదరాబాద్ లోని అధికారులకు ఢిల్లీ నుండి కేసీఆర్ ఫోన్ ద్వారా ఆదేశించారు.  

కూలిన భవనం..శిథిలాలలో కూలీలు..

హైదరాబాద్ : నానక్‌రాంగూడలోని ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో పలువురు కూలీలు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు,ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి. 

Don't Miss