Activities calendar

08 December 2016

22:11 - December 8, 2016

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల తీరుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు పదేపదే వాయిదా పడడంపై ప్రణబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో సమావేశాలను అడ్డుకోవడం అంగీకారయోగ్యం కాదన్నారు. ప్రజలు పార్లమెంటుకు పంపించింది... ధర్నాలు చేయడానికి కాదని చురకలంటించారు. సభలో చర్చించే హక్కు ఎంపీలకు ఉంటుందన్న ప్రణబ్‌... సభ ఉన్నది చర్చ జరపడానికే అని స్పష్టం చేశారు. 

 

22:09 - December 8, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉభయ సభల్లోనూ పెద్దనోట్లపైచర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని నరేంద్రమోది సభలో సమాధానం చెప్పాలని విపక్షసభ్యులు గందరగోళం సృష్టించారు. దీనిపై ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
విపక్షాల ఆందోళన 
పెద్దనోట్ల రద్దుపై పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష పార్టీల సభ్యులు ఆందోళన చేపట్టారు. పెద్దనోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... 15రోజులుగా విపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తున్నాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎదురుదాడికి దిగారు.
ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం : ఆజాద్‌ 
వెంకయ్య వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ గులాంనబీ ఆజాద్‌ తప్పుబట్టారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు నిల్చుని  జనం మృతిచెందడం  ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత సుమారు వంద మందికి పైగా మరణించారని.. వారికి సభలో నివాళులర్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ఆజాద్‌ విమర్శించారు. సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేశారు.
లోక్‌సభలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ 
లోక్‌సభలో కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది.  పెద్దనోట్ల రద్దు అంశంపై  సభ ప్రారంభం నుంచే విపక్షాలు ఆంళనకు దిగాయి. సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ప్రధాని మోది సభకు రావాలని విపక్ష సభ్యులు నినాదాలతో  హోరెత్తించారు. దీంతో సభ మధ్యాహ్నం వరకు రెండు సార్లు సభ వాయిదా పడింది.
నోట్ల రద్దుపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు  
తిరిగి సభ రెండుగంటలకు ప్రారంభమయ్యాక కూడా సభలో ఎలాంటి మార్పు లేదు. తాము చర్చకు సిద్ధమేనని కేంద్రమంత్రి అనంతకుమార్‌ చెప్పారు. 184 నిబంధన ప్రకారం చర్చ జరపాలన్న ఖర్గే డిమాండ్‌ను స్పీకర్‌ తిరస్కరించారు. విపక్ష సభ్యులు నోట్ల రద్దుపై చర్చకు పట్టుబట్టారు. ప్రధాని మోది సభకు రావాలని నినాదాలు చేశారు. 
కాంగ్రెస్ పై జైట్లీ విమర్శలు
2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం నల్లధనం అంశంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విమర్శించారు. జైట్లీ మాట్లాడుతున్నంత సేపు విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.  ప్రతిపక్ష సభ్యుల గందరగోళం నడుమ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

 

22:04 - December 8, 2016

గుంటూరు : ఆరోగ్యశ్రీపై చర్చకు సిద్ధమంటూ మంత్రి కామినేని శ్రీనివాస్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని....వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.  టైమ్, ప్లేస్ వెల్లడిస్తే చర్చకు వచ్చేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:01 - December 8, 2016

హైదరాబాద్ : సామాన్యుడు ఒకేఒక్క... రెండు వేల రూపాయల నోటు కోసం.. రోజుల కొద్దీ క్యూలైన్‌లో నించుంటుంటే.. పాలకవర్గానికి చెందిన పెద్దలు మాత్రం.. కోట్లకొద్దీ నల్లధనాన్ని కొత్త నోట్లలోకి మార్చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు శేఖరరెడ్డి వద్ద లభించిన భారీ పైకమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. అవును.. ఒకటికాదు రెండు కాదు... ఏకంగా 70కోట్ల రూపాయల కొత్తనోట్లు... వందకిలోల బంగారం... 20కోట్ల రూపాయల పాత నగదు.. 400కోట్ల విలువైన దస్తావేజులు... శేఖరరెడ్డి అతని స్నేహితుల వద్ద లభించింది. ఈ సంపదను చూసి ఐటీ అధికారులే నివ్వెరపోయారు.. ఇదంతా ఎలా సంపాదించారోనన్న వివరాలు ఆరా తీస్తున్నారు. 
బ్లాక్‌ దొంగల బాగోతం 
పెద్దనోట్ల రద్దుతో నల్లధనం మొత్తం బయటకు వస్తుందని కమలనాథులు విపరీతమైన ప్రచారం చేశారు. అయితే.. ఇప్పుడు అదంతా ఒట్టిదేనని తేలుతోంది. నిన్నటికి నిన్న గాలి జనార్దనరెడ్డి వంద కోట్ల రూపాయల పాతనోట్లను కొత్తనోట్లుగా మార్చుకున్నట్లు బయటపడితే.. తాజాగా టీటీడీ బోర్డు సభ్యుడు శేఖరరెడ్డి ఏకంగా 70 కోట్ల రూపాయల పాత నోట్లను కొత్తనోట్లతో మార్పిడి చేసుకున్నట్లు వెలుగు చూసింది. ఆదాయపన్నుశాఖ దాడులతో బ్లాక్‌ దొంగల బాగోతం బయట పడింది. 
తెలుగు బడా పారిశ్రామికవేత్తల ఇళ్లలో ఐటీ రెయిడ్స్
చెన్నైలోని తెలుగు బడా పారిశ్రామికవేత్తలు శేఖర్‌ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ప్రేమ్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కలు చూపని 90 కోట్ల నగదు, వందకిలోల బంగారు ఆభరణాలు, 400 కోట్ల రూపాయల విలువైన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నానగర్‌, టి. నగర్‌ సహా 8 చోట్ల జరిపిన ఈ సోదాల్లో 60మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు.. ముగ్గురు పారిశ్రామికవేత్తలను అదుపులోనితీసుకున్న వివరాలు సేకరిస్తున్నారు.. శేఖరరెడ్డి వద్ద పట్టుబడిన 90 కోట్ల నగదులో.. 70 కోట్ల మేర కొత్త నోట్లే ఉండడం.. పెద్దనోట్ల రద్దు ఎంత ప్రహసనంగా మారిందో తేటతెల్లం చేస్తోంది. 
రూ. 70కోట్ల కొత్తనోట్లు, రూ. 20కోట్ల పాతనోట్లు లభ్యం
కొత్తనోట్ల దొరక్క సామాన్యులు ఇబ్బందిపడుతుంటే ఈ వ్యాపారుల వద్దకు ఏకంగా 70కోట్ల రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు అధికారులు ఎవరైనా సహకరించారా అన్నకోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.. టీటీడీ సభ్యుడిగా ఉన్న శేఖర్‌ రెడ్డి.. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ లోకి సులువుగా వెళ్లగలిగే అతికొద్ది మందిలో శేఖర్ రెడ్డి ఒకరని కొందరు నేతలు చెబుతున్నారు.. శేఖర్ రెడ్డి తమిళనాడులో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తున్నట్లు సమాచారం.

 

21:54 - December 8, 2016

క్యూ కష్టాలు తీరలేదు.... ఏటీఎం బాధలు తగ్గలేదు.. చిల్లర సమస్య పోలేదు.. 30 రోజుల అచ్ఛేదిన్..!! ఈ అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథన.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:50 - December 8, 2016

మిర్యాలగూడ పబ్లిక్ తో మల్లన్న ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే.. 'పెద్ద నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్లు రద్దయ్యాయి. భూములు, మిల్లు కోనుగోలులో పంచాయతీలు అవుతున్నాయి. మోడీ నిర్ణయం చాలా దుర్మార్గం. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కార్మికులు, కూలీలు, రైతులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

టీఅసెంబ్లీ సమావేశాల నిర్వహణ కమిటీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియ శ్రీహరి ఇంట్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కమిటీ  సమావేశం అయ్యారు. సభ నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహంపై కమిటీ చర్చింది. ఈనెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

 

21:26 - December 8, 2016

మెగాస్టార్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్‌ 150 టీజర్‌ కేక పుట్టిస్తోంది. 'నాకు నచ్చితేనే చేస్తా'... అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్‌ దుమ్మురేపుతోంది. వీవీ.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మూవీ యూనిట్‌ ప్రయత్నాలు చేస్తోంది.

 

21:21 - December 8, 2016

విశాఖ : బంగాళాఖాతంలో పెను తుఫాను ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో ఉత్తరంగా కదిలి తుపానుగా మారింది. రేపటిలోగా పెను తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతవరణశాఖ అంచనా వేస్తున్నారు. ఈ తుపానుకు వార్దా అని పేరుపెట్టారు. ప్రస్తుతం వార్దా తుపాను బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 1060 కి.లో మీటర్ల దూరంలో,..మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 1150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వార్ధా తుపాన్ ప్రభావంపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:20 - December 8, 2016

ఢిల్లీ : హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రెండో విడత నిధులు విడుదల చేయాలని ఆయన జైట్లీని కోరారు. సమావేశంలో... పెద్ద నోట్ల రద్దు అంశాలపై కూడా చర్చ జరిగింది. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్... రేపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. అవకాశాన్ని బట్టి ప్రధాని మోదీతో కూడా కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. 

 

తెలంగాణ 3 సాగునీటి పథకాల కోసం కేంద్రం రూ.226.67 కోట్లు విడుదల

ఢిల్లీ : తెలంగాణకు చెందిన 3 సాగునీటి పథకాల కోసం కేంద్రం ఏఐబీపీ కింద రూ.226.67 కోట్లు విడుదల చేసింది. దేవాదుల ప్రాజెక్టుకు రూ.170 కోట్లు, రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకానికి రూ.54 కోట్లు, మత్తడివాగు రూ.2.67 కోట్లు విడుదల చేసింది. నిధుల విడుదల పట్ల తెలంగాణ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. 

 

నితిన్ గడ్కరీ కూతురు రిసెప్షన్ కు హాజరైన సీఎం కేసీఆర్, ఎంపీలు

ఢిల్లీ : నితిన్ గడ్కరీ కూతురు రిసెప్షన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీలు హాజరయ్యారు.

21:04 - December 8, 2016

హైదరాబాద్ : నగదు కొరత.. ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది. నెలరోజులుగా వేచి చూస్తున్నా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడక పోవడం ప్రజల ఆగ్రహాన్ని రెట్టింపు చేస్తోంది. మొన్నటిదాకా మోదీకి జయహో అన్న వారు కూడా.. వాస్తవ పరిస్థితి అవగతమై కమలనాథుడిపై విరుచుకు పడుతున్నారు.  కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న సొమ్ములోంచి కేవలం రెండువేల రూపాయలు విత్‌ డ్రా చేసుకోవడానికీ వీల్లేని దుస్థితి ఓవైపు.. బడాబాబులు వందల కోట్లు నల్లధనాన్ని కొత్తనోట్లతో మార్చేసుకున్నారన్న వార్తలు మరోవైపు.. ప్రజల కోపాన్ని తారాస్థాయికి పెంచుతోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నా డబ్బు దొరకని పరిస్థితిలో గొడవలు పెచ్చు మీరుతున్నాయి. 
తీరని నోట్ల కష్టాలు
నెల గడిచినా.. ప్రజల నోట్ల కష్టాలు తీరడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు రోజల తరబడి లైన్లలో నిలబడ్డా డబ్బులు దొరకడం లేదు. దీంతో జనం తీవ్ర అసహనానికి గురై తిరగబడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నగదు దొరక్క చిరు వ్యాపారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ముందుచూపు లేకుండా నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంపన్నులు, బడా బాబులకు ఇంటి వద్దకే వచ్చి చేరుతున్న కొత్త నోట్ల కట్టలు.. పేదలు, మధ్యతరగతి వారికి మాత్రం అందుబాటులోకి రావడం లేదు. 
మాజీ సైనికుడిపై కానిస్టేబుల్ దాడి 
నగదు సమస్యలతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. దీంతో కొన్ని చోట్ల దాడులకు దిగుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.  కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో మాజీ సైనికుడిపై బ్యాంకు ముందు ఓ కానిస్టేబుల్ దాడికి దిగాడు. బ్యాంకు ఇంకా ఎందుకు తెరవలేదన్నందుకు మాజీ సైనికుడిపై ఈ దాడి జరగడం గమనార్హం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఓ బ్యాంకులో దోపిడీకి పాల్పడి పది లక్షల కొత్త నోట్లను ఎత్తుకెళ్లారు.  
బ్యాంకులు, ఏటీఎంల వద్ద జన జాతర     
నోట్ల రద్దు జరిగి నెల గడుస్తున్నా .. బ్యాంకులు ఏటీఎంల వద్ద జన జాతర తగ్గలేదు. పైగా నెలలో మొదటి వారం కావడంతో జనాల సంఖ్య మరింత పెరిగింది. వృద్ధులు, వికలాంగులు తమ ఖాతాల్లో పడిన పింఛన్ డబ్బులు తీసుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులు, పెన్షన్‌దారులతో పాటు  రైతులు సైతం బ్యాంకుల వద్ద పడిగాపుల పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఉద్యోగులు, పెన్షన్‌ దారులు, రైతులు ఆందోళన    
ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం ఇండియన్‌ బ్యాంకు ఎదుట ఉద్యోగులు, పెన్షన్‌ దారులతో పాటు రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి డబ్బులకోసం పడిగాపులు పడితే రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారంటూ జనం సిబ్బందిని నిలదీశారు.  బ్యాంకుల వద్ద పెరిగిన రద్దీ శ్రీకాకుళం జిల్లా లో ఓ వృద్ధుణ్ణి బలి తీసుకుంది. కవిటి మండలం బోరివంక లోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ వద్ద క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్న వరక గ్రామానికి చెందిన కోగా బెహరా అనే వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు.  అక్కడున్నవారు ప్రథమ చికిత్స అందించే లోపే ఆయన మృత్యువాత పడ్డాడు. 
మోడీ సర్కార్ పై పలు విమర్శలు 
బ్లాక్ మనీ భరతం పట్టేందుకే  పెద్ద నోట్లు రద్దు చేపట్టామని చెబుతున్న సర్కారు.. దిగువ, మధ్య తరగతి ప్రజల కష్టాలను మర్చిపోయిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న నోట్లు తగినన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
కొనసాగుతూనే నోట్ల కష్టాలు  
కడప జిల్లాలో నోట్ల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగదు కోసం ప్రజలు రాత్రనక, పగలనక పడిగాపులు కాస్తూ జాగారం చేస్తున్నారు. వేకువ జామునే బ్యాంకుల వద్దకు మహిళలు చిన్నపిల్లలను ఎత్తుకుని వచ్చి క్యూలో నిలబడుతున్నారు. ప్రజల అవసరాలకు తగ్గ డబ్బు లేకపోవడంతో చాలా బ్యాంకుల్లో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో చాలాచోట్ల జనం తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. బ్యాంకు సిబ్బంది డబ్బులు లేవని చెపుతుండటంతో మహిళలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న ప్రజలు  
ప్రభుత్వం ప్రజలకు సరిపడా నగదును పంపిణీ చేయడంలో తీవ్రంగా విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదంటే జనాగ్రహానికి గురికావాల్సి వస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 

20:58 - December 8, 2016

కర్నాటక : పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు దాటినా ప్రజలకు నోట్ల కష్టాలు తప్పడం లేదు. కర్ణాటకలో బ్యాంకు ఎదుట సెక్యూరిటీ గార్డు ప్రజలపై దాడులకు పాల్పడ్డాడు. ఉదయం పది దాటినా బ్యాంకు ఇంకా తెరలేదని మాజీ సైనిక ఉద్యోగి ప్రశ్నించడంతో సెక్యూరిటీ గార్డు దాడికి పాల్పడ్డాడు. దీనిపై మాజీ సైనిక ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు.

 

20:52 - December 8, 2016

చిత్తూరు : చెన్నైలో టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 90 కోట్ల నగదు, 100 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటిలో 70 కోట్లు కొత్త నోట్లు ఉండటం విశేషం. చెన్నై, వేలూరులోని శేఖర్‌రెడ్డికి చెందిన ఇళ్లతో పాటు.. ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. శేఖర్ రెడ్డి సన్నిహితులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రేమ్‌రెడ్డి ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శేఖర్‌రెడ్డి ఇసుక, మైనింగ్‌ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో 60 మంది అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:48 - December 8, 2016

ఢిల్లీ : పెద్దనోట్లు రద్దైన నేపథ్యంలో దేశప్రజలంతా డిజిటల్‌ లావాదేవీలపై మళ్లాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి, నగదు రహిత లావాదేవీల కమిటీ కన్వీనర్ చంద్రబాబు అన్నారు. నగదు రహిత లావాదేవీలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం అత్యంత సానుకూల వాతావరణంలో సాగిందన్నారు చంద్రబాబు. శుక్రవారం మరోసారి సమావేశం అవుతున్నామన్న చంద్రబాబు.. తాము సూచించిన అంశాలపై ప్రధానికి నివేదిక సమర్పిస్తామన్నారు. డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌పై కేంద్రం అనేక డిస్కౌంట్లు ప్రకటించడం శుభపరిణామన్నారు నీతి ఆయోగ్‌ వైఎస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా. ఈ నిర్ణయం భవిష్యత్తులో డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన మొదటి సమావేశంలో వివిధ బ్యాంకుల అధికారులు, నీతి ఆయోగ్‌ వైఎస్‌ చైర్మన్‌, సీఈవో, కమిటీలో సభ్యులుగా ఉన్న ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 

 

20:42 - December 8, 2016

పశ్చిమగోదావరి : పరిశ్రమలవల్ల పెరిగిపోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాలో సీపీఎం పాదయాత్ర చేపట్టింది. తణుకులో ప్రారంభమైన ఈ పాదయాత్ర 13రోజులపాటు కొనసాగింది. 16 మండలాల్లో 380కి.మీ. యాత్ర కొనసాగింది. రేపు ఏలూరు కలెక్టర్‌ కార్యాలయంముందు మహాధర్నా చేయబోతున్న సీపీఎం బృందం కొల్లేరుకు చేరుకుంది.

 

20:39 - December 8, 2016

తమిళనాడు : చెన్నైలో టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 90 కోట్ల నగదు, 100 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటిలో 70 కోట్లు కొత్త నోట్లు ఉండటం విశేషం. చెన్నై, వేలూరులోని శేఖర్‌రెడ్డికి చెందిన ఇళ్లతో పాటు.. ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. శేఖర్ రెడ్డి సన్నిహితులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రేమ్‌రెడ్డి ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శేఖర్‌రెడ్డి ఇసుక, మైనింగ్‌ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో 60 మంది అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నోట్ల మార్పిడి కేసులో ఏ1 నిందితుడు సిబిఐ ఎదుట హాజరు

హైదరాబాద్ : నోట్ల మార్పిడి కేసులో సిబిఐ ఎదుట ఏ1 నిందితుడు, పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ సుధీర్ బాబు హాజరయ్యారు. సుధీర్ బాబుపై సిబిఐ అధికారులు 3 కేసులు నమోదు చేశారు. 

 

ఆధార్ ఆధారిత లావాదేవీలపై చర్చించాం : నీతి ఆయోగో సీఈవో

ఢిల్లీ : ఆధార్ ఆధారిత లావాదేవీలపై చర్చించామని నీతి ఆయోగ్ సీఈవో తెలిపారు. డిజిటల్ లావాదేవీలపై విస్తృత ప్రచారం చేశామని చెప్పారు. క్యూ ఆర్ కోడ్ ఉపయోగించాలని బ్యాంకులను కోరామని తెలిపారు. మైక్రో ఏటీఎంలను పెంచాలని ఆర్బీఐకి సూచించామని పేర్కొన్నారు. 

 

19:47 - December 8, 2016

నోట్ల రద్దు పరిణామాలపై సీఎంల కమిటీ సమావేశం

ఢిల్లీ : నోట్ల రద్దు పరిణామాలపై సీఎంల కమిటీ చర్చించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

కనీస అవసరాలు మినహా మిగతావన్ని డిజిటల్ లావాదేవీలే : సీఎం చంద్రబాబు

ఢిల్లీ : కనీస అవసరాలు మినహా మిగతావన్ని డిజిటల్ లావాదేవీల ద్వారానే జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. డిజిటల్ లావాదేవీల విధివిధానాల రూపకల్పనపై చర్చించామని తెలిపారు. రేపు మరోసారి కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. 

 

19:33 - December 8, 2016
19:32 - December 8, 2016

నిజామాబాద్‌ : సీపీఎం మహాజన పాదయాత్ర 53 వ రోజుకు చేరుకుంది. నిజామాబాద్‌లో పర్యటిస్తున్న పాదయాత్ర బృందానికి ప్రజలు వినతులు అందిస్తున్నారు. ఈమేరకు పాదయాత్ర బృందం సభ్యుడు, ఆదివాసీ గిరిజన సంఘం నేత నైతం రాజు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. హరితహారం పేరుతో గిరిజనుల పోడుభూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:21 - December 8, 2016

హైదరాబాద్‌ : నగరంలో కాలుష్యం...నివారణపై వర్క్‌ షాపు నిర్వహించారు. కర్మన్‌ ఘాట్‌ నందనవనంలోని స్మాట్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ వర్క్‌ షాపులో సుమారు 18 దేశాల నుంచి ఇండియాలోని ఎన్డీఆర్‌ఐలో  శిక్షణ పొందుతున్న వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పరిశీలించారు. భారత దేశం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో కార్పొరేట్‌ కంపెనీలు ముందుకు వచ్చి కాలుష్య నివారణకు కృషి చేయాలని ప్రతినిధులు కోరారు. 

 

19:17 - December 8, 2016

ఢిల్లీ : క్యాష్ లెస్ లావాదేవీలపై దృష్టి సారించామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నోట్ల రద్దుపై ప్రజల నుంచి మంచి సహకారం వచ్చిందని తెలిపారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్యాష్ లెస్ లావాదేవీలు వేగవంతం చేస్తామని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై 40 శాతం క్యాష్ లెస్ లావాదేవీలు జరుపనున్నట్లు తెలిపారు. కార్డుల ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై పన్నులో 0.75 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిజిటల్ మోడ్ లోకి మారడం వల్ల రేట్లు తగ్గుతాయన్నారు. 
డిజిటల్ మనీ దిశగా కేంద్రం అడుగులు 
డిజిటల్ మనీ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. పదివేల మందికిగా పైగా ప్రజలు ఉన్న గ్రామాలకు స్వైపింగ్ మెషిన్లు అందుబాటులో ఉంటాయన్నారు. డిజిటల్ మోడ్ లో రైల్వే టికెటింగ్ తీసుకున్న వారికే రూ.10 లక్షల భీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. డిజిటల్ పద్ధతిలో తీసుకునే నెలవారి రైల్వేపాసులు రేటు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ మోడ్ లో తీసుకున్న జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలపై 10 శాతం ప్రీమియం తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ..పేమెంట్ చేసే జీవన్ బీమాపై 8 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. 4.32 కోట్ల మంది రైతులకు రూపే కార్డులు అందజేస్తామని చెప్పారు. ఆన్ లైన్ లో టోల్ ఫీజు చెల్లిస్తే 10 శాతం రాయితీ  ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

క్యాష్ లెస్ లావాదేవీలు వేగవంతం : అరుణ్ జైట్లీ

ఢిల్లీ : క్యాష్ లెస్ లావాదేవీలు వేగవంతం చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెట్రోల్, డీజిల్ పై 40 శాతం క్యాష్ లెస్ లావాదేవీలు జరుపనున్నట్లు తెలిపారు. కార్డుల ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై పన్నులో 0.75 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిజిటల్ మోడ్ లోకి మారడం వల్ల రేట్లు తగ్గుతాయన్నారు. 

 

18:52 - December 8, 2016
18:50 - December 8, 2016

చిత్తూరు : చెన్నైలో టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 90 కోట్ల నగదు, 100 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటిలో 70 కోట్లు కొత్త నోట్లు ఉండటం విశేషం. చెన్నై, వేలూరులోని శేఖర్‌రెడ్డికి చెందిన ఇళ్లతో పాటు.. ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. శేఖర్ రెడ్డి సన్నిహితులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రేమ్‌రెడ్డి ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శేఖర్‌రెడ్డి ఇసుక, మైనింగ్‌ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో 60 మంది అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:29 - December 8, 2016

ప్రతి చేనేత మగ్గానికి, మరమగ్గానికి పని కల్పిస్తాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ప్రతి చేనేత మగ్గానికి, మరమగ్గానికి పని కల్పిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లా కేంద్రంలో గోల్కొండ పేరిట చేనేత, హస్తకళ షోరూంను ప్రారంభిస్తామని చెప్పారు. మల్కాపురం టెక్స్ టైల్ పార్కును మరింత విస్తరిస్తామన్నారు.

అరుణ్ జైట్లీతో సీఎం కేసీఆర్ సమావేశం

ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. నోట్ల రద్దు పరిణామాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. 

 

శేఖర్ రెడ్డి వ్యవహారంపై ఏపీ సీఎంవో ఆరా

చెన్నై : టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి వ్యవహారంపై ఏపీ సీఎంవో ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధాలున్నాయని ఆరా తీస్తున్నారు. శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.90 కోట్ల నగదు, 100 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. 

18:11 - December 8, 2016
18:09 - December 8, 2016

చిత్తూరు : టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి వ్యవహారంపై ఏపీ సీఎంవో ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధాలున్నాయని ఆరా తీస్తున్నారు. శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.90 కోట్ల నగదు, 100 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవాటిలో 70 కోట్లు కొత్త నోట్లు, 20 కోట్లు పాత నోట్లు ఉన్నాయి. తనిఖీల్లో 60 మంది అధికారులు పాల్గొన్నారు. శేఖర్ రెడ్డి స్నేహితులు, బంధువుల ఇళ్లపై కూడా సోదాలు జరుపుతున్నారు. శేఖర్ రెడ్డి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు సన్నిహుతుడుగా ఉండేవాడని తెలుస్తోంది. జయలలితనే అతన్ని టీటీడీ బోర్డుసభ్యుడి పదవికి రికమండ్ చేశారని సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:57 - December 8, 2016
17:53 - December 8, 2016

ఢిల్లీ : సామాన్యులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపించబోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరగబోతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయలు దాటుతుందన్న అంచనాలున్నాయి. పెట్రోల్, డీజిల్ సెగ మొదలవుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తి విషయంలో ఒపెక్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం భారత్ ను వణికిస్తోంది. చమురు ధరలను నియంత్రించే ఉద్దేశంతో జనవరి 1 నుంచి తమ  ఉత్పత్తులు తగ్గించేందుకు ఒపెక్ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.  రోజుకి 1.2 మిలియన్ బారెళ్ల చొప్పున ఉత్పత్తి తగ్గించాలన్నది  ఒపెక్ లోని 13 దేశాల మధ్య కుదిరిన అంగీకారం. దీంతో చమురు ఉత్పత్తి తగ్గి, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే అవకాశం వుంది. రాబోయే మూడు నాలుగు నెలల్లో పెట్రోల్ డీజిల్ ధరలు 5 నుంచి 8 శాతం దాకా పెరిగే అవకాశం వున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనాలేస్తున్నాయి. 
80శాతం పైగా ఒపెక్ దేశాల నుంచే దిగుమతి 
భారత్ పెట్రోలియం దిగుమతులకు ఎక్కువగా వెచ్చిస్తోంది. దేశీయ అవసరాల్లో 80శాతం పైగా ఒపెక్ దేశాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది.  ప్రస్తుతం ఒపెక్ దేశాలు రోజుకి 34. 24 మిలియన్ బారెళ్ల చొప్పున ఉత్పత్తి చేస్తున్నాయి. దీనిని 32 బారెళ్లకు తగ్గించాలన్నది తాజా ఒప్పందం. ఇది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది.  ఇప్పటికే ముడి చమురు ధర 50 డాలర్లు దాటింది. ఇది 60 డాలర్లు వరకు పెరగొచ్చన్న అంచనాలున్నాయి. ఈ స్థాయిని దాటితే భారత్ మీద మరింత భారం పడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర దాదాపు 71 రూపాయలుంది. ఒపెక్ దేశాలు తమ ఉత్పత్తి తగ్గిస్తే హైదరాబాద్ లో పెట్రోల్ ధర 80 రూపాయలు, డీజిల్ ధర 68 రూపాయలకు  పెరగొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా. 
పతాక స్థాయిలో ముడిచమురు ధరలు 
2012లో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పతాక స్థాయిలో పెరిగాయి. అప్పట్లో క్రాడాయిల్ ధర 110 డాలర్లు దాటింది.   అక్కడ నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన ముడి చమురు ధరలు 2016లో 40 డాలర్లకు పతనమయ్యాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గిన్నప్పటికీ ఆ ఫలితాన్ని వినియోగదారులకు అందించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టాక్స్ లు పెంచుకుంటూ వచ్చాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గతంలో పెంచిన టాక్స్ లను తగ్గించి, వినియోగదారులను ఆదుకుంటాయా? ఆ టాక్స్ లు అలాగే కొనసాగిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పెంచుతాయా? అన్నది ఆసక్తికరం. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే, రవాణా చార్జీలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగే ప్రమాదం వుంది. 

 

17:48 - December 8, 2016

అలహాబాద్‌ : ఇస్లాం మతంలోని ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో అలహాబాద్‌ కోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. మూడు సార్లు తలాక్‌ అన్న పదం ఉచ్చరించి విడాకులు ఇచ్చే అంశం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించడమంటే ముస్లిం మహిళల హక్కులను హరించడమేనని హైకోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగానికంటే పర్సనల్‌ లా గొప్పేమీ కాదని స్పష్టంచేసింది. ఇటీవల ఈ ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై పెద్దఎత్తున చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొందరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి కేంద్రం సైతం మద్దతు తెలిపింది. ఇది స్త్రీపురుష సమానత్వానికి వ్యతిరేకమని పేర్కొంది. కాగా, ముస్లిం మత పెద్దలు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు.

 

17:45 - December 8, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో బ్యాంకు దోపిడీ జరిగింది. బ్యాంకులోకి చొరబడిన ఉగ్రవాదులు రూ.10 లక్షల కొత్త నోట్లు ఎత్తుకెళ్లారు. 20 రోజుల్లో ఇది రెండో బ్యాంకు దోపిడీ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏకే 47తో బ్యాంకులోకి తీవ్రవాదులు బ్యాంకు అధికారులను బెదిరించి దోపిడీ చేశారు. 

17:43 - December 8, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో నెలరోజులు గడుస్తున్నా..ప్రజల కష్టాలు తీరడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు తప్పడం లేదు. తీరా వేచి చూశాక నోక్యాష్ అంటూ బ్యాంకు సిబ్బంది చెప్పడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బ్యాంకులు 'నోక్యాష్' అంటూ బోర్డులు పెడుతున్నాయి. నూటికి 90 శాతం ఏటీఎంలలో నగదు లేమి ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

క్యాష్ లెస్ లావాదేవీలపై దృష్టి సారించాం : అరుణ్ జైట్లీ

ఢిల్లీ : క్యాష్ లెస్ లావాదేవీలపై దృష్టి సారించామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నోట్ల రద్దుపై ప్రజల నుంచి మంచి సహకారం వచ్చిందని తెలిపారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 

 

17:06 - December 8, 2016

శ్రీకాకుళం : పెద్దనోట్ల రద్దు మరో వృద్ధుడి ప్రాణాలు తీసింది. బ్యాంకు ముందు క్యూలైన్లో నిల్చుని వృద్ధుడు మృతి చెందాడు. నగదు కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం వరక గ్రామానికి చెందిన కోగాబెహరా నగదు కోసం బోరివంక ఏపీ గ్రామీణ వికాస్‌బ్యాంక్ వద్ద క్యూలో నిలబడ్డాడు. చాలాసేపు క్యూకట్టిన అతను గుండెపోటుతో కుప్పకూలాడు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. నగదు కోసం తెల్లవారుజాము నుంచే జనం క్యూకట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:47 - December 8, 2016

చెన్నై : పెద్ద నోట్ల రద్దు పేదోడి నుండి సామాన్యుడు..మధ్య తరగతి వారిని కుదేలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 2వేల కోసం గంటలు గంటలు క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏటీఎం..బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఇదిలా ఉంటే మాత్రం 'పెద్దోళ్ల'కు మాత్రం డబ్బులు సులువుగానే అందుతున్నాయని పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన టిటిడి బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇంట్లో దొరికిన నగదు..బంగారం చూసి షాక్ తినాల్సిందే. టిటిడి బోర్డు సభ్యుడిగా శేఖర్ రెడ్డి ఉన్నారు. ఇతడిని ఇటీవలే మృతి చెందిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సిఫార్సు మేరకు సభ్యుడిగా నియమించినట్లు తెలుస్తోంది. ఇతనిపై పలు ఆరోపణలు రావడంతో ఐటీ శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఏకంగా ఇంట్లో రూ.90 కోట్ల నగదు, 100 కిలోల బంగారం లభ్యం కావడం ఐటీ అధికారులు షాక్ తిన్నారు. లభ్యం చేసుకున్న నోట్లలో రూ. 70 కోట్లు కొత్త నోట్లు, రూ. 20 కోట్లు పాత నోట్లు ఉన్నాయి. తనిఖీల్లో 60 మంది అధికారులు పాల్గొన్నారు. శేఖర్ రెడ్డి స్నేహితులు, బంధువుల ఇళ్లపై కూడా సోదాలు జరుపుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:41 - December 8, 2016

ఢిల్లీ : క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులకు స్మాల్ రిలీఫ్. పెద్దనోట్ల రద్దు అనంతరం దేశంలో నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను మళ్లించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా 2వేల రూపాయల లోపు జరిపే లావాదేవీలపై సేవాపన్ను ఎత్తివేయాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో నోటిఫికేషన్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు ఇటువంటి మొత్తాలపై 15శాతం సేవాపన్నుగా పడుతోంది. ఇకపై ఈ మొత్తాలపై పన్ను మినహాయింపు వెసులుబాటును కల్పించనున్నారు. 2012 జూన్‌లో విడుదల చేసిన సేవా పన్ను నోటిఫికేషన్‌ను ఇందుకోసం సవరించనున్నట్లు సమాచారం. 

 

16:39 - December 8, 2016

అనంతపురం : పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి నెల రోజులు గడుస్తున్నా ప్రజలకు మాత్రం కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. 90 శాతం ఏటీఎంలు ఖాళీగా ఉండటంతో అనంతపురంలో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, రెండు ఏటీఎంలలో డబ్బులు పెట్టినా గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయి. దీంతో కరెన్సీ కోసం ప్రజలు విలవిలలాడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:35 - December 8, 2016

హైదరాబాద్ : పెద్దనోట్లు రద్దై నెలరోజులవుతున్నా ఇంకా సామాన్యుల కష్టాలు తీరడంలేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు జనాల క్యూలు కొనసాగుతూనేఉన్నాయి. బ్యాంకుల ముందు జనాలు పడిగాపులుగాస్తున్నారు. చాలాచోట్ల ఏటీఎంలు పనిచేయక ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. గంటలకొద్దీ క్యూకట్టినా డబ్బు దొరకడం లేదు. నగదు కోసం సామాన్యులు విలవిల్లాడుతున్నారు. రూ. 2వేలనోటుకు చిల్లర దొరకక అవస్థలు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

టిటిడి బోర్డు సభ్యుడు దగ్గర రూ. 90 కోట్లు..

చెన్నై : టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 90 కోట్ల నగదు, 100 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటిలో 70 కోట్లు కొత్త నోట్లు, 20 కోట్లు పాతనోట్లు ఉన్నాయి. శేఖర్ రెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో 60 మంది అధికారులు పాల్గొన్నారు. 

16:17 - December 8, 2016

తూర్పుగోదావరి : 30రోజులు గడిచినా నగదు కొరత  వేధిస్తూనే ఉంది. ఏటీఎంలు పనిచేయక జనం తీవ్రం గా ఇబ్బంది పడుతున్నారు. కాకినాడలో ఏటీఎంల దగ్గర నోక్యాష్‌ బోర్డులే కనిపిస్తున్నాయి. బ్యాంకుల ముందు పెన్షన్‌దారులు, ఉద్యోగులు భారీగా క్యూ కడుతున్నారు. బ్యాంకులపై తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నోట్లరద్దుపై ప్రజలకు ప్రధాని సెల్యూట్..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. నోట్ల రద్దుకు సహకరించిన దేశ ప్రజలకు సెల్యూట్ అని, అవినీతి, ఉగ్రవాదం, నల్లధనంకు వ్యతిరేకం చేస్తున్న యజ్ఞంలో ప్రజలు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. యావత్ దేశ ప్రజలు నల్లధనాన్ని ఓడించాలని అప్పుడే పేదలు మధ్యతరగతి ప్రజలకు లాభం జరుగుతుందన్నారు. డిజిటల్ లావాదేవీల్లో ప్రతొక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. క్యాష్ లెస్ లావాదేవీలను ప్రోత్సాహించాలన్నారు. 

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. 457 పాయింట్లు లాభపడి 26,694 సెన్సెక్స్ ముగిసింది. 145 పాయింట్లు లాభపడి 8,246 వద్ద నిఫ్టీ ముగిసింది. 

15:55 - December 8, 2016

సంగారెడ్డి : పెద్ద నోట్ల రద్దు కష్టాలు ఒక్కొక్కరివి ఒక్కో రకంగా కన్పిపిస్తున్నాయి. బ్యాంకులు, ఎటీఎంల ముందు బారులు తీరిన వారి కష్టాలు ఒక రకంగా ఉంటే... సంచార జీవుల కష్టాలు మరింత దయనీంగా ఉన్నాయి. చాపలు, రకరకాల అల్లికలతో బతుకులీడ్చే వీరి పరిస్థితి ఇప్పుడు రోజు గడవడమే కష్టంగా ఉంది. పెద్ద నోట్ల రద్దై నెల తర్వాత కూడా అల్పాదాయ వర్గాలు పడుతున్న కష్టాలు ఎలా ఉన్నాయో వీడియోలో చూద్దాం...

 

రూ. 10 లక్షల కొత్తనోట్లను ఎత్తుకెళ్లిన ఉగ్రవాదులు..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామా జిల్లాలో బ్యాంకులో ఉగ్రవాదులు దోపిడి చేశారు. రూ. 10 లక్షల కొత్త నోట్లను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. 

ఫరూఖ్ నగర్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : ఫరూఖ్ నగర్ లోని బూర్గులలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

సింగూరు ప్రాజెక్టు నుండి నీరు విడుదల..

మెదక్ : పుల్ కల్ (మం) సింగూరు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేశారు. కాల్వలకు నీటిని మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. 

మోడీ రాకపోవడం వల్లే సభలో ప్రతిష్టంభన - ఏచూరి..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు రాకపోవడం వల్లే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ప్రధాని సభకు రాకుండా తప్పించుకుంటున్నారని, మొదట నల్లధనం కోసం నోట్ల రద్దు అని పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలని మాట మారుస్తున్నారని, 82 శాతం నగదు బ్యాంకులకు చేరిందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. అంటే నల్లధనం మార్పిడి జరిగిందని తెలుస్తోందని నోట్ల మార్పిడిలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ సమావేశాల తీరుపై రాష్ట్రపతి అసంతృప్తి..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై చర్చించాలి కానీ సభను అడ్డుకొనే హక్కు ఎంపీలకు లేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు పార్లమెంట్ లో ధర్నాలు చేయడం సరికాదన్నారు. 

15:36 - December 8, 2016

జగన్ పై గాలి ఆగ్రహం..

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై జగన్ ది అసత్యప్రచారమని, పోలవరం పూర్తి చేసి రాయలసీమకు త్రాగు, సాగునీరందిస్తామన్నారు. పోలవరానికి ఇంకా భూ సేకరణ జరగాలని, నిర్వాసితులకు అన్ని రకాల పరిహారం చెల్లిస్తామన్నారు. 

15:35 - December 8, 2016

ఢిల్లీ : వాయిదా అనంతరం లోక్ సభ తిరిగి ప్రారంభం అయింది. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నోట్ల రద్దుపై లోక్ సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

యాదాద్రి జిల్లాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

యాదాద్రి : జిల్లాలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. బీబీనగర్ (మం) కొండమడుగుమెట్టు వద్ద హైవేపై నున్న అక్రమ కట్టడాలను హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేశారు. పోచంపల్లి మండల కేంద్రంలోనూ ఆక్రమణలను తొలగించారు. 

15:30 - December 8, 2016

ఢిల్లీ : వాయిదా అనంతరం ఉభయసభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రాజ్యసభలో గందగరోళం నెలకొంది. దీంతో చైర్మన్ అమీద్ అన్సారీ రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:23 - December 8, 2016

రంగారెడ్డి : ఎక్కడో ఒక దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యంత వేగంగా ప్రయాణీస్తూ..మద్యం సేవించి..నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ నిండు ప్రాణాలు తీస్తున్నారు..తీసుకుంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే...
జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని మన్నెగూడ క్రాస్‌రోడ్డులో కృష్ణవేణి స్కూల్‌ బస్సు ఢీకొని బైక్‌పై వెళ్తున్న యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

14:53 - December 8, 2016

ముంబై: అరే ఏంటీ అంపైర్ రిటైర్డ్ హర్ట్ కావడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. క్రికెట్ ఏదైనా జరగవచ్చు. ఓటమి చెందుతుందన్న జట్టు..విజయం సాధించవచ్చు..విజయం సాధిస్తుందని అనుకున్న జట్టు..ఓడిపోవచ్చు..కానీ భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య ఓ ఘటన చోటు చేసుకుంది. అంపైర్ట్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ముంబైలో భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటలో భాగంగా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ వేస్తున్నాడు. అవతల వైపు ఇంగ్లండ్ ఆటగాడు జెన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను విసిరిన రెండో బంతిని జెన్నింగ్స్ లెగ్ స్టంప్ మీదుగా బాది సింగిల్ తీశాడు. వెంటనే అక్కడున్న ఫీల్డర్ గా ఉన్న భువనేశ్వర్ కుమార్ బంతిని పట్టుకుని వికెట్ల వైపుకు విసిరాడు. కానీ బంతి అంపైర్ గా ఉన్న రైఫెల్ ఫీల్డ్ తలకు గట్టిగా తాకింది. దీనితో ఫీల్డ్ మైదానంలోనే పడిపోయాడు. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మైదానాన్ని వీడాడు. అతని స్థానంలో టీవీ అంపైర్ ఎరస్ మస్ ఫీల్డ్ అంపైర్ గా వచ్చాడు.

అనంతబాగ్ లో ఎన్ కౌంటర్..

జమ్మూ కాశ్మీర్ : అనంతబాగ్ లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. జవాన్ల - ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. 

జాతీయ రహదారులకు నిధుల విడుదల చేయండి - వినోద్..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలోని నూతన జాతీయ రహదారులకు నిధులను విడుదల చేయాలని ఎంపీ వినోద్ కోరారు. నూతన తెలంగాణ రాష్ట్రం పలు సమస్యలు ఎదుర్కొంటోందని వినోద్ సభకు తెలిపారు. కొత్త జాతీయ రహదారుల కోసం అవసరమైన నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి నితీన్ గడ్కరిని సీఎం కేసీఆర్ కోరడం జరిగిందన్నారు. వెంటనే ఈ నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రిని కోరడం జరుగుతోందని ఎంపీ వినోద్ తెలిపారు. 

రాజ్యసభ ప్రారంభం..శుక్రవారానికి వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభలో అదే గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన సభ పలు మార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 2గంటలకు తిరిగి ప్రారంభమైన సభలో కాంగ్రెస్ సభ్యులు మాట్లాడారు. పెద్దనోట్ల రద్దుతో సభ్యులు ఆందోళన చేయడంతో శుక్రవారానికి సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

వాయిదా అనంతరం ఉభయసభలూ ప్రారంభం..

ఢిల్లీ : పలు మార్లు వాయిదా అనంతరం తిరిగి మధ్యాహ్నం 2గంటలకు ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో పెద్దనోట్ల రద్దు అనంతరం జరుగుతున్న పరిణామాలపై విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. 

14:05 - December 8, 2016
14:02 - December 8, 2016

హైదరాబాద్‌ : అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జోరుగా సాగుతున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలను .. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేస్తున్నారు. మేడ్చల్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో ఎల్ ఆర్ ఎస్,బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోని నిర్మాణాలు కూల్చివేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

14:00 - December 8, 2016

మహబూబ్‌నగర్‌ : క్యాలెండర్‌లో 30 రోజులు మారినా నగదు కొరత సమస్య ఇంకా సామాన్యులను వేధిస్తూనే ఉంది. జీతాల కోసం ఉద్యోగులు, పెన్షన్ల కోసం వృద్ధులు, నిత్యావసరాల కొనుగోలు కోసం మహిళలు, చిల్లర కోసం చిరువ్యాపారులు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డలో నగదు కోసం జనం పడుతున్న కష్టాలను వీడియోలో చూడండి..

13:58 - December 8, 2016

నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పారని ..సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రైతుల రుణమాఫీ తోపాటు డబుల్‌ బెడ్‌రూంలపై ఊరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం .. ఒక్క ఊళ్లో కూడా ఇల్లు కట్టినదాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న సీఎం కార్మికులను, రైతులను మోసం చేశారని తమ్మినేని విమర్శించారు. 

13:54 - December 8, 2016

సంగారెడ్డి : పెద్ద నోట్లు రద్ద అయ్యి సరిగ్గా నెలరోజులు అవుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. బ్యాంకుల వద్ద ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పండుగల వేళ కూడా చేతిలో కనీసం నగదు లేక గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి ఎస్‌బీహెచ్‌ శాఖ దగ్గర తాజా పరిస్థితి వీడియోలో చూడండి..

13:52 - December 8, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి మూడు నెలలు అవుతున్నా ఎలాంటి ముందడగు పడలేదని లోక్‌సభలో టిడిపి సభ్యులు మురళీ మోహన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏపికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశాఖలో కొత్త రైల్వేజోన్‌, గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్‌ యూనివర్సిటీ, దుగ్గిరాజపట్నంలో పోర్టు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో శాసనసభ్యుల సంఖ్యను పెంచడం లాంటి హామీలను కేంద్రం ఇంతవరకు నెరవేర్చలేదని చెప్పారు. 

13:51 - December 8, 2016

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై లోక్‌సభలో టిఆర్‌ఎస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచల రామమందిరం మునిగిపోతుందని, ఆదీవాసీల జనజీవనం అస్తవ్యస్తమవుతుందని టిఆర్‌ఎస్‌ సభ్యులు సీతారాం నాయక్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని ఎత్తు తగ్గించాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కూడా లేవని పేర్కొన్నారు. భద్రాచలం లోని రామమందిరం పోలవరం ముంపు కిందకు రాదని కేంద్ర జలవనరుల సహాయ మంత్రి సంజీవ్‌ కుమార్‌ బలయాన్‌ స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ఒడిషా తీవ్ర అభ్యంతరం
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై లోక్‌సభలో ఒడిషా తీవ్ర అభ్యంతరం తెలిపింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ఒడిషా, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ రాష్ట్రాల ఆందోళనను కేంద్రం పట్టించుకోవడం లేదని బిజెడి సభ్యులు బలభద్ర మాఝీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల లక్షలాది మంది ఆదీవాసీల జీవనంపై ప్రభావం చూపనుందన్నారు. ఛత్తీస్‌గడ్‌, ఒడిషాలో గ్రామసభలు ఏర్పాటు చేయకుండా ప్రాజెక్ట్‌లు ఎలా నిర్మిస్తారని మాఝీ కేంద్రాన్ని నిలదీశారు. పోలవరాన్ని పెద్దగా నిర్మించడం కన్నా 3 చిన్న ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ఎలాంటి ప్రమాదం ఉండదని... ఖర్చు కూడా సగం తగ్గనుందని అప్పటి ఏపి చీఫ్‌ ఇంజనీర్‌ హనుమంతప్పరావు చేసిన సూచనలు కూడా కేంద్రం పట్టించుకోకుండా ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణం ప్రారంభమైనందున దీనిపై వెనక్కి తగ్గేదిలేదని, ఒడిషా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే కేంద్రం సహకరిస్తుందని కేంద్రమంత్రి సంజీవ్‌ బలయాన్‌ సమాధానమిచ్చారు.

13:49 - December 8, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోల్లో ఒకరు 'రామ్ చరణ్ తేజ'..ఇతను నటించిన సినిమాలు కొన్ని విజయవంతం కాగా మరికొన్ని డిజాస్టర్ గా మిగిలాయి. 'బ్రూస్ లీ' సినిమా అంతగా ఆడకపోయేసరికి 'చెర్రీ' ఆచితూచి అడుగులేస్తున్నాడు. తాజాగా 'ధృవ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రాన్ని 'ధృవ' పేరుతో రీమెక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'రామ్ చరణ్' పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో మెరిపించనున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'అల్లు అరవింద్‌' ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో డిసెంబర్ 9వ తేదీన విడుదలవుతోంది. అంతేగాక ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కానీ సినిమా విడుదల సమయంలో పలు సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను 'అల్లు అరవింద్' తనదైన శైలిలో పరిష్కరించాని టాక్. 'ధృవ' సినిమా కోసం 'సూర్య' 'సింగం' సినిమాను వెనక్కి పంపే విధంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. చెన్నయ్ బోర్డర్ లో కూడా తలెత్తిన సమస్యను చాకచక్యంగా పరిష్కరించాని వార్తలు వస్తున్నాయి. 'ధృవ' సినిమా రిలీజ్ రోజునే అక్కడ 'సుందరంగ జాణ' సినిమా విడుదలవుతోంది. తెలుగులో వచ్చిన 'భలే భలే మగాడివోయ్' కు కన్నడ రీమెక్. ఇందులో కాస్త ఫాలోయింగ్ ఉన్న 'గణేష్' హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాణంలో 'అల్లు అరవింద్' భాగస్వామి అని తెలుస్తోంది. మరో భాగస్వామి రాక్ లైన్ వెంకటేష్ అని టాక్. 'ధృవ' రిలీజ్ వల్ల 'సుందరంగ జాణ' 23 రిలీజ్ కాబోతోంది...

13:43 - December 8, 2016

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. విపక్షాలు మాత్రం తమ ఆందోళనను కొనసాగించాయి. దీంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చైర్మన్ హమీద్ అన్సారీ ప్రారంభానికి సహకరించాలని విపక్షాలను కోరారు. తీవ్ర గందరగోళం నెలకొనటంతో రాజ్యసభను మ.2గంటలకు వాయిదా వేశారు.లోక్ సభలో నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.

13:35 - December 8, 2016

అనంతపురం : పావగడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్ ఐషర్ వాహనం ఢీన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మధ్యహ్నాం 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంతవరకూ ఏ అధికారులు సంఘటాస్థలికి చేరుకోకపోవటం గమనించదగిన విషయం.కాగా గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి విషయంగా వున్నట్లుగా తెలుస్తోంది. కళ్యాణ దుర్గం నుండి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్ ను ఐషర్ వాహన్ డ్రైవర్ క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

అక్రమ నిర్మాణాల కూల్చివేత..

హైదరాబాద్ : హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మేడ్చల్, రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విచారణ..

ఢిల్లీ : ఇసుక తవ్వకాలపై ఎన్టీజీలో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం..ప్రభుత్వ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతితో ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ప్రాజెక్టులయితే యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతారా అని యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపవద్దని ఎన్జీటీ పేర్కొంది. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 25కి వాయిదా వేసింది. 

ఆర్టీసీ బస్సు - ఐషర్ వాహనం ఢీ..ముగ్గురి మృతి..

అనంతపురం : పావగడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు - ఐషర్ వాహనం ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం నుండి బెంగళూరుకు ఆర్టీసీ బస్సు వెళుతోంది. 

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమన్న హైకోర్టు..

ఢిల్లీ : ముస్లిం పర్సనల్ లాపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

పాఠశాలను ఆదర్శవంతంగా తీరిదిద్దుతాం - మంత్రి గంటా..

విజయవాడ : అన్ని రెవెన్యూ డివిజన్ లలో ఒక పాఠశాలను ఆదర్శవంత పాఠశాలగా తీర్చిదిద్దుతామని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. ప్రాథమిక విద్యను బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జనవరి 3న సావిత్రిబాయి పూలె జయంతి రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 5 నుండి ప్రధానోపాధ్యాయుల వర్క్ షాప్ ఉంటుందన్నారు

13:01 - December 8, 2016

హైదరాబాద్ : లాలాగూడ నుండి ఓ బ్యాంక్ వద్ద పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన వృద్ధుల పాట్లు చూడనలవికాకుండా ఉన్నాయి. పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు బ్యాంక్ కు వచ్చిన వృద్దులు నానా అగచాట్లు పడుతున్నారు. లైన్ల లో నిల్చుంటే నెట్టివేశారనీ దీంతో పడిపోతే కాలు నొప్పిపట్టిందనీ దీంతో కుంటుకుంటూ వచ్చానని ఓ వృద్ధురాలు టెన్ టివితో వాపోయింది. పాత పెద్దనోట్లు రద్దు చేసిన నేటికి సరిగ్గా 30రోజులయ్యింది. సామాన్యుల కరెన్సీ కష్టాలు మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు..బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు..ఏటీఎంల వద్ద అవుటాఫ్ సర్వీస్ బోర్డు దర్శనమిస్తూనే వున్నాయి. బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతూనే వుంది.. పాపం ఆ వృద్ధురాలి గోస చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:00 - December 8, 2016

చెమట చుక్కతో ఆర్యోగం ఎలా తెలుస్తుంది. ప్రస్తుతం సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందో తెలిసిందే. రోజుకో పరికరం మార్కెట్ లో లభ్యమౌతున్నాయి. అందులో ఆరోగ్యం గురించి ఎన్నో వస్తువులు దొరుకుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన పలు యాప్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నార్త్ వెస్టర్న్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ స్టిక్కర్ ను తయారు చేశారు. చెమట చుక్కతో ఈ స్టిక్కర్ ఆరోగ్యాన్ని తెలియచేస్తుందంట. నాలుగు భాగాలుగా ఉండే ఈ స్టిక్కర్ లో నాలుగు రకాల రసాయనాలు ఉంటాయి. శరీరంలో నుండి వెలువడే చెమటతో కలిసినప్పుడు ప్రతిచర్య కలిగి వాటి రంగు మారుతుంది. తమ దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తో ఇలా రంగు మారిన స్టిక్కర్ ను ఫొటో తీస్తే ఫోన్లో వాటికి సంబంధించిన యాప్, రంగులను బట్టి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయవచ్చంట. ఆమ్లశాతం, లాక్టేట్‌ పరిమితులు, క్లోరైడ్‌ నిల్వలు, గ్లూకోజ్ స్థాయిలను ఇవి పసిగడుతాయి. ఈ స్టిక్కర్ అన్ని సందర్భాల్లో పనిచేస్తుందా ? లేదా ? అని టెస్ట్ కూడా చేశారని తెలుస్తోంది. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇది శుభ్రంగా పనిచేస్తున్నట్లు తేలింది. తక్కువ ఖరీదులో ఈ స్టిక్కర్స్ దొరుకుతాయంట. 

12:59 - December 8, 2016
12:41 - December 8, 2016

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్..

విజయవాడ : ఏపీలో టెన్త్..ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా విడుదల చేశారు. మార్చి 1 నుండి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు.. మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. జనవరి 5 నుండి ప్రధానోపాధ్యాయుల వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 

12:23 - December 8, 2016

ఏంటీ ముఖ్యమంత్రిగా 'మహేష్ బాబు'..అని ఆశ్చర్యపోతున్నారా ? రియల్ లైఫ్ లో కాదు లెండి..రీల్ లైఫ్ లో.. ఇప్పటికే ఆయన సీఎంగా నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ అనంతరం 'మహేష్ బాబు' ఆచూతూచి అడుగేస్తున్నారు. ప్రాధాన్యత గల అంశాలను ఎంచుకుంటూ ముందుకెళుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'మహేష్' ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామానాయుడు స్టూడియోలో ఎలాంటి హంగామా లేకుండా ఈ మూవీ ముహుర్తం సింపుల్ గా కానిచ్చేశారు. మహేష్ తో తను చేయనున్న కొత్త మూవీ తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రమవుతుందని కొరటాల చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజకీయాల నేఫథ్యంలో నడుస్తుందని టాక్. 'భరత్ అను నేను' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు మూవీ స్టోరీ లైన్ మార్చేస్తుందని ఈ దర్శకుడు మరో హాట్ కామెంట్ చేశాడు. దీనితో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే 'మహేష్' ముఖ్యమంత్రిగా కనబడుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే ఒకవేళ నిజమైతే రీల్ లైఫ్ లో సీఎంగా 'ప్రిన్స్' ఎలా నటించాడోనని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారంట. డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 100కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తుంది.

12:21 - December 8, 2016

ఢిల్లీ : బ్లాక్ మనీని అంతం చేస్తానని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి పేదలు అల్లాడిపోతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. నల్లకుబేరులపై సంధించిన బాణం పేదవారికి తగిలి విలవిల్లాడుతున్నారు. నోట్ల రద్దుపై ప్రజలు పడుతున్న కష్టాలను మీడియా ద్వారా ..చట్ట సభల ద్వారా ప్రభుత్వానికి ప్రజల కష్టాలను విన్నవించమని ఎంపీలకు మాజీ ఎంపీ అరుణ్ కుమార్ సూచించారు. నోట్ల రద్దుపై రిజర్వు బ్యాంక్ ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పాల్సిన అవుసరముందో చెప్పాలని డిమాండ్ చేశారు. మిగిలిన రోజుల్లోనైనా నోట్ల రద్దుపై చర్చ జరిగేలా చూడాలని విపక్ష ఎంపీలకు ఉండవల్లి సూచించారు. ఈ సంక్షోభానికి కారణమేంటి? ఈ కష్టాలు ఎన్నాళ్లు కొనసాగుతాయని ప్రశ్నించారు. చేతిలో నగదు వుండి కూడా పేదరికం అనుభవించాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొంటున్నాయన్నారు.నోట్ల రద్దుతో మిడిల్ క్లాస్ నుండి దిగువ స్థాయివారే ఇబ్బందులు పడుతున్నారు తప్ప ధనవంతులకు ఎటువంటి కష్టం లేదన్నారు. 

పార్లమెంట్ వద్ద ఉండవల్లి..

ఢిల్లీ : ఈ ఇబ్బందులు ఇంకా ఎన్నాళ్లు సాగుతాయని, డబ్బులుండి కూడా పేదరికం అనుభవించాల్సి వస్తోందని మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. పార్లమెంట్ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎలాంటి అనుమతి లేకుండానే ప్రధాని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు వల్ల చాలా మంది మృతి చెందుతున్నారని, ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం కలుగుతోందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాలు చేస్తున్న తీరు సరియైంది కాదని ఇది స్వపక్షానికి లాభం కలిగేలా ఉందని తెలిపారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై తనకు తెలిసిన సభ్యులకు తెలియచేయడం జరిగిందన్నారు. 

నోట్ల రద్దుపై హైకోర్టులో పిటిషన్ లు..

హైదరాబాద్ : నోట్ల రద్దు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. నోట్ల రద్దు చేయడం..చిల్లర కొరత..బ్యాంకులు..ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంపై పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.

రాజ్యసభ మళ్లీ వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఉదయం ప్రారంభం కాగానే విపక్షాలు..స్వపక్షాల సభ్యులు ఆందోళన చేయడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిద వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగానే పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సభను 2.00గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

12:03 - December 8, 2016

ముంబై : కాలేజీ విద్యార్థినిలు అలాంటి డ్రెస్ వేసుకోవద్దు..అలా రావద్దూ అంటూ పలు కాలేజీలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గతంలో విద్యార్థినిలు నిరసనలు తెలియచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో కొన్ని కాలేజీలు విద్యార్థినిలు ధరించే డ్రెస్ లపై ఆంక్షలు విధించడం సంచలనం సృష్టిస్తోంది. సెయింట్ జేవియర్ కాలేజీ, విల్సన్ కాలేజీలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కాలేజీల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాలపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కత్తిరింపులున్న జీన్స్ వేసుకరావద్దని..స్లీవ్ లెస్ క్లాత్స్..షార్ట్స్ వేసుకుని అమ్మాయిలు కాలేజీ క్యాంపస్ లోకి రావద్దని హుకుం జారీ చేశాయి. ఈ నిబంధన అబ్బాయిలకు కూడా వర్తింప చేశారు. ఇందుకు సంబంధించిన నోటీసులను కాలేజీ ఎంట్రెన్స్ వద్ద అతికించారు. కత్తిరింపులున్న జీన్స్ వేసుకుని సెయింట్ జేవియర్ కాలేజీకి వెళ్లిన ఓ విద్యార్థిని గేటు వద్దే సెక్యూర్టీ అడ్డుకున్నారు. మరొక సంగతి...కొన్ని కాలేజీల్లో విద్యార్థినిలకు సమయం కూడా విధించడం గమనార్హం. రాత్రి ఏడు దాటిన తరువాత కాలేజీ క్యాంపస్ లో ఉండకూడదని నిబంధనలు పెట్టారు. కాలేజీ యాజామాన్యాలు తీసుకున్న ఈ నిబంధనలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి. 

పోలవరానికి మార్పులు కుదరవు: సంజీవ్ కుమార్

ఢిల్లీ : కేంద్ర నీటి వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం విషయంలో ఎటువంటి మార్పులు కుదరవని తేల్చి చెప్పారు. లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ సీతారామ్ నాయక్ మాట్లాడుతూ..కేంద్రం ఆధ్వర్యంలో ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని కోరారు. జాతీయ స్థాయిలో నిర్మించే ఈ ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం ముంపుకు గురవుతుందనీ..పేరు ప్రఖ్యాతులు కలిగిన భద్రాద్రి రామన్న ఆలయం మునిగిపోతుందన్నారు. లక్షలాదిమంది ఆదివాసీలు నిర్వాశితులుగా మారిపోతారనీ ఈ విషయంలో తమ అభ్యంతరాలను పరిణలోకి తీసుకోవాలని సీతారాంనాయక్ కోరారు.

తెరుచుకోని ఎస్ బీఐ బ్యాంకు..

జగిత్యాల : మెట్ పల్లిలో ఎస్ బీఐ బ్యాంక్ ఇంకా తెరుచుకోలేదు. నగదు లేక అధికారులు బ్యాంక్ ను ఇంకా తెరుచుకోలేదు. నిరసనగా ఖాతాదారులు రాస్తారోకో నిర్వహించారు. 

పోలవరంకు అనుమతు లేవు - సీతారాం నాయక్..

ఢిల్లీ : లోక్ సభ లో పోలవరం అంశాన్ని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ ప్రస్తావించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని, ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, భద్రాచలానికి ముప్పు ఉందన్నారు. భద్రాచలం రామాలయం మునిగిపోతుందని అంతేకాదా లక్షలాది మంది ఆదవాసీలు నిర్వాసితులవుతారని తెలిపారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. 

11:45 - December 8, 2016

విజయవాడ : నోట్లు రద్దు ప్రకటన జరిగి నేటి సరిగ్గా నెల రోజులు గడిచాయి. అప్పుడు ప్రారంభమైన నగదు కష్టాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ఈ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. విజయవాడలో వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతూ..నిత్యం రద్దీగా వుండే వన్ టౌన్ ప్రాంతం కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. పాత పెద్దనోట్ల రద్దుతో ఈ ప్రాంత వాణిజ్యం కుదేలైపోయింది. చిల్లర కష్టాలతో గిరాకీలు లేక ఇటు వ్యాపారులు..అటు కూలీలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. వ్యాపార సంస్థలు బోసిపోయి కనిపిస్తున్నాయి. 90 శాతం వ్యాపారం పడిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. పనులు దొరక్క కూలీల కుటుంబాలు అల్లాడుతున్నాయి. అద్దెలు కట్టలేక..కరెంట్ బిల్లులకు రోజు వారీ నిత్యావసరాలకు కటకటలాడిపోతున్నారు. ఈ సంక్షోభం ఏనాటికి తీరేనో అని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొన్నాయి.

11:40 - December 8, 2016

పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను తీసుకోవడం వల్ల అనారోగ్యాలు దరి చేరవు. అలాగే పండ్లతో కూడా అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అందులో 'అరటి' కూడా ప్రముఖ స్థానం ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద అరటిని పండించే విషయంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. మరి ఈ అరటిని తీసుకోవడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది. మరి అవేంటో చూద్దామా…

 • మేక మాంసం..సగానికి కోసిన కోడిగుడ్డు..ఆవుపాలులో ఎంత శక్తి ఉందో అంత శక్తి కేవలం, ఒక మోస్తరు పొడవున్న అరటి పండులో ఉంటుంది.
 • పెరిగే పిల్లలకు, వృద్ధులకు వ్యాధులనుంచి కొలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహారౌషధంగా ఇవ్వవచ్చు.
 • అరటి పండులో కొవ్వు పదార్థం చాలా తక్కువస్థాయిలో ఉంటుంది. కామెర్లలోను, ఇతర కాలేయపు వ్యాధుల్లోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
 • అరటి పండు తిన్న తర్వాత ఏలక్కాయ తింటే కఫ దోషం తగ్గుతుంది. లేదా అరటి పండు తినేటప్పుడు రెండు లవంగాలను గాని, మూడు మిరియాలను గాని గుజ్జుతో పాటు తిన్నా సరిపోతుంది.
 • జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది.
 • పచ్చి అరటి కాయలు విరోచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి.
 • అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.

అందం..

 • బాగా పండిన అరటిపండును ఒక దానిని తీసుకుని మెత్తగా చిదమాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఉంచుకొని గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ ఫెక్షన్ తో కూడిన మొటిమలలోని బాక్టీరియాను అరటిపండులోని పొటాషియం హరించి వేయడంతో అవి చాలా త్వరగా తగ్గిపోతాయి.
 • ఈ ప్యాక్‌ నే ఎండవల్ల కమిలిన చర్మాన్ని సహజ స్థితికి తీసుకొచ్చేందుకు ఉపయోగించవచ్చు.
 • పండిన అరటిపండును తీసుకుని మెత్తగా చిదమాలి. దీనిని మాడుకు జుట్టుకు పట్టించాలి. తలకు ఏదైనా కట్టుకుని ఇరవై నిమిషాల పాటు ఉంచిన తరువాత షాంపూతో కడుక్కోవాలి. దీనితో జుట్టు ఆరోగ్యవంతంగా అవుతుంది.
 • పండిన అరటిపండును మెత్తని గుజ్జులా చేసుకుని, ముఖానికి పట్టించి పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ముఖానికి తేమ, నునుపుదనం ఇస్తుంది.
 • పండులో ఉండే 'ఇ' విటమిన్‌ ఉండడం వల్ల ముఖంలో వయసు తాలూకు ఛాయలను కనిపించకుండా చేస్తుంది.
 • ఓట్‌మీల్‌, కొబ్బరిపాలు పండు గుజ్జుకు జోడించి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే మృతకణాలు తొలగిపోతాయి.
 • అరటి పండు గుజ్జుని పాదాలకు పట్టిస్తే పగుళ్లు రాకుండా ఉంటాయి. 
11:26 - December 8, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. నేడు కూడా విపక్షాలు నోట్ల రద్దుపై ఆందోళన చేపట్టాయి. తీవ్ర గందరగోళం మధ్య లోక్ సభలలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. లోక్ సభలో స్పీకర్ వెల్ లోకి దూసుకొచ్చి విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగిస్తున్నారు. చేస్తున్నారు...మరో పక్క రాజ్యసభలో కూడా ఇదే వాతావరణ కొనసాగుతోంది. సభ జరిగేందుకు సహకరించాలని చైర్మన్ హమీద్ అన్సారీ కోరారు..వినని విపక్షాలు ఆందోళనను కొనసాగిస్తున్నారు.పెద్ద నోట్ల రద్దు అనంతరం వంద మంది రైతులు..వృద్ధులు..ఇతరులు మృతి చెందారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో అంతర్జాతీయస్థాయిలో భారత్ పరువు పోయిందన్నారు. నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా 100మందికి పైగా చనిపోయారనీ..వివాహాలు నిలిచిపోయాయి..చిల్లర కొరతతో మెడిసిన్స్ దొరకకు తీవ్ర అవస్థలకు గురవుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి సిగ్గురావటంలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదల జీవితాలలతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. నోట్ల రద్దు అనంతరం మృతి చెందినవారికి సంతాపం తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఈ రోజు గాంధీ విగ్రహం వద్ద విపక్షాల బ్లాక్ డే నిర్వహించాయన్నారు.మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రతీరోజూ విపక్షాలు ఇదే పరిస్థితిని కొనసాగిస్తున్నారనీ..సభ కొనసాగటం విపక్షాలకు ఇష్టం లేదనీ..అందుకే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల ఆందోళన కొనసాగించటంతో చైర్మన్ హమీద్ అన్సారీ రాజ్యసభను మ.12 గంటలకు వాయిదా వేశారు. ఆందోళన మధ్య లోక్ సభ కొనసాగుతోంది.

రాజ్యసభ వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ సమావేశం ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. విపక్షాలు..స్వపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కేంద్రం తీరుపై కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

అధికారపక్షంపై ఆజాద్ తీవ్ర ఆగ్రహం..

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం వంద మంది రైతులు..వృద్ధులు..ఇతరులు మృతి చెందారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఉదయం సభ ప్రారంభం కాగానే అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. క్యూ లో నిలబడి మృతి చెందిన వారికి సంతాపం తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఈ రోజు గాంధీ విగ్రహం వద్ద విపక్షాల బ్లాక్ డే నిర్వహించాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు చాల సమస్యలు ఎదుర్కొంటున్నారని సభకు తెలిపారు. వివాహాలు చేసుకోకుండా..రైతులు పంటలు పండించుకోకుండా చాలా అవస్థలు పడుతున్నారని విమర్శించారు.

11:12 - December 8, 2016

సమంత..మళ్లీ తెలుగులో కనిపించదా..వివాహం చేసుకున్న అనంతరం 'సమంత' సినిమాల్లో నటించదని పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య'..'సమంత' వివాహం త్వరలో జరుగుతుందని వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే వివాహం అనంతరం 'సమంత' మళ్లీ నటించదని టాక్. ఈ ఏడాది 'సమంత'కు మంచి హిట్స్ వచ్చాయి. 'బ్రహ్మోత్సవం' నిరాశపరచగా 'అ..ఆ'..'జనతా గ్యారేజ్' చిత్రాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. అనంతరం 'సమంత' కొత్త ప్రాజెక్టులు ప్రకటించలేదు. 'అక్కినేని నాగచైతన్య'తో పెళ్లి కుదరడం వల్లనే ఆమె కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకోవడం లేదని టాక్స్ వినిపించాయి. మంచి ఆఫర్స్ రాకపోవడంతోనే కొత్త సినిమాలకు సైన్ చేయలేదని… దానికి పెళ్లికి సంబంధంలేదని 'సమంత' స్పష్టం చేసింది. తాజాగా 'సమంత' ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశాయి. తెలుగులో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ దొరికాయని… వాటిని ప్రకటించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ట్విట్టర్ ద్వారా 'సమంత' చెప్పేసింది. ఆ ప్రాజెక్ట్స్ ఏంటో మాత్రం చెప్పలేదు. ఏ దర్శకుడు..ఏ హీరోతో 'సమంత' నటించనుందో కొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది. 

11:07 - December 8, 2016

గుంటూరు : డీఎస్పీ, ఎస్సై అవినీతి ఆరోపణలు రుజువయ్యాయి. గుంటూరు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ కమలాకర్, ఎస్సై నాగరాజులపై డీజీపీ చర్యలకు సిద్ధపడ్డారు. వీరిద్దరిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ఎస్పీ త్రిపాఠి డీజీపీకి నివేదిక పంపిచారు. నివేదికను పరిశీలించిన డీజీపీ కమలాకర్ నాగరాజులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. 

ఉభయసభలూ ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. రాజ్యసభ..లోక్ సభలో తొలుత జరగాల్సిన కార్యకలాపాలను ఆయా స్పీకర్లు కొనసాగిస్తున్నారు. నేడు కూడా పెద్దనోట్ల రద్దు..ప్రధాని క్షమాపణలు చెప్పాలని విపక్షాలు ఆందోళన కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. సమావేశాల ప్రారంభం కంటే ముందు గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. 

పేటీఎం అంటే పే టు మోడీ - రాహుల్..

ఢిల్లీ : నోట్ల రద్దు మూర్ఖపు చర్య అని, పేటీఎం అంటే పే టు మోడీ అని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. నెల రోజులుగా ప్రజలు నరకం చూస్తున్నారని, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

10:56 - December 8, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు ప్రకటన చేసి నేటికి నెల రోజులు గడిచిన నేపథ్యంలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు నోట్ల రద్దుపై ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ ఎంపీలు ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆనంద్ శర్మ, సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. ఆందోళన అనంతరం నేతలు పార్లమెంట్ లో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తనున్నారు.పెద్దనోట్లు రద్దు చేసి నెలగడిచినా పరిస్థితిని అదుపులోకి తేవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించాయి. నోట్లకు రద్దు చేసిన నెలరోజులు గడిచినా సామాన్యుల కష్టాలు తీరటంలేదనీ..దీనిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నేతలు విమర్శలు గుప్పించారు. మరింత సమచారం కోసం వీడియో చూడండి..

శంషాబాద్ లో నిలిచిపోయిన కాంగ్ విమానం..

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతి లోపంతో క్యాత్యే పసిఫిక్‌ విమానం నిలిచిపోయింది. సీఎక్స్‌ 646 క్యాత్యే పసిఫిక్‌ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హాంకాంగ్ వెళ్లాల్సి ఉంది. కాగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు. 

అండమాన్ లో చిక్కుకున్న 1400లమంది టూరిస్టులు..

అండమాన్ : అండమాన్ నికోబార్ దీవుల్లో దాదాపు 1400 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. అండమాన్ లోని హావెలాక్ మరియు నీల్ దీవుల్లో వీరు చిక్కుకుపోయారు. వార్దా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో వీరు దిక్కుతోచని స్థితిలో ఇరుక్కుపోయారు. టూరిస్టులంతా క్షేమంగానే ఉన్నారని... వారి కుటుంబ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల రక్షణ చర్యలను తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే పోర్ట్ బ్లెయిర్ లో రెస్క్యూ టీమ్స్ రెడీగా ఉన్నాయని తెలిపారు.

10:42 - December 8, 2016
10:40 - December 8, 2016

పాకిస్థాన్‌ : ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాక్‌ విమానయాన సంస్థకు చెందిన పీకె-661 విమానం బుధవారం కుప్పకూలింది. చిత్రాల్‌ నుంచి ఇస్లామాబాద్‌ వెళ్తోన్న ఆ విమానం ఆబోటాబాద్‌ సమీపంలోని కొండల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 48 మంది ప్రయాణీకులు చనిపోయినట్టు అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో పాప్‌ సింగర్‌ జునైద్‌ జంషీద్‌ కూడా ఉన్నారు.

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం
పాకిస్థాన్‌లో మరో విమాన ప్రమాదం సంభవించింది. ఆబోటాబాద్‌ దగ్గర పీకె -661 విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. బుధవారం మధ్యాహ్నం 3.30కు చిత్రాల్‌ నుంచి పీకే -661 విమానం బయలుదేరింది. 4.40 నిమిషాలకు ఈ విమానం ఇస్లామాబాద్‌లోని బేనజీర్‌భుట్టో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ కావాల్సి ఉంది. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌ నుంచి సంబంధాలు కోల్పోయింది. సరిగ్గా 4.30కు రాడార్‌ సిగ్నల్స్‌ తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిన ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని అలుముకున్నాయి. సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని షరీఫ్‌ ఆదేశించడంతో సైన్యం రంగంలోకి దిగింది. సైనిక హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు.

పీకె661లో 48 మంది ప్రయాణీకులు..43 మృతదేహాలు వెలికితీసిన సైన్యం
విమానం బయలుదేరిన సమయంలో 48 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో 9 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు విదేశీయులు ఉన్నట్టు చెప్పారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తోన్న ప్రయాణీకులంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రాత్రి వరకు మొత్తంగా 43 మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలిస్తున్నారు. విమాన ప్రమదానికి ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యే కారణం అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదానికి గురైన విమానంలో పాక్‌ పాప్‌సింగర్‌ జునైద్‌ జంషీద్‌
ఆబోటాబాద్‌ దగ్గర పీకే - 661 విమాన ప్రమాదంలో పాకిస్థాన్‌ పాప్‌ సింగర్‌ , మతబోధకుడు జునైద్‌ జంషీద్‌ కూడా ఉన్నారు. పాప్‌ గాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన జునైద్‌... అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. కొన్నాళ్లుగా సంగీతం ద్వారా మతపరమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. విమానం ఎక్కడానికి కొద్ది గంటల ముందు దిగిన ఫోటోలను జునైద్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

పాక్‌ చరిత్రలోనే ఇదే ఘోర ప్రమాదం
పీకె -661 విమాన ప్రమాదం పాకిస్థాన్‌ విమానయాన చరిత్రలోనే ఘోర ప్రమాదంగా నిలిచింది. 2012లో 200 మంది చనిపోయిన భూజా ఎయిర్‌ బోయింగ్‌ విమాన ప్రమాదం తర్వాత ఇప్పటి వరకు పాక్‌లో చేటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం ఇదే.

నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళన..

ఢిల్లీ : పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు నోట్ల రద్దుపై ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ ఎంపీలు ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆనంద్ శర్మ, సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. 

బాబు అధ్యక్షతన సీఎంల కమిటీ సమావేశం..

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ముఖ్యమంత్రుల కమిటీ సమావేశం కానుంది. ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఈ కమిటీ తొలి భేటీ జరగనుంది. కరెన్సీ లావాదేవీలను నివారించి, నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ చర్చించనుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నెలకొన్న ఇబ్బందులను కూడా ఈ కమిటీ చర్చిస్తుంది. కాగా నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఏపీ సీఎం అధ్యక్షతలన 5రాష్ట్రాల సీఎంలతో కూడిన ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

క్యాథే పసిఫిక్ విమానంలో సాంకేతిక లోపం..

హైదరాబాద్ : నగరం నుండి హాంకాంగ్ వెళ్లాల్సిన క్యాథే పసిఫిక్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం నిలిచిపోయింది. సుమారు 200 మంది ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు విమానం బయలుదేరవచ్చని అధికారులు పేర్కొన్నారు. 

డీజీపీకి గుంటూరు ఎస్పీ నివేదిక..

గుంటూరు : డీఎస్పీ కమలాకర్, ఎస్ఐ నాగరాజకుమారిలపై అవినీతి ఆరోపణలు నిజమేనని అర్బన్ ఎస్పీ త్రిపాఠి నివేదికలో పేర్కొన్నారు. డీజీపీకి ఎస్పీ నివేదిక పంపించారు. చర్యలకు సిఫార్సు చేశారు. 

క్యూలో నిల్చొని సృహ కోల్పోయిన వృద్ధురాలు..

ప్రకాశం : దర్శి స్టేట్ బ్యాంక్ వద్ద ఫించన్ కోసం క్యూలో నిల్చొని ఉన్న ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అక్కడ వైద్యులు స్పందించలేదని తెలుస్తోంది. 

పార్లమెంట్ వద్ద విపక్షాల ఆందోళన..

ఢిల్లీ : నోట్ల రద్దుకు నిరసనగా పార్లమెంట్ వద్ద విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళనలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ రోజు కూడా పార్లమెంట్ ఉభయసభలూ పెద్దనోట్ల రద్దు అంశంపై దద్దరిల్లే అవకాశం ఉంది. 

10:21 - December 8, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌ తమపై పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. క్షేత్రస్థాయిలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఆర్ధికశాఖ మంత్రి ఈటల రంగంలోకి దిగారు. వీలైనంత తొందరగా గ్రామీణ ప్రాంత ప్రజలను నగదు రహిత లావాదేవీలవైపు ప్రోత్సహించేందుకు చర్యలు ప్రారంభించారు.

ప్రజల ఇబ్బందులకు తొలగించేందుక ప్రభుత్వం చర్యలు
పెద్దనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం అన్ని ప్రధాన బ్యాంకుల అధికారులు, సీఎస్‌ ప్రదీప్‌చంద్ర, ఫైనాన్స్‌ సెక్రెటరీ సందీప్‌కుమార్‌తో ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్‌ సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజలమీద పడకుండా ఉండేందుకు ప్రతిపూట మానిటరింగ్‌ చేయాలని ఆర్ధికశాఖను ఆదేశించారు. ప్రజలందరినీ నగదు రహిత లావాదేవీలవైపు ప్రోత్సహించాలని సూచించారు. పట్టణ ప్రాంతం ప్రజలకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్సాక్షన్స్‌పై అవగాహన ఉంటుందని.. గ్రామీణ ప్రాంత ప్రజలకే వీటిపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే కరెన్సీ కష్టాలు అధికం : ఈటల
గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా నగదు కోసం ప్రజలు ఎక్కువ ఇబ్బందిపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈటల అన్నారు. ప్రతి రైతు 24వేల రూపాయలు డ్రా చేసుకోవడానికి అనుమతి ఉన్నా.. ఎక్కడ కూడా వారికి ఆ డబ్బు ఇవ్వడం లేదన్నారు. రైతులకు నగదు అందేలా చూడాలని బ్యాంకర్స్‌ను కోరారు. ప్రజల ఇబ్బందులు తొలగాలంటే ఎక్కువ డబ్బులు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రధానంగా 500,100 నోట్లను ఎక్కువగా చెలామణిలోకి తీసుకురావాలన్నారు. అప్పుడే పేదల కష్టాలు తొలుగుతాయని చెప్పారు. తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారని... బ్యాంకర్స్‌ కూడా ఇందుకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఎక్కువ సంఖ్యలో స్వైపింగ్‌ మిషన్లు, ఏటీఎంలను పెంచాలన్నారు.

95శాతం కుటుంబాలకు బ్యాంక్‌ అకౌంట్స్‌
నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈటల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 95శాతం కుటుంబాలకు అకౌంట్స్‌ ఉన్నాయన్నారు. 70 లక్షల మంది రూపే కార్డులను తీసుకోగా... అందులో ఇంకా 46 లక్షల కార్డులు ఆక్టివేటే కాలేదన్నారు. వందశాతం క్యాస్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌ తీసుకురావాలంటే ఇంకా చాలా కష్టపడాలని మంత్రి అన్నారు.

10:16 - December 8, 2016

హైదరాబాద్ : తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోపోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతున్నారు. నిన్నటి వరకు రైతు పోరుయాత్రలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకున్న రేవంత్ ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు నడుం బిగిస్తున్నారు. ఈపోరాటం వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టనున్నారు.

యూనివర్సిటీ విద్యార్థులతో విద్యార్థి పోరు కార్యక్రమం
తెలంగాణలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి ఇచ్చిన హమీలను ఎంతవరకు నెరవేర్చింది అనే అంశాలను యూనివర్సిటీ విద్యార్ధులతో టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చర్చించున్నారు. బోధనా రుసుము చెల్లింపులు, యూనివర్సిటీలు నెలకొల్పడంలో ప్రభుత్వ చర్యలు, ఉపాధి అవకాశాలు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య తదితర అంశాలు కూడా విద్యార్థి పోరు కార్యక్రమంలో విద్యార్థులతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు.

రేషనలైజేషన్ పేరుతో 3,224 పాఠశాలలను మూసివేత
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యావిధానం ఎంతవరకు ఆశాజనకంగా ఉంది...ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు బోధనా రుసులు చెల్లించడంలో ప్రభుత్వ చూపిస్తున్న ఉదాసీన వైఖరి...రేషనలైజేషన్ పేరుతో 3 వేల 224 పాఠశాలలను మూసివేయడం......పాఠశాలలలో మౌలిక సదుపాయాల లేమి... ఉద్యోగాల భర్తీ లాంటి అంశాల విషయంలో ప్రభుత్వ తీరుపై విద్యార్థి లోకంతో చర్చించేందుకు రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నారు.

తెలుగునాడు విద్యార్థి విభాగం, తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యార్థి పోరు
విద్యార్థి పోరు కార్యక్రమాన్ని తెలుగునాడు విద్యార్థి విభాగం, తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించేందుకు టీడీపీ నేతలు సన్నాహలు చేస్తున్నారు. రైతు పోరుయాత్రలో కీలక పాత్ర పోషించిన వేం నరేందర్ రెడ్డితో పాటు పార్టీ మహిళా నేత సీతక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మరో నేత రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు గండ్ర సత్యనారాయణ కూడా విద్యార్థి పోరు కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

వరంగల్ లో మకాం వేసిన తెలుగు యువత నాయకులు
తెలుగు యువత నాయకులు వారం ముందు నుంచే వరంగల్ లో మకాం వేసి విద్యార్థులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రైతు పోరు యాత్ర జరిగినట్లే విద్యార్థి పోరు కార్యక్రమం కూడా సజావుగా సాగేందుకు టీడీపీ ముఖ్యనేతలందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ప్రయోగిస్తున్న పదునైన విమర్శల ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నం స్ధానిక నేతలు చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ చేసిన రైతు పోరు యాత్రకు ప్రజలు మంచి సంఘీభావం తెలపడంతో మంచి జోష్ మీదున్న టీడీపీ నేతలు విద్యార్థి పోరు కార్యక్రమంలో కూడా విద్యార్థి లోకం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

10:12 - December 8, 2016

హైదరాబాద్ : నత్తకు నడకను నేర్పతున్నట్లుగా సాగుతోంది ఎంఎంటీఎస్ రెండవ దశ పనులు. ప్రభుత్వం ప్రజా రవాణాపై ఎన్నో ప్రకటనలు చేస్త్నున్నప్పటికీ అవి ఆచరణకు నోచుకోవడం లేదు. రాజధాని వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే ఎంఎంటీఆఎస్ ఎంఎంటీఆఎస్ రెండవ దశ పనులు మూడడుగులు మందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది.

హైదరాబాద్ నగరంలో ప్రయాణం నరకం..నిత్యం ట్రాఫిక్ జాం
హైదరాబాద్ నగరంలో ప్రయాణమంటేనే నరకప్రాయం. ఎప్పుడు.. ఎక్కడ..ఏ రోడ్డులో ట్రాఫిక్ జాం అవుతుంతో చెప్పలేని పరిస్ధితి. నగరంలో లక్షలాదిగా కొత్త వాహనాలు వచ్చి చేరడం...నగర జనాభా వీపరీతంగా పెరగడమే దీనికి కారణం. అయితే దీనికి తోడు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజా రవాణా అందుబాటులోకి రాకపోవడంతో పాటు ప్రైవేటు వాహనాలు భారీగా పెరుగడంతో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ట్రాఫిక్ కష్టాలకు తగ్గించేందుకు ముందుకువచ్చిన ఎంఎంటీఎస్
ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా ముందుకు వచ్చిందే మల్టీమోడల్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్. ఇప్పటి వరకు సిటీలో ఫలక్ నూమా నుంచి సికింద్రాబాద్ మీదుగా లింగంపల్లి వరకు....నాపంల్లి నుంచి లింగపల్లి మరియు సికింద్రాబాద్ మార్గాల్లో ఈ రైళ్లు 43 కిమీలో మేర పరుగులు పెడుతున్నాయి. ఈ మార్గంలో ప్రతి రోజు లక్షా 50 వేల మంది ప్రయాణీకులు నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. అది కూడా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే.

2014లో ఎంఎంటీఆఎస్ రెండవ దశకు శ్రీకారం
ఎంఎంటీఆఎస్ మంచి ఫలితాలు ఇవ్వడంతో ఎంఎంటీఆఎస్ రెండవ దశకు అధికారులు శ్రీకారం చుట్టారు. 2014 జూలైలో ప్రారంభం అయిన ఈ ప్రాజెక్టు డిసెంబర్ 2017 నాటికి నగరవాసులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తియి 78 కి.మీ మార్గంలో ఎంఎంటీఆఎస్ అందుబాటులోకి వస్తే 5 లక్షల మంది నగరవాసులు తక్కువ ఖర్చుతో ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుతారు. అయితే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో అలసత్వం వహించడంతో పనులు అనుకున్న స్ధాయిలో జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఎంఎంటీఎస్ రెండవ దశకు రూ. 816.55 కోట్లు

ఎంఎంటీఎస్ రెండవ దశకు మొత్తం 816.55 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా ఇందులో రెండు భాగాలు అంటే 540 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఒక భాగం డబ్బులు రైల్వే శాఖ చెల్లించాలి. అయితే రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు కేవలం 281 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది.నిధుల లేమితో పనులు సకాలంలో పూర్తికావడం లేదు. మరో 12 నెలలు మాత్రమే గడువు ఉండటంతో 55 శాతం పైగా మిగిలిపోయిన పనులను ప్రభుత్వం ఎప్పుడు పూర్తి చేస్తుందని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

వేగంగా పూర్తి చెయ్యాలంటున్న ప్రజలు
హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్న పాలకులు ఇప్పటికైనా ప్రజారవాణాపై దృష్టి సారించి ఎంఎంటీఎస్ ను వేగంగా పూర్తి చెయ్యాల్సిన అసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

09:59 - December 8, 2016

తిరుమల : భక్తుల జేబులకు భారీగా చిల్లుపడుతోంది.. ఆర్‌బీఐ సర్వీస్‌ చార్జీలను రద్దుచేసినా ఇక్కడ ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు.. పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తులకు మరింత మెరుగ్గా సేవలు అందించాల్సిందిపోయి అదనపు భారం మోపుతున్నారు..

తిరుమలలో భక్తులు నిలువుదోపిడీ
తిరుమలలో భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు.. స్వైపింగ్‌ మిషన్‌ద్వారా చెల్లింపులకు ఇంకా సర్వీస్‌ చార్జీలు చెల్లిస్తూనేఉన్నారు.. ఇలా రోజుకు దాదాపు 45లక్షల రూపాయల్ని అదనంగా చెల్లిస్తున్నారు..

డెబిట్‌ కార్డులద్వారా కొనుగోళ్లపై సర్వీస్‌ చార్జీలు రద్దు
పెద్దనోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం చాలా ప్రోత్సాహకాలు ప్రకటించింది.. ఇందులోభాగంగా డెబిట్‌ కార్డులద్వారా కొనుగోళ్లపై ఆర్‌బీఐ సర్వీస్‌ చార్జీలు రద్దు చేసింది.. ఈ నిర్ణయం ప్రకటించి దాదాపు నాలుగు రోజులవుతున్నా తిరుమలలోమాత్రం బ్యాంకు అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు.. స్వైపింగ్‌ మిషన్ల ద్వారా జరిగే రూంల బుకింగ్‌లు, వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు, ప్రసాదం, పుస్తక విక్రయాలన్నింటికీ 2.07శాతం రుసుమును అధికారులు వసూలు చేస్తున్నారు..

సర్వీస్‌ చార్జీలు రద్దు చేస్తే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తప్పనిసరి
తిరుమలకు రోజూ 70నుంచి 80వేలమంది యాత్రికులు శ్రీవారి దర్శనానిని వస్తుంటారు.. వారాంతంలోఅయితే ఈ సంఖ్య లక్షకుపైగానే ఉంటుంది.. నోట్ల రద్దు తర్వాత ఇక్కడ అన్ని లావాదేవీల్ని స్వైపింగ్‌ మిషన్‌ ద్వారా చేపట్టారు.. ఈ పేమెంట్ల బాధ్యతల్ని గేట్‌వే సంస్థలు నిర్వహిస్తున్నాయి.. ఈ సంస్థలకు కమిషన్‌ ఇచ్చేందుకే ఇలా ఎక్కువ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.. ఈ చార్జీల్ని రద్దు చేస్తే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి.. ఈ పనిని అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులపై మరింత భారం పడుతూనే ఉంది..

దేవడి సన్నిధిలోనే సర్వీస్‌ చార్జీల మోత
సాక్షాత్తూ దేవడి సన్నిధిలోనే సర్వీస్‌ చార్జీల మోతతో భక్తులు అల్లాడిపోతున్నారు.. ఏడుకొండలపైనే ఈ పరిస్థితి ఉంటే ఇతర ప్రాంతాల్లో సంగతేంటని అధికారుల్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు. 

09:58 - December 8, 2016

మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెర మీద చూద్దామా అని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో ఎలా ఉన్నాడో..ఎలాంటి ఫైట్లు..డ్యాన్స్ లు చేశారోనని అభిమానులు ఆతృతగా ఉన్నారు. చిత్రానికి సంబంధించిన పలు ఫొటోలు రిలీజైన సంగతి తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల తరువాత 'చిరు' నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 150వ చిత్రం కావడంతో 'చిరు' కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలవుతోందని తెలుస్తోంది. రేపటి నుండి చిత్ర టీజర్ 'ధృవ' ప్రదర్శింపపడే అన్ని థియేటర్స్ లలో ప్రదర్శితం కానుందని తెలుస్తోంది. విజయవాడలో చిత్ర ఆడియోను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. మెగా వారసుడు 'రామ్ చరణ్' నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్టు 'కత్తి'కి రీమేక్ గా తెరకెక్కుతోంది. 'వినాయక్' డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో 'చిరంజీవి' పక్కన 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ డ్రామాకి మేసేజ్ ని జోడించి ఈ మూవీని వెరీ ఇంట్రెస్ట్ గా వినాయక్ మలుస్తున్నట్లు సమాచారం. మరి టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..

ముంబై : వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ జట్టులో బ్రాడ్ స్థానంలో బాల్ జట్టులోకి వచ్చాడు. భారత జట్టులో షమీ స్థానంలో భువనేశ్వర్ కుమార్, గాయపడ్డ రహానే స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చారు. 84 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఒకే ఒక్కసారి సాధించిన ఐదు సిరీస్‌ల రికార్డును రిపీట్ చేయాలని టీమిండియా.. చావోరేవో తేల్చుకునేందుకు ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి.

ఎంపీ భర్తకు అరెస్ట్ వారెంట్!..

హైదరాబాద్‌: అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త, విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన పి.రామకోటేశ్వరరావుకు బుధవారం నాంపల్లి కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పెట్టిన చెల్లని చెక్కు కేసులో కింది కోర్టు రామకోటేశ్వరరావుకు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రామకోటేశ్వరరావు అప్పీలు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు హాజరుకాకుండా పదే పదే వాయిదాలు కోరుతుండటంతో కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

09:23 - December 8, 2016

సమత ఎక్స్ ప్రెస్ కు మంత్రి గ్రీన్ సిగ్నల్..

ఢిల్లీ : కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు విశాఖ స్టీల్ సమత ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో మంత్రి సురేష్ ప్రభు జెండా ఊపి ఈ రైలు ప్రారంభించారు. హజ్రత్ నిజాముద్దీన్ విశాఖపట్నం మధ్య ఈ రైలు తన సేవలను అందించనుంది. ఈ ఎక్స్ ప్రెస్ లో విశాఖ స్టీల్పఆ్ంట్ విశేషాలను ప్రదర్శించారు. 

09:09 - December 8, 2016

విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది మరో 24 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. విశాఖ పట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 900 కి.మీటర్ల దూరంలో ..అటు మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 1100 కి.మీటర్లు..పోర్టు బ్లెయర్ కు దక్షిణ నైరుతి దిశలో 250 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైవుంది. ఈనెల 12న ఆంధ్రాతీరాన్ని తాకే అవకాశమున్నట్లుగా భావిస్తున్నారు. దీంతో 11 నుండి కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుండి వర్షాలు కురిసే అవకాశమున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

09:03 - December 8, 2016

హైదరాబాద్ : పాత పెద్దనోట్లు రద్దు చేసిన నేటికి సరిగ్గా 30రోజులయ్యింది. సామాన్యుల ఇంట్లో ఏ శుభకార్యమూ జరగటంలేదు. నిర్ణయించుకున్న శుభకార్యాలను కూడా నగదు సమస్యతో వాయిదా వేసుకునే పరిస్థితులను సామాన్యులు ఎదుర్కొంటున్నారు. కానీ పెద్దవారి ఇంటమాత్రం పెళ్లి బాజాలు మ్రోగుతూనే వున్నాయి. నుదుటిన పెండ్లి తిలకం దిద్దుకుని..బుగ్గన చుక్క పెట్టుకుని పెండ్లి కుమారులు..కుమార్తెలు బ్యాంకులకు వచ్చి నగదు కోసం పడరాని పాట్లు పడుతూనే వున్నారు. 30 రోజులు గడిచినా సామాన్యుల కరెన్సీ కష్టాలు మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు..బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు..ఏటీఎంల వద్ద అవుటాఫ్ సర్వీస్ బోర్డు దర్శనిమిస్తూనే వున్నాయి. రూ.రెండువేల నోట్లకు దొరకని చిల్లరతో నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బందులు పడుతూనే వున్నారు. 30రోజులైనా ఇంతవరకూ రూ.500ల నోట్లు దొరకని పరిస్థితి నెలకొంది. నగదు పెట్టిన కాసేపట్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్న పరిస్థితులు కొనసాగుతూనే వున్నాయి. పలు సెంటర్లలో ఏటీఎంలు పనిచేయటంలేదు. అబిట్స్ ఎస్బీహెచ్ వద్ద ఎటువంటి పరిస్థితి వుందో చూడండి..

 

08:55 - December 8, 2016

సొట్టబుగ్గల సుందరి 'తాప్సీ' ఫుల్ హ్యపీ గా ఉంది. ఈ బ్యూటీకి టాలీవుడ్ కలిసి రాలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది. చూస్తుంటే ఈ హీరోయిన్ ఇక బాలీవుడ్ లో సెట్ అయినట్లే కనిపిస్తుంది. 'తాప్సీ' చాలా ఆనందంగా వున్నానంటోంది. కారణం బాలీవుడ్‌లో తన కెరీర్‌ మంచి జోరు మీదుంటుండడమేనట. బీటౌన్ లో ఈ ఎడాది 'తాప్సీ' నటించిన 'పింక్‌' సూపర్ హిట్టు అయింది. అంతేకాదు ఈ సినిమా అవార్డుల మీద అవార్డుల్ని సొంతం చేసుకుంటోంది. 'పింక్' సినిమా ప్రమోషన్‌ బాధ్యతల్ని భుజాన వేసుకున్న ఈ బ్యూటీకి ఈ మూవీ విజయం సాధించడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

నామ్ షబానా..
'తాప్సీ' బాలీవుడ్ లో ప్రస్తుతం 'నామ్‌ షబానా' సినిమా చేస్తుంది. ఈ మూవీ తన కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్‌ అంటూ ఈ బ్యూటీ పొంగిపోతోంది. ఈ మూవీతో పాటు బాలీవుడ్ లో 'ఘాజీ’, 'తడ్కా', 'జూడ్వా' మూవీస్ చేస్తోంది. 'తాప్సీ' అంటే మన టాలీవుడ్‌ ఆడియన్స్ కి కేవలం గ్లామర్‌ డాల్‌ మాత్రమే కానీ బాలీవుడ్‌లో మాత్రం 'తాప్సీ' డిఫరెంట్ క్యారెక్టర్స్ తో నటిగా పేరు తెచ్చుకొంటోంది. చూస్తుంటే 'తాప్సీ' సౌత్ కి టాటా చెప్పేసినట్లు టాక్. 'గుండెల్లో గోదారి' మూవీ తరువాత ఈ బ్యూటీ తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. దీంతో 'తాప్సీ' బాలీవుడ్ పైనే టోటల్ ఫోకస్ పెట్టింది. లక్ బాగుండి బాలీవుడ్ లో ఈ చిన్నది చేస్తున్న సినిమాలు కూడా మంచి విజయాలు అందుకుంటున్నాయి. బాలీవుడ్‌కి వెళ్ళాక సినిమా గురించి చాలా నేర్చుకున్నాననీ, సినిమాకు సంబంధించి విభాగాలపైనా అవగాహన పెంచుకున్నానని మురిసిపోతోంది. మొత్తానికి 'తాప్సీ'కి బాలీవుడ్ నీళ్లు బాగానే పడ్డాయనే చెప్పాలి.

08:49 - December 8, 2016

2016లో ఒక్క మూవీ కూడా రిలీజ్ చేయలేదు హీరో 'గోపీచంద్'. 'సౌఖ్యం' ఫ్లాప్ నుంచి వీలైనంత త్వరగా బయటపడి ట్రాక్ లోకి వచ్చేయాలని 'గోపీచంద్' ప్లాన్స్ అన్నీ రివర్స్ అయిపోయాయ్. దీంతో ఈ ఏడాది వస్తాయనుకున్న సినిమాలన్నీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిపోయాయ్. నిజానికి 'గోపీచంద్' 'ఆక్సిజన్' మూవీ దీపావళికే రావాలి. అయితే చిత్ర దర్శకుడు ఏఎం జ్యోతిక్రిష్ణతో డిఫరెన్సెస్ రావడంతో షూటింగ్ డీలే అయింది. ఫైనల్ గా 'గోపీచంద్', 'జ్యోతిక్రిష్ణ' మధ్య రాజీ కుదరడంతో మళ్లీ 'ఆక్సిజన్' మూవీ పట్టాలెక్కింది. 

వచ్చే ఏడాది మూడు సినిమాలు..
మిగిలిన ఇంకో పావుశాతం షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి 'ఆక్సిజన్' ని ఫిబ్రవరి లేదా మార్చిలో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. 'ఆక్సిజన్' మూవీతో పాటు సీనియర్ దర్శకుడు బి.గోపాల్ డైరెక్షన్ లో రెండేళ్ల కిందట మొదలై ఆగిపోయిన సినిమాను కూడా మళ్లీ పట్టాలెక్కించాలని 'గోపీచంద్' సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఎడాది స్టార్టింగ్ లోనే రిలీజ్ చేసేలా చూస్తున్నారు. ఇక ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో చేస్తున్న కొత్త మూవీ ఫాస్ట్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాను కూడా మే లేదా ఆగస్ట్ లో రిలీజ్ కానుంది. ఇలా వచ్చే ఎడాది 'గోపీచంద్' వరుసగా మూడు సినిమాలు రిలీజ్ చేసేలా స్కెచ్ వేశాడు. 2017 లో ఖాళీ లేకుండా ఈ హీరో బాగానే ప్లాన్ చేసుకున్నాడు.

టీమిండియాకు ఇంగ్లండ్ కళ్లెం వేసేనా?..

ముంబై : భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టుకు మరికొద్ది సేపట్లో తెరలేవనుంది. 84 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఒకే ఒక్కసారి సాధించిన ఐదు సిరీస్‌ల రికార్డును రిపీట్ చేయాలని టీమిండియా.. చావోరేవో తేల్చుకునేందుకు ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాలుగో టెస్ట్ జరగనుంది. గత రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి జోరుమీదున్న టీమిండియా అదే జోరు కొనసాగించాలని భావిస్తుండగా ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్ జోరుకు కళ్లెం వేయాలని ఇంగ్లష్ జట్టు భావిస్తోంది.

బ్యాంకుల 3రోజుల సెలవులు..ప్రజలకు మరిన్నికష్టాలు..

హైదరాబాద్: పెద్దనోట్లు రద్దు నేపథ్యంలో గత 30 రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మూడురోజులు బ్యాంకుల సెలవులతో మరిన్ని కష్టాలు రానున్నాయి. వచ్చే శనివారం రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. అలాగే ఆదివారం సాదారణ సెలవు, సోమవారం షిల్లార్‌-ఉల్‌-నబీ ముస్లీంల పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు. రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు అనంతరం ఈ రోజుకాకుంటే రేపైనా కరెన్సీ కష్టాలు తీరుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

అగ్నిప్రమాదంలో 18 గుడిసెలు దగ్థం..

కర్నూలు : నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాణిమహారాణి థియేటర్‌ దగ్గర అర్దరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 18 గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం జరుగకపోయినా పేదలకు చెందిన రూ.15 లక్షల ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.

అమరావతి నిర్మాణంలో సినీ జక్కన్న..

అమరావతి : బాహుబలి సినిమాతో భారతీయ సినీరంగంలో సంచలనం సృష్టించిన దర్శకుడు రాజమౌళి సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకోవాలని చూస్తోంది. దేశ సంస్కృతి, చరిత్రపై మంచిపట్టున్న జక్కన్న సేవలను ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాల ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 

అన్నాడీఎంకేలో వారసత్వ పోరు షురూ..

తమిళనాడు : దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ఇలా ముగిశాయో లేదో.. వారసత్వ పోరు అలా మొదలైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి జయ నెచ్చెలి శశికళ సహా సీనియర్ నేతలు సెంగొట్టయ్యన్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైలు పోటీపడుతున్నారు. 

ఉత్తరాదిని కప్పేసిన పొగమంచు..

ఢిల్లీ : ఉత్తరాదిని పొగమంచు కప్పేసింది. దీంతో ప్రయాణాలకు మంచు అంతరాయం కలిగిస్తోంది.ఢిల్లీ వాసులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలు విమాన..రైళ్ళను అధికారులు రద్దు చేశారు. పొంగమంచుతో రోడ్లు వాహనాలు కనిపించకపోవటంతో ప్రజలు పలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో మూడు రైళ్ళను అధికారులు రద్దు చేశారు. మరో 15 రైళ్ళ రాకపోకల సమయాలల్లో మార్పు చేశారు. దాదాపు 94 రైళ్లు ఆలస్యం నడుస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.

 

 

08:19 - December 8, 2016

ఢిల్లీ : శీతాకాలం వచ్చిందంటే చాలు ఉత్తరాది రాష్ట్రాలు హిమ సొగసులు సంతరించుకుంటాయి. చలిదుప్పటిని కప్పుకుంటాయి. చలిని తట్టుకునేందుకు ఆ ప్రాంత వాసులంతా వేడి వేడి చాయ్ తో సేదతీరుతారు. ఇదే క్రమంలో ప్రయాణాలకు మంచు అంతరాయం కలిగిస్తూంటుంది. దీంతో ఢిల్లీ వాసులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలు విమాన..రైళ్లు..విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. పొంగమంచుతో రోడ్లు వాహనాలు కనిపించకపోవటంతో ప్రజలు పలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో మూడు రైళ్ళను అధికారులు రద్దు చేశారు. మరో 15 రైళ్ళ రాకపోకల సమయాలల్లో మార్పు చేశారు. దాదాపు 94 రైళ్లు ఆలస్యం నడుస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుమల : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది. ఈ ఉదయానికి 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

08:09 - December 8, 2016

రియల్ ఎస్టేట్ రంగం నోట్ల రద్దు సుడిగుండంలో చిక్కుకుంది. నిర్మాణ రంగం మీద తీవ్ర ప్రభావం వుంటుందన్న అంచనాలున్నాయి. భవన నిర్మాణరంగంలో పనిచేస్తున్న వివిధ వృత్తులవారి భవిష్యత్ ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత కరెన్సీ సమస్య తలెత్తడంతో కొన్ని చోట్ల ఇప్పటికే నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇసుక, సిమెంట్, ఐరన్ కొనుగోళ్లు పెద్ద సమస్యగా మారడం, వర్కర్లకు చెల్లించేందుకు చేతిలో కరెన్సీ లేకపోవడంతో నిర్మాణరంగం పడకేసింది. మరోవైపు భూములు, ఇళ్ల ధరలు పడిపోతాయన్న అంచనాతో చాలామంది కొనుగోళ్లు వాయిదా వేస్తున్నారు. నవంబర్ నుంచి నిర్మాణరంగానికి సీజన్ మొదలవుతోంది. సీజన్ ప్రారంభంలోనే కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో పూట గడవని స్థితిలో కార్మికులు చిక్కుకున్నారు. నోట్ల రద్దు తర్వాత నిర్మాణ రంగం కార్మికులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ కన్ స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేత కోటంరాజు 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమచారానికి వీడియో చూడండి..

08:06 - December 8, 2016

నోట్ల రద్దు చేసిన నేటి 30 రోజులయ్యింది. కానీ ప్రజల కష్టాలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. ఏటీఎంల వద్ద బ్యాంకుల వద్ద లైన్లలో నిలబడి ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే వున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మరోపక్క ఐడీఎస్ పేరుతో ఐటీ దాడులు చేపడుతున్నామంటూ కేంద్రం హడావిడి..ఈ క్రమంలోనే  ఐడీఎస్‌ స్కీం కింద రూ. 10వేల కోట్ల ఆస్తి ఉందని జూబ్లీహిల్స్ లోని బిల్డర్  లక్ష్మణ్‌రావు ప్రకటించారు..దీంతో లక్ష్మణరావుతో పాటు మరో ఇద్దరు బిల్డర్స్ నివాసాలపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం డొల్లేనా..? స్వచ్ఛందంగా బ్లాక్‌మనీని ప్రకటించేందుకు ఉద్దేశించిన ఐడీఎస్‌ తుస్సుమన్నట్లేనా..? 65వేల కోట్ల నల్లధనం వెలుగులోకి వచ్చిందన్న ప్రభుత్వ ప్రకటనలోనే వాస్తవమెంత..? అసలు ఈ పథకం ప్రవేశపెట్టి.. కేంద్రం ఏం ఉద్ధరించినట్లు..! ఏం లబ్దిపొందినట్లు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మేధావులు, ఆర్థిక నిపుణుల మెదళ్లను తొలుస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు..! ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వి.శ్రీనివాస రావు (సీపీఎం జాతీయ కార్యవర్గ  సభ్యులు) ప్రేమంత్ రెడ్డి (బీజేపీ నేత) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నేత శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ప్రజలకోసమే కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని బీజేపీ నేత ప్రేమంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

07:59 - December 8, 2016

హైదరాబాద్ : ఈ నెల 10న ఉస్మానియా మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్ధుల మీటింగ్ జరగనుందని.. కలయిక కేవలం అనుభవాలు పంచుకోవడం కోసం మాత్రం కాదని ప్రపంచ వ్యాప్తంగా మెడికల్ విద్యలో వస్తున్న మార్పులు... వైద్యరంగంలో చోటు చేసుకున్న నూతన పరిణామాల గురించి చర్చిస్తామని డాక్టర్ రంగయ్య పేర్కొన్నారు. 1966 వ సంవత్సరంలో ఎంబీబీఎస్‌ లో చేరిన 150మంది మెడికల్ విద్యార్ధులు యాభై ఏళ్ల తరువాత కలిసి గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నారు. ఈనెల 10 నుంచి 13 వరకు ఓఎస్ఎంఈసీఏ 66 గోల్డ్ అనే పేరుతో ఉస్మానియా మెడికల్ కాలేజీ, అలంక్రితా రిసార్టులో పూర్వ విద్యార్ధుల ఈ మీట్ జరగబోతోంది. 

07:56 - December 8, 2016

అనంతపురం : ఎన్టీఆర్‌ వైద్యసేవపై బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమేనా అని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను జీర్ణించుకోలేకే వైసీపీ కలెక్టరేట్ల ధర్నాకు పిలుపునిచ్చిందని తప్పుపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా... వైసీపీని ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న వైద్యసేవలపై బహిరంగ లేఖ విడుదల చేస్తానని... దానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని అనంతపురంలో అన్నారు.

07:52 - December 8, 2016

నిజామాబాద్ : ఇప్పటివరకు ఆ గ్రామం పేరు ఖానాపూర్‌. ఇక ముందు మాత్రం ఆ ఊరి పేరు కవితాపూర్‌. కవిత అంటే కల్వకుంట్ల కవితేనా...? అవును అక్షరాలా మీరూహించింది కరెక్టే. ఎంపీ కవిత పేరు మీదుగా నిజామాబాద్‌ జిల్లాలోని ఖానాపూర్‌ పేరును కవితాపూర్‌గా మార్చారు. ఇంతకీ ఎందుకలా విలేజ్‌ పేరు మార్చాలని నిర్ణయించారు...? ఖానాపూర్‌ కాస్త..కవితాపూర్‌గా మారడంలో కహానీ ఏంటీ..? ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తోంది.

ఖానాపూర్‌ను కవితాపూర్ గా పేరు మార్పు
ఈ ఊరి పేరు ఖానాపూర్‌. నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ మండలంలోని ఈ గ్రామం ఉన్నట్టుండి వార్తల్లోకెక్కింది. ఇప్పటివరకు ఖానాపూర్‌గా ఉన్న ఈ గ్రామం.. ఇక కవితాపూర్‌గా పిలుచుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. నిర్ణయించిందే తడవుగా ఓ బ్రోచర్‌ను కూడా రూపొందించి ఎంపీ కవిత చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

గ్రామం పేరు మార్చేందుకు గ్రామస్థుల నిర్ణయం...
ఖానాపూర్‌ గ్రామాన్ని కవితాపూర్‌గా మార్చడానికి ఓ కారణమూ ఉంది. అదేంటంటే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో భాగంగా గతంలో తమ గ్రామం ముంపు గ్రామంగా ఉండటంతో నాడు ఇళ్లు కోల్పోయిన వారికి అప్పటి ప్రభుత్వాలు ఏళ్లు గడిచినా ఇళ్లు కేటాయించలేదు. కాంగ్రెస్‌ హయాంలో నాయకుల చుట్టూ తిరిగిన గ్రామస్తులు ఇళ్ల స్థలాలు మాత్రం సాధించుకోలేక పోయారు. ప్రభుత్వం మారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో.. ఎంపీ కవిత చొరవతో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. దీంతో గ్రామస్థులంతా ఆనందం వ్యక్తం చేస్తూ.... తమ గ్రామం పేరు మార్చేందుకు నిర్ణయించారు.

గ్రామస్తుల కోరిక మేరకు కవిత అంగీకారం.. బ్రోచర్‌ను ఆవిష్కరణ
ఖానాపూర్ గ్రామాన్ని ఇక నుంచి కవితాపూర్‌గా మార్చుకుంటామని గ్రామానికి చెందిన నాయకులు, వీడీసీ సభ్యులు, ఇళ్ల స్థలాల కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లి ఎంపీ కవితను కూడా కలిశారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి గ్రామ పేరు మార్పునకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామంలో 274 ఇళ్ల స్థలాలను ప్రభుత్వమే ఇచ్చిందని.. కాంగ్రెస్ హయాంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నో సార్లు వారి చుట్టు తిప్పించుకున్నారని ఆ గ్రామస్తులు వాపోయారు.

కవితే మా ఆరాధ్య దేవత : గ్రామాస్తులు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి ఆశగా ఎదురు చూసిన సమస్యను ఎంపీ కవిత నెరవేర్చటంతో గ్రామస్తులంతా తమ ఆరాధ్య నేత పేరునే తమ ఊరికి పెట్టుకోవాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామస్తులు పేరు మార్పు బ్రోచర్‌ను ఎంపీ కవితకు సమర్పించారు. దీంతో వారి కోరికను కాదనలేకపోయారు ఎంపీ కవిత.

 

07:47 - December 8, 2016

నిజామాబాద్ : నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ మూతపడి వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని, కార్మికులు, పేదలు రోడ్డు పాలవ్వడమే బంగారు తెలంగాణనా..? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. షుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపించి ప్రభుత్వమే దాన్ని నడిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా... పల్లెపల్లెను చైతన్య పరుస్తూ.. ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర నిజామాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. 52 వ రోజు గ్రామాల్లో పర్యటించిన పాదయాత్ర బృందం స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది. కార్మికులు, కర్షకులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తె‌స్తున్నారు. 52వ రోజు పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో వర్నిలో ప్రారంభమై.. అక్బర్‌నగర్, రాకాసిపేట, బోధన్‌, చక్కర్‌నగర్‌, ఎర్రాజుపల్లి, ఎడపల్లి వరకు కొనసాగింది. సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు పాదయాత్రలో పాల్గొన్నారు.

అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నిజాం సుగర్స్‌ ఫ్యాక్టరీ అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ అంశాన్ని చర్చించాలని ఆయన డిమాండ్‌ చేశారు. షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని.. బంగారు తెలంగాణ అంటే... పేదలు, కార్మికులను రోడ్డున పడేయడమేనా అని తమ్మినేని ప్రశ్నించారు. తెలంగాణకు గర్వకారణమైన ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీని నడపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యావవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.

52వ రోజు నాటికి పాదయాత్ర 1330 కిలోమీటర్లు పూర్తి
52వ రోజు నాటికి పాదయాత్ర 1330 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. జోగిని సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. జోగిని వ్యవస్థను రూపుమాపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 

07:41 - December 8, 2016

కర్నూలు : పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పనులు మానుకొని ప్రజలంతా బ్యాంకులచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గంటలకొద్దీ క్యూలో నిల్చుని అమాయక ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో రైతులు ఆందోళనబాట పడుతున్నారు.

యూటీఎఫ్‌, మెడికల్‌ రిప్స్‌, రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సదస్సు
పెద్దనోట్ల రద్దు - ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కర్నూలులో యూటీఎఫ్‌, మెడికల్‌ రిప్స్‌, రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి.. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఆయన విఫలప్రయత్నంగా అభివర్ణించారు. మోదీ ఏకపక్ష నిర్ణయంతో సామాన్యులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఇదే సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీ గేయానంద్‌ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బ్యాంకుల దగ్గర క్యూలైన్‌లో నిలబడి చనిపోయిన కుటుంబాలకు మోదీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

పింఛన్‌ డబ్బులు కోసం వెళ్ళి లచ్చమ్మ మృతి
మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రానికి చెందిన లచ్చమ్మ అనే వృద్ధురాలు పింఛన్‌ డబ్బులు తీసుకునేందుకు ఎస్‌బీహెచ్‌కు వెళ్లింది. అప్పటికే బ్యాంకు దగ్గర జనం బారులు తీరి ఉండడంతో చేసేదేమిలేక క్యూలో నిల్చుంది. గంటల కొద్దీ ఎండలోనే పడిగాపులు గాసింది. తీరా బ్యాంకు లోపలికి వెళ్తుండగా స్పృహతప్పి కుప్పకూలింది. దీంతో లచ్చమ్మను చికిత్స కోసం నారాయణఖేడ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో సంగారెడ్డికి తరలించాలని వైద్యులు సూచించారు. హుటాహుటిన సంగారెడ్డికి తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది.

నగదు కోసం రైతులు అష్టకష్టాలు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామంలో నగదు కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దుర్కిలోని సిండికేట్‌ బ్యాంకు దగ్గర రైతులు రాత్రి వరకు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి దాపురించింది. ఉదయం ఏడు గంటల నుంచి రైతులు బ్యాంకు దగ్గర క్యూలో నిల్చోగా... మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బ్యాంక్‌ అధికారులు డబ్బులు లేవని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు రహదారిపై బైఠాయించి రస్తారోకో నిర్వహించారు. పోలీసులు జోక్యంతో బ్యాంకు అధికారులు నగదు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో రాత్రి 9 గంటల వరకు రైతులు క్యూలోనే నిల్చున్నారు.

అనంతపురంలో పలువురు మంత్రుల పర్యటన
అనంతపురంలోని పలు చౌక దుకాణాలు, హోటల్స్‌లో మంత్రి పరిటాల సునీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వినియోగదారుల సౌకర్యార్ధం స్వైప్‌మిషన్లు ఏర్పాటు చేయాలని షాపు యజమానులకు సూచించారు. అటు రెవెన్యూ భవన్‌లో మంత్రి కామినేని శ్రీనివాస్‌ బ్యాంకర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభాన్ని త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు.

ఎస్‌బీఐ దగ్గర ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి పల్లె
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నగదు కోసం బ్యాంకుల దగ్గర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. స్థానిక ఎస్‌బీఐ దగ్గర ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 

07:31 - December 8, 2016

గుంటూరు : పోలవరం పనులకు వైఎస్ జగన్ సైంధవుడిలా తయారయ్యాడని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలవరం నిర్మాణ పనులపై జగన్, విజయసాయిరెడ్డి పక్క రాష్ట్రాలకు ఉప్పందిస్తూ ప్రజాద్రోహానికి పాల్పడుతున్నారని ఉమ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ ఆవాకులు చవాకులు పేలడం తగదన్నారు. జగన్ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోలేరని, పోలవరం కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి ఉమభారతితోపాటు ఇతర మంత్రులను ఆహ్వానిస్తామన్నారు. పోలవరాన్ని అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగులుతారని దేవినేని మండిపడ్డారు. 

07:28 - December 8, 2016

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు అన్ని విధాల అండగాల నిలవాలని వైసీపీ నిర్ణయించింది. పరిహారం నుంచి పునరావసం వరకు అన్ని విషయాల్లో చేదోడువాడోడుగా ఉంటామని పార్టీ అధినేత జగన్‌ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ఎంత ముఖ్యమో, నిర్వాసితులకు పునరావాసం కూడా అంతే ప్రధానమని తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో జగన్‌ చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లాలో జగన్ రెండు రోజుల పర్యటన
తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు బుధవారం రాజమండ్రి చేరుకున్న వైసీపీ అధినేత జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పార్టీ నేతులు, కార్యకర్తలను కలుసుకున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికపై పని చేస్తున్న అధ్యాపకులను జగన్‌ కలుసుకున్నారు. వారి సమస్యలు విన్నారు. ఏళ్లతరబడి తక్కువ జీతంతో పని చేస్తున్న తమ ఉద్యోగాలను క్రబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్ట్‌ అధ్యాకులు కోరారు. ఈ విషయాన్ని అసెంబ్లీ ప్రస్తావించి పరిష్కారమయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

రంపచోడవరంలో జగన్
రాజమండ్రి నుంచి రంపచోడవరం చేరుకున్న జగన్‌కు గిరిజనులు సంప్రదయాబద్ధంగా స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పోలవరం నిర్వాసితులు జగన్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

రెండోరోజు కూడా జగన్ పర్యటన కొనసాగింపు
పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్‌ ఈ సందర్భంగా విమర్శించారు. ఇవాళ రెండో రోజు కూడా జగన్ ఏజెన్సీలో పర్యటిస్తారు. మారేడుమిల్లి నుంచి బయలుదేరి చింతూరు మీదగా కూనవరం చేరుకుంటారు. రేఖపల్లిలో పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అన్నవరం చేరుకుని కాళ్లవాపు వ్యాధితో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. అక్కడ నుంచి రాజమండ్రి చేరుకుని హైదరాబాద్‌ బయలుదేరతారు. 

07:27 - December 8, 2016

గుంటూరు : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతిపక్ష నేత జనగ్‌ రాజకీయలబ్ధి కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుపెట్టుకుని గిరిజనులను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం, వార్షికాభివృద్ధి రేటు పెంపుకు తీసకోవాల్సిన చర్యలతోపాటు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వంటి అంశాలపై చర్చించారు.

పోలవరం నిర్వాసితులుకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించేందుకు చర్యలు ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. నిర్వాసితులు పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిపక్ష నేత జగన్‌ పోవరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, రాజకీయలబ్ధి కోసం గిరిజనులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తాం
అభివృద్ధిలో ఏపీని ప్రపచంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలని చంద్రబాబు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. గతేడాది మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా రెండంకెల అభివృద్ధి సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం కంటే రాష్ట్రమే మెరుగైన స్థాయిలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గతేడాడి 10.99 శాతం వృద్ధి రేటు సాధిస్తే... 2016-17 మొదటి అర్థభాగంలోనే 12.23 శాంత వృద్ధి సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిని 15 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ఇందుకు అనుగుణంగా అందరూ కలసినట్టుగా పని చేయాలని కోరారు.

నగదు కొరత తీర్చేందుకు చర్యలు..
నగదు కొరతతో గ్రామీణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను సాధ్యమైనంత తర్వగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

Don't Miss