Activities calendar

04 December 2016

ఇస్రో మరో ప్రయోగం..

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 7న పిఎస్‌ఎల్‌వి సి 36 ఉపగ్రహ వాహన నౌకతో ‘రిసోర్స్‌శాట్-2ఎ’ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది.

త్రిపురకు వెళ్లిన డిప్యూటి సీఎం కడియం..

హైదరాబాద్ : డిప్యూటి సీఎం కడియం శ్రీహరి త్రిపురకు వెళ్లారు. అక్షరాస్యతలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో త్రిపుర రాష్ట్రం ఉన్న సంగతి తెలిసిందే. అక్షరాస్యతపై అధ్యయనం చేసేందుకు కడియం శ్రీహరి ఆదివారం ఉదయం వెళ్లారు.

పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేనా..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు రగడ కొనసాగుతోంది. సోమవారం నాడు కొనసాగే ఉభయ సభల్లో రగడ చెలరేగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సభ్యులకు విప్ లు జారీ చేశాయి.

21:30 - December 4, 2016

లక్షలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య... క్యూబా విప్లవయోధుడు ఫిడెల్ కాస్ట్రో అంత్యక్రియలు ముగిశాయి. కాస్ట్రో చితాభస్మాన్ని శాంటియాగాలో సంప్రదాయబద్ధంగా సమాధి చేశారు. అంతకుముందు కాస్ట్రో చితాభస్మాన్ని ప్రజలు పెద్దఎత్తున సందర్శించారు. ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. క్యూబా విప్లవ యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో అంత్యక్రియలు ఆదివారం శాంటియాగోలో ముగిశాయి. క్యూబా విప్లవ జ్యోతి ఫిడెల్‌ కాస్ట్రో చితాభస్మం ఉన్న కలశాన్ని శాంటా ఐఫిజెనియా స్మశానవాటికలో సంప్రదాయ బద్ధంగా సమాధి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు హాజరై క్యాస్ట్రోకు నివాళలర్పించారు.

27న దహన సంస్కారాలు..
కాస్ట్రో భౌతిక కాయానికి గత ఆదివారం నవంబర్‌ 27న దహన సంస్కారాలు నిర్వహించారు. కాస్ట్రో రాసుకున్న విల్లు మేరకే ఆయన మృతదేహాన్ని దహనం చేశారు. ఆ తర్వాత కాస్ట్రో చితాభస్మం ఉన్న పాత్రను క్యూబా జాతీయ పతాకం కప్పిన అద్దాలపెట్టెలో ఉంచి ప్రజల సందర్శనార్థం వివిధ ప్రాంతాల్లో ఊరేగించారు. హవానాలో రెండురోజుల శ్రద్ధాంజలి అనంతరం కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు గత బుధవారం ప్రారంభమైంది. గురువారం అర్ధరాత్రి ఆ చితాభస్మం శాంటాక్లారాలోని ఆయన ఉద్యమ సహచరుడు చెగువెరా సమాధి మ్యూజియం ఉన్న సముదాయానికి చేరింది. హవానా నుంచి పలు పట్టణాల మీదుగా నాలుగు రోజుల పాటు 800 కిలోమీటర్ల మేర ప్రయాణించిన క్యాస్ట్రో చితాభస్మపు పేటిక.. ఆదివారం శాంటియాగోకు చేరుకుంది. శాంటాఐఫిజెనియా స్మశానవాటికలో.. 19వ శతాబ్దపు స్వాతంత్య్ర యోధుడు జోస్ మార్టి సమాధి పక్కన.. కాస్ట్రో చితాభస్మాన్ని సమాధి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధి నేతలు, అధికారులు హాజరయ్యారు.

21:28 - December 4, 2016

న్యూఢిల్లీ : ఒకవైపు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తలెత్తిన ప్రతిష్ఠంభన కొనసాగుతుండగా,.మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది. సోమవారం పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు ఈ విప్ జారీ అయింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశమవుతుండగా, లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహాంపై కాంగ్రెస్ పార్టీ ఉదయం 10.30 గంటలకు సమావేశమవుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు...అటు బీజేపి కూడా లోక్‌సభ, రాజ్యసభ సభ్యుంలందరికి విప్‌ జారీచేసింది. సోమవారం పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ విప్‌లో పేర్కొంది. దీంతో సోమవారం నాడు లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష, అధికార పక్షాల ఆందోళనలతో అట్టుడికే అవకాశం కన్పిస్తోంది.

21:26 - December 4, 2016

హైదరాబాద్ : ఆసుపత్రి కల్యాణ వేదికైంది... వైద్యులు కన్యాదాతలయ్యారు.. హస్పిటల్‌ సిబ్బంది బంధువులై ఆశీర్వదించారు. సాక్షాత్తు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి.. ఈ అపురూప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి ఏంటి.. అందులో పెళ్లి వేడుక ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే మీ అనుమానం తీర్చుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సికిందరాబాద్‌లోని యశోద ఆసుపత్రి కల్యాణోత్సవానికి వేదికైంది. ఇక్కడ జరిగిన సామూహిక వివాహ మహోత్సవం ఆదర్శనీయంగా.. స్పూర్తిదాయకంగా నిలిచింది. యశోద ఆసుపత్రి నిర్వాహకులు.. కొన్నేళ్లుగా యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ ద్వారా పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఈ సామూహిక వివాహ వేడుకను జరిపారు.

2వేల 51 మంది వివాహం..
యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఇప్పటి వరకు 2వేల 51 మంది అనాథ యువతులకు విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి సమాజంలో సమున్నత స్థానాన్ని కల్పించింది. అంతటితో తమ బాధ్యత తీరిందని ఊరుకోలేదు. ఆ ఆడపడుచులకు మంచి సంబంధాలు వెతికి.. పెళ్లిళ్లూ జరిపిస్తూ వస్తోందీ ఫౌండేషన్‌. ఇదే క్రమంలో ఆదివారం మరో మూడు జంటలకు పెళ్లిళ్లు జరిపించారు యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు. సంస్థ వద్ద ఆశ్రయం పొందిన 2వేల 51మంది.. సంప్రదాయ దుస్తుల్లో ఈ పెళ్లిళ్లకు హాజరై.. కొత్త జంటలకు అభినందనలు, శుభాకాంక్షలు అందజేశారు.
అనాథలను అన్ని విధాలా ఆదుకోవడం చాలా గొప్ప విషయమని సామూహిక వివాహాలకు హాజరైన మంత్రి పోచారం అన్నారు. యువతులకు మంచి సంబంధాలు చూసి ఓ ఇంటివాళ్లను చేసిన యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఇతర స్వచ్చంద సంస్థలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇన్ని రోజులు తమను చేరదీసి.. విద్యాబుద్ధులు చెప్పించి, ఉద్యోగాలు ఇప్పించడంతో బాధ్యత తీరిందనుకోకుండా.. తమకు వివాహాలు కూడా జరిపించిన యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌కు రుణ పడి ఉంటామని నూతన వధూవరులు అన్నారు. తమకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ చేపట్టిన ఈ సామూహిక వివాహాలపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

21:24 - December 4, 2016
21:23 - December 4, 2016

ఢిల్లీ : కరెన్సీ కష్టాలు ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీశాయి... క్యూలైన్లలో కుప్పకూలినా బాధితులను పట్టించుకునేవారే కరువయ్యారు.. కళ్లముందే ప్రాణాలు వదిలినా కనీసం అంబులెన్స్‌కు కూడా ఫోన్ చేయలేదు.. మాయమైపోతున్న మనిషి విలువలకు ఈ ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

డబ్బుకోసం భార్యతో కలిసి క్యూలో నిలబడ్డ రైతు..
నగదు కోసం క్యూలో నిలబడ్డ ఓ వృద్ధుడు గుండెపోటుతో బ్యాంకులోనే ప్రాణాలు వదిలాడు. తమిళనాడు రాష్ర్టం తంజావూరులో ఈ ఘటన జరిగింది... 75 ఏళ్ల సుబ్రమణ్యం అనే కౌలు రైతు పాపనాశంలోని ఇండియన్‌ బ్యాంకుకు భార్యతో కలిసివచ్చాడు. డబ్బుకోసం క్యూలో నిలబడ్డాడు. కొద్దిసేపు క్యూకట్టాక అనారోగ్యానికి గురయ్యాడు.. లైన్లోనే స్పృహతప్పి పడిపోయాడు. ఇది చూసిన ఆయన భార్యకు ఏంచేయాలోతెలియక కన్నీరుమున్నీరైంది. బ్యాంకులో మనిషి కుప్పకూలిపోయినా అధికారులెవ్వరూ పట్టించుకోలేదు.. సాయం చేయాలని ప్రాధేయపడ్డా కరుణించలేదు.. కనీసం క్యూలోఉన్నవారూ సాయం చేయడానికి ముందుకు రాలేదు.. కొంతమంది యువకులుమాత్రం ఇదంతా వీడియోతీశారు.. చివరికి ఓ వ్యక్తి ఫోన్‌ కాల్‌తో గంటసేపటి తర్వాత అంబులెన్స్ అక్కడకు వచ్చింది.. భర్తతోకలిసి బ్యాంకుకు వచ్చిన ఆమె చివరకు రైతు మృతదేహంతో రోదిస్తూ అక్కడి నుంచి వెనుదిరిగింది.

క్యూలోనే గుండెపోటు..
ఇలాంటి మరో ఘటనే పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.. 52 ఏళ్ల కల్లోల్‌ రాయ్‌చౌదురి బాందెల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. క్యూలో నిల్చున్న అతనికి గుండెపోటు వచ్చింది.. భరించలేని నొప్పితో స్పృహతప్పి పడిపోయాడు.. అయినా అక్కడివారు అతనివైపే చూడలేదు.. చౌదురి బాధతో విలవిలలాడుతున్నా తమ డబ్బు డ్రాచేసుకునేందుకే ముందుకు కదిలారు.. ఇలా గంటకుపైగా సమయం గడిచిపోయింది.... ఓ వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు బాధితున్ని ఆస్పత్రికి తరలించారు.. అప్పటికే కల్లోల్ మృతిచెందాడు.

మానవత్వానికే మచ్చ తెస్తున్న ఈ రెండు సంఘటనలు జనాల స్వార్థానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.. స్పృహ తప్పిన వ్యక్తికి సాయం కోసం కదిలితే తమ క్యూలైన్‌ మిస్‌ అవుతుందనే స్థానికులంతా డబ్బు కోసమే ఆలోచించారు. సాటిమనిషన్న ఆలోచనకూడా లేకుండా జరుగుతున్నది చూస్తూనే ఉండిపోయారు. మాయమైపోతున్న మనిషి విలువలకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

21:20 - December 4, 2016

హైదరాబాద్ : 26 రోజులు పూరైనా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. కొద్దిరోజులుపోతే ఈ సమస్య ఉండదనుకున్న సామాన్యులకు నిరాశే మిగులుతోంది.. నగదుకోసం జనాలు గంటలకొద్దీ క్యూ కడుతూనే ఉన్నారు.. ఆదివారం కావడంతో ఆ కాస్త డబ్బుకూడా దొరక్క సమస్యలు రెట్టింపయ్యాయి. అసలే కొత్త నోట్లు దొరక్క అష్టకష్టాలు పడుతున్న సామాన్యులకు ఆదివారం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది.. వర్కింగ్‌డేస్‌లోనే అంతంతమాత్రంగా దొరుకుతున్న నగదుకు సండే బ్రేక్‌ వేసింది.. పనిచేస్తున్న ఆ 20శాతం ఏటీఎంలలో కూడా డబ్బు కరువైంది.. అవుట్‌ ఆఫ్ సర్వీస్‌ బోర్డులు ఏటీఎంల ముందు వేలాడుతూ దర్శనమిచ్చాయి. నోట్ల రద్దుకుముందు ఎప్పుడు సందడిగా ఉండే మార్కెట్లు ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతున్నాయి... ఆదివారం అయినా ఎక్కడా హడావుడి కనిపించలేదు.. క్యాష్‌లేక హైదరాబాద్‌ రామ్‌నగర్‌ ఫిష్ మార్కెట్‌లో 90శాతం అమ్మకాలు పడిపోయాయి.. చిల్లర సమస్యతో కూడా చేపల్ని సామాన్యులు కొనలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇక బెజవాడ దుర్గ గుడిలో చిల్లర సమస్య మరింత వేధిస్తోంది.. సేవా టికెట్లకు పాతనోట్లు చెల్లక భక్తులకు ఇబ్బందుల తప్పలేదు. మొత్తానికి రోజులు గడిస్తే నగదు సమస్య తీరుతుందనుకున్న సామాన్యులకు నిరాశే ఎదురవుతోంది.. రోజురోజుకూ కష్టాలు పెరగడంతో ఏం చేయాలో తెలియక జనాలు అవస్థలు అనుభవిస్తున్నారు.

21:18 - December 4, 2016

పంజాబ్ : చేతులు కట్టుకొని కూర్చుంటే ఉగ్రవాదాన్ని ప్రొత్సహించినట్లేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అఫ్గానిస్థాన్‌లో సుస్థిర శాంతి స్థాపనకై అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన హార్ట్‌ ఆఫ్‌ ఏసియా ఆరో సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటేనే వారికి సహకరిస్తున్న వారిని అంతం చేయగలమని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రదాడులతో అట్టుడుకుతున్న అఫ్గానిస్థాన్‌లో శాంతి స్థాపనే లక్ష్యంగా అమృత్‌సర్‌లో హర్ట్‌ ఆఫ్‌ ఏసియా ఆరో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులతో పాటు ఆసియా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసియా ప్రాంతానికి ఉగ్రవాద హింస పెనుముప్పుగా మారిందని మోదీ అన్నారు. ప్రజలను భయపెడుతూ రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతం చేయాలంటే సమిష్టిగా పనిచేయాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పాలంటే మాటలు మాత్రమే సరిపోవని.. సుస్థిరమైన కఠిన చర్యలు అవసరమన్నారు. ఉగ్రవాదులపైనే కాదు వారికి మద్దతు, ఆశ్రయం, ఆర్థికసాయం అందిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను ఉద్దేశించి అన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికి పెను ముప్పుగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన.. దీనిపై అన్ని దేశాలు సమిష్టిగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ఘనీ కూడా పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. అఫ్గాన్‌ పునర్నిర్మాణానికి 500 మిలియన్‌ డాలర్ల సాయం అందిస్తామన్న పాకిస్థాన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన... ఉగ్రవాదానికి మద్దతిస్తే పాక్‌ నుంచి వచ్చే ఒక్క పైసా తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. హార్ట్‌ ఆఫ్‌ ఏసియా సదస్సుకు 40 దేశాల ప్రతినిధులతో పాటు పాక్‌ ప్రధానమంత్రి, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ హాజరయ్యారు.

21:14 - December 4, 2016

ముగిసిన 49వ రోజు మహాజన పాదయాత్ర..

కామారెడ్డి : జిల్లాలో 49వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర ముగిసింది. మొత్తం 24.4 కిలోమీటర్లు మేర ఈ రోజు పాదయాత్ర జరిగింది. పాదయాత్రకు పలువురు సంఘీభావం ప్రకటించారు. బృందానికి సమస్యలతో కూడిన వినతిపత్రాలు సమర్పించారు.

విప్ జారీ చేసిన కాంగ్రెస్, బీజేపీ..

ఢిల్లీ : లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు స్వపక్ష, విపక్షాలు విప్ లు జారీ చేశాయి. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉభయసభలకూ హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సభ్యులకు ఆదేశించాయి.

20:37 - December 4, 2016
20:08 - December 4, 2016
19:51 - December 4, 2016

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో పాపారావు (ఆర్థికరంగం నిపుణులు), శేఖర్ రెడ్డి (క్రిడాయి జాతీయ మాజీ అధ్యక్షులు), గురురాజ్ (సీఎండీ సుఖీభవ ప్రాపర్టీస్), చిగురుపాటి సుధాకర్ (క్రిడాయి ఉపాధ్యక్షులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. జిల్లాల ప్రాధాన్యతలను బట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలని ప్రతి జిల్లాకు ఒకే పద్ధతి అవలంబించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీన జిల్లాల కలెక్టర్ల సదస్సులో చేపట్టాల్సిన కార్యక్రమాలు..ప్రాధాన్యతలను నిర్ధారించుకోవాలని సూచించారు. నో యువర్ డిస్ట్రిక్స్..ప్లాన్ యువర్ డిస్ట్రిక్స్..అనే కార్యక్రమాలును కలెక్టర్లకు ఇవ్వాలన్నారు.

ఈనెల మూడో వారంలో టి.అసెంబ్లీ..

హైదరాబాద్ : ఈనెల మూడో వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. 14న కలెక్టర్ల సదస్సు ముగిసిన తరువాత అసెంబ్లీ సమావేశాలు తేదీలు ఖరారు చేస్తారని తెలుస్తోంది.

19:35 - December 4, 2016

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు నిదర్శనం. విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రియల్ బూమ్ ఊపందుకొంది. ముఖ్యంగా ఏపీ కొత్త రాజధాని అమరావతి, విశాఖపట్నంలతో పాటు మిగతా జిల్లాల్లోనూ భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. అమరావతి, అమరావతి చుట్టూ భూముల ధరలు హైదరాబాద్ కంటే ఎక్కువ పలుకుతున్నాయి. ఇక తెలంగాణలోనూ ప్రధానంగా రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో రియల్ బూమ్ పెరిగింది. జిల్లాల విభజనతో ఇది మరింత స్పీడ్ అందుకొంది. కానీ తాజాగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రియల్ రంగానికి చుక్కలు చూపబోతోందని నిపుణులు అంటున్నారు.

నగదు రూపంలో జరిగే స్థిరాస్తి లావాదేవీలన్నీ కుదేలే..
తెలంగాణలో సగటున రోజుకు 3 వేల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతాయి. పెద్ద నోట్ల రద్దుతో రోజుకు దాదాపు 200 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. సాధారణంగా రియల్టీ రంగంలో స్థలాలు, విల్లాలు, ప్రీమియం ఫ్లాట్ల కొనుగోళ్లలో మెజార్టీ భాగం నగదు రూపంలోనే లావాదేవీలు జరుగుతాయి. అందుకే ఆయా విభాగాలపై భారీగా ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. రియాల్టీ ఎక్కువుగా ఉన్న హైదరాబాద్ నగరంలో 40-60 శాతం గృహాలు అందుబాటులో ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, శ్రీనగర్‌కాలనీ, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రీమియం ప్రాంతాల్లోని ప్రాజెక్ట్‌లు, కొత్త జిల్లాల్లోని వెంచర్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లపై నోట్ల రద్దు ప్రభావం చూపుతోంది. మరోవైపు నోట్ల రద్దు నిర్ణయంతో ప్లాట్లు, ఇళ్ల ధరలు తగ్గుతాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్న చర్చ నడుస్తోంది.

పెద్ద నోట్ల రద్దుతో అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లు పెరిగే ఛాన్స్..
పెద్ద నోట్ల రద్దు 30-60 లక్షల మధ్య ధరలుండే అపార్ట్‌మెంట్లకు మాత్రం కలిసొస్తుందని మరికొందరంటున్నారు. ఎందుకంటే ఈ విభాగంలో నగదు రూపంలో లావాదేవీలు జరిగేది కొంతే. 20-25 శాతం మాత్రమే ముందస్తు చెల్లింపులుగా నగదు రూపంలో తీసుకుంటారు. మిగిలినదంతా బ్యాంకు రుణంగా ఇస్తుంది. అందుబాటు గృహాల నిర్మాణదారులకు ప్రధాన పోటీదారులు పంచాయతీ లే-అవుట్లు, వెంచర్లు చేసే అసంఘటిత డెవలపర్లే. ఇప్పుడు నోట్ల రద్దుతో లావాదేవీలు, బదిలీలు లేక వారందరూ తెరమరుగైపోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు నిపుణులు.. దీంతో ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులకు మిగిలిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు.

19:29 - December 4, 2016

విశాఖపట్నం : ఎల్లపువాని పాలెంలో..అనుమానాస్పదంగా వివాహిత మృతి చెందింది. తన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త బోగిరాజు చెబుతున్నారు. అయితే ఆమె భర్తే చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త ఆర్పీఎఫ్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య వరకట్నం విషయంలో వివాదం నడుస్తోందని బంధువులు తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

19:25 - December 4, 2016

హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగయ్య అన్నారు. ఈ దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పారు. దళితుల సమస్యలపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు.

19:18 - December 4, 2016

నెల్లూరు : అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేసి చెల్లింపులను వెంటనే మొదలు పెట్టాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కోరారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ నాయకులతో అఖిలపక్షం నిర్వహించారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం దాదాపు 25 లక్షల కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వానికి అగ్రిగోల్డ్‌ ఆస్తులను అమ్మి బాధితులకు చెల్లించడంలో చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు.

19:16 - December 4, 2016

విజయవాడ : పార్టీ కార్యక్రమాలపై వైసీపీ అధినేత జగన్‌ దృష్టి సారించారు. పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న గడప గడపకు వైసీపీపై రెండురోజుల పాటు సమీక్షలు నిర్వహించాలని అధినేత నిర్ణయించారు. సోమ, మంగళవారాల్లో అన్ని జిల్లాల్లోని వైసీపీ నేతలతో సమీక్ష జరగనుంది. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జులై 8వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని పార్టీ మొదలు పెట్టింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు అయినా ఇంకా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్న అభిప్రాయంతో ప్రధాన ప్రతిపక్షం ప్రజల్లో ఉండాలని నిర్ణయించింది. ప్రభుత్వం విఫలమైన పలు కార్యక్రమాలపై ప్రశ్నావళిని రూపొందించి ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఇంటి నుంచి అభిప్రాయాలను సేకరించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గడప గడపకు వైసీపీ మొదలు పెట్టిన నాటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలపై పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నేతల తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. పార్టీ నేతలు అనుకున్న స్థాయిలో ఇంటింటికి వెళ్లడం లేదన్న అభిప్రాయంతో వారిపై జగన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఆధిపత్య పోరు..
పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరుతో ఈ కార్యక్రమం నీరుగారిపోతుందన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో గడపగడపకు వైసీపీ మొదలు పెట్టి కూడా దాదాపు ఆరు నెలలు అవుతోంది. నిరంతరం పార్టీ నేతలు ప్రజల మధ్య ఉండే విధంగా కార్యక్రమాన్ని మరిన్ని రోజులు కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం. 5వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు, 6వ తేదీన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నేతలతో జగన్ సమావేశం కానున్నారు. రాబోయే రోజుల్లో అధికార పార్టీపై మరింత దూకుడుగా వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచే కార్యాచరణ ఉండాలన్న అభిప్రాయంతో పార్టీ అధినేత జగన్ ఉన్నట్లు సమాచారం.

18:55 - December 4, 2016

కోదండరామ్ పై మళ్లీ బాల్క సుమన్ విమర్శలు..

హైదరాబాద్ : కాంగ్రెస్, టిడిపి నేతలు కోదండరామ్ కు మద్దతివ్వడం దేనికి సంకేతమో తేలిపోయిందని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. కేసీఆర్ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించారని, అందులో భాగంగా జేఏసీ ఛైర్మన్ గా కోదండరమ్ ఉన్నారన్నారు. వెంటిలెటర్ పై ఉన్న కాంగ్రెస్ కు కోదండరామ్ జీవం పోసే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ డైరెక్షన్ లో కోదండరామ్ డ్రామాలు ఆడడం తగదన్నారు.

ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న బాబు - రఘువీరా..

అనంతపురం : సీఎం చంద్రబాబు పర్యటనల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. గొల్లపల్లి రిజర్వాయర్ కు ఎన్టీఆర్ పేరు పెట్టి అవమానించారని, రేణిగుంట ఎయిర్ పోర్టులో దొరికిన రూ. 10 లక్షలు ఎక్కడివో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం బావమరిది కావడం వల్లే లెక్కలు చూపకుండా బాలకృష్ణ కుటుంబసభ్యులను వదిలేశారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసి చర్యలు తీసుకోవాలన్నారు.

 

కామారెడ్డిలో జనశక్తి సభ్యుడు అరెస్టు - అకున్ సబర్వాల్..

హైదరాబాద్ : జనశక్తి సభ్యుడు భీమ్ భరత్ ను కామారెడ్డిలో అరెస్టు చేయడం జరిగిందని నగర రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. భీమ్ భరత్ నుండి కీలక సమాచారం సేకరించడం జరిగిందని, భరత్ కు దోమల గూడ నుండి ఆయుధాలు సరఫరా అయినట్లు గుర్తిచండం జరిగిందన్నారు. ఆయుధాలు సరఫరా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గిరిజన రిజర్వేషన్ సాధన సభ..

హైదరాబాద్ : బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గిరిజన రిజర్వేషన్ సాధన సభ జరిగింది. జస్టిస్ చంద్రకుమార్, విమలక్క, చెరుకు సుధాకర్, గిరిజన సంఘ నేతలు హాజరయ్యారు.

18:19 - December 4, 2016

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. వ్యక్తిని హత్య చేసి...ప్లాస్టిక్ డ్రమ్ములోమృత దేహాన్ని పెట్టి మూసీనది కాలువలో పడేశారు. గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. హత్యకు గురైన వ్యక్తిని వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లకు చెందిన రవీందర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

18:06 - December 4, 2016

హైదరాబాద్‌ : కామారెడ్డి జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర 49వరోజు కొనసాగుతోంది.. సదాశివనగర్‌, మల్లుపేట, గాంధారి ఎక్స్‌ రోడ్, మోడిగాం, భూంపల్లి, గుడిమెట్టు, జువ్వాడి, గాంధారి గ్రామాల్లో పాదయాత్ర బృందం సభ్యులు పర్యటిస్తున్నారు.. పాదయాత్ర బృందానికి స్థానికులనుంచి అనూహ్య స్పందన వస్తోంది.. గ్రామస్తులు తమ సమస్యల్ని సీపీఎం బృందానికి చెప్పుకుంటున్నారు. మరోవైపు పాదయాత్రలో తెలుసుకున్న ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్‌కు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. మూడేళ్లనుంచి ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలకాక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని లేఖలో తెలిపారు. సర్కారునుంచి నిధులు విడుదలకాక ఇటు ఫీజులు కట్టలేక విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని లేఖలో రాశారు. వెంటనే ఈ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

17:28 - December 4, 2016

మహరాష్ట్ర : ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదనే కోపంతో ప్రేమించిన అమ్మాయిపై కత్తితో దాడికి దిగాడు. అందరూ చూస్తుండగానే నాగ్‌పూర్‌లోని జింగబాయి టాల్కి వద్ద కత్తితో విరుచుకుపడ్డాడు. స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించి విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు యువకుడిని నిలువరించి పోలీసులకు అప్పగించారు.

17:19 - December 4, 2016

పంజాబ్ : తనతో డ్యాన్స్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఓ డ్యాన్సర్ ను ఓ తాగుబోతు కాల్చి చంపాడు. ఈ ఘటన భటిండాలో చోటు చేసుకుంది. వివాహ వేడుకలు..ఇతరత్రా వేడుకల్లో డ్యాన్సులు చేసుకుంటూ కొందరు జీవనం సాగిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలాగే భటిండాలో ఓ వివాహ వేడుక జరుగుతోంది. అందులో డ్యాన్సర్లు ఆడుతున్నారు. తనతో డ్యాన్స్ చేయలేదన్న కారణంతో ఓ తాగుబోతు వివక్ష కోల్పోయాడు. వెంటనే తనదగ్గరున్న తుపాకితో కాల్పులు జరిపాడు. దీనితో ఆ డ్యాన్సర్ ఆడుతూ అక్కడికక్కడనే కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు పారిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భటిండాలో దారుణం..

పంజాబ్ : భటిండాలో దారుణం చోటు చేసుకుంది. వివాహ వేడుకలో తనతో డ్యాన్స్ చేయలేదన్న కారణంతో డ్యాన్సర్ ను ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడు.

16:39 - December 4, 2016

వరంగల్ : సభ్య సమాజం తలదించుకొనే ఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. గత రెండు నెలలుగా ఈ ఆకృత్యం జరగుతోంది. వివరాల్లోకి వెళితే...పెగడపల్లి గ్రామంలో ఓ మానసిక వికలాంగులురాలు నివాసం ఉంటుఓంది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ, ఇతరత్రా పనులకు వెళుతుంటారు. ఇది చూసిన రవి అనే కామాంధుడు ఆమెపై కన్నేశాడు. తల్లిదండ్రులు వెళ్లిన సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నాడు. ఆదివారం కూడా అదే విధంగా ప్రయత్నం చేయడంతో వికలాంగురాలు అరుపులు..కేకలు వేసింది. దీనితో స్థానికులు స్పందించి రవిని పట్టుకున్నారు. అనంతరం చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రవిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.

16:34 - December 4, 2016

విశాఖపట్టణం : నేవీ డే ను పురస్కరించుకొని అమరులైన నేవీ సైనికులకు తూర్పు నావికాదళం నివాళులర్పించింది. విశాఖసాగర తీరంలోని సైనిక విజయస్థూపం వద్ద తూర్పునావికాదళ ప్రధానాధికారి హెచ్‌.సి. బిస్త్‌ నివాళులర్పించారు. అనంతరం నేవీ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ కమిషర్ హరినారాయణన్ తదితరులు పాల్గొన్నారు.

 

16:29 - December 4, 2016

శ్రీకాకుళం : క్రీడా రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రతాంబూలం ఇస్తున్నాయని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్ర స్థాయి 3వ క్రాస్ కంట్రీ ఛాంపియన్ షిప్ 2016 పోటీలు నగరంలోని కోడి రామమూర్తి స్టేడియంలో ఆయన ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుండి 23 టీంలు ఇందులో పాల్గొన్నాయి. పురుషులు, స్త్రీలు వివిధ భాగాలలో వేరు వేరుగా పోటీలు జరిగాయి. క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో కొన్న చిన్నారావు స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.

16:25 - December 4, 2016

కరీంనగర్ : పెద్దనోట్లు రద్దై దాదాపు నెల కావస్తోంది. ప్రజలకు నగదు కష్టాలు మాత్రం తీరడంలేదు. తెలంగాణలోని పలుజిల్లాల్లో మనీప్రాబ్లమ్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. కరెన్సీ కోసం ఎటీఎంల ముందు జనాలు పడిగాపులు పడుతున్నారు. కరీంనగర్‌లో చిల్లర కష్టాలపై 10టివి కథనం. కరీంనగర్‌ పట్టణంలో నగదు నింపిన గంటలోనే ఏటీఎంల్లో కరెన్సీ ఖాళి అవుతోంది. నగరంలో ఎక్కడ చూసిన ఏటీఎంల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. చాలాచోట్ల నో క్యాష్ బోర్డులు ,అవుట్‌ ఆఫ్ సర్వీస్‌ బోర్డులు దర్శనమిస్తుండడంతో జనం విసుగుచెందుతున్నారు.

వెలవెలబోతున్న నాన్‌వెజ్‌ మార్కెట్లు..
రూ. 500, రూ. 1000 రూపాయల నోట్ల రద్దు చేసి 28రోజులు అవుతోంది. మార్కెట్ లోకి 2 వేల రూపాయల నోట్లు వచ్చినప్పటికి సరిపడ చిల్లర దొరక్క పోవడంతో ప్రయోజనం లేకుండా పోతుంది. ఇక ఆదివారం ఎక్కువగా గిరాకి ఉండే మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు అమ్మకాల్లేక వెలవెలబోతున్నాయి.

అకౌంట్లో డబ్బులున్నా..చేతికిరాని పరిస్థితి...
మరోవైపు ఉద్యోగులకు జీతాలు వచ్చినా వాటిని వినియోగించుకునే పరిస్థితి మాత్రం కనపడడం లేదు. ఖాతల్లో డబ్బులు ఉన్న వాటిని తీసుకోవాలంటే బ్యాంకుల వద్ద, ఎటిఎం వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సరిపడ డబ్బులు లేక చాల బ్యాంకులు ఖాతదారులకు చెల్లింపులు కూడా చేయడం లేదు.

సింగరేణి కార్మికులపై నోట్ల రద్దు ప్రభావం..
నోట్ల ప్రభావం తమ కార్మికులపై పడకుండా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చర్యలను చేపట్టింది. పెద్దపల్లి జిల్ల రామగుండం రీజియన్ లో బొగ్గు గనులకు నోట్ల ప్రభావం పడకుండ బ్యాంకుల వద్ద అధికారులు పత్యేక చర్యలు చేపట్టారు. అయినప్పటికి ఏటీఎంలు సరిగా పనిచేయక క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని కార్మికులు అంటున్నారు. అటు పించన్ కోసం వస్తున్న వృద్ధులు లైన్లలో నిలబడలేక అవస్థలు పడుతున్నారు. నల్లధనం కట్టడికోసం కదా అని సామాన్యులు ఓపిగ్గా క్యూలైన్లలో నిలబడుతున్నారు. కాని ..రోజులు గడుస్తున్నా.. నోట్ల కష్టాలు మాత్రం తీరడంలేదు. ఖాతలో డబ్బులు ఉన్న వినియోగించకోలేని దుస్థితి నెలకోంది.

16:21 - December 4, 2016

హైదరాబాద్ : హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తే టీఆర్ఎస్ సహించలేకపోతోందని టి.టిడిపి నేత సీతక్క విమర్శించారు. నిలదీసినవారందరినీ అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరాంపై గులాబీ నేతల వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. విప్లవసాహిత్యం దొరికిందంటూ విమలక్క ఇళ్లు, కార్యాలయాలు సీజ్‌ చేయడం అన్యాయమన్నారు.

16:19 - December 4, 2016

విజయవాడ : కృష్ణా జలాల విషయంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ వెలువరించిన తీర్పును చర్చిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ ఉపసంఘం విజయవాడలో సమావేశమైంది. గేట్‌ వే హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, రావెల కిషోర్‌బాబు, జలవనరుల శాఖ అధికారులు, సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులు హాజరయ్యారు. తీర్పు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లని విధంగా పొరుగు రాష్ట్రాలతో వివాదాలు తలెత్తకుండా ఏం చేయాలన్న దానిపై సమగ్రంగా చర్చిస్తున్నారు. సెక్షన్‌ 89 (బి)లకు సంబంధించి కేసు ఫైల్‌ చేయడంతో పాటు పోలవరం తూర్పు కాలువల ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే విషయంపైనా చర్చించారు. అనంతరం రాబోయే రోజుల్లో కేసుకు సంబంధించిన వివరాలు సమావేశాల్లో తెలియచేశారని మంత్రి దేవినేని మీడియాకు తెలిపారు. ఈ విషయాలు సీఎం చంద్రబాబు నాయుడికి, కేబినెట్ కు తెలియచేస్తామన్నారు. భవిష్యత్ లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కేబినెట్ నిర్ణయిస్తుందన్నారు.

16:05 - December 4, 2016

ఢిల్లీ : మళ్లీ గిదేంది. ఇప్పటికే పెద్దనోట్లు రద్దు..కొత్త రూ. 2000 నోటుతో బాగా ఇబ్బందులు పడుతున్నాం మళ్లీ రూ. 20, రూ. 50 నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తయారు చేస్తారా ? అని ఏవేవో ఊహించుకోకండి. కొత్తగానే ఈ నోట్లను ముద్రించనున్నారు. కానీ పాత నోట్లు మాత్రం యథావిధిగా చలామణి కానున్నాయి. గత కొన్ని రోజుల కింద రూ. 500, రూ. 1000నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రూ. 2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చింది. అంతేగాకుండా నగదు డ్రా విషయంలో పలు ఆంక్షలు విధించింది. దీనితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా రూ. 20, రూ. 50 నోట్లను కొత్తగా ముద్రించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. పాతనోట్లు చలామాణిలో ఉంటాయని, రూ. 20 నోటులో రెండు అంకెల్లోనూ ఎల్ అనే అక్షరం ఉంటుందని పేర్కొంది. కానీ రూ. 50 నోటులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. ఈ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుందని, 2016 ఏడాది అని ముద్రించబడి ఉంటుందన్నారు.

కొత్తగా రూ. 20, రూ. 50 నోట్లు..

ఢిల్లీ : కొత్తగా రూ. 20, రూ. 50 నోట్లను ఆర్బీఐ జారీ చేయనుంది. ప్రస్తుత పాత రూ. 20, రూ. 50 నోట్ల యథాతథంగా చలామాణి కానున్నాయి. ఎల్ సిరీస్ ఫార్మాట్ లో రూ. 20 నోట్లు రానున్నాయి.

 

నైజీరియన్లు, స్థానికుల మధ్య ఘర్షణ..

గుంటూరు : తాడేపల్లి (మం) వడ్డేశ్వరంలో ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం షాపు వద్ద నైజీరియన్లు, స్థానికులకు మధ్య గొడవ జరిగింది. ఓ నైజీరియన్ పై బాటిళ్లతో స్థానికులు దాడి చేయడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి.

 

హోటల్ లో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ..

విజయవాడ : గేట్ వే హోటల్ లో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ జరుగుతోంది. మంత్రులు దేవినేని, రావెల, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.

15:46 - December 4, 2016

బొప్పాయి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎన్నో రకాల పోషకాలకు బొప్పాయి పండు నిలయంగా ఉంటుంది. నిత్యం దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

 • డెంగీ జ్వరం వచ్చిన వారికి ప్లేట్ లెట్లను పెంచేందుకు బొప్పాయి పండు ఎంతో సహాయ పడుతుంది.
 • బొప్పాయి పువ్వును బాగా నలిపి పేను కొరికిన చోట రుద్దాలి. ఇలా చేయడం వల్ల మళ్లీ వెంట్రుకలు వస్తాయి.
 • బొప్పాయి చెట్టు కాండం నుండి వచ్చే పాలను చర్మపై రాస్తే తామర, గజ్జి వంటి చర్మ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.
 • బొప్పాయి పాలను ఒక టీ స్పూన్ మోతాదులో నిత్యం తాగడం వల్ల లివర్ శుభ్ర పడుతుంది.
 • బాలింతలు బొప్పాయి పచ్చికాయను వండుకుని తినడం వల్ల వారిలో పాలు బాగా పడుతాయి.
 • బొప్పాయి ఆకును బాగా నూరి పేస్టులా చేయాలి. బోదకాలు ఉన్న చోట కట్టాలి.
 • మాసం వండుకొనే సమయంలో బొప్పాయి కాయ ముక్కలు వేయడం వల్ల మాంసం త్వరగా ఉడుకుతుంది.
 • బొప్పాయిలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు బి1, బి2, బి3, సి విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలు సమృద్ధిగా లభిస్తాయి.
 • నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. బొప్పాయి గుజ్జును మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది.
 • బొప్పాయి ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది.
 • బొప్పాయి పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు దరిచేరవు. బీటా కెరోటిన్ క్యాన్సర్ ను రాకుండా నిరోధిస్తుంది.
15:24 - December 4, 2016
15:23 - December 4, 2016

వరంగల్ : రూరల్ జిల్లాల్లోని డీబీఎం కాల్వకు నీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఎస్ఆర్ ఎస్పీ మెయిన్ కెనాల్ నుండి డీబీఎం కాల్వకు నీళ్లు వెళ్లలేని దుస్థితి నెలకొంది. సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతులు, ఎస్ఆర్ ఎస్పీ అధికారులతో క్షేత్ర పర్యటనలో కాల్వల మరమ్మత్తులో అవినీతి భాగోతం బయటపడింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. ధ్వంసమైన ఫీడర్, ఛానెళ్లు, పిల్ల కాల్వలు అదృశ్యమయ్యాయి. ఈ సందర్భంగా టెన్ టివితో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఎలాంటి అంశాలు మాట్లాడారో వీడియో క్లిక్ చేయండి.

15:19 - December 4, 2016

బ్యాంకాక్ : భారత మహిళా క్రికెట్‌ జట్టు అద్భుత విజయం సాధించింది. ఆసియా కప్‌ మహిళా టీ ట్వంటీ కప్‌ విజేతగా నిలిచింది.. ఫైనల్‌లో 17 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. టోర్నీలో ఆడిన అన్ని మ్యాచుల్లో మిథాలీ సేన వరుస విజయాలతో దూసుకెళ్లింది. ఈ టోర్నీ గెలుపుతో... ఇప్పటివరకూ జరిగిన ఆరు ఆసియాకప్ మహిళా టోర్నీల్లోనూ టీమిండియానే విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది.

రాణించని పాక్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు మిథాలికీ, జులాన్ గోస్వామి 17 పరుగులతో కొద్దిపాటి సహకారం అందించారు. మిగిలిన ప్లేయర్లలో ఒక్కరూ రెండంకెల స్కోరును సాధించలేకపోయారు. తరువాత బ్యాటింగ్‌ దిగిన పాకిస్తాన్‌ టీమ్...టార్గెట్‌ను సాధించే క్రమంలో పోరాడి ఓడింది. పాక్ ప్లేయర్స్‌లో 22 పరుగులతో జావిరియా ఖాన్, 25 పరుగులతో బిస్మా మరూఫ్ నాటౌట్‌గా నిలిచి... ఫర్వాలేదనిపించినా మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

ఆరింటిలో భారత్ విజేత..
ఇప్పటివరకూ ఆరు ఆసియాకప్ మహిళా టోర్నీలు జరగ్గా ఆరింటిలో భారత్ విజేతగా నిలిచింది. 2004 నుంచి 2008 వరకూ నాలుగు వన్డే ఆసియాకప్‌ టోర్నీలు జరిగాయి. ఆ తరువాత రెండు టీ ట్వంటీ టోర్నీలు జరిగాయి. చివరిసారి 2012లో జరిగిన మహిళల ఆసియాకప్ టీ ట్వంటీ ఫైనల్లో పాక్ పై భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేళ్ల తరువాత అదే ఫలితాన్ని భారత్ పునరావృతం చేసింది.

కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే మచ్చ - సీతక్క..

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై అందరూ ఏకమవ్వడాన్ని ప్రభుత్వం సహించలేకపోతోందని టి.టిడిపి ప్రధాన కార్యదర్శి సీతక్క పేర్కొన్నారు. కోదండరాం, రేవంత్, విమలక్కలు చేసిన తప్పేంటీ అని ప్రశ్నించారు. కోదండరామ్ పై కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే మచ్చ అని విమర్శించారు. గతంలో కేసీఆరే ములుగును జిల్లా చేస్తానని హామీనిచ్చారని, తెలంగాణ పితగా ప్రొ.జయశంకర్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోరుయాత్రలో లేవనెత్తిన సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

మహిళల ఆసియా కప్ విజేత భారత్..

బ్యాంకాక్ : మహిళల ఆసియా కప్ టీ 20 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ లో పాక్ జట్టుపై 17 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. భారత్ 121/5, పాక్ 104/6.

డీబీఎం కాల్వ నీటి విడుదలపై సందిగ్ధత..

వరంగల్ : రూరల్ జిల్లాల్లోని డీబీఎం కాల్వకు నీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఎస్ఆర్ ఎస్పీ మెయిన్ కెనాల్ నుండి డీబీఎం కాల్వకు నీళ్లు వెళ్లలేని దుస్థితి నెలకొంది. సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతులు, ఎస్ఆర్ ఎస్పీ అధికారులతో క్షేత్ర పర్యటనలో కాల్వల మరమ్మత్తులో అవినీతి భాగోతం బయటపడింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. ధ్వంసమైన ఫీడర్, ఛానెళ్లు, పిల్ల కాల్వలు అదృశ్యమయ్యాయి.

14:30 - December 4, 2016

పంజాబ్ : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరమని భారత ప్రధాని మోడీ పేర్కొన్నారు. అమృతసర్‌లో జరుగుతున్న హార్ట్‌ ఆఫ్‌ ఏసియా సదస్సులో అఫ్గాన్‌ దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీతో ప్రధాని మోడీ దైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఆఫ్గనిస్తాన్‌తో భారత్‌ సంబంధం విడదీయరానిదన్నారు. ఆర్థిక వృద్ధి, శాంతి, స్థిరత్వం అత్యంత ప్రదాన అంశాలనీ.. అభివృద్ధే ప్రధాన అంశంగా మనం అడుగులు వేయాలని చెప్పారు. అయితే ఉగ్రవాదులకు సాయం అందించడం ఎంత మాత్రం సరికాదన్న మోడీ.. ఉగ్రవాదాన్ని అందరం కలిసి తరిమికొడదామన్నారు.

14:27 - December 4, 2016

ఖమ్మం : స్పందన హార్ట్‌కేర్ ఆస్పత్రి నిర్వాహకంపై 10టీవీ ప్రసారం చేసిన కథనానికి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ స్పందిచారు. ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి బాధితురాలికి న్యాయం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. గ్యాస్ ట్రబుల్ అని ఆసుపత్రిలో చేరిన సూర్యాపేట వాసి కవితకు చేసిన ఆపరేషన్ వికటించింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో సరైన వసతులు లేవని.. సిబ్బంది ఎవరు అందుబాటులో లేరని డిప్యూటీ డిఎంహెచ్‌వో డాక్టర్ మాలతీ తెలిపారు. సోమవారం సాయంత్రం కల్లా కవిత కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని లేదంటే ఆసుపత్రిని సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు.

14:25 - December 4, 2016

విశాఖపట్టణం : ఏపీలో త్వరలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. 748 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఈనెల 29, 30 తేదీల్లో మెయిన్‌ పరీక్ష ఉంటుందన్నారు. 256 ఏఈ పోస్టులతో పాటు గ్రూప్‌1, గ్రూప్‌ 3 పోస్టులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని.. నెలాఖరులోగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. మార్చిలోగా అమరావతికి ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

14:23 - December 4, 2016

చెన్నై : మానవత్వం మంటగలుస్తోంది. సాటి మనిషి ప్రాణప్రాయ స్థితిలో ఉంటే ఆదుకునే నాథుడే కరువైపోతున్నాడు. తమిళనాడు రాష్ర్టం తంజావూరులో ఒక ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. 75 ఏళ్ల సుబ్రమణ్యం అనే కౌలు రైతుకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండటంతో... తంజావూరు జిల్లా పాపనాశంలోని ఇండియన్‌ బ్యాంకుకు తన భార్యతో కలిసి వెళ్లాడు. క్యూ లైన్‌లో నిల్చోవాలని బ్యాంకు అధికారులు సూచించడంతో సుబ్రమణ్యం తన భార్యతో కలిసి క్యూలో నిల్చున్నాడు. ఇంతలోనే సుబ్రమణ్యం స్పృహతప్పి ఒక్కసారిగా కూప్పకూలి ప్రాణాలు వదిలాడు. పక్కనే ఉన్న సుబ్రమణ్యం భార్య ఏడుస్తున్నా.. బ్యాంకులోని వారు ఎవరూ పట్టించుకోలేదు. అందరూ డబ్బుల కోసం క్యూలో నిలబడ్డారు గానీ ఏమైందని ఎవరూ అడగలేదు. కొంతమంది యువకులు తమ సెల్‌ఫోన్లలో ఈ విజువల్స్‌ను చిత్రీకరించారు. దాదాపు గంట తర్వాత అధికారులు అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి.. మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పాపం పండు ముదుసలి అంబులెన్స్‌లో తన భర్త శవాన్ని తీసుకొనివెళ్లింది. ఇంత జరిగినా ఇండియన్‌ బ్యాంకు అధికారులు, సిబ్బంది, అక్కడే ఉన్న ఖాతాదారులు కనీసం ఎవరూ స్పందించలేదు. మాయమైపోతున్న మనిషి విలువలకు ఈ ఘటన అద్దం పడుతోంది.

14:14 - December 4, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. చివరకు దుర్గగుడి కనకదుర్గమ్మకు కూడా తాకింది. పాతనోట్లు తీసుకోకపోవడం..రూ. 2వేల నోటుకు చిల్లర దొరక్కపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ గుడికి పలు జిల్లాలు, రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటుంటారు. కుటుంబంతో ఇక్కడకు వచ్చిన భక్తులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. సేవా టికెట్ల కొనుగోలుకు పాతనోట్లను నిరాకరిస్తున్నారని భక్తులు వాపోయారు. కొండపై చిల్లర దొరక్కపోవడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఏటీఎంలు చూసినా రెండు వేల నోట్లు రావడంతో చిల్లరదొరక్క పోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. కానీ దుర్గగుడికి వచ్చే భక్తులు ఏటీఎం కార్డులు తేలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

14:02 - December 4, 2016
13:59 - December 4, 2016

శ్రీకాకుళం : జిల్లాలోని కొవ్వాడ అణు విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఉపద్రవాన్ని ఎందుకు పట్టించుకోలేదని అఖిల భారత న్యాయవాదుల సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా బాధిత ప్రాంతాల్లో పౌరహక్కుల సంఘం, న్యాయవాదుల సంఘం నేతలతో పాటు సీపీఎం, సీఐటీయూ నేతలు ధర్నా నిర్వహించారు. విదేశాల్లో, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో తిరస్కరించిన అణువిద్యుత్ ప్రాజెక్ట్‌ను శ్రీకాకుళం జిల్లాలో ఎలా ఏర్పాటు చేస్తారని కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్ట్‌ వ్యతిరేక ఉద్యమకారులు ప్రశ్నించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం సరికాదని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:53 - December 4, 2016

నిజామాబాద్ : సంవత్సరాలు గడుస్తున్నా.. పూర్తికాని పనులు.. ఇరుకు రహదారుల్లో వాహనదారులు అవస్థలు. రాత్రయిందంటే.. రోడ్డుపై ప్రయాణం నరకంగా మారింది. నిజామాబాద్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారి దుస్థతిపై టెన్‌టీవీ  ప్రత్యేక కథనం..
అధ్వాన్నంగా రోడ్లు 
నిజామాబాద్‌ జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లతరబడి కొనసాగుతున్న  రోడ్లు, కల్వర్టుల నిర్మాణం.. ప్రయాణానికి తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌ -నిజామాబాద్‌ రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారులను హడలిపోతున్నారు. రోడ్లు వెడల్పు పేరుతో ఉన్న బ్రిడ్జిలను కూల్చేసిన అధికారులు.. కొత్తబ్రిడ్జిల నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌ దయకు వదిలేశారు. ప్రధానంగా నిజామాబాద్‌ -హైదరాబాద్‌ రోడ్డుపై ఎంతకీ పూర్తికాని బ్రిడ్జిల నిర్మాణం.. ప్రజలను విసుగెత్తిస్తోంది. 
నాసిరకంగా బ్రిడ్జీ పనులు 
నిజామాబాద్‌ పట్టణాన్ని వివిధ ప్రాంతాలలో కలిపే రోడ్లు 7 ఉండగా వాటిలో రద్దీ ఎక్కువగా ఉండేది హైదరాబాద్‌ నిజామాబాద్‌ రోడ్డు. దీన్ని 4లైన్లరహదారిగా మారుస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి డిచ్‌పల్లి వరకు నాలుగులైన్ల రోడ్డు ఉండగా.. డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్‌ వరకు 14కిలోమీటర్ల రోడ్డును 4లైన్లుగా మార్చే పనులు జరుగుతున్నాయి. దాన్లో భాగంగా కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టారు. నిజామాబాద్‌ పట్టణ శివారు ప్రాంతమైన బొర్గాం వద్ద బ్రిడ్జి నిర్మాణం నత్తనడకను తలపిస్తోంది. అసలే ఇరుకు రోడ్డు.. పైగా సగం బ్రిడ్జిని కూల్చేసి కొత్తగా నిర్మాణం చేపట్టారు. చేస్తున్న అరకొర పనులు కూడా నాసిరకంగా కానిచ్చేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
అర్థాంతరంగా ఆగిపోయిన బ్రిడ్జిపనులు 
ఇక.. దర్నారం  దగ్గర బ్రిడ్జిపనులు కోర్టు కేసులతో అర్థాంతరంగా ఆగిపోయాయి. రోడ్డు వెడల్పుకోసం భూసేకరణ చేయాల్సి ఉండగా.. అవేవి పట్టించుకోకుండా... ముందుగా కల్వర్టుల నిర్మాణం చేపట్టడంతో.. కోర్టుకేసులు అడ్డంకిగా మారాయి. దీంతో  రోడ్డు నిర్మాణం.. ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితివచ్చింది. పాత బ్రిడ్జిపై భారీ వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఎప్పుడు బ్రిడ్జి కూలి ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్‌ ప్రజలు కోరుతున్నారు. 

 

కుల వ్యవస్థ ఇంకా పోలేదు - ఈటెల..

హైదరాబాద్ : విశ్వజన కళామండలి ఆధ్వర్యంలో అంబేద్కర్ అంతర్జాతీయ, జాతీయఅ వార్డుల ప్రధానోత్సవ సభ జరగింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల, ఎమ్మెల్యే గుండా మల్లేష్ పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినా దేశంలో కులవ్యవస్థ పోలేదని, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేసినా దేశంలో కులవ్యవస్థ ఇంకా అలాగే ఉందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

భారత్ తో సంబంధాలు పటిష్టం - అప్ఘన్ అధ్యక్షుడు..

పంజాబ్ : భారత్ తో అప్ఘన్ సంబంధాలు పటిష్టంగా ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ వ్యాఖ్యానించారు. అమృత్ సర్ లో హార్ట్ ఆఫ్ ఏషియా సమ్మిట్ ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశ ప్రధాని మోడీ, అప్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పాల్గొన్నారు. వీరితో పాటు 40దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉగ్రవాదం, అభివృద్ధి, భద్రత, వాణిజ్యంపై చర్చించారు. ఉగ్రవాదంపై పోరు లక్ష్యంగా సదస్సుకు అతిథ్యమిచ్చిన భారత్ కు ఘనీ కృతజ్ఞతలు తెలియచేశారు. ఉగ్రవాదం నుండి అప్ఘన్ ముప్పు ఎదుర్కోంటోందని, ఎలాంటి షరతులు లేకుండానే భారత్ తమకు సహాయం చేస్తోందని తెలిపారు.

13:46 - December 4, 2016

కామారెడ్డి : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రకు తెలంగాణ రాష్ర్టంలో విశేష స్పందన లభిస్తోంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా పాదయాత్రకు మద్దతు తెలుపుతూ... పాదయాత్ర బృందంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర ఇవాళ్టికి 49వ రోజుకు చేరుకుంది. సదాశివనగర్‌, మల్లుపేట, గాంధారి ఎక్స్‌రోడ్డు, మోడీగాం, భూంపల్లి, గుడిమెట్టు, జువ్వాడి, గాంధారిలో పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. తెలంగాణ రాష్ర్టంలో ఎంబీసీలకు న్యాయం జరగడం లేదని పాదయాత్ర బృంద సభ్యులు ఆశయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్న కులాలపై పెత్తందార్ల ఆగడాలు పెరిగిపోయాయని అన్నారు. చిన్న కులాలవారు సాంఘిక బహిష్కరణకు గురవుతున్నారని వాపోయారు. దళితుల తర్వాత ఎంబీసీలే ఎక్కువగా కులవివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎంబీసీలకు వెంటనే అట్రాసిటీ యాక్ట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంబీసీల అభివృద్ధి కోసం ఎంబీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల నుంచి పాదయాత్ర బృందానికి అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు.

 

జాతీయస్థాయి షూటర్ పై అత్యాచారం..

ఢిల్లీ : జాతీయస్థాయి షూటర్ పై అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడని కోచ్ పై చాణక్యపురి పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు..

చిత్తూరు : తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు చక్రస్నానం కార్యక్రమం జరిగింది.

13:11 - December 4, 2016

నాని అనుకున్నట్టుగానే మరో సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో ఈ యంగ్ హీరో నటిస్తున్న కొత్త చిత్రం నేను లోకల్ రిలీజ్ డేట్ ని కన్ ఫర్మ్ చేశాడు. మరి నాని లోకల్ మూవీ రిలీజ్ డేట్ విశేషాలేంటో వాచ్ దీస్ స్టోరీ.
వరుస సినిమాలతో దుమ్మురేపిన నాని  
ఈ ఏడాది నాని వరుస సినిమాలతో దుమ్మురేపేశాడు. ఒకే ఎడాది లో హ్యట్రిక్ హిట్స్ కొట్టిన హీరోగా సరికొత్త రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ పుల్ స్వీంగ్ లో ఉన్న ఈ హీరో దిల్ రాజు బ్యానర్ లో నటించిన నేను లోకల్ కూడా కంప్లీట్ చేసి రిలీజ్ కి సిద్ధం చేశాడు.
మూడు హిట్లు అందుకున్న నాని
నాని ఈ ఎడాది కృష్ణగాడి ప్రేమగాథ, జెంటిల్ మేన్, మజ్ను ఈ మూడు సినిమాలు మూడు హిట్లు అందుకున్నాడు. ఒక్క సినిమాను రిలీజ్ చేయడానికే నేటి హీరోలు చాలా కష్టపడుతున్నారు. కానీ నాని మాత్రం నాన్ స్టాప్ గా సినిమాలు రిలీజ్ చేస్తూ ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. ఈ ఎడాదిలో మూడు సినిమాలతో మూడు హిట్స్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా  త్రినాథరావు దర్శకత్వంలో నటించిన నేను లోకల్ తో ఈ ఎడాదికి గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు. 
ఈ నెల 22న రిలీజ్ 
నేను లోకల్ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నట్టు రెండు వారాల కిందటే అనౌన్స్ చేశారు. అయితే విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ గాసిప్స్ పై స్పందించిన ఈ సినిమా టీమ్ ముందుగా చెప్పిన ప్రకారం ఈ నెల 22వ తేదీనే ఈ నేను లోకల్ సినిమా రిలీజ్ అవుతుందని క్లారిటి ఇచ్చింది.ఈ సినిమాలో నాని పక్కన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.

 

13:04 - December 4, 2016

ఇటీవల కాకినాడలో కవిసంధ్య, స్ఫూర్తి సాహితి, ఏపీ, పుదుచ్చేరి ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో యానాం కవితోత్సవం ఘనంగా జరిగింది. ఆ విశేషాలు వీడియోలో చూద్దాం....

 

13:02 - December 4, 2016

సినీ నిర్మాతలు ఆ నవలకి రెండు మిలియన్ డాలర్లు అంటే 14 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు.. కానీ, తన నవల చదివి తన పాఠకులే సినిమాగా ఊహించుకోవాలనుకున్నాడు. దాన్ని ఏ దర్శకుడూ తెరకెక్కించకూడదని పాఠకుల మీద తన అపార గౌరవాన్ని చాటిన రచయిత గురించి విన్నారా? నాలుగు సంవత్సరాలపాటు వెల్లకిలా పడుకొని మైఖేలేంజిలో తన ప్రపంచ ప్రఖ్యాత సిస్టిన్ ఛాపెల్ పెయింటింగ్ వేశాడు.. అంతే  శ్రద్ధగా తన ఒక్కో నవలనీ పదిహేను, ఇరవై, ముప్పై, నలభై ఏళ్ళపాటు చెక్కిన ఈ మహా శిల్పి రచనల్ని చదివారా? ఒక 80 ఏళ్ళ వృద్ధుడూ, మరో 70 ఏళ్ళ స్త్రీ, వారిద్దరి అజరామర ప్రేమ మీద తాను రాయదల్చుకొన్న నవల కోసం తనకొచ్చిన నోబెల్ బహుమతిని సైతం పణంగా పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే ప్రపంచ ప్రఖ్యాత రచయిత గాబ్రియేల్ గార్షియా మార్క్వెజ్. ఆ సాహితీవేత్తను గురించిన ప్రత్యేక కథనం ఇవాళ్టి అక్షరం కార్యక్రమలో చూద్దాం....
'వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్'.. 
వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్.. ఈ  నవల ప్రారంభంలోనే కథ భవిష్యత్తులో మొదలయ్యి గతానికి ప్రయాణిస్తుంది. మళ్ళీ వర్తమానంలోకి వచ్చి భవిష్యత్తులోకి ప్రయాణిస్తుంది. కథా కాలంతో ముందుకూ వెనక్కూ వర్తులాకారంలో జరగటం, ఆకాశం నుంచి పసుప్పచ్చ పూలు రాలటం, ఒక పాత్ర ఆకాశంలోకి ఎగిరి వెళ్ళటం వంటి విచిత్రమయిన సంఘటనలూ, అంతకంటే విచిత్రమయిన పాత్రలూ నవల నిండా ఉంటాయి. పౌరాణిక జానపద కథల్లోలాగ ఏది నిజమో ఏది కల్పనో తెలీని అద్భుత రస కథా నిర్మాణం పాఠకుడిని కట్టి పడేస్తుంది.
పాఠకులను అమితంగా ఆకట్టుకున్న నవలలు  
ఇక మార్క్వెజ్ ఇతర రచనల్లోకి వెళితే.. ఆటమ్ ఆఫ్ ది పాట్రియార్క్, లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా పాఠకులను అమితంగా ఆకట్టుకున్నాయి. జనావళికి దూరంగా అంత:పురాల్లో, రాజదుర్గాల్లో, ఉంటూ పతనమైన ఒక నియంత కథతో మార్క్వెజ్ రాసిన నవల ఆటమ్ ఆఫ్  ది పేట్రియార్క్ అయితే... 80ఏళ్ల వృద్ధుడికి, 70ఏళ్ల స్త్రీ మధ్య అజరామర ప్రేమను చిత్రించిన నవల లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా.. ఇవీ యాభైఏళ్ల వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ విశేషాలు.. 
పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

విజయవాడలో ఎపి కేబినెట్ సబ్ కమిటీ భేటీ

విజయవాడ : గేట్ వే హోటల్ లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరుగుతోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, పరిటా సునీత, రావెల కిషోర్ బాబు హాజరయ్యారు.

 

12:45 - December 4, 2016
12:30 - December 4, 2016
12:25 - December 4, 2016

పంజాబ్ : అభివృద్ధే ప్రధాన అంశంగా మనం అడుగులు వేయాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమృత్ సర్ లో జరుగుతున్న హార్ట్ ఆఫ్ ఏషియా సమ్మిట్ లో ప్రధాని మోడీ పాల్గొని, ప్రసంగించారు. అమృత్ సర్.. సిక్కులు నివసించిన ప్రాంతమని చెప్పారు. ఆప్ఘనిస్తాన్ నుంచి అమృత్ సర్ కు చాలామంది పర్యాటకులు వస్తుంటారని తెలిపారు. ఆర్థిక వృద్ధి, శాంతి, స్థిరత్వం అత్యంత ప్రధానాంశాలని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కు ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాప్ ఘని, 40 దేశాల ప్రతనిధులు హాజరయ్యారు. ఉగ్రవాదం, అభివృద్ధి, భద్రత, వాణిజ్యంపై చర్చించనున్నారు.
 

ఆర్థిక వృద్ధి, శాంతి, స్థిరత్వం అత్యంత ప్రధానాంశాలు : మోడీ

పంజాబ్ : అమృత్ సర్ లో జరుగుతున్న హార్ట్ ఆఫ్ ఏషియా సమ్మిట్ లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. అభివృద్ధే ప్రధాన అంశంగా మనం అడుగులు వేయాలన్నారు. ఆప్ఘనిస్తాన్ నుంచి అమృత్ సర్ కు చాలామంది పర్యాటకులు వస్తుంటారని తెలిపారు. ఆర్థిక వృద్ధి, శాంతి, స్థిరత్వం అత్యంత ప్రధానాంశాలని పేర్కొన్నారు. 

 

సిక్కులు నివసించిన ప్రాంతం అమృత్ సర్ : ప్రధాని మోడీ

పంజాబ్ : అమృత్ సర్ లో జరుగుతున్న హార్ట్ ఆఫ్ ఏషియా సమ్మిట్ లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. అమృత్ సర్.. సిక్కులు నివసించిన ప్రాంతమని చెప్పారు.

 

హార్ట్ ఆఫ్ ఏషియా సమ్మిట్ ప్రారంభం

పంజాబ్ : అమృత్ సర్ లో హార్ట్ ఆఫ్ ఏషియా సమ్మిట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాప్ ఘని, 40 దేశాల ప్రతనిధులు హాజరయ్యారు. ఉగ్రవాదం, అభివృద్ధి, భద్రత, వాణిజ్యంపై చర్చించనున్నారు. ప్రధాని ప్రసంగించారు.

 

12:09 - December 4, 2016

హైదరాబాద్ : బెంగళూరు...సికింద్రాబాద్ దురంతో ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది. బెంగళూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ లో ఎపిలోని అనంపురం జిల్లా గుంతకల్ వద్ద రెండు బోగీల్లో 12 తులాల బంగారం, రూ.40 వేలను అపహరించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. 

 

12:02 - December 4, 2016

మెగా ప్రెండ్ షిప్ కోసం అనుకున్నట్టుగానే సూర్య వెనక్కి తగ్గాడు. మెగా ప్రొడ్యూసర్ నేరిపిన మంతనాలతో కోలీవుడ్ స్టార్ తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఇంతకీ సూర్య సింగం 3 రిలీజ్ డేట్ ఎప్పుడు కన్ ఫర్మ్ చేశారో మీరే చూడండి.
లేట్ గా సూర్య సింగం 3 షూటింగ్ 
సూర్య సింగం 3 షూటింగ్ చాలా లేట్ గా జరుపుకుంది. అందుకే తగ్గట్టే ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో కూడా వాయిదాలు పడుతుంది. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో 9 న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ డేట్ నుంచి తప్పుకుంది. ఆ తరువాత డిసెంబర్ 16 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ డేట్ కూడా మారింది. కేవలం మెగా హీరో రామ్ చరణ్ కోసమే సూర్య తన సినిమాను పోస్ట్ ఫోన్ చేసినట్లు తెలుస్తుంది.
ఈనెల 16న  సింగం 3 విడుదల 
సూర్య కథానాయకుడిగా రూపొందిన సింగం 3 సినిమాను ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ధృవ సినిమా రిలీజ్ ను ఈ నెల 9వ తేదీన పెట్టుకున్న అల్లు అరవింద్, ఈ సినిమా వసూళ్లపై సింగం 3 ప్రభావం చూపుతుందని భావించారు. దీంతో సింగం3సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకోమని  నిర్మాత జ్ఞానవేల్ రాజాతో పాటు సూర్యతో ఆయన మాట్లాడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో మెగా ఫ్రొడ్యూసర్ జరిపిన మెగా మంతనం బాగానే పనిచేసింది.
థర్డ్ సీక్వెల్ పై భారీ అంచనాలు 
సూర్యతో పాటు జ్ఞానవేల్ రాజాకి అల్లు అరవింద్ తో పాటు మెగా ఫ్యామిలీ హీరోలతో మంచి ప్రెండ్ షిప్ ఉంది. ఆ రిక్వెస్ట్ తో పాటు బడా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ స్వయంగా అడగటంతో సింగం 3ని వెనక్కి జరిపారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ కోసం 16 తేదీ నుంచి వెనక్కి జరిగిన సూర్యం సింగం 3. ఈ నెల 23న విడుదల కానుంది. మొదటి రెండు భాగాలు సక్సెస్ కావడంతో ఈ థర్డ్ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

 

అమృత్ సర్ లో హార్ట్ ఆఫ్ ఏషియా సమ్మిట్

పంజాబ్ : అమృత్ సర్ లో హార్ట్ ఆఫ్ ఏషియా సమ్మిట్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాప్ ఘని, 40 దేశాల ప్రతనిధులు హాజరయ్యారు. ఉగ్రవాదం, అభివృద్ధి, భద్రత, వాణిజ్యంపై చర్చించనున్నారు. 

 

11:41 - December 4, 2016

హవానా : క్యూబా మాజీ అధ్యక్షుడు, విప్లవ వీరుడు ఫిడెల్ క్యాస్ట్రో అంతిమయాత్ర ముగిసింది. కాస్ట్రో చితాభస్మాన్ని ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించారు. క్యాస్ట్రో అవశేషాలను శాంటియాగాలో ఇవాళ సమాధి చేశారు. అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు హాజరయ్యారు.
కాస్ట్రో భౌతికకాయానికి నవంబర్‌ 27న దహన సంస్కారాలు
క్యూబా విప్లవవీరుడు ఫిడెల్ కాస్ట్రో భౌతిక కాయానికి గత ఆదివారం నవంబర్‌ 27న దహన సంస్కారాలు నిర్వహించారు. కాస్ట్రో రాసుకున్న విల్లు మేరకే ఆయన మృతదేహాన్ని దహనం చేశారు.
జోస్ మార్టిన్ స్మారక కేంద్రంలో చితాభస్మం
కాస్ట్రో చితాభస్మం ఉన్న పాత్రను ఒక అద్దాలపెట్టెలో ఉంచి, దానిపై క్యూబా జాతీయ జెండాను కప్పారు. కాస్ట్రో చితా భస్మాన్ని గ్రీన్‌ మిలటరీ వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రజల సందర్శనార్ధం రెండు రోజుల పాటు హవానాలోని చరిత్రాత్మక విప్లవ కూడలిలోని జోస్ మార్టిన్ స్మారక కేంద్రంలో ఉంచారు. అక్కడికి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు శోకతప్త హృదయంతో తమ ప్రియతమ నేతకు శ్రద్ధాంజలి ఘటించారు.
హవానాలో రెండురోజుల శ్రద్ధాంజలి 
హవానాలో రెండురోజుల శ్రద్ధాంజలి అనంతరం కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు బుధవారం నుంచి ప్రారంభమైంది. వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన క్యూబన్లు తమ నేతకు వీడ్కోలు పలికారు. నేనే ఫిడెల్ అంటూ నినాదాలు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ చితాభస్మం శాంటాక్లారాలోని ఆయన ఉద్యమ సహచరుడు చెగువెరా సమాధి మ్యూజియం ఉన్న సముదాయంలోకి చేరింది. ఇది క్యూబాతోపాటు మానవాళి చరిత్రను మార్చివేసిన ఇద్దరు విప్లవ వీరుల చారిత్రక సమావేశం అని ఓ వైద్య విద్యార్థి వ్యాఖ్యానించారు.
కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు ప్రస్థానం
కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు హవానా నుంచి పలు పట్టణాల మీదుగా నాలుగు రోజుల పాటు 8 వందల కిలోమీటర్ల మేర ప్రయాణించి డిసెంబర్‌ 4, ఆదివారం శాంటియాగోకు చేరుకుంటుంది. శాంటాఐఫిజెనియా స్మశానవాటికలో చితాభస్మాన్ని ఖననం చేయనున్నట్లు క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 19వ శతాబ్దపు స్వాతంత్య్ర వీరుడు జోస్ మార్టి సమాధి పక్కన కాస్ట్రో చితాభస్మాన్ని సమాధి చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధి నేతలు, అధికారులు హాజరుకానున్నారు.
2006లో అధికారాన్ని సోదరుడు రౌల్ కాస్ట్రోకు అప్పగింత
అమెరికా మద్దతుతో విర్రవీగిన క్యూబా నియంత ఫుల్జెన్సియో బాస్టియాను విప్లవోద్యమం ద్వారా కాస్ట్రో ఆయనను గద్దె దించారు. అమెరికా చేసిన హత్యాయత్నాలను కుట్రలను, విజయవంతంగా ఛేదిస్తూ 1959 నుంచి దాదాపు 50 ఏళ్ల పాటు క్యూబాను పరిపాలించారు. అనారోగ్యంతో 2006లో అధికారాన్ని తనకు విశ్వాసపాత్రుడైన సోదరుడు రౌల్ కాస్ట్రోకు అప్పగించి దేశ పాలనా వ్యవహారాలను చక్కదిద్దుతూ వచ్చారు. నవంబర్‌ 26న 90 ఏళ్ల కాస్ట్రో తుదిశ్వాస విడిచారు.

 

11:32 - December 4, 2016
10:40 - December 4, 2016
10:37 - December 4, 2016

విశాఖ : చేపల మార్కెట్లకు ఫేమస్‌ అయిన విశాఖలో .. చేపల వ్యాపారాలు డల్‌గా మారాయి. పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌ సామన్యులకు చేపలను దూరం చేశాయి. అయితే బ్యాంకులు చిల్లర సప్లైచేస్తున్నామని చెబుతున్నా.. 5వందల రూపాయల నోట్లు అసలే రావడంలేదంటున్నారు చేపల వ్యాపారులు. నిన్నటిదాకా కార్తీక మాసంతో సేల్స్‌ లేక వెలవెలబోయిన మార్కెట్లు... ప్రస్తుతం చిల్లర సమస్యతో బేరాలు లేకుండా పోయాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:36 - December 4, 2016

హైదరాబాద్ : చిల్లర సమస్యతో చేపలు చిన్నబోతున్నాయి. ఆదివారం కావడంతో చేపల తిందామనుకున్న జనానికి చిల్లర సమస్య చేపముల్లులా అడ్డుపడుతోంది. ఫిష్‌ మార్కెట్‌.. చిల్లర సమస్యతో వెలవెలబోతోంది. సేల్స్‌ లేక చేపల వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కేజీ చేపలు కొని 2వేల రూపాలయ నోట్‌ ఇస్తే ..చిల్లర ఎక్కడ తీసుకురావాలని ..వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.  అటు వ్యాపారులకు ..ఇటు వినియోగదారులకు చిల్లర పెద్ద సమస్యగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బెంగళూరు...సికింద్రాబాద్ దురంతో ఎక్స్ ప్రెస్ లో చోరీ

అనంతపురం : బెంగళూరు...సికింద్రాబాద్ దురంతో ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది. అనంపురం జిల్లా గుంతకల్ వద్ద రెండు బోగీల్లో 12 తులాల బంగారం, రూ.40 వేలను అపహరించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. 

 

09:50 - December 4, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో బైకు రేసర్లు రెచ్చిపోయారు. బైక్ రేసర్ నదీమ్ గోపాల్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గోపాల్ మృతి చెందారు. నదీమ్ తీవ్ర గాయాలు అయ్యాయి. ఉస్మానియా ఆస్పత్రిలో నదీమ్ చికిత్స పొందుతున్నాడు. మరోవైపు జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మధ్యం తాగి వాహనాలు నడుపుతున్న 21 మందిపై కేసు నమోదు చేశారు. పలు వాహనాలను సీజ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:47 - December 4, 2016

కర్నూలు : ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగి బస్సు దగ్ధం అయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్ ఆర్ ఎస్ ట్రావెల్స్‌ బస్సులో కర్నూలు జిల్లా డోన్ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:42 - December 4, 2016
09:41 - December 4, 2016

కామారెడ్డి : దేశానికి స్వాతంత్ర్యంవచ్చి 69 ఏళ్లు దాటుతున్నా ఇంకా నిరుపేదలు అలాగే ఉన్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇల్లిల్లు తిరుగుతూ బిక్షాటన చేసి జీవిస్తున్నవారి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. మహాజన పాదయాత్రలో భాగంగా  సంచార జాతివారిని సీపీఎం పాదయాత్ర బృందం సభ్యులు పరామర్శించారు. ప్రభుత్వ పథకాలేవీ తమకు అందడంలేదని ఈ పేదలు పాదయాత్ర బృందానికి చెప్పుకున్నారు. 
1200 కిమీ పూర్తి 
48వ రోజు కామారెడ్డిలో ప్రారంభమైన పాదయాత్ర... పోసానిపేట, అడ్డూర్‌ ఎల్లారెడ్డి, సదాశివనగర్‌ వరకు కొనసాగింది. 48వ రోజు వరకు పాదయాత్ర 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని... సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్‌ ఏమైందని ప్రశ్నించారు.
హామీలను నెరవేర్చని టీ. ప్రభుత్వం 
ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని తమ్మినేని అన్నారు. రోజురోజుకు రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. ప్రజలందరూ బాగుపడే తెలంగాణ కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. 
సంచార కులాల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ 
సంచార కులాల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. బీసీ కులాల్లో అత్యంత వెనకబడిన సంచార కులాల వారు సమాజానికి దూరంగా బతుకులీడుస్తున్నారని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. సంచార కులాల వారికి కనీసం రేషన్‌కార్డులు కూడా లేవని, ఈ తెగల అభివృద్ధి కోసం శ్రీ రేణికే కమిటీ సిఫార్సులను అమలు చేయాలని లేఖలో కోరారు. 

 

09:36 - December 4, 2016

కరీంనగర్ : శాంతి భద్రతలు కాపాడ్డంలో కరీంనగర్‌ పోలీసులు ..అలర్ట్‌గా ఉంటున్నారు. ప్రతి రోజు డ్రంక్‌ అండ్రైవ్‌ , కార్డన్‌సెర్చ్‌లను నిర్వహిస్తున్న పోలీసులు.. రోడ్లపైకి వచ్చిన ప్రతి వాహనాన్ని చెక్‌ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాల్లేని పలువాహనాలను పోలీస్టేషన్‌కు తరలించారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో జిల్లా రహదారులన్నిటినీ ఒకేసారి దిగ్బంధం చేసి.. నాకాబందీ నిర్వహించారు. డీసీపీ కమాలాసన్‌రెడ్డి నేతృత్వంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. 

 

09:33 - December 4, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో  పెద్దనోట్ల రద్దు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 26 రోజులు గడుస్తున్నా నగదు కష్టాలు తీరడం లేదు. కరెన్సీ కోసం ఎటీఎంల ముందు జనాలు పడిగాపులు కాస్తున్నారు. ఏటీఎంల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. డబ్బు పెట్టిన కొద్ది గంటల్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. చాలాచోట్ల నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎం సెంటర్లలో అవుట్‌ ఆఫ్ సర్వీస్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. పనిచేయని ఏటీఎంలతో జనం విసుగుచెందుతున్నారు. 2 వేల రూపాయల నోట్లకు చిల్లర దొరక్క.. నిత్యావసర సరుకులు కొనలేక.. సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు. పింఛన్‌దారులకు తిప్పలు తప్పడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఏటీఎంల ముందు భారీ క్యూలు

హైదరాబాద్ : 26 రోజులైనా నగదు కష్టాలు తీరడం లేదు. ఏటీఎం ముందు భారీ క్యూలున్నాయి. నగదు పెట్టిన కొద్దిసేపట్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. పలు చోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదు. దీంతో జనం విసుగు చెందుతున్నారు. పలు ఏటీఎం సెంటర్ల ముందు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. పింఛన్ దారులకు తిప్పలు తప్పడం లేదు.

08:55 - December 4, 2016
08:55 - December 4, 2016

ఆదిలాబాద్ : కల్తీరాయుళ్లు బరితెగిస్తున్నారు. తాగే మంచినీళ్ల దగ్గర నుంచి తినే తిండి వరకు ప్రతిదీ కల్తీమయం చేస్తున్నారు. ఇటీవలే గుంటూరులో భారీ ఎత్తున కల్తీ కారం ముఠా గుట్టు రట్టవ్వగా..తాజాగా ఆదిలాబాద్‌లో కల్తీ మంచినూనే దందా వెలుగులోకి వచ్చింది. కాగజ్‌నగర్లో పలు కిరాణాదుకాణాలతో కల్తీనూనే విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. అయితే విజిలెన్స్‌ దాడుల్లో ఓ కిరాణాషాపులో నిల్వ ఉంచిన వెయ్యి లీటర్ల కల్తీ వంటనూనే బయటపడింది. ఐదు డ్రమ్ములను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి నుంచి సాంపిల్స్‌ను సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్‌కు పంపించారు. శాంపిల్ టెస్టులో నకిలీ ఆయిల్‌ అని తేలితే కల్తీనూనే తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

 

08:52 - December 4, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత సైబర్‌ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలు తగ్గి..మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు పెరగడంతో ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సచివాలయ ఉద్యోగి నుంచి ఏకంగా 87 వేల రూపాయలు మాయం చేశారు సైబర్‌ నేరగాళ్లు. టాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న శంకర్‌ నిన్న ఉదయం జీతం డబ్బులు తీసుకుందామని బ్యాంకుకు వెళ్లాడు. అయితే క్యూలో నిలబడి ఉండగానే..శంకర్‌ మొబైల్‌కు బ్యాంకు అధికారులమంటూ 16 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. పాత ఏటీఎం కార్డు బ్లాక్‌ అయింది..కొత్త ఏటీఎం కార్డు ఇస్తున్నాము..మీ కార్డు నెంబర్‌ చెప్పండని అడగ్గానే..అది నమ్మిన శంకర్‌ పిన్‌నెంబర్‌తో సహా అన్నీ చెప్పేశాడు. ఇంకేముందు క్షణాల్లో శంకర్‌ అకౌంట్లో ఉన్న 87 వేల నగదు మాయం అయింది. విషయం తెలుసుకున్న శంకర్‌ లబోదిబోమంటున్నాడు. 

 

08:50 - December 4, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో వస్తున్న చిల్లర సమస్యలు పరిష్కరించేందకు ప్రభుత్వం మధ్యం ధరలను సవరించింది. చిల్లర సమస్య ఉత్పన్నం కాకుండా సమీప ధరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్యంపై ఎక్సైజ్ డ్యూటీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. లిక్కర్ మూలధరపై 70 శాతం, లైట్ బీర్‌పై 108 శాతం, స్ట్రాంగ్ బీరుపై 115 శాతం ఎక్సైజ్ డ్యూటీని విధించారు. గతంలో బ్రాండ్‌ను బట్టి 130 నుంచి 190 శాతం వరకు ధరను నిర్ణయించేవారు. మద్యం ఎంఆర్‌పీ ధరలకు మించి విక్రయిస్తే  చర్యలు తప్పవని హెచ్చరించారు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్. అయితే సవరించిన ధరలతో ప్రభుత్వానికి అదనంగా 50 కోట్ల రూపాయాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

08:47 - December 4, 2016

హైదరాబాద్ : ఈ నెల మూడో వారం నాటికి పంట భూముల్లో మిషన్ భగీరథ పైప్ లైన్‌లు వేయడం పూర్తి కావాల్సిందేనని వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. భగీరథ పనులతో అన్నదాతల పంటలకు నష్టం జరగొద్దన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా నాట్లు పడకముందే పైప్ లైన్ లు వేయాలన్నారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై సచివాలయంలో అధికారులు, కన్సల్టెంట్ లతో ప్రశాంత్‌ రెడ్డి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. 
నిర్లక్ష్యాన్ని సహించేదన్న ప్రశాంత్ రెడ్డి 
సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథలో చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి తేల్చి చెప్పారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షలకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. మెదక్, ఖమ్మం సెగ్మెంట్ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయన్న ఆయన..మిగతా సెగ్మెంట్ లలో కూడా వేగం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల్లో ఇసుక కొరతతో పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదని చీఫ్ ఇంజనీర్లు ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సంబంధిత మంత్రితో మాట్లాడుతానని వైస్ ఛైర్మన్ హామీ ఇచ్చారు.
ఓహెచ్ బీఆర్ లపై మరింత దృష్టి 
పనుల విభజనతో పాటు కాంట్రాక్టర్ల మధ్య లేబర్ విభజన కూడా జరగడం.. నోట్ల రద్దు ప్రభావం.. భగీరథపై పడలేదన్నారు. ఇంటెక్ వెల్స్ అన్నీ సేఫ్ స్టేజ్ కు వచ్చినందున ఇక ట్రీట్ మెంట్ ప్లాంట్.. ఓహెచ్ బీఆర్ లపై మరింత దృష్టి పెట్టాలన్నారు. వాటితో పాటు పైప్ లైన్ పనులను త్వరగా చేయాలన్నారు. భగీరథలో ఎన్ని కిలోమీటర్ల మేయిన్ పైప్ లైన్ వేయాలో.. పంట భూముల్లో ఎన్ని కిలోమీటర్లు వేయాలనేది ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 
ఓహెచ్ బీఆర్ లపై మరింత దృష్టి పెట్టాలన్నారు
యాక్షన్ ప్లాన్ ను రూపకల్పన 
డిసెంబర్ 2017 నాటికి అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించాలంటే ఈ నెల మూడో వారం నాటికి పంట భూముల్లో పైప్ లైన్ లు వేయడం పూర్తి కావాల్సిందే అన్నారు. అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఏఈఈల నుంచి పంట భూముల సమాచారం తెప్పించుకుంటే పని సులభంగా అవుతుందని సూచించారు. అవసరమైతే వేరే ప్రాంతాల్లో వేయాల్సిన పైప్ లైన్ పనులను కొన్ని రోజుల పాటు నిలిపివేసి, పంట భూములపై ఫోకస్ చేయాలన్నారు. ఈ విషయంలో వర్క్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని మానిటర్ చేయాలని ఈఎన్ సి సురేందర్ రెడ్డిని కోరారు. త్వరలోనే తాను వారంలో రెండు రోజులు ఫీల్డ్ విజిట్ చేస్తానని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఇంటింటికి నల్లాతో పాటు ఇంటింటికి ఇంటర్నెట్ ను ఇవ్వడం కూడా సీఎం కేసీఆర్ లక్ష్యమని దానికి అనుగుణంగా ఫైబర్ గ్రిడ్ పనులు పూర్తి చేయాలన్నారు. అంతకుముందు ఎస్ ఆర్ పీఎస్ జలాల్ పూర్ ఇంటెక్ వెల్ పనుల పురోగతిపై పబ్లిక్ హెల్త్ ఈ.ఎన్.సి ధన్ సింగ్ తో పాటు ఆ శాఖ ఇంజనీర్లతో ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు.

 

బైక్ రేసర్ ఢీ.. వ్యక్తి మృతి

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో బైకు రేసర్లు రెచ్చిపోయారు. బైక్ రేసర్ నదీమ్ గోపాల్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గోపాల్ మృతి చెందారు. నదీమ్ తీవ్ర గాయాలు అయ్యాయి. ఉస్మానియా ఆస్పత్రిలో నదీమ్ చికిత్స పొందుతున్నాడు.

08:20 - December 4, 2016

విజయవాడ : కాపునేత తముద్రగడ పద్మనాభం పాదయాత్ర మరోసారి వేడి పుట్టిస్తోంది. ఈ యాత్రకు అనుమతిచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే... జేఏసీ మాత్రం అనుకున్నది చేసి తీరతామని కుండబద్దలు కొడుతోంది. ఉభయ వర్గాలూ పంతానికి పోతుండడం..రాష్ట్ర రాజకీయాల్లో కాకను పెంచుతోంది. 
రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోన్న ముద్రగడ నిర్ణయం  
జనవరి నెలలో పాదయాత్ర చేపట్టాలన్న కాపు జేఏసీ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. రావులపాలెంనుంచి అంతర్వేది వరకు.. పాదయాత్ర చేపట్టేందుకు కాపు జేఏసీ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. దీనికి అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఇది కాపు సామాజిక వర్గంలో మరింత ఆగ్రహాన్ని రగిలిస్తోంది. తమ పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వరని ముద్రగడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.. సర్కారు ఒప్పుకోకపోయినా ఈసారి యాత్ర ఆపే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. 
శాంతిభద్రతలకు ముద్రగడ విఘాతం కలిగించే ప్రయత్నం : చినరాజప్ప 
కాపు జేఏసీ తలపెట్టిన పాదయాత్రను ప్రభుత్వ పెద్దలు తప్పుబడుతున్నారు. ముద్రగడ పద్మనాభం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని.. సాక్షాత్తు హోంమంత్రి, కాపు సామాజికవర్గపు నేత చినరాజప్ప ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రభుత్వం అనుమతించబోదని హోంమంత్రి స్పష్టం చేశారు. 
రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టడంతో ఉద్రిక్తత
ఎన్నికల వేళ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలంటూ ముద్రగడ పద్మనాభం.. ఏడాది కాలంగా పలు రకాల నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తుని సభకు వచ్చిన ఆందోళనకారులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు తగులబెట్టడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. ఈకేసులో నిందితుల అరెస్టులూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాసరి నారాయణరావు లాంటి కాపు పెద్దలతో ముద్రగడ పద్మనాభం సమావేశమై మద్దతును కూడగట్టారు. అటు వైసీపీ అధినేత జగన్‌ కూడా ఇప్పటికే కాపు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై అన్ని రకాలుగానూ ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఇటీవల ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సిద్ధం కాగా.. పోలీసులు ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసు ఉన్నతాధికారుల రాజీ యత్నాలు ఫలించి ముద్రగడ యాత్రను విరమించుకున్నారు. 
పోలీసు అనుమతి లేకున్నా పాదయాత్ర చేస్తా : ముద్రగడ 
గడచిన ఏడాదికాలంగా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న తాము.... జనవరిలో పోలీసు అనుమతి లేకున్నా పాదయాత్ర చేసి తీరతామంటూ.. కాపు నాయకులు ముఖ్యంగా ముద్రగడ సమాయత్తమవుతున్నారు. పాదయాత్రతో పాటు.. రెండు నెలల కార్యాచరణనూ రూపొందించుకున్నారు. కంచాలు వాయించడం... ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వడం, కొవ్వొత్తుల ప్రదర్శన తదితర రూపాల్లో తమ ఆకాంక్షను వ్యక్తీకరించాలని భావిస్తోంది. పైగా తుని ఘటనకు కారకులెవరో చెబుతానంటూ ముద్రగడ చేసిన ప్రకటనా ఆసక్తిని రేపుతోంది. ముద్రగడ తాజా వ్యాఖ్యలు రైలుదహనం కేసులో కొత్త కోణాన్ని ఆవిష్కరించవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి కాపు జేఏసీ తాజా పాదయాత్రపై చంద్రబాబు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 

08:11 - December 4, 2016

హైదరాబాద్ : జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం పక్కా కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లా కేంద్రాలను హైదరాబాద్‌ తరహాలో మార్చేందుకు స్కెచ్‌ గీస్తోంది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్న కేసీఆర్‌.. జిల్లాల అభివృద్ధిపై దిశా నిర్దేశం చేయనున్నారు. 
కలెక్టర్లతో ప్రదీప్‌చంద్ర వీడియో కాన్ఫరెన్స్‌ 
కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆ జిల్లాల కలెక్టర్లతో ఇంతవరకు సీఎం కేసీఆర్‌ సమావేశం కాలేదు. రెండు నెలలు గడుస్తున్నా పరిపాలనాపరమైన అంశాలు చర్చించలేదు. దీంతో జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలోకి ఎలా వెళ్తున్నాయనే అంశాలపై చర్చించేందుకు త్వరలో ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అయితే అంతకంటే ముందు కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వారా సేకరించిన వివరాలను బట్టి కేసీఆర్‌ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. 
జిల్లాల అభివృద్ధి, కలెక్టర్ల పనితీరు, సమస్యలపై చర్చ 
ప్రధానంగా కలెక్టర్ల సమావేశంలో జిల్లాల అభివృద్ధి, కలెక్టర్ల పనితీరు, సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. జిల్లాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించనున్నారు. కొత్త జిల్లాల అభివృద్ధితో పాటు.. మిగతా జిల్లాల పరిస్థితులపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. కొత్త జిల్లాలకు కేటాయించబడిన అధికారులు ఉత్సాహంగా పని చేస్తున్నందున.. వారికి సరైన సలహాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఇప్పటికే కేసీఆర్‌.. సూచించారు. మరోవైపు హెచ్‌ఎండీఏ, కుడా తరహాలో ప్రతి జిల్లాకు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఔటర్‌ రింగ్‌రోడ్డుతో పాటు.. మౌలిక వసతులు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు వంటివి ఎలా ఉండాలనే దానిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త జిల్లా కేంద్రాలన్నీ పట్టణ కేంద్రాలుగా మారే అవకాశమున్నందున ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది. హైదరాబాద్‌ తరహాలో ఇబ్బందులు తలెత్తకుండా పెరిగే జనాభాకు అనుకూలంగా.. మౌలిక వసతుల కల్పన ఏర్పాట్లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 
ప్రస్తుత పరిస్థితులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలు
మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు అధికారులకు కేసీఆర్‌.. ప్రత్యామ్నాయ మార్గాలు సూచించే అవకాశం ఉంది. కేబినెట్‌లో తీసుకున్న నగదు రహిత లావాదేవీలపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన క్యాష్‌లెస్‌ విధానం.. వాటి ఫలితాలపై నివేదిక సేకరించి.. దానిపై కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు. ఇక జిల్లాలోని భూసమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్లకు సూపర్‌ పవర్స్‌ ఇచ్చే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీనికోసం మార్గదర్శకాలు తయారుచేసే బాధ్యతను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు అప్పజెప్పారు. మొత్తానికి జిల్లాల అభివృద్ధి కోసం.. సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 

 

బంజారాహిల్స్ లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. 12 మందిపై కేసు నమోదు చేశారు. 

 

07:56 - December 4, 2016

హైదరాబాద్ : కార్మిక సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్న ఆయన.. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యూలర్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. విద్యుత్‌ సంస్ధలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలోనూ సీఎం సానుకూలంగా స్పందించడం హర్షనీయమన్నారు. 
ఉద్యోగుల భద్రతకు సర్కార్‌ శ్రీకారం : మంత్రి జగదీష్ రెడ్డి 
విద్యుత్‌ శాఖలో సిబ్బంది పని తీరును తెలంగాణ సర్కార్‌ గుర్తించిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. ఉద్యోగుల భద్రతకు సర్కార్‌ శ్రీకారం చుట్టనుందన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న విద్యుత్‌ ఉద్యోగులకు జీవన భద్రత కల్పించడమే కాకుండా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను దశల వారీగా క్రమబద్దీకరిస్తామని మంత్రి తెలిపారు. 
దశలవారిగా క్రమబద్ధీకరణ : మంత్రి జగదీష్ రెడ్డి
విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న వారి వేతనాలు ఏజెన్సీ నుంచి కాకుండా నేరుగా చెల్లించాలన్న డిమాండ్‌ తోపాటు మరికొన్ని సమస్యలతో సమ్మెకు దిగిన కార్మికుల ఇబ్బందులపై సీఎం తమతో చర్చించారని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్‌ ఉద్యోగులను దశలవారిగా క్రమబద్ధీ కరించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. 
28వేల ఉద్యోగులకు లబ్ధి : మంత్రి జగదీష్ రెడ్డి  
ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న 28వేల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని..8వేల మంది ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆర్ధిక శాఖ నుంచి అనుమతి పొందామని మంత్రి తెలిపారు. మరో 5వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు మొదలు పెట్టినట్లు మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. సమ్మెకు దిగిన కార్మికులు కూడా సీఎం కేసీఆర్‌ స్పందనను చూసి సమ్మె విరమించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి సమ్మెను విరమించిన కార్మికులకు మంత్రి జగదీశ్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  

 

07:51 - December 4, 2016

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే చార్జీలు ఏమేరకు పెంచాలన్న విషయంలో స్పష్టత లేదుగానీ.. చార్జీలు పెంచడం అయితే ఖాయంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉదయ్‌ పథకంలో ఏపీకూడా చేరడంతో.. ఉదయ్‌ పథకం నిబంధనల ప్రకారం ప్రజలపై భారం తప్పదంటున్నారు విద్యుత్‌ రంగ నిపుణులు.   
విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రతిపాదనలు 
ప్రజలపై విద్యుత్‌ భారం మోపడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందు పెంపు ప్రతిపాదనలు ఉంచాయి. విద్యుత్‌  రంగానికి సంబంధించి  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదయ్‌ పథకం అమలు చేస్తే... చార్జీలు పెరగడం తప్పదు. ఉదయ్‌ స్కీం నిబంధనల ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలకు కనీసం మూడున్నరశాతం పెంచాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రంలో కరంటుబిల్లులు పెరగడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో ఉన్నందున పెంచే చార్జీల భారం పూర్తిగా సాధారణ వినియోగ దారులపై పడనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 7వేల 177కోట్ల రూపాయల లోటుతో వార్షిక  అంచనాలను వేశాయి పంపిణీ సంస్థలు. తాజా అంచాలను ఏపీఈఆర్సీకి కూడా అందించడంతో లోటును పూడ్చుకోడానికి ఎంతశాతం పెంచాలన్నదానిపై స్పష్టత రావడమే ఆలస్యం.. కరంటు చార్జీలు మోతెక్కనున్నాయి. చార్జీల పెంపును సరికాదంటున్నాయి.. ప్రజాసంఘాలు.
సబ్సిడీ ఇవ్వడం అనుమానమే..!
అయితే నష్టాల్లో ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంపై ఉన్నతాధికారుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో పెంచబోయే చార్జీలు యూనిట్‌కు 65పైసల నుంచి రూపాయిదాకా పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ చార్జీలు పెంచితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఏర్పడతాయని, పరిశ్రమలు మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంమీద త్వరలోనే ఏపీ  ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో పిడుగుపడనుందని తేలిపోవడంతో.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

 

07:47 - December 4, 2016

హైదరాబాద్ : సాధ్యమైంత త్వరగా క్యాష్ లెస్ విధానాన్ని అలవాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పిలుపునిచ్చారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే లావాదేవీలు చెయ్యాల్సి వస్తుందన్న సీఎస్‌..వచ్చే నెల జీతం నగదు రూపంలో అందచేయడం కుదరని స్పష్టం చేశారు. క్యాష్ లెస్ పాలసీని ఉద్యోగులందరూ త్వరగా నేర్చుకోవాలని సీఎస్‌ ప్రదీప్‌చంద్ర సూచించారు. 
క్యాష్ లెస్ విధానంపై అవగాహన కార్యక్రమం
ఉద్యోగులకు క్యాష్ లెస్ విధానంపై సెక్రటేరియట్‌లో ఆర్ధిక శాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆన్ లైన్ బ్యాకింగ్, క్యాష్ లెస్ విధానంపై ప్రజలు మరింత వేగంగా క్యాష్ లెస్ విధానాన్ని అలవర్చుకోవాలని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. ఉద్యోగులు నెలవారి జీతం,.ఇతర అవసరాలను ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను అమలు చేసుకుంటే పని సులువు అవుతుందన్నారు. 
కేవలం 20 శాతం డబ్బు మాత్రమే విడుదల 
ఇప్పడున్న డబ్బు కేవలం 20 శాతం మాత్రమే విడుదల చేస్తారని మిగతా మనీ మొత్తం క్యాష్ లెస్ విధానమే ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే సిద్ధిపేట నియోజకవర్గంలో క్యాష్ లెస్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర చెప్పారు. ఇక వచ్చే నెల ఉద్యోగులకు నగదు రూపంలో జీతభత్యాలు ఇవ్వడం కుదరని..బ్యాంక్‌ అకౌంట్‌లోనే మొత్తం జీతాన్ని జమచేస్తామని సీఎస్‌ స్పష్టం చేశారు. 
ప్రత్యేక కౌంటర్ల ద్వారా పాలసీ వివరణ 
క్యాష్ లెస్‌ విధానం ద్వారా ఉద్యోగులకు జరిగే ప్రయోజనాలపై వివిధ బ్యాంకు అధికారులు ప్రత్యేకమైన కౌంటర్ల ద్వారా పాలసీని వివరించారు. డిజిటైజేషన్, ఈ కామర్స్, పేటీఎం వంటి విధానాలను ఉద్యోగులకు వివరించారు. పెద్దనోట్ల రద్దుతో ఉద్యోగులు మొదలు అందరూ క్యాష్ లెస్ ట్రాన్ జెక్షన్ పై అవగాహన పెంచుకోవడం వల్ల నోట్ల సమస్య నుంచి బయట పడవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 

 

07:39 - December 4, 2016

కర్నూలు : జిల్లాలో విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. కర్నూలు జిల్లా వెంగలాంపల్లికి చెందిన 9మంది కూలీలు.. ఆటోలో వెళ్తున్నారు. మార్గంమధ్యలో ప్యాపిలి మండలం ఎన్‌రంగాపురం వద్ద ఎదురుగా వస్తున్న లారీ.., ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  
క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగం కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం...

కర్నూలు : డోన్ టోలో ప్లాజా సమీపంలో ఎస్ ఆర్ ఎస్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. 

07:26 - December 4, 2016

ఉత్తరప్రదేశ్ : జన్‌ధన్‌ ఖాతాలో వేసిన నల్లధనాన్ని విత్‌ డ్రా చేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోది ఖాతాదారులకు విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ధనికులు ఇప్పుడు పేదల ఇళ్లముందు క్యూలు కడుతున్నారని తెలిపారు. జన్‌ధన్‌ ఖాతాలో వేసిన నల్లధనం పేదలకే చెందుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నిర్వహించిన బిజెపి పరివర్తన్‌ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ..పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. 
భాజపా పరివర్తన్‌ ర్యాలీలో 
పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తిప్పికొట్టారు. భారత ప్రజలే తన అధిష్ఠానమని చెబుతూ నల్లధనం, అవినీతిపై దాడిచేసి తానేమైనా నేరం చేశానా? అని ప్రజల్ని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన భాజపా పరివర్తన్‌ ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. 'పేద ప్రజల హక్కులను అవినీతి దోచుకొందన్న  మోదీ..అన్ని నష్టాలకు అదే మూలమన్నారు. నల్లధనం, అవినీతిపై దాడి చేసి నేనేమైనా నేరం చేశానా?' అని మోదీ ప్రజలను ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత నిజాయతీపరులు బ్యాంకుల ముందు నిలబడితే అవినీతిపరులు పేద ప్రజల ఇళ్ల ముందు వరుస కట్టారని ఎద్దేవా చేశారు. '70 ఏళ్లుగా ప్రజలు నిత్యావసరాల కోసం క్యూ కట్టారు,.ఇప్పుడు బ్యాంకుల ముందు నిలబడ్డ వరుసే అన్ని వరుసలకు శుభం పలికే చివరి క్యూ' అని వెల్లడించారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యర్థులు నన్నేం చేయగలరు,..నేనో సన్యాసిని. నా చిన్నపాటి సామగ్రితో వెళ్లిపోగలను' అని మోదీ విమర్శించారు. 
పేదరికాన్ని తరిమికొట్టాలి : మోడీ
దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ముందుగా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌బంగా వంటి పెద్ద రాష్ట్రాల్లో పేదరికాన్ని తరిమికొట్టాలన్నారు మోదీ. బీజేపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా,.దాని నాయకులు అభివృద్ధి బాటనే ఎంచుకొంటారని స్పష్టం చేశారు. 'అవినీతిపై పోరాటం నేరమా? అవినీతిపై యుద్ధం చేస్తోంటే కొందరు నన్ను తప్పు చేస్తున్నవాడిని అని ఎందుకు అంటున్నారు?' అని మోదీ ప్రశ్నించారు. నల్లధనాన్ని జన్‌ధన్‌ఖాతాల్లో జమచేసిన అవినీతిపరులను జైల్లో వేసేందుకు ఉన్న దారులను వెతుకుతున్నానన్నారు మోదీ.   
పేద ప్రజలకే తీవ్ర ఇబ్బందులు : ఏచూరీ  
అయితే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా పెద్దనోట్లను రద్దు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల సంపన్నులకు, నల్లకుబేరులకు ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదని, కేవలం పేద ప్రజలే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీకి కావల్సినవారిపై, ధనికులపై ఎలాంటి ప్రభావం పడకుండా కేంద్రం  పెద్ద నోట్ల రద్దు  నిర్ణయం తీసుకుందని ఏచూరి విమర్శించారు. 
చరిత్రలోనే అతి పెద్ద తప్పుడు నిర్ణయం : అభిషేక్ సింఘ్వీ 
నోట్ల రద్దు నిర్ణయం భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ జాతీయనేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. రోజుకో రూల్స్‌తో కేంద్రం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు బీజేపీ నేతలకు సంబంధించిన అకౌంట్లలో కోట్ల రూపాయల డబ్బు జమ అయినట్లు తమ దగ్గర ఆధాలున్నాయని సింఘ్వీ తెలిపారు. 
వెనక్కి తగ్గేది లేదన్న ప్రధాని మోడీ
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ యూపీ సభలో స్పష్టం చేశారు. అవినీతిపై జరిపే ఈ మహాయుద్ధంలో వెనకడడుగు వేసే ప్రసక్తేలేదని మోదీ స్పష్టం చేశారు. కానీ..నోట్ల రద్దు వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. రద్దైన నోట్లు..వాటి స్థానంలో కొత్త నోట్లు అందుబాటులోకి రావాలంటే మరికొన్ని నెలలు ఈ కష్టాలు పడక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

నేడు త్రిపుర వెళ్లనున్న కడియం శ్రీహరి

హైదరాబాద్ : నేడు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి త్రిపురం వెళ్లనున్నారు. అక్షరాస్యతపై ఆయనం అధ్యయనంపై చేయనున్నారు.

 

నేడు మహిళల ఆసియా టీ20 కప్ ఫైనల్

బ్యాంకాక్  : నేడు మహిళల ఆసియా టీ20 కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఉదయం ఉదయం 11 గంటలకు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. 

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

కర్నూలు : ప్యాపిలి మండలం ఎన్.రంగాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

 

 

Don't Miss