కాంగ్రెస్ గుడ్డిదైపోయింది...CAAపై ఆందోళనలు కంటిన్యూ చేసుకోవచ్చు

Submitted on 21 January 2020
CAA won't be taken back, those protesting may continue: Amit Shah

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA) ఉపసంహరించుకునే ప్రశక్తే లేదని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సృష్టం చేశారు. దమ్ముంటే సీఏఏపై చర్చకు రావాలని విపక్షాలకు అమిత్ షా సవాల్ విసిరారు. ఇవాళ(జనవరి-21,2020)ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ... లక్నోలో జరుగుతున్న జన్ జాగ్రన్ అభియాన్ కోసం నేను మీ దగ్గరికి వచ్చాను. కేంద్రంలో మా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కూడా కాలేదు. కానీ సీఏఏపై విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకే మేము ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. సీఏఏపై డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు నేను సవాల్ విసురుతున్నాను.

సీఏఏపై కాంగ్రెస్,ఎస్పీ,తృణముల్ పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని షా ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవాళ్లు తమ ఆందోళనలు కంటిన్యూ చేసుకోవచ్చని...ప్రభుత్వం మాత్రం ఈ చట్టం ఉపసంహరించుకోదని హోంమంత్రి అన్నారు. పాక్,ఆఫ్గాన్,బంగ్లాదేశ్ లలో వేధింపులు ఎదుర్కొని భారత్ కు వచ్చిన హిందూ,సిక్కు,బౌద్ధ,జైన,పార్శీ,క్రిస్టియన్ లకు కొత్త జీవితం ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ అవకాశం ఇచ్చారని షా అన్నారు. సీఏఏ పౌరసత్వం ఇవ్వడానికి తీసుకొచ్చేందేనని,సీఏఏ చట్టంలో ఏ ఒక్కరి పౌరసత్వం తొలగించే నిబంధన ఏమీ లేదని షా సృష్టం చేశారు.


దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లో హిందూ,బౌద్ధ,జైన పార్శీ,సిక్కు మతాల వాళ్లు 23శాతం,బంగ్లాదేశ్ లో 30శాతం ఉన్నారని,కానీ ఇవాళ బంగ్లాదేశ్ లో 7శాతం,పాకిస్తాన్ లో కేవలం 3శాతం మాత్రమే ఉన్నారన్నారు. ఈ వ్యక్తులు ఎక్కడికి వెళ్లారని సీఏఏకి వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిని తాను ఈ విషయం అడగాలనుకుంటున్నానని అమిత్ షా  అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా కాంగ్రెస్ గుడ్డిది అయిపోందన్నారు. దేశవిభజనకు కాంగ్రెస్ కారణమని ఆయన ఆరోపించారు. 

దేశవ్యతిరేక నినాదాలు చేసిన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(JNU)లోని వ్యక్తులకు విపక్షాలు సహాయం చేస్తున్నాయని షా ఆరోపించారు. రెండేళ్ల క్రితం జేఎన్ యూ లోపల దేశవ్యతిరేక నానాదాలు చేశారన్నారు. భారత్ మాతాను వెయ్యి ముక్కలుగా విభజించాలని మాట్లాడినవాళ్లని మోడీజీ జైలులో పెట్టిస్తే రాహుల్ గాంధీ,కాంగ్రెస్ కంపెనీ ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అని అంటున్నారని అమిత్ షా అన్నారు.


సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు