ఏడుస్తూ రోడ్డుపైకి : చిన్నారిని రక్షించిన బస్సు డ్రైవర్ 

Submitted on 12 January 2019
Bus driver rescues baby girl lost, crying and running barefoot. Video goes viral

ఒకవైపు గడ్డకట్టేంత చలి.. అసలే సుతిమెత్తని పాదాలు. అంత చల్లటి వాతావరణంలో ఓ ఏడాదిన్నర చిన్నారి ఫుట్ పాత్ పై పరిగెడుతోంది. చుట్టుపక్కలా ఎవరూ లేరు. అక్కడికి ఎలా వచ్చిందో తెలియదు.. గానీ, ఎటు వెళ్లాలో తెలియక క్యార్ క్యార్ మంటూ గుక్కబట్టి ఏడుస్తూ పరిగెడుతోంది. అటుగా వెళ్తున్న ఇరినా ఇవిక్ అనే మహిళా బస్సు డ్రైవర్.. రోడ్డు పక్కన పాసింగ్ వేపై పరిగెడుతున్న చిన్నారిని చూసి షాక్ అయింది.

వెంటనే బస్సు ఆపేసి.. ఆ చిన్నారిని రక్షించేందుకు పరుగులు తీసింది. రోడ్డు దాటి ఎట్టకేలకు పసిపాపను రక్షించింది. ఈ ఘటన కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మహిళా బస్సు డ్రైవర్ చిన్నారిని ఎత్తుకొని బస్సులోకి వెళ్లింది. చలి ఎక్కువగా ఉండటంతో బస్సులోని ఓ ప్రయాణికురాలు తన కోట్ ను తీసి చిన్నారికి కప్పింది. అంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. చిన్నారిని ఆమె తండ్రికి అప్పగించారు. 

Bus driver
baby girl
barefoot
Freezing temperatures
Milwaukee bus driver
Irina Ivic 

మరిన్ని వార్తలు