ప్రభుత్వం ఆదేశం : రాత్రి 8 నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చాలి

Submitted on 23 October 2019
Burst Green Crackers Between 8PM - 10PM: UP Government's Diwali Advisory

త్వరలో దీపావళి పండుగ రానుంది. దీపావళి అంటే క్రాకర్స్ కాల్చడం మస్ట్. వెలుగులు విరజిమ్మే టపాసులు కాల్చకుండా దీపావళి పూర్తి అవ్వదు. అయితే దీపావళి రోజున వాయు, ధ్వని కాలుష్యం తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రాకర్స్ కాల్చడానికి టైమ్ కేటాయించింది. పండగ రోజున రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని ఆదేశించింది. అంతేకాదు.. లైసెన్సు పొందిన అమ్మకందారుల నుంచే టపాసులు కొనుగోలు చేయాలంది. ఈ కామర్స్ వెబ్ సైట్లలో క్రాకర్స్ కొనొద్దని ప్రజలకు సూచించింది. తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే గ్రీన్ టపాసులే కాల్చాలని యోగి సర్కార్ ప్రజలకు పిలుపునిచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పండగ సందర్భంగా ధ్వని, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పోలీసు అధికారులు అమలు చేస్తారని ఉత్తర్వుల్లో తెలిపింది. తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే గ్రీన్ టపాసులను మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు 2018 అక్టోబర్ 23న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఇక హైదరాబాద్ లోనూ క్రాకర్స్ రకాలపై ఆంక్షలు పెట్టారు. కళ్లు మిరుమిట్లు గొలిపే టపాసులు, అధిక శబ్దంతో ఉండే క్రాకర్స్ విక్రయించే వారిపై కేసులు బుక్ చేస్తామని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) హెచ్చరించింది. లెడ్, లిథియం తదితర భార లోహాలున్న టపాసుల కారణంగా సమీపంలోని పెట్రోల్ బంకులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి క్రాకర్స్ విక్రయించే వారిని పట్టుకునేందుకు పీసీబీ రంగంలోకి దిగింది. పట్టుబడితే..సదరు విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

burst
green crackers
between
UP Government
Diwali
advisory

మరిన్ని వార్తలు