కాగడాలు విసరడమే ఆట : ఆలయంలో ‘అగ్ని కేళి’ ఉత్సవాలు

Submitted on 22 April 2019
Burning torch is thrown at each other, tradition of 'Agni Kelly' in Durga parameshwari Temple, Karnataka

కాగడాలను ఒకరిపై మరొకరు విసురుకోవడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం. ప్రమాదకరమైన ఈ ఆటలో పాల్గొనేందుకు అక్కడి స్థానికులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ ఆటకు ‘అగ్ని కేళి’ అని పేరు. కర్నాటకలోని మంగళూరులో కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ఈ ‘అగ్నికేళి’ ఆట ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు.  ఎనిమిది రోజుల పాటు ఆలయంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా భక్తులంతా ఉత్సాహంగా ఆటలో పాల్గొంటారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒకరిపై మరొకరు కాగడాలను విసురుకుంటారు. అత్తూరు, కొడత్తూరు గ్రామాలకు సమీపంలోని వారికి మాత్రమే ఈ ఆటలో పాల్గొనేందుకు ప్రవేశం కల్పిస్తారు. 
Also Read : కోట్ల మందికి ఇదే దిక్కు : 123456.. మీ పాస్‌వ‌ర్డ్‌ మాకు తెలుసు

ఈ గ్రామాల్లోని భక్తులంతా ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు. చివరి ఎనిమిదో రోజున వీరంతా రెండు వర్గాలుగా విడిపోతారు. ఆ తర్వాత మండుతున్న పొడవాటి కొబ్బరి మట్టలను ఒకరిపైకి ఒకరు విసురుకుంటూ ఉత్సాహంగా ఆటలో పాల్గొంటారు. ఇందులో ఒక్కో భక్తుడు 5 సార్లు మాత్రమే మండుతున్న కొబ్బరి కట్టలను మరొకరిపై విసరాలన్నది ఇక్కడి నిబంధనగా చెబుతుంటారు. ఈ ఆటలో ఎవరికైనా గాయాలైతే వారికి అమ్మవారికి అర్చన చేసిన కుంకుమతో చికిత్స చేస్తారని ఆలయ అర్చకుడు తెలిపారు. 

కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయం కాంప్లెక్స్ మంగళూరుకు 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి 360 మైళ్ల దూరంలో ఉంది. నందిని నది ఒడ్డున ఈ దుర్గా దేవాలయాన్ని నిర్మించారు. ఎన్నో శతాబ్దాలుగా ఈ ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో అగ్నికేళి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ అగ్నికేళి ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read : అదిరిపోయే ఫీచర్లు : Realme 3 Pro వచ్చేసింది

Burning torch
tradition
Agni Kelly
Durga parameshwari Temple
festival for 8 days

మరిన్ని వార్తలు