గుజరాత్‌లో ఎద్దు బీభత్సం : ఇద్దరు వ్యక్తులను కుళ్లబొడిచింది

Submitted on 19 June 2019
Bull attack on two persons in gujarat

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. దారిన వెళ్లే ఇద్దరు వ్యక్తులను కుమ్మేసింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. గోడకు ఆనుకుని నిల్చున్న ఎద్దు మనుషుల కోసమే కాచుకున్నట్లుగా ఉంది. ఆ దారిలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై ఒక్కసారిగా దూకి కుళ్లబొడిచింది. 

ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఎద్దు వైపే చూడడంతో దానికి మళ్లీ కోపం వచ్చినట్లుంది. మళ్లీ ఆ వృద్ధుడిపై దాడి చేసింది. అక్కడున్న ఓ యువకుడు వృద్ధుడిని లాక్కొని వెళ్లిపోయాడు. క్షణాల వ్యవధిలోనే మరో యువకుడిపై ఎద్దు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడిని సైతం ఆ ఎద్దు వదలలేదు. అతనిపై కూడా దాడి చేసింది. సమాచారం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు.. రాజ్‌కోట్‌కు చేరుకుని ఎద్దును గోవుల షెడ్‌కు తరలించారు. 
 

Bull
Attack
Two
Injured
Gujarat
rajkot

మరిన్ని వార్తలు