జియో ఎఫెక్ట్ : BSNL డేటా సునామీ ఆఫర్

Submitted on 21 February 2019
BSNL revises Rs 98 plan to offer 2GB daily data, Eros Now subscription

టెలికం రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో నెట్ వర్క్.. దేశంలోనే అతిపెద్ద డేటా నెట్ వర్క్ గా సంచలనం సృష్టిస్తోంది. అతి చౌకైన ధరకే Jio ఫోన్, అన్ లిమిటెడ్ డేటా అందిస్తుండటంతో వినియోగదారులంతా జియో బాట పట్టారు. మిగతా టెలికం ఆపరేటర్లపై తీవ్ర ప్రభావం పడింది. జియో ఎఫెక్ట్ తో ఇతర నెట్ వర్క్ కస్టమర్లు జియో ఆఫర్లకు ఆకర్షితులయ్యారు. జియోకు పోటీగా ఐడియా, ఎయిర్ టెల్ టెలికం నెట్ వర్క్ లు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ BSNL నెట్ వర్క్ కూడా తమ కస్టమర్ల కోసం కొత్త కొత్త ఆఫర్లు అందిస్తోంది. Jio ఎఫెక్ట్ తో బీఎస్ఎన్ఎల్ డేటా సునామీ (Data Tsunami) ఆఫర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం అందిస్తోన్న ఆఫర్ ను రీవైజ్ చేసి మార్కెట్లోకి ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.

భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) రూ.98 రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్ లో మార్పులు చేసింది. ఇదే రీఛార్జ్ పై తమ కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోంది. కొత్తగా రీవైజ్ చేసిన ప్లాన్ తో రోజుకు 2జీబీ డేటా పొందొచ్చు. అంతేకాదు.. Eros Now సబ్ స్ర్కిప్షన్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అంతకుముందు రూ.98 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పై రోజుకు 1.5జీబీ డేటాతో 26 రోజుల కాలపరిమితిపై అందించేది. ఈ ప్లాన్ రీవైజ్ చేసిన తర్వాత బీఎస్ఎన్ఎల్ వ్యాలిడెటీని 24 రోజులకు కుదించింది. యూజర్ రోజులో డేటా లిమిట్ దాటి వాడితే.. డేటా ట్రాన్స్ ఫర్ స్పీడ్ 80Kbps కు పడిపోతుంది. రూ.98 రీఛార్జ్ ప్లాన్ తో పాటు ఇతర ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.78, రూ.333, రూ.444 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ను BSNL ఆఫర్ చేస్తోంది. BSNL డేటా ఆఫర్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

రూ.78 ప్లాన్ : ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. రోజుకు 2GB Data (మొత్తం 20జీబీ డేటా). ఈ డేటా ప్లాన్ ఆఫర్ పై.. 10 రోజలు వరకు ఎరోస్ నౌ సబ్ స్ర్కిప్షన్ ఉచితం. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ బెనిఫెట్స్ పొందొచ్చు.

రూ.333 ప్లాన్: ప్రతిరోజు 3GB డేటా పొందొచ్చు. ఎరోస్ నౌ సబ్ స్ర్కిప్షన్ 45 రోజలు పాటు ఉచితం.

రూ.444 ప్లాన్ : రోజుకు 4GB డేటా 60 రోజుల కాల పరిమితిపై పొందొచ్చు. 

Read Also:దేశముదురు వ్యాపారులు : పాక్ డౌన్ డౌన్ అంటే డిస్కౌంట్లు
Read Also: ఫిటింగ్ వర్మ : చంద్రబాబు కంటే రానానే రియల్
Read Also:జెట్ ఎయిర్‌వేస్ విమాన టికెట్‌పై 50 శాతం డిస్కౌంట్

BSNL
Eros Now
Data plan
Prepaid data plan
Airtel
Jio effect 

మరిన్ని వార్తలు