బీ రెడీ : BSNL JTOలకు దరఖాస్తుల ఆహ్వానం

Submitted on 12 February 2019
BSNL JTO Recruitment 2019

భారత్ సంచార్‌ నిగమ్ లిమిటెడ్ (BSNL) గేట్-2019 ద్వారా జూనియర్ టెలికామ్ ఆఫీసర్ (JTO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించి సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో BE/B-TECH విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గేట్-2019 పరీక్షలో వచ్చిన స్కోరు ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. 

 
పరీక్ష ఫీజు:
- అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.1000 చెల్లించి మార్చి 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
-  SC, ST అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. 

విభాగాలు:
* సివిల్-132
*ఎలక్ట్రికల్- 66
* JTO- 198 పోస్టులు

అర్హత: 
BE/ B-TECH(సివిల్/ఎలక్ట్రికల్). సంబంధిత విభాగంలో గేట్-2019 పరీక్షలో ఉత్తీర్ణత ఉండాలి. 

వయస్సు పరిమితి:
12.03.2019 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య వయసుండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: 
ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు సమయంలో గేట్-2019 రిజిస్ట్రేషన్ ID తప్పనిసరిగా నమోదుచేయాల్సి ఉంటుంది.  

ఎంపిక విధానం:
 గేట్-2019 పరీక్షలో వచ్చిన స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గేట్-2019 ఫలితాల ప్రకారం సర్కిళ్ల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను తయారుచేస్తారు. గేట్ స్కోరు తప్ప ఎలాంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించరు.  

ముఖ్యమైన తేదీలు:
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.02.2019. 
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.03.2019. 

BSNL
Junior Telecom Officer(JTO)
2019

మరిన్ని వార్తలు