ఆధార్ సేవల్లో BSNL

Submitted on 20 September 2019
BSNL Aadhar Center In Hyderabad

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం BSNL వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆధార్ సేవలను అందించాలని నిర్ణయించింది. UIDAIతో ఒప్పందం చేసుకున్న బీఎస్ఎన్ఎల్ ఆధార్ కేంద్రాలను నెలకొల్పి సేవలను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాల వారీగా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఆధార్ నమోదు, మార్పులు చేర్పులు చేస్తోంది. 

ఆధార్..ప్రతి దానికి కంపల్సరి అయిపోయింది. కానీ..కొంతమంది ఆధార్‌లలో పేర్లు, నంబర్లు తప్పుగా ప్రింట్ కావడంతో..పలువురు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు జనాలు. కేంద్రాలకు డిమాండ్ పెరగడంతో దీనివైపు దృష్టి సారించింది బీఎస్ఎన్ఎల్. 

నగరంలో 28 సీఎస్‌సీ కేంద్రాల్లో ఆధార్ సేవలను అందిస్తున్నారు. త్వరలో 29 కేంద్రాలు ఏర్పాటు చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. కొన్ని కేంద్రాలకు ప్రజల తాకిడి అధికంగా ఉండడంతో టోకెన్స్ పంపిణీ చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సేవలందిస్తున్నారు. ఆధార్ నమోదు, అప్ డేషన్‌పై యూఐడీఏఐతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ప్రతి కేంద్రంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున సిబ్బందికి UIDAI బయోమెట్రిక్ ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ జారీ చేసి, కేంద్రానికి రెండు చొప్పున కిట్స్ కేటాయిస్తోంది బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం. 

ఏమేమీ చేస్తారు : - 
కార్డుల్లో మార్పులు చేర్పులు. అడ్రస్, ఫొటో, బయోమెట్రిక్ అప్ డేట్, పేరు, పుట్టిన తేదీల్లో తప్పులను సరిదిద్దడం. మొబైల్ నెండర్ అప్ డేట్. ఆధార్ డౌన్ లోడ్ కలర్ ప్రింటర్. దీంతో పాటు ఇతర సేవలను అందిస్తారు. కొత్తగా నమోదు చేయాలనుకుంటే ఫ్రీగానే చేస్తున్నారు. 

రుసుం : 
ఆధార్ అప్ డేషన్‌కు రూ. 50 వసూలు. 15 ఏళ్ల లోపు చిన్నారులకు ఆధార్ అప్ డేషన్ సేవలు ఫ్రీ. ఆధార్ కార్డు కలర్ ప్రింట్ డౌన్ లోడ్‌కు రూ. 30 ఛార్జీ. 
ఆధార్ అప్ డేషన్ కోసం బయోమెట్రిక్ తప్పనిసరి. దీని ఆమోదం అనంతరం యూఐడీఏఐ ప్రధాన సర్వర్ అప్ డేషన్‌కు అనుమతినిస్తుంది. మొబైల్ నెంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తారు. అనంతరం మొబైల్‌కు సమాచారం వస్తుంది. అనంతరం UIDAI వెబ్ సైట్ నుంచి ఈ - ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

ఆధార్ కౌంటర్లు : 
చాంద్రాయణగుట్ట. కేపీహెచ్‌బీ. అమీర్ పేట, మాదాపూర్, ప్యాట్నీ, తార్నాక, తిరుమల గిరి, కుషాయిగూడ, గచ్చిబౌలి, సికింద్రాబాద్, టెలిపోన్ భవన్, చార్మినార్, గౌలిగూడ, బీఎస్ఎన్ఎల్ భవన్, టౌలిచౌకి, నాచారం, సచివాలయం, సరూర్ నగర్, వనస్థలిపురం, ముషీరాబాద్, సీటీఓ హెచ్‌డీ నాచారం, దిల్ సుఖ్ నగర్, సంతోష్ నగర్, రామాంతాపూర్, లింగంపల్లి, జీడిమెట్ల, హిమాయత్ నగర్, కొంపల్లి. 

BSNL
Aadhar Center
Hyderabad
uidai
Biometric

మరిన్ని వార్తలు