రోడ్డు ప్రమాదంలో బ్రదర్ అనిల్ కుమార్ కు గాయాలు

Submitted on 15 February 2020
Brother Anil Kumar injured in road accident

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద కారు ప్రమాదం జరిగింది. బ్రదర్ అనిల్ కుమార్‌తో పాటు డ్రైవర్, గన్ మెన్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. బ్రదర్ అనిల్ కుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఘటనస్థలానికి వెళ్లి అనిల్ కుమార్ ను తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికత్స అందించిన తర్వాత అనిల్ కుమార్ తన పర్యటను వెళ్లిపోయారు. 

రాత్రి తన పర్యటనను ముగించుకుని బ్రదర్ అనిల్ కుమార్ వెళ్తుండగా మార్గంమధ్యలో కారు అదుపు తప్పి రోడ్డుపై నుంచి కిందికి వెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై గోతిలోకి వెళ్తున్న కారును మళ్లించారు. వెంటనే అనిల్, తన డ్రైవర్.. సహచరులకు ఫోన్ చేయడంతో స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయ భానుకు ఫోన్ చేశారు.

ఘటనాస్థలానికి చేరుకున్న ఆమె తన కారులో అనిల్ ను వెంటనే విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అతనికి చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లి పోయారు.   

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!

Brother Anil Kumar
Injured
road accident
Krishna
Car

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు