కట్నం వద్దన్న అల్లుడు.. సర్ ప్రైజ్ ఇచ్చిన అత్తింటివారు!

Submitted on 24 May 2019
Bride's Family Surprises Groom With 1000 Books Worth Rs 1 Lakh After He Refuses To Take Dowry

ఇండియాలో పెళ్లిళ్లు భిన్నమైన పద్ధతుల్లో జరుగుతుంటాయి. సంస్కృతి సాంప్రదాయాలకు తగినట్టుగా కొందరి వివాహం జరిగితే.. మరికొందరు తమకు నచ్చిన పద్ధతుల్లో పెళ్లిళ్లు చేస్తుంటారు. అమ్మాయిని ఇస్తే చాలు.. కట్నం వద్దనే వారు కూడా ఉంటారు. కట్నానికి బదులుగా పెళ్లికూతురి కుటుంబం నుంచి వెడ్డింగ్ గిఫ్ట్స్ కావాలని పేచి పెడతారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కట్నం ఇవ్వడం.. పుచ్చుకోవడం సర్వసాధారణం. పెళ్లి అయిన కొన్నాళ్లకే కట్నం కోసం అత్తింటివారిని వేధించేవారు లేకపోలేదు. 

కానీ, పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ పెళ్లి కొడుకు మాత్రం తనకు కట్నం అసలే వద్దన్నాడట. అమ్మాయి చాలు.. కట్నం తనకు అక్కర్లేదని చెప్పేశాడు. దీంతో పెళ్లికూతురి కుటుంబ సభ్యులు తెగ సంతోషించారు. మంచి అల్లుడు దొరికాడని మురిసిపోయారు. కట్నం వద్దన్న అల్లుడి రుణం ఎలా తీర్చుకోవాలా అని తెగ ఆరాటపడ్డారు. చివరికి కొత్త అల్లుడికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చి సంతోషపెట్టారు. వివరాల్లోకి వెళితే.. బెంగాల్ కు చెందిన సూర్యకాంత బరిక్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. 

తాళి కట్టే సమయంలో సర్ ప్రైజ్ :
ఇటీవల పెళ్లి కుదిరింది. అత్తింటివాళ్లు కట్నం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. కానీ, సామాజిక విలువలు తెలిసిన వాడిగా తనకు కట్నం వద్దని గట్టిగా చెప్పేశాడు. పెళ్లి గడియలు దగ్గరపడ్డాయి. తాళి కట్టడమే మిగిలింది. పెళ్లి వేదికపై పెళ్లికూతురు ప్రియాంక బెజ్ కు తాళి కట్టే సమయంలో పెళ్లికొడుకు సూర్యకాంత్ కు సడన్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.  ఇంతకీ గిఫ్ట్ ఏమిచ్చారో తెలుసా? లక్ష రూపాయల ఖరీదైన వెయ్యి పుస్తకాలను కట్నంగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.

అది చూసి ఆశ్చర్యపోయిన అల్లుడు.. కట్నంగా గిఫ్ట్ ల రూపంలో ఇచ్చిన నేను అంగీకరించనని అప్పుడే చెప్పాను కదా అన్నాడు. అల్లుడు.. పుస్తకాల పురుగు కావడంతో అత్తింటివారిచ్చిన పుస్తకాలను కాదనలేకపోయాడు. పెళ్లికొడుకు మంచితనాన్ని మెచ్చుకుంటూ... పెళ్లికూతురు ప్రియాంక ఆనందపడింది. తనకు విలువలు తెలిసిన మంచి వ్యక్తి భర్తగా వచ్చాడని తెలిపింది. తనకు కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉందని, అందుకే ఇలా పుస్తకాలను బహుమతిగా ఇచ్చినట్టు తెలిపింది. 

marriage dowry

Bride's Family
Groom Surprise
1000 Books
Refuses Dowry

మరిన్ని వార్తలు