కాసేపట్లో పెళ్లి.. పెళ్లికూతురిపై కాల్పులు..కట్ చేస్తే

Submitted on 18 January 2019
Bride Shot At In Delhi, Returns From Hospital For Wedding Ceremony

అతిథులంతా వచ్చేశారు. పెళ్లి తంతు మొదలైంది. పురోహితుడు పూజ మొదలుపెట్టాడు. పెళ్లి కొడుకు తాళి కట్టడమే ఆలస్యం. పురోహితుడు పెళ్లికూతుర్ని తీసుకొని రమ్మన్నారు. ముస్తాబయిన పెళ్లికూతురు మెల్లగా పెళ్లిమండపం పైకి నడుచుకుంటూ వస్తోంది. ఇంతలో తుపాకీ శబ్దం. వేదికపైకి వెళ్తున్న పెళ్లికూతురిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. వధువు కాళ్లకు బుల్లెట్లు తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే పెళ్లికూతుర్ని ఆస్పత్రికి తరలించారు. ట్రిట్ మెంట్ పూర్తి అయ్యాక మళ్లీ పెళ్లి వేదిక దగ్గరకు చేరుకున్న పెళ్లికూతురు.. పెళ్లికొడుకుతో తాళి కట్టించుకుంది.

ఇదిదో సినిమాలోని సన్నివేశం అనుకుంటున్నారా? సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన జనవరి 17న ఢిల్లీలోని షాకార్ పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పెళ్లి తంతులో భాగంగా పూజ చేసేందుకు పెళ్లి వేదికపైకి వధువు వచ్చింది. అదే సమయంలో ఒక్కసారిగా తుపాకీ పేలింది. కట్ చేస్తే వధువు గాయాలతో కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తనను ఎవరో కాల్చారో తెలియదని పోలీసులకు తెలిపింది. విషయం తెలిసిన పెళ్లికుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పెళ్లిలో కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు అతిథులను ఆరా తీశారు. గత ఏడాది నవంబర్ లో ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లికొడుకుపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. బుల్లెట్ గాయాలతో ఆస్పత్రికి వెళ్లిన వరుడు సర్జరీ చేయించుకొని తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నాడు.  

Bride
Gun Shot
Wedding Ceremony
Bridegroom
bride's legs

మరిన్ని వార్తలు