పోలీసులకు లంచాల కేసులో ఊహించని మలుపు

Submitted on 11 February 2019
bribery case for the police was unexpected turn

కృష్ణా : జిల్లాలో పోలీసులకు లంచాల కేసు ఊహించని మలుపు తిరిగింది. సాక్ష్యాలు లేకుండా కేసు నమోదు చేసినందుకు ఇద్దరు ఎస్సైలు, ఓ సీఐను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్‌.. ఈ నెల 5వ తేదీన తన అనుచరుడితో లంచం ఇవ్వడానికి ప్రయత్నించారంటూ జీకొండూరు, మైలవరం ఎస్సైలు కేసు నమోదు చేశారు. అయితే.. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు సరైన సాక్ష్యాలు లేకపోవడంతో.. వీఆర్‌కు పంపించారు. తమపై తప్పుడు కేసు పెట్టారంటూ మైలవరం పోలీస్‌ స్టేషన్ ముందు వసంత కృష్ణప్రసాద్‌ ఆందోళన చేపట్టారు.
 

bribery case
Police
unexpected turn
Krishna

మరిన్ని వార్తలు