సీరియల్ నటి ఝాన్సీ ప్రియుడు సూర్య అరెస్టు 

Submitted on 12 February 2019
Boyfriend surya arrested in Serial actress Jhansi suicide case

హైదరాబాద్ : సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఝాన్సీ ఆత్మహత్య కేసులో ప్రియుడు సూర్యను పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 306, 417 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...ఆత్మహత్య చేసుకోవడానికంటే ముందు ఝాన్సీ తన ప్రియుడు సూర్యకు ఫోన్ చేసింది. 

సూర్య.. ఝాన్సీని తీవ్ర స్థాయిలో మందలించాడు.  అతని మాటలతో ఝాన్సీ మనస్తాపానికి గురైంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. సూర్య మానసిక వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఝాన్సీ సూసైడ్ నోట్ రాసింది. అన్ని కోణాల్లో విచారణ చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించటం, వేధింపులకు గురి చేసిందుకు సూర్యను అరెస్ట్ చేశారు. 

Boyfriend surya
arrested
Serial actress Jhansi
suicide case
Hyderabad

మరిన్ని వార్తలు