సల్మాన్, అమీర్ ఖాన్ ఏకం అవ్వాలి, ఎన్నికలు రద్దు చెయ్యాలి : పాల్ డిమాండ్

Submitted on 15 April 2019
Boycott General Eelctions, Ka Paul Sensational Demand

ఢిల్లీ: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసీని కలిసేందుకు ఢిల్లి వెళ్లిన పాల్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరిగినట్లే మిగతా చోట్ల ఎన్నికలు జరుగుతాయని, ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని పాల్ అన్నారు. ఈవీఎంల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని పాల్ చెప్పారు. సోమవారం (ఏప్రిల్ 15, 2019)మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీని కలుస్తానని, ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలపై ఈసీకి వివరిస్తానని పాల్ చెప్పారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని, రానున్న 6 విడతల ఎన్నికలను బహిష్కరించాలని పాల్ పిలుపునిచ్చారు.

దేశ కోసం, ప్రజాస్వామ పరిరక్షణ కోసం, దేశాన్ని ప్రేమించే వాళ్లు, రాజకీయ పార్టీలు, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఏకం కావాలని పాల్ పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. ఎన్నికలు బాయ్ కాట్ చేస్తే బీజేపీ ఆటలు సాగవు అన్నారు. ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ ఆదేశాలకు అనుగుణంగా, మోడీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పని చేస్తున్నాయని పాల్ ఆరోపించారు.
Read Also : బాటా ఏంటీ లూటీ : క్యారీ బ్యాగులపై జరిమానా

40 రోజుల తర్వాత బాధ పడేకంటే.. దేశాన్ని ప్రేమించే వారు, సెక్యూలర్ ఇండియా కోరుకునే వాళ్లు ఏకం కావాలని, ఎన్నికలు బహిష్కరించాలని పాల్ డిమాండ్ చేశారు. మే 23వ తేదీ తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, ఆ తర్వాత దేశం నాశనం అవుతుందని పాల్ హెచ్చరించారు. మోడీ ప్రభుత్వ వస్తే కోట్ల మంది హిందువులు, 25 కోట్ల మంది ముస్లింలు, 13 కోట్ల క్రిస్టియన్లు, మైనార్టీలు తీవ్రంగా బాధలు పడాల్సి వస్తుందని పాల్ హెచ్చరించారు.    
 
ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అని పాల్ అన్నారు. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ తో నిర్వహించాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లుగా తాను ఇదే చెబుతున్నా అని గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకి అసలు విషయం అర్థమైందని, అందుకే ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని పాల్ అన్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొన్నేళ్లుగా ఈవీఎంలకు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారని పాల్ ప్రస్తావించారు. దేశాన్ని ప్రేమించే వారంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని, సెక్యూలర్ ఇండియా పరిరక్షణ కోసం కృషి చేద్దామని పాల్ అన్నారు. మే 23 తర్వాత ఎవరెంత బాధపడినా ప్రయోజనం ఉండదని పాల్ చెప్పారు.
Read Also : గాల్లో ఉద్యోగాలు : 20 వేల మంది ఉద్యోగులను ఆదుకోండి

ka pual
boycott elections
evms
malfunction
Tampering
cm chandrababu
amir khan
Salman Khan
Arvind Kejriwal
Praja Shanti Party

మరిన్ని వార్తలు