బోయపాటి-బాలకృష్ణ కాంబినేషనల్ లో మూవీ : ఎన్నికల తర్వాతే

Submitted on 14 March 2019
Boyapati-Balakrishna film after elections

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో మరో మూవీ రానుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత చిత్రాన్ని రూపొందించనున్నారు. ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రమోషనల్ కంటెంట్ క్రియేట్ చేయడంలో బోయపాటి శ్రీను బిజీగా ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వివిధ రాజకీయ పార్టీలకు ప్రమోషనల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఏపీలో పవిత్ర సంగమం, పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మరియు కృష్ణా పుష్కరాలు నిర్వహణ సమయంలో ప్రభుత్వానికి సహకరించారు.

ప్రస్తుతం అమరావతి కోసం ప్రోమో కంటెంట్ క్రియేట్ చేసేందుకు సహకరిస్తున్నాడు బోయపాటి. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రోమో వీడియోలు మరియు అడ్వర్టైజ్ మెంట్స్ తయారు చేసే పనిలో బిజీగా ఉండనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీలో ప్రముఖ వ్యక్తి. ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో బాలయ్యతో మూవీ ప్రాజెక్టు ఎన్నికల తర్వాతే పట్టాలెక్కనుంది. 

బోయపాటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నటీనటులుగా రామ్ చరణ్, భరత్ అనే నేను చిత్రం ఫేమ్ కైరా అద్వానీ నటించారు. దానయ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో మూవీ వచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. రిషి పంజాబీ మరియు అర్థర్ ఏ. విల్సన్ సినిమాటోగ్రఫీ చేశారు. ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరారావు. రమ్యకృష్ణ, స్నేహ, వివేక్ ఒబెరాయ్ మరియు ప్రశాంత్ లు కీలక పాత్రలో నటించారు. 
 

Boyapati Srinu
Balakrishna
combination
film
after elections

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు