దేవ్- డిజాస్టర్ డిక్లేర్

Submitted on 20 February 2019
Box Office Report karthi's Dev be Huge Disaster-10TV

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్స్‌గా, రజత్ రవిశంకర్ డైరెక్షన్‌లో, ఎస్.లక్ష్మణ్ కుమార్ తమిళ్‌లో నిర్మించిన దేవ్ సినిమాని, తెలుగులో ఠాగూర్ మధు రిలీజ్ చేసాడు. ఫిబ్రవరి 14 న లవర్స్ డే స్పెషల్‌గా థియేటర్స్‌లోకి వచ్చిన దేవ్, మార్నింగ్ షో నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో డైరెక్టర్ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. కలెక్షన్లు కూడా మరీ దారుణంగా ఉన్నాయి. తమిళనాట కూడా ఇదే పరిస్థితి. డిస్ట్రిబ్యూటర్లు సగానికి పైగా లాస్ అవుతారని కన్ఫమ్ అయిపోయింది. ఫుల్ రన్‌లో కనీసం పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కూడా రాబట్టే చాన్స్ లేదని ట్రేడ్ పండితులు తేల్చేసారు. దీంతో దేవ్ డిజాస్టర్ అని డిక్లేర్ అయ్యింది.

Image result for DEV TELUGU

తమిళనాట థియేట్రికల్ రైట్స్ రూ.17 కోట్లకు అమ్మగా, తెలుగులో రూ.6 కోట్లకు ఠాగూర్ మధు కొనుక్కున్నాడు. కోలీవుడ్ వర్గాల లెక్కల ప్రకారం, మొదటి ఆరు రోజుల్లో తమిళనాట రూ.5 కోట్ల షేర్ రాబట్టగా, ఫుల్ రన్‌లో, మరో కోటి రూపాయలు వసూలు చెయ్యొచ్చని, ఆ లెక్కన 35 శాతం కంటే ఎక్కువ రికవరీ అయ్యే పరిస్థతి లేదని అంటున్నారు. ఇక తెలుగు విషయానికొస్తే మొదటి ఆరు రోజుల్లో రూ.1.85 కోట్ల షేర్ వసూలైంది. ఫుల్ రన్‌లో రూ.2 కోట్లకి మించి వసూలు చేసే అవకాశం కనబడడం లేదు. దీంతో దేవ్ సినిమాని కొనుకున్న బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు.

వాచ్ చెలియా వీడియో సాంగ్...

Dev
Karthi
Rakul Preet Singh
Harris Jayaraj
Rajath RaviShankar

మరిన్ని వార్తలు