బాలీవుడ్ విలన్ మహేశ్ ఆనంద్ మృతి

Submitted on 10 February 2019
Bollywood villain Mahesh Anand dead

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ ఆనంద్ (57) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబైలోని అంధేరి యారీ రోడ్డులో ఉన్న స్వగృహంలో కుళ్లిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సమీపంలోని కూపర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఆనంద్ ముంబైలో ఒంటరిగానే నివసిస్తున్నారని, ఆయన భార్య మాస్కోలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. 

గోవింద హీరోగా నటించిన రంగీలా రాజాలో ఆనంద్ చివరిసారిగా నటించారు. ఈ చిత్రం జనవరి 18న విడుదల అయింది. 90వ దశకంలో పలు హిందీ హిట్ చిత్రాల్లో ఎక్కువగా నెగెటివ్ క్యారెక్టర్లు చేసిన ఆయన తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. అల్లుడా మజాకా, ఘరానా బుల్లోడు, నంబర్1, టాప్ హీరో, బాలు వంటి చిత్రాల్లో ఆయన నటించారు. 1980, 90 దశకంలో విలన్‌గా బాగా పాపులర్‌ అయ్యాడు.

‘శెహన్‌షా, మజ్‌బూర్, స్వర్గ్, తనీదార్, విజేత, కురుక్షేత్ర’ వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించారు. ఎస్వీ కృష్ణారెడ్డి  తీసిన ‘నంబర్‌ వన్‌’ సినిమాలోనూ నటించా రాయన. 2002లో భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ముంబైలో మహేశ్‌ ఒంటరిగానే ఉంటున్నారు. ఈ ఏడాది రిలీజైన ‘రంగీలా రాజా’ చిత్రంతో 18 ఏళ్ల తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చారు. ‘‘18 ఏళ్లుగా ఎవ్వరూ నాకు సినిమా ఆఫర్‌ చేయలేదు. పని, డబ్బు లేకుండా ఇన్నేళ్లు ఒంటరిగా బతికాను. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యక్తులతో పని చేశాను. కానీ నన్ను ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు’’ అని చివరిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్‌ పేర్కొన్నారు. 

 

Bollywood villain
Mahesh Anand
Dead
Mumbai

మరిన్ని వార్తలు