3.2 లక్షల భోగి పిడకలతో రికార్డ్

Submitted on 11 January 2019
 'Boghi' Bonfire Festival

తెలుగు రాష్ట్రాలు భోగి మంటలతో సందడిగా మారాయి. ఇంట్లోని పాత ఫర్నీచర్, వస్తువులతో అందరూ భోగి మంటలు వేస్తుంటే.. విజయవాడలోని కృష్ణలంకలో ఆవు పిడకలతో భోగి మంట వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోగి పండగ సందర్భంగా సంక్రాంతికి భోగి మంటల్లో వేసే భోగి పిడకలతో ఒక వ్యక్తి రికార్డు సృష్టించాడు. 3.2 లక్షల భోగి పిడకలతో నాలుగు కిలోమీటర్ల పొడవైన దండను రూపొందించడం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. దీనికి సంబంధించి ఆ గ్రామ ఉరదాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉరదాలమ్మ ఆలయ కమిటీతోపాటు మరో 60 మంది మహిళలు 20 రోజుల పాటు కష్టించి కేవలం ఆవు పేడతో 1.56 కిలో మీటర్ల పొడవైన భోగి పిడకల దండను తయారుచేశారు. భారత్ బుక్ ఆఫ్ రికార్డు, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డు సభ్యులు ఆదివారం గ్రామాన్ని సందర్శించి భోగి పిడకల దండను పరిశీలించి కొలతలు వేశారు. భారత్, రాష్ట్ర బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం కల్పించి నమోదు చేశారు. ప్రపంచ రికార్డుల సాధన సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్యామ్ జాదూ ఈ దండ రికార్డులను నమోదు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకు నమోదుకు పంపడంతో మరో రెండు రికార్డుల కైవసం చేసుకునేందుకు ఈ దండ సిద్ధంగా ఉంది. 

500 మంది వరకు పిల్లాపాపలతో కలిసి గ్రామస్థులు ఈ దండను మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపుగా భోగిమంట వద్దకు తీసుకెళ్తారు. గ్రామంలోని ముత్తైదువులంతా పిల్లాపాపలతో వచ్చి డూడూ బసవన్నల,  ఆశీర్వచనాలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అముజూరి శ్రీనివాసు, రెడ్డి రుద్రయ్య చౌదరి, గుణ్ణం బొడ్డుబాబు, జాతీయ ఉత్తమ పశు పోషక అవార్డు గ్రహీత కోరా సత్యవేణి, పలువురు మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

Bhogi
BonFire Festival
vijayawada

మరిన్ని వార్తలు