పాపికొండల్లో ప్రమాదం: నీట మునిగిన 61మంది

Submitted on 15 September 2019
boat drowned with 50 passengers in papikondalu

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు మునిగింది. ఈ బోటులో 61మంది ఉన్నారు. 50 మంది ప్రయాణికులు, 11మంది సిబ్బందితో కలిసి బోటు వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. లైఫ్ జాకెట్లు ధరించిన 18 మంది సేఫ్‌గా బయటపడ్డారు.

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదాన్ని గమనించి అక్కడకు వెళ్లి 14మందిని రక్షించారు. ఉదయం 10గంటలకు పోచమ్మగండి నుంచి బయల్దేరారు. వీరంతా పాపికొండలు టూర్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పర్యాటకుల్లో చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించినట్లు సమాచారం. 

ఒకరోజు ముందు వరకూ గోదావరిలో 5లక్సల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. తాజాగా వరద ఉధృతి తగ్గడంతో పర్యాటకానికి అధికారులు అనుమతిచ్చారు. ధవలేశ్వరం బ్యారేజి వద్ద 5లక్షల క్యూసెక్కు... పోలవరం వద్ద సరిగ్గా బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 

BOAT
50 passengers
papikondalu

మరిన్ని వార్తలు