బీఎండబ్ల్యూ బంపర్ ఆఫర్ : జీరో డౌన్ పేమెంట్ తో బైక్

Submitted on 10 March 2019
BMW zero downpayment offer..and 0 interest on g310r g310gs bikes

బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లు..బైక్స్ తయారీ సంస్థ. ఇప్పుడు తాజాగా అద్దిరిపోయే బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. జీరో డౌన్ పేపెంట్  ఫెసిలిటీస్ ని కల్పిస్తోంది. రూ. 1 కూడా చెల్లించకుండానే బైక్ కు ఇంటికి తీసుకెళ్లొచ్చు. మోటొరాడ్ తాజాగా జీ310ఆర్, జీ310జీఎస్ బైక్స్‌పై జీరో డౌన్ పేమెంట్ సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే 100 శాతం ఫండింగ్ సౌకర్యా్న్ని కూడా కల్పిస్తోంది. దీంతో బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్ కొనుగోలు చేయవచ్చంటోంది. 
 

జీ310ఆర్ బైక్ ధర రూ.2.99 లక్షలుగా, జీ310జీఎస్ ధర రూ.3.49 లక్షలుగా ఉంది. జీరో డౌన్‌పేమెంట్, ఫుల్ ఫండింగ్ సహా కంపెనీ బైక్స్‌పై మరో బెస్ట్ ఆఫర్ కూడా ప్రకటించింది. అదే జీరో వడ్డీ. దీంతో బైక్స్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సరైన సమయం. రెండు బీఎండబ్ల్యూ బైక్స్‌పై మూడేళ్ల వారంటీ కూడా ఉంది. వీటిల్లో 313 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. రెండు బైక్స్‌లోనూ 6 గేర్లు ఉంటాయి. ఈ బైక్స్ స్పీడ్ గంటకు 143 కిలోమీటర్లు. మరి ఇంకెందుకు ఆలస్యం.. బీఎండబ్ల్యూ బైక్స్ పై రయ్ రయ్ మంటు దూసుకుపోవచ్చు..బీఎండబ్ల్యూ అంటే ఇష్టపడేవారు ఈ ఆఫర్ ను ఎలా కాదనగలరు..అనిపించేలా ఉంది కదూ ఈ ఆఫర్. 
 

BMW
zero downpayment
Offer
0 interest

మరిన్ని వార్తలు