టెక్ అండ్ ట్రెండ్లీ : రెక్కలు లేని ఫ్యాన్లు వచ్చేశాయ్

Submitted on 24 April 2019
 Blade Les Fans at Domestic Solutions Company

ట్రెండ్..ట్రెండ్..ట్రెండ్ అంతా దీన్నే ఫాలో అవుతున్నారు. మార్కెటింగ్ కూడా ఈ ట్రెండ్ నే అనుసరిస్తోంది. సరికొత్త ప్రొడక్ట్స్ తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు వినూత్నమైన ఎలాక్ట్రానిక్స్ వస్తువులు తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో వేసవిల వచ్చిదంటే చాలు అన్ని వర్గాల వారు ఫ్యాన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఈ ఫ్యాన్స్ ట్రెండ్లీ లుక్ లతో ఆకట్టుకుంటున్నాయి. హై టెక్నాలజీ ఫ్యాన్స్ వైపే కష్టమర్స్ కూడా మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఫ్యాన్స్ ఫుల్ డిఫరెంట్ అయినవి. ఎంత డిఫరెంట్ అంటే ఈ ఫ్యాన్స్ కు రెక్కలే ఉండవు..ఇదే ఈ లేటెస్ట్ ఫ్యాన్స్ స్పెషాలిటీ. 
Also Read : ఆ మాటకు నవ్వు ఆపుకోలేకపోయిన మోడీ,అక్షయ్

ప్రముఖ టెక్నాలజీ సంస్థ డొమెక్ సొల్యుషన్స్ కంపెనీ..రెక్కలు  లేని  (బ్లేడ్ లెస్) ఫ్యాన్లను విడుదల చేసింది. ఎక్స్‌హీల్ కంపెనీ తయారు చేసిన రెండు రకాల ఫ్యాన్లను తెలుగు రాష్ట్రాల మార్కెట్ లోకి విడుదల చేసామని డొమెక్ ఎండీ రఘురామిరెడ్డి తెలిపారు. ఎటువంటి సౌండ్ లేకుండా శుద్ధి చేసిన గాలిని ఇవ్వడం ఈ ఫ్యాన్స్ ప్రత్యేకత అని తెలిపారు.  రెండు మోడళ్లలో విడుదల చేసిన ఈ ఫ్యాన్లలో ఒక మోడల్ రూ.23,500, మరొకటి రూ.25,600ల రేటు. 

వీటిని తయారు చేయడానికి చెన్నై సమీపంలో రూ.10 కోట్ల పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటు చేశామన్నారు. నెలకు 14 వేల యూనిట్లు తయారవుతున్నాయని తెలిపారు. వీటిలో సగం దేశవ్యాప్తంగాను..మిగతావి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. సిలింగ్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఈ ఫ్యాన్ ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు కంపెనీవారు. ఈ ఫ్యాన్ గదిలో ఉన్న గాలిని ఫ్యూరిఫై చేసి 360 డిగ్రీల సరౌండింగ్ లో గాలిని ప్రసరింపజేస్తుందట.
Also Read : రోహిత్ మర్డర్ కేసు : ఎన్డీ తివారీ కోడలు అరెస్ట్

Blade Les
fans
Domestic Solutions
Company

మరిన్ని వార్తలు