సీక్రెట్ Govt రిపోర్ట్ : నోట్ల రద్దుకు అసలు కారణం ఇదేనా?

Submitted on 21 February 2019
black money present within India than outside worth around Rs 9.41 lakh crore   

2016, నవంబర్ 8.. ఆ రోజును ఎవరూ మరిచిపోలేరు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న సంచలన నిర్ణయం. రాత్రికి రాత్రే మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదే.. డిమానిటైజేషన్ (పెద్దనోట్ల రద్దు). ఇది అందరికి తెలిసిన విషయమే. అసలు.. నోట్ల రద్దు చేయాలనే నిర్ణయాన్ని మోడీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.. అందులో బలమైన కారణం ఏంటో పెద్దగా అందరికి తెలియకపోవచ్చు. దేశంలో నల్లడబ్బును అరికట్టడానికే నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నారనే విషయం మాత్రమే తెలుసు. ఆర్థిక మంత్రిత్వశాఖ అధ్యయనం చేసిన ఓ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చిన ఇన్ ఫుట్స్ ఆధారంగా మోడీ పెద్దనోట్ల రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 2016 ఏడాదిలో నోట్ల రద్దుపై నిర్ణయంతో దేశంలో చలామణీ అవుతున్న 85 శాతం కరెన్సీ చిత్తుకాగితాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఆ సీక్రెట్ రిపోర్ట్ కు సంబంధించిన అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిజానికి.. ఈ సీక్రెట్ రిపోర్ట్  2014లోనే పూర్తి అయింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సీక్రెట్ రిపోర్ట్ పై అధ్యయనం జరిగింది. 

90 నుంచి 97 శాతానికి పైనే బ్లాక్ మనీ
ఈ అధ్యయనంలో లెక్కలో లేని కోట్లాది డబ్బు (బ్లాక్ మనీ) ఇండియాలో ఉన్నట్టు తేలింది. బయట దేశాల కంటే.. ఒక్క భారత్ లోనే  90 నుంచి 97 శాతం పైనే నల్లడబ్బు ఉన్నట్టు గుర్తించారు. విదేశాల్లో భారతీయుల మొత్తం నల్ల డబ్బు మొత్తం 9.41 లక్షల కోట్లు ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఈ సీక్రెట్ గవర్నమెంట్ రిపోర్ట్ ను అధ్యయనం చేయడానికి మూడు ప్రీమియర్ ఎకనామిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా పనిచేశాయి. డిసెంబర్ 2014 నాటికే భారత్ లో బ్లాక్ మనీ ఎంత శాతం ఉందనేది రిపోర్ట్ రెడీగా ఉంది. కానీ, ఈ రిపోర్ట్ ను రివీల్ చేయకుండా నాలుగేళ్లపాటు సీక్రెట్ గా పెట్టేశారు. ఈ సీక్రెట్ రిపోర్ట్ ను 2011, 2014 మధ్యకాలంలో అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది. 

మూడు ప్రీమియర్ సంస్థల్లో ఒకటైన నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPEP)బ్లాక్ మనీపై గుర్తించిన అంశాలను నివేదికలో పేర్కొంది. 1997 మధ్యకాలంలో, 2009లో ఇండియా గాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ)పై 0.2 శాతం నుంచి 7.4 శాతం వరకు దేశం బయట బ్లాక్ మనీ ఉన్నట్టు గుర్తించింది. రెండో సంస్థ నేషనల్ కౌన్సిల్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER)గుర్తించిన మొత్తం బ్లాక్ మనీ.. 384 బిలియన్ డాలర్లు (రూ.27 కోట్లు.. (ప్రస్తుత ఎక్సేంజీ రేటు) నుంచి 490 బిలియన్ల వరకు ఉంది. ఇదంతా.. 1980, 2010 ఏళ్ల మధ్యకాలంలో ఇండియా బయట ఆర్జించిన బ్లాక్ మనీగా నివేదిక పేర్కొంది. అంతేకాదు.. NCAER పూర్తి నివేదికలో.. క్యాపిటల్ ఔట్ ఫ్లోస్ (స్టాక్) ఆధారంగా భారత్ బయట ఉన్న మొత్తం బ్లాక్ మనీ 498 బిలియన్ డాలర్లు (జీడీపీ 2.8 శాతం)గా అంచనా వేసింది. నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ (NIFM)సంస్థ నివేదిక ప్రకారం.. మొత్తం బ్లాక్ మనీ ఔట్ ఫ్లో 1990, 2008 మధ్యకాలంలో రూ.9లక్షల 41వేల 837 కోట్లు (217 బిలియన్ డాలర్లు) ఉంటుందని తెలిపింది. 

ఈ మూడు సంస్థలు అధ్యయనం చేసిన నివేదికలను డిసెంబర్ 2013, జూలై 2014, ఆగస్టు 2014లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించాయి. చివరి రిపోర్ట్ మాత్రం డిసెంబర్ 2014లో ప్రిపేర్ చేశారు. ఈ ఫైనల్ రిపోర్ట్ ను 2016 డిమానిటైజేషన్ తర్వాత 2017 జూలై 25, 2017లో స్టాడింగ్ కమిటీ లోక్ సభ సెక్రటేరియట్ కు పంపించింది. ఈ స్టాండింగ్ కమిటీకి  వీరప్ప మొయిలీ అధ్యక్షతన వహించారు. ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ముగింపు సమయంలో సీక్రెట్ రిపోర్ట్ పై లోక్ సభలో లేవనెత్తారు. పబ్లిక్ కు సీక్రెట్ రిపోర్ట్ ను రివీల్ చేయాల్సిందిగా సభలో డిమాండ్ లు వెల్లువెత్తాయి. చివరికి స్టాడింగ్ కమిటీ చైర్మన్ మెయిలీ.. సీక్రెట్ రిపోర్ట్ రివీల్ చేయడంపై చర్చలు జరిపాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ చర్చల అనంతరం సీక్రెట్ రిపోర్ట్ ను పబ్లిక్ కు రివీల్ చేయాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  

Black Money
india
Secret govt report
9.41 lakh crore    

మరిన్ని వార్తలు