మోడీ హవా అలా ఉంది :12 రాష్ట్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్

Submitted on 24 May 2019
BJP scores big in three Hindi heartland states that Congress won five months ago

సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభంజనానికి కాంగ్రెస్‌ కుదేలై కేవలం 53 స్థానాలకే పరిమితమైంది.బీజేపీ గత లోక్ సభ ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెల్చుకుంది.303 స్థానాల్లో బీజేపీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్...ఇప్పుడు అదనంగా మరో ఎనిమిది స్థానాలను మాత్రమే దక్కించుకోగలింగదంటే  సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన పార్టీకి ఈ ఫలితాలు పరాభవమనే చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడిగా అర్హత సాధించాలంటే లోక్‌ సభలో కనీసం 10శాతం అంటే 55 సీట్లు సాధించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్‌ 52 సీట్లకే పరిమితమవడంతో  ఈసారి కూడా కాంగ్రెస్ కు దాదాపు ఆ ఆశలు గల్లంతయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్ష్యాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే అమేథీలో ఓడిపోవడం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందో క్లియర్ గా అర్థమవుతోంది.

గుజరాత్​, రాజస్థాన్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్,జమ్మూ కశ్మీర్,మణిపూర్,మిజోరామ్,నాగాలాండ్,సిక్కిం,త్రిపుర,ఉత్తరాఖండ్,ఆంధ్రప్రదేశ్,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క సీటుని కూడా గెల్చుకోలేకపోయింది.కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకపోగా మరో 12 రాష్ట్రాల్లో కేవలం ఒక్కో సీటుతో సరిపెట్టుకుంది. ​కాంగ్రెస్​ సాధించిన 52 స్థానాల్లో సగానికిపైగా దక్షిణాది నుంచి లభించినవే కావడం విశేషం.  కేరళలో గెల్చుకున్న 15 సీట్లే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్​ సాధించిన హైయ్యస్ట్ స్కోర్. తమిళనాడులో డీఎంతో పొత్తు కారణంగా 8 చోట్ల, తెలంగాణలో 3, కర్ణాటకలో 1, పాండిచ్చేరిలో 1, చత్తీస్ ఘడ్ లో 2 సీట్లో గెలిచింది. ఉత్తరాదిలో పంజాబ్ ​లో 8 సీట్లు, అస్సాంలో 3, వెస్ట్ ​బెంగాల్​లో 2, జార్ఖండ్​, మేఘాలయ, మధ్యప్రదేశ్​, యూపీ, మహారాష్ట్ర, బీహార్​, గోవా, ఒడిశాలో ఒక్కో స్థానం దక్కించుకున్న కాంగ్రెస్​, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్​ నికోబార్ లో​ 1 సీట్లుని  గెల్చుకుంది.

మరో ముఖ్యమైన కీలక అంశం...2018 చివర్లో చత్తీస్ ఘడ్,రాజస్థాన్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.మొత్తం 65 లోక్ సభ స్థానాలున్న ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో 62 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఇది పెద్ద పరాభవంగా చెప్పవచ్చు.
 

Congress
loksabha elections
results
BJP
win
States
clean sweap

మరిన్ని వార్తలు