కమల దళపతి : బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా

Submitted on 17 June 2019
BJP Party Working President JP Nadda

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బోర్డు జేపీ నడ్డాని ఎన్నుకుంది. ఈ సందర్భంగా ఆయనకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా అభినందనలు తెలిపారు. జూన్ 17వ తేదీ సోమవారం సాయంత్రం భేటీ అయిన పార్టీ పార్లమెంటరీ బోర్డు 6 నెలలపాటు జేపీ నడ్డా ఈ పదవిలో కొనసాగనున్నట్లు తెలిపింది. పార్టీ అధ్యక్షుడిగా అమిత్‌షా కొనసాగుతున్నా, హోంమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండటంతో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

గత ఎన్డీఏ ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్‌గా పని చేసిన జేపీ నడ్డా అసలు పేరు జగత్ ప్రకాష్ నడ్డా. 1960, డిసెంబర్ 2న జన్మించిన జేపీ నడ్డా 1993లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలో బీజేపీకి లెజిస్లేటివ్ పార్టీ నేతగా..మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో బీజేపీ తరపున హిమాచల్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభ మెంబర్‌గా ఎన్నికయ్యారు 
ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గానే ఎన్నిక అయినా జేపీ నడ్డానే పార్టీ అధ్యక్షుడిగా ఖరారు చేస్తారంటున్నారు కొందరు. ఈ ఏడాది జరగనున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన తర్వాత జేపీ నడ్డాని పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ప్రకటిస్తారని అంటున్నారు.

BJP Party
Working
President
JP NADDA
amith shah


మరిన్ని వార్తలు