బీజేపీవైపు కోమటిరెడ్డి చూపు: కాంగ్రెస్‌పై సంచలన కామెంట్లు

Submitted on 15 June 2019
Bjp is the only alternative to trs in telangana says congress mla Komatireddy Rajagopal Reddy

తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించట్లేదంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2024లో కూడా బీజేపీ రావడం ఖాయంగా కనిపిస్తోందని, ఉత్తమ్, కుంతియాల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిందని, నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా కూడా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం అలా ఆలోచించలేదని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టాలంటే ప్రధాని మోడీలాంటి నేత కావాలని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం స్పందించట్లేదని కోమటిరెడ్డి విమర్శించారు. నాయకత్వ లోపంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గల్లంతైందని చెప్పుకొచ్చారు.

అయితే పార్టీ మారే విషయంపైన మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం బీజేపీలోకి వెళ్లడం ఖాయమని అనిపిస్తుంది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ 2023లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకోగా కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తారని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ఇప్పటికే స్పందించిన  కోమటిరెడ్డి వెంకట రెడ్డి తాను బీజేపీలోకి వెళ్లట్లేదని, తన శవంపై కాంగ్రెస్ జెండా కప్పాలంటూ బావోద్వేగం అయిన సంగతి తెలిసిందే.

BJP
Alternative to trs
Telangana
Congress
Komatireddy Rajagopal Reddy

మరిన్ని వార్తలు