కిస్సింగ్ పాస్టర్: లిప్‌లాక్ ఇస్తే దెయ్యం పారిపోతుందట

Submitted on 25 April 2019
Bizarre moment pastor kisses a woman to 'expel demons'

క్రైస్తవమత ఆచారాలు, పాస్టర్‌లు చేసే చర్యలు నెట్టింట్లో ఎంతలా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లదు. అందులోనూ దెయ్యాలను వదలగొడుతామంటూ పెద్దపెద్దగా అరుస్తూ కొందరు చేసే ప్రార్ధనలు నెట్టింట్లో కామెడీ పుట్టిస్తుంటాయి. వర్షమా ఆగిపో.. దెయ్యమా దిగిపో అంటూ పాస్టర్లు చేసే చర్యలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటువంటిదే ఒక పాస్టర్ చేసిన పని నట్టింట్లో వైరల్ అవుతుంది.

అసలు విషయం ఏమిటంటే.. దుష్టశక్తులు, క్షుద్ర శక్తులు ఉంటాయని నమ్మే దేశాల్లో జింబాబ్వే కూడా ఉంది.  అతేంద్రియ శక్తులు ఉంటాయని, దెయ్యాలు, భూతాలు మనుషులను అవహిస్తాయని జింబాబ్వేలో కూడా ఎక్కువ నమ్ముతారు. జింబాబ్వే క్రైస్తవులు ఎక్కువ. క్రీస్తును ఆరాధించే ఓ యవతి తన గోడు చెప్పుకునేందుకు చర్చ్‌కు వెళ్లింది. అయితే తనకు దెయ్యం పట్టిందని దెయ్యాన్ని వదిలించేందుకు పాస్టర్ చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది.

దెయ్యం పట్టిందని చర్చికి తీసుకొచ్చిన యువతులకు లిప్‌లాక్‌లు ఇస్తూ దెయ్యాన్ని వెళ్లగొడుతానంటూ నమ్మిస్తున్నాడు పాస్టర్. కాగా పాస్టర్ చేస్తున్న చర్యలను ఓ యువకుడు వీడియో తీసి ట్విట్టర్‌లో పెట్టగా ఇప్పడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో చర్చిల్లో నన్‌లపై జరుగుతున్న లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయానని, నన్స్‌ను కేవలం ఓ శృంగార బానిసలుగా చూస్తున్నారని స్వయంగా క్రైస్తవ మతాధినేత పోప్ ఫ్రాన్సిస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో తాజా వీడియోపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

Bizarre moment
pastor kisses
expel demons

మరిన్ని వార్తలు