భూగ్రహానికి పెను ప్రమాదం!

Submitted on 15 February 2020
The biggest threat to the Earth!

మహాప్రమాదం ముంచుకొస్తోందట.. ఏ ఒక్కరికో కాదు, ఏ ఒక్క దేశానికో కాదు..ప్రపంచం మొత్తానికీ. ప్రచండవేగంతో దూసుకువస్తోన్న ఈ ప్రమాదం కొద్ది గంటల్లోనే సంభవిస్తుందని అమెరికన్ స్పేస్ సెంటర్ నాసా  హెచ్చరిస్తోంది. ఆస్టరాయిడ్స్ రూపంలో భూగ్రహానికి పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది..

భూమి అంతా అంతమైపోవాల్సిందే..
మహా ప్రమాదం...ముంచుకొస్తోంది...వేగంగా...మహా వేగంగా...భూమిపైకే...దూసుకొస్తోంది. ఆస్టరాయిడ్స్ భూమిని ఢీ కొడితే..ఇక అంతే... భూమి అంతా అంతమైపోవాల్సిందే..అమెరికన్ స్పేస్ సెంటర్ నాసా...ఇలానే హెచ్చరిస్తోంది..మీరు నిద్రపోయే ఈ రోజే చివరిది కావచ్చని..అందుకు కారణం రోదసినుంచి దూసుకువచ్చే ఆస్టరాయిడే అంటోంది. గ్రహశకలాలను అధ్యయనం చేసే...ఎక్స్ ప్రెస్ యూకే అనే నాసా విభాగం..ఓ వళ్లు జలదరించే నిజం కనుక్కున్నట్లు ప్రకటించింది..రాత్రి పగలూ తేడా లేకుండా..రోదసిలోని రహస్యాలను చేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ...తాను కనుక్కున్న విషయం..మొత్తం ప్రపంచాన్ని వణికించేదంటూ ప్రకటించింది..

భూమిపై ఆస్టరాయిడ్ దండయాత్ర
ఎక్స్ ప్రెస్ యూకే కనుక్కున్న ఆస్టరాయిడ్ మహా ప్రచండ వేగంతో దూసుకువస్తోందట.. గంటకి 57వేల240 కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో గిరికీలు కొడుతూ వస్తోన్న ఈ గ్రహశకలానికి 2002 పిజెడ్39 అని పేరు పెట్టింది. రోదసిలో ఎన్నో గ్రహశకలాలు..ఇతర గ్రహాల ధూళి భూమిని తాకుతుండటం మామూలే...ఐతే ఎక్స్ ప్రెస్ యూకే చెప్తోన్న 2002 పిజెడ్ మాత్రం సూపర్ మెగా సైజ్‌లో ఉండటంతో అది కానీ భూమిని తాకితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేకపోతున్నారు..ఆ ఊహకే భయపడిపోతున్నారు..ఎందుకంటే.. పిజెడ్ 39  వైశాల్యం ఏకంగా 3280 అడుగులట..ఈ సైజు ఎంత పెద్దదంటే.. ప్రపంచంలోనే ఎవరూ ఇంతవరకూ ఇంత పెద్ద కట్టడమే లేదట..మరి గంటకి దాదాపు 60వేల కిలోమీటర్ల వేగంతో..ఈ సైజు ఆస్టరాయిడ్ మన గ్రహాన్ని తాకితే..ఏర్పడే విలయం అంతా ఇంతా కాదు..

ప్రపంచం రూపురేఖలే మారిపోతాయ్
ఇంత పెద్ద ఆస్టరాయిడ్ కాబట్టే... నాసా దీన్ని పిహెచ్‌ఓగా నిర్ధారించింది.. పిహెచ్ఓ అంటే పొటెన్షియల్లీ హజార్డస్ ఆబ్జెక్ట్.. అత్యంతప్రమాదకరమైన వస్తువని అర్ధం..ఇంత ప్రమాదకరమైన మానవాళికే మృత్యువు అనదగ్గ 2002 పిజెడ్ 39 గ్రహశకలం ధాటికి ఖండాలకి ఖండాలే లేచిపోతాయ్..అసలు ప్రపంచం రూపురేఖలే మారిపోతాయ్.

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు

biggest
Threat
earth
nasa

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు